![Here Are Some Tips To Get Rid Of Joint Pains - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/9/Knee-Pain.jpg.webp?itok=dEre_vKv)
నేటి కాలంలో 30 ఏళ్లు దాటితే చాలు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతున్నాయి. ఈ పరిస్థితిలో వాటిని ఎదుర్కోవటానికి చాలామంది చాలా చిట్కాలు పాటిస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండటం లేదు. కానీ ఆహారంలో ఈ మూడు పండ్లను చేర్చుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఆ పండ్లేమిటంటే...
నారింజ: రోజూ నారింజను తినడం వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది. ఇందులో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లనొప్పులని తగ్గించడంలో సహాయపడుతుంది.
ద్రాక్ష: వీలయినంత వరకు ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా అనేకరకాల వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. చిన్నప్పటినుంచి పిల్లలకి ద్రాక్షపండ్లను తినిపించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
పుచ్చకాయ: వేసవి కాలంలో పుచ్చకాయ తినడం అన్ని విధాల శ్రేయస్కరం. దీనివల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. తక్షణ శక్తి లభిస్తుంది. దీనిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఎండాకాలం బయటికి వెళ్లే ముందు లేదా బయటి నుంచి వచ్చిన తర్వాత పుచ్చకాయ తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు
కీళ్లనొప్పులని తగ్గిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment