Summer Health Care Tips: Amazing Health Benefits Of Muskmelon Kharbuja In Telugu - Sakshi
Sakshi News home page

Muskmelon: కర్బూజ జ్యూస్‌ తరచుగా తాగుతున్నారా? ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు.. ఇంకా..

Published Sat, May 6 2023 12:15 PM | Last Updated on Sat, May 6 2023 1:14 PM

Summer Tips: Amazing Health Benefits Of Muskmelon Kharbuja - Sakshi

వేసవిలో మనకు అధికంగా దొరికే పండు ఖర్బూజ పండు. ఈ పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కర్బూజలో దాదాపు తొంబై శాతం నీరు ఉంటుంది. కాబట్టి వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి, వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్బూజపండు బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. ఈ పండులో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందాం.

తెల్ల రక్తకణాల వృద్ధి
►కర్బూజ పండులో ఎక్కువ శాతంగా ఉండే బీటాకెరోటిన్, విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరంలోని తెల్ల రక్తకణాలను వృద్ధి చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్‌ రాకుండా కాపాడతాయి.
►కర్బూజలో విటమిన్‌ ఎ ఎక్కువగా ఉండటం వల్ల కంటి సంబంధిత సమస్యలను దూరం చేసి కంటిచూపు బాగా ఉండేలా చేస్తుంది. వడదెబ్బ నుండి రక్షిస్తుంది.

ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు..
►కర్బూజ పండులో విటమిన్‌ కె, విటమిన్‌ ఇ ఎక్కువగా ఉంటుంది. దీనివలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ చక్కగా పని చేసేలా ఉపయోగపడుతుంది.

అధిక మోతాదులో పొటాషియం ఉండటం వలన
►ఈ పండులో అధిక మోతాదులో పొటాషియం ఉండటం వలన గుండెకు మంచి న్యూట్రియంట్స్‌ని అందజేస్తుంది. దీనిలో ఫోలెట్‌ ఉండటం వలన అది హార్ట్‌ ఎటాక్‌ నుండి, గుండె జబ్బుల నుండి కాపాడుతుంది.
►తక్కువ క్యాలరీస్, ఎక్కువ పీచు పదార్థం ఉండటం వలన అధిక బరువుని తగ్గిస్తుంది.
►ఖర్బూజ జ్యూస్‌ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్‌ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది.

కిడ్నీలో రాళ్లను సైతం
►ఈ జ్యూస్‌ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.
►ఈ పండు కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. 

గర్బిణులకు ఎంతో మేలు
►ఫోలిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా ఉండడం గర్బిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.
►కంటి ఆరోగ్యం, శ్లేష్మాన్ని తగ్గించడానికి కర్బూజా సహాయపడుతుంది. వేసవిలో కర్బూజ పండు ముక్కలతో పాటు జ్యూస్‌ తాగటం వల్ల మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. 
నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.

చదవండి: ఇలా చేస్తే పురుగులు పడిపోతాయి! అప్పుడు ఎంచక్కా...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement