Musk melon
-
కర్బూజ జ్యూస్ తాగుతున్నారా? అధిక మోతాదులో పొటాషియం ఉండటం వల్ల..
వేసవిలో మనకు అధికంగా దొరికే పండు ఖర్బూజ పండు. ఈ పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కర్బూజలో దాదాపు తొంబై శాతం నీరు ఉంటుంది. కాబట్టి వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి, వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్బూజపండు బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. ఈ పండులో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందాం. తెల్ల రక్తకణాల వృద్ధి ►కర్బూజ పండులో ఎక్కువ శాతంగా ఉండే బీటాకెరోటిన్, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరంలోని తెల్ల రక్తకణాలను వృద్ధి చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. ►కర్బూజలో విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వల్ల కంటి సంబంధిత సమస్యలను దూరం చేసి కంటిచూపు బాగా ఉండేలా చేస్తుంది. వడదెబ్బ నుండి రక్షిస్తుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు.. ►కర్బూజ పండులో విటమిన్ కె, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దీనివలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ చక్కగా పని చేసేలా ఉపయోగపడుతుంది. అధిక మోతాదులో పొటాషియం ఉండటం వలన ►ఈ పండులో అధిక మోతాదులో పొటాషియం ఉండటం వలన గుండెకు మంచి న్యూట్రియంట్స్‌ని అందజేస్తుంది. దీనిలో ఫోలెట్ ఉండటం వలన అది హార్ట్ ఎటాక్ నుండి, గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. ►తక్కువ క్యాలరీస్, ఎక్కువ పీచు పదార్థం ఉండటం వలన అధిక బరువుని తగ్గిస్తుంది. ►ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. కిడ్నీలో రాళ్లను సైతం ►ఈ జ్యూస్‌ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ►ఈ పండు కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. గర్బిణులకు ఎంతో మేలు ►ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండడం గర్బిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ►కంటి ఆరోగ్యం, శ్లేష్మాన్ని తగ్గించడానికి కర్బూజా సహాయపడుతుంది. వేసవిలో కర్బూజ పండు ముక్కలతో పాటు జ్యూస్ తాగటం వల్ల మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: ఇలా చేస్తే పురుగులు పడిపోతాయి! అప్పుడు ఎంచక్కా... -
ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివి.. వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు!
సాక్షి,జగిత్యాల అగ్రికల్చర్: ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివాడు.. ఓవైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. తనకున్న భూమిలో వరి, మస్క్ మిలన్, వాటర్ మిలన్ పండిస్తున్నాడు.. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన పోగుల నరేశ్(94924 61297) అనే యువ రైతు. సాగులోని విషయాలను తోటి రైతులకు వివరిస్తున్నాడు. ఆరెకరాల్లో పంటల సాగు నరేశ్‌కు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో రెండెకరాల్లో వరి, రెండెకరాల్లో అనంతపూర్ లాంటి ప్రాంతాల్లో సాగు చేసే మస్క్ మిలన్(కర్బూజ), మరో రెండెకరాల్లో వాటర్ మిలన్(పుచ్చకాయ) పంటలు సాగు చేస్తున్నాడు. ఈ పంటల ఉత్పత్తులు ఒకేసారి కాకుండా పలు దఫాలుగా చేతికి వచ్చేలా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. మస్క్ మిలన్, వాటర్ మిలన్ పంటలు పూర్తవగానే, ఆ స్థలంలో స్వీట్ కార్న్, మొక్కజొన్న, బీర, బీన్స్ పండిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి విత్తనాల కొనుగోలు మస్క్ మిలన్ కాయలను నగర, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా జ్యూస్‌గా వాడతారు. దీంతో వాటికి సహజంగానే డిమాండ్ ఉన్నప్పటికీ వేసవిలో మరీ ఎక్కువ ఉంటుంది. ఇది గమనించిన నరేశ్ ఏటా శివరాత్రి నుంచి మామిడి పండ్లు వచ్చే వరకు మస్క్ మిలన్ కాయలను మార్కెట్‌కు తరలించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. భూమిని బాగా దున్నించి, చివరి దుక్కిలో పశువుల ఎరువు వేస్తున్నాడు. తర్వాత, ట్రాక్టర్‌తో బెడ్స్ తయారు చేసి, వాటిపై డ్రిప్ లేటరల్ పైపులు వేస్తున్నాడు. ఆ తర్వాత, కలుపు మొక్కలు రా కుండా, నీరు ఆవిరి కాకుండా మల్చింగ్ పేపర్ ఉంచుతాడు. ఆ పేపర్‌పై రంధ్రాలు చేసి, మస్క్ మిలన్ విత్తనాలు నాటుతుంటాడు. ఈ విత్తనా లను రెండు ఎకరాలకు సరిపడేలా రూ.16 వేలు వెచ్చించి, హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నాడు. సస్యరక్షణ చర్యలు మస్క్ మిలన్ పంట 65 నుంచి 70 రోజుల్లో కోతకు వస్తుంది. డిసెంబర్ 15 ప్రాంతంలో విత్తనాలు నాటగా, పంటను మార్చి మొదటి వారంలో మార్కెట్‌కు తీసుకెళ్లేలా చూసుకుంటాడు. పంటకు కావాల్సిన పోషకాలు, ఎరువులు, సాగు నీటిని డ్రిప్ ద్వారా అందిస్తున్నాడు. పైపాటుగా ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రిషన్స్‌ను 4, 5 సార్లు పిచికారీ చేస్తున్నాడు. పండు ఆకు రోగం, కాయ తొలుచు పురుగు రాకుండా ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకుంటున్నాడు. ఎకరానికి 9 టన్నుల దిగుబడి ఎకరానికి 9 టన్నుల చొప్పున రెండెకరాల్లో 18 టన్నుల మస్క్ మిలన్ దిగుబడి వచ్చిందని నరేశ్ తెలిపాడు. పంట కోయక ముందే నిజమాబాద్‌లోని పలు జ్యూస్ సెంటర్ల నిర్వాహకులతో మా ట్లాడుకొని, కిలో రూ.30 నుంచి రూ.35 చొప్పున విక్రయించినట్లు పేర్కొన్నాడు. పంట సాగు ఖర్చులు రూ.50 వేలు పోను, ఎకరాకు రూ.లక్ష చొప్పున ఆదాయం వచ్చిందని తెలిపాడు. -
ఎలాన్ మస్కా.. మస్క్ మెలానా?
-
వైరల్: ఎలాన్ మస్కా.. మస్క్ మెలానా?
టెస్లా కంపెనీ ఫౌండర్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా 2020 ప్రపంచ కుబేరుల టాప్ టెన్ జాబితాలో చేరాడు ఎలాన్ మస్క్. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తన పేరుకు సంబధించిన వీడియో ఇది. ఎలాన్ మస్క్ పేరు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉందో.. దాన్ని పలకడానికి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో వెల్లడించారు ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్. ఎలాన్ మస్క్ పేరును మస్క్ మెలాన్ అని పలికి దానికి అర్థం ఖర్బుజా అని చెప్పి నవ్వులు పూయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అయ్యేవారికి ఇన్స్టాగ్రామ్ ప్రొనౌన్సియేషన్ రాజేశ్వరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గౌరవ్ గేర్ ప్రాంతానికి చెందిన రాజేశ్వరి ఇళ్లల్లో పనిచేస్తుండే వారు. ఈ క్రమంలో గతంలో వచ్చిన టిక్‌టాక్ రాంగ్ ప్రొనౌన్సియేషన్ చాలెంజ్ ద్వారా పాపులర్ అయ్యారు రాజేశ్వరి. ఈమె ప్రత్యేకత ఏంటి అంటే ఓ ఆంగ్ల పదాన్ని బోర్డు మీద రాస్తారు. దాన్ని అక్షరం అక్షరం విడివిడిగా పలుకుతారు. చివరకు అన్ని కలిపి ఓ కొత్త పదాన్ని క్రియేట్ చేస్తారు. దీనిలో భాగంగానే గతంలో రాజేశ్వరి తాబేలు పేరును ఇంగ్లీష్‌లో రాసి.. అక్షరం అక్షరం పలుకుతూ.. చివరకు ‘టుర్టలే’ అని చెప్పి తాబేలు అని అర్థం వివరించారు. ఈ క్రమంలోనే రాజేశ్వరి ఎలాన్ మస్క్ పేరును బోర్డు మీద రాశారు. అక్షరం అక్షరం పలుకుతు చివరకు అన్నింటిని కలిపి ఎలాన్ మస్క్‌కు బదులు మస్క్ మెలాన్ అని పలికారు. పైగా దాని అర్థం ఖర్బుజా అని వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులంతా పడి పడి నవ్వుతున్నారు. ‘‘దీన్ని ఎవరైనా ఎలాన్ మస్క్ దృష్టికి తీసుకెళ్తే పాపం ఎలా ఫీలవుతాడో’’ అని కామెంట్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘‘దేశీ ఇంగ్లీష్ టీచరా మజాకా’’ అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: రుజువైతే ..టెస్లా కంపెనీ మూసివేత..! -
జత ఖర్బూజ పండ్ల ధర ఎంతో తెలుసా?
ఎంత పెద్దగా ఉన్నా సరే జత ఖర్బూజ పండ్లు రూ.100 ధర కూడా ఉండవు. అయితే ఈ ఫోటోలో ఉన్న జత పండ్ల ధరను మీరు ఊహించగలరా? అక్షరాలా ఏడు లక్షల ఎనభై ఏడు వేల రూపాయిలు. జపాన్‌లోని హోక్కైడో ద్వీపంలోని సప్పరో సెంట్రల్ హోల్‌సేల్ మార్కెట్లో శుక్రవారం వీటిని వేలం వేయగా ఓ ఔత్సాహికుడు ఇంత ధర పెట్టి కొనుక్కున్నాడు. జపాన్‌లో సన్నిహితులకు బహుమతిగా ఇచ్చే అరుదైన యుబారీ రకం ఖర్బూజలకు ఇక్కడ డిమాండ్ ఎక్కువ. జపాన్‌లో సాధారణంగానే ఒక్కో ఆపిల్ రూ.190 ధర ఉంటుంది. ఇక 20 చెర్రీ పండ్లు ఉన్న ప్యాకెట్ రేటు రూ.6300.