joint pains
-
కీళ్ల నొప్పులకు కారణాలనేకం, కానీ అశ్రద్ధ పనికి రాదు!
40-50 ఏళ్ల వయసు దాటిన తరువాత స్త్రీ పురుషుల్లో కనిపించే ప్రధాన సమస్య కీళ్ల నొప్పులు. వయసుతోపాటు వచ్చేదేలే అని నిర్లక్ష్యం పనికి రాదు. తగిన వ్యాయామం, ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మరోవైపు కొన్నిప్రత్యేక కారణాల రీత్యా యువతలో కూడా కీళ్ళ సమస్య కనిపించవచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఈ కీళ్ల నొప్పులకు, కారణాలు, తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. కీళ్ల నొప్పులకు కారణాలుఆర్థరైటిస్ (ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్)గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు (సెప్టిక్ ఆర్థరైటిస్) గంటల తరబడి ఒకే చోట కూర్చుండి పోవడం, వ్యాయామం లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ (లూపస్, ఫైబ్రోమైయాల్జియా)కూర్చోవడం, లేదా నిలబడే తీరు సరిగ్గా లేకోవడం, లేదా బయోమెకానిక్స్వయస్సు-సంబంధిత దుస్తులు మరియు కన్నీటిమధుమేహం, థైరాయిడ్ లాంటి వ్యాధులుఅలాగే ఊబకాయం, సరైన జీవనశైలి, పేలవమైన భంగిమ, క్రీడలలో ఎక్కువగా పాల్గొనడం, కీళ్ల గాయాలు, జన్యుపరమైన కారణాలు, పుట్టుకతో వచ్చే పరిస్థితుల కారణంగా చిన్న వయసులో కూడా కీళ్ల నొప్పులు రావచ్చు. ఒక్కోసారి కేన్సర్‌లాంటి జబ్బులున్నపుడు కూడా కీళ్ల నొప్పులొస్తాయి.వైద్యుడిని ఎప్పుడు సందర్శించాలి?కీళ్ల నొప్పులకారణాన్ని గుర్తించి, తేలికపాటి వ్యాయామం, ఆహారంలో మార్పులతో చాలావరకు ఉపశమనం పొందవచ్చు. కానీ నొప్పి తీవ్రంగా ఉన్నపుడు, వాచినపుడు, నడవడంకష్టంగా మారినపుడు, అలాగే కీళ్ల నొప్పులతో మాటు జ్వరం వస్తే మాత్రం కచ్చితంగా వైద్యుణ్ని సంప్రదించాలి. ఎక్స్‌రే లాంటి కొన్ని పరీక్షల అనంతరం వ్యాధి నిర్ధారణ తగిన చికిత్స పొందవచ్చు.కీళ్ల నొప్పులకు ఉపశమనమిచ్చే ఆహారంఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు / చేప నూనెలునట్స్ అండ్ విడ్స్బ్రాసికా కూరగాయలు, కాయధాన్యాలు, బీన్స్పండ్లు, ఆలివ్ నూనె, వెల్లుల్లి , దంప కూరగాయలు, తృణధాన్యాలుకీళ్ల నొప్పులకు ఏ ఆహారాలు చెడ్డవి?ఉప్పు, చక్కెరపదార్థాలు,ప్రాసెస్ చేసిన ఆహారం, రెడ్‌మీట్,మద్యంగ్లూటెన్ ఆహారాలుఅధిక ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొన్నిరకాల నూనెలు ఇదీ చదవండి: నటి భాగ్యశ్రీ వ్యాయామాలతో భుజాల నొప్పులు మాయం!సమంత రోజు ఎలా గడుస్తుందంటే...??? -
జ్వరం.. కొత్త లక్షణం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లా ప్రజలను వింత జ్వరాలు వేధిస్తున్నాయి. జ్వరం ఒకటి రెండు రోజుల్లోనే తగ్గుతున్నా ఆ తరువాత కీళ్ల వాపులు, శరీరంపై ర్యాష్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. గతంలో జ్వరం వస్తే మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉండేది. కానీ ప్రస్తుతం జ్వరం ఒక్కరోజు మాత్రమే ఉంటోంది. 103 నుంచి 104 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. కానీ దుష్ఫలితాలు పది నుంచి 15 రోజుల పాటు వెంటాడుతూనే ఉన్నాయి.మలేరియా, డెంగీ అనుమానిత కేసులువిజయవాడ నగరంలోని మొగల్రాజపురం, మారుతీనగర్, గుణదల, పాతబస్తీలోని చిట్టినగర్, కేఎల్‌రావు నగర్ వంటి ప్రాంతాల్లో డెంగీ, మలేరియా అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. కొందరిలో డెంగీ ఎన్ఎస్1 పరీక్షలో పాజిటివ్ వస్తూ, ప్లేట్లెట్స్ కూడా తగ్గుతున్నాయి. అలాంటి వారిలో డెంగీ ఎలీజా పరీక్ష చేస్తే నెగిటివ్ వస్తోంది. గత నెలలో గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలు సోకగా, పదిహేను రోజులుగా నగరంలో కూడా జ్వర బాధితులు పెరుగుతున్నారు. దోమకాటుతో పాటు, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా కూడా జ్వరాలు పెరుగుతున్నాయి.దోమల నివారణ ప్రచార ఆర్భాటమేవిజయవాడ నగరంలో వ్యాధులు సోకకుండా దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారమే కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు జరగడం లేదు. ఏదైనా అనుమానిత కేసు వచ్చిన ప్రాంతంలో వైద్య ఆరోగ్యశాఖ, నగర పాలక సంస్థ సిబ్బంది వెళ్లి చుట్టు పక్కల ఇళ్లలో యాంటీ లార్వా ఆపరేషన్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాలు సైతం యాప్‌లో ఫొటోలు అప్లోడ్ చేసేందుకు రెండు, మూడు ప్రాంతాల్లో పర్యటించి సరిపెడుతున్నారు. దోమల నియంత్రణ క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదు. దీంతో నగర ప్రజలు దోమకాటు వ్యాధులకు గురవుతున్నారు. అధికారుల ప్రకటనలకు, వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు.కనిపిస్తున్న లక్షణాలు ఇవీ.. ⇒ తొలుత జ్వరం వచ్చి ఒకటి రెండు రోజుల్లోనే తగ్గిపోతుంది.⇒ ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు ప్రారంభమవుతున్నాయి.⇒ క్రమేణా కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులు వస్తున్నాయి. ⇒ ఇలాంటి వారిలో కొందరు రెండు మూడు రోజులు మంచం మీద నుంచి కిందకు దిగి నడవలేని పరిస్థితి తలెత్తుతోంది.⇒ కొందరిలో కాళ్ల వాపులు సైతం ఎక్కువగా వస్తున్నాయి.⇒ వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.⇒ ఈ లక్షణాలు పది రోజుల నుంచి 15 రోజులు పాటు ఉంటూ ప్రజలను బాధిస్తున్నాయి.⇒ కొంత మందిలో జ్వరం తక్కువగా ఉండి గొంతునొప్పి, జలుబు వంటి సమస్యలు వేధిస్తున్నాయి.⇒ ఇలాంటి వారు తీవ్రంగా నీరసించి పోతున్నారు. రెండు మూడు రోజులకు దగ్గు కూడా ప్రారంభమవుతుంది. వారం నుంచి పది రోజుల పాటు దగ్గు ఇబ్బంది పెడుతోంది.జ్వరాలు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి..ప్రస్తుతం ప్రబలిన జ్వరాలు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒక రోజు జ్వరం వచ్చి తగ్గిపోతుంది. ఆ తర్వాత చాలా మందిలో కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, కాళ్ల వాపులు వస్తున్నాయి. కొందరైతే, రెండు, మూడు రోజులు మంచంపై నుంచి దిగలేని పరిస్థితి ఏర్పడుతోంది. పది నుంచి పదిహేను రోజుల పాటు నొప్పులు ఉంటున్నాయి. కొందరిలో వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నారు. డెంగీ ఎన్ఎస్1 పాజిటివ్ వచ్చి, ప్లేట్లెట్స్ తగ్గినా, ప్రమాదకరంగా మారడం లేదు. వాటికవే పెరుగుతున్నాయి. కొందరిలో భరించలేని తలనొప్పి, బాడీపెయిన్స్ కూడా ఉంటున్నాయి. నిపుణులైన వైద్యులను సంప్రదించి వైద్యం పొందితే మంచిది.– డాక్టర్ ఎస్.డి.ప్రసాద్, జనరల్ ఫిజీషియన్, విజయవాడ -
వర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? జాగ్రత్తలు!
వర్షాకాలం వచ్చిదంటే చాలా మందికి కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కండరాలు పట్టేసినట్టు అనిపిస్తాయి. వర్షాకాలంలోని తేమకు కీళ్లనొప్పులకు సంబంధం ఉంటుంది. వానాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.వానల రోజులు కొంతమంది ఆహ్లాదాన్ని పంచితే మరికొంతమందికి, ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి ఆందోళన మోసుకొస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో వారికి నొప్పులతో రోజువారీ పనులను కొనసాగించడం, ఒక్కోసారి కాలు కదపడం కూడా కష్టం అనిపిస్తుంది. మారుతున్న వాతావరణానికి, కీళ్ల నొప్పులకు సంబంధం ఉంది అంటున్నారు నిపుణులు. చల్లని వాతావరణం, తేమ స్థాయిలలో మార్పులు, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల కారణంగా కీళ్ల నొప్పులు, కండరాలు దృఢత్వంలో తేడాలు, తిమ్మిర్లు గాయం నొప్పి కనిపిస్తాయి. గాలిలోని అధిక తేమ స్థాయిలు రక్తాన్ని చిక్కగా చేస్తాయి. రక్తపోటును పెంచుతాయి.ఎముకలకు కీలకమైన డీ విటమిన్ కూడా ఈ సీజన్లో సరిగ్గా అందదు. వర్షాకాలంలో నీరు ఎక్కువగా తాగకపోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అలాగే ఈ కాలంలో కీళ్ల చుట్టూ ఉండే ప్లూయడ్ పలచబడుతుంది. దీనివల్ల కూడా నొప్పి వస్తుంది. ఈ కారణాల రీత్యా కీళ్ల నొప్పులు పెరుగు తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలువిటమిన్ డీ, బీ 12 లభించే ఆహారాలు తీసుకోవాలి. అవసరమైతే ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలి.విటమిన్ ఇ నొప్పి , వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.గింజలు, అవకాడో, బెర్రీలు, ఆకు కూరలు, గింజలు, చేపలు ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం చాలా అవసరం. అవిసె గింజలు,నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, పనీర్, గుడ్లు తీసుకోవాలి. మోకాళ్లు, ఇతర కీళ్ళపై సురక్షితమైన ఆయిల్‌తో సున్నితంగా మసాజ్ చేసుకోవచ్చు. వేడి నీటి, హీట్బ్యాగ్తో కాపడం పెట్టుకోవచ్చు.కండరాలకు వ్యాయామం ఒక వరం. మార్నింగ్ వాక్, లెగ్, కండరాలను సాగదీసేలా వ్యాయామాలు, యోగా, సైక్లింగ్ చేయడం వంటివి చేయడం మర్చిపోకూడదు. అలాగని మరీ ఎక్కువ చేయకూడదు. ఎలాంటి వ్యాయామాలు చేయాలనే దానికోసం వైద్య నిపుణుడు, ఫిజియో థెరపిస్ట్‌ను సంప్రదించడం మంచిది -
మీకు తెలుసా? ప్రతిరోజూ సున్నం తీసుకుంటే ఇన్ని లాభాలున్నాయా?
మనకు వచ్చే వ్యాధులలో సుమారు 70% వాతం వల్ల వచ్చేవే. మన శరీరంలో వచ్చే నొప్పులు 90% వాతం కారణంగానే వస్తాయి. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? వాతం రాకముందే ఎలా గుర్తించాలి? నివారణకు ఏం చేయాలి?అన్నది ప్రముఖ ఆయుర్వేదిక్ డా. నవీన్ నడిమింటి మాటల్లోనే.. ►శరీరంలో కాల్షియం తగ్గితే 50కి పైగా జబ్బులు వస్తాయి. ► మన శరీరంలో40-45 ఏళ్ల వరకే మనం తీసుకునే ఆహరం నుంచి కాల్షియం తయారవుతుంది. ► శరీరంలో కాల్షియం తగ్గితే ఎముకలకి సంబంధించిన నొప్పులు, కఫానికి సంబంధించిన జబ్బులు వస్తాయి. ► కీళ్లనొప్పులు, భ/జాల నొప్పులు, మోకాళ్లు, నడుము నొప్పులు వస్తాయి. ► స్త్రీలకు 45ఏళ్లు పూర్తికాగానే, మోనోపాజ్ దశ మొదలవుతుంది. దీంతో శరీరం కాల్షియంను తీసుకునే సామర్థ్యం కోల్పోతుంది. కొందరికి యూరిక్ యాసిడ్ వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఈ మధ్యకాలంలో వాత రోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చలికాలంలో చల్లదనం వల్ల వాతం పెరిగి నొప్పులు మరింత ఎక్కువగా ఉంటాయి. శరీరంలో వాతం పెరిగితే నిద్ర పట్టకపోవచ్చు. కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, అరటిపండు, నారింజ, కమలా, బత్తాయి, ద్రాక్ష, మామిడి పండ్లు 45ఏళ్లు నిండిన తర్వాత,పండ్లు తీసుకున్నా శరీరంలో కాల్షియంను జీర్ణం చేసే హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో బయటి నుంచి కాల్షియంను తీసుకోవాల్సి ఉంటుంది. వాతం..ఇలా గుర్తించండి ► చేతి, కాళ్ల కదలికలు స్టిఫ్ అవుతున్నట్లు, ఏదైనా నొప్పి కలిగిస్తున్నట్లు ఉంటే వాతానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లు గుర్తించండి. ► ఉదయం నిద్రలేచే సమయానికి పూర్తిగా స్టిఫ్‌గా శరీరం ఉంటే వాతం ఉన్నట్లు గమనించండి. ► ఫ్యాన్ వాతాన్ని చాలా ఎక్కువగా పెంచుతుంది. కాబట్టి వేగంగా తిరిగే ఫ్యాన్ కింద నేరుగా పడుకోవద్దు. ► పలుచటి దుప్పటి కప్పుకొని కాస్త పక్కకు పడుకోవాలి. ► గాలి నేరుగా తగలకుండా చూసుకోవాలి. వాతం నివారణకు ఇలా చేయండి. 1. సున్నం తీసుకోండి: 45 ఏళ్లు దాటిన స్త్రీలు, పురుషులు ఎవరైనా తప్పకుండా సున్నం తీసుకోవాలి. సున్నంలో కాల్షియం పరిపూర్ణంగా ఉంటుంది. ఇందులో మన శరీరానికి కావల్సిన సూక్ష్మపోషకాలు ఉన్నాయి. 1.సున్నం ( 1 గ్రాము ) + 1 గ్లాసు నీళ్ళు (1 గ్రాము -- గోధుమ గింజంత మోతాదు ) సున్నంని నీళ్ళలో బాగా కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి. 2.సున్నం + పెరుగు లేక మజ్జిగ . సున్నంని పెరుగు లేక మజ్జిగలో కలిపి మధ్యాహ్నం భోజనము తర్వాత మాత్రమే తీసుకోవాలి. 3. ఆర్థరైటిస్ ఉన్నవారు రోజుకు రెండు గ్రాముల సున్నం తీసుకోవాలి. గమనిక: శరీరంలో రాళ్లు(కిడ్నీలో స్టోన్స్)ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సున్నంని తీసుకోరాదు. మెంతులు మంచి ఔషధం 1.మెంతులు ఔషధాల గని. ఇవి వాతం, కఫాన్ని తగ్గిస్తాయి. 2.రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని లేదా వేడి నీటిలో 1 చెంచా మెంతులు నానబెట్టి ఉదయాన్నే పరగడుపున బాగా నమిలితినాలి. మెంతుల కంటే సున్నం వాతనాశినిగా ఆయుర్వేదంలో చెప్పుకుంటారు. 3.పారిజాత వృక్షం చెట్టు ఆకులు ఎక్కువ క్షౌరగుణాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆకులను రాత్రిపూట ఒక గ్లాసు నీళ్లలో వేసి ఆ నీటిని అరగ్లాసు అయ్యేదాకా వేడి చేసి, ఉదయం పరగడుపునే ఆకులతో సహా గుటకగా తాగాలి. ఇది అన్ని రకాల ఆర్థరైటిస్‌ను తగ్గిస్తుంది. ఈ కషాయం దీర్ఘకాలిక రోగాలకు మంచి మందులా పనిచేస్తుంది. గమనిక: ఈ కషాయం వాడుతున్నప్పుడు ఎలాంటి ఇతర మందులు వాడరాదు. ఈ కషాయం వల్ల 2-3 నెలల్లోనే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ♦ యూరిక్ యాసిడ్ వల్ల మోకాళ్ల నొప్పులు ఉన్నవారు.. నల్ల నువ్వులు,బెల్లాన్ని కలిపి తీసుకోవాలి. ♦ ఆస్తమా + ఆర్ధరైటీస్ ఉన్నవారు దాల్చిన చెక్క + శొంటి కషాయాన్ని తప్పనిసరిగా తాగాలి. ♦ స్థూలకాయం + ఆర్ధరైటీస్ ఉన్నవారు కూడా బెల్లాన్ని తీసుకోవచ్చు. ♦ పెద్ద వయస్సు వారికి మోకాళ్ల నొప్పులు ఉంటే సున్నం తీసుకుంటే సరిపోతుంది. ♦ భుజాల నొప్పులు, మోచేతి నొప్పులకు నీటిని చిన్నగా గుటకగుటకగా తాగితే నొప్పులు తగ్గిపోతాయి. ♦ కీళ్ల నొప్పులు ఉన్నారు భోజనం చేసిన వెంటనే వేడినీళ్లు తాగాలి. ♦ ఉపవాస సమయంలో చల్లటి పండ్లరసాలు తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి. ఎక్కువ సేపు కడుపు ఖాళీగా ఉంటే వాతం పెరిగి కాళ్లు, చేతులు, నడుము నొప్పులు వస్తాయి. వేడినీళ్లు తాగితే ఏ ఇబ్బందీ ఉండదు. మంచినీళ్లు నిలబడి తాగుతున్నారా? ►మంచినీళ్లు తాగేటప్పుడు కూర్చొని తాగాలి. అంతేకాకుండా నీళ్లు ఎప్పుడు తాగినా గుటక గుటకగా తాగాలి. ► నిలబడి నీళ్లు తాగితే మోకాళ్ల నొప్పులు ఎప్పటికీ తగ్గవు. ఏ మందులు వాడినా ఫలితం ఉండదు. ► సైంధవ లవణం ( Rock Salt ),శుద్దమైన వంట నూనె వాతం శాతన్ని పెంచకుండా చేస్తుంది. - డాక్టర్ నవీన్ రోయ్,ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఫోన్ -9703706660 -
షోల్డర్ డిస్లొకేషన్... భుజం నొప్పికి కారణాలు
-
దవడ నొప్పికి కారణాలు చికిత్స
-
కీళ్లు, మోకాళ్ల నొప్పులకు ఉపశమనం కావాలంటే, Nveda Joint Support తెలుసుకోండి!
హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2తో సహజసిద్ద పద్దతిలోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్నారా? అయితే మీరు “Nveda Joint Support” గురించి తప్పకుండా తెలుసుకుని విముక్తి పొందండి! హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది ఒక రకమైన కొలాజెన్, ఇది కీళ్లు మరియు మోకాళ్ల ఆరోగ్యం కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది, ఎందుకంటే ఇది కీళ్ల మృదులాస్థి యొక్క ప్రధాన నిర్మాణ భాగం కాబట్టి. ఇది కోడి మృదులాస్థి నుండి తీసుకోబడింది. కీళ్లు మరియు మోకాళ్ల ఆరోగ్యానికి హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 ద్వారా పొందే కొన్ని ప్రయోజనాలను ఇక్కడ చూద్దాము : కీళ్ల చలనాన్ని మెరుగుపరుస్తుంది: హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది కీళ్ల చలనాన్ని మరియు వంగే గుణాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, కీళ్ల నొప్పులు మరియు అన్ని రకాల కీళ్ళవాపు వ్యాధులు(ఆర్థరైటిస్), కీళ్ల కదలికలో కష్టం (రుమాటిక్ ) మరియు ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్)తో బాధపడుతున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్లు & మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది : హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది మంటను తగ్గించే లక్షణాలను కలిగి ఉన్నట్లు గుర్తించబడింది, దీని వలన ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్) మరియు కీళ్ల కదలికలో కష్టంగా (రుమటాయిడ్ ఆర్థరైటిస్) ఉన్నటువంటి వారిలో కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. మృదులాస్థి ఆరోగ్యానికి దోహదపడుతుంది: కొలాజెన్ టైప్-2 అనేది మృదులాస్థిలో ప్రధాన భాగం, అది కీళ్లలో ఉన్న ఎముకల మధ్య ఒక మెత్తని పదార్థంలాగా పనిచేస్తుంది. హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది మృదులాస్థి ఆరోగ్యానికి సహాయపడుతుంది ఇంకా దాని అరుగుదలను నెమ్మదిపరుస్తుంది. క్రీడల్లో గాయపడిన వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కీళ్లు & మోకాళ్ల కణజాలను బాగుచేయడంలో దోహదపడుతుంది : కొలాజెన్ టైప్-2 అనేది కీళ్లు & మోకాళ్ల కణజాలను బాగుపరచడంలో ఎంతో ముఖ్యమైనది. హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల కొత్తగా కీళ్ల కణజాల పెరుగుదలకు దోహదపడుతుంది మరియు కీళ్ల & మోకాళ్ల పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సురక్షితమైనది మరియు సహజసిద్ధమైనది : హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది చాలా మంది ఒంటికి తగినటువంటి సురక్షితమైన, సహజసిద్ధమైన పదార్థం. ఇది చాలా తేలికగా జీర్ణమవుతుంది ఇంకా దీనిని శరీరం బాగా గ్రహించుకుంటుంది, అందువలన కీళ్ల నొప్పులు మరియు బిగుసుకుపోయిన కీళ్లు ఉన్న వారికి ఇదొక ప్రభావవంతమైన ఎంపిక అని చెప్పవచ్చు. Nveda (https://nveda.in/ ) అనేది బాగా పరిశోధించబడిన పదార్థాలతో కూడిన Nveda Joint Support అనే ఒక ఉత్పత్తిని తయారు చేసింది, ఇవన్నీ కూడా మోకాళ్లు, కీళ్లను బలపరచడంలో సహాయపడతాయి. Nveda Joint Support లో హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2తో పాటు గ్లూకోసమైన్, ఎంఎస్ఎం, కాల్షియం సిట్రేట్ & కాల్షియం ఆస్కార్బేట్ లు కూడా ఉన్నాయి. ఈ సహజసిద్ద పదార్ధాలన్నీ మంటను తగ్గించడానికి, కీళ్ల రాపిడిని తగ్గించడానికి మరియు కీళ్లు & మృదులాస్థిని బలపరచడంలో సహాయపడతాయి. ఈ ఉత్పత్తి గురించి మరిన్ని వివరాల కోసం, మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు (https://nveda.in/products/joint-support-60) గ్లూకోసమైన్ అనేది సహజసిద్దంగా మన శరీరంలో ఉండే పదార్థం, ఇది మృదులాస్థి తయారీలో ఇంకా దానిని బాగుచేయడంలో దోహదపడుతుంది. ఇది సాధారణంగా మోకాళ్లు & కీళ్ల ఆరోగ్యానికి ఉపయోగించబడుతుంది. కీళ్ల ఆరోగ్యానికి గ్లూకోసమైన్ కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ చూడండి: 👉కీళ్లు & మోకాళ్ల నొప్పులు తగ్గించి అవి బిగుసుకుపోవడాన్ని కూడా తగ్గిస్తుంది: గ్లూకోసమైన్ అనేది ముసలితనపు కీళ్ళ వ్యాధి(ఆస్టియో ఆర్థరైటిస్), కీళ్ళ కదలికలో కష్టము (రుమాటిక్ ఆర్థరైటిస్), ఇతర రకాల కీళ్లు & మోకాళ్ల నొప్పి ఉన్నవారిలో కీళ్లు&మోకాళ్ల నొప్పిని తగ్గించి, అవి బిగుసుకుపోవడాన్ని కూడా తగ్గించడంలో సహాయ పడుతుంది. 👉కీళ్ల పనితీరునుమెరుగుపరుస్తుంది: గ్లూకోసమైన్ అనేది కీళ్ల & మోకాళ్ల నొప్పి ఉన్నవారు సులభంగా కదలడానికి ఇంకా తక్కువ కష్టంతో రోజువారీ పనులను చేసుకోవడానికి కీళ్ల పనితీరును, వాటి చలనాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 👉మృదులాస్థి ఆరోగ్యానికి దోహదపడుతుంది: గ్లూకోసమైన్ అనేది కీళ్లలో ఎముకల మధ్య మెత్తని పదార్థంలాగా పనిచేస్తుంది, ఇది మృదులాస్థి యొక్క కీలక భాగం. గ్లూకోసమైన్ కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల మృదులాస్థి ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇంకా దాని అరుగుదలను నెమ్మదిపరుస్తుంది. 👉కణజాలాన్ని బాగుచేయడంలో తోడ్పడుతుంది: గ్లూకోసమైన్ అనేది కొత్త కీళ్ల కణజాల పెరుగుదలకు తోడ్పడడంలో సహాయపడుతుంది ఇంకా కీళ్లు & మోకాళ్ల యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో మంటను తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) లక్షణాలు ఉన్నాయి: గ్లూకోసమైన్ అనేది మంటను తగ్గించే లక్షణాలున్నాయి, కాబట్టి ఇది ముసలితనపు కీళ్ల వ్యాధికి, కీళ్ల కదలికలో కష్టంగా ఉన్నవారిలో కీళ్లలో మంటను తగ్గిస్తుంది. అదే విధంగా మిథైల్ సల్ఫోనిల్ మీథేన్ (ఎంఎస్ఎం) అనేది కొన్ని ఆహారాలలో ఉండే సహజసిద్దమైన పదార్థం, ఇది అన్ని రకాల కీళ్ల, మోకాళ్ల నొప్పులనుంచి ఉపశమనం కలిగేలా మంచి ప్రయోజనాల్ని కలిగి ఉన్నట్లు గుర్తించబడింది. ఎంఎస్ఎం అనేది కీళ్ల వాపును తగ్గించడంలో సహాయపడే మంటను తగ్గించగలిగే లక్షణాలను కలిగివుంది, ఇది ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్) మరియు కీళ్ల కదలికలో కష్టంగా (రుమటాయిడ్ ఆర్థరైటిస్) ఉన్నవారిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీ డాక్టర్ ప్రకారం, చాలా మంది వ్యక్తులు దీనిని తీసుకోవడం (కోర్సు) ప్రారంభించిన 3-4 వారాలలోనే ఉపశమనం పొందారంట. దీని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు, కానీ కోడిమాంసం, చేపలంటే పడనివారు దీనిని తినకూడదని సూచించారు, ఎందుకంటే ఈ ఉత్పత్తిలో వాటి నుండి సేకరించిన కొన్ని పదార్థాలు ఉన్నాయి కాబట్టి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ ఉత్పత్తికి 3,000 కంటే ఎక్కువ పాసిటివ్ రేటింగులున్నాయి, అంతేకాకుండా ఇది ఆరోగ్యం కోసం వాడే పదార్థాల విభాగంలో ఎక్కువగా అమ్ముడుపోయే ఉత్పత్తుల్లో ఒకటిగా ఉంది. ఈ ఉత్పత్తి గురించి మరిన్ని వివరాల కోసం దయచేసి లింక్‌ని క్లిక్ చేసి తెలుసుకోండి. -అడ్వర్టోరియల్ -
Health: థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం! జాగ్రత్త
ప్రపంచ వ్యాప్తంగా బీపీ, షుగర్, క్యాన్సర్ జబ్బుల రోగుల కంటే ఆర్థరైటిస్ సమస్యే ఎక్కువ మందిలో ఉంది. కానీ దీనిపై అవగాహన అంతంత మాత్రమే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక దశలో శరీర వైకల్యం రావచ్చు. పైగా ఎంత త్వరగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేసి అదుపులో ఉంచుకోవచ్చు. అక్టోబరు 12న అంతర్జాతీయ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కీళ్ల సమస్యలపై ప్రత్యేక కథనం.- కర్నూలు(హాస్పిటల్) జిల్లాలో ఆర్థరైటిస్ (కీళ్లనొప్పులు)తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో 50 నుంచి 60 ఏళ్లలో కనిపించే ఈ సమస్య ప్రస్తుతం 35 నుంచి 40 ఏళ్లకే కనిపిస్తోంది. ప్రస్తు తం జిల్లాలో 12 నుంచి 15 శాతం మంది వివిధ రకాల కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. గత పదేళ్లలో వైద్యుల వద్దకు రోజుకు సగటున 600 మంది రోగులు వస్తున్నారని చెబుతున్నారు. దీనిని ప్రారంభంలోనే నియంత్రించకపోతే భవిష్యత్‌లో నడవలేని, కదల్లేని పరిస్థితులు రావచ్చు. కీళ్లనొప్పికి జన్యుపరమైన కారణాలూ ఉంటాయి. ప్రధానంగా వయస్సు, జన్యుపరమైన కారణాలతోనే ఆర్థరైటిస్ వస్తుంది. ఆర్థరైటిస్ అంటే.. ఆర్థరైటిస్ అంటే ఎముకలు, కీళ్లు, వాటి కణజాలాలకు సంబంధించిన సమస్య. సాధారణంగా కీళ్ల దగ్గర నొప్పి, వాపు వచ్చి అవి గట్టిగా మారడాన్ని ఆయా కీళ్లల్లో కదలికలు తగ్గడాన్ని ఆర్థరైటస్గా చెప్పవచ్చు. ఈ సమస్యల తీవ్రత సాధారణంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. దాదాపు 30 నిమిషాల పాటు ఈ నొప్పి, బిగుతుదనం ఉంటుంది. ఆర్థరైటిస్‌లో రకాలు... ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకి యోజింగ్ స్పాండైటిస్, గౌట్, జువైనల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ (పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్), లూపస్, సోరియాటిక్, ఆర్థరైటిస్ వంటివి ఎక్కువగా మనం చూస్తుంటాము. లక్షణాలు ఆర్థరైటిస్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా తొలిదశలో ఆకలి తగ్డడం, జ్వరం, బాగా నీరసించి పోవడం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి. ప్రధానంగా కీళ్లలో నొప్పి, వాపు, ఎర్రగా అవడం, కదలిక తగ్గడం, ఇతర అవయవాలపై ప్రభావం చూపించడం జరుగుతుంది. ఇతర అవయవాలు అంటే చర్మంపై దద్దుర్లు, జుట్టు రాలిపోవ డం, నోటిపూత, కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్య, పక్షవాతం, కంటిచూపు తగ్గుట, కళ్లు పొడిబారడం, కండరాల నొప్పి మొదలైన లక్షణాలుంటాయి. జీవనశైలిలో మార్పులే కారణం ►ఆర్థరైటిస్‌కు ప్రధాన కారణం జీవనశైలిలో మార్పులే. ►వ్యాయామం లేకపోవడం, జంక్‌ఫుడ్ తినడం, ఫలితంగా ఊబకాయం, పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో ఆర్థరైటిస్ రావడాన్ని గమనించవచ్చు. ►వ్యాయామం చేయకపోవడం వల్ల మృదులాస్తి పునరుత్పత్తి పూర్తిస్థాయిలో ఏర్పడదు. ►సరైన ఆహారం, సరైన కదలిక లేకపోవడం వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది. తీవ్రత తగ్గించేందుకు సూచనలు ►దీనిని నయం చేయలేము గానీ మంచి ఆహారం, వ్యాయామం, మందుల ద్వారా తీవ్రతను తగ్గించుకోవచ్చు. ►ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, కంటినిండా నిద్రపోవడం, అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారం, ►ఒత్తిడి లేకుండా ఉండటం వంటి జాగ్రత్తలు అవసరం. ►పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ►సాధారణంగా లక్షణాల తీవ్రత తగ్గించేలా కీళ్లు మరింత దెబ్బతినకుండా ఉండేలా వ్యాధికి ప్రభావితమైన అవయవం దాని పనితీరును కోల్పోకుండా చూసేలా చికిత్స ఉంటుంది. మందులు ఇచ్చేటప్పుడు వైద్యులు అవాంఛనీయమైన నష్టాలు, దుష్ప్రభావాలు లేకుండా చూస్తారు. ఆ మేరకు మందుల మోతాదును వైద్యులు నిర్ణయిస్తారు. నొప్పి నివారణకు పెయిన్ కిల్లర్లు తాత్కాలికంగా ఉపయోగిస్తారు. కానీ వ్యాధి నియంత్రణ ముఖ్యం. అందుకోసం డిసీజ్మాడిఫైయింగ్ యాంటి రుమాటిక్ డ్రగ్స్ (డీఎంఏఆర్డీ), బయోలాజికల్ ఇంజెక్షన్ వంటి కొత్త మందు తీసుకోవాలి. మంచి చికిత్స అందిస్తే చాలా వరకు సమస్య అదుపులో ఉంటుంది. –డాక్టర్ సి.మంజునాథ్, ఆర్థోపెడిక్ సర్జన్, కర్నూలు వీరిలో ఎక్కువ! ►థైరాయిడ్ ఉన్న వారికి, అబార్షన్స్ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 16- 45 ఏళ్ల మహిళలకు రావచ్చు. ►కీళ్లనొప్పులు, వాపులు ఉండటం, ఉదయాన్నే వేళ్లు, కీళ్లు పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. ►ముఖ్యంగా తొలి దశలోనే ఏ రకమైన ఆర్థటైటిస్ సోకిందో తెలుసుకోవాలి. ►వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడటం, వ్యాయామం, ఆహార నియమాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. చదవండి: Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఈ రెండింటితో.. -
Winter Tips: వేళ్ల నొప్పులు బాధిస్తుంటే.. మనకు మనమే ఇలా చేసుకుంటే..
Health Tips: చలికాలంలో ఎదురయ్యే సమస్యల్లో కీళ్లు పట్టేయడం ఒకటి. అయితే తుంటికీళ్లు, మోకాళ్లు పట్టేసినప్పుడు మాత్రమే కీళ్ల సమస్యగా పరిగణిస్తుంటాం. అంతకంటే ముందే చేతివేళ్లు బిగుసుకుపోయి వేళ్ల నొప్పులు మొదలవుతుంటాయి. ఇది వయసుతో సంబంధం లేకుండా కాలానుగుణంగా జరిగే ప్రక్రియ. ఈ సీజన్లో అరచేతి నుంచి వేళ్ల వరకు ఉండే కనెక్టింగ్ టిష్యూలు మందబారడం, సంకోచించడం వల్ల కదలికలు నెమ్మదిస్తాయి. బలవంతంగా కదిలించే ప్రయత్నం చేసినప్పుడు నొప్పి కలుగుతుంది. ఈ నొప్పులకు స్వయంగా మనకు మనంగా చేసుకునే ఫిజికల్ థెరపీనే చక్కటి వైద్యం. ►అరచేతిని టేబుల్ మీద కానీ చదునుగా ఉన్న నేల మీద కానీ పెట్టి మెల్లగా వేళ్లను చాచాలి. ►కీళ్ల మీద మరీ ఒత్తిడి కలిగించకుండా అరచేతిని వీలయినంత వెడల్పుగా చేసి వేళ్లను ఒక వేలికి మరొక వేలిని దూరంగా వచ్చేటట్లు చేయాలి. ►ఈ స్థితిలో అరచేయి మొత్తాన్ని నేలకు ఆన్చడానికి ప్రయత్నించగలగాలి. ►నొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు సాధ్యం కాదు, కానీ చేయగలిగినంత వరకు ప్రాక్టీస్ చేయాలి. అరచేతిని నేలకు ఆన్చిన స్థితిలో 30 నుంచి 60 సెకన్ల పాటు అలా ఉంచిన ►తర్వాత చేతిని మెల్లగా పిడికిలి బిగించి వదలాలి. రోజూ నాలుగైదు సార్లు ఇలా చేస్తుంటే వేళ్లకు రక్తప్రసరణ మెరుగవుతుంది, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పై ఎక్సర్సైజ్ చేయడానికి సాధ్యం కానప్పుడు గంటకోసారి పిడికిలిని గట్టిగా బిగించి ఒక్కో వేలిని తెరుస్తూ అన్ని వేళ్లనూ తెరవాలి. ►అలాగే ఒక్కో వేలిని ముడుస్తూ పిడికిలి బిగించి వదలాలి. ►మామూలు సీజనల్ నొప్పులతోపాటు డయాబెటిక్ న్యూరోపతి కండిషన్‌కు కూడా ఈ ఎక్సర్సైజ్ ఉపకరిస్తుంది. ►ఒకవేళ వేళ్ల నొప్పులకు కారణం ట్యూమర్లు, ప్రమాదవశాత్తూ గాయపడడం, ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల్లో మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే.. -
మందులు కలిపితే కీళ్లనొప్పులు ఫట్?
ఆర్థరైటిస్ సమస్యకు సాల్క్ పరిశోధకులు ఓ వినూత్నమైన కొత్త చికిత్స పద్ధతిని కనుక్కున్నారు. మందులేసుకోవడం లేదా కీళ్లు మార్పించుకోవడం మాత్రమే ఇప్పటివరకూ ఉన్న కీళ్లనొప్పుల పరిష్కారాలు కాగా.. శక్తిమంతమైన రెండు కొత్త మందులను కలిపి వాడటం ద్వారా నొప్పులు తగ్గించడంతోపాటు కీళ్ల మధ్య ఉండే పదార్థాన్ని మళ్లీ పెరిగేలా చేయవచ్చునని వీరు చెబుతున్నారు. ఎలుకలతోపాటు మానవ కార్టిలేజ్ కణాలపై జరిగిన పరిశోధనలు ఇప్పటికే మంచి ఫలితాలిచ్చాయని ప్రొటీన్ అండ సెల్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. వయసు పెరిగే కొద్దీ కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి కణజాలం అరిగిపోయి నొప్పులు వస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. ఊబకాయం కూడా ఈ సమస్యకు కొంతవరకూ కారణమవుతోంది.ఆల్ఫా క్లోథో, టీజీఎఫ్‌ఆర్2 అనే రెండు రసాయన మూలకాలు ఈ సమస్యకు పరిష్కారం చూపగలవని ఇప్పటికే గుర్తించగా.. సాల్క్ పరిశోధకులు ఈ రెండింటిని కలిపి ఎలుకలపై ప్రయోగించారు. ఈ రెండు మందులు మృదులాస్థి కణాలు అరిగిపోకుండా చేస్తున్నట్లు గుర్తించారు. టీజీఎఫ్‌ఆర్2 కణాలు ముక్కలైపోకుండా అడ్డుకోవడమే కాకుండా.. వృద్ధి చెందేందుకు ఉపయోగపడుతున్నట్లు పరిశోధనల ద్వారా తెలిసింది. ఆరు వారాల చికిత్స తరువాత ఈ రెండు మందులు కలిపి అందించిన ఎలుకల్లో కీళ్లనొప్పుల తాలూకూ లక్షణాలు గణనీయంగా తగ్గిపోయాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టినెజ్ రెడొండో తెలిపారు. -
ఉదయంపూట కీళ్లు పట్టేస్తున్నాయి
నా వయసు 39 ఏళ్లు. నేను పదేళ్లగా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడుతున్నాను. పొద్దున లేవగానే కీళ్లన్నీ పట్టేసి జ్వరం వచ్చినట్లుగా ఉండి, మధ్యాహ్నానికి ఉపశమనం ఉంటోంది. ఈఎస్ఆర్ పెరిగి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఈ కీళ్లనొప్పులకు హోమియోలో చికిత్స ఉందా? మీకు వచ్చిన వ్యాధిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో ఒకరక. మన శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి, వాటితో పోరాడటానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఆ రక్షణ వ్యవస్థ పొరబడి తన సొంత శరీరంపైనే దాడి చేస్తే వచ్చే సమస్యల్లో ఇది ఒకటి. ఈ వ్యాధి శరీరంలోని ఇరుపక్కలా సమాంతరంగా వ్యాప్తి చెందుతుంది. కీళ్లు తీవ్రమైన వాపునకు గురికావడంతో వాటి కదలికలు పూర్తిగా స్తంభిస్తాయి. దాంతో కీళ్లు వైకల్యానికి గురికావడం జరుగుతుంది. కీళ్లనొప్పులు, వాపు, కీళ్లు పట్టివేయడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. కీళ్లు మాత్రమే కాకుండా కళ్లు, నోరు, ఊపిరితిత్తులకు వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో కనిపిస్తుంది. అయితే మొదట చేతివేళ్లు, కాలివేళ్ల వంటి చిన్న చిన్న కీళ్లలో మొదలై ఆ తర్వాత మోచేయి, మోకాలు, తుంటి వంటి పెద్ద కీళ్లలోకి పాకుతుంది. కారణాలు: ►శరీరంలోని జీవక్రియల్లో అసమతౌల్యత, రోగ నిరోధక వ్యవస్థలోని మార్పుల వల్ల ఈ జబ్బు వస్తుంది ►శారీరక, మానసిక ఒత్తిడి ►పొగతాగడం, మద్యం అలవాటు ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ ►ఆరోగ్య పరమైన జాగ్రత్తలు అస్సలు పాటించని వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు: ►నిరాశ, అలసట, ఆకలితగ్గడం, బరువు తగ్గడం ►మడమ చేతి ఎముకలపై చిన్న గడ్డలు రావడం ►ఉదయం లేచిన వెంటనే కీళ్లు బిగపట్టినట్లుగా ఉండి, నొప్పి ఉండటం ►ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం, ఊపిరితిత్తులు గట్టిపడటం ►రక్తహీనత, జ్వరం వంటివి. నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్–రే, ఎమ్మారై, ఆర్.ఏ. ఫ్యాక్టర్, ఏఎన్ఏ, ఎల్ఎఫ్టీ. చికిత్స: రోగి మానసిక, శారీరక లక్షణాలను అనుసరించి చికిత్స చేయాల్సి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, రస్టాక్స్, కాల్చికమ్, ఆర్సినికమ్, లైకోపోడియమ్, నేట్రమ్మూర్ మొదలైన మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే వ్యాధి సమూలంగా నయమవుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
గున్యాతో కీళ్ల నొప్పులెలా..?
