షుగర్ వ్యాధి వచ్చిందనగానే మనలో చాలామంది కంగారుపడిపోతూ ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, స్వీట్ తినకూడదు కదా మరి ఎలాంటి పండ్లు తీసుకోవాలి అనే సందేహాలు మొదలౌతాయి. అయితే వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని రకాల పండ్లను తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారు ఈ పండ్లను భయంలేకుండా తీసుకోవచ్చు.అవేంటో చూద్దాం. నిజానికి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ డయాబెటిస్ ఉన్నవారు కొన్ని పండ్లను తినకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా మామిడి, అరటి, ద్రాక్ష, పనస పండ్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఒకటి లేదా రెండు ముక్కలను తీసుకుంటే మంచిది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగవచ్చు.
ఆపిల్, జామ, నారింజ, బొప్పాయి ,పుచ్చకాయ తీసుకోవచ్చు. ఈ పండ్లలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది , చక్కెర తక్కువగా ఉంటుంది. అయితే వీటిని జ్యూస్‌ల రూపంలో కాకుండా, కాయగానే తినాలి. అపుడు మాత్రమే నష్టపోకుండా ఉంటుంది. ఫోలేట్, విటమిన్ సి, పొటాషియం, డైటరీ ఫైబర్ లభిస్తాయి. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించాలనుకుంటే, భోజనం మధ్య విరామాలలో ఈ పండ్లను తీసుకోండి. సిట్రస్ పండ్లు, యాపిల్స్, బొప్పాయి ద్వారా ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడే ఫోలేట్- B9 లభిస్తుంది.
ఆపిల్స్: ఆపిల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. జ్యూస్ రూపంలో గాకుండా, శుభ్రంగా కడిగి తొక్కతో తింటే ఫైబర్ ఎక్కువ అందుతుంది.
పుచ్చకాయ: దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని పొటాషియం కిడ్నీల పనితీరుని మెరుగ్గా చేస్తుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండుని తీసుకోవచ్చు.
ఆరెంజ్: ఆరెంజ్ పళ్లలోని క్యాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది. అధిక మోతాదులో లభించే విటమిన్ ‘ఎ’ వల్ల దృష్టి లోపాలను నివారిస్తుంది. ఇందులో క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము, సోడియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇంకా ఏ, సీ విటమిన్లతో పాటు థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్ తదితరాలు మెండుగా ఉంటాయి.
నేరేడుపండ్లు: సమ్మర్‌లో ఎక్కువగా లభించే పళ్లలో నేరేడు ఒకటి.నేరేడు పండ్లు, ఎండబెట్టిన గింజల పొడి, నేరేడు చిగుళ్లను తీసుకోవడం ద్వారా షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని చెబుతారు. ఇందులో విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం
జామపండ్లు: జామపండులో విటమిన్ ఏ, సి, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఈ పండ్లు మధుమేహులకు చాలా మంచివి. ఆరెంజ్‌లోని విటమిన్ సి జామపండులో నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. జామకాయను తినడం ద్వారా దంతాలు, చిగుళ్లకు బలం చేకూరుతుంది. జామపండును రోజుకు రెండేసి తీసుకోవడం ద్వారా షూగర్ ను కంట్రోల్ లో పెట్టవచ్చు.
పైనాపిల్: యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్న పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్య రక్షణకి అవసరమైన విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండు పైనాపిల్. ఎముకలకు ఇది బలం.
అంజీర్: వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అందుకే ఇది ఇన్సులిన్ ఫంక్షన్‌ని కంట్రోల్ చేస్తుంది.అంజీర్‌తో విటమిన్-ఎ, బి1, బి2, కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతోపాటు క్లోరిన్ లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment