ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. బాధితులను రక్షించేందుకు వైమానిక దళానికి చెందిన చినూక్, ఎంఐ 17 హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. కేదార్‌నాథ్ మార్గంలో చిక్కుకుపోయిన 6,980 మందికి పైగా యాత్రికులకు రక్షించారు. ఇంకా 1,500 మందికి పైగా భక్తులు, స్థానికులు ఇప్పటికీ పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వీరిలో 150 మంది తమ కుటుంబాలను సంప్రదించలేని స్థితిలో ఉన్నారు.
సోన్‌ప్రయాగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ విశాఖ అశోక్ భదానే మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు ఒక యాత్రికుడు మృతిచెందారు. కేదార్‌నాథ్ మార్గంలో చిక్కుకున్న 150 మందికి పైగా కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో మొబైల్ కనెక్టివిటీ లేకపోవడంతో తమ కుటుంబసభ్యులను సంప్రదించలేకపోతున్నారని ఆయన తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామితో టెలిఫోన్‌లో మాట్లాడారు. విపత్తు అనంతరం జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం 599 మందిని విమానంలో, 2,380 మందిని కాలినడకన సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment