90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..! | 90 Percent Of People Drink Water Incorrectly This Is The Best method | Sakshi
Sakshi News home page

90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!

Published Thu, Mar 21 2024 11:54 AM | Last Updated on Thu, Mar 21 2024 11:56 AM

90 Percent Of People Drink Water Incorrectly This Is The Best method - Sakshi

నీళ్లు తాగడం మంచిదని తాగుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఎలా తాగుతున్నం అనేది ఆలోచిస్తున్నారా?. చాలామంది చేసే తప్పే ఇది. పరగడుపునే నీళ్లు తాగమనగానే చల్లటి నీళ్లు తాగేస్తున్నారే తప్ప. కనీసం గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీళ్లను తీసుకునేందుకు యత్నించడం లేదు. పైగా నీళ్లు ఎక్కువుగా తాగుతున్నాం కదా!. అయినా ఈ సమస్యలేంటి అని వాపోతున్నారు. కానీ నీళ్లు తాగే పద్ధతి ఇది కాదు. అలాగే ఎప్పుడూ పడితే అప్పుడూ తాగిన ఆరోగ్యం మాట ఎలా ఉన్నా అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఎలా తాగితే మేలంటే..

ఇక నీటిని 90 శాతం మంది తప్పుగానే తాగుతుంటారు. ఈ విధంగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నీటిని తాగేందుకు కూడా ఒక పద్ధతి ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఆయుర్వేద ప్రకారం నీటిని భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం అనంతరం 30 నిమిషాలు ఆగి తాగాలి. అప్పుడే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కనుక భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ నీళ్లను తాగరాదు. అంతగా తాగాలనిపిస్తే ఒకసారి చప్పరించవచ్చు.

అంతేగాదు నీళ్లను ఎల్లప్పుడూ కూర్చునే తాగాలి. నిలుచుని తాగరాదు. లేదంటే అది జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తుంది. అది కిడ్నీల పనితీరును నెమ్మదింపజేస్తుంది. కనుక నీళ్లను ఎల్లప్పుడూ కూర్చునే తాగాలి. ఎల్లప్పుడూ గోరు వెచ్చని నీళ్లు లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీళ్లను తాగాలి. చల్లని నీళ్లను తాగరాదు. కానీ కుండలోని నీళ్లను తాగవచ్చు. ఫ్రిజ్‌లో చల్ల బరిచిన నీళ్లను తాగరాదు. తాగితే శరీరంలో కఫం పెరిగిపోతుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక మలబద్దకం సమస్య వస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను కూడా శరీరం సరిగ్గా శోషించుకోలేదు.

చల్లని నీళ్లను తాగడం వల్ల రక్త నాళాలు కుచించుకుపోతాయి. దీంతో గుండె జబ్బులు, హార్ట్‌ ఎటాక్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కనుక చల్లని నీళ్లను తాగరాదు. అలాగే ఒకేసారి పెద్ద మొత్తంలో నీళ్లను కూడా తాగరాదు. బాగా దాహంగా ఉందని ఆబగా తాగేయ్యకూడదు. నీళ్లను తాగేటప్పుడూ కొంత సమయం వ్యవధి ఇచ్చి తాగాలి. ఇలా ఎక్కువ మొత్తంలో నీళ్లను ఒకేసారి తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. జీర్ణాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మంచిది కాదు. కనుక నీళ్లను కొద్దిగా కొద్దిగా ఎక్కువ సార్లు తాగాలి.

నీళ్లను తగినంత మోతాదులో తాగకపోతే మూత్రం పసుపు రంగులో వస్తుంది. అంటే మీరు నీళ్లను సరిగ్గా తాగడం లేదని అర్థం చేసుకోవాలి. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల మేర నీళ్లను తాగాలి. అలాగే దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లను తాగాలి. అవసరం ఉన్నా, లేకపోయినా పదే పదే నీళ్లను తాగరాదు. నీళ్లను అవసరం లేకపోయినా ఎక్కువగా తాగితే కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో కిడ్నీల వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కిడ్నీలు చెడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

కనుక అవసరం ఉన్నంత మేరకే నీళ్లను తాగాల్సి ఉంటుంది. ఇక ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో మలబద్దకం సమస్య ఉండదు. అధిక బరువు తగ్గుతారు. గ్యాస్‌ సమస్య నుంచి బయట పడవచ్చు. గోరు వెచ్చని నీళ్లను ఒక లీటర్‌ వరకు కూడా ఉదయం తాగవచ్చు. కానీ కొంత సమయం ఇచ్చి తాగాల్సి ఉంటుంది. అప్పుడే ప్రయోజనాలను పొందవచ్చు.

(చదవండి: Sadhgurus Brain Surgery: మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement