![Washington University School Of Medicine Researchers Find Medicine For Gunya - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/31/1.jpg.webp?itok=OEo1hfNR)
వాషింగ్టన్ : గున్యా జ్వరం వచ్చినప్పుడు భరించరాని స్థాయిలో కీళ్ల నొప్పులు వస్తుంటాయి. కీళ్ల నొప్పులకు, గున్యా వైరస్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరిపారు. సాధారణంగా గున్యా వైరస్ దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఈడిస్ ఈజిప్టి, ఈడిస్ అల్బోపిక్టస్ అనే జాతి దోమల కారణంగా గున్యా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌లో జన్యు పదార్థం సింగిల్ స్ట్రాండెడ్ ఆర్‌ఎన్‌ఏ ఉంటుంది. ఈ వైరస్ సోకినప్పుడు వెంటనే జ్వరం, వణుకు, తలనొప్పి, వాంతులు, తల తిరగడం, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి ఎలాంటి మందులు ఇప్పటివరకు కనుక్కోలేదు. అయితే వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డెబోరా లెన్స్‌హౌ అనే పరిశోధకురాలు.. ఈ వ్యాధి కారణంగా కీళ్ల నొప్పులు రావడానికి దారితీసే ప్రక్రియను గుర్తించారు. దీంతో ఈ వ్యాధికి మందులు కనుగొనేందుకు మార్గం సుగమమైందంటున్నారు. అయితే ఇన్‌ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత కూడా కీళ్ల నొప్పులు ఉండటానికి కారణాలను తెలుసుకునేందుకు లెన్స్‌హౌ ఈ వైరస్ సోకిన కణాలను శాశ్వతంగా మార్క్ చేసే సరికొత్త విధానాన్ని రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment