Fruits
-
బాహుబలి రోబో...రోజుకు 8 టన్నుల పండ్లు చకా చకా!
బత్తాయి చెట్ల నుంచి పండ్లు కోసే రోబోని ఇజ్రేలుకు చెందిన కంపెనీ నానోవెల్ రూపొందించింది. దీనికి వివిధ ఎత్తుల్లో 6 రోబోటిక్ చేతుల్ని అమర్చారు. తోట మధ్యలో వెళ్తూ చెట్టు కొమ్మలకు తగినంత సైజు పెరిగిన, పక్వానికి వచ్చి రంగు మారిన పండ్లను కృత్రిమ మేధతో గుర్తించి కోసేలా దీన్ని రూపొందించారు. వాక్యూమ్ టెక్నాలజీతో పండును పట్టుకొని, తొడిమెను కత్తిరిస్తుంది. చేతిలోకి వచ్చిన పండు కన్వేయర్ బెల్ట్ ద్వారా బుట్ట లోకి చేరుతుంది. ఈ పనులన్నీ రోబో తనంతట తానే చేసేస్తుంది. దూరం నుంచి చూస్తే చిన్న చక్రాలున్న షెడ్డు మాదిరిగా కనిపించే ఈ రోబో.. ప్రస్తుతం ఒక ట్రాక్టర్ లాక్కెళ్తూ ఉంటే పండ్లను కోస్తుంది. మున్ముందు ట్రాక్టర్ అవసరం లేకుండా తనంతట తానే కదిలి వెళ్లేలా దీన్ని మెరుగు పరచనున్నట్లు నానోవెల్ కంపెనీ ప్రకటించింది. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో భారీ బత్తాయి తోటల యజమానులను కోత కూలీల కొరత వేధిస్తోంది. ఈ రోబో వారికి ఊరటనిస్తుందని నానోవెల్ ఆశిస్తోంది. కాలిఫోర్నియా సిట్రస్ రీసెర్చ్ బోర్డుతో ఒప్పందం చేసుకున్న ఈ కంపెనీ బత్తాయిలు కోసే ఈ రోబో పనితీరును కాలిఫోర్నియా బత్తాయి, నారింజ తోటల్లో పరీక్షంచబోతున్నది. అక్కడి భారీ కమతాల్లో సాగయ్యే సిట్రస్ పండ్ల తోటల అవసరాలకు అనుగుణంగా ఈ రోబోకు అవసరమైన మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లండన్‌లో జరిగే వరల్డ్ అగ్రి–టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్‌లో కూడా ఈ రోబోను ప్రదర్శించబోతున్నామని నానోవెల్ సీఈవో ఇసాక్ మేజర్ చెప్పారు. భారీ తోటల్లో పండ్ల కోత కూలీల కొరతను ఎదుర్కొంటున్న అమెరికా, స్పెయిన్, ఇటలీ తదితర దేశాల్లో ఈ భారీ రోబోకు ఆదరణ బాగుంటుందని భావిస్తున్నామన్నారు. అంటే, సమీప భవిష్యత్తులో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఇటువంటి రోబోలు రాబోతున్నాయి. పండ్లను కోయటంతో పాటు మిగిలిన కాయలు ఎన్ని ఎప్పటికి కోతకు వస్తాయి? తోటలో చెట్ల స్థితిగతులపై కూడా గణాంకాలను ఈ రోబో సేకరించటం వల్ల తోట యజమానులకు వెసులుబాటు కలుగుతుంది. ఆరు రోబోటిక్ చేతులతో ఏకకాలంలో పనిచేసే ఈ భారీ రోబో గంటకు బుట్ట (400 కిలోల) ఆరెంజ్‌లను కోయగలదు. రాత్రీ పగలు తేడా లేకుండా 24 గంటల్లో 20 బుట్టల (8 టన్నులు) పండ్లు కోయగలదు. అందువల్ల దీన్ని ‘బాహుబలి రోబో’ అనొచ్చు! ఇక ధర ఎంతో.. అంటారా? అది కూడా భారీగానే ఉంటుంది మరి! -
గత ఆర్థిక ఏడాదిలో పండ్ల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: రైతుకు వెన్నుదన్నుగా నిలిస్తే పంటల దిగుబడి ఎంతగా పెరుగుతుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరూపించింది. ధాన్యం, వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటలకూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యతనిచి్చ, అడుగడుగునా రైతుకు అండదండగా నిలిచింది. దీంతో రాష్ట్రంలో పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. పండ్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో తలసరి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు, దేశంలో తలసరి పండ్లు, కూరగాయల ఉత్పత్తిపై నివేదికను విడుదల చేసింది. గత ఆరి్థక ఏడాదిలో దేశంలో మొత్తం తలసరి పండ్ల ఉత్పత్తి 80 కిలోలు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 333 కిలోలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే 2023–24లో ఆంధ్రప్రదేశ్ తలసరి కూరగాయల ఉత్పత్తి 119 కిలోలుందని తెలిపింది. గత దశాబ్ద కాలంలో దేశంలో తలసరి పండ్ల ఉత్పత్తి 7 కిలోలు, కూరగాయల ఉత్పత్తి 12 కిలోలు పెరిగినట్లు నివేదిక తెలిపింది. 2013–14లో దేశంలో తలసరి పండ్ల ఉత్పత్తి 73 కిలోలుండగా 2023–24లో 80 కిలోలకు, కూరగాయల ఉత్పత్తి 135 కిలోల నుంచి 147 కిలోలకు పెరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో తలసరి పండ్లు, కూరగాయల ఉత్పత్తి గత దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గిందని నివేదిక తెలిపింది. దేశంలో మొత్తం ఒక వ్యక్తి సంవత్సరానికి పండ్లు, కూరగాయలు 146 కిలోలు తీసుకోవాలని సాధారణ సిపార్సు ఉందని నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఒక వ్యక్తికి సంవత్సరానికి పండ్లు, కూరయలు కలిపి 227 కిలోలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే పంట కోత అనంతరం, నిల్వ, గ్రేడింగ్, రవాణా, ప్యాకేజింగ్‌లో 30 నుంచి 35 శాతం తగ్గుతోందని, ఇది మొత్తం వినియోగంపై ప్రభావం చూపుతోందని నివేదిక తెలిపింది. -
వీటిపై ‘శీత’ కన్నేయండి
ఈ కాలంలో కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవడం వంటికి ఎంతో మంచిది. అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ఏ కాలంలో తీసుకో వలసిన పండ్లు, కూరగాయలు ప్రకృతి చేసిన ఏర్పాటు వల్ల విరివిగా దొరుకుతూనే ఉంటాయి. అయితే తీసుకోకూడని ఆహారం మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అయితే వాటికి దూరంగా ఉండటం ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారమేంటో చూద్దాం.ఈ కాలంలో తీసుకోకూడని ఆహార పదార్థాలలో ముందు వరసలో ఉండేది...నూనెలో వేయించిన చిరుతిళ్లు...వీటికి ఉదాహరణ సమోసాలు, పకోడీలు, బజ్జీలు. చలి చలిగా ఉన్న వాతావరణంలో వేడి వేడి బజ్జీలు, పకోడీలు, సమోసాలు లాగించడానికి బాగుంటుంది కానీ అరుగుదలకే చాలా కష్టం అవుతుంది. అజీర్తి, యాసిడిటీ, కడుపు ఉబ్బరం వస్తాయి. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి చిరుతిళ్లకు దూరంగా ఉండటమే మేలు.డెయిరీ ఫుడ్...మీగడ, జున్ను, పాల ఉత్పత్తులు శరీరానికి బలవర్థకమే కానీ అది ఈ సీజన్లో అంతమంచిది కాదు. పాల ఉత్పత్తులు ఒంటికి వెచ్చదనాన్నివ్వడమొక్కటే కాదు, శ్లేష్మకరం కూడా. చల్లని వాతావరణంలో సైన సైటిస్ వచ్చేలా చేస్తుంది. శ్వాసకోశ వ్యాధులున్నవారికి సమస్యలు కలిగిస్తుంది. అందువల్ల ఈ సీజన్లో డెయిరీ ఉత్పత్తులు తీసుకోవడం అంత మంచిది కాదు. రెడ్ మీట్...చలికాలంలో రెడ్ మీట్ తీసుకోరాదు. రెడ్‌మీట్‌కు మంచి ఉదాహరణ మటన్, బీఫ్, పోర్క్. ఇవి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై దు్రçష్పభావం పడుతుంది. అధికమొత్తంలో కొవ్వు ఉండటం మూలాన అరుగుదల లోపిస్తుంది. కడుపు ఉబ్బరం వస్తుంది. ఒకోసారి అది గుండెకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. బండ్లమీద అమ్మే పదార్థాలు...బండ్లమీద అపరిశుభ్ర వాతావరణంలో అమ్మే పానీపూరి, చాట్ వంటి వాటిని ఎప్పుడు తీసుకున్నా మంచిది కాదు కానీ ఈ సీజన్లో తీసుకోవడం బొత్తిగా మంచిది కాదు. స్ట్రీట్‌ఫుడ్ తినడం రోగనిరోధక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపి, బలహీనపరుస్తుంది. ఫలితంగా శరీరం రకరకాల వ్యాధుల బారిన పడుతుంది. అందువల్ల స్ట్రీట్ ఫుడ్‌కి దూరంగా ఉండటం మంచిది. శీతల పానీయాలు...చల్లటి వాతావరణంలో చల్లటి పానీయాలు, ఐస్‌క్రీములూ తీసుకోవడం వల్ల వాటిని అరిగించడానికి, జీర్ణం చేసుకోవడానికి శరీరానికి చాలా కష్టం అవుతుంది. దానివల్ల జీర్ణవ్యవస్థకు తీవ్ర హాని కలుగుతుంది. గొంతులో గరగర, నొప్పి, జలుబు, ముక్కు కారడం వంటి సమస్యలు తీవ్రం అవుతాయి. సిట్రస్ జాతి పండ్లు...విటమిన్ సీ అధికంగా ఉండే కమలా, బత్తాయి, నిమ్మ వంటి పండ్లు తీసుకోవడం వల్ల వాటిని అరిగించే క్రమంలో కడుపులో తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. అసిడిటీ, గొంతు మంట వంటి ఇబ్బందులు కలుగుతాయి.ఆవకాయ వంటి ఊరగాయలు...వింటర్లో ఊరగాయలు తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే నిల్వ ఉండటం కోసం ఊరగాయలలో ఉప్పు, నూనె, కారం వంటివి కొంచెం ఎక్కువమొత్తంలో వాడతారు. వాటిని అరిగించడం జీర్ణవ్యవస్థకు కాస్తంత భారమైన పనే. ఊరగాయలలో కూడా మామిడికాయలతో పెట్టిన ఆవకాయ, మాగాయ వంటివి తినడమంటే జీర్ణవ్యవస్థకు మరింత పని పెట్టినట్టే కాబట్టి వాటికి కాస్తంత దూరంగా ఉండటం మంచిది. మసాలా పదార్థాలు...మసాలాలు దట్టించి చేసిన పదార్థాలంటే భారతీయులకు అందులోనూ తెలుగు వాళ్లకు చాలా ఇష్టం. అయితే ఈ సీజన్లో మసాలాలను దేహం అరిగించుకోలేదు కాబట్టి వాటిని కూడా దూరం పెట్టడమే మేలు. -
52 ఏళ్లుగా అన్నం బంద్!
జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మండలంలోని కొలిప్యాక్ గ్రామానికి చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు లొక్కిడి గంగారాం యాభై రెండేళ్లుగా అన్నం తినడం బంద్ చేశారు. వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ గ్రామంలో 1948లో గంగారాం జన్మించారు. యాభై ఏళ్ల క్రితం ఆయన కొలిప్యాక్ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. దైవ చింతన ఎక్కువగా ఉండడంతో అప్పటి నుంచి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద ఓ రెండు గదులలో నివాసం ఉంటున్నారు. గంగారాంకు భార్య సత్యగంగు ఉన్నారు. కుమారుడు గతంలోనే వాగులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. ప్రస్తుతం గంగారాం వయస్సు 76 ఏళ్లు. గంగారాంకు 1971లో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. మొదటి పోస్టింగ్ కలిగోట్ యూపీఎస్ పాఠశాలలో రాగా, అక్కడే 18 ఏళ్లు పని చేశారు. అప్పుడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1972 సంవత్సరం నుంచి గంగారాం అజీర్తి సమస్యతో అన్నం తినడం బంద్ చేశారు. దీంతో ఆహారంగా పల్లి పలుకులు, నీరు తీసుకోవడం ప్రారంభించారు. ఉపాధ్యాయుడిగా కలిగోట్, కొలిప్యాక్, మనోహరాబాద్, కొండాపూర్, మచ్చర్ల, సుర్బిర్యాల్, ఖుదావంద్‌పూర్, చేంగల్, వాడి, లింగాపూర్ గ్రామాల్లో పని చేశారు.2004లో ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి పండ్లు జ్యూస్, అరటి, ఆపిల్, సీజనల్ పండ్లు తీసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. యాభై రెండు ఏళ్లుగా ఎలాంటి అనారోగ్యం రాలేదని గంగారాం తెలిపారు. ఒక్క మందు గోలి, ఇంజెక్షన్ తీసుకోలేదన్నారు. స్వచ్ఛమైన గాలి, సాత్విక ఆహారం తీసుకుంటే అనారోగ్యం దరి చేరదన్నారు. ప్రస్తుతం గంగారాం ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమయ్యారు. గత యాభై ఏళ్లు గా ఊరూరా తిరుగుతూ ‘శ్రీరామ కోటి ’రాయిస్తున్నారు. వెయ్యి కోట్లు రామనామం రాయించాలని సంకల్పంతో ఉన్నట్లు తెలిపా రు. ప్రస్తుతం మనోహరాబాద్ గ్రామ రెవిన్యూ శివారులో పాండురంగ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. లోక కల్యాణం, భక్తిభావం, మానవతా దృక్పథంతో భగవంతుని సన్నిధికి చేరుకోవాలని తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ అత్యంత శ్రేష్టమైనదని, ఈ జీవితం భగవంతునికి అంకితమని చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం 76 ఏళ్ల వయసులో బైక్‌పై తిరుగుతూ రామకోటి రాయిస్తున్నారు. ఆశ్రమానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తున్నారు. పాండురంగ ఆశ్రమం వద్ద అన్ని రకాల దేవత విగ్రహాలను, స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. పచ్చని చెట్లు, ఆహ్లాదాన్ని పంచే వాతావరణంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రమానికి వచ్చే వారికి దైవత్వాన్ని బోధిస్తున్నారు. -
నారింజ పండులా ఉంటుంది.. కానీ తొక్కతో పాటు తినేయొచ్చు
కుమ్ఖాత్ సిట్రస్ జాతి పండు. నారింజలాగే ఉంటుంది. కానీ, గుండ్రంగా కాకుండా కోడి గుడ్డు మాదిరిగా ఓవెల్ ఆకారంలో చిన్నగా (1–2 అంగుళాలు) ఉంటుంది. చైనా దీని పుట్టిల్లు. 500 ఏళ్ల క్రితం దీన్ని ఫార్చునెల్లా అని పిలిచేవారట. చైనీస్ భాషలో గామ్ (అంటే బంగారం), గ్వాత్ (టాంగెరిన్స్కు మరో పేరు) మాటల కలయిక వల్ల కుమ్ఖాత్ అనే పేరు ఈ పంటకు, పండుకు స్థిరపడింది. 400 ఏళ్ల క్రితమే ఈ పంట యూరప్‌కి, అమెరికాకు చేరింది. ఇది అతి చలిని, అతి వేడిని కూడా తట్టుకొని బతకగల విలక్షణ నారింజ జాతి పంట. దీన్ని తొక్క తీపిగా ఉంటుంది. దాంతో పాటుగా తినేయొచ్చు. కుమ్ఖాత్ పండ్లు వగర, పులుపు, కొద్దిగా తీపి కలగలిసిన రుచి కలిగి ఉంటుంది. కట్ చెయ్యాల్సిన అవసరం లేకుండా నోట్లో పెట్టుకొని తినెయ్యగలిగే ఈ పండ్లలో విటమిన్ సి, పీచు పదార్థం పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్లు, మాంగనీసు, రాగి, కాల్షియం తదితర పోషకాలు కూడా ఉన్నాయి. కుమ్ఖాత్ పండులోని విత్తనాలు కూడా తినదగినవే. ఆరోగ్యదాయకమైన ఒమెగా –3 ఫ్యాటీ ఆసిడ్స్ వున్నాయి. నీటి శాతం కూడా ఎక్కువే. కుమ్ఖాత్ పండ్ల జాతిలో అనేక రకాలున్నాయి. జనాదరణ పొందిన రకాలు.. నగమి, మరుమి, మీవ. మురుమి, మీవ కుమ్ఖాత్ రకాల పండ్లు గుండ్రంగా ఉంటాయి. ఓవెల్ షేప్‌లో కొంచెం పుల్లగా ఉండే నగమి పండ్ల కన్నా తియ్యగా ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్నారింజ జాతి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్న వారిలో ఈ పండ్లు బ్లడ్ గ్లూకోజ్‌ను పెంచవు. అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌తో పాటు పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున కుమ్ఖాత్ పండ్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి.అధిక పీచుకుమ్ఖాత్ పండ్లలో పీచుతో కూడిన సంక్లిష్ట పిండిపదార్థాలుంటాయి. కాబట్టి, జీర్ణకోశంలో ఎక్కువ సేపు అరిగిపోకుండా ఉంటాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. అందువల్ల బరువు పెరగకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. దీనిలోని జీర్ణమయ్యే పీచుకు విరేచనాలను అరికట్టే గుణం ఉంది. ఇది జీర్ణకోశంలోని అదనపు నీటిని పీల్చుకొని, జెల్ మాదిరిగా ఏర్పడుతుంది. అందువల్ల, ఎక్కువ సార్లు విరేచనాలు అవుతూ ఉంటే గుప్పెడు కుమ్ఖాత్ పండ్లు నోట్లో వేసుకుంటే సరి.ఆరోగ్యదాయకమైన కొవ్వులుకుమ్ఖాత్ పండ్లలో కొవ్వు చాలా తక్కువ. కాబట్టి, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు వారి దినసరి ఆహారంలో కుమ్ఖాత్ పండ్లను చేర్చుకుంటే మంచిది. ఈ పండ్లలోని విత్తనాలను కూడా నమిలి తినాలి. ఈ విత్తనాల్లో ఒమెగా ఫాటీ ఆసిడ్లు ఉంటాయి కాబట్టి దేహంలో బాడ్ కొలెస్ట్రాల్ తగ్గి, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.యాంటీఆక్సిడెంట్‌గా ఉపయోగంకుమ్ఖాత్ పండ్లలో విటమిన్ ఎ, సి వంటి యాంటీఆక్సిడెంట్ విటమిన్లు ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ దేహంలో ఎక్కువైతే కణ నిర్మాణం దెబ్బతింటుంది. మన దేహంలో ఫ్రీ రాడికల్స్ కలిగించే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను కుమ్ఖాత్ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు తగ్గిస్తాయి.గుండె ఆరోగ్యానికి మేలుకుమ్ఖాత్ పండ్లలోని విటమిన్ సి, పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ వంటి పోషకాలు రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోయి గుండెపోటు రాకుండా చూస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలా అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. మొత్తంగా గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఎల్‌డిఎల్‌ను తగ్గించటం ద్వారా గుండె సమస్యల్ని నిరోధిస్తాయి.ఇన్ఫ్లమేషన్కు చెక్కుమ్ఖాత్ పండ్లలో కీంప్‌ఫెరాల్, లుటియోలిన్, హెస్పెరిడిన్, క్యుఎర్సెటిన్, సి–గ్లైకోసైడ్ వంటి ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. సి–గ్లైకోసైడ్ దేహంలో వాపును నివారించే గుణం కలిగిఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. రోగనిరోధక వ్యవస్థలో ఇన్ఫ్లమేటరీ రీయాక్షన్ను, ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ పుట్టుకను తగ్గించటంలో సి–గ్లైకోసైడ్ ఉపయోగపడుతుంది.యాంటీబాక్టీరియల్ ప్రభావంకుమ్ఖాత్ పండు తొక్కలోని నూనెకు సూక్ష్మక్రిములను హరించే గుణం ఉందని పరిశోధనల్లో తేలింది. ఆహార పదార్థాలపై పెరిగే బూజు, సూక్ష్మజీవులను నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా ఆహార పదార్థాలు త్వరగా చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఇది దోహదం చేస్తుంది.కేన్సర్‌నూ అరికడుతుందికుమ్ఖాత్ పండులో ఉండే అపిజెనిన్ అనే ఫ్లేవనాయిడ్ కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుందని పరిశోధనల్లో తేలింది. అపిజెనిన్ కేన్సర్ కణాలను ఇతర ఆరోగ్యకరమైన కణాలకు సోకకుండా అరికట్టగలుగుతుందని భావిస్తున్నారు.ఊబకాయాన్ని తగ్గిస్తుందికుమ్ఖాత్ పండ్లలోని పోన్సిరిన్ అనే ఓ ఫ్లావనాయిడ్ ఊబకాయాన్ని తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దేహం కొత్త కొవ్వు కణాలను తయారు చేసుకోకుండా అడ్డుకోవటం ద్వారా బరువు పెరగకుండా ఉండేందుకు పోన్సిరిన్ దోహదపడుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీనితో పాటు ఈ పండ్లలోని అధిక పీచుపదార్థం కడుపులో ఎక్కువ సేపు దన్నుగా ఉండటం వల్ల ఆకలి భావనను త్వరగా కలగనివ్వదు.కంటి చూపునకు మంచిదికుమ్ఖాత్ పండ్లలో బీటా కరోటెన్ రూపంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. ఈ పండ్లలో ఉన్న 11 కెరొటెనాయిడ్లలో ఇదొకటి. బీటీ కరోటెన్, జియాక్సాంతిన్, లుటీన్ వంటి కెరొటెనాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కంటి చూపు బాగుండాలంటే విటమిన్ ఎ తోడ్పాటుతో రోడోస్పిన్ ఉత్పత్తి అవుతుంది.మూడ్ డిజార్డర్లకూ... వత్తిడి సమస్యలను, మూడ్ డిజార్డర్లను, నిద్ర సమస్యలను విటమిన్ సి ఆహారాలు అరికడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వత్తిడి, కుంగుబాటు, ఆందోళనల తీవ్రతను తగ్గించటం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యాంటీడిప్రెసెంట్ మాదిరిగా కుమ్ఖాత్ పండ్లు పనిచేస్తాయి. ఆరోగ్యదాయకమైన నిద్రకు దోహదం చేస్తాయి. అయితే, అది ఏ విధంగా దోహదపడతాయో ఇంకా స్పష్టంగా తెలియదు.ఎముక పుష్టికి.. ఎముక పెరుగుదలలో విటమిన్ సి పాత్ర కీలకమైనది. విటమిన్ సి కొల్లజెన్ ఏర్పడటానికి దోహదపడుతుంది. కుమ్ఖాత్ పండ్లలో కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఎముకలు పటుత్వాన్ని కోల్పోయే ఆస్టియోపోరోసిన్ వంటి సమస్యలను విటమిన్ సి తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకల నుంచి కాల్షియంను హరించే యాసిడ్ ఫుడ్స్ ఎముక సమస్యల్ని పెంచుతాయి. కుమ్ఖాత్ పండ్లు ఆల్కలిన్ ఫ్రూట్స్ కాబట్టి ఆస్టియోపోరోసిన్కు దారితీయకుండా కాపాడుతాయని చెప్చొచ్చు.రోగనిరోధక శక్తి కుమ్ఖాత్ పండ్లలోని బీటా–క్రిప్టోక్సాంతిన్, ఎల్–లైమోనెనె మన దేహంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని ఓ అధ్యయనం చెబుతోంది. సహజ సిద్ధమైన కిల్లర్ సెల్స్ కార్యకలాపాలను పెంపొందించటం ద్వారా దేహంలో మెటబాలిక్ స్ట్రెస్‌ను తగ్గించటంలో ఇవి ఉపయోపడతాయి.చదవండి: పొలాల్లో రసాయనాల వాడకంతో మనుషుల్లో జబ్బుల పెరుదలకుమ్ఖాత్ పోషక విలువలు: 100 గ్రాముల కుమ్ఖాత్ పండ్లలో పోషకవిలువలు ఇలా ఉంటాయి... శక్తి : 71 కిలోకేలరీలు; పిండిపదార్థాలు : 15.9 గ్రా; మాంసకృత్తులు : 1.8 గ్రా; కొవ్వు : 0.8 గ్రా; పీచు : 6.5 గ్రా; విటమిన్ ఎ : 15 మిల్లీ గ్రాములు; విటమిన్ సి : 43.9 ఎం.జి; రిబొఫ్లేవిన్ : 0.09 ఎం.జి; క్లోరిన్ : 8.4 ఎం.జి; కాల్షియం : 62 ఎం.జి; ఐరన్ : 0.87 ఎం.జి; మెగ్నీషియం : 20 ఎం.జి; మాంగనీసు : 0.13 ఎం.జి; జింక్ : 0.17 ఎం.జి; -
ఆలూ బుఖారాతో బోలెడన్ని లాభాలు..!
వర్షాకాలంలో వ్యాధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆహార విషయానికొస్తే తగిన జాగ్రత్తలు ఎంతో ముఖ్యం. ఈ సీజన్లో ఆలూ బుఖారాతో కొన్ని ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అవేంటో చూద్దాం.ఆలూ బుఖారాలో విటమిన్ సి ప్రోటీన్ పుష్కలంగా దొరుకుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతూ, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఈ పండు శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్లను కలిగి ఉండటంతోపాటు ఈ వ్యాధులను కూడా నివారిస్తుంది.ఆలూ బుఖారాతో ప్రయోజనాలు..ఆలూ బుఖారా జీర్ణవ్యవస్థ సమస్యలను తొలగించడంతోపాటు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. అలాగే కడుపు నొప్పి సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చు.ఈ పండు తీపిగా ఉన్నప్పటికీ, మధుమేహ రోగులకు ప్రయోజనాన్నిస్తుంది. ఇది పీచు పదర్థంగా ఉంటూ, రక్తంలో అవసరమైనంత చక్కెర స్థాయినిస్తుంది. షుగర్ పేషెంట్లు కూడా ఆలూ బుఖారాను తక్కువ మోతాదులో తీసుకోవచ్చు.ఎముకలు దృఢంగా మారడంలో ఆలూ బుకారా ఎంతో ఉపయోగకరం. ఎముకలు దెబ్బతినకుండా, ఎముకల వ్యాధి వంటి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి కాపాడుతుంది.అధిక రక్తపోటు నుంచి రక్షించడంతోపాటు, దీన్ని తినడంతో బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. ఇది గుండె సంబంధిత వ్యాధులను కూడా అరికడుతుంది.విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో ఆలూ బుఖారా ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచడంలో ఎంతో తోడ్పడుతుంది. దీనిని తీసుకోవడంతో ఫిట్నెస్ కూడా మెరుగుపడుతుంది.(చదవండి: 6,7 తేదీల్లో హుబ్లీలో పనస మేళా..) -
అటు వర్షాలు.. ఇటు కమ్మని ఫలాలు (ఫొటోలు)
-
నోరూరించే నేరేడు పళ్లు: ఈ ప్రయోజనాలు తెలుసా?
మార్కెట్లో ఎక్కడ చూసినా అల్ల నేరేడు పండ్లు కనిపిస్తున్నాయి. నల్లగా నిగ నిగ లాడుతూ నోరు ఊరిస్తున్నాయి. ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తినడం అలవాటు చేసు కోవాలని పెద్దలు చెబుతారు. అసలు అల్ల నేరేడు పళ్లు తింటే లభించే ఔషధ ప్రయోజనాల గురించి తెలుసా? తెలిస్తే మీరు తినకుండా ఉండలేరు.ఇండియన్ బ్లాక్‌బెర్రీ, జామూన్, లేదా జావా ప్లం ఈ పేరుతో పిలిచినా.. రుచి మాత్రం వగరు, తీపి కలయికతో గమ్మత్తుగా ఉంటుంది. మార్కెట్‌నుంచి తీసుకొచ్చిన కాయలను ఉప్పు నీళ్లలో వేసి శుభ్రంగా కడిగిన తరువాత తినాలి. అల్ల నేరేడు పోషకాల గని. ఆరోగ్యకరమైన కొవ్వుల సమ్మేళనం. ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్తో సహా యాంటీఆక్సిడెంట్లు మెండు. ఇంకా ప్రొటీన్, కాల్షియం, కార్బొహైడ్రేట్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, విటమిన్ సీ, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బీ6, విటమిన్ ఏ, పుష్కలంగా లభిస్తాయి. నేరేడు పండు మాత్రమే కాదు, ఆకులు, గింజల్ని ఔషధాలుగా వాడతారు. అల్ల నేరేడు బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు చక్కటి ఔషధంలా పని చేస్తుంది. ఈ పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. రకాల ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా అడ్డుకుంటాయి. అలాగే దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.అల్ల నేరేడు- లాభాలు అల్లనేరేడులో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అధిక రక్తపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది. కాలుష్యంగా కారణంగా దెబ్బతిన్న శ్వాస నాళాలు, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. వీటిలో ఉండే జింక్, విటమిన్ సీ ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి.అల్ల నేరేడులో ఉండే సైనైడిన్ వంటి సమ్మేళనాలు కొలన్ కేన్సర్‌ను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి. డయాబెటిక్ రోగులకు నేరేడు పళ్లు చాలా మేలు చేస్తాయి. అధిక మూత్ర విసర్జన, దాహం వంటి డయాబెటిస్ లక్షణాలను తగ్గిస్తాయి. వీటిల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడానికి దోహదం చేస్తుంది. ఈ పండులో జాంబోలిన్ అనే సమ్మేళనం పిండి పదార్ధాన్ని చక్కెరగా మార్చడాన్ని నిరోధించడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.వీటిల్లోని యాంటాక్సిడెంట్ల సమ్మేళనాలు, విటమిన్ సీ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఫలితంగా చర్మం మెరుస్తుంది. అంతేకాదు చాలాకాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు విస్తర్జిస్తుంది. పేగుల్లో చుట్టుకు పోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉందని పెద్దలు చెబుతారు. పిండిపదార్థం, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కనుక అధిక బరువు ఉన్నవారు కూడా తినవచ్చు. ఇందులోని అంతేకాదు ఫైబర్ కంటెంట్ సరైన జీర్ణక్రియకు దోహదపడి, అనవసరమైన కొవ్వు పెరగకుండా అడ్డుపడుతుంది. -
రెయిన్బో డైట్: రంగురంగుల ఆహారాలతో ఆరోగ్యం పదిలం..!
మనం తినే ఆహారంలో వివిధ రకాల పోషకాలు సమతుల్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా జీవించగలుగుతాం. అందుకే పోషకాహార నిపుణులు మనం తినే ఆహారంలో అన్ని రంగుల్లోని పండ్లు, కూరగాయలు ఉండాలంటున్నారు. ముఖ్యంగా రెయిన్బో(ఇంద్ర ధనుస్సు) డైట్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు. ఏంటీది అనేకదా..!. ఏం లేదండీ ఇంద్రధనుస్సులోని ఏడు రంగుల్లో ఉండే కూరగాయాలు, పండ్లు తీసుకుంటే అన్ని రకాల పోషకాలు శరీరానికి అందడమే గాక చక్కటి ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుందని చెబుతున్నారు. ఈ డైట్ వల్ల జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చని అంటున్నారు. అలాంటి ఈ రెయిన్బో డైట్లో రంగుల వారీగా ఉండే కూరగాయాలు, పండ్లు వర్గీకరణ, వాటి ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటాయని మనకు తెలుసు. అలాగే రెయిన్బో డైట్ అంటే ఎరుపు, పసుపు, ఊదా, ఆకుపచ్చ, నారింజ వంటి వివిధ రంగుల్లో పండ్లు, కూరగాయలను కలిగి ఉంటుంది. అందులోని ప్రతి రంగుతో కూడిన కూరగాయాలు, పండ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో చూద్దామా..!రెడ్ ఫుడ్స్: ఇవి లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. అందువల్ల ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే గాక కేన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ రంగు కూరగాయలు, పండ్లు ప్రోస్టేట్, మూత్ర నాళం, డీఎన్ఏ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. అందువల్ల ఎరుపు రంగులో ఉండే యాపిల్స్, చెర్రీస్, నారింజ, బెర్రీలు, పుచ్చకాయలు, ఎర్ర ద్రాక్ష, బీట్రూట్లు, టమోటాలు మొదలైనవి తప్పక తినమని నిపుణులు చెబుతున్నారు.గ్రీన్ ఫుడ్స్: క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల అవి శరీరాన్ని నిర్విషీకరణ చేసి జీర్ణక్రియకు తోడ్పడతాయి. అలాగే శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ ఆహారాలు కంటి, ఊపిరితిత్తులు, కాలేయం, కణాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. త్వరగా గాయాలు నయం అవ్వడంలో, చిగుళ్ల ఆరోగ్యంలో సహయపడతాయి. ఆకుపచ్చ రంగులో ఉండే అవోకాడో, ద్రాక్ష, కివి, బేరి, బ్రోకలీ, దోసకాయ, ఆస్పరాగస్, క్యాబేజీ, బీన్స్, మొదలైనవి తీసుకోవాలి.వైట్ ఫుడ్స్: దీనిలో అల్లిసిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఎముకలకు మద్దతునిస్తాయి. అలాగే గుండె జబ్బులు, కేన్సర్‌తో పోరాడుతాయి. అందుకోసం అరటిపండ్లు, వెల్లుల్లి, కాలీఫ్లవర్, బంగాళదుంపలు, పుట్టగొడుగులు, ఖర్జూరం, అల్లం, ముల్లంగి మొదలైనవి తినండి.పసుపు ఆహారాలు: వీటిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఈ సిట్రస్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, చర్మ సంరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అందుకోసం నిమ్మకాయలు, పైనాపిల్, అత్తి పండ్లను, మొక్కజొన్న, పసుపు మిరియాలు, పసుపు టమోటాలు, మామిడి, బంగారు కివి మొదలైనవి. ఈ ఆహారాలు కళ్ళకు, రోగనిరోధక వ్యవస్థకు మంచివిపర్పుల్ ఫుడ్స్: వీటిలో ఆంథోసైనిన్లు అధికంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కడుపులోని మంటను తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా గుండెకు, మెదడుకు, ఎముకలకు, ధమనులకు, జ్ఞానానికి మేలు చేస్తాయి. ఈ ఆహారాలు కేన్సర్‌తో పోరాడటమే గాకుండా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి కూడా తోడ్పడతాయి. అందుకోసం ప్లం, ప్రూనే, బ్లాక్‌బెర్రీ, అత్తి పండ్లను, ఎండుద్రాక్ష, వంకాయ, ఊదా క్యాబేజీ, బ్లూబెర్రీస్, పర్పుల్ ద్రాక్ష మొదలైనవి.ఆరెంజ్ ఫుడ్స్: వీటిలో ఉండే బీటా-కెరోటిన్‌తో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. నరాలు, కండరాల ఆరోగ్యానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి ఇవి చాలా అవసరం. దీని కోసం నారింజ, గుమ్మడికాయ, బొప్పాయి, పసుపు, చిలగడదుంపలు మొదలైనవి తీసుకోవాలి.ఎల్లప్పుడూ వివిధ రంగుల కూరగాయలు, పండ్లు తినాలని లక్ష్యంగా పెట్టుకోండి. ఈ ఆహారాలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి మెదడు కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి, అభిజ్ఞా పనితీరును పెంచుతాయి.గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. పాటించేమందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి ఫాలో అవ్వడం మంచిది. -
పెరుగుతో జత చేయకూడని ఆహార పదార్థాలు ఇవే..!
కొంతమంది అజీర్ణం, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట లేదా కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు ప్రోటీన్, కాల్షియంల పవర్‌హౌస్ అయిన పెరుగుతో ఈ ఆహార పదార్థాలను జోడించడం వల్ల ఈ సమస్య తీవ్రతరమయ్యి, ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా కూడా పెరుగుతో ఇలాంటి పదార్థాలను జోడించడం శరీరానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా భారీ భోజనం లేదా మంచి స్పైసీతో కూడిన ఆయిలీ ఫుడ్స్ తినేటప్పుడు పెరుగులో కలపి అస్సలు ఇలాంటివి అస్సలు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ పెరుగుతో జత చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో సవివరంగా చూద్దామా..!కాల్షియం, ప్రోబయోటిక్స్ ఉండే పెరుగు శరీరానికి చలువ చేస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. కడుపులోని ప్రేగు కదలికలకు మద్దతు ఇస్తుంది. ఐతే కడుపులో జీర్ణక్రియ ప్రశాంతంగా హాయిగా ఉండాలంటే మాత్రం పెరుగుకి ఈ పదార్థాలు అస్సలు జత చెయ్యకండి.ఉల్లిపాయలు..ఉల్లిపాయ రైతా ఒక రుచికరమైన లంచ్ టైం డిష్. కూరగాయలు, రోటీలతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..పెరుగు శరీరంలో చల్లదనం తీసుకొస్తే..ఉల్లి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు కలిపి తీసుకుంటే..అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు తీవ్రతరం అవ్వడం లేదా రావడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.మామిడికాయలునిపుణుల అభిప్రాయం ప్రకారం మామిడిని పెరుగుతో జత చేసి అస్సలు తినకూడదు. జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, పీహెచ్ స్థాయిలలో అసమతుల్యతకు దారితీస్తుంది. మామిడికాయలో పులుపు, పెరుగులోని ఆమ్లం వల్ల పీహెచ్ స్థాయిల్లో అసమతుల్యతకు కారణమవుతుంది. మామిడి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల ఇది కూడా జీర్ణక్రియకు సమస్యాత్మకంగా ఉంటుంది. ఇలా తినడం ఫుడ్ పాయిజన్‌కు దారితీసి, దద్దుర్లు, తామర లేదా సోరియాసిస్ వంటి చర్మ సమస్యలకు దారితీస్తుంది. చేపశాకాహారంతో నాన్‌వెజ్ మూలాన్ని ఎట్టిపరిస్థితుల్లో జత చేయకూడదు. చేపలు, పెరుగులో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. ఇది కూడా కడుపు నొప్పి, ఉబ్బరం, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. పండ్లు..చాలా పండ్లలలో ఫ్రక్టోజ్ ఉంటుంది. అందువల్ల కొన్ని రకాల పండ్లను కూడా పెరుగుతో కలపడకూడదు. ఈ కలయిక జీర్ణక్రియకు ఇబ్బందికరంగా మారుతుంది. ఇది కూడా గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుతందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం ఇష్టంగా తాగే మిల్క్ షేక్‌లో ఎక్కువగా పాలు, అరటిపండ్లు ఉపయోగిస్తారు. ఇవి కూడా పొట్టకు ప్రతికూలంగా ఉంటాయని చెబుతున్నారు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్..పెరుగులో బాగా వేయించిన డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, వడలు కలిపిన బ్రేక్‌ఫాస్ట్‌లు తీసుకున్నా పొట్టలో చాలా భారంగా ఉంటుంది. పైగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది కూడా. అంతేగాదు ఆయిల్ ఫుడ్స్‌తో కూడిన పెరుగు జీర్ణక్రియను నెమ్మదించేలా చేసి నీరసం తెప్పించేలా చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: నాడు చిన్నారి పెళ్లి కూతురు..నేడు డాక్టర్‌గా..!) -
షుగర్ పేషెంట్స్ పళ్లు తినకూడదా? తింటే ఏవి తినాలి?
షుగర్ వ్యాధి వచ్చిందనగానే మనలో చాలామంది కంగారుపడిపోతూ ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, స్వీట్ తినకూడదు కదా మరి ఎలాంటి పండ్లు తీసుకోవాలి అనే సందేహాలు మొదలౌతాయి. అయితే వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని రకాల పండ్లను తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారు ఈ పండ్లను భయంలేకుండా తీసుకోవచ్చు.అవేంటో చూద్దాం. నిజానికి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ డయాబెటిస్ ఉన్నవారు కొన్ని పండ్లను తినకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా మామిడి, అరటి, ద్రాక్ష, పనస పండ్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఒకటి లేదా రెండు ముక్కలను తీసుకుంటే మంచిది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగవచ్చు.ఆపిల్, జామ, నారింజ, బొప్పాయి ,పుచ్చకాయ తీసుకోవచ్చు. ఈ పండ్లలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది , చక్కెర తక్కువగా ఉంటుంది. అయితే వీటిని జ్యూస్‌ల రూపంలో కాకుండా, కాయగానే తినాలి. అపుడు మాత్రమే నష్టపోకుండా ఉంటుంది. ఫోలేట్, విటమిన్ సి, పొటాషియం, డైటరీ ఫైబర్ లభిస్తాయి. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించాలనుకుంటే, భోజనం మధ్య విరామాలలో ఈ పండ్లను తీసుకోండి. సిట్రస్ పండ్లు, యాపిల్స్, బొప్పాయి ద్వారా ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడే ఫోలేట్- B9 లభిస్తుంది.ఆపిల్స్: ఆపిల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. జ్యూస్ రూపంలో గాకుండా, శుభ్రంగా కడిగి తొక్కతో తింటే ఫైబర్ ఎక్కువ అందుతుంది. పుచ్చకాయ: దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని పొటాషియం కిడ్నీల పనితీరుని మెరుగ్గా చేస్తుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండుని తీసుకోవచ్చు. ఆరెంజ్: ఆరెంజ్ పళ్లలోని క్యాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది. అధిక మోతాదులో లభించే విటమిన్ ‘ఎ’ వల్ల దృష్టి లోపాలను నివారిస్తుంది. ఇందులో క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము, సోడియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇంకా ఏ, సీ విటమిన్లతో పాటు థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్ తదితరాలు మెండుగా ఉంటాయి.నేరేడుపండ్లు: సమ్మర్లో ఎక్కువగా లభించే పళ్లలో నేరేడు ఒకటి.నేరేడు పండ్లు, ఎండబెట్టిన గింజల పొడి, నేరేడు చిగుళ్లను తీసుకోవడం ద్వారా షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెబుతారు. ఇందులో విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలంజామపండ్లు: జామపండులో విటమిన్ ఏ, సి, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఈ పండ్లు మధుమేహులకు చాలా మంచివి. ఆరెంజ్‌లోని విటమిన్ సి జామపండులో నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. జామకాయను తినడం ద్వారా దంతాలు, చిగుళ్లకు బలం చేకూరుతుంది. జామపండును రోజుకు రెండేసి తీసుకోవడం ద్వారా షూగర్ ను కంట్రోల్ లో పెట్టవచ్చు.పైనాపిల్: యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్య రక్షణకి అవసరమైన విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండు పైనాపిల్. ఎముకలకు ఇది బలం. అంజీర్: వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అందుకే ఇది ఇన్సులిన్ ఫంక్షన్‌ని కంట్రోల్ చేస్తుంది.అంజీర్‌తో విటమిన్-ఎ, బి1, బి2, కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతోపాటు క్లోరిన్ లభిస్తాయి. -
సమ్మర్లో డీహైడ్రేషన్‌కు చెక్‌పెట్టేవి ఇవే..!
సమ్మర్ ఇలా ప్రారంభమయ్యిందో లేదో అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఓ పక్క జనాలు వడదెబ్బకు తాళ్లలేక పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ కాలంలో మండే ఎండలను తట్టుకోవాలంటే అధికంగా నీరు తాగడమే కాక శరీరం డీహైడ్రేషన్‌కి గురికాకుండా ఉండేలా చూసుకోవాలి. కేవలం నీరు, మజ్జిగ రూపంలో ద్రవ పదార్థాలు తీసుకోవడమే కాకుండా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండు తీసుకోవడం మరింత మేలు. అందుకోసం తీసుకోవాల్సిన పండ్లు ఏంటో సవివరంగా తెలుసుకుందామా..! పుచ్చకాయ అధిక వాటర్ కంటెంట్‌కి ప్రసిద్ధ. వేసవిలో దీన్ని తీసుకుంటే దాహం కట్టడుతుంది. వడదెబ్బ నుంచి సులభంగా బయటపడగలుగుతాం. వేసవి తాపం నుంచి మంచి ఉపశమనం కలిగించే ఫ్రూట్ పుచ్చకాయ అని చెప్పొచ్చు. దోసకాయలు.. ఇది ఏకంగా 96% నీటిని కలిగి ఉంటుంది. నీటితో ప్యాక్ చేసిన మంచి ఫ్రూట్‌గా పేర్కొనవచ్చు. కేలరీలు తక్కువగా ఉండటమే గాకుండా కావల్సినన్నీ విటమిన్లు, ఫైబర్లు ఉంటాయి. ఈ దోసకాయని సలాడ్‌రూపంలో లేదా అల్పాహారంగానూ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కొబ్బరి నీరు ఇది ద్రవాల తోపాటు కోల్పోయిన నీటిని ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది. ఇందులో ఉండే సోడియం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు కీలకమైన శారీరక విధులకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. డీహైడ్రేషన్ నుంచి కాపాడటంలో సమర్థవంతంగా ఉంటుంది. టమోటాలు.. వీటిలో కూడా 94% నీటి కంటెంట్ ఉంటుంది. ఫైబర్, కేలరీలు సమృద్దిగా ఉంటాయి. ఇందులో ఉండే లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని అందించి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. చర్మ ఆరోగ్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం కంటెంట్ ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. బూడిద గుమ్మడికాయ ఇందులో 96% నీటి కంటెంట్ ఉంటుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆమ్లత్వంతో కూడిన ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పెద్దప్రేగుని నిర్వహించడంలోను జీర్ణ సమస్యలను తగ్గించడంలోనూ సమర్థవంతంగా ఉంటుంది. బెల్ పెప్పర్స్ క్యాప్సికంనే బెల్ పెప్పర్స్ అని కూడా అంటారు. ఇది వంటకాలకు మంచి రుచిని, వాసనను అందిస్తాయి. విటమిన్ సీ, విటమిన్ బీ6, బీటా కెరోటిన్, థయామిన్, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు ఉంటాయి. స్ట్రాబెర్రీలు స్ట్రాబెర్రీల్లో దాదాపు 91% నీటి శాతాన్ని కలిగి ఉంటాయి. దీనిలో విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్‌తో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది కడుపులో మంటను తగ్గించడంలోనూ వివిధ వ్యాధుల నుంచి రక్షించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. నారింజలు.. ఇందులో కూడా మంచి నీరు కంటెంట్ ఉంటుంది. విటమిన్ సీ, పొటాషియం, వంటి యాంటి యాక్సిడెట్లు సమృద్దిగా ఉంటాయి. గుండె ఆరోగ్యం, వాపు తగ్గింపుకు తోడ్పడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మూత్ర పిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయ పడుతుంది. ఇందులో సిట్రిక్యాసిడ్ కంటెంట్, ఆర్ధ్రీకరణను ప్రోత్సహించే లక్షణాలు కారణంగా డీహైడ్రేన్ని నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. (చదవండి: ఉగాది పచ్చడితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!) -
సమ్మర్ : ఈ జాగ్రత్తలు మర్చిపోతున్నారా?
ఏప్రిల్ మాసంలోకి ఎంటరై పోయాం. మండే ఎండలకు సిద్ధం కావాలి. రాబోయే రోజుల్లో వేసవి తాపం గురించి వాతావరణ నిపుణులు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వసవిలోత తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసుకుంటూ,దానికి తగినట్టుగా జీవన శైలిని మార్చుకోవాలి.ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేలా, బాడీ చల్లగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. వేసవిలో మాంసాహారాన్ని తగ్గించుకుంటే మంచింది. దీనికి బదులుగా తేలికగా జీర్ణమయ్యే తాజా కూరగాయలను ఎక్కువగా తినాలి.తాజా కూరలు, పళ్లుకూరగాయల్లో అన్ని రకాల ఆకు కూరలతోపాటు, దోసకాయ, కీరా, బీరకాయ, గుమ్మడి, టమాటా, బెండ, లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఫ్రూట్స్‌లో పుచ్చకాయ, జామ, పైనాపిల్, దానిమ్మ, ఇతర సిట్రస్ పండ్లు కొవ్వు పదార్ధాలను విచ్ఛిన్నం చేస్తాయి, జీర్ణక్రియకు సహాయ పడతాయి. అలాగే బాడీకి చల్లదనాన్నిస్తాయి. నిమ్మ, పుదీనా - చల్లదానికి నిమ్మ పుదీనా చాలా మంచిది. ఈరెండూ కలిస్తే ఏ పానీయమైనా రిఫ్రెష్ అయిపోతుంది. కొబ్బరి నీళ్ళు,మజ్జిగ : వేసవిలో ఎంత నీరు తాగితే అంత మంచిది. కొబ్బరి నీళ్లు సహజ ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ప్రత్యేకించి ఎండకు బాగా అలసిపోయినప్పుడు బాగా పనిచేస్తుంది.ఉల్లిపాయలు - ఉల్లిపాయలు చలవగా చాగాబాగా పని చేస్తాయి. వడదెబ్బ నుంచి ఉల్లిపాయలు కాపాడతాయని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే దీన్ని పచ్చిగా, రైతా, సలాడ్లు , చట్నీలలో వాడుకోవచ్చు.వేడిని పెంచే కొన్ని ఆహార పదార్థాలు వేరుశెనగ , క్యారెట్లు, గుడ్లు, మాంసాహారం లాంటి వాటిల్లో పోషకాలు అధికం కాబట్టి జీర్ణం కావడం లేటవుతుంది. వీటికి శరీరంలో వేడిని పెంచే శక్తి ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అల్లం, వెల్లుల్లి, ఇతర మసారా దినుసులను బాగా తగ్గించాలి. యాంటీ ఆక్సిడెంట్లులో పుష్కలంగా ఉండే అల్లం, వెల్లుల్లి, శరీరంలో వేడిని పెంచుతాయి. గుండెమంట, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలున్నవారు ఈ వేసవిలో జాగ్రత్తగా ఉంటే బెటర్. వేసవి వచ్చింది కదా అని పచ్చళ్లు తెగ తినేయకూడదు. కొత్త ఆవకాయ లాంటి పచ్చళ్లను మితంగా తీసుకోవాలి.ఇతర జాగ్రత్తలుమరీ అవసరం అయితే ఎండకు వెళ్లకుండా ఉండాలి. ఉదయం 12 తరువాత బయటికి వెళ్లవద్దు. సాయంత్రం పనులను 4 గంటల తరువాత ప్లాన్ చేసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. గొడుగు, స్కార్ఫ్, తలపై కప్పుకోవాలి. లేదా టోపీ పెట్టుకోవాలి. వ్యాయామం చేసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి.వెంట నీళ్ల బాటిల్ తీసుకుపోవాలి. ఒకవేళ ఎండకు వెళ్లి వచ్చిన తరువాత బాగా నలతగా, అలసటా అనిపించినా అప్రమత్తం కావాలి. తలనొప్పి, వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలొస్తే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలు, పెద్దల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. -
సమ్మర్ : ఈ జాగ్రత్తలు మర్చిపోతున్నారా?
ఏప్రిల్ మాసంలోకి ఎంటరై పోయాం. మండే ఎండలకు సిద్ధం కావాలి. రాబోయే రోజుల్లో వేసవి తాపం గురించి వాతావరణ నిపుణులు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వసవిలోత తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసుకుంటూ,దానికి తగినట్టుగా జీవన శైలిని మార్చుకోవాలి. ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేలా, బాడీ చల్లగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. వేసవిలో మాంసాహారాన్ని తగ్గించుకుంటే మంచింది. దీనికి బదులుగా తేలికగా జీర్ణమయ్యే తాజా కూరగాయలను ఎక్కువగా తినాలి. తాజా కూరలు, పళ్లు కూరగాయల్లో అన్ని రకాల ఆకు కూరలతోపాటు, దోసకాయ, కీరా, బీరకాయ, గుమ్మడి, టమాటా, బెండ, లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఫ్రూట్స్‌లో పుచ్చకాయ, జామ, పైనాపిల్, దానిమ్మ, ఇతర సిట్రస్ పండ్లు కొవ్వు పదార్ధాలను విచ్ఛిన్నం చేస్తాయి, జీర్ణక్రియకు సహాయ పడతాయి. అలాగే బాడీకి చల్లదనాన్నిస్తాయి. నిమ్మ, పుదీనా - చల్లదానికి నిమ్మ పుదీనా చాలా మంచిది. ఈరెండూ కలిస్తే ఏ పానీయమైనా రిఫ్రెష్ అయిపోతుంది. కొబ్బరి నీళ్ళు,మజ్జిగ : వేసవిలో ఎంత నీరు తాగితే అంత మంచిది. కొబ్బరి నీళ్లు సహజ ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ప్రత్యేకించి ఎండకు బాగా అలసిపోయినప్పుడు బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు - ఉల్లిపాయలు చలవగా చాగాబాగా పని చేస్తాయి. వడదెబ్బ నుంచి ఉల్లిపాయలు కాపాడతాయని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే దీన్ని పచ్చిగా, రైతా, సలాడ్లు , చట్నీలలో వాడుకోవచ్చు. వేడిని పెంచే కొన్ని ఆహార పదార్థాలు వేరుశెనగ , క్యారెట్లు, గుడ్లు, మాంసాహారం లాంటి వాటిల్లో పోషకాలు అధికం కాబట్టి జీర్ణం కావడం లేటవుతుంది. వీటికి శరీరంలో వేడిని పెంచే శక్తి ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అల్లం, వెల్లుల్లి, ఇతర మసారా దినుసులను బాగా తగ్గించాలి. యాంటీ ఆక్సిడెంట్లులో పుష్కలంగా ఉండే అల్లం, వెల్లుల్లి, శరీరంలో వేడిని పెంచుతాయి. గుండెమంట, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలున్నవారు ఈ వేసవిలో జాగ్రత్తగా ఉంటే బెటర్. వేసవి వచ్చింది కదా అని పచ్చళ్లు తెగ తినేయకూడదు. కొత్త ఆవకాయ లాంటి పచ్చళ్లను మితంగా తీసుకోవాలి. ఇతర జాగ్రత్తలు మరీ అవసరం అయితే ఎండకు వెళ్లకుండా ఉండాలి. ఉదయం 12 తరువాత బయటికి వెళ్లవద్దు. సాయంత్రం పనులను 4 గంటల తరువాత ప్లాన్ చేసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. గొడుగు, స్కార్ఫ్, తలపై కప్పుకోవాలి. లేదా టోపీ పెట్టుకోవాలి. వ్యాయామం చేసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వెంట నీళ్ల బాటిల్ తీసుకుపోవాలి. ఒకవేళ ఎండకు వెళ్లి వచ్చిన తరువాత బాగా నలతగా, అలసటా అనిపించినా అప్రమత్తం కావాలి. తలనొప్పి, వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలొస్తే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలు, పెద్దల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. -
కీళ్ల నొప్పులను తొలగించే చిట్కాలు మీకోసం...
నేటి కాలంలో 30 ఏళ్లు దాటితే చాలు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతున్నాయి. ఈ పరిస్థితిలో వాటిని ఎదుర్కోవటానికి చాలామంది చాలా చిట్కాలు పాటిస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండటం లేదు. కానీ ఆహారంలో ఈ మూడు పండ్లను చేర్చుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఆ పండ్లేమిటంటే... నారింజ: రోజూ నారింజను తినడం వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది. ఇందులో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లనొప్పులని తగ్గించడంలో సహాయపడుతుంది. ద్రాక్ష: వీలయినంత వరకు ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా అనేకరకాల వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. చిన్నప్పటినుంచి పిల్లలకి ద్రాక్షపండ్లను తినిపించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పుచ్చకాయ: వేసవి కాలంలో పుచ్చకాయ తినడం అన్ని విధాల శ్రేయస్కరం. దీనివల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. తక్షణ శక్తి లభిస్తుంది. దీనిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఎండాకాలం బయటికి వెళ్లే ముందు లేదా బయటి నుంచి వచ్చిన తర్వాత పుచ్చకాయ తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు కీళ్లనొప్పులని తగ్గిస్తాయి. ఇవి చదవండి: మిమ్మల్ని మీరే పట్టించుకోవాలీ..! -
స్టవ్ వెలిగించకుండానే.. పండంటి వంటలు..
ఆరోగ్యంగా పెరగాలంటే రోజూ పండ్లు తినాలి. ఇది డాక్టర్ మాట.. అలాగే అమ్మ మాట కూడా. రోజూనా.. నాకు బోర్ కొడుతోంది.. పిల్లల హఠం. రోజూ తినే పండ్లనే కొత్తగా పరిచయం చేద్దాం. చేయడం సులభం... స్టవ్ వెలగాల్సిన పని లేదు. గరిట తిప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. స్ట్రాబెర్రీ విత్ క్రీమ్.. కావలసినవి: స్ట్రాబెర్రీ ముక్కలు – వంద గ్రాములు (కడిగి పలుచగా తరగాలి); మీగడ– వంద గ్రాములు; ఐసింగ్ షుగర్ లేదా మామూలు చక్కెర పొడి– 2 టేబుల్ స్పూన్లు; గార్నిష్ కోసం.. స్ట్రాబెర్రీలు – 2 టీ స్పూన్; బ్లాక్ సాల్ట్ – చిటికెడు; తయారీ: మీగడను బాగా చిలికి నాజిల్ ఉన్న ట్యూబ్‌లో వేయాలి. కోన్ అయినా ఫర్వాలేదు. అదీ లేకపోతే జంతికల గొట్టంలో స్టార్ డిజైన్ ఉన్న ప్లేట్ అమర్చి ఉపయోగించుకో వచ్చు. స్ట్రాబెర్రీ ముక్కలను గ్లాసులో పావు వంతు వేయాలి. ఆ పైన కొద్దిగా మీగడ అమర్చాలి. ఆ పైన మళ్లీ ఒక వరుస స్ట్రాబెర్రీ ముక్కలు, ఆ పైన మీగడ వేయాలి. చివరగా ఒక స్ట్రాబెర్రీ అమర్చి సర్వ్ చేయాలి. చట్పటా పొమోగ్రనేట్.. కావలసినవి: దానిమ్మ గింజలు – ముప్పావు కప్పు; చాట్ మసాలా – పావు టీ స్పూన్; ఆమ్చూర్ పౌడర్ – పావు టీ స్పూన్ (ఆమ్చూర్ పౌడర్ లేకపోతే పచ్చి మామిడి తురుము టీ స్పూన్); జీలకర్ర పొడి– పావు టీ స్పూన్; బ్లాక్ సాల్ట్ – చిటికెడు తయారీ: ఒక కప్పులో వీటన్నింటినీ వేసి స్పూన్‌తో కలిపితే చట్పటా పొమోగ్రనేట్ రెడీ. పిల్లలకు బాక్సులో పెట్టడానికి కూడా బావుంటుంది. డ్రాగన్ – కోకోనట్ స్మూతీ.. కావలసినవి: డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు – కప్పు; కొబ్బరి పాలు – కప్పు; స్వచ్ఛమైన తేనె – టేబుల్ స్పూన్; ఐస్ క్యూబ్స్ – 10 (ఇష్టమైతేనే) తయారీ: పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి పాలు తీసుకోవచ్చు లేదా రెడీమేడ్ కోకోనట్ మిల్క్ తీసుకోవచ్చు. డ్రాగన్ ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తగా బ్లెండ్ చేసి అందులో కొబ్బరి పాలు వేసి మొత్తం కలిసే వరకు బ్లెండ్ చేయాలి. పెద్ద గ్లాసులో పోసి తేనె కలిపి సర్వ్ చేయాలి. బ్లెండ్ చేసిన వెంటనే తాగేటట్లయితే తేనె కూడా అప్పుడే వేసుకోవచ్చు. డ్రాగన్ – కొబ్బరి పాల మిశ్రమాన్ని ముందుగా చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని తర్వాత తాగాలంటే తాగే ముందు తేనెను కలుపుకోవాలి. గ్రీన్ గ్రేప్ సోర్బెట్.. కావలసినవి: ఆకుపచ్చ ద్రాక్ష – 200 గ్రాములు; అల్లం తురుము – టీ స్పూన్; నిమ్మరసం– 2 టీ స్పూన్లు; చక్కెర – టీ స్పూన్ (అవసరం అనిపిస్తేనే) గార్నిష్ చేయడానికి.. పుదీన ఆకులు – 20. తయారీ: ద్రాక్షను మంచినీటితో శుభ్రం చేసి ఆ తరవాత గోరువెచ్చటి నీటిలో ఉప్పు కలిపి అందులో వేయాలి. ద్రాక్షను ఉప్పు నీటిలో 15 నిమిషాల సేపు ఉంచిన తర్వాత అందులో నుంచి తీసి మంచి నీటిలో ముంచి కడిగి నీరు కారిపోయే వరకు పక్కన పెట్టాలి. ద్రాక్ష, అల్లం, నిమ్మరసం మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. రుచి చూసి అవసరమనిపిస్తే చక్కెర వేసి మరొకసారి గ్రైండ్ చేయాలి. ఈ చిక్కటి ద్రవాన్ని ఒక పాత్రలో పోసి మూత పెట్టి ఎనిమిది గంటల పాటు ఫ్రీజర్‌లో పెట్టాలి. సర్వ్ చేసే ముందు తీసి ఫోర్క్‌తో గుచ్చి పలుకులు చేసి గ్లాసుల్లో పోసి పుదీన ఆకులతో గార్నిష్ చేయాలి. ఇవి చదవండి: అరటి పండ్లు పండిపోతున్నాయని పడేస్తున్నారా? -
పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో తెలుసా?
మాములుగా అందరం ఆరోగ్యం కోసం పళ్లను తినడం జరుగుతుంది. అయితే చాలా పండ్లలో కొన్నింటికి మాత్రం వాటిపై స్టిక్కర్లు అంటించి ఉంటాయి. ఎందుకిలా స్టిక్కర్లు అంటిస్తారనేది చాలామందికి తెలియదు. వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న పండ్లకు ఇలా స్టిక్కర్లు ఉంటాయోమో అనుకుంటాం . మరికొందరూ అలా స్టిక్కర్లు ఉన్న పళ్లే మంచివని కూడా అనుకుంటారు. అసలు ఇంతకీ ఎందుకు పండ్లపై స్టిక్కర్లు అంటిస్తారు?. దానికేమైన అర్థం ఉందా? తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా!. పండ్లపై ఉండే స్టిక్కర్ల గురించి ఇటీవలేఇటీవల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ స్టిక్కర్ల వినియోగం గురించి కీలక ప్రకటన చేసింది. ఎందుకు పండ్లపై స్టిక్కర్లు అతికిస్తారు, వాటి అర్థం ఏంటో సవివరంగా వెల్లడించింది. ఇక ఫుడ్ సేఫ్టి అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం..నాణ్యత, ధరతో పాటు పండ్లను ఏ విధంగా పండించారనే సమాచారాన్ని ఈ స్టిక్కర్లు సూచిస్తాయి. ఫ్రూట్స్‌కు అంటించే స్టిక్కర్లలో చాలా రకాలు ఉంటాయి. అందులో ఐదు నంబర్లు ఉండి అది 9తో మొదలైతే ఆ పండ్లు ఆర్గానిక్ ఫామ్ లో పండించారని, వందకు వంద శాతం నాచురల్ అని అర్థం. అదే కోడ్ ఐదు నంబర్లు ఉండి 8తో స్టార్ట్ అయితే ఆ ఫ్రూట్స్ సగం ఆర్గానిక్, సగం కెమికల్స్ వినియోగించినట్లని తెలుస్తోంది. ఒకవేళ నాలుగు నంబర్లు ఉడి అది నాలుగుతో స్టార్ట్ అయితే అది పూర్తిగా కెమికల్స్‌తో పండించారని, ఇన్ఆర్గానిక్ అని భావించవచ్చు. అలాగే స్టిక్కర్లపై ఎటువంటి నంబర్లు లేకపోతే మార్కెట్లో అమ్మకం దారులు మోసం చేస్తున్నారని అర్థం. ఈ క్రమంలో పండ్లను కొనుగోలు చేసే సమయంలో ఆలోచించి కొనుగోలు చేయండి. (చదవండి: చలికాలంలో కొబ్బరి నూనె గడ్డకట్టకూడదంటే ఇలా చేయండి!) -
రక్తహీనతతో బాధ పడుతున్నారా.. అయితే ఇవి తీసుకోండి!
'మన శరీరంలో పోషకాలు, ఆక్సిజన్ ప్రతి కణానికి సరిగ్గా అందడంలో రక్తం పాత్ర ముఖ్యమైనది. సరైన ఆరోగ్యం కోసం తగినంత రక్తం శరీరంలో ఉండాల్సిన అవసరం ఉంది. శరీరంలో రక్తం లోపించిన పరిస్థితిని అనీమియా అంటారు. రక్తం సరిగ్గా ఉండటానికి సరైన ఆహారాలు తినటం ఎంత ముఖ్యమో ప్రాసెస్డ్ ఆహారాలు, కృత్రిమ షుగర్స్ గల ఆహారాలు తగ్గించడం కూడా అంతే ముఖ్యం.' ఐరన్ అనేది ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్ లో కనిపించే ఒక ఖనిజం. హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కావు, గుడ్లు, మాంసం, చేపలు, టోఫు, పప్పులు, చిక్కుళ్ళు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఐరన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. విటమిన్ బి 12 అనేది ఒక విటమిన్, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్తకణాలు సరిగా పనిచేయలేవు. అందువల్ల ఆహారంలెఓ విటమిన్–బి 12 లభించే మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ అనేది ఒక విటమిన్, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా అవసరం. ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగా పెరగలేవు, అందువల్ల ఫోలిక్ యాసిడ్ ఉండే గుడ్లు, మాంసం, చేపలు, ఆకుకూరలు, బీన్స్, చిక్కుళ్ళు తీసుకోవాలి. ప్రోటీన్లు అనేవి శరీరం యొక్క నిర్మాణాత్మక భాగాలు. ప్రోటీన్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా అవసరం. ప్రోటీన్ల–మూలం మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, పప్పులు, చిక్కుళ్ళు, ధాన్యాలు, ఆకుకూరలు, తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఈ ఐరన్ మన రక్తం లోని హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో ముఖ్యమైనది. ఆకు కూరల్లాంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల రక్తం పెరిగి అనీమియా వంటి సమస్య రాకుండా ఉంటుంది. చిక్కుళ్ళు, పప్పు దినుసులు చిక్కుళ్ళు, పప్పు దినుసుల్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉన్న ప్లాంట్ బేస్డ్ ఐరన్ రక్తవృద్ధికి సహాయపడాలంటే వీటితో పాటు విటమిన్ సి అధికంగా ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోవాలి. అలాగే వీటిలో ఫోలియేట్, విటమిన్ బి 6 కూడా ఉండటం వల్ల రక్తం తయారవ్వటానికి ఇవి బాగా దోహదం చేస్తాయి. నట్స్, సీడ్స్ బాదం, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు వంటి నట్స్, సీడ్స్ లో ఫోలియేట్, ఐరన్, విటమిన్ ఇ ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ ఎర్ర రక్తకణాలు నష్టపోకుండా కాపాడుతుంది. బీట్ రూట్ బీట్ రూట్స్ లో ఐరన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. అందుకని మన శరీరం లో బ్లడ్ లెవల్స్ పెరగడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఈ బీట్రూట్స్ లో ఉండే నైట్రేట్స్ రక్త ప్రసరణ సవ్యంగా జరగడానికి అలాగే రక్తంలో ఆక్సిజన్ సరిగ్గా ఉండటానికి సహాయపడతాయి. సిట్రస్ పండ్లు నారింజ పళ్ళు, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి అనేది మన శరీరంలో రక్తం పెరగడానికి అవసరం అయ్యే ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. అందుకనే ఐరన్ రిచ్ ఫుడ్స్ తో పాటు ఈ సిట్రస్ పండ్లు కూడా తీసుకోవటం మంచిది. ఇవి కూడా చదవండి: ఆస్తమా 'దమ్ముందా'? ఇలా చేసి చూడండి! వెంటనే.. -
భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా?
చాలామంది ఆహారం తిన్న వెంటనే తేలిగ్గా తీసుకుని చేసే పనులే అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం. భోజనం తిన్న వెంటనే చల్లటి పదార్థాలు గానీ లేదా పండ్లు తీసుకుంటుంటాం. అలాగే బాగా స్పైసీ ఫుడ్ తినేసి హెర్బల్ టీలు వంటివి తాగేస్తుంటారు కొందరూ. నిజానికి ఇలాంటి అలవాట్లు చాలా ప్రమాదం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణలు. మన జీర్ణ వ్యవస్థ పాడవడ్డానికి ఆ అలవాట్లే ప్రధాన కారణమని హెచ్చరిస్తున్నారు. తిన్న వెంటనే పండ్లు తింటే.. పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ భోజనం చేసిన వెంటనే పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతారంటే భోజనం కాగానే పండ్లు తినడం వల్ల అందులోని ఎంజైమ్‌లు విచ్ఛిన్నమై ఆహారంతో కలిసిపోయి పొట్టలో సమస్యలను కలిగిస్తాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చల్లటి నీరు.. ప్రస్తుతం చాలా మంది ఆహారం తీసుకున్న వెంటనే రిఫ్రిజిరేటర్లో.. కొందరైతే మరీ డీప్ ఫ్రీజర్‌లో ఉంచిన చల్లని నీరు తాగుతున్నారు. ఇలా చల్లటి తాగడం వల్ల కడుపులో ఉత్పత్తి అయ్యే డైజెస్టివ్ ఎంజైమ్‌లు పొట్టను చల్లగా చేసి, జీర్ణక్రియ వ్యవస్థను స్తంభింపజేస్తాయి. అంతేకాదు, శరీరం ఆహారంలోని పోషకాలను గ్రహించడం మానుకుంటుంది. దీని కారణంగా పోషకలోపం వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి తిన్న వెంటనే చల్లటి నీటిని తాగడం మానుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. స్పైపీ ఫుడ్ తీసుకున్న తర్వాత టీ తీసుకుంటే.. వేడి ఆహారాలు తీసుకున్న తర్వాత హెర్బల్ టీలు తీసుకోవడం వల్ల తీవ్ర జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు పొట్టలో ఉష్ణోగ్రతలు కూడా ఒక్కసారిగా పెరిగిపోతాయి కాబట్టి ఆహారం తీసుకున్న వెంటనే బాగా వేడిగా ఉండే కాఫీ, టీ వంటి పానీయాలు తాగడం మానుకోవాలి. (చదవండి: స్పైసీ ఫుడ్స్‌తో నిమ్మరసాన్ని జత చేస్తున్నారా! ఐతే ఈ సమస్యలు తప్పవు!) -
డయాబెటిస్ పేషెంట్లకు ఈ పండ్లు..కూరగాయాలతో మేలు!
మనకు డయాబెటిస్ ఉందనగానే ఆ పండు తినకూడదని, ఈ కూరగాయ తినకూడదనీ రకరకాల సలహాలు చెబుతూ మనల్ని తికమకకు గురి చేసేస్తుంటారు చాలామంది. ఈ సందిగ్ధం లేకుండా డయాబెటిస్ ఉన్న వారు ఏయే పండ్లు, కూరగాయలు తినవచ్చో తెలియజేసే ప్రయత్నంలో భాగమే ఈ కథనం. కొన్ని పండ్లు సహజ సిద్ధంగా చక్కెర పరిమాణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఇలాంటి పండ్లను తీసుకోవడం చాలా హానికరం. ముఖ్యంగా మామిడి, శీతాఫలం, సపోటా, అరటి, పైనాపిల్‌ను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి. ఎండు ఖర్జూరాలు రోజూ కొన్ని ఎండు ఖర్జూరాలను తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే ఔషధ గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు సహాయపడతాయి. అయితే వీటిని పరిమితంగానే తీసుకోవాలి. నారింజ సిట్రస్ జాతి ఫలాల్లో నిమ్మకాయ, నారింజ చాలా మంచివి. డయాబెటిస్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపు చేసేందుకు నారింజ ఎంతగానో ఉపకరిస్తుంది. తేలికగా జీర్ణమయ్యే గుణం కలిగిన ఈ పండును రోజువారీ డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జామ జీర్ణసంబంధిత సమస్యలకు జామ అద్భుత ఔషధం. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో చాలా మంచిది. జామలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అయితే మధుమేహులు జామను దోరగా ఉన్నదే తీసుకోవడం మంచిది. యాపిల్ మధుమేహం ఉన్న వారికి యాపిల్ పండు మంచిది. ఇందులో పిండిపదార్థాలతోబాటు ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మధుమేహులు యాపిల్ తీసుకోవడం మంచిది. అయితే తొక్కతోపాటు తీసుకున్నప్పుడే ప్రయోజనం. తినవలసిన కూరగాయలు క్యాబేజీ డయాబెటిస్ డైట్లో వాడే కూరగాయల్లో అద్భుతంగా పనిచేసేది క్యాబేజీ ఒకటి. ఎక్కువగా చలికాలంలోనే దొరికే క్యాబేజీని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఇందులోని అధిక ఫైబర్ శరీరంలోని షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. చిలగడ దుంప (స్వీట్ పొటాటో) చిలగడ దుంప అని, గెణుసుగడ్డ అని, రత్నపురి గడ్డ అనీ ఇలా రకరకాలుగా పిలిచే ఈ కూరగాయను నేరుగా తినొచ్చు లేదా కూరలా వండుకొని కూడా తినొచ్చు. యాంటీ డయాబెటిక్ ఫుడ్‌గా దీనికి పేరుంది. ఇందులోని న్యూట్రిషన్లు, ఫైబర్ సహా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బ్లడ్‌షుగర్‌ను అదుపు చేయడంతో పాటు బరువు తగ్గించడంలో కూడా బాగా పని చేస్తుంది. ఇంకా టమోటా, దొండ, బెండ, కాకర, బీర, సొర, పొట్ల, క్యారట్ మంచిది. బంగాళదుంపను, బీట్రూట్ను వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. ఇంచుమించు ఆకుకూరలన్నీ డయాబెటిస్‌కు మంచిదే. (చదవండి: చక్కెర కంటే బెల్లమే ఎందుకు ఆరోగ్యానికి మంచిదంటే.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..) -
ఫ్రిజ్‌లో ప్రతీది పెట్టేస్తున్నారా..!
రిఫ్రిజిరేటర్లో ప్రతిదీ... తోసేయకండి. సీజన్‌తో పనిలేకుండా అన్నిరకాల ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్లో పెట్టేస్తుంటారు కొందరు. అయితే అన్నింటిని రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. ఐదురకాల ఆహారాలను రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరం అసలు లేదు. అవేంటో చూడండి... ఫ్రిజ్‌లో పెట్టకూడని పదార్థాలు.. సాస్, జామ్, జెల్లీలను రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరంలేదు. టొమాటోలను ఫ్రిడ్జ్‌లో పెట్టడడం వల్ల వాటిలోని సహజసిద్ధమైన రుచి పోతుంది. వీటిని బయట ఉంచితేనే తాజాగా.. రుచిగా ఉంటాయి. అరటి పండ్లు త్వరగా పండిపోతాయని రిఫ్రిజిరేటర్లో పెడుతుంటారు. ఇది మంచిది కాదు. అరటిపండ్లను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితేనే మంచిది మీరు తులసి లేదా రోజ్మేరీని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే, అవి త్వరగా ఎండిపోతాయి. మీరు ఈ మూలికలను ఒక చిన్న గ్లాసులో కొద్దిగా గది-ఉష్ణోగ్రత నీటిలో ఉంచవచ్చు. లేదా వంటగదిలో సూర్యకాంతి నుంచి దూరంగా ఉంచవచ్చు. కాఫీను, కాఫీ పౌడర్‌ను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే.. అది దాని చుట్టూ ఉన్న ఆహార పదార్థాల రుచిని తీసేసుకుంటుంది. పుచ్చకాయలను కట్ చేయకుంటే వాటిని బయటే ఉంచాలంటున్నారు నిపుణులు. వాటిని ముక్కలు చేసిన తర్వాతనే ఫ్రిజ్‌లో నిల్వచేయవచ్చని తెలిపారు. బ్రెడ్ స్లైసులను రిఫ్రిజిరేటర్లో ఉంచితే త్వరగా పాడైపోతాయి. ..పీచ్, ప్లమ్, బ్లాక్‌బెర్రీ, ఆవకాడోలను రిఫ్రిజిరేటర్లో కంటే బయటే ఉంచాలి. (చదవండి: పచ్చసొన తినకపోతే ఏం జరుగతుందో తెలుసా?) -
సీతాఫలం తరచూ తింటున్నారా? దీనిలోని గ్లైసెమిక్ ఇండెక్స్..
గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో సీతాఫలాల సీజన్ ప్రారంభమైంది. తియ్యని ఈ పండ్లలో ఎన్నో పోషక విలువలుండడమే కాకుండా కొన్ని రకాల అనారోగ్యాల నివారిణిగా పనిచేస్తుంది. ఈ పండే కాకుండా చెట్టు ఆకులు, బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం (ఆచార్యా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం) గృహ విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త వై.ఉమాజ్యోతి తెలిపారు. సీతాఫలం తీసుకుంటే కలిగే ఉపయోగాల గురించి ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్నో విటమిన్ల కలబోత సీతాఫలంలో ఎన్నో రకాల పోషకాలతో పాటు విటమిన్లు ఉన్నాయి. ఈ పండు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ (ఎ), విటమిన్ (బి) మెగ్నిషియం, పొటాషియం, ఫైబర్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఉదయాన్నే తినడం ద్వారా కండరాలు, నరాల బలహీనత వంటి రుగ్మతలు తొలగిపోతాయి. శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. విటమిన్ (ఎ) పుష్కలంగా ఉండడంతో కంటి సమస్యలు దూరమవుతాయి. మెగ్నీషియం, పోటాషియం, సోడియం సమపాళ్లలో ఉండడం వల్ల రక్తపోటును అదుపు చేసి గుండె సమస్యలు తలెత్తకుండా చూస్తుంది. పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగిస్తుంది. అల్సర్, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గర్భిణులు తినడం ద్వారా పుట్టబోయే బిడ్డల మెదడు చురుగ్గా ఉంటుంది. క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా తోడ్పడుతుంది. బలహీనంగా ఉండే చిన్న పిల్లలకు సీతాఫలాలను ఎంత ఎక్కువగా తినిపిస్తే అంత మేలు. ఈ పండ్లను ఎక్కువగా తినడం ద్వారా రక్తహీనత తగ్గుతుంది. కడుపులో మంట, జీర్ణ సంబంధ సమస్యలున్న వారు ఈ పండ్లను ఎక్కువగా తినడం మంచిది. డైటింగ్ చేసేవారు ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ఎదుగుతున్న పిల్లలు నిత్యం తింటుంటే కాల్షియం లాంటి పోషకాలు అధికంగా లభిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తం శుధ్ధి అవుతుంది. గుండె ఆరోగ్యానికి మెరుగు సీతాఫలం చూడడానికి కూడా హృదయాకారంలో ఉంటుంది. శరీరమంతా రక్తప్రసరణ సరిగ్గా ఉండేలా చూస్తుంది. అందువల్ల రక్తహీనత దరి చేరదు. ఈ పండు తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉంటాయి. సీతాఫలంలో గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో–గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. ఉదర ఆరోగ్యానికి.. దీనిలో విటమిన్ సి సమృధ్ధిగా దొరుకుతుంది. ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటందుకు దీనిలోని పీచుపదార్థం తోడ్పడుతుంది. అల్సర్లను నయం చేస్తుంది. ఎసిడిటీకీ చెక్ పెడుతుంది. డయేరియా లాంటి సమస్య రాకుండా అడ్డుకుంటుంది. చర్మ ఆరోగ్యానికి దోహదం ఈ పండులో స్మూత్ స్కిన్ టోన్ అందించే సూక్ష్మపోషకాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడి స్కిన్ మెరుస్తుంది. ఆకులతోనూ ప్రయోజనం ఒక్క పండేకాదు, సీతాఫలంచెట్టు ఆకులు కూడా ఉపయోగపడతాయి. ఆకుల్లోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్మ సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకుల్ని మెత్తగా నూరి రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్ పౌడర్ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే నల్లుల బెడద ఉండదు. చెట్టు బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి ఔషధంగా ఇస్తుంటారు. సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. అయితే కళ్లల్లో పడకుండా చూసుకోవాలి. నేరుగా తినడమే మంచిది గర్భిణులు ఈ పండును సాధ్యమైనంత తక్కువగా తినాలి. పొరపాటున గింజలు లోపలికి వెళితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. మోతాదుకు మించి తినకూడదు. మధుమేహ వ్యాధి గ్రస్తులు, ఊబకాయులు ఈ పండ్లను వైద్యుల సలహాలతో తీసుకోవాలి. జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలతో బాధపడేవారు పరిమితంగా తీసుకోవడం మంచిది. ఈ ఫలాన్ని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే ఉత్తమం. ఎందుకంటే గుజ్జు నోటిలోపల జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. పండుగుజ్జును తీసుకుని రసంలా చేసి పాలు కలిపి పిల్లలకు తాగిస్తే సత్వర శక్తి లభిస్తుంది. – వై.ఉమాజ్యోతి, శాస్త్రవేత్త, కేవీకే, రస్తాకుంటుబాయి -
భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా? ఇది తెలిస్తే అలా చేయరు
మనలో చాలామంది భోజనం విషయంలో సరైన నియమాలు పాటించరు. తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంటుంది. కొన్ని కాంబినేషన్స్ శరీరానికి అస్సలు మంచివి కావు.కొంతమంది అన్నంలో అరటిపండు, మామిడి పండును తీసుకుంటారు. ఇలా తినడం వల్ల అసౌకర్యంతో పాటు అనారోగ్యం కూడా తోడవుతుంది. అందుకే కొన్ని కాంబినేషన్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. మరికొందరు భోజనం తర్వాత వెంటనే పండ్లను తింటూ ఉంటారు. ఇలా అస్సలు చేయొద్దని అంటున్నారు నిపుణులు. భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి? అస్సలు తినకూడదని కొన్ని కాంబినేషన్స్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ► సాధారణంగా మనం భోజనం చేసిన తర్వాత పండ్లు తింటూ ఉంటాం. కానీ ఇది సరైన పద్ధతి కాదు. భోజనం చేశాక కొన్ని పండ్లు అస్సలు తినకూడదట. భోజనం చేసిన వెంటనే పండ్లను తింటే త్వరగా జీర్ణం కావని చెబుతున్నారు నిపుణులు. భోజనం చేసిన వెంటనే పండ్లను తీసుకుంటే భోజనంతో పాటు ఇతర ఆహారాలతో కలిసి అది రియాక్షన్‌గా ఏర్పడుతుందట. దీని ఫలితంగా ఎక్కువ ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. దీంతో పండ్లలోని పోషకాలు సరైన పద్దతిలో శరీరానికి అందవు. అందుకే భోజనం చేసిన కనీసం గంట, రెండు గంటల తర్వాత పండ్లను తీసుకోవాలి. ► భోజనం చేసిన వెంటనే అరటిపండ్లు తింటుంటారు చాలామంది. కానీ తిన్న వెంటనే అరటిపండ్లు తినడం వల్ల జలుబు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మరికొంతమంది నిద్రపోయే ముందు అరటిపండ్లు తింటుంటారు. దీనివల్ల నిద్రలేమితో బాధపడాల్సి వస్తుందట. కాబట్టి అరటిపండ్లు తినాలనుకునేవారు మధ్యాహ్న సమయంలో తినడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ► నారింజ, కమల, నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి వీటిని తినడానికి గంటముందు, లేదంటే తిన్న గంట తర్వాత పండ్లు తినడం మంచిది. లేదంటే యాసిడ్ రిఫ్లక్స్ వల్ల గుండెల్లో మంటగా అనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా సిట్రస్ పండ్లను పాలతో కూడా కలిపి తీసుకోరాదు. ► పాలకూర, పనీర్ కాంబినేషన్ చాలా ఎక్కువగా తింటుంటారు. రెస్టారెంట్లలోనూ వెజ్ తినాలనుకుంటే ఎక్కువగా పాలక్ పనీర్ తినేందుకు మొగ్గు చూపుతారు. కానీ ఈ కాంబినేషన్ అస్సలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఈ కాంబినేషన్ వల్ల పాలకూరలోని పోషకాలు నాశనం అవుతాయని అన్నారు. పాలక్ పనీర్‌లో ఎక్కువగా కాల్షియం,ఐరన్ ఉంటాయి. కాల్షియం కారణంగా ఐరన్‌ను శరీరం గ్రహించుకోలేదు. అందుకే పనీర్‌కు బదులుగా బంగాళదుంప, కార్న్ వంటివి తీసుకుంటే సరైన పోషకాలు అందుతాయని అంటున్నారు. ► భోజనం చేసిన వెంటనే కొందరు నిద్రకు ఉపక్రమిస్తారు. ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. తిన్న వెంటనే నిద్ర పోవడం వల్ల తిన్నది సరిగా అరగదని, దానివల్ల జీర్ణప్రక్రియకకు ఆటంకం కలుగుతుందని అంటున్నారు. అంతేకాకుండా తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల బరువు పెరుగుతారని, అందుకే భోజనానికి, నిద్రకు మధ్య రెండు, మూడు గంటల వ్యత్యాసం ఉండాలని సూచిస్తున్నారు. ► కొందరు తిన్న తర్వాత భోజనం చేస్తుంటారు. ఇలా అస్సలు చేయొద్దని అంటున్నారు నిపుణులు. భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తే అది శరీర ఉష్ణోగ్రతను విపరీతంగా పెంచుతుందని, ఇది జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. అందుకే తిన్నాక గంటకు పైగానే బ్రేక్ తీసుకొని ఆ తర్వాత స్నానం చేయాలని చెబుతున్నారు. -
ప్రపంచంలోని దోమలన్నింటినీ అంతం చేస్తే ఏమవుతుంది?... శాస్త్రవేత్తల సమాధానం ఇదే..
దోమలు అన్ని ప్రాంతాలలోనూ కనిపిస్తాయి.దోమలు కుట్టడం వలన సాధారణ జ్వరం మొదలుకొని ప్రాణాంతక వ్యాధులు సైతం సోకుతాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,500 దోమల ప్రజాతులు ఉన్నాయి. వీటిలో చాలా ప్రజాతులు దోమలు మనిషిని కుట్టవు. ఈ తరహా దోమలు పండ్లు, మొక్కల రసాలను తాగి జీవిస్తుంటాయి. కేవలం ఆరు ప్రజాతుల దోమలే మనుషుల రక్తాన్ని తాగుతాయి. ఇవి పలు వ్యాధులను కూడా వ్యాపింపజేస్తాయి. మన దేశంలో దోమల కారణంగా ఏటా 10 లక్షల మంది మరణిస్తున్నారు. Mosquitoes are the deadliest animal in the world: They kill more people than any other creature, due to the diseases they carry. pic.twitter.com/3v2CxAg8gc — TheFacts (@TheWorldFactsjj) May 27, 2023 దోమలు కుట్టడం వలన వచ్చే వ్యాధులలో మలేరియా, డెంగ్యూ,ఎల్లో ఫీవర్ మొదలైనవి ఉన్నాయి. వీటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది మరణిస్తున్నారు. ఒకవేళ ప్రపంచంలోని దోమలన్నింటినీ మట్టుబెడితే ఏం జరుగుతుందో తెలుసా? దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా దోమలను చంపేందుకు కెమికల్స్ వాడుతుంటారు. అయితే ఈ కెమికల్స్ వలన దోమలకన్నా అధికంగా మనుషులకే ముప్పు ఏర్పడుతోంది. దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ఎటువంటి కెమికల్స్ సాయంలేకుండా దోమలను తరిమికొట్టే ఉపాయాలను కనుగొనే పనిలో పడ్డారు. దీనిలో చాలా దేశాలు విజయం సాధించాయి. మనిషిని కుట్టే ఆడ దోమల జీన్‌లో మార్పులు తీసుకువచ్చి జెనెటికల్లీ మోడిఫైడ్ దోమలను సిద్ధం చేశారు. దోమలు గుడ్లను పెడతాయి. అయితే వాటినుంచి పిల్లలు బయటకు వచ్చేలోగానే తల్లిదోమలు మృతిచెందుతాయి. సుమారు మూడు లక్షల దోమలను కెమన్ ద్వీపంలో 2009-2010 కాలాల మధ్య వదిలివేశారు. ఈ ప్రయోగం వలన దోమల జనాభాలో 96 శాతం వరకూ తగ్గింది. ఇటువంటి ప్రయోగం బ్రెజిల్ లోనూ మంచి ఫలితాలను ఇచ్చింది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మూడు రకాల దోమలను నాశనం చేయగలిగితే పది లక్షలమంది మనుషులను కాపాడవచ్చు. అలాగే జెనిటికల్లీ మాడిఫైడ్ మస్కిటో ప్రయోగం కూడా ఇప్పటివరకూ ఎటువంటి దుష్పరిమాణాలను చూపలేదు. అయితే దోమలను పూర్తిస్థాయిలో నాశనం చేస్తే ప్రకృతి అందించిన ఫుడ్ చైన్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దోమలు పూలలో పరపరాగ సంపర్కం ఏర్పడేందుకు సహకారం అందిస్తాయి. ఫలితంగానే పూలు పండ్లుగా మారుతాయి. దోమలు కొన్ని ప్రాణులకు ఆహారం వంటివి. కప్పలు, బల్లులు, తొండలు మొదలైనవి దోమలను తిని బతుకుతాయి. ఇవి ఉండటం వలన ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అందుకే దోమలను మొత్తంగా అంతం చేసేబదులు వాటిలో ప్రమాదకరమనవాటిని మాత్రం అంతం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
సూపర్మార్కెట్లలో కూరగాయలు, పండ్లపై పరిమితులు.. ఒక్కరికి మూడే!
లండన్: బ్రిటన్‌లోని ప్రముఖ సూపర్‌మార్కెట్ సంస్థలు కొన్ని పండ్లు, కూరగాయల కొనుగోళ్లపై పరిమితులు విధించాయి. అననుకూల వాతావరణ పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా కొరత తలెత్తింది. నెల రోజుల వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయంటూ ప్రభుత్వం హెచ్చరించడంతో సూపర్ మార్కెట్ యాజమాన్యాలు ఈ చర్యను ప్రకటించాయి. టమాటాలు, క్యాప్సికం, దోసకాయలు, బ్రకోలి, క్యాలిఫ్లవర్ తదితరాల సరఫరా తక్కువగా ఉండటంతో వీటిని ఒక్కో వినియోగదారుకు మూడు వరకే విక్రయిస్తామని టెస్కో, అస్డా, మోరిసన్స్, ఆల్డి సంస్థలు తెలిపాయి. ఆఫ్రికా, యూరప్‌ల్లో ప్రతికూల వాతావరణం, ఇంధన ధరలు పెరగడం, బ్రిటన్, నెదర్లాండ్స్‌లో గ్రీన్హౌస్ వ్యవసాయంపై ఆంక్షలు కారణంగా పండ్లు, కూరగాయల దిగుబడి, రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. చదవండి: అమెరికాలో భీకర మంచు తుపాను -
Maha Shivaratri 2023: పండంటి ఆహారం.. దానిమ్మ రసం, డ్రై ఫ్రూట్ లడ్డు.. ఇంకా
రేపే శివరాత్రి! రోజంతా ఉపవసించాలి... నీరసించకూడదు. వండ వద్దు... ఎండకు డస్సిపోనూ వద్దు. పండంటి ఆహారంతో శక్తిని పుంజుకోవచ్చేమో! వంటకు నిషేధం... పండ్లకు ఆహ్వానం !! దానిమ్మ రసం కావలసినవి: దానిమ్మ పండ్లు – 2 తయారీ: దానిమ్మ పండ్లను కడిగి ఒక్కొక్క పండును నాలుగు భాగాలుగా కట్ చేయాలి. మొత్తం ఎనిమిది ముక్కలను వెడల్పాటి పాత్రలో వేసి ముక్కలు మునిగేటట్లు నీరు పోయాలి. ఇప్పుడు వేళ్లతో మృదువుగా గింజలను వేరు చేయాలి. గింజలు నీటి అడుగున చేరతాయి, వగరుగా ఉండే పలుచని తొక్క నీటి మీద తేలుతుంది. పై చెక్కు, లోపలి తొక్కలను తీసేసి నీటిని వడపోయాలి. ఈ గింజలను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ జ్యూస్‌ను అలాగే తాగవచ్చు లేదా వడపోసి తాగవచ్చు. వడపోయకుండా తాగినట్లయితే జీర్ణవ్యవస్థ చక్కగా శుభ్రపడుతుంది. దానిమ్మలోని తీపి సరిపోదనుకుంటే గింజలను గ్రైండ్ చేసేటప్పుడు రెండు ఖర్జూరాలను (గింజ తీసేసినవి) కలుపుకోవచ్చు. రెయిన్ బో ఫ్రూట్ సలాడ్ కావలసినవి: స్ట్రాబెర్రీలు – 2 కప్పులు (శుభ్రం చేసి సగానికి కట్ చేయాలి); తర్బూజ ముక్కలు – 2 కప్పులు; బ్లూ బెర్రీలు – కప్పు; కివీ పండ్లు – 2 (తొక్క తీసి పలుచగా ముక్కలు చేయాలి); బొప్పాయి పండు (ముక్కలు చేయాలి); రాస్ప్ బెర్రీలు – కప్పు తయారీ: ఈ ముక్కలను చక్కగా ఫొటోలో ఉన్నట్లు ఇంద్రధనుస్సు ఆకారంలో అమర్చాలి. ఫ్రూట్ సలాడ్ ప్లేట్‌ని ఇలా చూస్తే ఎవరికైనా ఒక ముక్క తినాలనిపిస్తుంది. మనకు అందుబాటులో ఉన్న అరటిపండు, యాపిల్, ఆరెంజ్, ద్రాక్ష వంటి పండ్లతోనూ సరదాగా ఇంద్ర ధనుస్సును అమర్చుకోవచ్చు. డ్రై ఫ్రూట్ లడ్డు కావలసినవి: ఖర్జూరాల ముక్కలు – కప్పు; బాదం – 3 టేబుల్ స్పూన్లు; కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు; అంజీర్ – 8; కొబ్బరి తురుము – టేబుల్ స్పూన్; యాలకులు – 2. తయారీ: బాదం పప్పును బాగా ఎండబెట్టి సన్నగా తరిగి ఒకపాత్రలో వేయాలి. అంజీర్లను కూడా తరగాలి, యాలకులను తొక్క వేరు చేసి గింజలను పొడి చేసి బాదం తరుగులో వేయాలి. మిక్సీ జార్లో ఖర్జూరం పలుకులు, అంజీర్ మిశ్రమం, జీడిపప్పు, కిస్మిస్, బాదం తరుగు, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి సమంగా కలిసేటట్లు బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కావలసిన సైజ్‌లో లడ్డూలుగా తయారు చేయాలి. పుచ్చకాయ రసం కావలసినవి: పుచ్చకాయ – 1 (మీడియం సైజ్); పుదీన ఆకులు – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం – టీ స్పూన్. తయారీ: పుచ్చకాయలో గింజలు తీసేసి ముక్కలు తీసుకోవాలి. ఈ ముక్కల్లో పుదీనా ఆకులు వేసి మిక్సీ జార్ (జ్యూస్ బ్లెండర్)లో గ్రైండ్ చేయాలి. చివరగా నిమ్మరసం కల పాలి. ఫైబర్ సమృద్ధిగా అందాలంటే ఈ మిశ్రమాన్ని వడపోయకుండా తాగవచ్చు. అలా తాగలేకపోతే వడపోసి తాగవచ్చు. -
పండ్ల తొక్కలు కూడా వదిలిపెట్టను! నా బ్యూటీ సీక్రెట్ అదే: హీరోయిన్
Sara Ali Khan Beauty Tips: నవాబుల వారసురాలు.. పటౌడి పరగణా యువరాణి.. ఒకప్పటి బీ-టౌన్ జోడీ సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్ కుమార్తె.. అలనాటి హీరోయిన్ షర్మిలా ఠాగోర్ మనుమరాలు.. ఇన్ని ట్యాగ్లు ఉన్నప్పటికీ.. హీరోయిన్ కావాలన్న తన కలను నిజం చేసుకోవడానికి ఎంతో కఠినంగా శ్రమించింది సారా అలీఖాన్. అధిక బరువు కారణంగా ఆరంభంలో ఇబ్బందులు పడ్డ ఆమె.. పట్టుదలతో సమస్య నుంచి విముక్తి పొందింది. కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి తనదైన అందం, అభినయంతో యువకుల ఆరాధ్య దేవతగా మారిపోయింది. కాగా బాల్యంలోనే పీసీఓడీ బారిన పడిన కారణంగా సారా చదువుకునే రోజుల్లో దాదాపు 96 కిలోల బరువుతో బొద్దుగా ఉండేది. అయితే, బాలీవుడ్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత జిమ్‌లో తీవ్రమైన కసరత్తులు చేసి.. ప్రస్తుత శరీరాకృతిని పొందింది. అయితే.. తన కాంతులీనే ముఖసౌందర్యానికి కారణం మాత్రం అమ్మ చెప్పిన చిట్కానే అంటోంది ఈ బ్యూటీ. సారా పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. పండ్ల తొక్క కూడా వదలను ‘నా బ్యూటీ సీక్రెట్ తాజా పండ్లు.. బాదం పప్పు. సీజన్లో దొరికే పండ్లను వదిలిపెట్టను. వాటి తొక్కను కూడా. పండ్లను తింటాను.. తొక్కతో మొహానికి మసాజ్ చేసుకుంటా. బాదం పప్పుతో ఫేస్‌ప్యాక్ వేస్తా. ఒక టీ స్పూన్ బాదం పప్పు పౌడర్‌లో ఒక టీ స్పూన్ శనగపిండి, రెండు టీ స్పూన్ల పాలు, కొన్ని రోజ్ వాటర్ చుక్కలు కలిపి మొహానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేస్తా. ఇది గనుక రెగ్యులర్‌గా చేస్తే ఇంకే కాస్మెటిక్స్ అవసరం లేదు.. రాదు. మా అమ్మ చెప్పిన చిట్కానా మజాకా మరి!’’ అంటోది సారా అలీ ఖాన్. చదవండి: Skin Care: నల్లటి మచ్చలు మాయం, చర్మ నిగారింపు.. ఎన్నో ఉపయోగాలు! ఈ డివైజ్ ధర? Skin Care: చేమంతులతో ముడతల్లేని చర్మం.. తేనెతో గులాబీ రంగు పెదాలు.. ఇంకా.. -
Viral Video: ఉన్నపలంగా లారీ డోర్ తీసాడు.. తర్వాత ఏమైందంటే..!
-
పంచాయతీ ఎన్నికలు.. మధ్యాహ్న భోజనంలో చికెన్, పండ్లు
లక్నో: పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార టీఎంసీ ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కొత్తగా చికెన్, సీజనల్ పండ్లు అందజేయాలని నిర్ణయింది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకురానుంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలలపాటు వీటిని స్కూల్ పిల్లలకు అందజేయనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మిల్లో భాగంగా బియ్యం, పప్పులు, కూరగాయలు, సోయాబీన్ ,గుడ్లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా మెనూలో అదనంగా పీఎం పోషన్ కింద పోషకాహారం కోసం వారానికి ఒకసారి చికెన్, సీజనల్ పండ్లను అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం మమతా బెనర్జీ సర్కార్ అదనంగా రూ. 371 కోట్లను మంజూరు చేసింది. జనవరి నుంచి అదనపు పౌష్టికాహార పథకం అమలులోకి వస్తోందని విద్యాశాఖ విభాగం అధికారి ఒకరు ధృవీకరించారు. అయితే ఏప్రిల్ తర్వాత దీనిని కొనసాగించాలా వద్దా అనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రతి విద్యార్థికి అదనపు పోషకాహారాన్ని అందించడానికి వారానికి రూ. 20 ఖర్చు అవుతుందన్నారు. ఈ ప్రక్రియ 16 వారాల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా రాష్ట్ర,ఎయిడెడ్ పాఠశాలల్లో 1.16 కోట్ల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్దిపొందుతున్నారు. దీని కోసం రాష్ట్ర, కేంద్రం 60:40 నిష్పత్తిలో ఖర్చును పంచుకుంటాయి. అయితే ఈ నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది, ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజలను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని బీజేపీ మండిపడింది.అయితే దీనిపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్.. ప్రతిపక్షాలు ప్రతిదానిలో చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించింది. మరోవైపు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పుడూ సామాన్య ప్రజల పక్షాన నిలుస్తారని టీఎంసీ రాజ్యసభ ఎంపీ శాంతాను సేన్ అన్నారు. చదవండి: నెల రోజుల్లో రెండో ఘటన.. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మరో దారుణం .. -
‘పండంటి’ రాష్ట్రం.. దేశంలోనే ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటే అన్నదాత అద్భుతాలు సృష్టిస్తాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. పండ్ల తోటలు తగ్గిపోతున్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు రైతులను ఉత్సాహపరుస్తున్నాయి. దీంతో పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ సంవత్సరంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 10,72,41,510 టన్నుల పండ్లు ఉత్పత్తి అవగా అందులో ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 17.72 శాతమని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ శాఖ 2021–22లో రాష్ట్రాలవారీగా పండ్ల ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై మూడో ముందస్తు అంచనాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. బత్తాయి, అరటి, బొప్పాయి, మామిడి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏపీలో మొత్తం పండ్ల ఉత్పత్తి 1,89,99,020 టన్నులు. ఆ తరువాత 1,24,66,980 టన్నులతో మహారాష్ట్ర, 1,11,13,860 టన్నుల పండ్ల ఉత్పత్తితో ఉత్తరప్రదేశ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం పండ్లు సాగు విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్‌కన్నా మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో పండ్ల సాగు విస్తీర్ణం 7,88,220 హెక్టార్లుండగా మహారాష్ట్రలో 8,31,180 హెక్టార్లలో సాగు చేసినట్లు ఆ నివేదిక తెలిపింది.. -
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటున్నారా.. పండ్ల రసంతో ట్యాబెట్లు తీసుకుంటే!
మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే అది శరీరానికి ఒక రోజుకు అవసరమయ్యే శక్తిని అందివ్వడమే కాకుండా ఆ రోజులో మిగతా సమయం అంతా అతిగా తినటాన్ని కూడా నియంత్రించి శరీరంలో సమతుల్యతను కాపాడుతుందన్న ఆరోగ్య నిపుణుల సలహా అందరికీ తెలిసిందే. చెప్తున్నారు. అయితే ఏది పడితే అది అనారోగ్యకరమైన తిండి తినడం కంటే కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడమే చాలా ఉత్తమం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఒకవేళ కొన్నిసార్లు మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్లిన సందర్భాల్లో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సమస్యా ఎదురు కాదు. ఉండదు. గుడ్లు ఒక అధ్యయనం ప్రకారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే ఆ వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఆ రోజులోని మిగతా సమయంలో తీసుకునే ఆహారం కూడా ఎక్కువ, తక్కువ కాకుండా కావాల్సిన మేరకే తీసుకుంటాం. తద్వారా శరీరంలో కేలరీలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయులు నియంత్రణలో ఉంటాయని వెల్లడైంది. గుడ్ల సొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటికి బలాన్నిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ప్రోటీన్లు, పోషకాలు అందజేస్తాయి. ఓట్ మీల్ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు ఓట్ మీల్‌కు ఓటెయ్యడం ఉత్తమం. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోగలగడమే గాక చాలా ఉత్తమమైనది కూడా. ఎందుకంటే, ఓట్ మీల్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును అదుపు చేయడంలో తోడ్పడతాయి. రక్తపోటు, ఊబకాయం, హృద్రోగ సమస్యలు ఉన్నవారికి ఓట్ మీల్ మంచి బ్రేక్‌ఫాస్ట్. ఓట్ మీల్‌ను పాలతో కలుపుకొని తినడం లేదా ఉప్మాలా తిరగమోత వేసుకుని తినడం వల్ల ఈ సుగుణాలు అందుతాయి. చదవండి: Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి పండ్లు మీ రోజు ఫలవంతంగా సాగాలంటే ఉదయాన్నే పొట్టను పండ్లతో నింపేస్తే సరి. పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కావాల్సినంత ఫైబర్, శరీరానికి అవసరమయ్యే హైడ్రేషన్ కూడా పండ్ల ద్వారా లభిస్తుంది. ఒక కప్పు ఆపిల్ ముక్కలు, లేదా సిట్రస్ జాతికి చెందిన నారింజ, సంత్ర పండ్లు లేదా బెర్రీస్ ఏవైనా సరే మంచి బ్రేక్‌ఫాస్ట్ జాబితాలో ఉంటాయి. చదవండి: Health Tips: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా నట్స్, సీడ్స్ నట్స్ తినటానికి రుచిగా ఉండటమే కాదు, వాటి నుంచి శరీరానికి లభ్యమయ్యే పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. నట్స్ లో కేలరీలు చాలా ఉన్నా కొవ్వు ఏ మాత్రం రాదు. బరువు తగ్గటానికి నట్స్ చాలా ఉపయోగకరం, వీటిలో మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ శరీరానికి అందుతాయి. రోజు ఉదయం గుప్పెడు నట్స్ తీసుకోవటం ఆరోగ్యకరం. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ శరీరంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతూ, ఇన్సులిన్ ను అందిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలనుంచి రక్షణ లభిస్తుంది. ఒక విషయం సాధారణంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా టాబ్లెట్స్ వేసుకోవడం సహజమే. ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. అందులో భాగంగా పండ్ల రసంతో మాత్రలు తీసుకుంటే బాగా పని చేస్తాయనే ఉద్దేశ్యంతో నారింజ లేదా నిమ్మరసంతో కలిపి మాత్రలను మింగే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మేలు జరగకపోగా, ప్రమాదం ఎదురుకావొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను తీసుకున్నప్పుడు, సిట్రస్ పండ్లలో ఉండే రసాయనాలు పేగులో చర్య జరిపి ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటి రసంతో ఔషధాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు కణాలు వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఔషధంలో ఉన్న రసాయనం పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక అలా చేయరాదని వైద్యులు చెబుతున్నారు. -
Health: షుగర్ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి? ఇవి తిన్నారంటే..
How To Control Diabetes- Tips In Telugu: డయాబెటిస్.. చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. దీన్నే మధుమేహం, షుగర్, చక్కెర వ్యాధి అని పిలుస్తారు. డాక్టర్లు సూచించిన మందులతో పాటు సరైన ఆహార పద్ధతులను పాటిస్తే షుగర్ నియంత్రించవచ్చు. రక్తంలోని చక్కర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు అధిక రక్త పీడనం వంటి సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు. షుగర్ పేషెంట్లకు ఉత్తమమైన ఆహారం చేపలు చేపలు తింటే చాలా మంచిది. హెర్రింగ్, సార్డైన్, సాల్మన్, అల్బకోర్ ట్యూనా, మాకేరాల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచుతాయి. పప్పు దినుసులు డైట్లో పప్పు దినుసులు ఎక్కువగా ఉండేలా చూడాలి. పప్పు దినుసుల నుండి లభించే ప్రోటీనులు, మాంసాహారం నుండి లభించే ప్రోటీనుల కంటే మేలైనవి.పప్పు దినుసులు ప్రోటీన్, ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి. ఈ మూలకాలు రక్తంలోని చక్కర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి. అన్నం వద్దా? గోధుమ, రాగి తప్ప వరి అన్నము తినరాదు అన్నది తప్పు అభిప్రాయం. వరి, గోధుమ, రాగి జొన్నలు, సజ్జలు మొదలైన ధాన్యాలలోనూ 70 శాతం పిండి పదార్థం ఉంటుంది. అందుకే ఏ ధాన్యం తినాలన్నది ముఖ్యం కాదు. ఎంత పరిమాణంలో తింటున్నామన్నదే ముఖ్యం. కూరగాయలు అన్ని రకాల ఆకుకూరలు, వంకాయ, బెండకాయ, ఉల్లి పాయలు, అరటి పువ్వు, బ్రాసెల్స్ మొలకలు, క్యాబేజి, కాలిఫ్లవర్ ,పుదీన, బొప్పాయి, కరివే పాకు, బ్రకోలి, దోసకాయ, టర్కిప్, ముల్లంగి, బెంగుళూరు వంకాయ, అరటిపువ్వు, ములగకాయ, గోరు చిక్కుడు, కొత్తిమీర, పొట్లకాయ, టమాట , బ్రాడ్బీన్స్, తెల్ల గుమ్మడి, సొరకాయ వంటివి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ పోషకాలను అందించే స్నాక్స్ తినాలంటే బాదం చాలా మంచిది. భోజన సమయంలో కాకుండా.. స్నాక్స్‌గా అప్పుడప్పుడు బాదం ప్రయత్నించండి. ఆరోగ్యవంతమైన ఫైబర్ కోసం శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, రక్తంలోని చక్కర స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచే ఆరోగ్యవంతమైన ఫైబర్‌ను ఓట్స్ అందిస్తాయి. ప్లెయిన్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ తక్కువ చక్కెరను ఉత్పత్తి చేస్తాయి, నెమ్మదిగా జీర్ణం అవుతాయి. బెర్రీస్ తక్కువగా కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉండటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా మంచివి. మధుమేహం రెండురకాలుగా సంక్రమిస్తుంది.. 1. వారసత్వంగా వచ్చే మధుమేహం 2. మన అలవాట్ల వల్ల వచ్చే మధుమేహం వారసత్వంగా వచ్చే ఆస్తులు వద్దు అనుకుంటే రాకపోవచ్చును కానీ, వారసత్వంగా వచ్చే వ్యాధులు అనివార్యం. కాబట్టి మనం రాకుండా చూసుకోలేము, కానీ వచ్చిన తరువాత మన కంట్రోల్ లో ఉంచుకోవడము మాత్రమే మన చేతిలో ఉన్న విషయం. మధుమేహం రాకుండా ఉండేందుకు ఇవి పాటించండి 1. వీలైనంత వరకూ మన శరీరానికి వ్యాయామం ఇవ్వాలి 2. మీరు చేసే వృత్తి కి తగ్గట్టుగా మీ ఆహార అలవాట్లు చేసుకోవాలి. సిస్టమ్ వర్క్ అయితే వాకింగ్, రన్నింగ్ రెగ్యులర్ గా చేయండి. ఫిజికల్ వర్క్ అయితే కొద్దిగా యోగా చేయండి 3. రాగి సంగటి , అంబలి లాంటి ఫైబర్ ఫుడ్ ని వారానికి రెండుసార్లు కచ్చితంగా ఆహారంగా తీసుకోవాలీ. 4. దేశీయ ఫలాలు ఎక్కువ తినడం మంచిది. 5. ముఖ్యంగా నేరేడు, ఉసిరికాయ లాంటివి మన చుట్టున్న వాతావరణంలో సీజన్లో మాత్రమే దొరుకుతాయి, వాటిని తినడం మంచిది. 6. తెల్ల చక్కెర బదులు, బెల్లం, నాటు చక్కెర ఉపయోగించండి. 7. గోధుమ, వరి అన్నం, ఇడ్లీ, చపాతీ తినడం తగ్గించి, మొలకెత్తిన విత్తనాలు తినండి 8. వర్క్ టెన్షన్ వదిలేసి 6 నెలలకు ఒకసారి అయినా ఫ్యామిలీ టూర్ వెళ్లి సంతోషంగా ఉండండి 9. చాలా ముఖ్యమైన విషయం అనవసరంగా టెన్షన్ అవడం, భయపడటం అదుపులో ఉంచేందుకు ప్రయత్నం చేయాలి. 10. ఎందుకంటే మానసిక ప్రశాంతత లేకపోతే బిపి, షుగర్లు సులభంగా అటాక్ చేస్తుంది. బిపి, షుగర్లు కవల పిల్లలు. ఏ ఒకటి వచ్చినా, ఇంకొకటి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. వీటితో పాటు నీళ్లు ఎక్కుగా తాగాలి. నిజానికి మధుమేహం విషయంలో ఆహార వ్యాయామాల వంటివి ముఖ్యమేగానీ వాటికంటే కూడా.. గ్లూకోజు నియంత్రణకు వైద్యులు చెప్పినట్టుగా మందులు వేసుకోవటం, క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవటం మరింత ముఖ్యం. -డాక్టర్ నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చదవండి: ఊపిరితిత్తులు భద్రం.. పోస్ట్ కోవిడ్‌తో ఎన్నో సమస్యలు.. వ్యాధులను గుర్తించడం ఎలా? Custard Apple: సీజనల్ ఫ్రూట్ సీతాఫలం.. తరచూ తింటున్నారా? ఇందులోని బయోయాక్టివ్ అణువుల వల్ల -
Health Tips: ఆ పళ్లు తిన్న వెంటనే నీళ్లు తాగారో ఇబ్బందుల్లో పడ్డట్లే!
కొందరు వైద్యులు మంచినీళ్లు బాగా తాగమని చెబుతుంటారు. ఇంకొందరు అంత ఎక్కువగా తాగవద్దని చెబుతారు. అయితే కొన్ని పదార్థాలు తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత నీళ్లు తాగడం మంచిది కాదని పెద్దవాళ్లు చెబుతుంటారు. దీని వెనుక మనలో చాలా మందికి తెలియని కారణం ఉంది. ఇంతకీ మనం ఏయే పదార్థాలు తీసుకున్న తర్వాత నీరు తాగకుండా ఉండాలో తెలుసా మరి? ►అరటిపండు.. ఆయుర్వేదం ప్రకారం, పండ్లను తీసుకున్న తర్వాత నీరు తాగకూడదు. ఎందుకంటే ఇది శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది. మరి అరటిపండు తిన్న తర్వాత కనీసం అరగంట పాటు నీళ్లు తాగకపోవడానికి ఇదే కారణం. ►పుచ్చకాయ: నీటిశాతం అధికంగా ఉండే వాటిలో పుచ్చకాయదే ప్రముఖ స్థానం. పుచ్చకాయ తిన్న తర్వాత నీటిని తాగడం ద్వారా సహజంగా ఊరే జీర్ణరసాలు పలుచన అవుతాయి. దీనివల్ల పొట్ట ఉబ్బరంగా మారుతుంది. కడుపు నొప్పి లేదా అజీర్ణంతో బాధపడ వలసి వస్తుంది. ►పాలు: పాలు తాగిన తర్వాత నీళ్లు తినకూడదు. ఇలా చేయడం వల్ల జీవక్రియలు మందగిస్తుంది. ఇది ఎసిడిటీ, అజీర్ణానికి కూడా దారి తీస్తుంది. ►సిట్రస్ జాతి ఫలాలు తిన్న తర్వాత... నారింజ, ఉసిరి, సీజనల్ మొదలైన సిట్రస్ పండ్లను తిన్న తర్వాత మన జీర్ణవ్యవస్థ నుండి యాసిడ్ బయటకు వస్తుంది. ఈ పండ్లను తిన్న తర్వాత మనం నీరు తాగితే, పిహెచ్ బ్యాలెన్స్ చెదిరిపోతుంది. అందుకే సిట్రస్ పండ్లు తిన్న తర్వాత మనం నీరు తాగకూడదు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కోసం మాత్రమే. చదవండి: Postpartum Care- Fitness: బిడ్డల్ని కనే సమయాన్ని వాయిదా వేయనక్కర్లేదు! ఇవి పాటించడం వల్ల ప్రసవం తర్వాత కూడా.. Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
కూరగాయలు, పండ్ల నిల్వలో విప్లవం.. 2 నెలల వరకు చెక్కు చెదరవు!
పండ్లు, కూరగాయల నిల్వ పద్ధతిలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అస్సాంలోని గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు ఉద్యాన పంటల రైతులకు తీపికబురు చెప్పారు. విస్తృత పరిశోధనల ఫలితంగా సముద్రపు నాచు వంటి సహజ పదార్థాలతో ఓ సేంద్రియ లేపన పదార్థాన్ని ఆవిష్కరించారు. ఈ ద్రావణంలో కూరగాయలు, పండ్లను ముంచి తీసి పక్కన పెడితే సరి. లేదంటే ఈ పదార్థంతో కవరును తయారు చేసి అందులో పండ్లు, కూరగాయలను నిల్వ చేసినా చాలు. వారం, రెండు వారాలు కాదు.. ఏకంగా రెండు నెలల వరకు చెక్కు చెదరకుండా నిల్వ ఉంటాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కుళ్లిపోయిన టమాటోలు, ఉల్లిపాయలు, పండ్లను చెత్తకుప్పల్లో పారబోయాల్సిన దుస్థితికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది. అంతేకాదు.. ‘పచ్చి సరుకు’ కాబట్టి తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి ఉద్యాన రైతులు విముక్తి పొందే రోజు కూడా దగ్గర్లోనే ఉందని చెప్పొచ్చు! కూరగాయలు, పండ్లను పొలంలో పండించడానికి రకాన్ని బట్టి 3 నుంచి 12 నెలల సమయం పడుతుంది. ఇంతా కష్టపడి పెంచి చెట్ల నుంచి కోసిన తర్వాత, ప్రజలకు అందించేలోగా, కొద్ది రోజుల్లోనే వడలిపోతుంటాయి. ఇంకొన్ని రోజులైతే కుళ్లి పనికిరాకుండా పోతుంటాయి కూడా. ఈ క్రమంలో ఉద్యాన పంటల రైతులకు, చిరు వ్యాపారులకు తీవ్రనష్టం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల కూరగాయలు, పండ్లకైతే అత్యధికంగా 20% వరకు నష్టం జరుగుతోంది. ధర మరీ పతనమైతే పారబోయాల్సిన దుస్థితి. ఈ కష్టాల నుంచి రైతులను, వ్యాపారులను గట్టెక్కించే సరికొత్త సేంద్రియ లేపన పదార్థాన్ని గౌహతిలోని ఐఐటీకి చెందిన రసాయన ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు, పరిశోధకులు కనుగొన్నారు. తాజాదనాన్ని, పోషకాలను, రంగును, రూపురేఖలను కోల్పోకుండా పండ్లు, కూరగాయలను నిల్వ చేయొచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి వాటిని మెత్తబడిపోకుండా, మొలక రాకుండా చూసుకోవచ్చు. ఏకంగా రెండు నెలల వరకూ కాపాడుకోవచ్చని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన ఈ లేపనం పూసిన పండ్లు, కూరగాయలను తిన్న వారికి ఎటువంటి హానీ జరగదని శాస్త్రీయ పరీక్షల్లో రుజువైందంటున్నారు. బంగాళాదుంపలు, టొమాటోలు, పచ్చి మిరపకాయలు, స్ట్రాబెర్రీలు, ఖాసీ మాండరిన్ రకం నారింజ పండ్లు, ఆపిల్స్, పైనాపిల్స్, కివీ పండ్లపై ఈ పదార్థాన్ని ఇప్పటికే పరీక్షించి.. వీటిని దాదాపు రెండు నెలల పాటు తాజాగా ఉంచగలిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనా బృందానికి కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ విమల్ కటియార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వైభవ్ వి గౌడ్ మార్గదర్శకత్వం నెరిపారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సస్టైనబుల్ పాలిమర్స్‌కు చెందిన పరిశోధకులు తబ్లీ ఘోష్, కోన మొండల్, మాండవి గోస్వామి, శిఖా శర్మ, సోను కుమార్ విజయవంతంగా పరిశోధనలు నిర్వహించారు. లేపనంలో ఏముంది? డునాలియెల్లా టెర్టియోలెక్టా అనే సముద్రపు నాచు సారానికి పాలీసాకరైడ్లను కలిపి ఈ లేపన పదార్థాన్ని రూపొందించారు. ఈ సముద్రపు నాచు యాంటీఆక్సిడెంట్లతో పాటు.. కెరోటినాయిడ్లు, ప్రోటీన్లు వంటి వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను ఉత్పత్తి చేయడానికి, అదే విధంగా జీవ ఇంధనం ఉత్పత్తికి కూడా ఈ సముద్రపు నాచును ఉపయోగిస్తున్నారు. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను వెలికితీసిన తర్వాత మిగిలే అవశేషాలను వ్యర్థాలుగా భావించి పారేసేవారు. అయితే, గౌహతి ఐఐటి పరిశోధకులు ఈ అవశేషాలను చిటోసాన్ అనే పిండి పదార్థంతో కలిపి లేపన పదార్థాన్ని రూపొందించే పద్ధతిని కనుగొన్నారు. సూక్ష్మక్రిములు, శిలీంధ్రాల నాశని లక్షణాలు కలిగిన ఈ పదార్థాలతో తయారైన లేపన పదార్థం తిన్న వారికి ఎటువంటి నష్టం కలగదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. (క్లిక్: ఇంటి పంట: రూఫ్‌టాప్ పొలం.. 5.7 ఎకరాలు!) ఈ విధంగా తయారు చేసిన లేపన పదార్థంలో మనుషుల ఆరోగ్యానికి మేలు చేసే మెరుగైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇది 40 డిగ్రీల వరకు వేడికి తట్టుకుంటుంది. లేపనం రాసిన తర్వాత చెదిరిపోకుండా ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో నుంచి నీటి ఆవిరి బయటకుపోకుండా అడ్డుకుంటుంది. కాంతిని అడ్డుకునే శక్తి దీనికి ఉందని అనేక పరీక్షల ద్వారా నిర్థారణైందని పరిశోధకులు తెలిపారు. పరిశోధకులు ఈ పూతను జీవ భద్రత కోణంలోనూ పరీక్షించారు. వివిధ జీవ ప్రక్రియల అధ్యయనానికి ప్రయోగశాల ప్రమాణంగా పరిగణించే ‘బిహెచ్కె21 సెల్ లైన్’ ద్వారా పరీక్షించి చూశారు. ఈ లేపన పదార్థం విషపూరితమైనది కాదని, తినదగిన ఆహార ప్యాకేజింగ్ పదార్ధంగా సురక్షితంగా ఉపయోగించవచ్చని పరీక్షల్లో తేలిందన్నారు. (క్లిక్: నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..) ఈ అధ్యయన ఫలితాలు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అడ్వాన్సెస్, అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ‘ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ సహా అనేక ప్రతిష్టాత్మక శాస్త్రీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పండ్లు, కూరగాయల వృథాను అరికట్టడంతో పాటు, రైతుల వెతలను తగ్గించి మంచి ఆదాయాన్నిచ్చే ఈ అద్భుత లేపనం త్వరలోనే అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఆకృతి, రంగు, రుచి, పోషకాలు చెక్కుచెదరవు! భారత వ్యవసాయ పరిశోధనా మండలి అంచనా ప్రకారం 5 నుంచి 16 శాతం పండ్లు, కూరగాయలు కోసిన తర్వాత నిల్వ సామర్థ్యం లేక వృథాగా పాడైపోతున్నాయి. వాస్తవానికి ఈ నష్టం బంగాళాదుంప, ఉల్లిపాయలు, టొమాటో వంటి కొన్ని పంటల్లో కోత అనంతర నష్టం 19% వరకు ఉండొచ్చు. ప్రజలు ఎక్కువగా తినే ఈ కూరగాయల ధర ఆ మేరకు పెరిగిపోతోంది. ఈ లేపన పదార్ధాన్ని పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 40 డిగ్రీల సెల్షియస్ వరకు కాంతిని, వేడిని, ఉష్ణోగ్రతను ఈ లేపనం చాలా స్థిరంగా తట్టుకుంటుంది. తిన్న వారి ఆరోగ్యానికి ఎటువంటి హానీ జరగదు. సురక్షితమైనది. లేపనం చేసిన పండ్లు, కూరగాయల ఆకృతి, రంగు, రుచి, పోషక విలువలు చెక్కుచెదరదు. ఈ లేపన పదార్థాన్ని నేరుగా కూరగాయలు, పండ్లపై పూయవచ్చు లేదా ఈ పదార్థంతో కవర్‌ను తయారు చేసి కూరగాయలు, పండ్లను అందులో నిల్వ చేయవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఎలా ఉపయోగించినా కూరగాయలు, పండ్ల నిల్వ సామర్థ్యాన్ని పొడిగించవచ్చు. ఇది సాధారణ ‘డిప్ కోటింగ్ టెక్నిక్’. పెద్దగా ఖర్చు పెట్టకుండానే పంట కోత అనంతరం దిగుబడులను సులభంగా దీర్థకాలం నిల్వ చేసుకోవచ్చు. – ప్రొ. విమల్ కటియార్, అధిపతి, కెమికల్ ఇంజనీరింగ్ విభాగం, ఐఐటి, గౌహతి, vkatiyar@iitg.ac.in -
అదిరిపోయే గాడ్జెట్..కాలుష్యాలు ఖతం!
అరచేతిలో తేలికగా ఇమిడిపోయే ఈ పరికరం ఆహార కాలుష్యాలను ఇట్టే ఖతం చేసేస్తుంది. అమెరికాలో స్థిరపడిన చైనీస్ పరిశోధకుడు కాయ్ జియా ఈ పోర్టబుల్ ఫుడ్ క్లీనర్‌ను రూపొందించారు. కూరగాయలు, పండ్లు వంటి వాటిపై ఉండే పురుగుమందులు, రసాయనాల అవశేషాలను క్షణాల్లో నిర్మూలిస్తుంది. ఒక గిన్నెలో నీళ్లు నింపి, శుభ్రం చేయదలచుకున్న కూరగాయలు, పండ్లు వేసుకున్నాక, ఈ పరికరాన్ని స్విచాన్ చేసి, గిన్నెలో కొద్ది క్షణాలు ఉంచాలి. దీని నుంచి వెలువడే హైడ్రాక్సిల్ అయాన్లు కూరగాయలు, పండ్లు వంటి వాటిపై ఉండే రసాయన కాలుష్యాలను, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను క్షణాల్లోనే నశించేలా చేస్తాయి. హైడ్రాక్సిల్ అయాన్ల ప్రభావంతో ఈ కాలుష్యాల అణువులు సమూలంగా నాశనమవుతాయి. -
Sagubadi: గాల్లో ఎగురుతూ పండ్లు కోసే రోబోలు! ఆపిల్స్, అవకాడో, పియర్స్..
పండ్ల కోత కూలీలు సమయానికి దొరక్క రైతులు నానా యాతన పడుతూ ఉంటారు. కూలీల కొరత వల్ల కోత ఆలస్యం కావటం, నాణ్యత కోల్పోవటం.. రైతులు ఆశించిన ధర దక్కకపోవటం చూస్తుంటాం. ప్రపంచవ్యాప్తంగా కోత కూలీలు దొరక్క ఏటా 3 వేల కోట్ల డాలర్ల మేరకు రైతులు నష్టపోతున్నారు. రెండు వారాలు ఆలస్యంగా కోసిన పండ్ల వెల 80% తగ్గిపోతున్నదట. 2050 నాటికి 50 లక్షల మంది పంట కోత కార్మికుల కొరత నెలకొంటుందని అంచనా. కోసే వాళ్లు లేక 10% పండ్లు కుళ్లిపోతున్నాయట. ఈ సమస్యకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిష్కారాలు చూపుతోంది. ఎత్తయిన చెట్ల నుంచి పక్వానికి వచ్చిన పండ్లను మాత్రమే సుతిమెత్తగా పట్టుకొని కోసి తెచ్చే రోబోలు వచ్చేశాయి. PC: Kubota తోటలో నేల మీద కదులుతూ స్ట్రాబెర్రీలు, కూరగాయలు, పండ్లను కోసే రోబోలు వున్నాయి. అయితే, గాలిలో ఎగురుతూ ఎత్తయిన చెట్ల నుంచి పండ్లు కోసే రోబోలను కూడా తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ విజయవంతంగా రూపొందించింది. ఇజ్రాయిల్‌కు చెందిన టెవెల్ ఏరోబోటిక్స్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ కంపెనీ ఈ సమస్య పరిష్కారానికి స్వతంత్రంగా ఎగురుతూ చెట్ల నుంచి పండ్లను కోసే రోబోలను తయారు చేసింది. ఈ రోబోలకు మీటరు పొడవుండే ఇనుప చెయ్యిని బిగించారు. కోయాల్సిన పండు రకాన్ని బట్టి ఈ చేతిలో తగిన మార్పులు చేస్తారు. అత్యాధునిక కృత్రిమ మేథను కలిగి ఉన్నందున ఏ రంగు, ఏ సైజు పండు కొయ్యాలి? ఏది అక్కర్లేదు? అనే విషయాన్ని ముందుగానే వీటికి ఫీడ్ చేస్తారు. ఆ సమాచారం మేరకు మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ద్వారా సెన్సార్లు, కామెరాల సహాయంతో ఈ రోబోలు పనిచేస్తున్నాయి. పక్వానికి వచ్చిన పండ్లనే కచ్చితంగా గుర్తించి కోయగలుగుతున్నాయని టెవెల్ ఏరోబోటిక్స్ సీఈవో యనివ్ మోర్ తెలిపారు. ఒక వ్యాన్‌పై నాలుగు పండ్లు కోసే రోబోలను వైర్లతో అనుసంధానం చేస్తారు. అవి చెట్లపై ఎగురుతూ పండ్లను కోసి, వాటిని జాగ్రత్తగా వ్యాన్‌పై పెడతాయి. ఈ రోబోలు ఒక ఆప్‌తో అనుసంధానమై ఉండి రైతుకు ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని అందిస్తాయి. ఎంత మొత్తంలో పండ్ల కోత పూర్తయ్యింది? ఏదైనా పురుగుమందు లేదా చీడపీడల ప్రభావం ఉందా? అనే విషయాన్ని కూడా రైతుకు తెలియజేస్తాయి. ఆపిల్స్ నుంచి అవకాడో వరకు అనేక రకాల పండ్లను ఈ రోబోలు అవలీలగా రాత్రీ పగలు నిరంతరాయంగా కోస్తున్నాయని కంపెనీ చెప్తోంది. ఆపిల్స్, అవకాడో, పియర్స్, నారింజ తదితర పండ్ల కోత పరీక్షల్లో చక్కని ఫలితాలు వచ్చాయి. సాధారణంగా రెండున్నర ఎకరాల్లో పండ్ల కోతకు ఒక ఎగిరే రోబో సరిపోతుందట. అయితే, చెట్ల వయసు, పండ్ల రకం, సైజులను బట్టి ఎంత తోటకు ఎన్ని రోబోలు అవసరమవుతాయన్నది ఆధారపడి ఉంటుంది. ‘గాలిలో ఎగురుతూ పండ్లను కోసే రోబోలు మావి మాత్రమే. ఈ ఏడాది మార్కెట్లోకి తెస్తున్నాం’ అంటున్నారు ఆ కంపెనీ సీఈవో. సుమారు 3 కోట్ల డాలర్ల పెట్టుబడితో ఐదేళ్లు పరిశోధించి కంపెనీ ఈ వినూత్న రోబోలను తయారు చేసింది కదా.. ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుందిగా మరి! మన దేశంలో ఎంత ధరకు అమ్ముతారో వేచి చూద్దాం... చదవండి: Sagubadi: కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఇలా తయారు చేసుకోండి.. కోకోపోనిక్స్ సాగులో.. -
శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ
దివంగత నటి శ్రీదేవి (Sridevi) అందానికి అడ్రస్ లాంటివారు. అందుకే ఆమెను అతిలోక సుందరి అంటారు. ఆమె సాధించిన పేరు ప్రఖ్యాతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన ఆమె అందానికి, అభినయానికి అక్కడి ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఆమె అందాన్ని వారసత్వంగా తీసుకున్న జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా ప్రస్తుతం బాలీవుడ్లో మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటోంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటనకు పదును పెడుతోంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ ఒక బ్యూటీ సీక్రెట్‌ను పంచుకుంది. అది కూడా వాళ్ల అమ్మ (శ్రీదేవి) చెప్పిన రహస్యమట. తాను ఇంత అందంగా మిలమిల మెరిసిపోవడానికి కారణం ఆమె తల్లి శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్ అని చెప్పుకొచ్చింది. 'మా అమ్మ.. బ్రేక్‌ఫాస్ట్‌లో తినగా మిగిలిపోయిన పళ్ల ముక్కలతో అప్పటికప్పుడే అక్కడికక్కడే మొహానికి మసాజ్ చేసుకుని ప్యాక్‌లా వేసుకునేది. ఓ పదిహేను నిమిషాలు ఆగి కడిగేసేది. అప్పుడు చూడాలి అమ్మ మొహం.. మిలమిల మెరిసిపోయేది. ఇప్పుడు నేనూ అదే ఫాలో అవుతున్నా. బ్రేక్‌ఫాస్ట్‌లో మిగిలిపోయిన పళ్ల ముక్కలే నా బ్యూటీ సీక్రెట్' అని జాన్వీ కపూర్ తెలిపింది. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ 'గాడ్ ఫాదర్' షూటింగ్.. చిరంజీవి, సల్మాన్ ఫొటో లీక్ కాగా జాన్వీ నటించిన 'గుడ్ లక్ జెర్రీ' మూవీ నేరుగా ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జులై 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించి హిట్ కొట్టిన తమిళ చిత్రం 'కోలమావు కోకిల'కు రీమేక్‌గా తెరకెక్కింది. హిందీలో మాత్రం బాలీవుడ్ నేటివిటీకి తగినట్లు స్టోరీలో మార్పు చేశారని ఇటీవల జాన్వీ తెలిపింది. ఈ చిత్రానికి డైరెక్టర్ సిద్ధార్థ్ సేన్ గుప్త దర్శకత్వం వహించారు. చదవండి: భర్త న్యూడ్ ఫొటోలు తీసిన హీరో భార్య.. వైరల్ -
చిన్న వయసుసులోనే గుండెపోటు మరణాలు.. ఎందుకు?
మొన్న కన్నడ సినీహీరో పునీత్ రాజ్ కుమార్.. నిన్న మేకపాటి గౌతమ్ రెడ్డి.. తాజాగా గాయకుడు కేకే.. గుండెపోటు కారణంగా చిన్న వయసులోనే మరణించిన వారు వీరందరూ! ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... పైన ఉదహరించిన వారంతా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపేవారే. నిత్యం వ్యాయామాలు చేస్తూ.. పుష్టికరమైన ఆహారం తీసుకునే వారే. అయినా సరే చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. కారణాలేమైనా... ఈ ఘటనల సారాంశం ఒక్కటే! అది ఆరోగ్యంపై పురుషులు మరింత శ్రద్ధ వహించాలని. అంతర్జాతీయ పురుషుల ఆరోగ్య వారోత్సవాల (జూన్ 13 – 19)నేపథ్యంలో ఆహారం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందడం ఎలాగో చూద్దాం... ప్రొటీన్ మోతాదు పెంచండి... మనం తినే ఆహారం.. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు. ప్రతీదీ తగు మోతాదులో అవసరం. ఆహార అలవాట్ల ప్రకారం మనం కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకుంటాం. ఇలా కాకుండా... భోజనంలో ఎంతో కొంత ప్రొటీన్లను కూడా తీసుకోగలిగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఉడికించిన కోడిగుడ్లు మొదలుకొని పన్నీర్, పరాఠా, చేపలు, రాజ్మా, సాంబార్, బీన్స్, సోయా పులావ్ వంటి వెజ్/నాన్‌వెజ్ ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన ప్రొటీన్ లభిస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రమాణాల ప్రకారం ప్రతి భారతీయుడు రోజుకు కనీసం 48 గ్రాముల ప్రొటీన్‌ను తీసుకోవడం అవసరం. ఇంకోలా చెప్పాలంటే ప్రతి కిలోగ్రాము బరువుకు ఒక గ్రాము ప్రొటీన్ అవసరమవుతుంది. అయితే నూటికి 80 శాతం మంది అవసరమైన దానికంటే తక్కువ ప్రొటీన్ తీసుకుంటున్నారు. కండరాలు బలోపేతమయ్యేందుకు మాత్రమే కాకుండా... రోగ నిరోధక శక్తిని పెంచేందుకూ, ఒత్తిడికి విరుగుడుగా పనిచేసే సెరటోనిన్ ఉత్పత్తికీ ప్రొటీన్ అత్యవసరమన్న విషయం పురుషులు గుర్తించాలి. ఐదారు సార్లు పండ్లూ, కాయగూరలు! మెరుగైన ఆరోగ్యం కోసం కాయగూరలు, పండ్లు అవసరం. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు అందేందుకు ఇదే మేలైన దారి. జాతీయ పోషకాహార సంస్థ అంచనాల ప్రకారం రోజు కనీసం 400గ్రాముల కాయగూరలు, పండ్లు తినాల్సి ఉండగా.. చాలామంది ఇందులో సగం కూడా తీసుకోవడం లేదు. వీటిలోని పీచు పదార్థం జీర్ణకోశం మెరుగ్గా పనిచేసేందుకు, యాంటీ ఆక్సిడెంట్లు కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి.ఏ కాయగూరనైనా ఏదో ఒక రూపంలో శరీరానికి అందివ్వడం మేలు. మితమే.. హితం! ఎంత తింటే అంత బలం కాదు.. మితమే హితమకోవాలి. మరీ ముఖ్యంగా ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పక పాటించాలి. చక్కెర, ఉప్పు, కొవ్వులు ఉన్న ఆహారం విష యంలో మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. నోరు కుట్టేసుకుని ఉండటం ఎలా అనిపిస్తే... అన్ని రకాల ఆహారాన్ని కొంచెం కొంచెం తీసుకుంటే సరి. పాల ఉత్పత్తులు... పాల ఉత్పత్తుల వాడకంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రోజూ వాడాలని కొందరు, అవసరమే లేదని కొందరు చెబుతారు. పెరుగు, మజ్జిగల రూపంలో తీసుకునే విషయంలో మాత్రం ఎవరికీ అభ్యంతరాలు లేవు. అయితే ఎంత మోతాదులో అన్నది ఒక ప్రశ్న. నిపుణులు చెప్పిన దాని ప్రకారం రోజుకు ఏదో ఒక రూపంలో కనీసం 300 మిల్లీలీటర్ల పాలు/పాల ఉత్పత్తులు శరీరానికి అందించడం మేలు. చిరుతిళ్లతోనూ చిక్కులు.. సాయంత్రం చిరుతిళ్లు తినాలనిపించడం సహజం. అలాంటి సందర్భాల్లో నూనె పదార్థాలు కాకుండా.. మొలకెత్తిన గింజలు, ఉడికించిన శనగలు, వేరుశనగ పప్పుల్లాంటివి తినడం మేలు. వీటివల్ల శరీరానికి శక్తి, ప్రొటీన్లు రెండూ లభిస్తాయి. ఉప్పుతో ముప్పు... ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల రక్తపోటు సహా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చదువుతూనే ఉన్నాం. రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవద్దు. కానీ.. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు. శుద్ధీకరించిన ఆహారంలో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి... వాటిని వీలైనంత తక్కువగా తీసుకోవడం మేలు. ఈ ఆహారపు అలవాట్లకు తోడుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. నలభై ఏళ్లు దాటిన తరువాతైనా తరచూ వైద్య పరీక్షలు చేసుకోవడం ద్వారా పురుషులు ఆకస్మిక మరణాలను కొంతవరకైనా నివారించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
తీరంలో ‘ఫల’ సాయం
నాలుగేళ్ల క్రితం అక్కడ అడుగు పెడితే అంతా ఇసుకే. ఎడారిని తలపిస్తూ కేవలం సరుగుడు మొక్కలు తప్ప ఏ విధమైన పంటలు పండే అవకాశం లేని భూమి అది. కానీ ఇప్పుడు అక్కడ చూస్తే అంతా పచ్చదనం.. కళ్లు మిరుమిట్లు గొలిపే రంగుల్లో పండ్లు దర్శనమిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో మాత్రమే పండే వివిధ రకాల అరుదైన పండ్లు ఇప్పుడు అక్కడ పండుతున్నాయి. పిఠాపురం: కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు శీలంవారిపాలెం వద్ద రైతు ఐపీఆర్ మోహన్‌రాజు తనకు ఉన్న 3 ఎకరాల తీర ప్రాంత భూమిలో ప్రయోగాత్మకంగా డ్రాగన్, ఫ్యాషన్ ఫ్రూట్స్, లాంగన్ తదితర అరుదైన పండ్ల సాగు చేపట్టారు. సేంద్రీయ పద్ధతిలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పండ్ల తోటలు సాగు చేసి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అత్యధిక పోషక విలువలు, ఔషధ గుణాలు కలిగిన పండ్లుగా గుర్తింపు ఉండటంతో వీటికి మార్కెట్లో గిరాకీ ఎక్కువగానే ఉంది. మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ కేజీ రూ.300 వరకూ ఉండగా ఫ్యాషన్ ఫ్రూట్ కేజీ రూ.180 నుంచి రూ.200 వరకూ పలుకుతోంది. మూడేళ్ల క్రితం సాగు చేపట్టగా ప్రస్తుతం పంట చేతికి వచ్చి మంచి దిగుబడులు సాధిస్తున్నారు మోహన్‌రాజు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సముద్రం దగ్గరగా ఉండటంతో ఉప్పు నీరు వచ్చి సముద్ర ఇసుక మేటలు వేస్తుంది. అలాంటి ఉప్పు ఇసుకలో పంటలు పండించడం సవాలే. అయినప్పటికీ రైతు మోహన్‌రాజు ఉప్పు ఇసుకలోనూ బంగారు పంటలు పండించి శభాష్ అనిపించుకుంటున్నారు. ఆ ప్రాంతంలో బోరు వేసినా ఉప్పు నీరు పడేది. అనేక ప్రయత్నాల అనంతరం మంచినీరు పడగా ఆ బోరు నీటితో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో పండ్ల తోటలు పెంచుతున్నారు. ప్రస్తుతం తొలి పంట రావడంతో మార్కెట్ చేయడం ప్రారంభించారు. అనువు గాని చోట విజయం సాధించారు సముద్ర తీరం సమీపంలో అనువుగాని చోట అరుదైన రకాల పండ్ల తోటల పెంపకంతో మోహన్‌రాజు విజయం సాధించారు. ఎప్పటికప్పుడు మా సూచనలు, సలహాలు పాటించడం ద్వారా ఎక్కడా తోటలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసకున్నారు. పెట్టుబడి ఎక్కువే అయినప్పటికీ మంచి ఆదాయం ఆర్జించే అవకాశాలున్నాయి. డ్రిప్ ఇరిగేషన్, సేంద్రియ ఎరువుల వాడకం వల్ల మంచి దిగుబడి వచ్చే వీలుంది. – శైలజ, ఉద్యాన శాఖ అధికారి, పిఠాపురం ప్రయోగాత్మకంగా ప్రారంభించా.. మాది అంతా ఇసుక నేల. అంతా ఉప్పు మయంగా ఉంటుంది. గతంలో ఇక్కడ సరుగుడు తోటలు వేసేవాళ్లం. నేను మహారాష్ట్ర వెళ్లినప్పుడు అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ చూశాను. అక్కడి నుంచి విత్తనం తెచ్చి, ఇక్కడ సాగు చేయాలని ప్రయత్నించాను. తొలుత చాలా ఇబ్బందులు ఎదురైనప్పటికీ దేశవాళీ ఆవులు కొనుగోలు చేసి సేంద్రియ ఎరువుల తయారీ ద్వారా విత్తనాభివృద్ధి చేశాను. డ్రాగన్‌తో పాటు కేరళ నుంచి ఫ్యాషన్ ఫ్రూట్స్, లాంగన్ ఫ్రూట్స్ విత్తనాలు తెచ్చి పొలంలో నాటాను. వీటి పెంపకానికి సేంద్రియ ఎరువులతో పాటు నిత్యం నీరు అందేలా డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేశాను. ఆ పద్ధతి ద్వారానే నీటిలో కలిపి సేంద్రియ ఎరువులు మొక్కల మొదళ్లకు అందేలా ఏర్పాటు చేశాను. దీంతో ఉప్పు శాతం ఉన్నా మొక్కలు బలవర్దకంగా ఎదిగాయి. మొత్తం సాగుకు రూ.13 లక్షల వరకూ ఖర్చు అయ్యింది. ప్రస్తుతం కాపు వచ్చింది. మార్కెట్ నుంచి వ్యాపారులు వస్తున్నారు. అమ్మకాలు ప్రారంభించాను. ఇక నుంచి ఏటా పంట చేతికి అందుతుంది. పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం నీరు, ఎరువులు వేసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవడమే. ప్రయోగాత్మకంగా చేసినా విజయవంతమైంది. – ఐపీఆర్ మోహన్‌రాజు, రైతు, శీలంవారిపాలెం -
మామిడి పండు తింటున్నారా?.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
కర్నూలు(అగ్రికల్చర్): పళ్లలో మామిడి రారాజు. ఇప్పుడిప్పుడే మార్కెట్లో దర్శనమిస్తూ నోరూరిస్తున్నాయి. పసుపు పచ్చ రంగులో ఆకర్షించే అలాంటి మామిడిని చూసి మోసపోవద్దంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు. కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లు అయితేనే అంతలా ఊరిస్తాయని, వాటిని తింటే ఆరోగ్యానికి హానికరమంటూ హెచ్చరిస్తున్నారు. సహజసిద్ధంగా లేదా ఎథ్రిల్ లిక్విడ్‌తోనైనా మాగబెట్టిన పండ్లను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లకు సహజసిద్ధంగా మాగిన పండ్లను ఎలా గుర్తు పట్టాలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.. చదవండి: ఈ మిల్క్‌షేక్‌ను రాత్రి పడుకునే ముందు తాగితే! కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండు.. కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండు మొత్తం లేత పసుపు రంగులో ఒకే విధమైన కాంతితో నిగనిగలాడుతూ ఉంటుంది. పైకి మాగినట్లు కనిపించినా లోపల అపరిపక్వంగా ఉండి రుచి పుల్లగా ఉంటుంది. పండును ముక్కుకు దగ్గరగా ఉంచినప్పుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది. చక్కెర శాతం తక్కువగా ఉండి, తీపి, రుచి అంతంత మాత్రమే ఉంటాయి. పండు తొక్క ముడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది. తొక్కపై నల్లని చుక్కలు ఏర్పడతాయి. పండు త్వరగా పాడైపోతుంది. సహజసిద్ధంగా మాగిన పండు.. సహజంగా మాగిన పండు కొంత పసుపు, మరికొంత ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి లోపలి భాగం అంతా పరిపక్వంగా ఉంటుంది. పండు కొంత దూరంలో ఉన్నప్పటికీ కమ్మని మామిడి పండు వాసన వస్తుంది. చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. తీయగా, రుచిగా ఉంటుంది. సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు.. కాల్షియం కార్బైడ్‌తో కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను తింటే కాన్సర్, అల్సర్, కాలేయం(లివర్), మూత్ర పిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాల్షియం కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలీన్ వాయువు నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపి తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, జ్ఞాపిక శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయ పద్ధతులు.. మాగని కాయలను, కొన్ని మాగిన పండ్లను గాలి చొరబడని డబ్బాలలో ఉంచాలి. లేదా పక్వానికి వచ్చిన కాయలను ఒక రూములో వరిగడ్డి లేదా బోదగడ్డిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల సహజ సిద్ధంగా మాగుతాయి. లేదా తప్పని పరిస్థితుల్లో మామిడి కాయలు మాగబెట్టాల్సి వస్తే ఇథిలిన్ వాయువు(గ్యాస్) 100 పీపీఎం మాత్రమే ఉపయోగించాలి. 100 పీపీఎం ఎథిలిన్ వాయువు 24 గంటలు తగిలేలా ఉంచితే 5 రోజుల్లో సహజత్వానికి దగ్గరగా ఎలాంటి హాని లేకుండా మాగుతాయి. ఈపద్ధతిని రైపనింగ్ చాంబర్లో వినియోగిస్తున్నారు. ఎథ్రిల్ లిక్విడ్‌లో 5 నిముషాలు పాటు ముంచి మూడు, నాలుగు రోజులు నిల్వ చేస్తే సహజత్వానికి దగ్గర మాగుతాయి. ముంచడం సాధ్యం కానిపక్షంలో ఎథ్రిల్ లిక్విడ్‌ను కాయలకు స్ప్రే చేయవచ్చు. తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు.. పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15–20 నిముషాలు ఉంచి, తిరిగి వాటిని మంచినీళ్లతో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత తినాలి. లేదా ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది. కాల్షియం కార్బైడ్‌తో మాగించొద్దు ఆహార సురక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో మామిడి పండ్లను మాగించరాదు. కార్బైడ్ వాడిన పండ్లను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎలా మాగించాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్‌తో మాగబెట్టిన వారికి, అమ్మేవారికి ఏడాది జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. – రఘునాథరెడ్డి, ఏడీ ఉద్యానశాఖ కర్నూలు -
Photo Feature: వీటిని తింటే కలిగే ప్రయోజనాలు తెలుసా?
సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం: ఐస్ యాపిల్‌గా పేరుగాంచిన తాటి ముంజల సీజన్ మొదలైంది. కూడళ్లలో ముంజల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఎర్రటి ఎండలో ముంజల్ని ఆరగించేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. అందులో ఉండే ద్రవ పదార్థాన్ని ఇష్టంగా లాగించేస్తున్నారు. లేత ముంజలకు రోజురోజుకీ గిరాకీ పెరుగుతోంది. నగరంలోని జీటీరోడ్లో విక్రయాల్ని చిత్రాల్లో చూడొచ్చు. చదవండి: కర్బూజా జ్యూస్.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో! వేసవి వరం.. ♦తాటిముంజలు వేసవి వరమని చెబుతున్నారు వైద్య నిపుణులు. దాని వల్ల కలిగే ప్రయోజనాల్ని వివరిస్తున్నారు. అజీర్తిని తగ్గించే గుణందీని సొంతం. ♦బరువు తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుంది. ♦లేతముంజల్ని తింటే ఉపయోగం. ♦డీహైడ్రేషన్ రాకుండా చేస్తుంది. ♦బ్రెస్ట్ క్యాన్సర్, ట్యూమర్ వంటివి రాకుండా కాపాడుతుంది. -
కివీ పండు- పోషకాలు మెండు
-
మామూలు రోబో కాదు.. పండ్లు కోసుకొచ్చి, బుట్టలో పడేస్తుంది
చిటారు కొమ్మన ఉన్న పండును కోసుకు రావాలంటే, ఇకపై చెట్టెక్కాల్సిన పనిలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం దగ్గర ఉంటే, ఎంత ఎత్తయిన చెట్టు నుంచైనా ఇట్టే పండ్లు కోసుకొచ్చి, బుట్టలో పడేస్తుంది. పెద్ద పెద్ద తోటల్లో వినియోగించుకోవడానికి అనువుగా రూపొందించిన ఈ పరికరం పేరు ‘టెవెల్ ఎఫ్ఏఆర్ ద్రోన్’. ఇది ద్రోన్ మాత్రమే కాదు, రోబో కూడా. ఫ్లయింగ్ ఆటానమస్ రోబో (ఎఫ్ఏఆర్). అమెరికాకు చెందిన ‘టెవెల్ టెక్’ స్టార్టప్ కంపెనీకి చెందిన డిజైనర్లు దీనికి రూపకల్పన చేశారు. త్వరలోనే దీని పనితీరును అమెరికా, స్పెయిన్ దేశాల్లో ఎంపిక చేసుకున్న కొన్ని తోటల్లో పరిశీలించనున్నారు. పండ్లు కోసే ఈ రోబో ద్రోన్లను పెద్దసంఖ్యలో తయారు చేసేందుకు ‘టెవెల్ టెక్’ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతోంది. -
కోపంతో రెచ్చిపోయిన మహిళ.. రోడ్డుపై పండ్లు విసురుతూ.. వీడియో వైరల్
రోడ్డు పై వెళ్తున్నపుడు చిన్న చిన్న తప్పులు జరగడం సహజం. అయితే కొందరు మాత్రం చిన్న చిన్న వాటికి కూడా కోపంతో రెచ్చిపోతుంటారు. తాజాగా ఓ మహిళ రోడ్డుపై కోపంతో విచక్షణ లేకుండా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చోటు చేసుకుంది. (చదవండి: వైరల్: దొంగతనానికి వచ్చి.. ఆకలేయడంతో వంటగదిలో కిచిడీ వండుతూ.. ) వివరాల్లోకి వెళితే.. తోపుడు బండపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించే ఓ వ్యక్తి ఎప్పటిలానే తన బండిని రోడ్డు పై తోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ దారిలో ఓ కారు పార్క్ చేసి ఉంది. పొరపాటున చిరు వ్యాపారి తోపుడు బండి ఆ కారుకు తగిలింది. ఈ విషయాన్ని గమనించిన ఆ కారు యజమాని అయన మహిళ విచక్షణ కోల్పోయి మరి అతని పట్ల కర్కశంగా ప్రవర్తించింది. కోపంతో ఊగిపోతు బండిపై ఉన్న పండ్లను రోడ్డుపై విసిరేసింది. అతను తప్పు జరిగింది క్షమించండి అంటూ వేడుకున్న ఏ మాత్రం కనికరం చూపలేదు. దారిన పోయే వాహనదారులు ఆమె అనూహ్య ప్రవర్తనను వీడియో తీస్తున్నా కూడా ఆగకుండా అలాగే చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది. Bhopal : After a slight touch of a car parked on the road, the woman in anger threw all the fruits of the fruit seller on the road. It is said that a professor of a private university in Bhopal, madam. The cartman kept pleading but madam did not listen.#Bhopal #MadhyaPradesh pic.twitter.com/cAFvPL7LRN — Mario David Antony Alapatt (@davidalapatt) January 11, 2022 -
ముక్కలుగా.. ఆ తర్వాత పేస్ట్‌లా మార్చే మాన్యువల్ చాపర్
కూరగాయలను, పండ్లను అవసరాన్ని బట్టి, ఇట్టే ముక్కలుగా, పేస్ట్‌లా అందించే మాన్యువల్ చాపర్ ఇది. దీనికి పవర్‌తో పని లేదు. మల్టీ–బ్లేడ్ డిజైన్ కలిగిన ఈ డివైజ్‌లో పండ్లు లేదా కూరగాయలు ఈ బౌల్లో వేసుకుని.. మూత పెట్టి, ఆ మూత పైభాగంలో ఉన్న రెడ్ లేదా గ్రీన్ కలర్ హ్యాండిల్‌ని ఒక చేత్తో పట్టుకుని, మూతపైన మరో చేయి వేసి నొక్కి పెట్టి.. హ్యాండిల్‌ని ఫోర్స్‌గా మనవైపుకి లాగితే.. లోపల ఉన్న పదార్థాలు ముక్కలు ముక్కలుగా అవుతాయి. అలా అయిదుసార్ల కంటే ఎక్కువ లాగితే కూర తయారీకి సరిపడా ముక్కల్లా, ఎనిమిదిసార్ల కంటే ఎక్కువ లాగితే చట్నీలా, పన్నెండుసార్ల కంటే ఎక్కువ లాగితే జ్యూస్‌లా మారుతుంది. టొమాటో, ఆనియన్, కొత్తిమీర, నిమ్మరసం, మిరియాల పొడి వేసుకుని స్పైసీ సల్సా తయారు చేసుకోవచ్చు. తులసి, పైన్ నట్స్, వెల్లుల్లి, లవంగాలు, ఆలివ్ నూనె వేసుకుని పర్ఫెక్ట్ పెస్టో రెడీ చేసుకోవచ్చు. బనానా, స్ట్రాబెర్రీ, పైనాపిల్ ముక్కల్లో పెరుగు, తేనె వంటివి జోడించి టేస్టీ జ్యూస్ చేసుకోవచ్చు. భలే బాగుంది కదూ. -
డ్రాగన్.. ‘ఫల’కరింపు
సాక్షి, తుని(తూర్పుగోదావరి): అందరూ వెళ్లే దారిలో వెళ్లాలనుకోలేదాయన.. ఫ్రూట్‌ఫుల్‌గా ఉండే డ్రాగన్ సాగుపై దృష్టిసారించారు. ఔషధగుణాలు అధికంగా ఉండే ఈ పండ్లకు ఉన్న డిమాండ్ తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు వెళ్లి అక్కడ సాగవుతున్న పంటను వారం రోజుల పాటు పరిశీలించారు. ఈ ఏడాది ఆగస్టులో అమెరికన్ బ్యూటీషన్ (ఎంఎం గోల్డ్) రకం విత్తనం తీసుకుని ఎస్.అన్నవరంలో తనకున్న 2.40 ఎకరాల్లో సాగుకు శ్రీకారం చుట్టారు. ఆయనే తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతానికి చెందిన పోలిశెట్టి రామారావు (టైల్స్ రామారావు). ఒకసారి నాటితే మూడేళ్ల నుంచి 25 ఏళ్లు ఏకధాటిగా (ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు) డ్రాగన్ ఫ్రూట్ ఫలసాయాన్ని పొందవచ్చని ఆయన చెబుతున్నారు. దీని సాగుకు మెట్ట ప్రాంత నేలలు అనుకూలంగా ఉన్నాయంటున్నారు. సాగు ఇలా.. ఆరు అడుగులు ఎత్తులో చక్రాకారంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ లభించిన మట్టల నుంచి సేకరించిన విత్తనాన్ని సిమెంట్ స్తంభాల చట్టూ నాలుగైదు నాటుకోవాలి. మూడు నెలల్లో సిమెంట్ స్తంభాలకు విస్తరిస్తుంది. అప్పటి నుంచి ఒక్కొక్కటిగా డ్రాగన్ ఫ్రూట్ ఫలసాయం లభిస్తుంది. విస్తారంగా ఫలసాయాన్ని పొందేందుకు నవంబరు, ఫిబ్రవరి మధ్యకాలంలో వచ్చే పూతను రైతులు ఎప్పటికప్పుడు తొలగించడం ఉత్తమం. దీంతో ఫిబ్రవరి నుంచి అధికంగా ఫలసాయం లభించనుంది. తొమ్మిది నెలల్లో ఎకరాకు నాలుగు నుంచి పది టన్నులు డ్రాగన్ ఫ్రూట్స్ లభిస్తాయి. చీడపీడలు ఆశించకపోవడంతో రసాయనక ఎరువులు, మందులు వాడాల్సిన పనిలేదు. విస్తారంగా పంట విరబూసేందుకు గో మూత్రం, వివిధ రకాల ఆకులతో తయారు చేసిన కషాయాల పిచికారీ, కలుపు నివారణ, వేసవిలో రెండు రోజులకు డ్రిప్ పద్ధతిలో ఒక తడుపు వంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఎండవేడిమిని అదుపు చేసేందుకు డ్రాగన్ ఫ్రూట్ చక్రాకార సిమెంట్ స్తంభాలను ఆనుకుని సీతాఫలం మొక్కలు వేసుకోవడం మంచిది. ఫ్రూట్ తొలగించిన రెబ్బలు (మట్టలు) నుంచి రైతు సొంతంగా విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు. విత్తనాన్ని విక్రయించుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. అబ్బురపరిచే ఔషధ గుణాలు పుచ్చకాయ మాదిరిగా తియ్యని రుచి కలిగిన డ్రాగన్ ఫ్రూట్స్‌లో అబ్బుర పరిచే ఎన్నోపోషక విలువలు ఉన్నాయి. రక్తంలో చక్కెర నియంత్రణ, తెల్లరక్త కణాలు, ప్రేగుల్లో మంచి చేసే 400 రకాల బ్యాక్టీరియాల వృద్ధి, క్యాన్సర్, కీళ్ల నొప్పులు, మలబద్ధకాన్ని నివారించడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించడం, జీర్ణాశయ రుగ్మతలు తొలగించే పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో డ్రాగన్ ప్రూట్స్కి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. రూ.15 లక్షల పెట్టుబడి డ్రాగన్ ఫ్రూట్స్‌కు ఉన్న డిమాండ్‌తో సాగు చేయాలన్న ఆసక్తి కలిగింది. తెలంగాణ రాష్ట్రం నల్గొండలో వారం రోజులు పంటను పరిశీలించి, సాగు, సంరక్షణ, సస్యరక్షణ తదితర విషయాలపై అవగాహన వచ్చింది. సీజన్లో ఎకరానికి నాలుగు నుంచి పది టన్నులు దిగుబడి, రూ.లక్షల్లో ఆదాయం వస్తుందని తెలుసుకున్నాను. ఆగస్టులో అమెరికన్ బ్యూటీషన్ (ఎంఎం గోల్డ్) రకం విత్తనం తీసుకువచ్చాను. 2.40 ఎకరాల్లో 12 వందల వలయాకార సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసి రూ.15 లక్షలు పెట్టుబడితో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టాను. సేంద్రియ పద్ధతులను అనుసరిస్తున్నాను. తొలి పంట ఫలసాయం 2022 ఫిబ్రవరిలో లభించనుంది. డ్రాగన్ ఫ్రూట్స్ రుచులను స్థానికులకు అందించాలన్న ఆలోచనతో వ్యాపారులతో ఒప్పందాలకు అంగీకరించలేదు. – పోలిశెట్టి రామారావు, అభ్యుదయ రైతు, తుని -
నిపా వైరస్: పండ్లు కడిగే తింటున్నారా?
థర్డ్ వేవ్‌తో కరోనా విరుచుకుపడుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్న వేళ.. నిఫా వైరస్ పేరు మళ్లీ వినిపించడం వైద్యసిబ్బందిని కలవరపాటుకు గురి చేస్తోంది. కేరళలో పన్నెండేళ్ల బాలుడు నిపా వైరస్ కారణంగా చనిపోవడంతో కేరళ, ఆ పొరుగునే ఉన్న తమిళనాడు జిల్లాలు అప్రమత్తం అయ్యాయి. ఈ తరుణంలో ఫేక్ కథనాలు ప్రచారంలోకి వస్తున్నప్పటికీ.. నిపా విషయంలో అప్రమత్తంగా ఉంటేనే నష్టనివారణ చేయొచ్చని సూచిస్తున్నారు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు. నిపా.. జూనోటిక్ డిసీజ్. జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. అయితే మనిషి నుంచి మనిషికి సోకడమనే ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది. అందుకే జంతువులు, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ అశుతోష్ బిస్వాస్ చెబుతున్నారు. ఫ్రూట్ బ్యాట్(గబ్బిలాలు) లాలాజలం నుంచి, వాటి విసర్జితాల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రత్యేకించి చికిత్స విధానమంటూ నిపా వైరస్‌కు లేకపోవడం వల్ల జాగ్రత్తగా ఉండడమే మార్గమని డాక్టర్ బిస్వాస్ అంటున్నారు. సెప్టెంబర్ 5న నిపా కారణంగా కేరళ కోజికోడ్ బాలుడు చనిపోగా.. బాధితుడి ఇంటి నుంచి సేకరించిన ‘రాంభూటాన్ పండ్ల’(చెట్టు నుంచి కిందపడిన పండ్లు) ద్వారా వైరస్ నిర్ధారణ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు డాక్టర్ బిస్వాస్. పండ్లు కడగాల్సిందే! గబ్బిలాలు నిపా వాహకాలు కావడంతో పండ్ల(ఫ్రూట్స్) విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ బిస్వాస్ సూచిస్తున్నారు. సాధారణంగా గబ్బిలాలు జంతువులకు వైరస్‌ను అంటిస్తాయి. ప్రధానంగా గబ్బిలాలు కొరికిన పండ్ల వల్ల నిపా వైరస్ సోకుతుంది. చాలామంది చెట్ల మీద నుంచి పడిన పండ్లను సంబరంగా తింటుంటారు. సగం కొరికి కింద పడ్డ పండ్లను.. కడగకుండానే తినేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన అలవాటు అని చెప్తున్నారు డాక్టర్ బిస్వాస్. పండ్లు ఎలాంటివైనా సరే శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలని ఆయన సూచిస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఈ జాగ్రత్త తప్పక పాటించాలని, లేకుంటే ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారాయన. ప్రాథమిక జాగ్రత్తలు ► పెంపుడు జంతువుల్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవడం.. వాటిని బయటకు తీసుకెళ్లినప్పుడు ఓ కంటకనిపెడుతుండడం. ► చేతులను తరచు సబ్బుతో శుభ్రం చేసుకోవటం. ► ఆహారాన్ని పూర్తిగా ఉడికించి తినడం ► పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. లక్షణాలు ► శ్వాసకోశ సమస్యలు, ► జ్వరం ► ఒళ్లు నొప్పులు ► తలనొప్పి ► వాంతులు ► లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. ► నిపా నిర్ధారణ అయితే వైద్యసిబ్బందిని సంప్రదించడం. మలేషియాలో పందుల పెంపకందారులకు మొదటిసారిగా నిపా వైరస్ సోకింది. భారత్‌లో మొదటిసారి పశ్చిమబెంగాల్లో, రెండోసారి కేరళలో విజృంభించింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి తీరుతెన్నులను గమనిస్తే ఒకే ప్రాంతం, దాని చుట్టుపక్కల పరిసరాలకు పరిమితమవుతూ వచ్చింది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటే.. ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశమే ఉండదని వైద్యులు చెప్తున్నారు. చదవండి: మరోసారి నిపా కలకలం -
లోకల్.. ఆ‘ఫీల్’.. డిమాండ్ ఎక్కువ.. ధర తక్కువ!
సాక్షి హైదరాబాద్: సిటీలో దేశీయ ఆపిల్స్ విరివిగా దొరుకుతున్నాయి. ఈ ఏడాది మార్కెట్లలో పెద్దమొత్తంలో దిగుమతులు పెరిగాయి. విదేశీ కంటే దేశీయ ఆపిల్స్ ధర తక్కువగా ఉండటం అగ్గువకు దొరుకుతుండటంతో చాలామంది వీటినే కొనుగోలు చేస్తున్నారు. రిటైల్‌గా అమ్మేవాళ్లు, బండ్లపై వ్యాపారం చేసేవాళ్లు కూడా లోకల్ రకాలనే ఎక్కువగా కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దేశీయ ఆపిళ్ల దిగుబడి గణనీయంగా పెరిగిందని, అనువైన వాతావరణం ఉండటమే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గడ్డి అన్నారం హోల్‌సేల్ ఫ్రూట్ మార్కెట్లో దిగుమతి పెరిగింది. ఈ ఒక్క మార్కెట్లోనే ప్రస్తుతం 40 శాతం మేర దిగుమతి పెరిగిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 14.59లక్షల బాక్సులు దిగుమతి అయ్యాయి. ఆరు నెలల క్రితం దేశీయ ఆపిల్ ఒక బాక్స్ ధర(కనీసం 100 కాయలు) రూ.1900– రూ.2000 ఉండగా, ప్రస్తుతం రూ.600–రూ.1000 ధర ఉంది. ఇంపోర్టెడ్ ఆపిల్స్ ఒక బాక్స్ ధర రూ.2వేల నుంచి రూ.3 వేల వరకు అమ్ముడవుతోంది. చదవండి: Telangana: భయం లేకుంటేనే బడికి పంపండి లోకల్ ఆపిల్స్కు డిమాండ్ నగరంలో ఇంపోర్టెడ్ ఆపిల్స్ కంటే లోకల్ రకాలకే డిమాండ్ ఉంది. హిమాచల్‌ప్రదేశ్ నుంచి 70%, కశీ్మర్, డిల్లీ నుంచి 15% వరకు ఆపిళ్లు దిగుమతులు ఉంటాయి. అమెరికా, బంగ్లాదేశ్, మలేíÙయా, చైనా నుంచి మరో 15% వరకు ఇంపోర్టెడ్ ఆపిళ్లు దిగుమతి అవుతాయని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. విదేశీ ఆపిళ్లు కేవలం పెద్ద పెద్ద మాల్స్‌లో మాత్రమే అమ్ముతుండటంతో సంపన్న వర్గాల వారు మాత్రమే వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. రేటు బాగా తగ్గింది గతేడాదికంటే ఆపిల్ పంట దిగుబడి పెరిగింది. సిటీలో ఇంపోర్టెడ్ ఆపిళ్ల కంటే ఇండియన్ రకాలనే ఎక్కువ కొంటున్నారు. రేటు తక్కువగా ఉండటం, అన్ని ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో లభిస్తుండటంతో జనాలు వీటినే కొనుగోలు చేస్తున్నారు. – మహ్మద్ ఖుర్రం, హోల్‌సేల్ వ్యాపారి కొత్తపేట్ మార్కెట్ -
పండ్లు అమ్మిన సీనియర్ నటుడు నరేశ్
వ్యవసాయం చేస్తూ లాక్డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు సీనియర్ నటుడు నరేశ్. తాజాగా అతడు తన ఫాంహౌస్‌లో పండిన పండ్లను స్వయంగా అమ్మాడు. తోటలో విరగకాసిన మామిడి, నేరేడు పండ్లను స్వహస్తాలతో తెంపి తన కార్యాలయానికి తీసుకొచ్చాడు. అక్కడ వాటిని కిలో రూ.50 చొప్పున అమ్మి 3,600 రూపాయలు సంపాదించాడు. అయితే నటుడిగా సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటే వచ్చే సంతోషం కన్నా వీటిని అమ్మినందుకు పొందిన ఆనందమే ఎక్కువగా ఉందని నటుడు చెప్పుకొచ్చాడు. కష్టపడి వ్యవసాయం చేయడంలోనే అసలు సిసలైన మజా ఉందంటున్నాడు. అతడు పండ్లు అమ్మిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నరేశ్ చివరిసారిగా 'శ్రీకారం', 'రంగ్‌దే' చిత్రాల్లో కనిపించాడు. ప్రస్తుతం అతడు ఆలీతో కలిసి 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' సినిమాలో నటిస్తున్నాడు. Naresh the farmer sold his hand plucked organic mangoes & kala. jamoons to his film fraternity at his studio for 50 rs a kg and earned rs 3600 🤗 The happiness was much more than when received his highest remuneration as an actor . Try farming feel the real joy 😍🥭💕 pic.twitter.com/vTAlVWKItB — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 23, 2021 చదవండి: మా దగ్గర పని చేసిన అందరికీ అమ్మ ఇళ్లు కట్టించింది: నరేశ్ -
ఈ ఆహారంతో అస్తమాకు చెక్!
కొన్ని రకాల ఆహారాలు ఆస్తమాను నివారిస్తాయి. అవి... 1.కిస్మిస్, వాల్నట్స్ వంటి ఢ్రై ఫ్రూట్స్, బొప్పాయి, ఆపిల్ వంటి తాజా పండ్లు, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, కూర అరటి వంటి కూరగాయలు, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఈ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి కాబట్టి ఇవి కూడా ఎక్కువగా లభ్యమయ్యేలా ఆహారం తీసుకోవాలి. 2.బ్రేక్‌ఫాస్ట్‌లో... పండ్లు, తేనె, కిస్మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో... క్యారట్, బీట్రూట్ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు తీసుకోవాలి. 3.కూరల్లో లేదా తీసుకునే పదార్థాల్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం– సోయా గింజలు ఉండటం మంచిది. 4.దనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి. 5.పాలు లేదా టీలో అరస్పూన్ అల్లం పొడి లేదా మిరియాల పొడి వేసి తాగాలి. ఆస్తమాను ప్రేరేపించడానికి అవకాశం ఉన్న ఆహారాలు ఇక ఆస్తమాను ప్రేరేపించే ఆహారాలూ ఉన్నాయి. అలా ట్రిగర్ చేసే ఈ కింది వాటిని సాధ్యమైనంతగా నివారించడం మేలు. అయితే... ఇవన్నీ అందరిలోనూ ఆస్తమాను ప్రేరేపించవు. వ్యక్తిగతంగా వారికి సరిపడక వారిలో మాత్రమే ఆస్తమాను ట్రిగర్ చేస్తాయి. అందుకే ఈ కింది వాటిలో ఏదైనా పదార్థం సరిపడక, దేని కారణంగానైనా ఆస్తమా వస్తుంటే దాన్నుంచి దూరంగా ఉండాలి. సాధారణంగా కొందరిలో ఆస్తమాను ప్రేరేపిస్తాయంటూ చెప్పే ఆహారాలు ఇవే... పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు... ఇవి ఆస్తమా సమస్యను తీవ్రతరం చేయవచ్చు. అయితే ఇందులో కొన్ని మాత్రమే నిజం. వీటిలో ఫలానా ఆహారం నిర్దిష్టంగా అలర్జీని కలిగించి ఆస్తమాను ప్రేరేపిస్తుందని, అదే ట్రిగర్ అని తెలిస్తేనే... అప్పుడు దాన్ని మాత్రమే మానేయాలి. కమలాలు, నిమ్మ, బత్తాయి లాంటివి సి విటమిన్‌ను కలిగించి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయి. నిర్దిష్టంగా ఆ ఆహారం అలర్జీని కలిగిస్తుందని అనుకున్నప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించి, అది కచ్చితంగా అలర్జీని కలిగిస్తుందనే నిర్ధారణ పరీక్షను చేయించాకే... ఆ ఆహారం నుంచి దూరంగా ఉండాలి. -
ఇవే ఇమ్యూనిటీ బూస్టర్స్...
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కోవిడ్–19 లేదా కరోనా వైరస్ దాటికి గజగజ వణికిపోతుంది. దీనికితోడు వర్షాకాలం, చలికాలం రాబోతున్న సమయంలో మరిన్ని సాంక్రమిక వ్యాధులు పెచ్చురిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో వ్యాధులు వచ్చాక చికిత్స కన్నా, నివారణ ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇంతకీ ఏంతింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది? ఏవి తినాలి? ఏవి తినకూడదు?.. చూద్దాం... రోగనిరోధక శక్తిని పెంచడంలో ఏ, బీ, సీ, డీ, ఈ విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు, ఫైటో న్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. కంటికి కనిపించని హానికారక సూక్ష్మ జీవుల కారణంగా సంక్రమించే అనేక రకాల వ్యాధులను ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణలో విటమిన్ ఏ దోహదపడుతుంది. విటమిన్ సీ, బీటా కెరోటిన్, ఈ, డీ విటమిన్లు, జింక్, సెలీనియంలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఈ పోషకాలన్నీ మన శరీరానికి చేరతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంది. మోతాదుకు మించి పోషకాలు తీసుకున్నా ఇతర రకాల సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల సమతుల ఆహారం తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎక్కడ దొరుకుతాయి? ప్రధానంగా తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు సమృద్ధిగా దొరుకుతాయి. అందువల్ల వీటన్నింటిని దైనందిన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. స్థానికంగా పండే ధాన్యాలు, ఆయా సీజన్లలో దొరికే పండ్లలో పోషకాలు అధికంగా లభిస్తాయి. అధికంగా ప్రాసెస్ చేసి వండి ఆహార పదార్థాల జోలికి వెళ్లకూడదు. కార్బోనేటెడ్ శీత పానీయాలు తాగకూడదు. వీటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు మోతాదుకు మించి ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్ లాంటి ముఖ్యమైన పోషకాలు ఏవీ ఉండవు. మాంసం, గుడ్లు వంటి ఆహారాలను బాగా ఉండికించిన తర్వాతే తినాలి. పచ్చి మాంసం, గుడ్లు, కూరగాయలను పట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులను శానిటైజర్‌తో కడుక్కోవాలి. లేదంటే వాటి మీద ఉన్న సూక్ష్మజీవులు మన శరీరంలోకి సులభంగా ప్రవేశించి వివిధ అనారోగ్యాలను కలుగచేస్తాయి. శరీరంలో కొవ్వు స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఒక వ్యక్తి రోజుకి 30 గ్రాములకు మించి నూనెను, 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. చక్కెరలో కెలరీలు తప్పించి పోషకాలు ఏవీ ఉండవు. అందువల్ల చక్కెరను మితంగా తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వల్ల రోగనిరోధక శక్తి బాగా బలహీనపడుతుంది. ఈ అలవాట్లు ఉన్న వారికి అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.అందువల్ల వీటిని మానేయాలి. మరీ ముఖ్యంగా రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీటిని తప్పకుండా తీసుకోవాలి. నీరు శరీర ఉష్ణోగ్రతలను సమ స్థితిలో ఉంచడంతోపాటు. శరీరంలో వ్యర్థాలను స్వేదం, మూత్రం ద్వారా బయటకు పంపి మన శరీరాన్ని స్వచ్చగా ఉంచుతుంది. బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడితోపాటు అనేక రకాల పండ్లలో బీటా కెరోటిన్, విటమిన్లు ఏ, ఈలు, పొటాషియం, ఫోలేట్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగు పరచుకునేందుకు ఇవి ఎంతగానో సాయపడతాయి. నారిజం, నిమ్మ, బత్తాయి, బెర్రీ వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. ఆకు కూరల్లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మధుమేహం లేదా ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడతున్న వారు ఇప్పటిదాక వాడుతున్న మందులను వాడుకుంటూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కేవలం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే కాకుండే ఎవరైనా సరే మానసిక ఒత్తిడి లేకుండా చూసుకుంటూ, రోజూ సమతుల ఆహారం తీసుకోవాలని, అప్పుడు ఆటోమేటిగ్గా శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని నిపుణుల మాట!. -
పరదేశీ పండు.. బహుబాగుండు
సాక్షి, సిటీబ్యూరో : అమెరికా స్ట్రాబెర్రీ, న్యూజిలాండ్ కివి, వాషింగ్టన్ యాపిల్, కాలిఫోర్నియ ద్రాక్ష, ఆ్రస్టేలియా ఆరెంజ్, థాయిలాండ్ డ్రాగన్.. ఇలా అనేక రకాల విదేశీ పండ్లు ప్రసుత్తం నగర పండ్ల మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. పండ్ల రుచులను ఆస్వాదించడానికి నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. కరోనా కాలంలో విదేశీ పండ్ల వినియోగం గణనీయంగా పెరిగిందని మార్కెట్ వర్గాల అంచనా. ప్రతి పండు పోషకాల సమ్మేళనం. సీజన్లో వచ్చే పండ్లలను తింటే మేలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రకాల పండ్లు రోగాలను సైతం నయం చేస్తాయని ఆయుర్వేద డాక్టర్లు అంటున్నారు. ►ఇటీవలి కాలంలో నగరంలో విదేశీ పండ్ల దిగుమతులు భారీగా పెరిగాయని గడ్డిఅన్నారం మార్కెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్లో రోజుకు దాదాపు 50–60 టన్నుల విదేశీ పండ్ల విక్రయాలు సాగుతున్నాయి. గతంతో పోలిస్తే విదేశీ పండ్ల విక్రయాలు పెరిగాయని వ్యాపారవర్గాలు పేర్కొన్నాయి. ►గతంలో కేవలం సంపన్నులకే అందుబాటులో ఉండే ఈ పండ్లు ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి ప్రజల దరికి చేరాయి. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ పోషక విలువలు మెండుగా ఉండే పండ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నందున.. ఈ ఫ్రూట్స్ తినేందుకు మొగ్గు చూపుతున్నారు. ►గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు 20 దేశాల నుంచి వివిధ రకాల పండ్లు దిగుమతి అవుతుంటాయి. నగరంలో ఇటీవల ఈ పండ్ల వాడకం గణనీయంగా పెరగడంతో విదేశీ పండ్ల స్వీకరణలో మన నగరం దేశంలోనే మూడో స్థానానికి చేరుకుంది. ►ముంబై, బెంగళూరు తర్వాతి స్థానం హైదరాబాద్‌ది అని ‘వాషింగ్టన్ యాపిల్ కమిషన్’ డేటాలో తేలిందని విదేశీ ఎగుమతి, దిగుమతుల నిపుణుడు పి.రాకేశ్రెడ్టి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో లభించే వివిధ రకాల పండ్లు నగర మార్కెట్లో అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఏ పండు ఎక్కడ నుంచంటే.. యాపిల్: గ్రీన్ యాపిల్‌కు ఇటీవల అదరణ పెరిగింది. నెదర్లాండ్స్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ నుంచి నెలకు దాదాపు 12 వేల పెట్టెలు దిగుమతి అవుతున్నాయి. అమెరికా నుంచి యాపిల్ వాషింగ్టన్, రాయల్ గాల, యాపిల్ చైనా.. ఇక్కడి నుంచే గాకుండా న్యూజిలాండ్ నుంచి చిల్లి, బెల్జియం నుంచి కూడా పండ్లు మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. డ్రాగన్‌ఫ్రూట్: క్యాబేజీ రూపంలో గులాబీ రంగులో ఉండే ఈ పండుకు పైన తొన ఉంటుంది. లోపల ఎక్కువగా తెలుపు కొన్ని ఎరుపు రంగులో కనిపిస్తాయి. చిన్న గింజలు ఉంటాయి. విటమిన్ సీ, ఫాస్పరస్, కాల్షియం, ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సీడెంట్లు ఎక్కువ. వ్యాధి నిరోధక శక్తితో పాటు కేన్సర్‌ను నియంత్రిస్తుంది. చెర్రీ: నగరానికి దిగుమతి అవుతున్న పండ్లలో చెర్రీ కూడా ఒకటి. ఇందులో కార్బొహైడ్రేట్లు, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. కివి: న్యూజిలాండ్, ఇటలీ, ఇరాన్, చైనా నుంచి దిగుమతి అవుతాయి. ప్రసుత్తం దేశీయ పండ్ల కంటే విదేశీ కివీకి ఎక్కువ డిమాండ్ . ప్లమ్: ఇదిచిన్న యాపిల్. చిన్న సైజు టమాటలా కనిపిస్తుంది. పెద్ద రేగు పండు సైజులో ఉంటుంది. కాల్షియం, సీ, బీ విటమిన్లు, మెగి్నíÙయంతో పాటు ఇతర పోషకాలు ఈ పండులో అధికంగా ఉన్నాయి. -
బీపీ,షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చు..
ఈ ఏడాది చలికాలంలోకి అడుగుపెట్టాం. దీంతో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కొంత వ్యాయమం చేయడంతో పాటు డైట్ పాటించడం కూడా చాలా ముఖ్యం. అందుకే చలికాలంలో దొరికే కొన్ని పండ్లను మీ డైట్లో భాగంగా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి. ఈ కాలంలో దొరుకుతూ, ఆరోగ్యానికి, బీపీ, షుగర్ లెవల్స్ తగ్గించడానికి దోహదపడే ఐదు రకాల పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. కమల పండు: ఈ పండులో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఫైబర్‌తో నిండి వుండే ఈ పండులో సీ విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది భోజనం తరువాత షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండేందుకు దోహదపడుతోంది. ఇది షుగర్ లెవల్స్‌ను, కొలస్ట్రాల్‌ను, బీపీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 2. పీర్స్: ఈ పండులో ఎక్కవ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ పోషకాలు, ఫైబర్ కలిగి ఉంటుంది. షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. అయితే ఈ పండు జ్యూస్ తాగకుండా కొరికి తినడం ఉత్తమం. ఎందుకంటే జ్యూస్ తాగితే ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువుగా ఉండే ఫ్రూట్స్‌లో పీర్స్ ఒకటి. గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఉండవు. 3.కివి: దీనిలో సీ విటమిన్ పుష్కలంగా ఉండటంతో పాటు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని షుగర్ పేషెంట్స్‌కు బెస్ట్ ఫ్రూట్‌గా చెప్పవచ్చు. ఇది కూడా గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువుగా ఉండే పండ్లలో ఒకటి. సంవత్సరం అంతా కివి అందుబాటులో ఉంటుంది.అందుకే మీ డైట్లో కచ్ఛితంగా దీనిని భాగంగా చేసుకోండి. 4. యాపిల్స్: దీని గురించి చెప్పాలంటే రోజు ఒక యాపిల్ తినడం ద్వారా డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చు అనే నానుడి ఉండనే ఉంది. దీని ద్వారా యాపిల్‌లో ఆరోగ్యం కోసం ఉపయోగపడే ఎన్ని పోషకాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనిలో చాలా తక్కువ కొలిస్ట్రాల్ ఉంటుంది. తక్కువ కాలరీలు ఉంటాయి. ఎక్కువ ఫైబర్స్ ఉంటాయి. షుగర్ లెవల్స్ పెంచే కారకాలు దీనిలో చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఎతో పాటు సోడియం లాంటి సూక్ష్మ పోషకాలు కూడ పుష్కలంగా ఉంటాయి. అందుకే యాపిల్‌ను మీ డైట్లో భాగంగా మార్చుకోండి. 5.బెర్రీస్: ఇక మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన ఫ్రూట్స్‌లో బెర్రీస్ ముందు వరుసలో ఉంటాయి. తీయగా ఎంతో రుచికరంగా ఉండే ఈ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వుండి షుగర్ లెవల్స్ పెరగకుండా కంట్రోల్చేస్తాయి. అయితే వీటిని కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలతో కలిపి తీసుకుంటే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. అందుకే వీటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: షుగర్‌తో డిప్రెషన్.. జాగ్రత్త -
బెస్ట్ స్టూడెంట్.. జామకాయలు అమ్ముతూ..
సాక్షి, సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్): ఆమె ఉన్నతమైన కుటుంబంలో పుట్టింది. నీట్లో మంచి ర్యాంక్ సాధించింది. అయినా... తమ తోటలో పండే ఆర్గానిక్ జామకాయలను విక్రయిస్తూ ఆదర్శంగా నిలిచింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మాచర్ల రామన్న బర్కత్‌పురలో నివాసముంటున్నారు. ఈయన కూతురు అశ్రిత. తల్లి టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తుంది. డబ్బుకు ఎలాంటి లోటు లేదు అయినప్పటికి అశ్రిత ఏ విధమైన బిడియం లేకుండా బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యపార్కు ముందు ఆర్గానిక్ జామకాయలు విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. అశ్రిత ఇటీవల వెలుపడ్డ నీట్ పరీక్షా ఫలితాల్లో 843వ ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకుంది. ఎటువంటి బిడియం లేకుండా పార్కుల ముందు తమతోటలో కాసే జామకాయలను విక్రయిస్తూ మన్నన పొందుతోంది. రోజూ ఏదో ఒక పార్కు ముందు జామకాయలను విక్రయిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అశ్రితకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. చదవండి: నీట్ స్టేట్ ర్యాంకులు విడుదల -
మానవత్వాన్ని చాటుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం లంచ్ ముగించుకొని సీఎం కేసీఆర్ తన వాహనంలో కొండ కిందికి వెళ్తున్న సమయంలో దారికి కోతులు అడ్డురావడంతో కారుదిగి వాటికి అరటిపండ్లు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన యాదాద్రి టూరిజం హోటల్ వద్ద జరిగింది. (స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత వినోద్ కుమార్‌దే) -
వారంలో ఏడు కిలోల బరువు తగ్గాలంటే..
ఎంతోమందిని వేధించే సమస్య అధిక బరువు. అందంగా, నాజుగ్గా కనిపించాలనుకునే వాళ్లు అధికం. కానీ వారి శరీర బరువు ఆ విధంగా ఉండనివ్వకపోవచ్చు. బరువు తగ్గడం కోసం కఠినమైన డైట్ పాటిస్తూ ఎంతో కాలం శ్రమిస్తున్న వారు చాలామందే ఉన్నారు. అయితే అతి తక్కువ కాలంలో ఉత్తమ ఫలితం అందే చిట్కా ఉంటే ఇక అంతకంటే మహా భాగ్యం మరోకటి ఉండదని చాలా మంది అనుకుంటారు. అయితే ఈ చిట్కా వారి కోసమే. ఇలా చేయడం వల్ల కేవలం ఏడంటే ఏడు రోజుల్లోనే ఏడు కిలోల బరువు తగ్గవచ్చు. ఇందుకు జీఎమ్ (జనరల్ మోటర్స్) ఏడు రోజుల డైట్‌ను ఫాలో అయితే సరిపోతుంది. అదెలాగో తెలుసుకుందాం. జనరల్ మోటార్స్ కార్పొరేషన్ మొదట వారి ఉద్యోగులను మంచి ఆరోగ్యంతో ఉంచడానికి ప్రతిపాదించిన ఈ ఆహార నియమం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇలాంటి మెరుగైన ఫలితాలను అందిస్తున్న వారికి అనేక మంది కృతజ్ఞతలు తెలుపుతున్నారు. డే 1: ఏడు రోజుల డైట్ నియమాన్ని పాటించే ముందు పండ్లను అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో నారింజ, యాపిల్, పుచ్చకాయ, బేబీ కార్న్ వంటి తాజా పండ్లతో రోజును ప్రారంభించాలి. అయితే ఈ పండ్లలో సపోటా,కివీ, సీతాఫలం, ద్రాక్షను మినహాయించాలి. ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు తీసుకోవాలని జీఎమ్ వైబ్‌సైట్ సూచిస్తోంది. అయితే రోజంతా కేవలం పండ్లను మాత్రమే తినడం వల్ల శరీరంలో అలసట, నీరసం, ఆకలి బాధలు వంటివి పెరుగుతాయి. అయినప్పటికీ వాటన్నింటినీ భరించి పోరాటం చేస్తే తప్పకుండా ఉత్తమ ఫలితం అందుతుంది. డే 2: రెండో రోజు డైట్లో భాగంగా ఆహారాన్ని చేర్చవచ్చు. ఈ రోజు కూరగాయలను తీసుకోవచ్చు. ఉదయం పూట చిలకడ దుంపను తీసుకున్న తర్వాత ఆకుకూరలు ఆహారంగా చేర్చుకోవాలి. ఇందులో ఎలాంటి పరిమితి ఉండదు.ఎంతైనా ఉపయోగించవచ్చు. డే 3: మొదటి, రెండవ రోజు స్వీకరించిన పండ్లు, కూరగాయలు రెండింటినీ తినవలసి ఉంటుంది. ఎందుకంటే మరుసటి రోజు పూర్తి స్థాయి ఆహారాన్ని తీసుకునేందుకు సహకరిస్తుంది. డే 4: ఎనిమిది అరటిపండ్లు, 3 గ్లాసుల విరిగిన పాలు (skimmed milk) తీసుకోవాలి. ఇది నాలుగో రోజులో తీసుకోవాల్సిన నియమాలు. డే 5: ఇప్పటి వరకు మితపరమైన ఆహారం స్వీకరించిన తరువాత ఇప్పుడు కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. అయిదవ రోజు ఒక పూట అర కిలో చికెన్, మరో పూట 6 టమోటాలను భోజనంగా తీసుకోండి. డే 6: ఇక ఆరవ రోజు బ్రౌన్ రైస్, వెజిటేబుల్స్‌తో మరో అర కిలో చికెన్ తీసుకోవాలి. కాని ఈసారి టమోటాలు, బంగాళాదుంపలు ఉపయోగించొద్దు. డే 7: ఈ రోజు బ్రౌన్ రైస్, పండ్ల రసంతోపాటు ఆకుకూరలు ఆహారంగా తీసుకోవాలి. ఇది చివరి రోజు కాబట్టి శరీరం తేలికగా ఉన్నట్లు, సన్నగా అయినట్లు అనుభూతి చెందుతారు. అంతే ఇక ఇది పనిచేస్తుంది. ఈ రోజుల్లో ఓవర్హైప్డ్ ఫ్యాడ్ డైట్స్లా కాకుండా ఇది వాస్తవంగా ఫలితాలను అందిస్తుంది. అంతేగాక చర్మం మరింత మెరుస్తుంది. గట్టిగా తలుచుకుంటే ఏడు రోజుల్లో ఏడు కిలోలు తగ్గడం పెద్ద కష్టంగా అనిపించదు. అయితే ఈ డైట్ వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఈ నియమం ఇలా చేసే క్రమంలో మన ముఖంపై అలసట కనిపిస్తోంది. అలాగే ఈ ఏడు రోజుల వేగవంతంగా బరువు తగ్గడం కోసం మనకు నచ్చిన ఆహారానికి దూరంగా ఉండాలి. శరీరంలో అలసట, నీరసం వంటివి ఏర్పడతాయి. అంతేగాక జీవితమంతా కేవలం పండ్లు, కూరగాయలు, బ్రౌన్ రైస్,చికెన్ మీదే ఆధారపడి జీవించలేము. ఒక వేళ రోజువారీ పాత ఆహారానికి అలవాటు పడితే మన బరువు కూడా తిరిగి వచ్చేస్తుంది. ఈ నిర్ధిష్ట ఆహారం తీసుకోవడం వల్ల మనం రోజూ పనులు చేయడం కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే అవసరం కంటే తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల జీవక్రియను నెమ్మదిస్తుంది. దీని ఫలితంగా భవిష్యత్తులో బరువు తగ్గడం కష్టమవుతుంది. చివరగా చెప్పే మాట ఏంటంటే అత్యవసర సమయాల్లో ఏదైనా ఫంక్షన్లకు హాజరు కావాలనుకున్నప్పుడు ఈ ఏడు రోజుల నియమం పాటిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. కానీ ఈ డైట్‌ను ఎల్లవేళలా పాటించడం మాత్రం ఆరోగ్యానికి సరైనది కాదు. నోట్: జీఎం డైట్ సౌజన్యంతో .. -
ఎవర్గ్రీన్ ఆహారంగా తునికి పండ్లు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం:ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఆహారం తీసుకున్నా శరీరానికి అవసరమయ్యే పోషకాల కంటే రసాయనాలే ఎక్కువగా ఉంటున్నాయి. చీడపీడల ¯నుంచి కాపాడుకోవడంతో పాటు అధిక దిగుబడి కోసం కూరగాయాలు, పండ్లు తదితర పంటలకు ఎరువులు, పురుగు మందులను విచ్చలవిడిగా వేస్తున్నారు. అయితే గత్యంతరం లేక ఎక్కువ మంది వీటినే వినియోగిస్తున్నారు. కానీ అటవీ ఫలాలు మాత్రం స్వచ్ఛంగా లభిస్తున్నాయి. ఇందులో అత్యంత పోషక విలువలు కలిగిన, అప్పటికప్పుడు తినదగిన తునికి పండ్లు (టెండూ ఫ్రూట్) ప్రస్తుతం జిల్లాలో భారీ గానే లభిస్తున్నాయి. ఎవర్ గ్రీన్ అటవీ ఆహారంగా ఈ పండ్లకు పేరుంది. జిల్లాలోని పలువురు గిరిజనులు, గిరిజనేతరులు ఈ పండ్లను చాలా ఇష్టంగా తింటారు. వీటి సేకరణకు ప్రత్యేకంగా అడవుల్లోకి వెళుతుంటారు. ఒక్కో చెట్టు ఏడాదికి ఐదువేల కాయలు కాస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో లభించే ఈ కాయలను వరిగడ్డి లేదా ఇసుకలో మాగబెడితే పండుతాయి. మైదాన ప్రాంతాల్లో తాటిముంజలు ఎంత సహజంగా ఉంటాయో.. అడవిలో లభించే తునికి పండ్లు అంతకన్నా బాగుంటాయని గిరిజనులు చెబుతున్నారు. వీటిని కోతులు, వివిధ రకాల జంతువులు సైతం ఇష్టంగా తింటాయి. సేకరించి అమ్ముకుంటాం ప్రతి సంవత్సరం తునికి కాయలు సేకరిస్తున్నా. గిరిజ నులంతా ఈ కాయలను తినేందుకు ఉవ్విళ్లూరుతారు. కొన్ని మేము తిని, మిగిలినవి అమ్ముకుంటాం. ఈ సీజన్లో తునికి కాయలు కొనుగోలు చేసేందుకు చాలామంది ఎదురు చూస్తుంటారు.– మైత ఎర్రక్క, కరకగూడెం ఇష్టంగా సేకరిస్తాం తునికి పండ్లు అంటే మాకు చాలా ఇష్టం. ఈ కాయలను సేకరించి వరిగడ్డిలో మాగబెట్టుకుంటాం. పండిన వెంటనే తింటాం. ఇవి ఎండిపోయినా మంచి రుచిగా ఉంటాయి. – కొమరం సింధురాణి, కరకగూడెం పోషకాలు ఎక్కువ తునికి పండ్లు స్వచ్ఛమైనవి. గాలికి కిందపడినా ఇబ్బంది ఉండదు. సపోటా పండులో వలె గుజ్జు ఉంటుంది. ఈ పండ్లలో ఏ, సీ విటమిన్లు ఎక్కువ. ఇవి తింట్లు కడుపులో పుండ్లు ఉంటే తగ్గుతాయి. రక్తం శుభ్రపడుతుంది. – దామోదర్‌రెడ్డి, వైల్డ్‌లైఫ్ ఎఫ్డీఓ -
రూ. 300 కు ఆరు రకాల పండ్ల కాంబో ప్యాక్’
సాక్షి, హైదరాబాద్ : కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలకు ఇంటి వద్దకే పండ్లను అందించే ప్రయోగం బాగుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. మూసాపేటలోని వాక్ ఫర్ వాటర్ పండ్ల ప్యాకింగ్ కేంద్రాన్ని శనివారం మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి వద్దకే పండ్ల కార్యక్రమానికి ప్రజల అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. జంటనగరాలలో ఇప్పటివరకు 71 వేల కుటుంబాలకు రైతుల నుంచి 11 వందల 25 టన్నుల పండ్ల సరఫరా జరిగినట్లు తెలిపారు. మరిన్ని నాణ్యమైన సేవల కోసం తపాలశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. (ఆ విషయంలో ప్రభుత్వం విఫలమైంది: బండి సంజయ్ ) వాక్ ఫర్ వాటర్, తెలంగాణ మార్కెటింగ్‌శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ప్రతి ఒక్కరూ 5 కిలోల బత్తాయి, మామిడి పండ్లు తీసుకుంటే ఉత్పత్తిలో 50 శాతం ఇక్కడే వినియోగమవుతుందన్నారు. రూ. 300 కు ఆరు రకాల పండ్ల కాంబో ప్యాక్ తో పాటు, రూ.300 కు 5 కిలోల పండ్లు, సేంద్రీయ, ప్రత్యేక రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉంటున్నాయన్నారు. 88753 51555 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో అందతాయని మంత్రి తెలిపారు. (ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్) -
ఇంటికే పండ్లు కార్యక్రమానికి పెరుగుతున్న జనాదరణ
సాక్షి, హైదరాబాద్ : వాక్ ఫర్ వాటర్, తెలంగాణ మార్కెటింగ్‌శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటికే పండ్ల కార్యక్రమానికి జనాదరణ పెరుగుతోంది. ఫోనుకాల్స్, ఆన్లైన్లో ఆర్డర్లు పోటెత్తుతున్నాయి. నాణ్యత బాగుండడం, తక్కువ ధరకావడంవల్ల పండ్లు కావాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. సంబంధిత వెబ్‌సైట్‌కి ఇప్పటికి 26 లక్షల హిట్స్ రాగా... ఇప్పటి వరకు వచ్చిన లక్షన్నర ఆర్డర్లలో... 65 వేలు సరఫరా చేశారు. డెలివరీ వేగవంతం చేసేందుకు తపాలశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు. లాక్డౌన్ వేళ దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రజల ఇళ్ల వద్దకే తాజా పండ్లు సరఫరా చేస్తున్నందున... ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డిని నగరవాసులు ప్రశంసిస్తున్నారు. ఇటు రైతులు అటు వినియోగదారులకి ఏకకాలంలో మంచి చేస్తున్నారంటూ కొనియాడుతున్నారు. ఈ కిట్‌లో రూ.300 కు ప్రజల ఇంటి వద్దకే మామిడి(1.5 కేజీ), బొప్పాయి (3 కేజీలు), నిమ్మ(12కాయలు), పుచ్చ(3 కేజీలు), బత్తాయి(2 కేజీలు), సపోట(1 కేజీ) పండ్ల డెలివరీ చేస్తున్నారు. 88753 51555 నంబర్‌కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే ఇంటివద్దకే పండ్లు అందిస్తున్నారు. ( ‘సరిలేరు’ తర్వాత మహేశ్ చిత్రం ఇదే! ) ప్రజాదరణ, అధికారుల సహకారంతో... ఇంటికే పండ్ల కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోందని వాక్ ఫర్ వాటర్ ఛైర్మన్ ఎం. కరుణాకర్‌రెడ్డి తెలిపారు. నలుమూలల పంపిణీకోసం తపాలశాఖ రంగంలోకి దిగుతోందన్నారు. పండ్లు తీసుకున్న వారిలో 98 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని... నాణ్యత, పరిమాణం బాగున్న కారణంగా మళ్లీ మళ్లీ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రవాస తెలంగాణ పౌరులు... తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకి పండ్ల సంచి అందించాలంటూ ఆన్లైన్లో పెద్ద ఎత్తున వినతులు పంపిస్తున్నారని చెప్పారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు ఫోన్లు చేసి తమకి కూడా పండ్లు కావాలని కోరుతున్నట్లు వెల్లడించారు. సర్కార్ పిలుపు మేరకు కొందరు దాతలు స్పందించి పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, అనాధలకి పండ్లు వితరణ చేస్తున్నారని చెప్పారు. కరోనాతో దేశంలోని ప్రధాన రంగాలు స్తంభించిన సమయంలో రైతులని ఆదుకునేందుకు సత్ సంకల్పంతో చేపట్టిన ప్రయోగానికి జనామోదం లభించడం సంతోషంగా ఉందన్నారు. (ఇర్ఫాన్ భార్య సుతప భావోద్వేగ పోస్టు) -
భలే డిమాండు.. సరఫరా కూడా మెండు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లను అధికంగా తీసుకోవాలన్న ప్రభుత్వ సూచనల నేపథ్యంలో వాటి వినియోగం పెరిగింది. లాక్డౌన్ కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఫ్రూట్ జూస్, ఐస్‌క్రీం పార్లర్లు మూతబడ్డప్పటికీ డిమాండ్ మాత్రం సాధారణ రోజుల మాదిరే ఉంటోంది. మొబైల్ వాహనాల ద్వారా ప్రజల దగ్గరకే పండ్లను చేర్చడంతో పాటు కొత్తగా ఇంటికే పండ్ల సరఫరాతో మంచి గిరాకీ ఉంటోంది. పెరిగిన లభ్యత.. మెరుగైన కొనుగోళ్లు.. రాష్ట్రంలో బత్తాయి, మామిడి, నిమ్మ, బొప్పాయి, జామ, దానిమ్మ వంటి పండ్ల తోటల సాగు 4.40 ఎకరాల్లో సాగవుతుండగా, ప్రస్తుతం బత్తాయి, మామిడి పంటల కోతలు పెరిగాయి. దీంతో వీటి లభ్యత మార్కెట్లో విపరీతంగా పెరిగింది. భారతీయ వైద్య పరిశోధనా సంస్థ (ఐసీఎంఆర్) సిఫార్సుల మేరకు ప్రతీ మనిషి రోజుకు 100 గ్రాముల పోషక విలువలు గల పండ్లను తీసుకోవాలి. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రతీ మనిషి నెలకు 3 కిలోల పండ్లు తినాల్సి ఉంది. ఈ లెక్కన 1.20లక్షల మెట్రిక్ టన్నుల మామిడి, బత్తాయి తినాల్సి ఉంటుందని అంచనా వేశారు. మన మార్కెట్లో ఏప్రిల్, మే నెలలో 70వేల టన్నుల బత్తాయి, మామిడి 5 నుంచి 6 లక్షల మేర ఉత్పత్తి ఉంటోంది. హైదరాబాద్ మార్కెట్లోకి మామిడి ప్రతి రోజూ 600 నుంచి 1000 టన్నుల మేర వస్తోంది. బత్తాయి, వాటర్‌మిలన్, దానిమ్మ, ద్రాక్ష ఇతర రకాల పండ్లు రోజుకు 22వేల క్వింటాళ్లకు మించి వస్తున్నాయి. వాటి లభ్యత పెరగడంతో వీటిని వినియోగదారులకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 280 మొబైల్ రైతు బజార్ల ద్వారా 620 ప్రాంతాల్లో అమ్మకాలు చేపట్టారు. ఇవి విజయవంతమయ్యాయి. వీటి ద్వారా రోజుకు 15వేలకు పైగా వినియోగదారులు కొనుగోళ్లు చేస్తున్నారు. ఇంటికే సరఫరాకు శ్రీకారం... దీనికి అనుబంధంగా మార్కెటింగ్ శాఖ ఇంటికే పండ్ల సరఫరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 8875351555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు, రూ.300 విలువ చేసే మామిడి (1.5కిలోలు), బొప్పాయి(3 కిలోలు), నిమ్మ (12 కాయలు), బత్తాయి (2 కిలోలు), సపోటా (కిలో) పండ్లు డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే 35వేల మంది వినియోగదారులు ఈ సౌలభ్యాన్ని వినియోగించుకున్నారని మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. రోజుకు 1,500 నుంచి 2వేల కాల్స్ వస్తున్నాయని, 78 గంటల్లో వీటిని సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. గడ్డిఅన్నారం మార్కెట్ వికేంద్రీకరణ.. ఇక గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేయగా, వికేంద్రీకరణ చేసేందుకు నిర్ణయించింది. సరుకు రవాణా వాహనాలతో ఇక్కడ భౌతిక దూరం పాటించే అవకాశాలు లేకపోవడం, మహారాష్ట్ర నుంచి ద్రాక్ష, బత్తాయి, మామిడి వాహనాల నుంచి పండ్లు దించేందుకు హమాలీలు వెనకాడటం, దీన్ని మూసివేసి ఇతర ప్రాంతాలకు తరలించాలని స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో దీన్ని బుధవారం నుంచి మూసివేశారు. ఈ మార్కెట్‌కు ప్రతిదినం 18వేల నుంచి 20వేల క్వింటాళ్ల వివిధ రకాల పండ్లు వస్తుంటాయి. ఇప్పుడు సోమవారం నుంచి మామిడి మార్కెట్‌ను కోహెడకు, బత్తాయి, సపోటా, కమలాపండ్లను ఎల్బీనగర్ సమీప విక్టోరియా హౌస్ ప్రాంతానికి, వాటర్ మిలన్, కర్భూజ పండ్లను స్థానిక రోడ్డుమీద పెట్టి అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో కొనుగోళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. -
రూ.100కే ఐదు పండ్ల కిట్
సాక్షి, మచిలీపట్నం: కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్డౌన్ ప్రభావంతో విలవిల్లాడుతున్న ఉద్యాన రైతుకు ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే కోతల దగ్గర నుంచి ఎగుమతి వరకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం తాజాగా మరో అడుగుముందుకేసి స్థానిక మార్కెట్లలో పండ్ల అమ్మకాలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టింది. ♦ ప్రస్తుతం నెలకొన్న పరిíస్థ్ధితుల్లో ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు రైతుకు కాసింత లాభదాయకంగా ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకోసం గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుకు–వినియోగ దారునికి మధ్యఉద్యానవన శాఖ వారధిలా వ్యవహరిస్తోంది. రూ.252లకు పైగా విలువైన పండ్లను కేవలం రూ.100లకే వినియోగదారులకు అందించే ఏర్పాట్లు చేసింది. కిలో రూ.50– 60ల విలువైన రెండు కిలోల బంగినపల్లి మామిడి పండ్లు, కిలో రూ.40ల విలువైన రెండు కిలోల బొప్పాయి పండ్లు, కిలో రూ.20ల విలువైన జామ, కిలో 8లు పలికే కేజీన్నర అరటితో కిలో రూ.40ల విలువైన నిమ్మకాయలు కలిపి మొత్తం ఏడున్నర కిలోల పండ్ల కిట్‌ను కేవలం రూ.100లకే అందజేయనున్నారు. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతాలతో పాటు ఉన్నత, ఎగువ మధ్య తరగతి ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి ఈ కిట్లను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.250లకే ఐదు కిలో బంగినపల్లి ♦ మేలురకమైన బంగినపల్లి మామిడి పండ్లు ఐదు కిలోలు కేవలం రూ.250లకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో పండు కనీసం 300 గ్రాముల సైజులో ఉండే నెంబర్ వన్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ కల్గిన మామిడి పండ్లను నేరుగా వినియోగదారునికి అందజేయనున్నారు. ♦ రైతు వద్ద సేకరించి నూజివీడులోని ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హోంలోని రైబనింగ్ చాంబర్లో సహజ సిద్ధంగా మూడురోజుల పాటు మగ్గపెట్టిన మామిడిపండ్లను ప్యాకింగ్ చేసి రెడీ టూ ఈట్ పద్ధ్దతిలో అందజేస్తారు. తొలుత విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ తదితర పట్టణ ప్రాంతాల్లో అపార్టుమెంట్లు ఎక్కుగా ఉన్న చోట ఈ కిట్లను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికంగా ఉండే ఉద్యాన శాఖ సిబ్బంది జిల్లాలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని అపార్టుమెంట్లు, విల్లాలు, గేటెడ్‌కమ్యూనిటీ ప్రాంతాలున్న చోటకు వెళ్లి ఈ కిట్ల కోసం వివరిస్తారు. అక్కడ నివాసితుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి వాటిని నేరుగా వారి ఇళ్లకే సరఫరా చేస్తారు. ఉద్యాన రైతులను ఆదుకునేందుకే... ఎగుమతుల్లేక ఇబ్బందిపడుతున్న ఉద్యాన రైతులను ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వాదేశాలతో ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. మధ్యలో ఎలాంటి దళారీలకు ఆస్కారం లేకుండా రైతు నుంచి నేరుగా వినియోగదారునికి నాణ్యమైన పండ్లను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టాం. సోమవారం నుంచి విజయవాడతో పాటు ప్రధాన పట్టణాల్లో కనీసం 100కిట్ల చొప్పున అందుబాటులో ఉంచుతున్నాం.ఆసక్తి గల వారు నూజివీడు హార్టికల్చర్ ఆఫీసర్ ఎం. రత్నమాల 7995086891ను ఫోన్లో సంప్రదిస్తే చాలు కావాల్సిన కిట్లు నేరుగా పంపిణీ చేస్తాం. దయాకరబాబు, ఏడీ, ఉద్యానవన శాఖ -
ఒక్క మిస్డ్ కాల్.. ఇంటికే పండ్లు
లక్డీకాపూల్ : ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే..ఇంటి వద్దకే పండ్లు సరఫరా చేస్తున్న ‘వాక్ ఫర్ వాటర్ సంస్థ’ ప్రయత్నాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు. రైతులను ప్రోత్సాహించే దిశగా జరుగుతున్న ఈ ప్రక్రియకు ప్రజలు చేయూత నివ్వాలన్నారు. ప్రజలు కొనుగోలు చేసే ప్రతి పండు రైతుక అండగా నిలవటంలో భాగమన్నారు. లాక్డౌన్ కారణంగా చేతికి వచ్చిన పండ్లు తోటల్లోనే మగ్గిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు, వినియోగదారులకు వారధిగా నిలుస్తున్న ‘వాక్ ఫర్ వాటర్’ వ్యవస్ధాపకులు కరుణాకర్ రెడ్డి కృషిని మంత్రి కొనియాడారు. -
రూ.100కే అయిదు రకాల పండ్లు..
సాక్షి, తూర్పుగోదావరి : ఉద్యానవన శాఖ, మెప్మా ద్వారా పండ్లను కిట్ల రూపంలో ప్రజలకు చౌకగా అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడలో మంగళవారం రూ. 100లకే అయిదు రకాల పండ్లను డోర్ డెలీవరి సదుపాయాన్ని మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యానవన రైతులకు మేలు జరిగేలా.. వినియోగదారులకు చౌకగా పండ్లు అందించేలా కిట్ల రూపంలో డోర్ డెలీవరీ చేస్తున్నామని తెలిపారు. (విషమంగా కిమ్ జోంగ్ ఆరోగ్యం..! ) ముందుగా రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలో వీటిని ప్రారంభించి త్వరలోనే అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. మామిడి పండ్ల సీజన్ మొదలైన నేపథ్యంలో మామిడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ నుంచి ఇతర రాష్ట్రాలకు140 టన్నులు, తిరుపతి నుంచి 1.2 టన్నుల మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేశామని తెలిపారు. కరోనా వంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ వంగా గీత అన్నారు. ధరలు పెరగకుండా వినియోగదారులను ఆదుకుంటున్నారని తెలిపారు. రూ. 100లకే అయిదు రకాల పండ్లు సదుపాయాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. (కరోనా: బెజవాడంతా రెడ్‌జోన్ ) -
అన్ని జిల్లాల్లో.. రూ.100కే పండ్లకిట్
సాక్షి, అమరావతి: ఫ్రూట్ కిట్ల విక్రయాన్ని అన్ని జిల్లాలకూ విస్తరించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కలెక్టర్లకు శనివారం లేఖలు రాశారు. కర్నూలు జిల్లాలో శుక్రవారం ప్రయోగాత్మకంగా అమలు చేసిన రూ.100కే పండ్ల కిట్ అమ్మకం విజయవంతమైనందున రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. లేఖలో అంశాలివీ.. స్థానికంగా దొరికే ఏవైనా ఐదు రకాల పండ్లను కిట్ రూపంలో తయారు చేసి రూ.100 చొప్పున విక్రయించాలి. ఇందుకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవో), ఉద్యాన శాఖ సహకారాన్ని తీసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు 350 గ్రాముల కూరగాయలు, వంద గ్రాముల పండ్లు తీసుకోవాలి. ఆ సూత్రం ఆధారంగా కరోనా వైరస్ వ్యాధి నివారణకు ఉపయోగపడే విటమిన్ ఏ, సీ ఉండే పండ్లను పంపిణీ చేయాలి. అనూహ్య స్పందన ‘లాక్డౌన్ సమయంలో.. రైతు సేవలో ఎఫ్‌పీవోలు’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన వార్తకు వివిధ వర్గాల నుంచి విశేష స్పందన వచి్చంది. వందలాది మంది ఫోన్లు చేసి పండ్ల కిట్ల పంపిణీలో పాలు పంచుకుంటామని చెప్పినట్లు ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ పి.హనుమంతరావు తెలిపారు. అపార్ట్మెంట్ అసోసియేషన్లు, కాలనీ సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీలు, పండ్ల వ్యాపారులు, ఏజెంట్లు, పండ్ల రైతులు, వెండర్లు.. ఇలా అన్నివర్గాల నుంచి స్పందన రావడంతో వాళ్లను సమీపంలోని ఎఫ్‌పీవోలకు అనుసంధానం చేశామన్నారు. ఇతర జిల్లాలకూ విస్తరిస్తున్నాం ప్రజల వద్దకే పండ్ల పంపిణీ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచి్చనందున ఇతర జిల్లాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదురి తెలిపారు. ఆయన ఏం చెప్పారంటే.. గుంటూరు, విజయనగరం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పండ్ల కిట్ల పంపిణీ ప్రారంభమైంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఈ పనిలో నిమగ్నమయ్యాయి. చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, తూర్పు, పశి్చమ గోదావరి జిల్లాల్లో వెండింగ్ వ్యాన్ల ద్వారా ఉద్యాన శాఖ సిబ్బంది అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్‌లు, సొసైటీల వద్ద ప్రభుత్వం అనుమతి ఇచి్చన సమయంలో విక్రయిస్తున్నారు. -
ఫోన్ కొట్టండి..పండ్ల ప్యాక్ పట్టండి
-
ఫోన్ కొట్టు..పండ్లు పట్టు
లక్డీకాపూల్ (హైదరాబాద్): లాక్డౌన్ నేపథ్యంలో మార్కెట్‌కి వెళ్లి కోరిన పండ్లు కొనుక్కోలేని వారికి వాటిని ఇంటివద్దకే అందించే సదుపాయాన్ని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇంటివద్దకే పండ్ల సరఫరా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రక్రియకు వినియోగదారుల నుంచి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. జంటనగరాల్లో కాలనీలు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు 30 ప్యాక్‌లు చొప్పున 7330733212 కాల్ సెంటర్‌కు ఫోన్లో ఆర్డర్ చేస్తే చాలు..కోరిన పండ్లు నేరుగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరహా సరఫరాలో పండ్ల ధరలు ఇలా ఉన్నాయి..రూ.300కు మామిడి పండ్లు..1.5 కిలోలు, బొప్పాయి 3 కిలోలు, సపోట 1 కిలో, బత్తాయి 2.5 కిలోలు, డజన్ నిమ్మకాయల ప్యాక్, కలంగిరి 4 కిలోలు చొప్పున సరఫరా చేస్తున్నారు. ఉద్యాన పంటల రైతులను ఆదుకునేందుకు చేపట్టిన ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మొబైల్ రైతు బజార్ల ద్వారా రోజుకు 550 కేంద్రాలలో ప్రజల వద్దకు పండ్లు, కూరగాయలను సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, రవి కుమార్, జేడీ శ్రీనివాస్, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఇంటి వద్దకే పండ్ల సరఫరా ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వారానికి నగరంలోని 3,500పై చిలుకు ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్టు చెప్పారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతుల నుంచి కొనుగోలు చేసిన పండ్లను సేకరిస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు వివరిస్తున్నారు. -
విషాలను వదిలేద్దామిలా!
మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంతగా కలుషితమై ఉందో మనకు తెలియంది కాదు. అంతేనా... మనం రోజూ తినే పదార్థాల్లోనూ ఎన్నో రకాల హానికరమైన రసాయనాలుంటాయి. ఇలా మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి... ఇలా ప్రతి చోటా ఏవో వ్యర్థ రసాయనాల కారణంగా మనం నిత్యం ఎంతో కొంత మనకు సరిపడని రసాయనాల బారిన పడుతూనే ఉంటాం. అయితే... ఈ విషపదార్థాల నుంచి బయటపడటం ఎలా? ఇలాంటి హాని చేసే పదార్థాలను మన ఒంట్లోంచి బయటకు పంపడాన్ని డీ–టాక్సిఫికేషన్ అంటారన్నది తెలిసిందే. ‘డి–టాక్స్’ అని సంక్షిప్తంగా వ్యవహించే ఈ ప్రక్రియ కోసం చాలామంది పెద్ద పెద్ద డీ–టాక్స్ సెంటర్లనూ, నేచర్ కేర్/ నేచర్ క్యూర్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అలాంటి కష్టమే లేకుండా ఇంట్లోనే స్వాభావిక పదార్థాలతో డీ–టాక్స్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. శరీరంలో విష పదార్థాలు చేరే మార్గాలివి ∙మన చుట్టూ ఉండే వాతావరణంలోకి దగ్గర్లో ఉండే పరిశ్రమల ద్వారా వెలువడే వ్యర్థాలు, మోటార్ కార్ల నుంచి వెలువడే కర్బన రసాయనాలతో గాలి కలుషితం అవుతుంది. ఆ గాలి పీల్చినప్పుడు మన ఒంట్లోకి విష రసాయనాలు చేరతాయి. గాలి కాలుష్యం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. డీజిల్ పొగ క్యాన్సర్ గడ్డలకు కారణమవుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది ∙అలాగే ఇవే పరిశ్రమలు నీళ్లలోకి వదిలే వ్యర్థాల ద్వారా నీళ్లు కలుషితమవుతాయి. ఇలాంటి పరిశ్రమలు కేవలం పొగమాత్రమే గాక... సీసం, పాదరసం వంటి హానికరమైన రసాయనాలను వెలువరిస్తూ... ఇటు గాలినీ, ఇటు నీళ్లనూ కలుషితం చేస్తుంటాయి ∙ఇక మనం రోజూ వాడే ప్లాస్టిక్ పదార్థాల ద్వారా కొన్ని హానికర రసాయనాలు మనలోకి చేరతాయి. ఉదాహరణకు ప్లాస్టిక్‌లో బిస్ఫినాల్ అనే విషపూరితమైన పదార్థం ఉంటుంది. మనం రోజూ నీళ్లు తాగడానికి ఉపయోగించే ప్లాస్టిక్ బాటిల్స్, భోజనం పెట్టుకునే లంచ్‌బాక్స్‌లు... ఎలాంటి ఎన్నో పదార్థాల ద్వారా ఈ బిస్ఫినాల్ మన ఒంట్లోకి చేరుతుంది ∙కలుషితమైన నీటిలో పెరిగే చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా కూడా మెర్క్యూరీ వంటి హానికర పదార్థాలు మన ఒంట్లోకి చేరుతుంటాయి ∙వీటితో కొన్నిరకాల మందులు, హార్మోన్లు, ఫాస్ట్ ఫుడ్స్, సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఉప్పు, చక్కెర కూడా శరీరాన్ని విషతుల్యం చేస్తుంటాయి. దుష్పరిణామాలివే... హానికరమైన పదార్థాలు మన ఒంట్లోకి తీసుకోవడం వల్ల మలబద్ధకం, తలనొప్పి, వీపునొప్పి, పొట్టనొప్పితో పాటు ఇతర గ్యాస్ట్రో ఎంటరాలజీ సమస్యలు, బరువు తగ్గటం, హైబీపీ (హైపర్ టెన్షన్), చర్మసంబంధ సమస్యలు, పెద్దపేగు క్యాన్సర్, ఊపిరితిత్తులు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల వంటి సమస్యలు తలెత్తుతాయి. డిటాక్స్ చేసుకోవడం ఎలా? మన శరీరంలో సహజసిద్ధంగానే డీటాక్సిఫికేషన్ ప్రక్రియ నిత్యం జరుగుతూనే ఉంటుంది. తొలుత మొదటి దశలో ఆహారనాళం బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. ఇలా చాలారకాల విషపూరిత పదార్థాలు శరీరంలోకి చేరకుండా చూసే యంత్రాంగం ఉంటుంది. ఆ దశను దాటుకుని ఏదైనా విషపూరిత పదార్థం శరీరంలోకి చేరితే దానిని కాలేయం విరిచేసి నీటిలో కరిగే పదార్థంగా మార్చి పంపుతుంది. అవి కిడ్నీలకు చేరి అక్కడినుంచి విసర్జితమవుతాయి. ఇదీ శరీరం తనకు తాను స్వాభావికంగానే (నేచురల్‌గా) డిటాక్సిఫై చేసుకునే ప్రక్రియ. అయితే శరీరం బయటకు పంపే దానికంటే మనం అదేపనిగా విషాలను ఒంట్లోకి చేరుస్తుంటే వాటన్నింటినీ బయటకు పంపించడంలో కాలేయం అలసిపోతుంది. అందుకే పైన మనం పేర్కొన్న విష పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండటంతో పాటు... స్వాభావికంగానే మన దేహం నుంచి టాక్సిన్స్‌ను తేలిగ్గా బయటికి పంపగల ఆహారం తీసుకోవడం మేలుచేస్తుంది. ఇది ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో దోహదపడుతుంది. డీటాక్సిఫికేషన్‌కు ఉపయోగపడే ఆహారాన్ని డీ–టాక్స్ డైట్ అంటుంటారు. తీసుకోవాల్సినవి... పచ్చిగానే తినదగ్గ కూరగాయలను సలాడ్స్ రూపంలో తీసుకోవాలి. తాజా పండ్లను, నట్స్నూ, పప్పుదినుసులను, తృణధాన్యాలను మన ఆహారంగా మార్చుకోవాలి ∙డీటాక్స్ డైట్లో భాగంగా ఆర్గానిక్‌గా పండించిన ఉత్పాదనలు ఉదా. బ్రౌన్‌రైస్, పండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు తీసుకోవాలి ∙డీటాక్స్ కోసం అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క వంటివి ఆహారపదార్థాలపై చల్లి వాడటం మేలు. పసుపు వంటి వాటిని మజ్జిగలో కొద్ది మోతాదులో కలుపుకుని తాగవచ్చు. ఇక్కడ పేర్కొన్న సుగంధ ద్రవ్యాలన్నీ నేచురల్ డీటాక్ఫిఫైయర్స్ కాబట్టి అవి దేహం నుంచి ఎన్నో మలిన రసాయనాలను తొలగిస్తాయి ∙రోజూ తగినంత నీటిని తాగాలి. రోజులో కనీసం మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి ∙చేపల్లోని చాలా పోషకాలు, ప్రోటీన్లు ఒంటికి మంచిది. వీటిని ఎక్కువగా తీసుకోవాలి. అయితే కలుషిత జలాల్లో పెరిగిన చేపలు మంచిది కాదు. వాటిలోని మెర్క్యూరీ వల్ల మళ్లీ మనలోకి విషాలు చేరే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ∙ఎక్కువ క్యాలరీలను విడుదల చేసే కూల్‌డ్రింక్స్, కోలా డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉంటూ, స్వాభావికంగానే నీటి పాళ్లు ఎక్కువగా ఉండే కొబ్బరిబొండాలు, పండ్లరసాలు, మజ్జిగ వంటివి తాగాలి. తీసుకో కూడనివి ∙ప్రాసెస్డ్ ఫుడ్స్ అని పేర్కొనే రంగుపూసిన, ఎక్కువ పిండి వంటి పదార్థాలను పూసినవీ, చక్కెరలు కలిపినవీ, ఉప్పు ఎక్కువగావేసిన వాటికి దూరంగా ఉండాలి. మన జీర్ణ వ్యవస్థ ప్రాసెస్డ్ ఆహారాన్ని అంత తేలిగ్గా గ్రహించదు. వాటి కారణంగా కొన్ని సేంద్రీయ రసాయనాలు వెలువడి అవి ఒంట్లో విషపదార్థాలుగా రూపొంది, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ∙డీటాక్సిఫికేషన్ కోసం వారంలో ఏదో ఒకరోజు ఎంచుకొనిగానీ లేదా ప్రతి పదిహేనురోజులకోసారిగానీ... ఆరోజున పైన పేర్కొన్న స్వాభావికమైన పదార్థాలను (నేచురల్ ఫుడ్స్) మాత్రమే తీసుకుంటూ ఉండేలా ఒక నియమాన్ని పాటించడం చాలా మేలు చేస్తుంది. ఇలా క్రమబద్ధంగా చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. కాలేయానికి కూడా తగిన విశ్రాంతి లభించి, భారం తగ్గి మళ్లీ మరింత శక్తిమంతంగా పనిచేస్తుంది. -
కార్బైడ్ నివారణ చర్యలు చెప్పండి
సాక్షి, హైదరాబాద్: రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెట్టి పండ్లుగా చేసి విక్రయించే వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని, ప్రజల ప్రాణాలతో ఆడుకునే అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలను వివరించాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాల్షియం కార్బైడ్ ద్వారా కాయల్ని కృత్రిమ పద్ధతిలో మట్టి పండ్లుగా చేయడంపై 2015లో పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు గతంలోనే ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ జరిపింది. ఈ ‘పిల్’లో పలు వివరాలు కోరుతూ ఇటీవల ధర్మాసనం ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. కార్బైడ్ వినియోగించిన ఎంతమంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారో, ఎంతమందికి శిక్షలు పడ్డాయో, విచారణలో ఎన్ని కేసులు ఉన్నాయో, కేసుల్లో శిక్ష పడకుండా ఎంతమంది బయటపడ్డారో వంటి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార భద్రతా చర్యలు తీసుకునేందుకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, గెజిటెడ్ ఆఫీసర్లు ఎంతమంది కావాలి, ఇప్పుడు ఆ పోస్టుల్లో ఎంతమంది ఉన్నారు, మిగిలిన పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారు వంటి వివరాలను కౌంటర్ ద్వారా తెలియజేయాలంది. ఆహార భద్రతాధికారుల పోస్టులు 80 అవసరమైతే ఇప్పటి వరకూ వాటిని ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించింది. 256 కేసులు నమోదు చేస్తే కేవలం 19 మందికే శిక్షలు పడ్డాయంటే మిగిలిన కేసులు పరిస్థితి ఏమిటని నిలదీసింది. 2018 ఆగస్టు తర్వాత కార్బైడ్ వినియోగం చేయడం లేదని, ప్రమాదకరం కాని మరో రెండు రకాల రసాయనాలతో కాయల్ని మగ్గబెడుతున్నారని ప్రభుత్వం చెప్పడం కాదని మండిపడింది. రాష్ట్రంలో ఇథిలిన్ చాంబర్లు 74 ఏర్పాటు చేశామంటున్నారేగానీ అవి సిద్ధంగా ఉన్నాయో లేదో ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించింది. మరో 36 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. జిల్లాల వారీగా కేసుల స్థితిగతులను తెలియజేస్తామన్నారు. అందుకు అనుమతి ఇచ్చిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
ఇదో చిత్రమైన అలర్జీ
మీకు తెలుసా? కొందరిలో కొన్ని పదార్థాలతో వచ్చే అలర్జీలు మనకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. ఇందుకు ఓ ఉదాహరణ అరటి, కీవీ పండ్ల వల్ల వచ్చే అలర్జీ. మనకు చిత్రంగా అనిపించినా ఇది వాస్తవం. సాధారణంగా కొందరిలో రబ్బర్ ఉత్పాదనలనుంచి అలర్జీ వస్తుంటుంది. ఉదాహరణకు చేతికి వేసుకునే రబ్బర్ గ్లౌవ్స్, షూస్, మాస్కులు, స్లిప్పర్ల వంటి ఎన్నెన్నో వస్తువులతో ఈ తరహా అలర్జీ కనిపిస్తుంది. దీని కారణంగా చర్మం ఎర్రబారడం, మేనిపై చిన్న చిన్న గుల్లలు, దద్దుర్లు, ర్యాష్ రావడం మొదలుకొని, అవి చాలా తీవ్రంగానూ చర్మంపై పగుళ్ల రూపంలో కనిపించేలా ఈ అలర్జిక్ రియాక్షన్ తీవ్రత ఉంటుంది. మరికొందరిలో రబ్బర్‌తో వచ్చే అలర్జీ రియాక్షన్ కనిపించగానే చేతులు లేదా కాళ్లు నల్లబారడం లేదా రంగుమారడం జరుగుతుంది. ఈ రియాక్షన్‌ను అది వచ్చిన ప్రాంతాన్ని బట్టి దాన్ని ‘బ్లాక్ రబ్బర్ హ్యాండ్’ లేదా ‘బ్లాక్ రబ్బర్ ఫీట్’ అని అంటుంటారు. ఇలా రబ్బర్‌తో అలర్జీ ఉన్న కొంతమందిలో కాస్తంత అరుదుగానైనా అరటి, కీవీ పండ్ల వల్ల కూడా అలర్జీ కనిపించవచ్చు. అరటి, కివీ పండ్ల చెట్లు కూడా ఇంచుమించుగా రబ్బర్ మొక్క కుటుంబానికి చాలా దగ్గరి జాతివి కావడమే ఇందుకు కారణం. ఇలా అటు రబ్బర్కూ... ఇటు ఈ అరటి, కీవీ పండ్లకూ అలర్జీ కలిగి ఉండటాన్ని ‘లాటెక్స్–ఫ్రూట్ సిండ్రోమ్’ అని వ్యవహరిస్తారు. కేవలం ఆ కుటుంబానికి చెందిన పండ్లకు మాత్రమే కాకుండా... మరికొందరికి అవకాడో, చెస్ట్నట్, పీచ్, టొమాటో, ఆలూ, బెల్‌పెప్పర్, మామిడి, స్ట్రాబెర్రీ వంటి పండ్లూ కూరగాయలతో కూడా అలర్జీ వస్తుంటుంది. వీటిల్లో లాటెక్స్ పాళ్లు లేనప్పటికీ కనిపించే ఈ రుగ్మతను కూడా ‘లాటెక్స్–ఫ్రూట్ సిండ్రోమ్’ అనే వ్యవహరిస్తారు. ఆయా పదార్థాలు వారికి సరిపడకపోవడమే ఇందుకు కారణం. -
పండ్లు, పాలు వద్దని మారాం చేస్తున్నారా?
దాదాపు ఐదేళ్ల నుంచి పదిహేనేళ్ల వరకు పిల్లలు కూరగాయలు, పండ్లు, పాలు తీసుకోడానికి ఇష్టపడకపోవడం చాలా సాధారణం. ఇలాంటి ఫిర్యాదులు దాదాపు ప్రతి తల్లి నుంచి వస్తూనే ఉంటాయి. పిల్లలు అలా పౌష్టికాహారం తిసుకోకుండా, పాలు తాగకుండా మారాం చేస్తుంటే... ఈ కింది సూచనలు పాటించండి. ఉదాహరణకు పిల్లలు పండ్లు తినడానికి ఇష్టపడకపోతే... రకరకాల పండ్లను కట్ చేసి ఫ్రూట్ సలాడ్స్‌గా ఇవ్వడమో లేదా కస్టర్డ్‌తో కలిపి పెట్టడమో చేయండి. కొన్ని సందర్భాల్లో పండ్లను జ్యూస్‌గా తీసి ఇవ్వవచ్చు. కాకపోతే పిల్లలకు జ్యూస్ చేసి ఇవ్వడం కంటే వాళ్లంతట వాళ్లే కొరికి తినేలా పండ్లు ఇవ్వడమే మంచిది. ఇక పిల్లలు పాలు తాగకపోతే మిల్క్‌షేక్ రూపంలో ఇవ్వండి. పాలతో తయారైన స్వీట్లు పెట్టండి. అలాగే చాలామంది పిల్లలు కూరగాయలను ఇష్టపడరు. ఒకవేళ వారు కూరగాయలు తినకపోతే... వెజిటెబుల్ ఆమ్లెట్, గ్రిల్డ్ వెజిటెబుల్ శాండ్విచ్... ఇలా రకరకాలుగా ఇవ్వండి. ఒకవేళ వాళ్లు నూడుల్స్ ఇష్టంగా తింటుంటే, వాటికే రకరకాల కూరల ముక్కలు కలిపి తయారు చేయండి. ఎదిగే పిల్లలకు మాంసాహారం, చేపలూ (తినేవారైతే), లెగ్యూమ్స్ (పప్పులు / దాల్స్), బాదాం, జీడిపప్పు, వాల్నట్ వంటి నట్స్ తప్పక ఇవ్వాలి. వల్ల వాటిలో ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో ఆ వయసు పిల్లలకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అలాగే పిల్లలు కాస్త పెద్దయాక ఆటల రూపంలో వాళ్లకు మంచి వ్యాయామం అందేలా తల్లిదండ్రులు తప్పక చూడాలి. -
పండ్లు అలవాటైతే జంక్‌ని నెట్టేస్తారు
బడి పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఇటీవల కేరళ ప్రభుత్వం పాఠశాలల్లో పిల్లలకు ‘మంచి నీటి గంట’ను ప్రవేశపెడితే.. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం పాఠశాల క్యాంటీన్లలో జంక్‌ఫుడ్ అమ్మకాలపై నిషేధం విధించబోతోంది. అంతేకాదు, బడికి యాభై మీటర్ల పరిధిలో ఫాస్ట్ ఫుడ్‌ను విక్రయించకూడదని కూడా ఆదేశాలు జారీ చేయబోతోంది. ఈ నేపథ్యంలో పిల్లలపై జంక్ ఫుడ్ చూపే ప్రభావాలు, జంక్‌ని మాన్పించే మార్గాల గురించి తెలుసుకుందాం. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. స్కూల్ పిల్లలు, యువతీ, యువకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఫాస్ట్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇదే సంస్కృతి ఇప్పుడు పల్లెలలో కూడా వ్యాపించింది. జంక్ ఫుడ్ ప్రధానంగా పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. భావోద్వేగాలపైన కూడా! ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడితే భవిష్యత్తులో డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్‌ఫుడ్ భావోద్వేగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ ఆఫ్ అలబామాకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు కొంతమంది పాఠశాల విద్యార్థుల ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత వారు ఈ విషయాన్ని నిర్ధారించారు. పాఠశాల వయసులోనే! ప్రస్తుతం డిప్రెషన్‌కు గురయ్యే వారిలో ఎక్కువమంది పాఠశాల వయసువారే ఉంటున్నారు. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలలో ఎక్కువ మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని జాతీయ డేటా విశ్లేషణలో తేలింది. 2005–2017 మధ్య కాలంలో ఇది 52 శాతం పెరిగింది. పరిశోధన జరిగిన తీరు ఫాస్ట్‌ఫుడ్ పిల్లలపై చూపే ప్రభావాల పరిశోధన కోసం ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే 84 మంది పాఠశాల వయసు గల బాల బాలికలను తీసుకున్నారు. వీరిలో 95 శాతం మంది తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన ఆఫ్రికన్ అమెరికన్లు. వారిలోని సోడియం, పొటాషియంల శాతాన్ని పరీక్షించడం కోసం ప్రతి రోజు రాత్రిపూట వారి మూత్ర నమూనాలు సేకరించారు. ఇలా ఏడాదిన్నర కాలంపాటు అధ్యయనం చేసిన తర్వాత.. జంక్‌ఫుడ్ తీసుకునేవారిలో సోడియం శాతం పెరిగి, పొటాషియం తగ్గుతుందని కనుగొన్నారు. ‘‘జంక్‌ఫుడ్‌లో ఎక్కువ మొత్తం కొవ్వు, చక్కెర, ఉప్పు ఉంటాయి. శరీరానికి ఉపయోగపడే ప్రొటీన్స్, విటమిన్స్, ఇతర పోషక పదార్థాలు వుండవు. మనకు అవసరమైన పీచు పదార్థాలు లభించవు’’ అని యూనివర్సిటీ ఆఫ్ అలబామా మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ సిల్వీ మ్రగ్ సిల్వీ తన పరిశోధన తర్వాత వెల్లడించారు. బీన్స్, చిలగడ దుంపలు, బచ్చలికూర, టమాటాలు, అరటిపండ్లు, నారింజ, పెరుగు, కూరగాయలు వంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్లే పొటాషియం శాతం తగ్గుతుందని కూడా సిల్వీ చెప్పారు. తినకుండా ఉండలేని వారు..! జంక్ ఫుడ్‌ని తీసుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యంతో పాటు డిప్రెషన్‌కు లోనవుతున్నారు. అందుకని జంక్ ఫుడ్‌ని తినకుండా ఉండలేనివారు తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలతో పాటు కొద్ది మోతాదులో మాత్రమే ఫాస్ట్‌ఫుడ్ తీసుకోవడం మంచిదని కూడా ఆహార నిపుణులు సూచిస్తున్నారు. – శెట్టె అంజి, సాక్షి వెబ్ డెస్క్ -
23 ఏళ్లుగా ఇంటిపంటల సాగు
బాల్యంలో పెరటి తోటల పనుల్లో భాగం పంచుకున్న అనుభవాలు ఆమెను చక్కని టెర్రస్ ఆర్గానిక్ కిచెన్ గార్డెనర్‌గా నిలబెట్టాయి. చెన్నైలోని తిరువోత్రియూర్ ప్రాంతంలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్న పాలిన్ శ్యామ, గోపి నటరాజన్ దంపతులు ప్రకృతికి అనుగుణమైన జీవన శైలిని గత 23 ఏళ్లుగా అనుసరిస్తున్నారు. సుమారు 50 రకాల పండ్లు, కూరగాయలను తమ ఇంటి మేడపైనే పాలిన్ సునాయాసంగా పెంచుతున్నారు. ‘నేను కేరళలో పుట్టాను. మా ఇంటి పెరట్లో కూరగాయలు, పండ్లు, పూల మొక్కల పెంపకంలో మా తాత గారికి సాయం చేస్తుండేదాన్ని. అప్పట్లో కొబ్బరి పొట్టును ఎరువుగా వేసేవాళ్లం. రుచికరమైన సొంత కూరగాయలు, పండ్లు తిన్న బాల్యానుభవమే పెళ్లయి మద్రాసు వచ్చాక టెర్రస్ ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ పెట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది’ అంటున్నారు పాలిన్. మొక్కలకు పోషకాలు అందించేందుకు 23 ఏళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ, తప్పులు చేస్తూ నేర్చుకున్నానని ఆమె అంటున్నారు. వంటింటి తడి వ్యర్థాలు ఏవైనా సరే మున్సిపాలిటీ వాళ్లకు ఇవ్వకుండా కంపోస్టు తయారు చేసుకుంటూ, ఆ కంపోస్టుతోనే టెర్రస్ మీద కుండీలు, గ్రోబాగ్స్‌లో కూరగాయలు, పండ్లు పండించుకుంటున్నారామె. 3 మట్టి పాత్రలలో (ప్లాస్టిక్ బకెట్లలో కూడా కంపోస్టు చేసుకోవచ్చు) వ్యర్థాలు, మట్టిని పొరలు పొరలుగా వేస్తూ.. రెండు రోజులకోసారి కలియదిప్పుతూ.. పైపైన పుల్లటి మజ్జిగ చిలకరిస్తూ ఉంటే.. 60 రోజుల్లో కంపోస్టు సిద్ధమవుతుందని పాలిన్ తెలిపారు. కుండీలు, గ్రోబాగ్స్‌లో మొక్కలకు నెలకోసారి గుప్పెడు కంపోస్టు వేస్తూ ఉంటానన్నారు. చేపల మార్కెట్‌కు వెళ్లి చేపలు ముక్కలు చేసిన తర్వాత మిగిలిపోయే వ్యర్థాలను తీసుకువచ్చి.. కిలో చేపల వ్యర్థాలకు కిలో బెల్లం కలిపి(నీరు కలపకూడదు).. గాజు పాత్రలో వేసి గట్టిగా మూత పెట్టాలి. 40 రోజులకు మంచి పోషక ద్రవం తయారవుతుంది. అదే ఫిష్ అమినోయాసిడ్. దీన్ని 5ఎం.ఎల్.ను 10 లీటర్ల నీటిలో కలిపి మొక్కలపైన పిచికారీ చేస్తాను, మొక్కల మొదళ్లలో పోస్తాను అన్నారామె. కోడిగుడ్ల పెంకులను పిండి చేసి కాల్షియం కోసం మొక్కలకు వేస్తూ ఉంటారు. తన కిచెన్ గార్డెన్లో ఉన్న 75 కుండీల్లో పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పెంచుకునే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు, బోన్సాయ్ మొక్కల ఉత్పాదకత చాలా బాగుందని సంతోషంగా చెబుతున్నారు. చెన్నై అనగానే నీటికొరతే గుర్తుకొస్తుంది. అయితే, టెర్రస్ మీద నుంచి వర్షపు నీటిని వృథా పోనియ్యడం లేదు. వాన నీటిని తమ ఇంటి ఆవరణలోని బోరుకు రీచార్జ్ చేసేందుకు వాడుతున్నారు. తద్వారా మండు వేసవిలోనూ నీటి కొరత ఉండటం లేదన్నారు. పర్యావరణ అనుకూల జీవనవిధానాన్ని అనుసరిస్తూ చక్కని ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లు పండించుకొని తినడంతోపాటు నీటి సంరక్షణ చేస్తూ పాలిన్, గోపి నటరాజన్ దంపతులు నగరవాసులకే ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ స్పృహతో నాగరికతకు సరికొత్త అర్థం చెబుతున్నారు. గోపి, పాలిన్ శ్యామ దంపతులు -
చౌకగా ఎండబెట్టేద్దాం!
ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను రైతులు ఆ రోజుకారోజే తక్కువ ధరకు తెగనమ్మేసుకుంటూ నష్టపోతూ ఉంటారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు, పుట్టగొడుగులను నిల్వ పెట్టుకునే సదుపాయాల్లేకపోవడమే ఇందుకు కారణం. అయితే, వీటిని పల్చటి ముక్కలుగా కోసి సోలార్ డ్రయ్యర్ల సాయంతో నాణ్యత, పోషకాల సాంద్రత ఏమాత్రం నష్టపోకుండా ఎండబెట్టి దాచుకోవచ్చు. ఎటువంటి రసాయనాలు కలపకుండానే ఏడాది వరకు నిశ్చింతగా గాలి చొరబడని డబ్బాల్లో నిల్వచేసుకోవచ్చు. వీలువెంబడి అమ్ముకోవచ్చు, ఏడాది పొడవునా తమ ఇంటి అవసరాలకూ వాడుకోవచ్చు.అయితే, సోలార్డ్రయ్యర్లు మార్కెట్లో చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ఈ దిశగా రైతులు ఆకర్షితులు కావడం లేదు. సోలార్ డ్రయ్యర్ల ధరలు ఎక్కువగా ఉండటమే ఇందుకు ముఖ్య కారణం. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు, కింది మధ్యతరగతి ప్రజలకు ఇవి అందుబాటులో లేవు. అయితే, రోజులన్నీ ఒకేలా ఉండవు. 5 కిలోల డ్రయ్యర్ వెల రూ. 5,500 టన్నెల్ సోలార్ డ్రయ్యర్లు తక్కువ ధరలకే అందుబాటులోకి రావడం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వరుణ్ రహేజా అనే యువ ఇంజినీర్ ఇందుకు శ్రీకారం చుట్టాడు. గృహస్తులు, చిన్న రైతులకు అందుబాటులో ఉండే ధరలకే సోలార్ డ్రయ్యర్లను అందిస్తున్నాడు. 5 కిలోల పండ్లు, కూరగాయలను రెండు రోజుల్లో నాణ్యత, పోషకాలు చెడకుండా ఎండబెట్టే చిన్న డ్రయ్యర్‌ను రూ. 5,500లకు, 20 కిలోల సామర్థ్యం ఉండే డ్రయ్యర్‌ను రూ. 14,500కు అందిస్తున్నాడు. అవసరాన్ని బట్టి పారిశ్రామిక అవసరాల కోసం ఎంత పెద్ద సోలార్ డ్రయ్యర్లనయినా తయారు చేసి ఇస్తానని చెబుతున్నాడు వరుణ్. గత ఏడాది నుంచి ఇప్పటికి 90 డ్రయ్యర్లను అందించానని తెలిపాడు. బీహార్‌లో గ్రామీణులకు పుట్టగొడుగుల ఒరుగులు తయారు చేయడానికి, ఉత్తరాఖండ్‌లో ఔషధ మొక్కలను నాణ్యత చెడకుండా ఎండబెట్టడానికి ప్రభుత్వాల సహకారంతో సరఫరా చేశామని వరుణ్ ‘సాగుబడి’ ప్రతినిధితో చెప్పారు. పొడవాటి గుడారం మాదిరిగా ఉండే డ్రయ్యర్లో గాలి ఎండ వల్ల వేడెక్కుతుంది. ఆ వేడి గాలి సోకడంతో పంట ఉత్పత్తుల ముక్కల్లోని తేమ త్వరగా ఆరిపోతుంది. చిన్న ఫ్యాన్ ఈ ఆవిరిని డ్రయ్యర్లో నుంచి బయటకు పంపుతుంది. లోకాస్ట్ డ్రయ్యర్ల ప్రత్యేకతలు కూరగాయలు, పండ్లు, ఉల్లి, వెల్లుల్లి.. ఏ వ్యవసాయోత్పత్తినైనా సోలార్ డ్రయ్యర్లతో పరిశుభ్రంగా, తక్కువ సమయంలో ఎండబెట్టవచ్చు. ఉదాహరణకు, టమాటాల ముక్కలను మామూలుగా ఎండలో పెడితే 7–8 రోజులకు గానీ పూర్తిగా ఎండవు. సోలార్ డ్రయ్యర్లో అయితే, కేవలం రెండు రోజులు చాలు. ఎండిన తర్వాత కూడా వీటిలో పోషక విలువలు, రుచి, రంగు, సువాసన ఉన్నవి ఉన్నట్టే ఉంటాయి. ఎండే క్రమంలో దుమ్ము ధూళి పడకుండా ఉంటుంది. పురుగులు, పక్షుల, జంతువులు వల్ల కూడా పాడుకావు. వర్షం, మంచులో తడిసినా కూడా ఇబ్బందేమీ ఉండదు. తమ డ్రయ్యర్లను సులువుగా బిగించుకోవచ్చని, సులువుగా విడదీసుకొని తీసుకువెళ్లవచ్చని వరుణ్ తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఏడాదిలో 300 రోజులు సౌర విద్యుత్తుతో పనిచేసేలా వీటిని రూపొందించామన్నారు. ఎండబెట్టిన ఉత్పత్తులకు మార్కెట్ ఉంది.. సోలార్ డ్రయ్యర్ల ద్వారా పరిశుభ్రమైన, నాణ్యమైన రీతిలో ఎండబెట్టిన ఒరుగులు, వాటి పొడులకు మార్కెట్లో డిమాండ్‌కు కొరత లేదని వరుణ్ చెబుతున్నారు. సోలార్ డ్రయ్యర్లతో తమ ఉత్పత్తులను ఎండబెట్టుకొని ఎటువంటి రసాయనాలను కలపకుండా భ్రదంగా నిల్వ చేసే చిన్న, సన్నకారు రైతులకు వీటిని కొనుగోలు చేసే ఆహార శుద్ధి కర్మాగారాలను పరిచయం చేస్తున్నామని వరుణ్ తెలిపారు. ఒకటి, రెండు డ్రయ్యర్లను కొనుగోలు చేసే వారికి దాన్ని ఎలా బిగించుకోవాలో తెలిపే మాన్యువల్‌ను, వీడియో సీడీని ఇస్తామని, ఫోన్ ద్వారా సూచనలిస్తామన్నారు. తమ డ్రయ్యర్లను ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసే రైతులకు పంట దిగుబడులతో నాణ్యమైన ఎండు ఆహారోత్పత్తుల తయారీలో 3 రోజుల పాటు శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. పంట దిగుబడులను శుభ్రపరిచి ముక్కలు తరిగే పద్ధతి, నాణ్యత చెడిపోకుండా ఎండబెట్టుకోవడం, గాలి చొరబడని ప్లాస్టిక్/గాజు డబ్బాల్లో ఎండు ఉత్పత్తులను నిల్వ చేసుకోవడంలో శిక్షణ ఇస్తామన్నారు. దీనితోపాటు మార్కెట్ సమాచారాన్ని కూడా అందించడం ద్వారా చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తులు వృథాను అరికట్టడం, వారి ఆదాయాన్ని పెంపొందించడం సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన లక్ష్యమని వివేక్ అంటున్నారు. యు.ఎన్.ఈ.పి. ప్రశంస తక్కువ ఖర్చుతో వరుణ్ రూపొందించిన సోలార్ డ్రయ్యర్ల పనితనాన్ని ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం(యు.ఎన్.ఈ.పి.) మెచ్చుకోవడం విశేషం. ‘వరుణ్ తయారు చేసిన సోలార్ డ్రయ్యర్ల వంటి స్వల్పఖర్చుతో కూడిన ఆవిష్కరణలు రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా పెద్ద మార్పునకు దోహదపడతాయి. అంతేకాకుండా కోత అనంతర నష్టాలను గణనీయంగా తగ్గిస్తాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇదెంతో అవసరం’ అని యు.ఎన్.ఈ.పి.లోని సుస్థిర వ్యవసాయ విభాగం ప్రోగ్రామ్ ఆఫీసర్ క్లెమెంటైన్ ఓ కాన్నర్ అన్నారు. వరుణ్‌ను ఈ–మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. solar.rsfp@gmail.com ‘నానబెట్టిన సిరిధాన్యాలు ఒక్క రోజులో ఎండుతున్నాయి’ వరుణ్ దగ్గర నుంచి 5 కిలోల సామర్థ్యం కలిగిన చిన్న సోలార్ డ్రయ్యర్(రూ.5,500)ను హైదరాబాద్‌కు చెందిన సూర్యప్రకాశ్‌రెడ్డి కొద్ది నెలల క్రితం కొరియర్లో తెప్పించుకున్నారు. సోలార్ డ్రయ్యర్ విడిభాగాలను వరుణ్ సూచించిన ప్రకారం తానే బిగించుకున్నారు. సిరిధాన్యాల బియ్యం నానబెట్టి ఎండబెట్టిన తర్వాత పిండి పట్టించి వినియోగదారులకు విక్రయిస్తూ ఉండే ఆయన సోలార్ డ్రయ్యర్ పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నానబెట్టిన సిరిధాన్యాలను సోలార్ డ్రయ్యర్లో ఒక్క రోజులోనే బాగా ఎండుతున్నాయని తెలిపారు. దుమ్ము, పక్షులు, మంచు, వర్షం బెడద లేకుండా కూరగాయలు, పండ్లు వంటివి ఏవైనా నాణ్యత, రంగు చెడకుండా ఎండబెట్టుకోవచ్చని చిరువ్యాపారి సూర్యప్రకాశ్‌రెడ్డి (72999 97993) చెబుతున్నారు. 5 కిలోల సామర్థ్యం గల లోకాస్ట్ సోలార్ డ్రయ్యర్ మామిడి ఒరుగులు, ఎండిన పుట్టగొడుగులు, ఎండిన ఆపిల్ ముక్కలు, అరటి ఒరుగులు -
పండ్లు ఎలా తింటే మంచిది?
సాక్షి, న్యూఢిల్లీ : ఆకు కూరలను మాత్రమే తినడాన్ని ‘విజిటేరియనిజం’ అన్నట్లుగా పండ్లను మాత్రమే తినడాన్ని ‘ఫ్రూటరియనిజం లేదా ఫ్రూజివోరిజం’ అని అంటారు. అయితే పండ్లను ఎలా తినాలి? ఆహారానికి ముందు తినాలా? తర్వాత తినాలా? ఏ రకమైన పండ్లను తినాలి? పండ్లను నమిలి తినాలా? జూస్‌గా చేసుకొని తాగాలా? ఇటీవల చాలా మందిని వేధిస్తున్న అనుమానాలు ఇవి. పరగడుపున పండ్లు తింటే మంచిదని, అప్పుడు అవి మంచిగా జీర్ణం అవుతాయని, అన్నంతోపాటు తింటే టాక్సిక్ ఆసిడ్లు రిలీజై కడుపు పాడవుతుందని ఇటీవల కొందరు కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఇది పూర్తిగా తప్పని, కడుపులో ఒకోరకమైన పదార్థాలకు ఒకో రకమైన జీర్ణ వ్యవస్థ ఉండదని, మోతాదులో తింటే పరగడుపున తిన్నా, అన్నంతోపాటు తిన్నా పండ్లు ఒకే రకమైన ఫలితాలను ఇస్తాయని స్పెయిన్‌లోని ‘పాలిటెక్నిక్ యూనివర్శిటీ ఆఫ్ వాలెన్సియా’లో బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జోస్ మైగుల్ ములెట్ తెలియజేశారు. ఆయన కథనం ప్రకారం స్పెయిన్‌లో ఓ సామెత ప్రచారంలో ఉంది. ‘మిలన్ ఇన్ ది మార్నింగ్ ఈజ్ గోల్డ్, ఆఫ్టర్నూన్ ఇట్ ఈజ్ సిల్వర్, ఎట్ నైట్ ఇట్ కిల్స్ యూ’ (పుచ్చకాయ లేదా కర్భూజా ఉదయం బంగారం, మధ్యాహ్నం వెండిలాంటిది. రాత్రి తింటే నిన్ను చంపేస్తుంది). ఆస్ట్రియా చక్రవర్తి ఆల్బర్ట్–2 1358లో, పోప్ పాల్–2 1471లో, పోప్ క్లెమెంట్–8 1605లో పుచ్చకాయల విందులో వాటికి ఎక్కువగా తినడం వల్ల వారు ముగ్గురు ప్రముఖులు మరణించారనే ప్రచారం ఉంది. ఈ కారణంగా పుచ్చకాయలు తినడంపై సామెత పుట్టుకొచ్చి ఉండవచ్చని ప్రొఫెసర్ ములెట్ వివరించారు. ఒకప్పుడు ఈ పండ్లు ఖరీదు ఎక్కువ అవడం వల్లన ధనవంతులకే అందుబాటులో ఉండేవి కనుక, రాత్రి పూట అవి తినడం మంచిది కాదన్న వాదను పుట్టుకొచ్చి ఉండవచ్చన్నది ప్రొఫెసర్ వాదన. కేవలం పండ్ల వలనే మన శరీరానికి కావాల్సిన పోషకాలు రావని, వంటకాలను కూడా తినాలని, వండేటప్పుడు కూడా కొన్ని కూరగాయల నుంచి ఆ వేడికి కొన్ని పోషకాలు ఉత్పత్తి అవుతాయని ఆయన చెప్పారు. పండ్లు తినే జంతువులకన్నా మానవులు ఎక్కువ తెలివి తేటలు కలిగి ఉండడానికి, తక్కువ ఆహారం తిన్నా ఎక్కువ శక్తి రావడానికి కారణం అవుతున్నది వంటేనన్నది కూడా ఆయన వాదన. అందుకే కోతులు, చింపాజీలీ లాంటి జంతువులు శక్తి సరిపోక ఎప్పుడూ పళ్లను తింటూనే ఉంటాయని ఆయన చెప్పారు. పండ్లలో డీ విటమిన్ అస్సలు ఉండదని దాని కోసం పాలు, గుడ్లు, మాంసం, చేపలు తీసుకోవడం లేదా ఎండలో కూర్చోవడం లాంటివి చేయాల్సిందేనని ఆయన చెప్పారు. పండ్లను ఎప్పుడైనా తినవచ్చని, అయితే జూస్ బదులు పండ్లను నేరుగా తినడమే మంచిదని ఆయన తెలిపారు. ఉదాహరణకు బత్తాయి తీసుకుంటే మహా అంటే ఒకటి, రెండు తీసుకుంటామని, అదే జూస్ తాగితే నాలుగైదు పండ్ల రసం తాగుతామని, దానివల్ల శరీరంలోని రక్తంలో సుగర్ స్థాయి హఠాత్తుగా పెరుగుతుందని ఆయన అన్నారు. అదే బత్తాయి పండును నమిలి తిన్నట్లయితే అందులోని ఫైబర్ (పీచు) పదార్థం కడుపులోకి వెళ్లి జీర్ణ వ్యవస్థకు తోడ్పడుతుందని ఆయన చెప్పారు. ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తీసుకుంటే మంచిదని, ఆకు కూరలు, పండ్లు, మాంసాహారం అన్న తేడా లేకుండా ఎవరి అలవాట్లనుబట్టి వారు తమ శరీర శ్రమకు తగ్గట్లుగా పరిమితంగా ఆహారాన్ని తీసుకోవడం మంచిదని ‘వాట్ ఈజ్ ఈటింగ్ హెల్తీ’ అనే పుస్తకాన్ని రాసిన ప్రొఫెసర్ ములెట్ సూచిస్తున్నారు. -
యాంటీ డిసీజ్ ఆహారం
రుచికరమైన పండ్లు, ఆహార పదార్థాలు లొట్టలేసుకుంటూ తింటూనే మేనిపై ముడతలనేవే రాకుండా చూసుకోవాలని ఉందా? ఇదే యౌవనంతో ఇలాగే చాలాకాలం పాటు ఉండిపోవాలని ఉందా? హాయిగా రకరకాల వెజిటబుల్స్ తినేస్తూనే క్యాన్సర్‌తో పాటు అనేక రకాల వ్యాధులను దూరంగా ఉంచాలని ఉందా? అయితే మీరు మీలోని ఫ్రీ–రాడికల్స్ అనే జీవవ్యర్థాలను తుదముట్టించే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఆహారం తినాలి. అవేవో తెలుసుకోవాలని ఉందా... ఇలా రండి... ఇది చదవండి. వయసు పెరగడం అందరిలోనూ చాలా సహజం. అది సాధారణంగా జరిగే ప్రక్రియ. అది వీలైనంతగా ఆలస్యం అయితే కాదనుకునేవారెవరు? చాలాకాలంపాటు యౌవనంగా ఉండాలని ఎవరు కోరుకోరు? అలాగే కొన్ని ఆహారాలతో క్యాన్సర్‌ను నివారించుకోవచ్చంటే వాటిని కోరుకోని వారెవరు? ముందుగా వయసు పెరగడం వల్ల వచ్చే శారీరక మార్పులు వేగవంతం కావడానికి, క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరగడానికి కారణం ఏమిటో తెలుసా? ఫ్రీరాడికల్స్ అనే కొన్ని పదార్థాలు. వాటిని తుదముట్టించేవే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు. అసలు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? వాటి వల్ల ప్రయోజనాలు, అవి ఏయే ఆహారపదార్థాల్లో ఉంటాయనే అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం. మన దేహంలో నిత్యం అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. వాహనం నడుస్తున్నప్పుడు, మోటార్ లేదా ఇంజన్ పనిచేస్తున్నప్పుడు పొగ వెలువడినట్టే... ఆ జీవక్రియలు జరిగే సమయంలో మన దేహంలో కొన్ని కాలుష్య పదార్థాలు విడుదల అవుతాయి. వాటిని ఫ్రీరాడికల్స్ అంటారు. అవి కణాలను దెబ్బతీస్తాయి. ఫ్రీ–రాడికల్స్ అన్నవి మన దేహంలోని ఏ కణంపై ప్రభావం చూపితే ఆ కణం జీవిత కాలం తగ్గిపోతుంది. ఆ కణం కూడా దెబ్బతింటుంది. కణం స్వరూపం మారితే మరింత ప్రమాదం... ఫ్రీ రాడికల్స్ ప్రభావంతో ఒక్కోసారి కణం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకుందనుకోండి. అప్పుడది మరింత ప్రమాదకరమైన పరిణామానికి దారిస్తుంది. క్యాన్సర్ అంటే ఒక కణం తన స్వాభావికమైన ధర్మాలు కోల్పోయి, విచిత్రంగా ప్రవర్తించడం అన్నది తెలిసిందే కదా. అలా ఒక కణం తన సహజధర్మాలకు విరుద్ధంగా క్యాన్సర్ కణంగా కూడా మారిపోయే ప్రమాదం ఈ ఫ్రీ–రాడికల్స్ వల్ల ఉంటుంది. ఇలాంటి ఫ్రీ–రాడికల్స్‌ను నిస్తేజంగా మార్చే పోషకాలూ మన ఆహారంలో ఉంటాయి. అలా ఫ్రీ–రాడికల్స్‌ను నిర్వీర్యం చేయగల పోషక పదార్థాలనే ‘యాంటీ ఆక్సిడెంట్స్’. ఇవి మనం తీసుకునే ఆహారపదార్థాల్లో ఉంటాయి. మరికొన్ని ఆహార పదార్థాల్లోని పోషకాలు నేరుగా యాంటీ ఆక్సిడెంట్స్ కాకపోయినా వాటిలోని కొన్ని వృక్ష రసాయనాల (ఫైటో కెమికల్స్)కు యాంటీ ఆక్సిడెంట్‌కు ఉన్న లక్షణాలే ఉంటాయి. అంటే అవి కూడా యాంటీ ఆక్సిడెంట్స్లాగే పనిచేస్తాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే...? మనం తినే ఆహారంలోని కొన్ని పోషకాలు... ఫ్రీ రాడికల్స్‌తో చర్యజరిపి దాని ప్రభావాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తాయి. రసాయన పరిభాషలో చెప్పాలంటే తటస్థీకరిస్తాయి. అంటే న్యూట్రలైజ్ చేస్తాయన్నమాట. దాంతో ఫ్రీ–రాడికల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలగిపోతాయి. అంతేకాదు... ఫ్రీరాడికల్స్ కణాన్ని దెబ్బతీయడం గాని, కణాన్ని క్యాన్సర్ కణంగా మార్చడం గాని జరగకుండా కూడా ఆగిపోతుంది. అలా ఫ్రీ–రాడికల్స్‌ను తటస్థీకరించడానికి ఉపయోగపడే ఆహార పదార్థాల్లోని పోషకాలనే ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్‌తో ప్రయోజనాలివే... ♦ జీవక్రియల (మెటబాలిక్ ప్రాసెసెస్) ద్వారా వెలువడే వ్యర్థాల్లోని హానికర పదార్థాలను నిర్వీర్యం చేసి, కణంలో జరిగే ధ్వంసాన్ని (సెల్ డ్యామేజీని) నిలిపివేస్తుంది. సెల్డ్యామేజ్ తగ్గడం వల్ల కణం చాలాకాలంపాటు ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి సెల్ డ్యామేజీలు కాలుష్యం వల్ల, పొగతాగడం వల్ల, శారీరక శ్రమ వల్ల, అల్ట్రావయొలెట్ లైట్ వల్ల కూడా జరుగుతుంటాయి. ఫలితంగా చర్మం ముడుతలు పడటం వంటి వృద్ధాప్య చిహ్నాలు కనపడుతుంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ–రాడికల్ కార్యకలాపాలను నిరోధించడం వల్ల ఈ దుష్పరిణామాలన్నీ ఆగుతాయి లేదా తగ్గుతాయి. దాంతో చాలా కాలం పాటు వయసు పెరిగినట్లుగానే కనిపించదు. ♦ ఆక్సిజన్ ఫ్రీ–రాడికల్స్ అన్నవి ఒక్కోసారి కణంలోని స్వరూపాన్నే పూర్తిగా మార్చివేస్తుంది. దాంతో కణంలోని జన్యుస్వభావమే మారి కణం కాస్తా... క్యాన్సర్కణంగా మారిపోతుంది. అప్పుడది క్యాన్సర్ గడ్డలాగా అపరిమితంగా పెరిగిపోయి మనిషికి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఆ ప్రమాదాన్ని నివారిస్తాయి. కణాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్... అవి చేసే మేలు ♦ బీటా–కెరోటిన్ అనే పోషకానికి యాంటీఆక్సిడెంట్ గుణం ఉంటుంది. ఇవి పసుపు పచ్చగానూ, నారింజరంగులోనూ ఉండే అన్ని పండ్లలో, కూరగాయల్లో, ముదురు ఆకుపచ్చ ఆకుకూరల్లో ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణాల్లోని పైపొర (సెల్ మెంబ్రేన్)ను సురక్షితంగా కాపాడతాయి. అందుకే ఈ రంగు పండ్లు తింటే క్యాన్సర్ నుంచి రక్షణతో పాటు దీర్ఘకాలం పాటు కణం ఆరోగ్యంగానూ, యౌవనంతోనూ ఉంటుంది. ఫలితంగా మన దేహం కూడా చాలాకాలం పాటు యౌవనంగా ఉంటుంది. ♦ లైకోపిన్ అన్నది ఒక ఫైటో కెమికల్. అంటే చెట్టు నుంచి వచ్చే రసాయనం. దీనికి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఎరుపు రంగు పిగ్మెంట్ ఉండే ఆహారాల్లో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది. అన్ని ఎరుపు రంగు పండ్లలోనూ ఇది ఉన్నా ఎరుపురంగు పండు అనగానే గుర్తొచ్చే టొమాటోలో ఇది మరీ ఎక్కువ. టొమాటోతో పాటు లైకోపిన్ పుచ్చకాయలోనూ ఎక్కువే. అది మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటమేగాక... పెద్దపేగు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లను నివారిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌లో లైకోపిన్దే అత్యంత ప్రధానమైన పాత్ర. ♦ అల్లిసిన్ అనేది చాలా శక్తిమంతమైన ఫైటో కెమికల్. అంటే చెట్టు నుంచి వచ్చే జీవరసాయనం. దీనికి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఈ అల్లిసిన్ వెల్లుల్లి, ఉల్లిలో ఉంటుంది. ఇది అన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. అంతేకాదు... ఈ యాంటీఆక్సిడెంట్ మన శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అందుకే రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఉల్లి, వెల్లుల్లి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది. ♦ ఐసోథయనేట్స్, ఐసోఫ్లేవోన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సోయా ఉత్పాదనల్లో, క్యాబేజీ, కాలిఫ్లవర్ లాంటి ఆహార పదార్థాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక రకాల క్యాన్సర్ల నుంచి శరీరాన్ని కాపాడతాయన్న విషయం చాలా మందికి తెలిసిందే. ♦ గ్లుటాథియోన్ ఇది చాలా శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్. ఇది కంటిజబ్బులైన క్యాటరాక్ట్‌ను నివారిస్తుంది. ♦ యాంథోసయనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ద్రాక్షలో, బెర్రీ పండ్లలో ఎక్కువ. గుండె జబ్బులను యాంథోసయనిన్ సమర్థంగా నివారిస్తుంది. ♦ ఫ్లేవనాయిడ్స్ అన్నవి చాలా చిక్కటి ముదురు రంగులో ఉండే అన్ని రకాల పండ్లలోనూ, కూరగాయల్లోనూ లభ్యమయ్యే యాంటీఆక్సిడెంట్. ఫ్లేవనాయిడ్స్ గుండెజబ్బులను నివారిస్తాయి. ఇవి పండ్లు, కూరగాయల్లోని పైపొరల్లో ఉంటాయి. వాటికి ఫ్రీ–రాడికల్స్‌ను తటస్థీకరించే గుణం బాగా ఎక్కువ. అందుకే అవి సహజసిద్ధమైన క్యాన్సర్ నిరోధక (యాంటీక్యాన్సర్) గుణాలను కలిగి ఉంటాయి. శరీరంలో పుట్టే మంటను తగ్గిస్తాయి. అంటే వాటిని సహజసిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ పోషకాలుగా పరిగణించవచ్చు. మన రక్తప్రసరణ వ్యవస్థలో... అంటే రక్తం ప్రవహించే సిరలు, ధమనులు, గుండె వంటి కీలక శరీర భాగాలనూ కాపాడతాయి. రక్తంలోని రకరకాల పదార్థాలైన ప్లేట్లెట్స్ వంటివి గుంపులు కట్టకుండా (ప్లేట్లెట్ అగ్రిగేషన్ కాకుండా) కాపాడతాయి. దాంతో రక్తప్రవాహం సాఫీగా సాగేలా చూస్తాయి. అంతేకాదు... రక్తనాళాల గోడలకు బలం చేకూరుస్తాయి. ♦ అంతెందుకు... పుల్లగా ఉండే నిమ్మజాతి పండ్లలో లభ్యమయ్యే విటమిన్–సి కూడా యాంటీ ఆక్సిడెంటే. దాంతోపాటు విటమిన్–ఇ కూడా ఒక యాంటీ ఆక్సిడెంటే. అందుకే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. దీర్ఘకాలం పాటు యౌవనంతో, మంచి ఆరోగ్యంతో జీవించండి.-డాక్టర్ హరిచరణ్కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,హైదరాబాద్ -
లోబిపి ఉంటే...
హైపోటెన్షన్ రక్తప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. దీనినే లో బిపి అంటాం. ఆహార మార్పుతో దీనిని చక్కదిద్దవచ్చని పరిశోధకులు అంటున్నారు. ♦ వారం రోజుల పాటు ఉదయం ఒకకప్పు, సాయంత్రం ఒక కప్పు పచ్చిబీట్రూట్ రసం తాగితే తేడా స్పష్టంగా తెలుస్తుంది. దానిమ్మ రసం కూడా రక్తప్రసరణను క్రమబద్ధీకరించడంలో బాగా పని చేస్తుంది. ♦ వారం రోజుల పాటు తాజాపండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటే బిపి క్రమబద్ధం కావడంతోపాటు వ్యవస్థ మొత్తం శక్తిమంతం అవుతుంది. రోజుకు మూడుసార్లూ తాజా పండ్లనే తీసుకోవాలి. ఐదు గంటల వ్యవధిలో పూర్తిస్థాయి భోజనానికి సరిపడిన మోతాదులో పండ్లను తినాలి. తర్వాత రెండు లేదా మూడు వారాలపాటు పండ్లతోపాటు పాలు తీసుకోవాలి. ఆ తర్వాత పండ్లను మరికొంత తగ్గించి గింజలు, చిరుధాన్యాలు, పచ్చికూరగాయలను కూడా చేర్చాలి. ఇలా చేయడం వల్ల సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది. ఇలా మూడునెలలకొక కోర్సు ఫుడ్‌హ్యాబిట్ పాటిస్తుంటే మంచిది. -
ఫారిన్ పండు.. భలేగుండు
అమెరికా స్ట్రాబెర్రీ, న్యూజిలాండ్ కివీ, వాషింగ్టన్ ఆపిల్, కాలిఫోర్నియా ద్రాక్ష, ఆస్ట్రేలియా ఆరెంజ్, థాయిలాండ్ డ్రాగన్ ఫ్రూట్.. ఇలాంటి పండ్లు కావాలంటేఆ దేశాలకు వెళ్లనక్కరలేదు.ఏ దేశంలో పండే పండ్లయినా సరే నగర మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటి రుచిని ఆస్వాదించేందుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. అందుకు తగ్గట్టే నగరంలో ప్రతి వేసవిలో విదేశీ పండ్ల వినియోగం భారీగా పెరిగుతోంది. హోల్‌సేల్ మార్కెట్, ఫుడ్ బజార్లు, పెద్ద వాణిజ్య కేంద్రాలు, సూపర్ మార్కెట్లలో ఇవి దర్శనమిస్తున్నాయి. పైగాప్రతి గల్లీలోనూ విదేశీ పండ్ల విక్రయించే చిల్లర వ్యాపారులుతెగ తిరుగుతున్నారు. ఈ తరహా పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయని నమ్మేవారు పెరుగుతుండడంతో వీటి అమ్మకాలు సైతం ఊపందుకుంటున్నాయి.గతేడాది కంటే ఈసారి విదేశీ పండ్ల వ్యాపారం పెరగడమే ఇందుకు నిదర్శనమని వ్యాపారులు చెబుతున్నారు. 20 దేశాల నుంచి దిగుమతి ఇటీవల కాలంలో నగరానికి విదేశీ రకాల పండ్ల దగుమతులు భారీగా పెరిగాయి. రోజుకు 50 నుంచి 60 టన్నుల వరకు అన్ని రకాల పండ్ల క్రయవిక్రయాలు జరుగుతున్నాయని గడ్డిఅన్నారం మార్కెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నారు. నగరం నుంచి ఈ పండ్లను పక్క రాష్ట్రాలు, జిల్లాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంలోనే పెద్దదైన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ విదేశీ పండ్లకు పెట్టింది పేరు. ఇక్కడికి దాదాపు 20 విదేశాల నుంచి వివిధ రకాల పండ్లు ఇక్కడి దిగుమతి అవుతున్నాయి. ఈ పండ్ల వినియోగంలో ముంబై, బెగళూరు తర్వాత నగరం దేశంలో మూడో స్థానంలో ఉంది. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా పండే అన్ని రకాల పండ్లు నగర మార్కెట్లో సీజన్ ప్రకారం అందుబాటులో ఉండడం విశేషం. ఆన్లైన్లోనే బేరసారాలు.. మార్కెట్ హోల్‌సెల్ వ్యాపారులు వివిధ దేశాల్లో లభించే పండ్లలను అక్కడి వ్యాపారులను ఆన్లైన్లో సంప్రదిస్తారు. వారివద్దనున్న పండ్లను వాట్సప్, మెయిల్లో ఫొటోలు పంపగా ధరలను నిర్ణయించుకుని ఆన్లైన్లోనే అడర్ చేస్తున్నారు. తర్వాత ఆయా దేశాల నుంచి పండ్లు చెన్నై, ముంబై ఓడ రేవులకు దిగుమితి అవుతాయి. అక్కడి నుంచి నగరానికి కూల్ కంటైనర్లలో నగరానికి చేరుతున్నాయి. విదేశాల్లో కంటే ఇక్కడే ధర తక్కువ.. విదేశీ పండ్ల ధరలు ఇక్కడే తక్కువగా ఉన్నాయి. అమెరికాలో ఒక ఆపిల్ ఒకటి నుంచి రెండు డాలర్లు. అదే పండు మనకు రూ.30కి లభిస్తోంది. ఇలా విదేశాల నుంచి వచ్చే అన్ని పండ్లూ అక్కడి ధరల కంటే మనకే తక్కువకు లభిస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఏ పండు ఎక్కడి నుంచంటే.. ♦ గ్రీన్ ఆపిల్.. నెదర్లాండ్స్, యూఎస్, ఫ్రాన్స్, ఇటలీ నుంచి నెలకు దాదాపు 12 వేల పెట్టెలు నగర హోల్‌సెల్ వ్యాపారులు దిగుమతి చేసుకుంటన్నారు. ♦ ఆపిల్, రాయల్ ఆపిల్.. వాషింగ్టన్, చైనా, న్యూజిలాండ్, చిలీ, బెల్జియం నుంచి ముంబై, చెన్నై పోర్టుల ద్వారా నగరానికి దిగుమతి అవుతున్నాయి. ♦ కివీ.. న్యూజిలాండ్, ఇటలీ, ఇరాన్‌తో పాటు చైనా నుంచి వస్తున్నాయి. ప్రసుత్తం దేశీయ పండ్ల కంటే విదేశీ కివీకి ఎక్కువ డిమాండ్ ఉంది. ♦ ప్లమ్.. చూడ్డానికి చిన్న ఆపిల్, టమాటలా కనిపించే ఈ పండును స్పెయిన్ నుంచి వస్తుంది. ♦ డ్రాగన్ ఫ్రూట్.. వియత్నాం, థాయిలాండ్ దేశాల నుంచి వసుతంది. ♦ చెర్రీ.. నగరానికి దిగుమతి అవుతున్న పండ్లలో చెర్రీ కూడ ఒకటి. దీన్ని న్యూజిలాండ్ నుంచి దిగుమతి చేస్తున్నారు. ♦ యాపిల్ రెడ్ గాలా.. ఫిజీ, ఫ్లేమ్ ద్రాక్ష.. ఆస్ట్రేలియా నుంచి.. ఈజిప్ట్ నుంచి పెద్ద సైజు నారింజ పండ్లు దిగుమతి అవుతున్నాయి. నగరంలో అధిక డిమాండ్ గతంలో పోలిస్తే విదేశీ పండు తినాలనే ఆసక్తి నగర ప్రజల్లో పెరిగింది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని అందించే ఆపిల్, కివీ, పియర్స్‌తో పాటు మరిన్ని విదేశీ రకాల వైపు మొగ్గు చూపుతున్నారు. – క్రాంతి ప్రభాత్‌రెడ్డి, విదేశీ పండ్ల హోల్‌సేల్ వ్యాపారి దిగుమతులు పెరిగాయి మార్కెట్‌కు గతంలో కంటే విదేశీ పండ్ల దిగుమతులు పెరిగాయి. వాటిని నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్ చాంబర్లు ఏర్పాటు చేశాం. దేశంలోని ఇతర పండ్ల మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మార్కెట్ ఆదాయం కూడా పెరిగింది, గడ్డి అన్నారం మార్కెట్‌కే విదేశీ పండ్ల దిగుమతి జరుగుతోంది. – ఈ. వెంకటేశం, గడ్డి అన్నారం మార్కెట్ కార్యదర్శి -
లోటుకు జవాబు.. పెంపే
సాక్షి, హైదరాబాద్ : కూరగాయల ఉత్పత్తిలో రాష్ట్రం అత్యంత వెనుకబడి ఉంది. దీంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచడమే సరైన పరిష్కారమని ఉద్యానశాఖ భావించి తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రజలు రోజువారీ ప్రధానంగా 20 రకాల కూరగాయలను వినియోగిస్తుంటారు. ఇలా ఏడాదికి 22.28 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం కాగా, కేవలం 15.94 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే లభిస్తున్నాయి. అంటే 6.34 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉంది. ఈ 20 రకాల్లో టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి వంటి ఆరు రకాలు అవసరానికి మించి ఉత్పత్తి అవుతుండగా, పచ్చిమిర్చి, కాకర , బీర, సొరకాయ, దోసకాయ, బీన్స్, క్యాప్సికం, బంగాళదుంప, చేమగడ్డ, క్యారట్, కందగడ్డ, ఆకుకూరలు, ఉల్లిగడ్డలు సహా 14 రకాలకు తీవ్ర కొరత నెలకొని ఉంది. ఇక ఆరు రకాల్లో వినియోగం 7.99 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఉత్పత్తి 8.66 లక్షల మెట్రిక్ టన్నులుంది. అంటే 66,760 మెట్రిక్ టన్నులు అదనంగా ఉత్పత్తి అవుతున్నాయి. మిగిలిన 14 రకాలు 14.29 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ఉత్పత్తి 7.28 లక్షల మెట్రిక్ టన్ను లు మాత్రమే . ఈ 14 రకాల వరకు చూస్తే దాదాపు సగం అంటే 7.01 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉంది. దీంతో ఈ సాగును అదనంగా 2.13 లక్షల ఎకరాల్లో చేయాలని ఉద్యానశాఖ ప్రతిపాదించింది. ఎనిమిది రకాల పండ్లకూ కొరతే... రాష్ట్రంలో వినియోగించే ఎనిమిది రకాల పండ్ల ఉత్పత్తి తక్కువగా ఉంది. జామ, ద్రాక్ష, యాపి ల్, కర్బూజ, నేరేడు, అరటి, పైన్ ఆపిల్, దాని మ్మ అవసరానికంటే 4.46 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉంది. యాపిల్ ఇక్కడ పండే పంట కాదు కాబట్టి ఆ చర్చ లేదు. జామ 23 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో కేవలం 13 వేల మెట్రిక్ టన్నులే పండుతోంది. ద్రాక్ష 27 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, కేవలం 3 వేల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి అవుతోంది. అరటి పండ్లు 3.39 లక్షల మెట్రిక్ టన్నులు గాను, 73 వేల మెట్రిక్ టన్నులే . దానిమ్మ 49 వేల మెట్రిక్ టన్నులకు గాను, కేవలం 11 వేల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి అవుతోంది. ఆయా పండ్ల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే అదనంగా 38 వేల ఎకరాల్లో పండ్ల సాగు చేయా లని ఉద్యానశాఖ ప్రభుత్వానికి నివేదించింది. మామిడి, బొప్పాయి, పుచ్చకాయ, సపోటా, కమలా, బత్తాయి పండ్ల ఉత్పత్తి అవసరానికి మించి 9.43 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఉత్పత్తి అవుతుండటం గమనార్హం. అందులో మన జనాభాకు మామిడి 60 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, 4.82 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది. బొప్పాయి 3 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో 51 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది. అదనంగా ఉత్పత్తి అవు తున్న పండ్లను ఎగుమతి చేయాలని ఉద్యానశాఖ భావిస్తోంది.అందుకోసం ఆహారశుద్ధి పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం నెలకొని ఉంది. కొరత నెలకొన్న పండ్ల కోసం అదనంగా 38 వేల ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించింది. -
కర కరాచీ బిస్కెట్లు
తియ్యటి ఘుమఘుమల సువాసనలు కరిగించిన బటర్, కారమిలైజ్ చేసిన పంచదారల కలయిక నుండి వచ్చే మాధుర్యం.. నైపుణ్యం కలిగిన రెండు మూడు చేతుల మధ్యన మృదువుగా నలుగుతున్న పిండి... క్యాండీడ్ ఫ్రూట్స్‌ను జల్లుతున్న మరో కొన్ని చేతులు... వారి వెనకాలే పెద్ద పెద్ద అవెన్లు... అంతే... ఎంతో ఆదరణ పొందిన కరాచీ బేకరీ బిస్కెట్లు సిద్ధం... దేశవ్యాప్తంగా ఇంత ఆదరణ పొందిన ఈ బిస్కెట్ల ప్రయాణం సుమారు 60 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఈ బేకరీ ఖాన్చంద్ రామ్నాని ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది. కరాచీ బిస్కెట్లు... ఈ పేరుకి, పాకిస్థాన్‌లోని కరాచీకి ఏ మాత్రం సంబంధం లేదు. తన స్వస్థలం మీద మమకారంతో మాత్రమే ఈ పేరు పెట్టుకున్నారు. పుట్టుకతో సింధీ అయిన ఖాన్చంద్ రామ్‌నామీ, దేశ విభజన సమయంలో పాకిస్థాన్ కరాచీ నుంచి ప్రస్తుత ఇండియాకి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. 1953లో తనముద్రను ప్రతిబింబించేలా బిస్కెట్లు, కేక్‌లు, పేస్ట్రీల అమ్మకాలలో ప్రఖ్యాతి చెందారు. మొట్టమొదటి ఔట్‌లెట్‌ను ముజాంజాహి మార్కెట్లో ప్రారంభించారు. ఇటీవలే దుబాయ్‌లో కూడా వీరి ఔట్లెట్ తొలి అడుగు వేసింది.1960లో రామ్‌నామీ స్వయంగా తన సొంత బేకింగ్ యూనిట్‌ను ప్రారంభించి, తన మార్కులో ఫ్రూట్ బిస్కెట్లను తయారుచేయడం ప్రారంభించారు. అంతే, హైదరాబాదీల మనసులను ఇట్టే దోచేసుకున్నారు. నోటికి లవణ రుచిని కూడా చూపిస్తున్నారు. టూటీ ఫ్రూటీతో బిస్కెట్ల మీద నక్షత్రాల్లా మిణుకుమిణుకు మంటూ నోరూరేలా చేస్తున్నారు. టీ టైమ్ తినడానికి అనువుగా కాజు బిస్కెట్లు, ఉప్పు బిస్కెట్లు తయారుచేస్తున్నారు. ‘‘మా నాన్నగారు నాణ్యత మీదే మనసు లగ్నం చేశారు. ఆ నాణ్యతనే నేటికీ కొనసాగిస్తున్నాం. నా సోదరులిద్దరూ గతించారు. నా మేనల్లుళ్లు సోషల్‌మీడియాలో మా బేకరీ వస్తువుల గురించి ప్రచారం చేస్తుంటారు. నేను నిత్యం పనులలో బిజీగా ఉన్నా కూడా అందరికీ సకాలంలో డెలివరీలు అందేలా జాగ్రత్తపడుతుంటాను’’ అంటారు లేఖ్‌రాజ్ రామ్నాని. ఇక్కడి ప్రత్యేకతలు... ఎగ్‌లెస్ కుకీస్ కరాచీ బేకరీ ప్రత్యేకత. అలాగని వీరు కొత్తరకాలు తయారుచేయడంలేదని కాదు. ఇక్కడ పదిరకాల బిస్కెట్లు, షెర్మాల్ నుంచి ఒరిజానో వరకు 40 రకాల కుకీలు తయారుచేస్తున్నారు. కాజు, ఫ్రూట్స్, ఉస్మానియా... అన్నీ అప్పటికప్పుడు అమ్ముడైపోతాయి. హైదరాబాద్‌లో వీరికి విశేష ఆదరణ రావడంతో, నాణ్యత విషయంలో మరింత జాగ్రత్తలు పాటిస్తున్నారు. 2018 లో ముంబైలో కొత్తబ్రాంచ్ తెరిచారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 ఔట్లెట్లు పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నారు. స్థానిక దుకాణాలు మొదలు, అమెజాన్.కామ్ వంటి ఆన్లైన్ సంస్థల వరకు కరాచీ బిస్కెట్లను అమ్ముతున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణించేవారు ఈ బిస్కెట్లను తమ బంధువులకు తప్పనిసరిగా తీసుకువెళ్తారు. నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణతో ఈ ఔట్లెట్ల సంఖ్య పెరుగుతోంది. లేఖరాజ్ మాటల ప్రకారం. ... నిజమైన హైదరాబాదీకి ఉదయం టీతో పాటు కరాచీ బిస్కెట్లతోనే తెల్లవారుతుంది. మా కుటుంబీకులకు ఒక నమ్మకం ఉంది. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. అందువల్లే మేం ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడం. చేతలతోనే మాట్లాడతాం. – లేఖ్‌రాజ్ రామ్నాని (ఖాన్చంద్ రామ్నాని కుమారుడు) కారం బిళ్లలు కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; సెనగ పిండి – ఒక కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – రుచికి తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; నువ్వులు – ఒక టేబుల్ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, సెనగ పిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, మిరపకారం, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙నువ్వులు వేసి మరోమారు కలపాలి ∙ఈ మిశ్రమాన్ని సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి ∙చేతికి నూనె పూసుకుని పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉండలా చేసి, చేతితో వడ మాదిరిగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి ∙ఈ విధంగా అన్నీ చేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న కారం బిళ్లలను అందులో వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙ఇవి పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటాయి. -
మధుమేహులకు పండ్లతో మేలు..
లండన్ : తీపి పదార్ధాలతో పోలిస్తే కృత్రిమ పానీయాలతోనే టైప్ టూ మధుమేహ ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఫ్రక్టోజ్‌తో కూడిన డైట్ మన ఆహారంలో పోషక రహిత శక్తిని చొప్పించి రక్తంలో చక్కెర స్ధాయిలపై పెను ప్రమాదం చూపుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే పండ్లు, కూరగాయలు, సహజసిద్ధమైన పండ్ల రసాలు, తేనె వంటి ఆహారం, పానీయాలతో ఎలాంటి ముప్పు లేదని వెల్లడించారు. సోడాతో పాటు శీతల పానీయాలు, బేకరీ పదార్ధాలు, స్వీట్లకు దూరంగా ఉండాలని కెనడాకు చెందిన సెయింట్ మైఖేల్ హాస్పిటల్, టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు సూచించారు. గతంలో మధుమేహం, ఆహారానికి ఉన్న సంబంధంపై వెలువడిన 155 అథ్యయనాలను విశ్లేషించి ఈ పరిశోధనల చేపట్టారు. అదనపు క్యాలరీలు లేని ఫ్రక్టోజ్ చక్కెరతో కూడిన ఆహారంతో ఎలాంటి అనర్ధం ఉండదని పరిశోధక బృందం తేల్చింది. డయాబెటిస్తో బాధపడే వారిలో చక్కెరలో గ్లూకోజ్, ఇన్సులిన్లను నియంత్రించేందుకు తాజా పండ్లు, పండ్ల రసాలు ఉపయోగపడతాయని తాజా అథ్యయనం వెల్లడించడం గమనార్హం. శీతల పానీయాలతో మాత్రం మధుమేహుల ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించింది. పండ్లలో అధికంగా ఉండే పీచు పదార్ధం శరీరంలో చక్కెరను విడుదల చేసే ప్రక్రియను నెమ్మదింపచేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.మధుమేహ నియంత్రణ, నివారణలో తమ అథ్యయన వివరాలు ఉపయోగపడతాయని అథ్యయన రచయిత డాక్టర్ జాన్ సివెన్‌పైపర్ పేర్కొన్నారు. .