ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి జనం వివిధ పద్ధతులను అవలంబిస్తుంటారు. ఇలా సంవత్సరానికి కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటారు. వీరిలో సంపాదనకు చక్కటి మార్గాలను కనుగొన్నవారు కూడా ఉన్నారు. వారిలో ఒకరే కరుణ్ విజ్. అతను భారతీయుడే అయినప్పటికీ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు.
కరుణ్ విజ్ ప్రతి నెలా సగటున రూ.9 లక్షలు సంపాదిస్తున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు కరుణ్ సంపాదనకు లాభసాటి మార్గాన్ని కొనుగొన్నారు. 33 ఏళ్ల కరుణ్ మొదటి నుంచి ప్రాపర్టీ ఓనర్‌గా మారాలనుకునేవారు. రియల్ ఎస్టేట్.. మంచి లాభదాయకమైన వ్యాపారమని కరుణ్ కాలేజీ రోజుల్లోనే గ్రహించారు. ఈ సమయంలో కరణ్.. దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌ల చుట్టుపక్కల ఉండే ఇళ్లకు సంబంధించి ఒక ఆలోచన చేసేవారు. మొత్తం ఇంటిని ఒకరికే అద్దెకు ఇవ్వకుండా.. గదుల ప్రాతిపదికన రెంట్ వసూలు చేయడం లాభదాయకమని భావించారు.
ఇంటినంతటికీ అద్దెదారుకు అద్దెకు ఇవ్వకుండా విద్యార్థుల కోసం ప్రత్యేక గదులుగా మలచి, అద్దెకు ఇవ్వడం ఎంత ప్రయోజనకరమనేది గ్రహించారు. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం కరుణ్ కెనడాలో మొత్తం 28 గదులు కలిగిన నాలుగు ఇళ్లను కలిగి ఉన్నాడు. అతను వాటిని అద్దెకు ఇచ్చాడు. దీంతో ప్రతినెలా రూ.9 లక్షలకు పైగా మొత్తాన్ని ఆర్జిస్తున్నారు.
అయితే ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు కరుణ్ దాదాపు రూ.19 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2016వ సంవత్సరంలో తన 26 ఏళ్ల వయస్సులో కరుణ్ కెనడాలోని అంటారియోలో తన మొదటి పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలో దాదాపు రూ.2.7 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసి, ఏడుగురు కాలేజీ విద్యార్థులకు అద్దెకు ఇచ్చారు. కరుణ్ కేవలం అద్దె ఆదాయంపై మాత్రమే ఆధారపడటం లేదు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కరుణ్ అప్లికేషన్స్ ఇంజనీర్‌గా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాలోని ఒక కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అద్దెల ద్వారా వచ్చే ఆదాయం, తన జీతం సొమ్ముతో కరుణ్.. దక్షిణ అంటారియోలో భారీగా ఆస్తులను కూడబెట్టారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత
Comments
Please login to add a commentAdd a comment