జత ఖర్బూజ పండ్ల ధర ఎంతో తెలుసా?
ఎంత పెద్దగా ఉన్నా సరే జత ఖర్బూజ పండ్లు రూ.100 ధర కూడా ఉండవు. అయితే ఈ ఫోటోలో ఉన్న జత పండ్ల ధరను మీరు ఊహించగలరా? అక్షరాలా ఏడు లక్షల ఎనభై ఏడు వేల రూపాయిలు. జపాన్లోని హోక్కైడో ద్వీపంలోని సప్పరో సెంట్రల్ హోల్సేల్ మార్కెట్లో శుక్రవారం వీటిని వేలం వేయగా ఓ ఔత్సాహికుడు ఇంత ధర పెట్టి కొనుక్కున్నాడు. జపాన్లో సన్నిహితులకు బహుమతిగా ఇచ్చే అరుదైన యుబారీ రకం ఖర్బూజలకు ఇక్కడ డిమాండ్ ఎక్కువ. జపాన్లో సాధారణంగానే ఒక్కో ఆపిల్ రూ.190 ధర ఉంటుంది. ఇక 20 చెర్రీ పండ్లు ఉన్న ప్యాకెట్ రేటు రూ.6300.