దారి లేక నిలిచిన అంత్యక్రియలు
ఖానాపూర్: శ్మశాన వాటికకు వెళ్లేందుకు కూడా దారి వదల కుండా అటవీశాఖ అధికారులు చుట్టూ కంద కాలు తవ్వడంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఓ వృద్ధురాలి అంత్యక్రియలు వారుుదా పడ్డారుు. మండల కేంద్రమైన ఖానాపూర్‌లోని గాంధీనగర్, అశోక్‌నగర్, సుభాష్‌నగర్ కాలనీ ప్రజలు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలు చేస్తారు. అటవీ అధి కారులు శ్మశానానికి దారి వదలకుండా చుట్టూ కందకాలు తవ్వారు. గాంధీనగర్ కాలనీకి చెందిన బాదే రాజవ్వ(80 సోమవారం అనారోగ్యంతో చనిపోరుుంది. శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు దారి లేకపోవడంతో అంత్యక్రియలు వారుుదా వేస్తున్నట్లు కాలనీవాసులు తెలిపారు.