వాషింగ్టన్ : గున్యా జ్వరం వచ్చినప్పుడు భరించరాని స్థాయిలో కీళ్ల నొప్పులు వస్తుంటాయి. కీళ్ల నొప్పులకు, గున్యా వైరస్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరిపారు. సాధారణంగా గున్యా వైరస్ దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఈడిస్ ఈజిప్టి, ఈడిస్ అల్బోపిక్టస్ అనే జాతి దోమల కారణంగా గున్యా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌లో జన్యు పదార్థం సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. ఈ వైరస్ సోకినప్పుడు వెంటనే జ్వరం, వణుకు, తలనొప్పి, వాంతులు, తల తిరగడం, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి ఎలాంటి మందులు ఇప్పటివరకు కనుక్కోలేదు. అయితే వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డెబోరా లెన్స్హౌ అనే పరిశోధకురాలు.. ఈ వ్యాధి కారణంగా కీళ్ల నొప్పులు రావడానికి దారితీసే ప్రక్రియను గుర్తించారు. దీంతో ఈ వ్యాధికి మందులు కనుగొనేందుకు మార్గం సుగమమైందంటున్నారు. అయితే ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత కూడా కీళ్ల నొప్పులు ఉండటానికి కారణాలను తెలుసుకునేందుకు లెన్స్హౌ ఈ వైరస్ సోకిన కణాలను శాశ్వతంగా మార్క్ చేసే సరికొత్త విధానాన్ని రూపొందించారు. -
చమురుతో నొప్పి వదులుతుంది..
బాకు : కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా..? ఆ భరించరాని నొప్పి నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి ఎన్నో ప్రకటనలు మీరు చూసుంటారు.. విని ఉంటారు. అయితే వీటన్నింటినీ తలదన్నే.. వీటన్నింటి కన్నా వినూత్నమైన చక్కటి పరిష్కారాన్ని అజర్బైజాన్ లోని ఓ క్లినిక్ కనిపెట్టింది. అదేంటంటే నాఫ్తాలాన్ అనే ముడి చమురుతో స్నానం చేస్తే ఆ కీళ్ల నొప్పులన్నీ మటుమాయం అవుతాయని చెబుతున్నారు. చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు కూడా. ఆ దేశ రాజధాని బాకూకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెహిర్లీ నాఫ్తాలాన్ హెల్త్ సెంటర్లో ఈ తరహా చికిత్సను అందిస్తున్నారు. ఇలా చేస్తారు.. బాత్‌టబ్‌లో నిండుగా ముడి చమురును ముందుగా నింపుతారు. అందులో రోగులను 10 నిమిషాల పాటు పడుకోవాలని చెబుతారు. ఆ చమురు ఉష్ణోగ్రత మన శరీర ఉష్ణోగ్రత కన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది. అంతే కొద్ది రోజుల పాటు ఇలా చికిత్స అందిస్తే నొప్పులన్నీ మటుమాయం అవుతాయట. ఆర్థరైటిస్ నుంచి చాలా మందికి విముక్తి కలిగిందని డాక్టర్లు చెబుతున్నారు. అక్కడికి వచ్చే రోగులు కూడా తమకు కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పుల నుంచి ఎంతో ఉపశమనం కలుగుతోందని, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నట్లు చెబుతున్నారు. దీంతో అజర్బైజాన్లో ఇప్పుడు ఇది హాట్ ట్రెండ్‌గా మారింది. త్వరలోనే మన దగ్గర కూడా ఈ చికిత్స అందుబాటులోకి వస్తుందేమో చూద్దాం. -
కీళ్ల వ్యాధులపై అవగాహన ర్యాలీ
నెల్లూరు(అర్బన్): ఈ నెల 12న వరల్డ్ ఆర్థరైటిస్ డేను పురస్కరించుకొని అపోలో స్పెషాల్టీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఎముకల వ్యాధులు, రుమాటిక్, కండరాలకు సంబంధించిన కీళ్ల వ్యాధులపై అవగాహన కల్పిస్తూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో ర్యాలీని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడారు. ఆహార అలవాట్లు, ఒత్తిడి వల్ల కీళ్ల నొప్పుల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, ఇలాంటి వ్యా«ధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఆస్పత్రి యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం ఆస్పత్రి ప్రముఖ సీనియర్ ఎముకల వ్యాధి నిపుణుడు మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. గతంలో కీళ్లనొప్పులు తగ్గక అనేక మంది పడరాని కష్టాలు పడేవారని, ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో ఎలాంటి కీళ్లనొప్పులనైనా అ«ధునాతన వైద్యం ద్వారా నయం చేస్తున్నామన్నారు. డాక్టర్లు వివేకానందరెడ్డి, మీరావలి, యూనిట్ హెడ్ నవీన్, లయన్స్, రోటరీ క్లబ్, షార్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, జైన్ హబ్ అసోసియేషన్, చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
వయసు పెరుగుతుంటే... ఎముకల పటుత్వం తగ్గుతుంది
నిర్ధారణ వయసు పెరిగే కొద్దీ ఎముకల పటుత్వం లోపించడంతో వార్ధక్య చిహ్నాలు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల రూపంలో బయటపడుతుంటాయి. ఆస్టియోపోరోసిస్‌ను నిర్ధారణ చేయాలంటే... మెడికల్ హిస్టరీ... గతంలో జరిగిన ప్రమాదాలు రక్తసంబంధీకుల ఎముకల సమస్యలు, ఆహారవిహారాల వివరాలు. ఫిజికల్ ఎగ్జామినేషన్ బోన్ డెన్సిటీ టెస్ట్ ఫాక్స్ (ఫ్రాక్చర్ రిస్క్ అసెస్మెంట్ టూల్) లాబొరేటరీ టెస్ట్‌ల్లో భాగంగా రక్తం, మూత్ర పరీక్షల ద్వారా ఎముక పటుత్వం తగ్గడానికి కారణాలను తెలుసుకుంటారు. ఇందులో రక్తంలో క్యాల్షియం స్థాయులు, 24 గంటల పాటు విసర్జించిన మూత్రంలో క్యాల్షియం మోతాదును పరీక్షించడం, థైరాయిడ్ పనితీరు, పారాథైరాయిడ్ హార్మోన్ స్థాయులు, టెస్టోస్టీరాన్ స్థాయులు (మగవారిలో), హైడ్రాక్సి విటమిన్ -డి పరీక్ష, బయోకెమికల్ మార్కర్ టెస్ట్‌లు ఉంటాయి. అవసరమైతే న్యూక్లియర్ బోన్ స్కాన్, సి.టి. స్కాన్, ఎం.ఆర్.ఐ కూడా చేయాల్సి ఉంటుంది.