దొంగలు డబ్బులు, నగలు దొంగతనం చేస్తారని విన్నాం. అంతేందుకు స్ట్రీట్ లైట్లు, మొక్కలను కూడా ఎత్తుకుపోవడం గురించి కూడా విని ఉంటాం. కానీ ఏకంగా రెండు కిలోమీటర్ల రహదారిని దొంగలించడం గురించి విన్నారా!. అదీ కూడా రెండు గ్రామాలను కలిపే రహదారిని రాత్రికి రాత్రే మాయం చేశారు. ఈ షాకింగ్ ఘటన బిహార్‌లోని బంకా జిల్లా, రాజౌన్ ప్రాంతంలోని ఖరౌనీ గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే....ఐదు రోజులు క్రితం వరకు ప్రజలు ఏళ్ల తరబడి వినయోగించినా.. ఖాదంపూర్, ఖరౌనీ అనే రెండు గ్రామాలను కలిపే రహదారిని ఉపయోగించారు. ఒక రోజు ఉదయం ప్రజలు అటుగా వెళ్తున్నప్పుడూ...రోడ్డు మొత్తం మాయమై దాని స్థానంలో పంటలు వేసి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గరయ్యారు గ్రామస్తులు. మొదట్లో వారు దారి తప్పాం అనుకున్నారు. ఆ తర్వాత గానీ వారికి అసలు విషయం అర్థం కాలేదు. ఖైరానీ గ్రామానికి చెందిన గూండాలు, రాత్రికి రాత్రే ట్రాక్టర్‌తో రహదారిని దున్ని గోధుమ పంటలను విత్తారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వ్యరేకించడంతో.. గుండాలు కొట్లాటకు దిగి కర్రలు, రాడ్లతో ప్రజలను బెదిరించారు. దీంతో ఖాదంపూర్ గ్రామానికి చెందిన దాదాపు 35 మంది ప్రజలు సర్కిల్ పోలీస్ అధికారి మహ్మద్ మెయినుద్దీన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఆక్రమణకు పాల్పడినట్లు తేలితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు పోలీసు అధికారి హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయానికి వినియోగిస్తున్న ఆక్రమిత భూమిని తొలగించి తిరిగి రోడ్డు వేస్తామని కూడా చెప్పారు.
(చదవండి: ఆప్ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment