knee pain
-
కొత్త డివైస్ : ఇది కట్టుకుంటే నొప్పులు మాయమట!
జిమ్‌లో వ్యాయామం చేసేవారికి, మైదానాల్లో ఆటలాడే వారికి ఒక్కోసారి కీళ్లు పట్టేసి నొప్పులు తలెత్తడం మామూలే! ఇళ్లల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి నొప్పులు తలెత్తుతుంటాయి. ఇలాంటి నొప్పులకు నొప్పినివారణ మాత్రలు వాడటం, పైపూతగా ఆయింట్మెంట్లు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇకపై వాటితో పని లేకుండా, ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్నచోట పెట్టుకుని, దీనికి ఉన్న బెల్టుతో బిగించి కట్టుకుంటే చాలు, సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఇటీవల ‘రికవరీ థెర్మ్‌క్యూబ్’ పేరిట ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం కోరుకున్న విధంగా చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఎంచుకోవడానికి స్విచ్‌లు ఉంటాయి. నొప్పి ఉన్న చోట ఈ క్యూబ్‌ను అదిమిపెట్టి బిగించి బెల్ట్ కట్టుకుంటే చాలు, రెండు గంటల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవీ చదవండి : చలి పులి వచ్చేస్తోంది నెమ్మదిగా...ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది! -
మోకాలి నొప్పికి.. మెయిడ్ పేరు!
ఆ వైద్యసమస్య పేరే ‘హౌజ్ మెయిడ్ నీ పెయిన్’! వైద్య పరిభాషలో ‘‘ప్రెపటెల్లార్ బర్సయిటిస్’’ అనే ఓ జబ్బుకు పనిమనిషి పేరు పెట్టడం విశేషం. వాడుక పేరుగా పనిమనిషి (మెయిడ్) పేరు పెట్టిన ఆ జబ్బును ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అంటారు. ఇంటిని తుడిచే వారు రెండు మోకాళ్లనూ గచ్చు మీద ఆనించి, మరో చేతిని నేలకు ఆనించి ఇంకో చేత్తో గుడ్డతో తుడుస్తూ ఉండటంతో మోకాళ్లు ఒరుసుకుపోయి నొప్పి వస్తుంది. అందుకే ఆ జబ్బుకు ఆ పేరు.అలాగని అది కేవలం పనిమనుషులకు వచ్చే సమస్య అనుకుంటే పొరబాటే. మోకాళ్లను నేలకు ఆనించి పనిచేసే వృత్తుల్లోని వారందరిలో (ఉదాహరణకు ప్లంబర్లు, గార్డెనర్లూ)నూ ఆ జబ్బు కనిపిస్తుంది. ఇంకా చె΄్పాలంటే ఆటల్లో నేల మీదికి దూకే సమయంలో మోకాళ్లు నేల మీద దోక్కుపోయే క్రీడాకారులకు కూడా ఈ నొప్పి వస్తుంటుంది. ఇలా ఎంతోమందిలో ఆ జబ్బు కనిపిస్తున్నప్పటికీ దానికి ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అనే పేరు స్థిరపడింది.చికిత్స...నొప్పి తొలిదశల్లో మోకాలికి ఐస్ పెట్టడం, పడుకునే/నిద్రపోయే సమయంలో ఆ భాగం కాస్త ఎత్తుగా ఉండేలా మోకాలి కింద దిండు పెట్టడం, విశ్రాంతి ఇవ్వడం వంటివి చేయాలి. ఆటగాళ్లకు లేదా ఇతరత్రా వృత్తుల్లోని వారికి నొప్పి మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ మందులను ఇస్తారు. సూచిస్తారు. ఇక క్రీడాకారుల్లో ఈ సమస్య రాకుండా నివారించేందుకు ‘నీ–΄్యాడ్స్’ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలతో పాటు... మోకాళ్లకు దెబ్బతగిలినప్పుడు క్రీడలకూ, ప్రాక్టీస్‌కూ విశ్రాంతి ఇవ్వడం వంటి పెయిన్ మేనేజ్మెంట్ ప్రక్రియలను డాక్టర్లు సూచిస్తుంటారు. -
వర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? జాగ్రత్తలు!
వర్షాకాలం వచ్చిదంటే చాలా మందికి కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కండరాలు పట్టేసినట్టు అనిపిస్తాయి. వర్షాకాలంలోని తేమకు కీళ్లనొప్పులకు సంబంధం ఉంటుంది. వానాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.వానల రోజులు కొంతమంది ఆహ్లాదాన్ని పంచితే మరికొంతమందికి, ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి ఆందోళన మోసుకొస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో వారికి నొప్పులతో రోజువారీ పనులను కొనసాగించడం, ఒక్కోసారి కాలు కదపడం కూడా కష్టం అనిపిస్తుంది. మారుతున్న వాతావరణానికి, కీళ్ల నొప్పులకు సంబంధం ఉంది అంటున్నారు నిపుణులు. చల్లని వాతావరణం, తేమ స్థాయిలలో మార్పులు, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల కారణంగా కీళ్ల నొప్పులు, కండరాలు దృఢత్వంలో తేడాలు, తిమ్మిర్లు గాయం నొప్పి కనిపిస్తాయి. గాలిలోని అధిక తేమ స్థాయిలు రక్తాన్ని చిక్కగా చేస్తాయి. రక్తపోటును పెంచుతాయి.ఎముకలకు కీలకమైన డీ విటమిన్ కూడా ఈ సీజన్లో సరిగ్గా అందదు. వర్షాకాలంలో నీరు ఎక్కువగా తాగకపోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అలాగే ఈ కాలంలో కీళ్ల చుట్టూ ఉండే ప్లూయడ్ పలచబడుతుంది. దీనివల్ల కూడా నొప్పి వస్తుంది. ఈ కారణాల రీత్యా కీళ్ల నొప్పులు పెరుగు తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలువిటమిన్ డీ, బీ 12 లభించే ఆహారాలు తీసుకోవాలి. అవసరమైతే ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలి.విటమిన్ ఇ నొప్పి , వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.గింజలు, అవకాడో, బెర్రీలు, ఆకు కూరలు, గింజలు, చేపలు ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం చాలా అవసరం. అవిసె గింజలు,నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, పనీర్, గుడ్లు తీసుకోవాలి. మోకాళ్లు, ఇతర కీళ్ళపై సురక్షితమైన ఆయిల్‌తో సున్నితంగా మసాజ్ చేసుకోవచ్చు. వేడి నీటి, హీట్బ్యాగ్తో కాపడం పెట్టుకోవచ్చు.కండరాలకు వ్యాయామం ఒక వరం. మార్నింగ్ వాక్, లెగ్, కండరాలను సాగదీసేలా వ్యాయామాలు, యోగా, సైక్లింగ్ చేయడం వంటివి చేయడం మర్చిపోకూడదు. అలాగని మరీ ఎక్కువ చేయకూడదు. ఎలాంటి వ్యాయామాలు చేయాలనే దానికోసం వైద్య నిపుణుడు, ఫిజియో థెరపిస్ట్‌ను సంప్రదించడం మంచిది -
కీళ్ల నొప్పులను తొలగించే చిట్కాలు మీకోసం...
నేటి కాలంలో 30 ఏళ్లు దాటితే చాలు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతున్నాయి. ఈ పరిస్థితిలో వాటిని ఎదుర్కోవటానికి చాలామంది చాలా చిట్కాలు పాటిస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండటం లేదు. కానీ ఆహారంలో ఈ మూడు పండ్లను చేర్చుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఆ పండ్లేమిటంటే... నారింజ: రోజూ నారింజను తినడం వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది. ఇందులో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లనొప్పులని తగ్గించడంలో సహాయపడుతుంది. ద్రాక్ష: వీలయినంత వరకు ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా అనేకరకాల వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. చిన్నప్పటినుంచి పిల్లలకి ద్రాక్షపండ్లను తినిపించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పుచ్చకాయ: వేసవి కాలంలో పుచ్చకాయ తినడం అన్ని విధాల శ్రేయస్కరం. దీనివల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. తక్షణ శక్తి లభిస్తుంది. దీనిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఎండాకాలం బయటికి వెళ్లే ముందు లేదా బయటి నుంచి వచ్చిన తర్వాత పుచ్చకాయ తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు కీళ్లనొప్పులని తగ్గిస్తాయి. ఇవి చదవండి: మిమ్మల్ని మీరే పట్టించుకోవాలీ..! -
అందుకే ఆడవాళ్లకు ఎక్కువగా కీళ్లనొప్పులు.. తేలిగ్గా తీసుకోవద్దు
చలికాలం వచ్చిందంటే చాలు కీళ్ల నొప్పులు,ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. చాలామందికి చలికాలంలో కీళ్ల నొప్పులతో లేచి నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇక ఉదయం పూట పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. కీళ్లు గట్టి పడిపోవడం, జాయింట్లు సహకరించకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు చలికాలంలో కీళ్ల నొప్పుల నుండి, ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు. చలికాలంలో వాతావరణంలోని చల్లదనానికి కీళ్లమధ్యలో ఉండే మృదువైన కార్టిలేజ్ కుచించుకుపోతుంది. చర్మం, కండరాలు బిగుసుకుపోతాయి. అందుకే చాలామందికి చలికాలంలో కీళ్ల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లలో రక్తహీనత కారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ సీజన్లో శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కీళ్ల నొప్పులను తేలిగ్గా తీసుకోకూడదు. చలికాలంలో వచ్చే సాధారణ కీళ్ల నొప్పులను తగ్గించడానికి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా భుజాలు, తొడ కండరాలు గట్టిపడే వ్యాయామాలు చేస్తే కీళ్లపై ఒత్తిడి పడదు. అలాగే గంటల తరబడి కూర్చొని పనిచేసేవాళ్లు అప్పుడప్పుడు లేచి అటు ఇటు నడుస్తుండాలి. నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కోసం వేడినీళ్ల కాపడం, మసాజ్, ఫిజియోథెరపీ వ్యాయామాలు లాంటివి ఉపయోగపడతాయి. కీళ్ల అరుగుదల, కీళ్లవాతం లాంటి సమస్యలు ఉన్నవాళ్లు చలికాలంలో డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. కీళ్లు మరీ వీక్‌గా ఉన్నవాళ్లు డాక్టర్ల సలహా మేరకు క్యాల్షియం, విటమిన్ డి మాత్రలు వేసుకోవచ్చు. ఇక వీటితో పాటు చలికాలంలో జంక్ ఫుడ్ తగ్గించి శరీరంలో వేడిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, విటమిన్–డి, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. కీళ్లను వెచ్చగా ఉంచుకునేందుకు మందపాటి బట్టలు వేసుకోవాలి. శరీరాన్ని చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి కావలసినంత అందకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్–డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిది. సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా కాస్త కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు బాధిస్తున్న వారు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. నారింజ, క్యాబేజీ, బచ్చలికూర, టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మరీ మంచిది.చలికాలంలో మనకు తెలియకుండానే తక్కువ నీటిని తీసుకుంటాం కాబటి బాడీ డీహైడ్రేషన్ కు గురవుతుంది. దానివల్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అందువల్ల అది గుర్తుంచుకుని కీళ్లనొప్పులతో బాధపడేవారు శరీరం డీ హైడ్రేట్ కాకుండా తగినంత నీటిని తాగడం మంచిది. -
మోకాలి నొప్పితో బాధపడుతున్నారా? సర్జరీ చేయాల్సిన పనిలేదు
