మోకాళ్ల నొప్పులతో బాధపడేవారిలో చాలామంది తాము మరింత ఎక్కువగా నడుస్తూ ఉంటే మోకాళ్లు ఇంకా అరిగిపోతాయేమోనని, దాంతో తమ నొప్పులు మరింతగా ఎక్కువవుతాయేమోనని అపోహపడుతుంటారు.
నిజానికి మన మోకాళ్ల కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే, ఆ భాగంలో అంతగా రక్తప్రసరణ జరిగి కీళ్లకు మంచి పోషణ అందుతుంది. దాంతో మోకాలి ఎముకలతో పాటు, మన ఇతర కండరాలూ, దేహంలోని ఎముకలూ బలపడతాయి.
మోకాలి నొప్పులను నివారించాలంటే...
►మోకాళ్ల నొప్పులున్నవారు ఈ కింద పేర్కొన్న పనులేవీ చేయకూడదు...
►ఒక అంతస్తు కంటే ఎక్కువగా మెట్లు ఎక్కి దిగడం ఎగుడుదిగుడుగా ఉండే నేలపై నడక (వాకింగ్‌లోనూ సమతలంగా ఉండే నేలపైనే నడవాలి).
►నేలపై కాళ్లు రెండూ మడత వేసుకుని కూర్చోవడం / లేవడం (స్కాటింగ్)
►నేల మీది వస్తువుల్ని, బరువుల్ని నడుము వంచి గభాల్న లేవడం.
►అలా లేపాలనుకున్నప్పుడు కూర్చుని నింపాదిగా లేపాలి.
►ఈ జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ మోకాళ్లు నొప్పిగా ఉంటే ఒకసారి ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించాలి.
నోట్: ఇది కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే అందించిన కథనం.
Comments
Please login to add a commentAdd a comment