మండల కేంద్రానికి దారేది? | there is no way to go | Sakshi
Sakshi News home page

మండల కేంద్రానికి దారేది?

Published Sun, Aug 7 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

మండల కేంద్రానికి దారేది?

మండల కేంద్రానికి దారేది?

  • బీటీ రోడ్డు లేక 50కి.మీ. తిరగాల్సిన దుస్థితి
  •  గ్రామస్తులు దూరభారం
  •  పట్టించుకోని పాలకులు 
  • జైనథ్‌ : పాలకులు మారినా..ప్రభుత్వాలు మారిన గ్రామాలకు మాత్రం రవాణా సౌకర్యం మెరుగుపడడం లేదు. స్వరాష్ట్రం ఏర్పడినా అదే దుస్థితి. మండలంలోని జామ్ని, జున్నపాని, మేడిగూడ, పార్డి, మాంగుర్ల తదితర గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
          10 కి.మీ దూరానికి రోడ్డు లేని కారణంగా 50 కిలోమీటర్లు ప్రయాణించి మండల కేంద్రానికి చేరుకుంటున్నారు. దీంతో దూరభారంతోపాటు సమయమంతా వథా అవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. జామ్ని, జున్నపాని, మేడిగూడ, పార్డి, మాంగుర్ల నుంచి మండల కేంద్రం జైనథ్‌కు వెళ్లేందుకు నేరుగా బీటీ రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు ముందుగా జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌కి వచ్చి, అటు నుంచి మండల కేంద్రానికి రావల్సి వస్తోంది.  
    ఇలా వస్తే 10..అలా వెళ్తే 50 
    జామ్ని, మేడిగూడ, పార్డి, మాంగుర్ల గ్రామపంచాయితీలు మండల కేంద్రం నుంచి కేవలం పది కిలోమీటర్ల మేర దూరంలోనే ఉన్నాయి. కానీ మండల కేంద్రం నుంచి ఈ గ్రామాలకు రాకపోకల కోసం బీటీ రోడ్డు మాత్రం లేదు. దీంతో ఈ గ్రామాల్లోని ప్రజలు మండలంలోని లక్ష్మీపూర్, పిప్పల్‌గావ్‌ గ్రామాల మీదుగా మండల కేంద్రానికి వస్తుంటారు. అయితే ఈ గ్రామాలను కలుపుతూ గ్రావెల్‌ రోడ్లు ఉండటంతో వేసవి కాలంలో పర్వాలేదు.. కానీ వర్షాకాలంలో బురదమయంగా మారి ఎడ్లబండ్లు కూడా వెళ్లని పరిస్థితి. దీంతో ప్రజలు తమ గ్రామాల గుండా జిల్లా కేంద్రం వరకు బీటీ రోడ్డు గుండా వస్తుంటారు. వాస్తవానికి జామ్ని నుంచి లక్ష్మీపూర్‌ గుండా మండల కేంద్రానికి మధ్య ఉన్న దూరం కేవలం 10 కిలోమీటర్లే.
            అదే ఆదిలాబాద్‌ నుంచి వస్తే దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే గానీ జైనథ్‌కు చేరుకోలేని దుస్థితి. అయితే మండల కేంద్రానికి రావాల్సిన ప్రతీ సారి జిల్లా కేంద్రానికి వెళ్లి రావడంతో సమయం కూడా వథా అవుతోంది. ప్రయాణపు ఖర్చులూ నాలుగైదు రేట్లు పెరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ గ్రామాల గుండా జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డు సైతం పూర్తిగా ధ్వంసమై గుంతలు పడింది. ఈ మధ్యనే రూ.85 కోట్ల నిధులు మంజూరైనా ఇంకా రోడ్డు పనులు ప్రారంభించలేదు.
            అయితే ఎన్నో ఏళ్లుగా లక్ష్మీపూర్‌ గుండా మండల కేంద్రానికి ఉన్న రోడ్డును పునరుద్ధరించి దాని స్థానంలో బీటీ రోడ్డు నిర్మించాలని వేడుకుంటున్నామని, అధికారులు ఇకనైనా స్పందించి తమ కష్టాలు తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement