వర్షాకాలం వచ్చిదంటే చాలా మందికి కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కండరాలు పట్టేసినట్టు అనిపిస్తాయి. వర్షాకాలంలోని తేమకు కీళ్లనొప్పులకు సంబంధం ఉంటుంది. వానాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వానల రోజులు కొంతమంది ఆహ్లాదాన్ని పంచితే మరికొంతమందికి, ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి ఆందోళన మోసుకొస్తుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో వారికి నొప్పులతో రోజువారీ పనులను కొనసాగించడం, ఒక్కోసారి కాలు కదపడం కూడా కష్టం అనిపిస్తుంది.
మారుతున్న వాతావరణానికి, కీళ్ల నొప్పులకు సంబంధం ఉంది అంటున్నారు నిపుణులు. చల్లని వాతావరణం, తేమ స్థాయిలలో మార్పులు, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల కారణంగా కీళ్ల నొప్పులు, కండరాలు దృఢత్వంలో తేడాలు, తిమ్మిర్లు గాయం నొప్పి కనిపిస్తాయి. గాలిలోని అధిక తేమ స్థాయిలు రక్తాన్ని చిక్కగా చేస్తాయి. రక్తపోటును పెంచుతాయి.
ఎముకలకు కీలకమైన డీ విటమిన్ కూడా ఈ సీజన్‌లో సరిగ్గా అందదు. వర్షాకాలంలో నీరు ఎక్కువగా తాగకపోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అలాగే ఈ కాలంలో కీళ్ల చుట్టూ ఉండే ప్లూయడ్ పలచబడుతుంది. దీనివల్ల కూడా నొప్పి వస్తుంది. ఈ కారణాల రీత్యా కీళ్ల నొప్పులు పెరుగు తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
విటమిన్ డీ, బీ 12 లభించే ఆహారాలు తీసుకోవాలి. అవసరమైతే ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలి.
విటమిన్ ఇ నొప్పి , వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
గింజలు, అవకాడో, బెర్రీలు, ఆకు కూరలు, గింజలు, చేపలు ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి.
కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం చాలా అవసరం. అవిసె గింజలు,నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, పనీర్, గుడ్లు తీసుకోవాలి.
మోకాళ్లు, ఇతర కీళ్ళపై సురక్షితమైన ఆయిల్‌తో సున్నితంగా మసాజ్ చేసుకోవచ్చు.
వేడి నీటి, హీట్‌బ్యాగ్‌తో కాపడం పెట్టుకోవచ్చు.
కండరాలకు వ్యాయామం ఒక వరం. మార్నింగ్ వాక్, లెగ్, కండరాలను సాగదీసేలా వ్యాయామాలు, యోగా, సైక్లింగ్ చేయడం వంటివి చేయడం మర్చిపోకూడదు. అలాగని మరీ ఎక్కువ చేయకూడదు.
ఎలాంటి వ్యాయామాలు చేయాలనే దానికోసం వైద్య నిపుణుడు, ఫిజియో థెరపిస్ట్‌ను సంప్రదించడం మంచిది
Comments
Please login to add a commentAdd a comment