దారి కోసం ఘర్షణ
ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
ప్రత్తిపాడు : శరభవరంలో దారి విషయమై రెండు కుటుం బాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు శరభవరంలోని మార్కెట్ సమీపంలో నామాల రామలక్ష్మి, పోకల వెంకటేశ్వరరావు అనే బాబులు కుటుంబాల మధ్య ఏడాది కాలంగా దారి విషయమై వివాదం ఉంది. ఈ విషయమై çశుక్రవారం నామాల సురేష్, అతని తల్లి రామలక్ష్మి, సోదరి ధనేకుల సుబ్బలక్ష్మి కర్రలతో వెంకటేశ్వరరావు కుటుంబీకులపై దాడికి పాల్పడ్డారు. ఈసంఘటనలో బాబులు (43) అక్కడికక్కడే మృతి చెందగా, అతని సోదరుడు బ్రహ్మరాజు, తల్లి లక్ష్మి నరసమ్మ గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వీరిలో తలకు తీవ్రగాయమైన బ్రహ్మరాజును ప్రా«థమిక చికిత్స అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. సీఐ జి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం, అన్నవరం ఎస్సైలు ఎం నాగదుర్గారావు, వై రవికుమార్, పార్థసారధి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.