ఆరోగ్యకరమైన జీవనం కోసం పోషకాలు,విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా అసవరం. వీటిల్లో ఏది లోపించినా ఏదో శారీరక ఇబ్బందులు తప్పవు. అలాంటి వాటిల్లో విటమిన్ బీ 12. ఇది ఎర్రరక్త కణాల వృద్దికి, నాడీ వ్యవస్థకు చాలా తోడ్పాటునిస్తుంది. ఆహారం ద్వారానే మనం బీ12 విటమిన్ తీసుకోవాల్సి ఉంటుందని అనేది గమనించాలి. మరి బీ 12 లోపంతో వచ్చే అనర్థాలు, లభించే ఆహారం గురించి తెలుసుకుందాం.
వయసులో ఉన్నవారితో పోలిస్తే సాధారణంగా వయస్సుపైబడినవారు, స్త్రీలు, శాకాహారుల్లో విటమిన్ బీ 12 లోపం ఎక్కువగా కనిపిస్తుంది. భారతీయుల్లో సుమారు 47 శాతం మందిలో విటమిన్ బీ12 లోపంతో బాధపడుతున్నట్టు అంచనా. శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ఇది ప్రభావం చూపిస్తుంది.విటమిన్ కాలేయంలో ఐదేళ్లపాటు నిల్వ ఉంటుంది. ఈ నిల్వలు తగ్గినప్పుడు బీ 12 లోపంకనిపిస్తుంది.
లక్షణాలు
రక్తహీనత, నీరసం అలసట, నిరాశ, నిస్సహాయత, గుండె దడ, నరాల సమస్యలు , ఒత్తిడిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా చర్మం పాలిపోయినట్లు ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తల తిరగడం, తలనొప్పి, ఇన్ఫెక్షన్లు, నోరు పొడిబారడం, అతిసారం, మలబద్దకం, ఆకలి లేకపోవడం,జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత తగ్గడం, డిప్రెషన్, చిరాకు ఇవన్నీ బీ 12 లోపం వల్ల కావచ్చు. బోలు ఎముకల వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది.
విటమిన్ బీ12 లేకపోవడం వల్ల వచ్చే అరుదైన పరిస్థితి ఆప్టిక్ న్యూరోపతి సంభవిస్తుంది. కంటి నుండి మెదడుకు దృశ్యమాన సమాచారాన్ని ప్రసారం చేసే ఆప్టిక్ నరం దెబ్బతింటుంది. ఇది క్రమంగా చూపు కోల్పోయేలా చేస్తుంది. చర్మంపై హైపపర్ పిగ్మంటేషన్ (డార్క్ స్పాట్స్) కనిపిస్తాయి. బీ 12 ఎక్కువైనా, బొల్లి ,నోటి పూతల, తామర, మొటిమలు లాంటి లక్షణాలు కనిస్తాయి. (ప్రపంచ ప్రఖ్యాత బాడీ బిల్డర్ గుండెపోటుతో కన్నుమూత)
బీ12 లభించే ఆహారం
చేపలు, రొయ్యలు, మాంసం, శనగలు, బాదం పప్పు, పుట్ట గొడుగులు, జీడిపప్పు, అల్లం, ఉల్లిపాయ, ప్రాన్స్ , మాంసం, గుడ్లలో విటమిన్ బీ 12 లభిస్తుంది. శాకాహారులు తృణధాన్యాలు పోషక ఈస్ట్ వంటి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ఇంకా చీజ్, పాల ఉత్పత్తులు,సోయా ,బియ్యంలో కూడా ఇది లభిస్తుంది. వైద్యుల సలహా మేరకు ‘విటమిన్ బీ12 సప్లిమెంట్లు తీసుకోవచ్చు.
ఇదీ చదవండి : ఓనం అంటే సంబరం సరదా, సాధ్య!
Comments
Please login to add a commentAdd a comment