ఆంటిక్విటా ప్రావిన్స్ అటవీప్రాంతంలో హెలికాప్టర్ కూలిన ప్రదేశం నుంచి వెలువడుతున్న పొగ
బొగోటా: అడవుల్లో తలదాచుకుని, అక్కడి నుంచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న క్రిమినల్ గ్యాంగ్స్ను మట్టేబెట్టేందుకు బయలేదేరిన పోలీసు బృందం.. అనూహ్యరీతిలో మృత్యువాత పడింది. పైలట్ సహా 17 మంది పోలీసులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 15 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
కొలంబియాలోని ఆంటిక్విటా ప్రావిన్స్ అటవీప్రాంతంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలను పోలీసు అధికారులు బుధవారం వెల్లడించారు.' అడవుల్లో తలదాచుకున్న క్రిమినల్ గ్యాంగ్స్ను చుట్టుముట్టే ఉద్దేశంతో 17 మంది పోలీసులు ఒక హెలికాప్టర్లో బయలుదేరారు. ఎత్తైన కొండ శిఖరాన్ని దాటుతుండగా ఛాపర్లో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. దానిని గుర్తించి, బయటపడేలోగా హెలికాప్టర్ నేల కూలింది. ఈ ఘటనలో 15 మంది పోలీసులు చనిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం' అని పోలీసు శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.