40-50 ఏళ్ల వయసు దాటిన తరువాత స్త్రీ పురుషుల్లో కనిపించే ప్రధాన సమస్య కీళ్ల నొప్పులు. వయసుతోపాటు వచ్చేదేలే అని నిర్లక్ష్యం పనికి రాదు. తగిన వ్యాయామం, ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మరోవైపు కొన్నిప్రత్యేక కారణాల రీత్యా యువతలో కూడా కీళ్ళ సమస్య కనిపించవచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఈ కీళ్ల నొప్పులకు, కారణాలు, తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.
కీళ్ల నొప్పులకు కారణాలు
ఆర్థరైటిస్ (ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్)
గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు (సెప్టిక్ ఆర్థరైటిస్)
గంటల తరబడి ఒకే చోట కూర్చుండి పోవడం, వ్యాయామం లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి,
ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ (లూపస్, ఫైబ్రోమైయాల్జియా)
కూర్చోవడం, లేదా నిలబడే తీరు సరిగ్గా లేకోవడం, లేదా బయోమెకానిక్స్
వయస్సు-సంబంధిత దుస్తులు మరియు కన్నీటి
మధుమేహం, థైరాయిడ్ లాంటి వ్యాధులు
అలాగే ఊబకాయం, సరైన జీవనశైలి, పేలవమైన భంగిమ, క్రీడలలో ఎక్కువగా పాల్గొనడం, కీళ్ల గాయాలు, జన్యుపరమైన కారణాలు, పుట్టుకతో వచ్చే పరిస్థితుల కారణంగా చిన్న వయసులో కూడా కీళ్ల నొప్పులు రావచ్చు. ఒక్కోసారి కేన్సర్‌లాంటి జబ్బులున్నపుడు కూడా కీళ్ల నొప్పులొస్తాయి.
వైద్యుడిని ఎప్పుడు సందర్శించాలి?
కీళ్ల నొప్పులకారణాన్ని గుర్తించి, తేలికపాటి వ్యాయామం, ఆహారంలో మార్పులతో చాలావరకు ఉపశమనం పొందవచ్చు. కానీ నొప్పి తీవ్రంగా ఉన్నపుడు, వాచినపుడు, నడవడంకష్టంగా మారినపుడు, అలాగే కీళ్ల నొప్పులతో మాటు జ్వరం వస్తే మాత్రం కచ్చితంగా వైద్యుణ్ని సంప్రదించాలి. ఎక్స్‌రే లాంటి కొన్ని పరీక్షల అనంతరం వ్యాధి నిర్ధారణ తగిన చికిత్స పొందవచ్చు.
కీళ్ల నొప్పులకు ఉపశమనమిచ్చే ఆహారం
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు / చేప నూనెలు
నట్స్ అండ్ విడ్స్
బ్రాసికా కూరగాయలు, కాయధాన్యాలు, బీన్స్
పండ్లు, ఆలివ్ నూనె, వెల్లుల్లి , దంప కూరగాయలు, తృణధాన్యాలు
కీళ్ల నొప్పులకు ఏ ఆహారాలు చెడ్డవి?
ఉప్పు, చక్కెరపదార్థాలు,
ప్రాసెస్ చేసిన ఆహారం, రెడ్‌మీట్,మద్యం
గ్లూటెన్ ఆహారాలు
అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొన్నిరకాల నూనెలు
ఇదీ చదవండి: నటి భాగ్యశ్రీ వ్యాయామాలతో భుజాల నొప్పులు మాయం!
సమంత రోజు ఎలా గడుస్తుందంటే...???
Comments
Please login to add a commentAdd a comment