way
-
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న భక్తులు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. బాధితులను రక్షించేందుకు వైమానిక దళానికి చెందిన చినూక్, ఎంఐ 17 హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. కేదార్నాథ్ మార్గంలో చిక్కుకుపోయిన 6,980 మందికి పైగా యాత్రికులకు రక్షించారు. ఇంకా 1,500 మందికి పైగా భక్తులు, స్థానికులు ఇప్పటికీ పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వీరిలో 150 మంది తమ కుటుంబాలను సంప్రదించలేని స్థితిలో ఉన్నారు.సోన్‌ప్రయాగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ విశాఖ అశోక్ భదానే మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు ఒక యాత్రికుడు మృతిచెందారు. కేదార్నాథ్ మార్గంలో చిక్కుకున్న 150 మందికి పైగా కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో మొబైల్ కనెక్టివిటీ లేకపోవడంతో తమ కుటుంబసభ్యులను సంప్రదించలేకపోతున్నారని ఆయన తెలిపారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామితో టెలిఫోన్లో మాట్లాడారు. విపత్తు అనంతరం జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం 599 మందిని విమానంలో, 2,380 మందిని కాలినడకన సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!
నీళ్లు తాగడం మంచిదని తాగుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఎలా తాగుతున్నం అనేది ఆలోచిస్తున్నారా?. చాలామంది చేసే తప్పే ఇది. పరగడుపునే నీళ్లు తాగమనగానే చల్లటి నీళ్లు తాగేస్తున్నారే తప్ప. కనీసం గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీళ్లను తీసుకునేందుకు యత్నించడం లేదు. పైగా నీళ్లు ఎక్కువుగా తాగుతున్నాం కదా!. అయినా ఈ సమస్యలేంటి అని వాపోతున్నారు. కానీ నీళ్లు తాగే పద్ధతి ఇది కాదు. అలాగే ఎప్పుడూ పడితే అప్పుడూ తాగిన ఆరోగ్యం మాట ఎలా ఉన్నా అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఎలా తాగితే మేలంటే.. ఇక నీటిని 90 శాతం మంది తప్పుగానే తాగుతుంటారు. ఈ విధంగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నీటిని తాగేందుకు కూడా ఒక పద్ధతి ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఆయుర్వేద ప్రకారం నీటిని భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం అనంతరం 30 నిమిషాలు ఆగి తాగాలి. అప్పుడే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కనుక భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ నీళ్లను తాగరాదు. అంతగా తాగాలనిపిస్తే ఒకసారి చప్పరించవచ్చు. అంతేగాదు నీళ్లను ఎల్లప్పుడూ కూర్చునే తాగాలి. నిలుచుని తాగరాదు. లేదంటే అది జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తుంది. అది కిడ్నీల పనితీరును నెమ్మదింపజేస్తుంది. కనుక నీళ్లను ఎల్లప్పుడూ కూర్చునే తాగాలి. ఎల్లప్పుడూ గోరు వెచ్చని నీళ్లు లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీళ్లను తాగాలి. చల్లని నీళ్లను తాగరాదు. కానీ కుండలోని నీళ్లను తాగవచ్చు. ఫ్రిజ్‌లో చల్ల బరిచిన నీళ్లను తాగరాదు. తాగితే శరీరంలో కఫం పెరిగిపోతుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక మలబద్దకం సమస్య వస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను కూడా శరీరం సరిగ్గా శోషించుకోలేదు. చల్లని నీళ్లను తాగడం వల్ల రక్త నాళాలు కుచించుకుపోతాయి. దీంతో గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కనుక చల్లని నీళ్లను తాగరాదు. అలాగే ఒకేసారి పెద్ద మొత్తంలో నీళ్లను కూడా తాగరాదు. బాగా దాహంగా ఉందని ఆబగా తాగేయ్యకూడదు. నీళ్లను తాగేటప్పుడూ కొంత సమయం వ్యవధి ఇచ్చి తాగాలి. ఇలా ఎక్కువ మొత్తంలో నీళ్లను ఒకేసారి తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. జీర్ణాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మంచిది కాదు. కనుక నీళ్లను కొద్దిగా కొద్దిగా ఎక్కువ సార్లు తాగాలి. నీళ్లను తగినంత మోతాదులో తాగకపోతే మూత్రం పసుపు రంగులో వస్తుంది. అంటే మీరు నీళ్లను సరిగ్గా తాగడం లేదని అర్థం చేసుకోవాలి. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల మేర నీళ్లను తాగాలి. అలాగే దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లను తాగాలి. అవసరం ఉన్నా, లేకపోయినా పదే పదే నీళ్లను తాగరాదు. నీళ్లను అవసరం లేకపోయినా ఎక్కువగా తాగితే కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో కిడ్నీల వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కిడ్నీలు చెడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక అవసరం ఉన్నంత మేరకే నీళ్లను తాగాల్సి ఉంటుంది. ఇక ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో మలబద్దకం సమస్య ఉండదు. అధిక బరువు తగ్గుతారు. గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. గోరు వెచ్చని నీళ్లను ఒక లీటర్ వరకు కూడా ఉదయం తాగవచ్చు. కానీ కొంత సమయం ఇచ్చి తాగాల్సి ఉంటుంది. అప్పుడే ప్రయోజనాలను పొందవచ్చు. (చదవండి: Sadhgurus Brain Surgery: మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..! -
ఏమీ చేయకుండా నెలకు రూ. 9 లక్షలు.. ఫలించిన కుర్రాడి ఐడియా!
ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి జనం వివిధ పద్ధతులను అవలంబిస్తుంటారు. ఇలా సంవత్సరానికి కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటారు. వీరిలో సంపాదనకు చక్కటి మార్గాలను కనుగొన్నవారు కూడా ఉన్నారు. వారిలో ఒకరే కరుణ్ విజ్. అతను భారతీయుడే అయినప్పటికీ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు. కరుణ్ విజ్ ప్రతి నెలా సగటున రూ.9 లక్షలు సంపాదిస్తున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు కరుణ్ సంపాదనకు లాభసాటి మార్గాన్ని కొనుగొన్నారు. 33 ఏళ్ల కరుణ్ మొదటి నుంచి ప్రాపర్టీ ఓనర్‌గా మారాలనుకునేవారు. రియల్ ఎస్టేట్.. మంచి లాభదాయకమైన వ్యాపారమని కరుణ్ కాలేజీ రోజుల్లోనే గ్రహించారు. ఈ సమయంలో కరణ్.. దేశంలోని ఇన్స్టిట్యూట్ల చుట్టుపక్కల ఉండే ఇళ్లకు సంబంధించి ఒక ఆలోచన చేసేవారు. మొత్తం ఇంటిని ఒకరికే అద్దెకు ఇవ్వకుండా.. గదుల ప్రాతిపదికన రెంట్ వసూలు చేయడం లాభదాయకమని భావించారు. ఇంటినంతటికీ అద్దెదారుకు అద్దెకు ఇవ్వకుండా విద్యార్థుల కోసం ప్రత్యేక గదులుగా మలచి, అద్దెకు ఇవ్వడం ఎంత ప్రయోజనకరమనేది గ్రహించారు. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం కరుణ్ కెనడాలో మొత్తం 28 గదులు కలిగిన నాలుగు ఇళ్లను కలిగి ఉన్నాడు. అతను వాటిని అద్దెకు ఇచ్చాడు. దీంతో ప్రతినెలా రూ.9 లక్షలకు పైగా మొత్తాన్ని ఆర్జిస్తున్నారు. అయితే ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు కరుణ్ దాదాపు రూ.19 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2016వ సంవత్సరంలో తన 26 ఏళ్ల వయస్సులో కరుణ్ కెనడాలోని అంటారియోలో తన మొదటి పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలో దాదాపు రూ.2.7 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసి, ఏడుగురు కాలేజీ విద్యార్థులకు అద్దెకు ఇచ్చారు. కరుణ్ కేవలం అద్దె ఆదాయంపై మాత్రమే ఆధారపడటం లేదు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కరుణ్ అప్లికేషన్స్ ఇంజనీర్‌గా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాలోని ఒక కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అద్దెల ద్వారా వచ్చే ఆదాయం, తన జీతం సొమ్ముతో కరుణ్.. దక్షిణ అంటారియోలో భారీగా ఆస్తులను కూడబెట్టారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత -
గర్భిణికి దారి కష్టాలు..
మంచిర్యాల: రోడ్డు సదుపాయానికి నోచుకోని గిరిజన గ్రామం అది. అత్యవసర సమయంలో ఆస్పత్రికి వెళ్లాలంటే కాలినడకన లేదా ఎడ్లబండే గతి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు, వంకలు దాటాల్సిందే. 108 అంబులెన్స్ రాక, వైద్య సౌకర్యం అందక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నెన్నెల మండలం కోనంపేట పంచాయతీ పరిధిలోని పాటి గ్రామానికి చెందిన గిరిజన మహిళ రెడ్డి మల్లక్క మూడు నెలల గర్భిణి. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దారిలేక ఆస్పత్రికి వెళ్లలేకపోయింది. బుధవారం తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎడ్లబండిపై లంబాడితండా ఎర్రవాగు వరకు తీసుకువచ్చారు. అక్కడ ఆటోలో ఎక్కించి అందరూ కలిసి అతికష్టం మీద వాగు దాటించి బెల్లంపల్లిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గతంలో దమ్మిరెడ్డిపేటకు చెందిన గిరిజనుడు జ్వరంతో బాధపడుతూ వాగు దాటలేక మృతి చెందాడు. ఎన్నికల ముందు సర్పంచ్ హామీ ఇచ్చినప్పటికీ రోడ్డు సౌకర్యం కల్పించలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే పాటి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకొని గిరిజనులు బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నేతలు మారినా అధికారులు వచ్చి చూసినా దారిచూపే నేతలు లేక మా రాతలు మారడం లేదని గిరిజనులు గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, నాయకులు స్పందించి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. -
ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ దారిలో అల్లు అర్జున్ అదే జరిగితే మహాద్బతమే....
-
షాకింగ్ ఘటన: రాత్రికి రాత్రే రోడ్డుని మాయం చేసిన దొంగలు
దొంగలు డబ్బులు, నగలు దొంగతనం చేస్తారని విన్నాం. అంతేందుకు స్ట్రీట్ లైట్లు, మొక్కలను కూడా ఎత్తుకుపోవడం గురించి కూడా విని ఉంటాం. కానీ ఏకంగా రెండు కిలోమీటర్ల రహదారిని దొంగలించడం గురించి విన్నారా!. అదీ కూడా రెండు గ్రామాలను కలిపే రహదారిని రాత్రికి రాత్రే మాయం చేశారు. ఈ షాకింగ్ ఘటన బిహార్‌లోని బంకా జిల్లా, రాజౌన్ ప్రాంతంలోని ఖరౌనీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....ఐదు రోజులు క్రితం వరకు ప్రజలు ఏళ్ల తరబడి వినయోగించినా.. ఖాదంపూర్, ఖరౌనీ అనే రెండు గ్రామాలను కలిపే రహదారిని ఉపయోగించారు. ఒక రోజు ఉదయం ప్రజలు అటుగా వెళ్తున్నప్పుడూ...రోడ్డు మొత్తం మాయమై దాని స్థానంలో పంటలు వేసి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గరయ్యారు గ్రామస్తులు. మొదట్లో వారు దారి తప్పాం అనుకున్నారు. ఆ తర్వాత గానీ వారికి అసలు విషయం అర్థం కాలేదు. ఖైరానీ గ్రామానికి చెందిన గూండాలు, రాత్రికి రాత్రే ట్రాక్టర్‌తో రహదారిని దున్ని గోధుమ పంటలను విత్తారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వ్యరేకించడంతో.. గుండాలు కొట్లాటకు దిగి కర్రలు, రాడ్లతో ప్రజలను బెదిరించారు. దీంతో ఖాదంపూర్ గ్రామానికి చెందిన దాదాపు 35 మంది ప్రజలు సర్కిల్ పోలీస్ అధికారి మహ్మద్ మెయినుద్దీన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఆక్రమణకు పాల్పడినట్లు తేలితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు పోలీసు అధికారి హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయానికి వినియోగిస్తున్న ఆక్రమిత భూమిని తొలగించి తిరిగి రోడ్డు వేస్తామని కూడా చెప్పారు. (చదవండి: ఆప్ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్) -
మంచి మాట: సాధన.. ఓ తపస్సు
ఏ విద్యలోనైనా పట్టు రావాలంటే సాధన అవసరం. అది నిరంతరం కొనసాగాలి. ‘అభ్యాసం కూసు విద్య..’ అన్నారు కదా పెద్దలు. అభ్యసించటానికి శ్రద్ధాసక్తులే కాక అకుంఠిత దీక్ష కావాలి. దానికి పట్టుదల కలవాలి. ఇష్టపడి నేర్చుకున్న ఒక విద్యను అభ్యసించవలసి వుంటుంది. ఆ విద్యను సరిగా ఒక గురువు వద్ద నేర్చుకోవాలి. సుశిక్షితులైన పిదప నేర్చిన విద్యను అభ్యసించాలి. అపుడే దానికొక దిశ – దశ ఏర్పడతాయి. సక్రమ మార్గం ఏర్పడుతుంది. నేర్చుకున్న విద్య కరతలామలకమవ్వాలంటే అభ్యాసం వల్లే సాధ్యం. సరైన శిక్షణ లేని విద్య సాధన చేయటం సమయం వృథా. ఇక్కడ జాగరూకత చాలా అవసరం. తపస్సుకు మనో నిశ్చలత అత్యంత ప్రధానమైనది. ఒక దైవాన్ని మనస్సు లో ప్రతిష్టించుకోవాలి. ఆ దేవుడి నామాన్నో.. మంత్రాన్నో ఉచ్చరిస్తూ వుండాలి. జగాన్ని మరవాలి. పెదవుల కదలికలు నెమ్మది.. నెమ్మదిగా అదృశ్యమై మీ ఉచ్ఛ్వాస,.. నిశ్వాసాలే ఆ నామ, మంత్రాలవుతాయి. ఇది తపస్సులో గొప్ప దశ. ఆ అద్భుత స్థితికి చేరగలిగామా.. తపస్సులో అత్యున్నత దశకు చేరుకున్నట్టే. సాధనలో కూడ అంతటి త్రికరణ శుద్ధి కావాలి. అపుడే మనం అభ్యసిస్తున్నా దానిలో గొప్ప ప్రావీణ్యం పొందుతాం. ఎలాగూ మన మనస్సుకు నచ్చిన విద్యను ఎంపిక చేసుకుంటాం కనుక ఆమూలాగ్రంగా నేర్చుకోవాలి. ఏకాగ్రతతో సాధన చేయాలి. మన శక్తియుక్తుల్ని ధారపోయాలి. సంకల్పం... పట్టుదల..మనోనిశ్చలత.. ఏకాగ్రత.. ఈ శక్తుల పిల్ల కాలువలన్నీ సాధన అనే మహా నదిగా మారిన వేళ.. మార్చుకున్న వారికి విద్య స్వాధీనమై.. విద్వత్తు వశమవదా..! సా.. ధ.. న అనే మూడు అక్షరాల వెనుక ఇన్ని శక్తుల కలయిక ఉందని.. ఉంటుందని గ్రహించాలి. అలా గ్రహించిన వారే వాటిని తమలో అంతర్గతంగా వుంటే గుర్తిస్తారు. లేకుంటే అలవరచుకుంటారు. అటువంటి వారే ఆ సాధనా తపస్సులో పరిపూర్ణులవుతారు. ఆ తపోఫలితాన్ని పొందుతారు. సాధారణంగా ఎవరైనా.. నేర్చుకున్న విద్యను సాధన చేస్తారు. ఇది లోకరీతి. గురువు చెప్పిన విద్యను దాని లోతుపాతులను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే బాగా అభ్యసించాలి. జీవితంతో పోల్చి చూసుకోవాలి. స్వీయ అనుభవాలు, ఇతరుల అనుభవాలు పరిశీలించాలి. ఆ సాధనకు విచక్షణ, వివేచనల తోడు చేసి మరింతగా గట్టిపరచుకోవాలి. కొందరికి అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులంటాయి. వారి వైఖరే వేరు. అసలు గురువునుండి విద్యను గ్రహించి ఆకళింపు చేసుకునే పద్ధతే విభిన్నం. కౌరవులకు .. పాండవులకు విలువిద్య నేర్పే ఆరంభ దశలోనే.. బాణంతో చేధించవలసిన పక్షికన్ను తప్ప ఇంకేమి కనుపించటంలేదన్న అర్జునుడి మాటలతో అతనే ఆ విద్యకు సరైన అర్హుడని నిర్ణయించుకున్నాడు ద్రోణాచార్యుడు. గొప్ప కలయిక వారిరువురిది. ఏకాగ్రతతో గురువు చెప్పిన విద్యను సాధన చేయసాగాడు. ఓ రాత్రివేళ.. దీపంలేని తరుణాన... భోజనం చేయగలిగిన పార్థుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. చీకటిలో శబ్దాన్ని బట్టి.. ఆ దిశ వైపు బాణం వేసి వేటాడటం నేర్చుకున్నాడు. గొప్పగా సాధన చేసాడు. పట్టు సంపాదించాడు. తన గురువు మెప్పు పొందాడు. గురువు నేర్పిన విద్యను సాధన చేసే క్రమంలో వచ్చే ఆలోచనలకు తన అద్భుత ఊహశక్తిని మేళవించి తాను నేర్చిన.. నేర్చుకుంటున్న విద్యకు ఒక రూపు.. కోణం.. ఓ వైవిధ్యతను.. ఓ విభిన్నతను కలిపి ఆ విద్యను పరివ్యాపితం చేసాడు తన శక్తి యుక్తులతో. తన గురు ప్రశంస పొందాడు. అలా విశేషమైన ప్రతిభ కల శిష్యులుంటారు. ప్రతిభకు వైవిధ్యం తోడైతే అది ఓ అద్భుతమే. అంతే కాదు.. ఓ నవ నవోన్మేషమే అవుతుంది. విశ్వనాథ సత్యనారాయణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభృతులు అటువంటి ప్రతిభ సంపన్నులే. నిరంతర సాధన మన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎనలేని ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. పొరపాట్లు.. తప్పిదాలను గమనించి వాటిని సరిదిద్దుకునే అవకాశమిస్తుంది. విద్యాప్రతిభను ప్రదర్శించే సందర్భాలు నల్లేరు మీద బండిలా సాగాలంటే అభ్యాసం తప్పదు. భూ గర్భంలోని రత్నం వంటిదే ప్రతిభ. రత్నాన్ని వెలిక్కితీసి సానపెడితే కాని ధగధగద్ధాయమానంగా ప్రకాశించదు. మనలోని పాడగలిగే గొంతుకకైనా.. అద్భుత కవితాశక్తికైనా... చిత్రలేఖనా ప్రతిభకైనా మార్గదర్శకత్వం చేయగల గొప్పగురువు కావాలి. ఆయన నుండి పొందిన మన జ్ఞానానికొక పరిపుష్టి.. పరిపూర్ణత.. అద్భుత స్వాధీనత.. రాణింపు రావాలంటే సాధన కావాలి. ఒక విద్వాంసుడి.. లేదా ఒక కళాకారుడి ప్రతిభ నిజానికి పేరు ప్రఖ్యాతులు ఎంత బాగా వస్తే వారు అంత ఎక్కువగా సాధన చేయాలి. ఒక కళాకారుడు అత్యున్నత స్థాయికి చేరిన తరువాత అతని ప్రదర్శన తిలకించటానికి వచ్చేప్రేక్షకులు అది అత్యున్నతంగా ఉండాలని... ఉంటుందని ఆశించి వస్తారు. అది ఎంతో సహజమైనది. తాను ఎప్పుడూ ఇస్తున్న ప్రదర్శనే కదా.. సాధన ఎందుకు చేయాలన్న ఆలోచన ఏ కళాకారుడికైనా.. పండితుడికైనా వచ్చిన క్షణం అతడి ప్రతిభాభానుడికి మేఘాలు కమ్ముతాయి. కళాకారులు ఎంతటి లోకప్రసిద్ధులైతే అంతటి సాధన కావాలి. చేయాలి. వారి స్థాయికి తగ్గని ప్రదర్శన ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే సాధన చేయక తప్పదు. సాధన చేసే క్రమంలో ఏకాగ్రత.. పట్టుదలలు సడలకూడదు. మనస్సు చంచలం కాకూడదు. సాధన ఎంత కాలం చేయాలి, దీనిని ఎక్కడ ఆపాలి..? అసలు ఆపచ్చా... అన్న ప్రశ్నలు.. సందేహాలు వస్తుంటాయి. సాధన నిలుçపు చేయటం అన్న ఆలోచనే పుట్టకూడదు మనలో. వచ్చిన క్షణం మనలో నేర్చుకునే తపన చనిపోతుంది. చాలానే నేర్చుకున్నామన్న తృప్తి.. ఇంకా నేర్చుకోవలసిన అవసరం లేదన్న ఆలోచనే అందుకు కారణం! సాధనకు దూరమయ్యామంటే నేర్చుకున్న విద్య మీద పట్టు తగ్గచ్చు. అందుకే సాధన ఒక జీవనది కావాలి. ఎంత సాధన చేస్తే. అంత పరిపూర్ణత. అంత అలవోకగా చేయగల సామర్థ్యం వస్తుంది. నేర్చుకునే సమయంలో సాధన చాలా మంది చేస్తారు. ఇది సహజం. ఒక దశకు చేరుకున్న తరువాత శ్రద్ధ పెట్టం. కాని సాధన ఊపిరున్నంత వరకు చేయాల్సిందే. అలా చేసినవారే తమ విద్వత్తును, దానిలోని సారాన్ని అనాయాసంగా చదువరులకు లేదా శ్రోతలకు ఇవ్వగలరు. రంజింప చేయగలరు. ‘మాలో మీరనే ఉత్కృష్టత నిరంతరాభ్యాసం వల్ల ఒక అలవాటుగా మారింది’ అన్నారు గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. -
దానిమ్మను ఇలా ఒలిచేయండి.. ఈజీగా
-
దానిమ్మను ఇలా ఒలిచేయండి.. ఈజీగా
దానిమ్మ కాయ గురించి తెలియని వారు వుండరు. అనేక ఔషధ లక్షణాలను తనలోదాచుకున్న దానిమ్మ అంటే ఇష్టం పడనివారు దాదాపు ఎవరూ వుండరు. ఎర్రటి గింజలతో చూడగానే నోరూరించే దానిమ్మ జ్యూస్‌ను సేవిస్తే..రక్తహీనత నుంచి బయటపడవచ్చని వైద్యులు చెపుతారు. అలాగే దానిమ్మ పండు పైన ఉన్న బెరడును పదిగ్రాములు తీసుకుని దాన్ని కషాయంగా కాచి తాగితే విరోచనాల నుంచి విముక్తి కలుగుతుందట. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా దానిమ్మ గింజలను తింటే క్యాన్సర్ బారి నుంచి గట్టెక్కవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. అయితే.. దానిమ్మ కాయలు వలవడం అంటే అంత సులువు కాదు. కొంచెం కష్టపడాల్సిందే. దానిమ్మ గింజలు చితికిపోకుండా, దుస్తుల మీద గింజల రసం పడకుండా.. జాగ్రత్తగా ఒలవాలి. ఎందుకంటే.. దానిమ్మ రసం దుస్తుల మీద పడితే... ఆ మరకలు ఒక పట్టాన పోవు. దీంతో దానిమ్మ గింజలు ఒలవడం అంటే ఓర్పు, నేర్పూ వుండాలి. దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ తాజాగా దానిమ్మగింజలు ఒలిచే విధానంపై ఒక వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరి సులభమైన ఆ విధానం కథా కమామిషు ఏంటో మీరు కూడా ఒకసారి వీక్షించండి.. ఇప్పటికే చూశారా.. అయినా మరోసారి చూసేయండి! -
ఓ మృతుని ఆత్మఘోష
గుంటూరు, శావల్యాపురం: అంతా శూన్యం..అంతా నిర్వేదం..అంతా నిస్సత్తువ..ఎన్నో ఏళ్లుగా నా చుట్టూ అల్లుకున్న బంధాలు, అనుబంధాలు అన్నీ తీరిపోయాయి. కట్టెగా మారిన నా శరీరం వద్ద రాలిన కన్నీటి బొట్లు నా ఆత్మఘోషకు ఆజ్యం పోశాయి. సొంత ఇంటిని, పుట్టిన ఊరిని, ఈ లోకాన్ని వదిలిన నన్ను సాగనంపుతున్న వేళ.. ఇదిగో వాగు..కొద్దిసేపు ఆగు అంటూ నాతోపాటు నన్ను తీసుకెళుతున్న వారినీ నిలేసింది. తన ఉధృతితో చచ్చిన నన్ను తీసుకెళుతున్న బతికున్న వారినీ భయపెట్టింది. వీడి చావు మన చావుకొచ్చిందిరా అంటూ ఆ వాగు దాటలేక నా బంధువే ఒకరు అన్న మాటలు ఆగిన నా గుండెల్లో కన్నీటి సుడులయ్యాయి. అప్పుడు నా కళ్ల ముందు అధికారులకిచ్చిన వినతిపత్రాలు, పాలకులు ఇచ్చిన హామీలు పొరలు పొరలుగా కనిపించాయి. జన్మభూమి అంటూ ఊళ్లోకి వచ్చిన వారికి వాగు దాటే దారి చూపించండయ్యా అంటూ వేడుకున్న గుర్తులు ఈ ప్రవాహంలో కలిసిపోతున్నట్టే అనిపించాయి. అందుకే పాలకులారా ? అధికారులారా ? మిమ్మల్ని ఒక్కటే వేడుకుంటున్నా, బతికున్నప్పుడు ఎలాగూ మా సమస్యలు పట్టించుకోలేదు.. కనీసం చచ్చాకైనా మా కాలనీవాసుల అంతిమయాత్ర వెంట నలుగురు నడిచేలా దారి చూపించండి. – శావల్యాపురం మండలం బొందిలిపాలెం దళితవాడలో ఓ మృతుని ఆత్మఘోష -
బాబు తీరు రాష్ట్రానికి శాపమైంది: కేవీపీ
సాక్షి, ఢిల్లీ: వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారు.. ఆయన తీరు రాష్ట్రానికి శాపంగా మారిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఈమేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. నాలుగేళ్లయినా విభజన చట్టంలోని హామీలను అమలు చేయించుకోలేకపోయారన్నారు. దోపిడీ వాటాలు కుదరక ప్రాజెక్టులు ఆలస్యం చేస్తున్నారని, అమరావతి లో శాశ్వత భవనాలకు ఇటుక పేర్చలేదని విమర్శించారు. విభజన చట్టం హామీలపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. చివరి నిమిషంలో బిజెపిపై నిందలేస్తే ప్రజలు క్షమించరని హితవు పలికారు. ఆస్పత్రి పేర దుబాయ్ కంపెనీకి భూములు ఇవ్వడంలో ఉన్న ఆసక్తి ఎయిమ్స్ నిర్మాణంపై లేదని, కాంట్రాక్టర్ల రేట్ల కోసం కేంద్రంతో తగాదాపడడం విడ్డూరంగా ఉందని కేవీపీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హెరిటేజ్, బిగ్‌బజార్ ప్రయోజనాల కోసం రాజీపడుతున్నారని ఆరోపించారు. విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదంటూ టీడీపీ కూడా రెండుసార్లు విభజన లేఖలు ఇచ్చిందని వెల్లడించారు. -
హైవేలపై వైన్ దుకాణాలకు నో
ఏప్రిల్ నుంచి లైసెన్స్‌లను పునరుద్ధరించం కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రకటన 28వ రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభం బాలాజీచెరువు (కాకినాడ సిటీ) : సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ నుంచి జాతీయ రహదారులపై మద్యం దుకాణాలను అనుమతించేది లేదని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ప్రకటించారు. 28వ రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో గురువారం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో జాతీయ రహదారుల వెంబడి ఉన్న వైన్ షాపుల లైసెన్స్ మార్చి నెలాఖరుతో ముగుస్తుందని, ఆ తర్వాత వాటిని పునరుద్ధరించబోమని చెప్పారు. వాహనాల సంఖ్యలోను, ప్రమాదాల్లో కూడా రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో ఉందన్నారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించామని కలెక్టర్ చెప్పారు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. జాతీయ రహదారుల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, రోడ్డు మరమ్మతులను త్వరలో చేపడతారన్నారు. రోడ్ల భద్రత అనేది పాఠశాలల స్థాయిలో పాఠ్యంశంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. వాహన డ్రైవర్లు అతి వేగానికి నిర్లక్ష్యానికి, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. దీనివల్ల పోలీసు శాఖకు చెందిన ఇంటర్ సెప్టార్ వాహనం సాయంతో ఆ ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించవచ్చన్నారు. అలాగే డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకుండా నివారణ చర్యలు కూడా చేపట్టినట్టు తెలిపారు. రూ. 1100 కోట్లతో జాతీయ రహదారి అభివృద్ధి సమావేశంలో రోడ్డు భవనాల శాఖ ఎస్ఈ సీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ జాతీయ రహదారి 216ను జిల్లా పరిధిలో రూ.1100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అలాగే సామర్లకోట- రాజానగరం ఏడీబీ రోడ్డును రూ.325 కోట్లతో నాలుగు లైన్లుగా విస్తరిస్తామని చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే 292 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి, ఈ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇన్చార్జి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) సిరి ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్యశాఖ డీసీహెచ్ డాక్టర్ పవన్ కిషోర్, సమాచారశాఖ డీడీ ఎం.ఫ్రాన్సిస్ కూడా ప్రసంగించారు. అనంతరం రోడ్డు భద్రతా వారోత్సవాల పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కె.చంద్రయ్య, ఎంవీఐలు నరసింహారావు, శివకామేశ్వరరావు, వీజీఎస్ తిలక్, ఆర్.సురేష్, శ్రీనివాస్, ఆయేషా, కల్యాణి, ఎం.రవికుమార్, పరంధామరెడ్డి, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
దారి కోసం ఘర్షణ
ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు ప్రత్తిపాడు : శరభవరంలో దారి విషయమై రెండు కుటుం బాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు శరభవరంలోని మార్కెట్ సమీపంలో నామాల రామలక్ష్మి, పోకల వెంకటేశ్వరరావు అనే బాబులు కుటుంబాల మధ్య ఏడాది కాలంగా దారి విషయమై వివాదం ఉంది. ఈ విషయమై çశుక్రవారం నామాల సురేష్, అతని తల్లి రామలక్ష్మి, సోదరి ధనేకుల సుబ్బలక్ష్మి కర్రలతో వెంకటేశ్వరరావు కుటుంబీకులపై దాడికి పాల్పడ్డారు. ఈసంఘటనలో బాబులు (43) అక్కడికక్కడే మృతి చెందగా, అతని సోదరుడు బ్రహ్మరాజు, తల్లి లక్ష్మి నరసమ్మ గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వీరిలో తలకు తీవ్రగాయమైన బ్రహ్మరాజును ప్రా«థమిక చికిత్స అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. సీఐ జి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం, అన్నవరం ఎస్సైలు ఎం నాగదుర్గారావు, వై రవికుమార్, పార్థసారధి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
దారి లేక నిలిచిన అంత్యక్రియలు
ఖానాపూర్: శ్మశాన వాటికకు వెళ్లేందుకు కూడా దారి వదల కుండా అటవీశాఖ అధికారులు చుట్టూ కంద కాలు తవ్వడంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఓ వృద్ధురాలి అంత్యక్రియలు వారుుదా పడ్డారుు. మండల కేంద్రమైన ఖానాపూర్లోని గాంధీనగర్, అశోక్‌నగర్, సుభాష్‌నగర్ కాలనీ ప్రజలు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలు చేస్తారు. అటవీ అధి కారులు శ్మశానానికి దారి వదలకుండా చుట్టూ కందకాలు తవ్వారు. గాంధీనగర్ కాలనీకి చెందిన బాదే రాజవ్వ(80 సోమవారం అనారోగ్యంతో చనిపోరుుంది. శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు దారి లేకపోవడంతో అంత్యక్రియలు వారుుదా వేస్తున్నట్లు కాలనీవాసులు తెలిపారు. -
క్లస్టర్ విధానంలో సేంద్రియ సాగు
రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణకు సన్నాహాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతి సేద్య సలహాదారు విజయ్‌కుమార్ గోకవరం : క్లస్టర్ విధానం ద్వారా రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతిసేద్య సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.విజయ్‌కుమార్ తెలిపారు. గోకవరం మండలం వీరలంకపల్లిలోని కొరిపల్లి అప్పలస్వామి అనే రైతు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 131 క్లస్టర్లలో రెండు లక్షల మంది రైతులతో సేంద్రియ సాగు చేపట్టామన్నారు. సుమారు 300 రైతులతో మండలాన్ని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న మూడేళ్లలో ఒక్కొక్క క్లస్టర్ నుంచి 30 మంది రైతులను ఎంపిక చేసి, వారి ద్వారా మిగిలిన చోట్ల సేంద్రియ సాగును విస్తరిస్తామన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువులు వాడుతున్న పొలాలు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోలేకపోతున్నాయని విజయ్‌కుమార్ తెలిపారు. వాటితో పోలిస్తే సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటలే ప్రకృతి వైపరీత్యాల వల్ల సోకుతున్న అనేక చీడపీడలను తట్టుకుని నిలబడగలుగుతున్నాయన్నారు. సేంద్రియ సాగుకు అవసరమైన కషాయాల విక్రయ షాపులను త్వరలో అన్నిచోట్లా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేడీఏ కేఎస్వీ ప్రసాద్, వ్యవసాయశాఖ సంచాలకుడు లక్ష్మణ్‌రావు, ఆత్మా పీడీ పద్మజ, ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ సుబ్బారావు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ యువతా ప్రకృతి సాగు వైపు.. ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం): సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడిన యువత కూడా సేంద్రియ సాగుపై ఇప్పుడిప్పుడే ఆసక్తి కనబరుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతి సేద్య సలహాదారు, రైతు సాధికారిక సంస్థ ఉపాధ్యక్షుడు పి.విజయ్‌కుమార్ అన్నారు.రైతులంతా సేంద్రియ సాగుపై మక్కువ చూపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయనన్నారు. వ్యవసాయశాఖ, కదలిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని చందా సత్రంలో నిర్వహిస్తున్న సహజ సేద్యం కళాజాతాలో బుధవారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా నిరోధించి నాణ్యమైన దిగుబడిలే లక్ష్యంగా రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో ప్రకృతి సేద్య ప్రదర్శనా క్షేత్రాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.జేడీఏ కేఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి సేద్యం కోసం వివిధ మండలాల్లో క్లస్టర్ గ్రామాలను ఎంపిక చేశామన్నారు. అనంతరం ఆర్అండ్ బీ అతిథి గృహంలో జిల్లాలోని ఏడీఏలు, ఏవోలు, ఏఈవో, ఎంపీఈవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ, ప్రకృతి సేద్య నిపుణులు వైవీ సుబ్బారావు, పవన్, రాజమహేంద్రవరం ఏడీఏ సూర్య రమేష్ పాల్గొన్నారు. -
స్వర్గానికి దారి.. దొరికినట్లే!
బ్రాండ్.. బాజా! - హెచ్డీ మద్యం ఇక అధికారికం - బలవంతంగా అంటగడుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు - చక్రం తప్పిన నంద్యాల ఎంపీ - అధికార పార్టీ నేత కావడంతో చెల్లుబాటు - ఒక్కో షాపునకు 300-400 కేసుల సరఫరా - అమ్ముడుపోక దుకాణదారుల గగ్గోలు అధికార పార్టీ నేతలు ఏమి చేసినా చెల్లుబాటే. మద్యం మత్తు కుటుంబాలను కాటేస్తున్నా.. మహిళల జీవితాలు నాశనం అవుతున్నా.. వీరికి వ్యాపారమే ప్రధానం. ఎంతలా అంటే.. దుకాణాలకు బలవంతంగా సరుకు అంటగట్టేంత. అది కూడా.. ప్రభుత్వ శాఖను అడ్డం పెట్టుకొని మరీ బరి తెగించడం టీడీపీ నాయకులకే చెల్లుబాటు. స్వర్గానికి దారి పేరిట నరకం చూపుతున్న తీరు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్వర్గానికి ద్వారం(హెవెన్ డోర్–హెచ్డీ). నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి విడుదల చేసిన ఈ మద్యం బ్రాండ్ ఇప్పుడు జిల్లాలో దుమ్ము రేపుతోంది. ఒక్కో మద్యం షాపునకు కచ్చితంగా 300 కేసుల నుంచి 400 కేసుల వరకూ సరఫరా అవుతోంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఎక్సైజ్ సిబ్బంది మద్యం షాపులకు లక్ష్యాలు విధించి మరీ హెచ్డీ మద్యాన్ని కేసులకు కేసులు సరఫరా చేస్తున్నారు. కేవలం గత సెప్టెంబర్ నెలలోనే జిల్లాలోని మద్యం షాపులకు హెచ్డీ బ్రాండ్ మద్యం ఏరులై పారింది. తాజా పరిణామాలతో అధికారపార్టీలో చేరినందుకు ఆయనకు స్వర్గానికి దారి దొరికిందేమో కానీ.. మాకు మాత్రం నరకానికి దారి కనిపిస్తోందని మద్యంషాపుల యాజమాన్యాలు వాపోతున్నారు. కొనుగోలు చేసిన సరుకు అమ్ముడుపోక.. మిగిలిన సరుకు ఉంచుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తాము కొనుగోలు చేయమంటే.. ఏ బ్రాండ్ మద్యం ఇచ్చేది లేదని ఎక్సైజ్ సిబ్బంది బెదిరిస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తంగా జిల్లాలోని మద్యం షాపులన్నీ ఇప్పుడు హెచ్డీ బ్రాండ్లతో నిండిపోయాయి. కొన్ని షాపుల్లో ఏకంగా 200 కేసుల వరకూ ఇప్పుడు హెచ్డీ స్టాక్ మూలుగుతోంది. కోట్ల మద్యం జిల్లాలో మొత్తం 203 మద్యం దుకాణాలు ఉండగా.. ఒక్కో మద్యం దుకాణానికి 200 నుంచి 400 కేసుల వరకూ హెచ్డీ మద్యాన్ని సరఫరా చేశారు. కర్నూలు నగరంలో ఒక్కో షాపునకు 400 కేసులు సరఫరా చేస్తుండగా.. మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉన్న షాపులకు 200–300 కేసులను అంటగడుతున్నారు. ఈ లెక్కన సగటున ఒక్కో షాపునకు 250 కేసుల మద్యాన్ని లెక్కించినా.. 203 షాపులకు 50,750 కేసుల మద్యం సరఫరా అయ్యిందన్నమాట. ఒక్కో కేసుకు రూ.2 వేల చొప్పున రూ.10 కోట్లకుపైగా హెచ్డీ మద్యం కేవలం అక్టోబర్ నెలలో మాత్రమే సరఫరా చేయడం గమనార్హం. అధికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లతో మద్యం షాపులన్నీ ఇప్పుడు స్వర్గ జపం చేస్తున్నాయి. ఎక్సైజ్ సిబ్బంది టార్గెట్ తమ మద్యాన్ని విక్రయించుకునేందుకు అధికార పార్టీ నేత దగ్గరిదారి ఎంచుకున్నారు. ప్రత్యేకంగా మార్కెట్ టీం ఎందుకులే అనుకున్నారో ఏమో నేరుగా ఎక్సైజ్ సిబ్బందికే లక్ష్యాలు విధించారు. ఒక్కో ఎక్సైజ్ సీఐ స్టేషన్ పరిధిలో ఒక్కో మద్యం షాపు కచ్చితంగా 300 నుంచి 400 కేసుల వరకూ కొనుగోలు చేసేలా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఇప్పించారు. ఫలితంగా జిల్లాలోని అన్ని మద్యం షాపులు 300 నుంచి 400 కేసుల వరకూ హెచ్డీ మద్యాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఒక్కో కేసులో 12 మద్యం సీసాలు ఉంటారు. అది కూడా ఒక్కొక్కటి ఫుల్ బాటిల్ కావడం గమనార్హం. ఈ విధంగా ఒక్కో కేసును రూ.2 వేలు చెల్లించి మరీ మద్యం షాపు యాజమాన్యాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఒక్కో కేసుకు రూ.2 వేల చొప్పున లెక్కిస్తే 300 కేసులకు రూ.6 లక్షలు, 400 కేసులైతే రూ.8 లక్షలు చెల్లించి మరీ కొనుగోలు చేయాల్సి వస్తోందని మద్యం షాపుల యజమానులు వాపోతున్నారు. -
అద్భుతం.. భరతనాట్యం
బంజారాహిల్స్ అద్బుతమైన నాట్యంతో భరతనాట్య కళాకారిణి కిరణ్మయి మడుపు నాట్యప్రియులను కట్టిపడేసారు. శుక్రవారం బంజారాహిల్స్ సప్తపర్ణిలో ‘ మార్గం ’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పలు కీర్తనలకు ఆకట్టుకునే అభినయంతో చేసిన నాట్యం ఆహుతులును ఉర్రూతలూగించింంది. కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి , బీజేపీ నేత దగ్గుపాటి పురందేశ్వరి, హైదరాబాద్ పాస్ ఎడిటర్ సర్వాని పొన్నం పాల్గొన్నారు. -
జోరుగా వర్షాలు
జిల్లాలో 2.2 సెం.మీ వర్షపాతం నమోదు సత్తుపల్లి, పినపాక, ముల్కలపల్లి మండలాల్లో కుండపోత ఖమ్మం వ్యవసాయం: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాల్లో శనివారం మొదలైన వర్షాలు ఆదివారం నాటికి పుంజుకున్నాయి. ఆదివారం రోజున మూడు మండలాలు (ఎర్రుపాలెం, బోనకల్లు, ఇల్లెందు) మినహా అన్నిచోట్ల వర్షం కురిసింది. ఆదివారం ఉదయానికి జిల్లా సగటు వర్షపాతం 2.2 సెం.మీ.గా నమోదైంది. సత్తుపల్లి, పినపాక, ముల్కలపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. చండ్రుగొండ, వెంకటాపురం, దుమ్మగూడెం, భద్రాచలం, దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి, కూసుమంచి మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. 14 మండలాల్లో సాధారణ స్థాయిలో, 13 మండలాల్లో అక్కడక్కడ వర్షం పడింది. అత్యధికంగా సత్తుపల్లి మండలంలో 7.82 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పుంజుకున్న వర్షపాతం జిల్లాలో వర్షపాతం కొంతమేరకు పుంజుకుంది. ఏడు మండలాల్లో (పినపాక, మణుగూరు, అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, ముల్కలపల్లి, సత్తుపల్లి) సాధారణానికి మించి (20 శాతానికి పైగా) వర్షపాతం నమోదైంది. 28 మండలాల్లో (వాజేడు, వెంకటాపురం, చర్ల, గుండాల, దుమ్ముగూడెం, పాల్వంచ, కొత్తగూడెం, టేకులపల్లి, ఇల్లెందు, బయ్యారం, గార్ల, కామేపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, ఏన్కూరు, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, ముదిగొండ, వైరా, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం)లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆరు మండలాల్లో (సింగరేణి, చింతకాని, కూసుమంచి, తిరుమలాయపాలెం, కొణిజర్ల, నేలకొండపల్లి) ఇంకా లోటు వర్షపాతమే ఉంది. మొత్తంగా చూస్తే, సింగరేణి మినహా ఏజెన్సీ అంతటా వర్షపాతం సాధారణం.. అంతకున్నా ఎక్కువగా ఉంది. మైదాన ప్రాంతంలోని ఐదు మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. జలాశయాల్లోకి చేరుతున్న నీరు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది... ఇంకా చేరుతోంది. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టులోకి వరద నీటి రాక పెరుగుతోంది. సత్తుపల్లి మండలంలోని జలాశయాల్లోకి నీరు చేరుతోంది. ముల్కలపల్లి మండలంలోని ముత్యాలంపాడు వాగు ప్రవహిస్తోంది. మూకమామిడి ప్రాజెక్టులోకి కూడా వరద నీరు వస్తోంది. దమ్మపేట మండలంలోని చెరువులు, కుంటలు నిండుతున్నాయి. వేంసూర్ మండలంలో దిద్దుపూడి వాగు ప్రవహిస్తోంది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టులోకి నీరు చేరుతోంది. కొత్తగూడెం మండలంలోని ముర్రేడు వాగు ప్రవహిస్తోంది. మణుగూరు, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు మండలాల్లోని చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది. ప్రస్తుతం సాగులోగల పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి తదితర పైర్లకు ఈ వర్షాలు ఉపయోగపడతాయి. జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు (సెం.మీలలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––– మండలం వర్షపాతం(సెం.మీ.లలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––– 6–9 సెం.మీల మధ్య వర్షపాతం నమోదైన మండలాలు సత్తుపల్లి 7.82 పినపాక 6.66 ముల్కలపల్లి 6.00 3–6 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదైన మండలాలు పెనుబల్లి 5.34 చండ్రుగొండ 5.24 భద్రాచలం 4.94 దమ్మపేట 4.68 వెంకటాపురం 4.52 దుమ్ముగూడెం 4.52 వేంసూరు 3.30 కూసుమంచి 3.24 1–3 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదైన మండలాలు కల్లూరు 2.88 అశ్వాపురం 2.80 ముదిగొండ 2.78 బూర్గంపాడు 2.46 పాల్వంచ 2.38 చర్ల 2.28 వాజేడు 2.22 నేలకొండపల్లి 1.92 అశ్వారావుపేట 1.88 కొత్తగూడెం 1.76 మణుగూరు 1.66 జూలూరుపాడు 1.28 ఏన్కూరు 1.02 గుండాల 1.00 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మూడు మండలాల్లో వర్షం కురవలేదు. మిగిలిన 13 మండలాల్లో ఒక సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. –––––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
మండల కేంద్రానికి దారేది?
బీటీ రోడ్డు లేక 50కి.మీ. తిరగాల్సిన దుస్థితి గ్రామస్తులు దూరభారం పట్టించుకోని పాలకులు జైనథ్ : పాలకులు మారినా..ప్రభుత్వాలు మారిన గ్రామాలకు మాత్రం రవాణా సౌకర్యం మెరుగుపడడం లేదు. స్వరాష్ట్రం ఏర్పడినా అదే దుస్థితి. మండలంలోని జామ్ని, జున్నపాని, మేడిగూడ, పార్డి, మాంగుర్ల తదితర గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. 10 కి.మీ దూరానికి రోడ్డు లేని కారణంగా 50 కిలోమీటర్లు ప్రయాణించి మండల కేంద్రానికి చేరుకుంటున్నారు. దీంతో దూరభారంతోపాటు సమయమంతా వథా అవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. జామ్ని, జున్నపాని, మేడిగూడ, పార్డి, మాంగుర్ల నుంచి మండల కేంద్రం జైనథ్‌కు వెళ్లేందుకు నేరుగా బీటీ రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు ముందుగా జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌కి వచ్చి, అటు నుంచి మండల కేంద్రానికి రావల్సి వస్తోంది. ఇలా వస్తే 10..అలా వెళ్తే 50 జామ్ని, మేడిగూడ, పార్డి, మాంగుర్ల గ్రామపంచాయితీలు మండల కేంద్రం నుంచి కేవలం పది కిలోమీటర్ల మేర దూరంలోనే ఉన్నాయి. కానీ మండల కేంద్రం నుంచి ఈ గ్రామాలకు రాకపోకల కోసం బీటీ రోడ్డు మాత్రం లేదు. దీంతో ఈ గ్రామాల్లోని ప్రజలు మండలంలోని లక్ష్మీపూర్, పిప్పల్‌గావ్ గ్రామాల మీదుగా మండల కేంద్రానికి వస్తుంటారు. అయితే ఈ గ్రామాలను కలుపుతూ గ్రావెల్ రోడ్లు ఉండటంతో వేసవి కాలంలో పర్వాలేదు.. కానీ వర్షాకాలంలో బురదమయంగా మారి ఎడ్లబండ్లు కూడా వెళ్లని పరిస్థితి. దీంతో ప్రజలు తమ గ్రామాల గుండా జిల్లా కేంద్రం వరకు బీటీ రోడ్డు గుండా వస్తుంటారు. వాస్తవానికి జామ్ని నుంచి లక్ష్మీపూర్ గుండా మండల కేంద్రానికి మధ్య ఉన్న దూరం కేవలం 10 కిలోమీటర్లే. అదే ఆదిలాబాద్ నుంచి వస్తే దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే గానీ జైనథ్‌కు చేరుకోలేని దుస్థితి. అయితే మండల కేంద్రానికి రావాల్సిన ప్రతీ సారి జిల్లా కేంద్రానికి వెళ్లి రావడంతో సమయం కూడా వథా అవుతోంది. ప్రయాణపు ఖర్చులూ నాలుగైదు రేట్లు పెరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ గ్రామాల గుండా జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డు సైతం పూర్తిగా ధ్వంసమై గుంతలు పడింది. ఈ మధ్యనే రూ.85 కోట్ల నిధులు మంజూరైనా ఇంకా రోడ్డు పనులు ప్రారంభించలేదు. అయితే ఎన్నో ఏళ్లుగా లక్ష్మీపూర్ గుండా మండల కేంద్రానికి ఉన్న రోడ్డును పునరుద్ధరించి దాని స్థానంలో బీటీ రోడ్డు నిర్మించాలని వేడుకుంటున్నామని, అధికారులు ఇకనైనా స్పందించి తమ కష్టాలు తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
పోరుబాట పట్టాలి
వైఎస్ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం పథకాల పేరు మార్చి పబ్బం గడుపుతున్నారు ప్రజలకు అండగా శ్రేణులు ఉద్యమించాలి జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది లోటస్‌పాండ్ సమావేశంలో జిల్లా నేతలకు దిశానిర్దేశం సాక్షిప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తోందని, దీనిని నిరసిస్తూ పార్టీ తరఫున పోరుబాట పట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు జిల్లాపార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం రాజధానిలోని లోటస్‌పాండ్‌లో పార్టీ ఖమ్మం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అ«ధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మెండెం జయరాజు, సేవాదళ్ అధ్యక్షుడు రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది ప్రజాప్రతినిధులు, నేతలు పార్టీని వీడినంత మాత్రాన నష్టమేమీలేదని, జిల్లాలో పార్టీ బలంగా ఉందన్నారు. జిల్లాలో పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. కానీ ప్రసుత్తం ప్రభుత్వం పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తోందని, వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. అలాగే దూరదృష్టితో వైఎస్.జలయజ్ఞం కింద జిల్లాలో తీసుకున్న ప్రాజెక్టుల పేరును ప్రభుత్వం మార్చి వాటిని ముందుకు సాగకుండా చూస్తోందన్నారు. వీటిపైనే పార్టీ శ్రేణులు దృష్టి పెట్టి, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఉద్యమించాలన్నారు. ప్రజలకు అండగా ఉండి పోరాడి.. పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా నేతలు, శ్రేణులు చేపట్టే కార్యక్రమాలకు రాష్ట్ర పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజల్లో ఉండి కష్టపడిన వారికే గుర్తింపు ఉంటుందని చెప్పారు. త్వరలోనే పార్టీ జిల్లా కమిటీతోపాటు అనుబంధ సంఘాల బాధ్యుల నియామకాలు కూడా చేపడతామన్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు తరలివెళ్లారు. జిల్లా నేతలు జిల్లపల్లి సైదులు, మందడపు వెంకటేశ్వర్లు, ఆలస్యం సుధాకర్, సంపెట వెంకటేశ్వర్లు, వాలూరి సత్యనారాయణ, రాములు, ఎస్కె.కరీం, ఎస్కె.మీరా, మర్రి బాబూరావు, గనపారపు వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ జ్యోతి, ఏసురత్నం, రమేష్‌బాబు, పులి సైదులు, రుద్ర హనుమంతరావు, రుద్ర ఉపేందర్, రేవతి, జయమ్మ, కుర్తం సత్యనారాయణ, ఉదయ్‌కుమార్, తాళ్లూరి శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
నిట్‌కు వెళ్లే దారేది
► ప్రధాన రహదారి కోసం అన్వేషణ ► రహదారి ఏర్పాటుకు ఆక్రమణల అడ్డంకి ► హైవే బైపాస్ నుంచీ దారి కరువు తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) శాశ్వత భవనాల నిర్మాణాలకుగాను మాస్టర్ ప్లాన్ సిద్ధమయ్యింది. ఏ భవనం ఎక్కడ ఎంత విస్తీర్ణంలో నిర్మించాలి. ఎలా నిర్మించాలి అనే విషయాలకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సిద్ధమవుతోంది. అన్నీ కుదిరితే మరో రెండు నెలల తర్వాత నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కానీ ఇప్పుడు నిట్‌కు ఎలా వెళ్లాలి అనేది పరిష్కారం దొరకని సమస్యగా మారింది. నిట్ ఎక్కడ ఉన్నా జాతీయ రహదారికి ఆనుకుని గాని, 80 నుంచి 100 అడుగుల రోడ్డు పక్కన గాని భవనాల నిర్మాణం చేపడతారు. తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల్లో నిట్ కోసం కేటాయించిన భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం పూర్తిచేశారు. అప్పారావుపేట రోడ్డులో జాతీయ రహదారి బైపాస్కు అభిముఖంగా వాస్తు రీత్యా ప్రధాన గేటును కూడా ఏర్పాటుచేస్తున్నారు. దీనికి గా ను ఇప్పటికే బాలికోన్నత పాఠశాల సమీపంలో పట్టణానికి దగ్గరగా గణేష్‌నగర్‌కు సమీపంలో ఉన్న నిట్ ప్రహరీ గోడను అధికారులు మూసివేశారు. ప్రధాన రహదారి సమస్య నిట్‌కు చేరుకోవాలంటే పట్టణం నుంచి అప్పారావుపేట రోడ్డు ఒక్కటే శరణ్యం. ఈ రోడ్డు ప్రస్తుతం 20 అడుగులకు మించి లేదు. ఈ రోడ్డు నుంచి పట్టణంలోకి రావాలంటే ఆర్టీసీ డిపో గోడ పక్కగా గణేష్ నగర్‌కు వచ్చే రహదారి మాత్రమే అందుబాటులో ఉంది. ఎఫ్ఎంబీ ప్రకారం ఇది రికార్డుల్లో 80 అడుగులు ఉంది. గతంలో ఇక్కడ విమానాశ్రయం ప్రతిపాదన ఉన్న సమయంలో ఈ రహదారిని ప్రధాన రహదారిగా గుర్తించి సర్వే చేశారు. ఆక్రమణల వివరాలను రెవెన్యూ అధికారులు నమోదుచేశారు. ఎయిర్‌పోర్టు ప్రతిపాదన ఆగడంతో ఈ దారి గురించి విస్మరించారు. తాజాగా నిట్ కో సం ఇదే ర హదారిని పరిగణనలోకి తీసుకున్నా రు. 80 అడుగుల మేర ఉండాల్సిన ఈ మార్గం లో ఆర్టీసీ గేటుకు రెండో పక్కన దారిని ఆక్రమించి కొన్ని పూరి గుడిసెలు, మరికొన్ని బహు ళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. గతంలో ఈ ఆక్రమణల వ్యవహారంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు అభ్యంతరాల కారణంగా తొలగింపు ప్రక్రియ ముందుకు సాగలేదు. తిరిగి నిట్ రహదారి కోసం ఈ రహదారిని ఎంచుకోడానికి గాను ఆక్రమణదారుల వివరాలను అధికారులు సేకరించారు. హైవే బైపాస్ నుంచి.. తాడేపల్లిగూడెం మీదుగా జాతీయ రహదారి బైపాస్ వెళ్లినా పట్టణంలో ఎక్కడా కూడా దీనికి అప్రోచ్ రోడ్ గాని, సర్వీస్ రోడ్డు గాని లేవు. మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ కేంద్ర మంత్రి బోళ్ల బులిరామయ్య నిర్వాకంతోనే ఇలా జరిగిందనే విమర్శలూ ఉన్నాయి. ఆయన తణుకు మీద ప్రేమతో తాడేపల్లిగూడెం వాసులకు కష్టాలు తెచ్చిపెట్టారనే వాదన ఉంది. దీంతో తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి బైపాస్కు అప్రోచ్, సర్వీస్ రోడ్లు లేవు. దీంతో నిట్‌కు సమీపంలో ఉన్న జాతీయ రహదారి బైపాస్ నుంచి నిట్‌కు చేరుకోవడానికి ఉన్న తాత్కాలిక అనధికారిక రహదారే శరణ్యంగా మారింది. రికార్డుల్లో అప్రోచ్ రోడ్డుగా కాని, సర్వీస్ రోడ్డుగా కాని ఈ మార్గాన్ని ఎవరు అభివద్ధి చేస్తారనే ప్రశ్న ఉంది. మొత్తంగా చూసుకుంటే నిట్‌కు దారేది అనే సమస్య మళ్లీ మొదటికొచ్చింది. -
ప్రయాణీకులకు రక్షణగా కూల్ షేడ్స్ !
నాగ్ పూర్ః భారతదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే నగరాల్లో ఒకటైన నాగపూర్ లో ప్రయాణీకుల కష్టాలపై అధికారులు దృష్టి సారించారు. నగరంలోని ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎండ వేడి నుంచీ ప్రయాణీకులకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నారు. తీవ్రమైన వేడిని తట్టుకోలేక, సిగ్నల్ పడిన ఒకటి రెండు నిమిషాలు కూడ వేచి చూడలేని ప్రజలు... సిగ్నల్ జంప్ కు ప్రయత్నించడాన్ని నాగపూర్ అధికారులు గమనించారు. అందుకే ప్రయాణీకులకు కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నగరంలోని ప్రతి కూడలివద్దా ముఖ్యంగా టూవీలర్ పై ప్రయాణించే వారికి ఎండనుంచి రక్షణ కోసం పచ్చని క్లాత్ తో నీడనిచ్చే ఏర్పాట్లు చేశారు. నాగపూర్ లో ఈసారి నమోదవుతున్న44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేని ప్రజలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేందుకు కూడ వెనుకాడటం లేదు. దీంతో అధికారులు ఈ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చల్లని రాష్ట్రంగా చెప్పే మహరాష్ట్రతోపాటు ఈసారి దేశంలోనే అనేక రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవ్వడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇంటినుంచీ బయటకు వెళ్ళే పరిస్థితి లేకపోయినా తప్పని పరిస్థితుల్లో ప్రయాణించాల్సి రావడం వారి ఓర్పును, సహనాన్ని పరీక్షిస్తోంది. దీంతో తీక్షణమైన సూర్యకిరణాల వేడినుంచీ ప్రయాణీకులను కాపాడేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూల్ గ్రీన్ షేడ్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సిగ్నల్ పడినప్పుడు మోటారిస్టులు అక్కడి నీడలో ఆగేందుకు ప్రయత్నిస్తుంటారు. లేదంటే ఎండను తట్టుకోలేక అడ్డదిడ్డంగా రోడ్లు దాటడం, సిగ్నల్ జంప్ చేయడం చేస్తుంటారు. దీన్ని నిశితంగా గమనించిన నాగపూర్ అధికారులు కూల్ షేడ్స్ ప్రక్రియ చేపట్టారు. స్థానికుల కష్టాలపై దృష్టి సారించిన అధికారుల ప్రయత్నాన్ని నాగపూర్ ప్రజలు అభినందిస్తున్నారు. -
హెలికాప్టర్ కూలి 15మంది పోలీసుల దుర్మరణం
బొగోటా: అడవుల్లో తలదాచుకుని, అక్కడి నుంచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న క్రిమినల్ గ్యాంగ్స్‌ను మట్టేబెట్టేందుకు బయలేదేరిన పోలీసు బృందం.. అనూహ్యరీతిలో మృత్యువాత పడింది. పైలట్ సహా 17 మంది పోలీసులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 15 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కొలంబియాలోని ఆంటిక్విటా ప్రావిన్స్ అటవీప్రాంతంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలను పోలీసు అధికారులు బుధవారం వెల్లడించారు.' అడవుల్లో తలదాచుకున్న క్రిమినల్ గ్యాంగ్స్‌ను చుట్టుముట్టే ఉద్దేశంతో 17 మంది పోలీసులు ఒక హెలికాప్టర్లో బయలుదేరారు. ఎత్తైన కొండ శిఖరాన్ని దాటుతుండగా ఛాపర్లో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. దానిని గుర్తించి, బయటపడేలోగా హెలికాప్టర్ నేల కూలింది. ఈ ఘటనలో 15 మంది పోలీసులు చనిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం' అని పోలీసు శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.