ఎంతోకాలంగా మోకాలినొప్పితో బాధపడుతున్నారా? ఫిజియో థెరపీ, స్టారాయిడ్ ఇంజెక్షన్లు, సర్జరీ వంటివన్నీ ట్రై చేశాక కూడా ఎలాంటి ఫలితం లేదా? అయితే ఈ వార్త మీకోసమే. ఎలాంటి సర్జరీ లేకుండానే మీ నొప్పిని తగ్గించేందుకు డ్యూక్ యూనివర్సిటీ నేతృత్వంలోని ఓ అధ్యయన బృందం ఒక హెడ్రైజెల్ను తీసుకొచ్చారు. ఇది మోకాలి నొప్పులను త్వరగా నయం చేస్తుందట. ఈరోజుల్లో కీళ్లనొప్పుల సమస్య సర్వసాధారణం అయిపోయింది. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్లలో ఈ సమస్య మరీ అధికంగా ఉంటోంది. దీనికి కారణం ఆర్థరైటిస్. దీన్నే కీళ్ళవాపు వ్యాధి అంటారు. అనారోగ్య జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మోకాలి సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పటికీ కీళ్లనొప్పులకు శాశ్వత పరిష్కారం లేదు. మెట్లు ఎక్కాలన్నా, పరిగెత్తాలన్నా, ఎక్కువసేపు నడవాలన్నా మోకాలి నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. కీళ్లు బలహీనంగా మారడం వల్ల మోకాలు లోపలి కణజాలం దెబ్బతింటుందని, దీని వల్ల లోపల cartilage (మృదులాస్థి) అరిగిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కాస్త లెగ్ స్ట్రెచ్ చేసినా, మూమెంట్ ఇచ్చినా తీవ్రమైన నొప్పి కలుగుతుంది. విపరీతంగా బరువు ఉండటం, సరైన వ్యాయామం శరీరానికి లేకపోవడం, శరీరానికి కావాల్సిన విటమిన్ డి3 లేకపోవడం వంటివన్నీ మోకాలి నొప్పికి కారణాలు. కొందరు నొప్పి భరించలేక శస్త్రచికిత్సల బాట పడుతున్నారు. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదంటున్నారు డ్యూక్ యూనివర్సిటీ సైంటిస్టులు. ఎందుకంటే సెల్యూలోజ్ ఫైబర్‌తో తయారుచేసిన ఓ హైడ్రోజెల్‌తో మోకాలి నొప్పులను తగ్గించవచ్చని వెల్లడించారు. ఈ హైడ్రోజెల్‌ను పాలిమర్‌తో తయారుచేశారు. సెల్యూలోజ్ ఫైబర్ యోక్క పలుచని షీట్లను తీసుకొని వాటిని పాలీ వినైల్ ఆల్కహాల్ కూడిన పాలిమర్‌తో అనుసంధానం చేసి ఓ జిగట లాంటి జెల్‌ను రూపొందించారు. సెల్యూలోజ్ ఫైబర్ కొల్లాజిన్ ఫైబర్‌లా పనిచేస్తాయని డ్యూక్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు తమ పరిశోధనలో వెల్లడించారు. ఇది cartilage కంటే ధృడంగా ఉంటుందని తెలిపారు. కాళ్లను ముందుకి, వెనక్కి స్ట్రెచ్(సాగదీసినప్పుడు) హైడ్రోజెల్ మోకాలి నొప్పిని పట్టి ఉంచుతుంది. హైడ్రోజెల్ ఉన్న ఇంప్లాట్తో కీళ్ల నొప్పి చాలావరకు తగ్గిపోతుందని సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. దీనికోసం సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గతంలో హైడ్రోజెల్‌లను రూపొందించడానికి జెల్లోని స్ఫటికాలను ఉత్పత్తి చేయడానికి ఫ్రీజ్-థా ప్రక్రియను ఉపయోగించారు. కానీ తాజా అధ్యయనంలో ఎనియలింగ్ అనే హీట్ ట్రీట్మెంట్ని ఉపయోగించారు. ఫలితంగా కీళ్లలో వచ్చే ఒత్తిడిని రెండు రెట్లు ఎక్కువగా తట్టుకునే శక్తిని కలిగి ఉన్నట్లు తెలిపారు. -
Chiranjeevi : సర్జరీ @ ఢిల్లీ, వచ్చే వారం హైదరాబాద్ కు చిరంజీవి
మెగాస్టార్ మోకాలికి సర్జరీ మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ పూర్తయింది. గత కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో మోకాలికి సర్జరీ చేయించుకున్నారని తెలిసింది. వైద్య పరిభాషలో ఈ సర్జరీని ఆర్థోస్కోపి నీ వాష్ ట్రీట్మెంట్ అంటారని తెలిపారు. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!) ఏమిటీ నీ వాష్ (Knee Wash) ట్రీట్ మెంట్ ? నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పోర్టల్ ప్రకారం నీ వాష్ ట్రీట్ మెంట్ అంటే.. మోకాలి చిప్ప భాగంలో ఏర్పడే ఇన్ ఫెక్షన్ ను తొలగిస్తారు. అదే స్థానంలో రెండు ఎముకల మధ్య కొత్త ఫ్లూయిడ్ ను నింపుతారు. దీని వల్ల మోకాలి చిప్పకు నొప్పి ఉండదు. మోకాలి దగ్గర చాలా చిన్నగా రెండు రంధ్రాలు చేసి ఈ సర్జరీ పూర్తి చేస్తారు. దీని వల్ల కుట్లు వేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఎన్నాళ్లు విశ్రాంతి అవసరం ? నీ వాష్ ట్రీట్ మెంట్ తీసుకున్న వ్యక్తులు.. మళ్లీ మామూలుగా పనులు చేసుకోవాలంటే కనీసం 45 రోజుల విశ్రాంతి అవసరం. దీనికంటే త్వరగా కూడా కోలుకోవచ్చు. కానీ వైద్యులు సాధారణంగా 45 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. చిరంజీవి సంగతేంటీ ? ప్రస్తుతం చిరంజీవి వయస్సు 67 సంవత్సరాలు. అయితే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండే చిరంజీవి వయస్సు 67 ఏళ్లు వచ్చినా.. ఇంకా చలాకీగానే కనిపిస్తారు. అయితే కొన్నాళ్లుగా మోకాలి నొప్పి పెరిగిపోవడంతో శస్త్ర చికిత్స తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఢిల్లీలో ఎప్పటివరకు ? ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న చిరంజీవి.. మరో వారం రోజుల పాటు ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ఆ తర్వాత హైదరాబాద్ రానున్నారు. అంటే ఆగస్టు 22న తన పుట్టినరోజు కల్లా ఇంటికొచ్చేస్తారని తెలుస్తోంది. ఇక్కడ ఇంట్లో మరో 5 వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. చిరంజీవి సినిమాల సంగతేంటీ? ఈ మధ్య 'భోళా శంకర్'గా వచ్చిన చిరు.. తన బర్త్ డే నాడు కొత్త మూవీ ప్రారంభించబోతున్నారు. 'బంగార్రాజు' ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకుడు కాగా చిరు కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తుంది. మళయాళంలో హిట్టయిన బ్రో డాడీ సినిమా రీమేక్ పట్ల కూడా చిరంజీవి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే స్ట్రెయిట్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన చిరు.. రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకున్నారు. ఈ మధ్య థియేటర్లలో విడుదలైన 'భోళా శంకర్' మాత్రం బోల్తా కొట్టేసింది. భారీ నష్టాలు రాబోతున్నాయని తెలుస్తోంది. ఇది 'వేదాళం' అనే తమిళ సినిమాకు రీమేక్. త్వరలో చేయబోయే కొత్త ప్రాజెక్ట్ కూడా 'బ్రో డాడీ' అనే మలయాళ చిత్రానికి రీమేక్ అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు) -
ప్రభాస్ మోకాలికి సర్జరీ..?
ప్రభాస్ అంటే ఫైట్స్ మాత్రమే కాదు...డాన్సులతో కూడా దుమ్మురేపుతాడు.కానీ అలా ప్రభాస్ దుమ్ములేపి చాలాకాలం అయ్యింది.దానికి కారణం కేవలం ప్రభాస్ ఎంచుకుంటున్న పాన్ ఇండియా సినిమాలే కాదు, ప్రభాస్ ని వదలకుండా వేధిస్తున్న మోకాలినొప్పి సమస్య కూడా. బాహుబలి సినిమాలో నెలల తరబడి యాక్షన్ సీన్స్ చెయ్యడంతో మోకాలి నొప్పి సమస్య వచ్చింది. ఇప్పటివరకు తగ్గలేదు. అందుకే ఈ మధ్య సినిమాల్లో ఎటూ డాన్సుల అవసరం లేదు కాబట్టి డాన్సులకు దూరంగా ఉంటున్నాడు. (చదవండి: ‘జైలర్' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్‌తో ధనుష్ రచ్చ) అయితే ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభాస్ మోకాలు సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాడు అని టాక్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సలార్, 'కల్కి 2898 ఏడీ' సినిమాలో కూడా పెద్దగా డాన్సులకు స్కోప్ లేదు...ఆ అవసరం కూడా లేదు. ఆ కథలు అలాంటివి. జస్ట్ ప్రభాస్ కటౌట్ నిలబడితే చాలు అదిరిపోయే ఎలివేషన్స్ ఇస్తాడు ప్రశాంత్ నీల్. ఇక కల్కి 2898 పూర్తిగా స్టోరీ డ్రివెన్ సినిమా. (చదవండి: ‘భోళా శంకర్’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..) మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అది పూర్తిగా కమర్షియల్ టచ్ ఉన్న సినిమా. ప్రభాస్ కామెడీ,ఫైట్స్ తో పాటు డాన్సులు కూడా ఉండాలి.ఉంటేనే మజా.ఆ సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నాయని అంటున్నారు. కనీసం రెండింటిలోనైనా డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. చేయాలని ప్రభాస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. అందుకే సలార్, కల్కి 2898 చిత్రాల షూటింగ్ పూర్తవగానే సర్జరీ చేయించుకుని రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకుంటాడట రెబల్ స్టార్. ఇక ఆ తరువాత ఎప్పటిలానే దుమ్ము లేచిపోవడం ఖాయం. -
ఎక్కువగా నడిస్తే మోకాళ్లు అరిగిపోతాయా? ఇలా చేస్తే..
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారిలో చాలామంది తాము మరింత ఎక్కువగా నడుస్తూ ఉంటే మోకాళ్లు ఇంకా అరిగిపోతాయేమోనని, దాంతో తమ నొప్పులు మరింతగా ఎక్కువవుతాయేమోనని అపోహపడుతుంటారు. నిజానికి మన మోకాళ్ల కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే, ఆ భాగంలో అంతగా రక్తప్రసరణ జరిగి కీళ్లకు మంచి పోషణ అందుతుంది. దాంతో మోకాలి ఎముకలతో పాటు, మన ఇతర కండరాలూ, దేహంలోని ఎముకలూ బలపడతాయి. మోకాలి నొప్పులను నివారించాలంటే... ►మోకాళ్ల నొప్పులున్నవారు ఈ కింద పేర్కొన్న పనులేవీ చేయకూడదు... ►ఒక అంతస్తు కంటే ఎక్కువగా మెట్లు ఎక్కి దిగడం ఎగుడుదిగుడుగా ఉండే నేలపై నడక (వాకింగ్‌లోనూ సమతలంగా ఉండే నేలపైనే నడవాలి). ►నేలపై కాళ్లు రెండూ మడత వేసుకుని కూర్చోవడం / లేవడం (స్కాటింగ్) ►నేల మీది వస్తువుల్ని, బరువుల్ని నడుము వంచి గభాల్న లేవడం. ►అలా లేపాలనుకున్నప్పుడు కూర్చుని నింపాదిగా లేపాలి. ►ఈ జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ మోకాళ్లు నొప్పిగా ఉంటే ఒకసారి ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించాలి. నోట్: ఇది కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే అందించిన కథనం. -
‘జోడో’ను మూడు రోజులకే ముగిద్దామనుకున్నారు!
తిరువనంతపురం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రమైన మోకాలి నొప్పి కారణంగా భారత్ జోడో యాత్రను మూడు రోజులకే ఆపేయాలనుకున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. రాహుల్‌కు అత్యంత విశ్వసనీయుడిగా పేరున్న వేణు గోపాల్ శనివారం కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మోకాలి నొప్పితో ఇబ్బందిపడిన రాహుల్..యాత్రలో తన బదులుగా మరొకరిని పెట్టాలనుకున్నారని కూడా ఆయన చెప్పారు. తన స్థానంలో సీనియర్ నేతలెవరికైనా ఆ బాధ్యతలను అప్పగించాలని సోదరి ప్రియాంకా గాంధీకి చెప్పారన్నారు. కన్యాకుమారి నుంచి యాత్ర మొదలైన మూడు రోజులకే రాహుల్ మోకాలి నొప్పి తీవ్రమైందన్నారు. అయితే, దేవుడి దయతో ఆ తర్వాత నొప్పి తగ్గిపోయిందని చెప్పారు. రాహుల్ నేతృత్వంలో గత ఏడాది సెప్టెంబర్ 7న మొదలైన భారత్ జోడో యాత్ర జనవరి 30న జమ్మూలో ముగిసిన విషయం తెలిసిందే. -
హైదరాబాద్‌లోనే అంతర్జాతీయస్థాయి వైద్యం
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో ముఖ్యంగా హైదరాబాద్‌లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన అంతర్జాతీయస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని కెన్యా సెనెటర్ ఒబురో ఒగింగా ప్రశంసించారు. తన సోదరుడు గతంలో కెన్యా ప్రధానిగా ఉన్నారని, తాను గత 27 ఏళ్లుగా ఆ దేశంలో రాజకీయవేత్తగా కొనసాగుతున్నానని చెప్పారు. భారత్–కెన్యాల మధ్య మరింత దృఢమైన ఆర్థిక, వ్యాపార సంబంధాలను తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. భారత్‌కు చెందిన అపోలో, యశోద వంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు తమ బ్రాంచీలను ఏర్పాటుచేసి వివిధ వైద్యాంశాల్లో స్థానిక డాక్టర్లకు శిక్షణ ఇవ్వాలని కోరారు. శుక్రవారం ఒబురో ఒగింగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను గత కొన్నేళ్లుగా తీవ్రమైన మోకాళ్ల నొప్పులను అనుభవించానని, ఆ సమస్యకు ఇటీవల హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించుకుని పూర్తి స్వస్థతతో స్వదేశానికి తిరిగి వెళుతున్నట్టు వెల్లడించారు. కెన్యా కంటే మూడింతల తక్కువ ఖర్చుతో.. కెన్యాలో కంటే మూడింతల తక్కువ ఖర్చుతో (అదీ కూడా విమాన చార్జీలు, హోటల్ ఖర్చులన్నీ కలుపుకుని), యశోద ఆసుపత్రిలో చీఫ్సర్జన్ డా.దశరథ రామారెడ్డి ఆధ్వర్యంలో మంచి ట్రీట్మెంట్ పొందినట్టు తెలిపారు. ప్రతి కాలి నొప్పికీ ఆపరేషన్ అవసరం లేదు.. తమను వీడియో కాల్ ద్వారా కెన్యా సెనెటర్ ఒబురో సంప్రదిస్తే, అన్ని పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేయించుకోవాలని సూచించామని యశోద చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. దశరథరామారెడ్డి తెలిపారు. ప్రతి కాలి నొప్పికీ ఆపరేషన్లు అవసరం లేదన్నారు. సమస్య తీవ్రతను బట్టి అత్యవసరమైన వారికే ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మోకాలి మార్పిడి ఆపరేషన్ల నొప్పి తట్టుకోలేరని 2,3 వారాలు నడవలేరని, 3నెలలు ఫిజియోథెరపీ చేయాలంటూ చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయన్నారు. ఇలాంటి అపోహలను దూరంపెట్టి మోకాళ్ల సమస్యలపై దగ్గరలోని ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు. ‘మోకీలు ఆపరేషన్ చేసిన 72 గంటల్లోనే డిశ్చార్జి చేసి రెండువారాల్లో రెండుసార్లు డ్రెస్సింగ్ చేస్తాం. తగిన జాగ్రత్తలతో నెలరోజుల్లో మామూలుగా నడిచే అవకాశాలున్నాయి’ అని చెప్పారు. -
Health: థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం! జాగ్రత్త
ప్రపంచ వ్యాప్తంగా బీపీ, షుగర్, క్యాన్సర్ జబ్బుల రోగుల కంటే ఆర్థరైటిస్ సమస్యే ఎక్కువ మందిలో ఉంది. కానీ దీనిపై అవగాహన అంతంత మాత్రమే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక దశలో శరీర వైకల్యం రావచ్చు. పైగా ఎంత త్వరగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేసి అదుపులో ఉంచుకోవచ్చు. అక్టోబరు 12న అంతర్జాతీయ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కీళ్ల సమస్యలపై ప్రత్యేక కథనం.- కర్నూలు(హాస్పిటల్) జిల్లాలో ఆర్థరైటిస్ (కీళ్లనొప్పులు)తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో 50 నుంచి 60 ఏళ్లలో కనిపించే ఈ సమస్య ప్రస్తుతం 35 నుంచి 40 ఏళ్లకే కనిపిస్తోంది. ప్రస్తు తం జిల్లాలో 12 నుంచి 15 శాతం మంది వివిధ రకాల కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. గత పదేళ్లలో వైద్యుల వద్దకు రోజుకు సగటున 600 మంది రోగులు వస్తున్నారని చెబుతున్నారు. దీనిని ప్రారంభంలోనే నియంత్రించకపోతే భవిష్యత్‌లో నడవలేని, కదల్లేని పరిస్థితులు రావచ్చు. కీళ్లనొప్పికి జన్యుపరమైన కారణాలూ ఉంటాయి. ప్రధానంగా వయస్సు, జన్యుపరమైన కారణాలతోనే ఆర్థరైటిస్ వస్తుంది. ఆర్థరైటిస్ అంటే.. ఆర్థరైటిస్ అంటే ఎముకలు, కీళ్లు, వాటి కణజాలాలకు సంబంధించిన సమస్య. సాధారణంగా కీళ్ల దగ్గర నొప్పి, వాపు వచ్చి అవి గట్టిగా మారడాన్ని ఆయా కీళ్లల్లో కదలికలు తగ్గడాన్ని ఆర్థరైటస్గా చెప్పవచ్చు. ఈ సమస్యల తీవ్రత సాధారణంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. దాదాపు 30 నిమిషాల పాటు ఈ నొప్పి, బిగుతుదనం ఉంటుంది. ఆర్థరైటిస్‌లో రకాలు... ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకి యోజింగ్ స్పాండైటిస్, గౌట్, జువైనల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ (పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్), లూపస్, సోరియాటిక్, ఆర్థరైటిస్ వంటివి ఎక్కువగా మనం చూస్తుంటాము. లక్షణాలు ఆర్థరైటిస్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా తొలిదశలో ఆకలి తగ్డడం, జ్వరం, బాగా నీరసించి పోవడం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి. ప్రధానంగా కీళ్లలో నొప్పి, వాపు, ఎర్రగా అవడం, కదలిక తగ్గడం, ఇతర అవయవాలపై ప్రభావం చూపించడం జరుగుతుంది. ఇతర అవయవాలు అంటే చర్మంపై దద్దుర్లు, జుట్టు రాలిపోవ డం, నోటిపూత, కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్య, పక్షవాతం, కంటిచూపు తగ్గుట, కళ్లు పొడిబారడం, కండరాల నొప్పి మొదలైన లక్షణాలుంటాయి. జీవనశైలిలో మార్పులే కారణం ►ఆర్థరైటిస్‌కు ప్రధాన కారణం జీవనశైలిలో మార్పులే. ►వ్యాయామం లేకపోవడం, జంక్‌ఫుడ్ తినడం, ఫలితంగా ఊబకాయం, పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో ఆర్థరైటిస్ రావడాన్ని గమనించవచ్చు. ►వ్యాయామం చేయకపోవడం వల్ల మృదులాస్తి పునరుత్పత్తి పూర్తిస్థాయిలో ఏర్పడదు. ►సరైన ఆహారం, సరైన కదలిక లేకపోవడం వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది. తీవ్రత తగ్గించేందుకు సూచనలు ►దీనిని నయం చేయలేము గానీ మంచి ఆహారం, వ్యాయామం, మందుల ద్వారా తీవ్రతను తగ్గించుకోవచ్చు. ►ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, కంటినిండా నిద్రపోవడం, అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారం, ►ఒత్తిడి లేకుండా ఉండటం వంటి జాగ్రత్తలు అవసరం. ►పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ►సాధారణంగా లక్షణాల తీవ్రత తగ్గించేలా కీళ్లు మరింత దెబ్బతినకుండా ఉండేలా వ్యాధికి ప్రభావితమైన అవయవం దాని పనితీరును కోల్పోకుండా చూసేలా చికిత్స ఉంటుంది. మందులు ఇచ్చేటప్పుడు వైద్యులు అవాంఛనీయమైన నష్టాలు, దుష్ప్రభావాలు లేకుండా చూస్తారు. ఆ మేరకు మందుల మోతాదును వైద్యులు నిర్ణయిస్తారు. నొప్పి నివారణకు పెయిన్ కిల్లర్లు తాత్కాలికంగా ఉపయోగిస్తారు. కానీ వ్యాధి నియంత్రణ ముఖ్యం. అందుకోసం డిసీజ్మాడిఫైయింగ్ యాంటి రుమాటిక్ డ్రగ్స్ (డీఎంఏఆర్డీ), బయోలాజికల్ ఇంజెక్షన్ వంటి కొత్త మందు తీసుకోవాలి. మంచి చికిత్స అందిస్తే చాలా వరకు సమస్య అదుపులో ఉంటుంది. –డాక్టర్ సి.మంజునాథ్, ఆర్థోపెడిక్ సర్జన్, కర్నూలు వీరిలో ఎక్కువ! ►థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 16- 45 ఏళ్ల మహిళలకు రావచ్చు. ►కీళ్లనొప్పులు, వాపులు ఉండటం, ఉదయాన్నే వేళ్లు, కీళ్లు పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. ►ముఖ్యంగా తొలి దశలోనే ఏ రకమైన ఆర్థటైటిస్ సోకిందో తెలుసుకోవాలి. ►వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడటం, వ్యాయామం, ఆహార నియమాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. చదవండి: Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఈ రెండింటితో.. -
మోకాలి నొప్పులతో బాధపడుతున్న ధోని.. ట్రీట్మెంట్ ఖర్చు 40 రూపాయలు!
MS Dhoni- Knee Pain: కొన్ని ఆరోగ్య సమస్యలకు పెద్ద ఆస్పత్రులకు వెళ్లినా.. భారీ మొత్తం ఖర్చు చేసినా ఒక్కోసారి పెద్దగా ఫలితం కనిపించదు. అలాంటప్పుడు హస్తవాసి బాగున్న వైద్యుల గురించి తెలిస్తే అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవం సహజం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఇందుకు మినహాయింపు కాదు. మోకాలి నొప్పులతో బాధ పడుతున్న ఈ మిస్టర్ కూల్ ఇటీవల ఓ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించినట్లు సమాచారం. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆఖరికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి, ధోని ట్రీట్మెంట్కు అయిన ఖర్చు ఎంతో తెలుసా? దైనిక్ భాస్కర్ వార్తా పత్రిక కథనం ప్రకారం... జార్ఖండ్ రాజధాని రాంచీకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాపంగ్‌లో గల వందన్ సింగ్ ఖెర్వార్ అనే ఆయుర్వేద వైద్యుడు ఉన్నారు. ఆయన హస్తవాసి గురించి స్థానికంగా మంచి పేరుంది. ఈ విషయం తెలుసుకున్న ధోని ఆయన దగ్గరకు వెళ్లి మోకాలి నొప్పుల సమస్యల గురించి బయటపడే మార్గం గురించి అడిగాడు. కాల్షియం లోపం వల్ల తాను బాధపడుతున్నానని ఖెర్వార్‌కు ధోని చెప్పాడు. దీంతో ప్రతిసారి నాలుగు రోజులకు ఓసారి తన వద్దకు రావాల్సిందిగా సదరు వైద్యుడు సూచించాడు. ఈ విషయాల గురించి ఆయుర్వేద డాక్టర్ వందన్ సింగ్ ఖెర్వార్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ... ‘‘మొదటి సారి ధోని నా దగ్గరకు వచ్చినపుడు ఆయనను గుర్తుపట్టలేకపోయాను. కన్సల్టేషన్ ఫీజు కింద 20 రూపాయలు.. చికిత్సకై మందుల కోసం 20 రూపాయల మేర ప్రిస్కిప్షన్ రాశాను. ధోని తల్లిదండ్రులకు కూడా నేను వైద్యం చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఇరుగు పొరుగు వారి గురించి తన గురించి తెలుసుకున్న ధోని తనను సంప్రదించినట్లు పేర్కొన్నారు. కాగా ధోని లాపంగ్‌కు వస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే, ధోని మాత్రం సెల్ఫీలు గట్రా వద్దంటూ వారిని సున్నితంగా వారిస్తున్నాడట. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2022లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. సీజన్ ఆరంభంలో జడేజాను కెప్టెన్‌గా నియమించిన సీఎస్కే.. వరుస పరాజయాల నేపథ్యంలో మళ్లీ ధోనికే సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నైకి ఘోర పరాభవం తప్పలేదు. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కాగా 40 ఏళ్ల వయస్సులోనూ క్రికెట్ ఆడుతున్న ధోనిని గత కొన్ని రోజులుగా మోకాళ్ల నొప్పి సమస్య వేధిస్తోందట. చదవండి: India Vs England-Rishabh Pant: అద్భుతమైన షాట్లు.. నువ్వో సూపర్‌స్టార్: పంత్‌పై ప్రశంసల జల్లు -
ఫ్రాక్చర్ లేకపోయినా నొప్పి తగ్గడం లేదు
నా వయసు 25 ఏళ్లు. ఈమధ్యే నేను బైక్‌పైనుంచి పడ్డాను. అప్పట్నుంచి నా మోకాలు కొద్దిగా వాచింది. నొప్పి ఎంతగా ఉంటోందంటే ఒక్కోసారి అస్సలు దానిపై భారం వేయలేకపోతున్నాను. కాలు కింద పెట్టలేకపోతున్నాను. డాక్టర్‌కు చూపిస్తే ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ ఏదీ లేదని చెప్పారు. అయినప్పటికీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. ఫ్రాక్చర్ లేనప్పటికీ మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి. లిగమెంట్లు చీరుకుపోవడం వంటి గాయాలు ఎక్స్–రేలో కనిపించవచ్చు. దీనికోసం ఎమ్మారై స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో భవిష్యత్తులో అది మరింత సమస్యాత్మకంగా పరిణమించవచ్చు. మీరు వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించండి. -
ఏసీఎల్ టేర్ అంటే ఏమిటి?
నా వయసు 27 ఏళ్లు. నేను మంచి స్పోర్ట్స్ పర్సన్‌ను. ఇష్టంగా ఆటలాడుతుంటాను. ఏడాది కిందట ఒకసారి హైజంప్ చేసే సమయంలో మోకాలిలో తీవ్రమైన నొప్పివచ్చింది. డాక్టర్‌ను కలిస్తే ‘పార్షియల్ ఏసీఎల్ టేర్’ జరిగిందని వివరించారు. కొన్ని రోజులు ఫిజియోథెరపీ తీసుకొమ్మనీ, ఆ తర్వాత ఎప్పట్లాగే ఆటలాడవచ్చని చెప్పారు. నాకు ఇప్పటికీ నాకు అప్పుడప్పుడూ ఇంకా నొప్పిగానే ఉంటోంది. అసలీ ఏసీఎల్ టేర్ అంటే ఏమిటి? నాకు తగిన సలహా ఇవ్వండి. ఆటలు ఆడే సమయంలో మీరు చెప్పిన యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయపడటం చాలా సాధారణంగా జరిగేదే. పాశ్చాత్యదేశాల వారు స్పోర్ట్స్ సమయంలో దీనికి ఏసీఎల్‌కు లోనవుతుంటారు. కానీ మనదేశంలో సాధారణంగా టూవీలర్ నడిపేవారు యాక్సిడెంట్‌కు గురైనప్పుడు ఈ లిగమెంటు దెబ్బతింటుంది. ఇది మోకాలిలో ఉండే కీలకమైన లిగమెంటు. ఒకసారి ఇది గాయపడితే దీనికి రక్తసరఫరా జరగదు కాబట్టి ఇది ఒక శాశ్వతనష్టం చేకూర్చే ప్రమాదంగా పరిణమిస్తుంది. ఈ లిగమెంట్ దెబ్బతిన్న వారు... అంటే ఏసీఎల్‌కు గాయం అయిన వారు సరిగా నిలబడలేకపోవడం మామూలే. కొన్నేళ్ల తర్వాత అది ఆర్థరైటిస్‌గా మారడం కూడా జరుగుతుంది. సాధారణంగా 50 ఏళ్ల కంటే పెద్ద వయసు ఉన్న వారిలో ఏసీఎల్ గాయపడితే సాధారణ సంప్రదాయ చికిత్స చేస్తూ, మోకాలి కదలికలు తగ్గించుకొమ్మని చెబుతూ, వ్యాయామాలను సూచిస్తుంటాం. కానీ చిన్న వయసు వారిలో అంటే... 40 ఏళ్ల కంటే తక్కువ వారికి మాత్రం శస్త్రచికిత్స సూచిస్తుంటాం. ఇందులో కొత్త లిగమెంటు పునర్నిర్మాణం చేస్తుంటాం. దీనివల్ల వారిలో ఆర్థరైటిస్ రాకుండా నివారించడం సాధ్యమవుతుంది. మీరు ఎమ్మారైను బట్టి పార్షియల్ టేర్ అంటున్నారనుకుంటాను. కానీ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే ఆ లిగమెంట్ పూర్తిగా చిరిగిపోయి ఉంటుందని ఊహించవచ్చు. కాబట్టి మీరు ఇప్పట్లో జంపింగ్స్, రన్నింగ్ వంటి వ్యాయామాలు, స్పోర్ట్స్ మొదలుపెట్టకండి. మీ పరిస్థితిని పూర్తిగా సమీక్షించేలా ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ నిపుణుడిని కలిసి, తగిన సలహా తీసుకోండి. ఇంత చిన్న వయసులోనేమోకాళ్లనొప్పులా? నా వయసు 29 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పి మరీ ఎక్కువగా వస్తోంది. నేను చాలారకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఈ చిన్న వయసులోనే ఇలా మోకాళ్ల నొప్పులు రావడం ఆందోళన కలిగిస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. మీ సమస్యను నిశితంగా విశ్లేషించాక మీకు మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో వచ్చే సమస్యే ఇది. ఇది కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు దానిపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదేమీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాబోదు. కాబట్టి అతిగా ఆందోళన పడకుండా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. పిల్లాడి పాదంలోఉండాల్సినఒంపు లేదు...ప్రమాదమా? మా బాబు వయసు నాలుగున్నరేళ్లు. వాడి ఎదుగుదల, ఆకృతి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొంతమంది వాడి పాదాలు చూసి... పాదంలో సహజంగా ఉండే ఒంపు లేదనీ, పాదం పూర్తిగా ఫ్లాట్‌గా ఉందని అన్నారు. భవిష్యత్తులో నడకగానీ, ఆటలాడటం గానీ కష్టమవుతుంది అన్నారు. దాంతో మేము ఆందోళనతో డాక్టర్‌కు చూపించాం. బాబును చూసి, డాక్టర్‌గారు ప్రత్యేకమైన షూ సూచించారు. భవిష్యత్తులో సర్జరీ అవసరం కావచ్చని కూడా చెప్పారు. మా బాబుకు ఆ ప్రత్యేకమైన షూ తొడిగించాలని ప్రయత్నించాం. కానీ వాడు ఆ షూస్ తొడుక్కోడానికి ఇష్టపడటం లేదు. పైగా అవి లేకుండానే మామూలుగా నడవడం, పరుగెత్తడం చేస్తున్నాడు. వాడికి భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందేమోనంటూ ఇప్పుడు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. దయచేసి మాకు తగిన సలహా ఇవ్వగలరు. మీరు పాదం మధ్యలో ఒంపు లేకుండా ఉంటే ఫ్లాట్ ఫీట్ గురించి పూర్తిగా అపోహపడుతున్నారు. అలా పాదం మధ్య ఒంపు ఉండాలన్నది కేవలం ఒక దురభిప్రాయం మాత్రమే. మన జనాభాలోని 6 – 8 శాతం మందిలో పాదంలో ఒంపు (ఆర్చ్) ఉండదు. పైగా అప్పుడే పుట్టిన నవజాత శిశువుల్లో పాదం మధ్యలో ఉండాల్సిన ఒంపు సరిగా కనిపించదు. మూడు నుంచి ఐదేళ్ల వయసు నుంచి ఆ ఒంపు పెరుగుతూ పోతుంటుంది. కేవలం కొద్దిమంది పిల్లల్లోనే పాదంలో ఉండాల్సిన ఎముకలన్నీ కలిసిపోయి, అది చాలా బాధాకరమైన సమస్యగా పరిణమిస్తుంది. కానీ ఇలా జరగడం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది. చిన్నారులు పెరుగుతున్న కొద్దీ ఒంపు లేని పాదాలు (ఫ్లాట్ ఫీట్) ఉన్న చాలామందికి ఎలాంటి చికిత్స లేకుండానే ఆ సమస్య సరైపోతుంది. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో ఆటలాడలేరన్నది కూడా పూర్తిగా తప్పుడు అభిప్రాయం. వాళ్లు కూడా అందరు పిల్లల్లాగానే ఆడుకోగలరు. ఉదాహరణకు సయీద్ ఓవుటా అనే మొరాక్ ఆటగాడు ఒలిపింక్స్‌లో 1984లో ఒలిపింక్స్‌లో బంగారు పతకం సాధించాడు. అలాన్ వెబ్ అనే అమెరికన్ అథ్లెట్ పరుగులో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వాళ్లంతా ఫ్లాట్ ఫీట్‌తో పుట్టిన వాళ్లే. కాబట్టి మీరు మీ బాబు గురించి ఆందోళనపడటం మానేయండి. అతడు బాగా నొప్పి అని ఫిర్యాదు చేస్తే తప్ప... సాధారణంగా అతడికి ఎలాంటి సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. మీకు ఉన్న దురభిప్రాయమే చాలాకాలం కిందట చాలమందిలో ఉండేది. ఇప్పటి ఆధునిక వైద్యవిజ్ఞాన పరిశోధనల్లో అది తప్పు అని తేలింది. -
ఫాస్ట్‌ట్రాక్ విధానం వల్ల కోలుకోవడం ఈజీ
ఆర్థో కౌన్సెలింగ్ నా వయసు 51 సంవత్సరాలు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. ఒక విభాగంలో సూపర్వైజర్గా ఉన్నాను. మా ఆఫీస్ బిల్డింగ్ చాలా పాతది. లిఫ్ట్ సౌకర్యం లేదు. ఫైల్స్ సంతకాల కోసం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న నేను సెకండ్ ఫ్లోర్‌కు రోజులో కనీసం పదిసార్లు తిరుగుతుంటాను. దీంతో నేను విపరీతమైన మోకాలి నొప్పులతో బాధపడుతున్నాను. వైద్యులను సంప్రదించి కొన్ని మందులు వాడాను. కానీ లాభం లేకపోవడంతో ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్‌ను కలిశాను. ఆయనేమో మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలని అంటున్నారు. నా సమస్యకు ఆపరేషన్ ఒక్కటే మార్గమా? ఇతర ప్రత్యామ్నాయ చికిత్సలు ఏమైనా అందుబాటులో ఉంటే తగిన చికిత్స ఇవ్వగలరు. - సత్యనారాయణ, వరంగల్ మీరు తెలిపిన వివరాల ప్రకారం మీరు ‘ఆస్టియో ఆర్థరైటిస్’తో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. వయసుతో పాటు మోకాలి చిప్ప అరిగిపోవడం వల్ల, హిప్ డిస్లొకేషన్ లేదా జాయింట్లు అధిక ఒత్తిడికి గురైనప్పుడు లేదా మనం తీసుకునే ఆహారంలో క్యాల్షియమ్ లోపం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. మీ సమస్యకు మోకాలి చిప్ప మార్పిడి అనేది ఉత్తమమైన పరిష్కారం అని చెప్పవచ్చు. కానీ మీకు డయాబెటిస్, రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యల వంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను బట్టి మీ చికిత్స విధానం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు సంపూర్ణారోగ్యంతో ఉంటే మాత్రం ‘ఫాస్ట్‌ట్రాక్’ విధానంలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడానికి వీలవుతుంది. ఈ విధానంలో సర్జరీ జరిగిన 24 గంటలలోనే పేషెంట్‌ను నడిపించి డిశ్చార్జ్ చేసే వీలుంది. అలాగే చాలా కొద్దిరోజులలోనే మీరు పూర్తిగా కోలుకుని మీ ఉద్యోగ నిర్వహణలో యధావిధిగా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇందుకు అత్యాధునిక ఇంప్లాంట్స్‌తో పాటు ఇప్పుడు అనుభవజ్ఞులైన వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. మీకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు. ఆపరేషన్‌కు ముందు నుంచే మీ నొప్పి నివారణ ప్రక్రియలను వైద్యులు ప్రారంభిస్తారు. మీకు నొప్పి, బాధ లేకుండానే సర్జరీ చేస్తారు. ఫాస్ట్‌ట్రాక్ విధానంలో ఆపరేషన్ చేయడానికి వీలవుతుందని వైద్యులు నిర్ధారణ చేస్తే, ఈ విధానం గురించి మీకు పూర్తిగా వివరించి, మిమ్మల్ని మానసికంగా ఆపరేషన్‌కు సిద్ధం చేస్తారు. అలాగే సర్జరీ తర్వాత మీ ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. వైద్యులు చేసే కొన్ని సూచనలను మాత్రం మీరు తప్పకుండా ఫాలో కావాల్సి ఉంటుంది. వ్యాయామాలు, ఫిజియోథెరపీ గురించి వైద్యులు క్షుణ్ణంగా తెలియజేస్తారు. దీనికి రోజుల తరబడి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స గురించి మీరు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. - డాక్టర్ ప్రవీణ్ రావు, సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
బైక్ యాక్సిడెంట్ తరువాత నుంచి మోకాలిలో నొప్పి... తగ్గేదెలా?
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 24 ఏళ్లు. ఇటీవల జరిగిన ఒక యాక్సిడెంట్లో నేను బైక్‌పైనుంచి కింద పడ్డాను. అప్పట్నుంచి నా మోకాలు కొద్దిగా వాచింది. ఒక్కోసారి ఎంత నొప్పి ఉంటోందంటే దానిపై అస్సలు భారం వేయలేకపోతున్నాను. డాక్టర్గారికి చూపిస్తే ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ ఏదీ లేదని చెప్పారు. అయినప్పటికీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. నాకు తగిన సలహా ఇవ్వండి. - కృష్ణకుమార్, హైదరాబాద్ ఫ్రాక్చర్ లేనప్పటికీ మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి. లిగమెంట్లు చీరుకుపోవడం వంటి గాయాలు ఎక్స్-రేలో కనిపించవచ్చు. దీనికోసం ఎమ్మారై స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో అది భవిష్యత్తులో మరింత సమస్యాత్మకంగా పరిణమించవచ్చు. మీరు వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించండి. నా వయసు 30 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా వస్తోంది. నేను చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఈ చిన్న వయసులోనే ఇలా కావడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు శాశ్వతంగా ఏదైనా వైకల్యం వస్తుందేమో అని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - రమేశ్, నిర్మల్ మీ సమస్యను నిశితంగా పరిశీలించినట్లయితే మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో వచ్చే సమస్యే ఇది. ఇది కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు దానిపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదేమీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాబోదు. కాబట్టి అతిగా ఆందోళన పడకుండా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
మోకాలి నొప్పికి ద్రాక్షతో చెక్
న్యూయార్క్: మోకాలి నొప్పితో బాధపడుతున్నారా? అయితే రోజూ మీరు తీసుకునే ఆహారంలో ద్రాక్ష పళ్లను తీసుకోండి. మోకాలి నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. ప్రతి రోజూ ద్రాక్ష తినడం వల్ల నరాలు, కీళ్లలో పటుత్వం పెరిగి మోకాలి నొప్పిని తగ్గడానికి ఉపయోగపడుతుందని ఓ పరిశోధనలో తేలింది. ద్రాక్షలో పోలీపినాల్స్ ఉన్నట్టు గుర్తించారు. దీనివల్ల కీళ్లలో పటుత్వం పెరగడంతో పాటు మోకాలి నొప్పిని తగ్గిస్తుందని అమెరికాలోని టెక్సాస్ ఉమెన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షానిల్ జుమా తెలిపారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న 72 మంది పురుషులు, మహిళలపై పరిశోధనలు నిర్వహించినట్టు వివరించారు. రోజూ ద్రాక్ష తినడం వల్ల వారి సమస్యలు నయమైనట్టు గుర్తించామని చెప్పారు.