b12
-
విటమిన్ బీ12 లోపమా? ఈ ఆహారం తీసుకోండి!
ఆరోగ్యకరమైన జీవనం కోసం పోషకాలు,విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా అసవరం. వీటిల్లో ఏది లోపించినా ఏదో శారీరక ఇబ్బందులు తప్పవు. అలాంటి వాటిల్లో విటమిన్ బీ 12. ఇది ఎర్రరక్త కణాల వృద్దికి, నాడీ వ్యవస్థకు చాలా తోడ్పాటునిస్తుంది. ఆహారం ద్వారానే మనం బీ12 విటమిన్ తీసుకోవాల్సి ఉంటుందని అనేది గమనించాలి. మరి బీ 12 లోపంతో వచ్చే అనర్థాలు, లభించే ఆహారం గురించి తెలుసుకుందాం.వయసులో ఉన్నవారితో పోలిస్తే సాధారణంగా వయస్సుపైబడినవారు, స్త్రీలు, శాకాహారుల్లో విటమిన్ బీ 12 లోపం ఎక్కువగా కనిపిస్తుంది. భారతీయుల్లో సుమారు 47 శాతం మందిలో విటమిన్ బీ12 లోపంతో బాధపడుతున్నట్టు అంచనా. శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ఇది ప్రభావం చూపిస్తుంది.విటమిన్ కాలేయంలో ఐదేళ్లపాటు నిల్వ ఉంటుంది. ఈ నిల్వలు తగ్గినప్పుడు బీ 12 లోపంకనిపిస్తుంది. లక్షణాలు రక్తహీనత, నీరసం అలసట, నిరాశ, నిస్సహాయత, గుండె దడ, నరాల సమస్యలు , ఒత్తిడిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా చర్మం పాలిపోయినట్లు ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తల తిరగడం, తలనొప్పి, ఇన్ఫెక్షన్లు, నోరు పొడిబారడం, అతిసారం, మలబద్దకం, ఆకలి లేకపోవడం,జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత తగ్గడం, డిప్రెషన్, చిరాకు ఇవన్నీ బీ 12 లోపం వల్ల కావచ్చు. బోలు ఎముకల వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది.విటమిన్ బీ12 లేకపోవడం వల్ల వచ్చే అరుదైన పరిస్థితి ఆప్టిక్ న్యూరోపతి సంభవిస్తుంది. కంటి నుండి మెదడుకు దృశ్యమాన సమాచారాన్ని ప్రసారం చేసే ఆప్టిక్ నరం దెబ్బతింటుంది. ఇది క్రమంగా చూపు కోల్పోయేలా చేస్తుంది. చర్మంపై హైపపర్ పిగ్మంటేషన్ (డార్క్ స్పాట్స్) కనిపిస్తాయి. బీ 12 ఎక్కువైనా, బొల్లి ,నోటి పూతల, తామర, మొటిమలు లాంటి లక్షణాలు కనిస్తాయి. (ప్రపంచ ప్రఖ్యాత బాడీ బిల్డర్ గుండెపోటుతో కన్నుమూత)బీ12 లభించే ఆహారంచేపలు, రొయ్యలు, మాంసం, శనగలు, బాదం పప్పు, పుట్ట గొడుగులు, జీడిపప్పు, అల్లం, ఉల్లిపాయ, ప్రాన్స్ , మాంసం, గుడ్లలో విటమిన్ బీ 12 లభిస్తుంది. శాకాహారులు తృణధాన్యాలు పోషక ఈస్ట్ వంటి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ఇంకా చీజ్, పాల ఉత్పత్తులు,సోయా ,బియ్యంలో కూడా ఇది లభిస్తుంది. వైద్యుల సలహా మేరకు ‘విటమిన్ బీ12 సప్లిమెంట్లు తీసుకోవచ్చు.ఇదీ చదవండి : ఓనం అంటే సంబరం సరదా, సాధ్య! -
సెల్యులర్ రీప్రోగ్రామింగ్కి ఆ విటమిన్ అత్యంత కీలకం!
శరీర పనితీరుకు అవసరమైన కీలక మూలకం బీ12. అలాంటి బీ12తో జన్యు ఉత్ఫరివర్తనాలను రక్షించే డీఎన్ఏని సంశ్లేషించగలదని, దీంతో ఎన్నో రకాలా దీర్ఘకాలిక వ్యాధులతో సులభంగా పోరాడగలుగుతామని పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడించారు. అలాగే కణజాల పునరుత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని కనుగొన్నారు. ఈ బీ12 ఉపయోగాలు, ఎంతెంత మోతాదులో మానవులకు అవసరమో తదితర విశేషాల గురించే ఈ కథనం!. ఐఆర్బీ బార్సిలోనా పరిశోధకులు సెల్యులర్ రీ ప్రోగ్రామింగ్‌కి బీ12 ఎలా అవసరమో తమ అధ్యయనంలో వెల్లడించారు. అందుకోసం పెద్దప్రేగు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఎలుకలపై పరిశోధనలు చేశారు. ఆ ఎలుకలకు విటమిన్ బీ12 సప్లిమెంట్స్ ఇవ్వగా.. అది ఎలుకల కడుపులోని పొరను సరిచేసేలా పేగు కణాలు సెల్యులార్ని రీప్రోగ్రామింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు గుర్తించారు. అసలు ఈ సెల్యులర్ రీప్రోగామింగ్కి ఎలా విటమిన్ సరిపొతుందనే దిశగా మరింత లోతుగా అధ్యయనం చేయగా..బీ12 మిథైలేషన్ జీవక్రియను సులభతం చేయగలదని తెలుసుకున్నారు. నిజానికి కణజాల మరమత్తుకి మెదడు పనిచేసే కణాల డీఎన్ఏకి అధిక మొత్తంలో మిథైలేషన్ అవసరం. ఆ లోటును బీ12 భర్తి చేస్తుందని కనుగొన్నారు. అందువల్ల ఈ విటమిన్‌ని ఏదోరూపంలో శరీరానికి అందిస్తే దెబ్బతిన్న కణాజాల త్వరితగతిన రీప్రోగ్రామింగ్ చేయబడుతుందన్నారు. చెప్పాలంటే ముందుగా ఇది జన్యు పనితీరును మెరుగుపరిచడంతో చాలా సులభంగా కణజాలం రీప్రోగ్రామింగ్ చేయబడుతుందని తమ పరిశోధనల్లో వెల్లడించారు. ఇది చేతుల వాపులను కూడా తగ్గిస్తుందన్నారు. ఈ విటమిన్ దీర్ఘకాలిక వ్యాధులు, వయసు రీత్యా వచ్చే వ్యాధుల్లో పోరాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించారు. వయసు పైబడిన ఎలుకలకు అధిక విటమిన్ B12 ఇవ్వగా వాటి రక్తప్రవాహంలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ IL-6, సీఆర్పీ స్థాయిలపై విలోమ ప్రభావాన్ని చూపుతునట్లు కనుగొన్నారు. అందువల్ల ఇది వయసు రీత్యా వచ్చే వ్యాధులను ఎదుర్కొవడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. దీన్ని ఆహారం నుంచి మాత్రమే తీసుకోగలం. పరిమిత మోతాదులో తీసుకోవడమే మంచిదన్నారు. వయసు రీత్యా పురుషులు, స్త్రీలు ఎంతెంత మోతాదుల్లో తీసుకోవాలి, అలాగే గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా వివరించారు. నిజానికి ఈ బీ12 విటమిన్ చేపలు, కాలేయం, ఎర్ర మాంసం, గుడ్లు, పాలు, చీజ్ వంటి ఉత్పత్తుల్లో లభిస్తుంది. ఇవేగాక ఈస్ట్ ఉత్పత్తులైన పట్టగొడుగులు, కొన్ని రకాల మొక్కలు, తృణధాన్యాల్లో కూడా ఉంటుందని అన్నారు. బలహీనమైన కండరాలు, వికారం, అలసట, అకస్మాత్తుగా హృదయ స్పందన రేటు పెరిగిపోవడం, ఎర్రరక్త కణాలు తక్కువగా ఉండటం తదితర సమస్యలను సులభంగా చెక్కుపెడుతుంది ఈ విటమిన్ బీ12. తద్వారా అనే రకాల దీర్ఘకాలిక రుగ్మతలు బారిన పడకుండా సురక్షితం ఉండగలుగుతామని నేచర్ మెటబాలిజం జర్నల్ వెల్లడించారు పరిశోధకులు. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) -
Health Tips: బీ12 లోపించడం వల్లే ఇలా! పాదాలకు మసాజ్ చేశారంటే..
కొంతమందికి ప్రతిరోజూ పాదాలు నొప్పి, అరికాళ్లు చురుక్కుమని మంటలు పుట్టడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. సాధారణంగా విటమిన్ బీ12 లోపం వల్ల, డయాబెటిస్ ఉండటం వల్ల ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అయితే విటమిన్ టాబ్లెట్లు వాడుతూ, డయాబెటిస్‌కు చికిత్స తీసుకుంటున్నా కూడా ఈ సమస్య వేధిస్తుంటే పాదాలకు మసాజ్ చేయడం చాలా ఉపశమనాన్నిస్తుందంటున్నారు నిపుణులు. అదేమిటో చూద్దాం... అనేక ప్రయోజనాలు! చాలామంది ఇళ్లలో పెద్దవాళ్లు ఇప్పటికీ కూడా అరికాళ్లకు, పాదాలకు కొబ్బరినూనె రాయించుకుని కాళ్లు పట్టించుకుంటూ ఉండటం చూస్తుంటాం. అయితే అది పాతకాలం పద్ధతి అని కొట్టిపారేయద్దని, పాదాలకు మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆధునిక పరిశోధనలు కూడా చెబుతున్నాయి. అరికాళ్ల మసాజ్ కాళ్ల నొప్పులతోపాటు మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. రోజూ పాదాలకు మసాజ్ చేస్తే కాళ్లకు సత్తువ పెరుగుతుంది. ఒక పరిశోధన ప్రకారం... పాదాలకు మసాజ్ చేయడం నాడీవ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది. మెదడులో ఉండే ఎండార్ఫిన్ రసాయనాల ఉత్పత్తిని పెంచుతుంది. కొన్నిరకాల శస్త్ర చికిత్సల తర్వాత పాదాలకు మసాజ్ చేసిన వారికి నొప్పి తక్కువగా ఉండడంతోపాటు శస్త్ర చికిత్సానంతరం తలెత్తే కొన్ని రకాల ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటారని తెలిపింది. ఫుట్ మసాజ్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఫుట్ మసాజ్ చేయడం వల్ల... కండరాలను బలపరుస్తుంది... రెగ్యులర్ ఫుట్ మసాజ్ కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చాలాకాలం పాటు కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. పాదాలను మర్దన చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది నరాలు దెబ్బతినడం, డయాబెటిస్ వంటి వాటిలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. డిప్రెషన్ దూరం... ►మానసికంగా అస్వస్థతకు గురై, డిప్రెషన్‌కు లోనవుతున్నవారు ఫుట్మసాజ్ చేయించుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుంది. ►మంచి నిద్ర కోసం... మీకు రాత్రి నిద్ర రాకపోతే మీకు ఇష్టమైన ఎసెన్షియల్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో పాదాలను సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ►సత్వర ఉపశమనం... ఫుట్ మసాజ్ సహాయంతో మీరు మడమలు, బూట్లు, పాదాలు మొదలైన వాటికి తగిలిన గాయాల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ముఖ్యంగా అథ్లెట్లు లేదా ఎక్కువ పనిచేసే వ్యక్తులు. ►గర్భధారణ సమయంలో... గర్భధారణ సమయంలో పాదాలు వాపు సర్వసాధారణం. అలాంటి సమయంలో వారికి ఫుట్ మసాజ్ వల్ల హాయిగా ఉండటమే కాకుండా పాదాలవాపు సమస్య కూడా దూరమవుతుంది. ►ఇన్ని ఉపయోగాలున్న ఫుట్మసాజ్ను పక్కన పెట్టెయ్యరు కదా.. ఇంక? చదవండి: Rainy Season Tips: అసలే వర్షాకాలం.. లో దుస్తుల విషయంలో జాగ్రత్త! ఇలా మాత్రం చేయకండి! Health Benefits Of Corn: మొక్కజొన్న పొత్తు తరచుగా తింటున్నారా? ఇందులోని లైకోపీన్.. -
మతిమరుపు...మందు
-
గర్భిణుల్లో బీ12 లోపాన్ని సవరిస్తే... పుట్టే బిడ్డకు మధుమేహం రాదు!
సాక్షి, హైదరాబాద్: పుట్టబోయే బిడ్డ... మధుమేహం, గుండె సంబంధ వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? అయితే గర్భిణిగా ఉన్నప్పుడే మీరు కొంచెం జాగ్రత్త పడటం మంచిదంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు. భారతీయ మహిళల రక్తంలో హోమోసిస్టైన్ అనే అమినోయాసిడ్ల మోతాదు ఎక్కువగా ఉండటంవల్ల పిల్లలు తక్కువ బరువుతో పుట్టడమే కాకుండా... పెరిగి పెద్దయ్యాక మధుమేహం, గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంటుందని తమ పరిశోధనల ద్వారా తెలిసిందని సీసీఎంబీ శాస్త్రవేత్త గిరిరాజ్ చందక్ తెలిపారు. రక్తంలో హోమోసిస్టైన్ల మోతాదు ఎక్కువగా ఉన్న వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశముందని ఇప్పటికే దాదాపుగా రుజువైందని, అయితే ఈ అమినోయాసిడ్కు... నవజాత శిశువులు తక్కువ బరువుతో ఉండేందుకు సంబంధం ఉన్నట్లు తాము గుర్తించామని ఆయన మంగళవారం సీసీఎంబీ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. శాకాహారం తీసుకునే వారు ఎక్కువగా ఉండటం.. మాంసాహారం తీసుకునే వారు తక్కువగానే మాంసం ఉత్పత్తులను తీసుకుంటూండటంవల్ల దేశంలోని చాలామందిలో మరీ ముఖ్యంగా మహిళల్లో బీ12 విటమిన్ లోపం కనిపిస్తోందని, ఫలితంగా దాదాపు సగం మంది పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తున్నారని ఆయన చెప్పారు. శరీర నాడీవ్యవస్థ, మెదడు సవ్యంగా పనిచేసే విషయంలో, రక్తం తయారయ్యే అంశంలోనూ ఈ విటమిన్ కీలకపాత్ర పోషిస్తుందన్నది తెలిసిందే. బీ12 విటమిన్ తక్కువైతే రక్తంలోని హోమోసిస్టైన్ మోతాదు ఎక్కువ అవుతుంది. ఎంటీహెచ్‌ఎఫ్‌ఆర్ అనే ఎంజైమ్‌లోని జన్యులోపం దీనికి కారణం. ఈ జన్యులోపంవల్ల హోమోసిస్టైన్ను మరో రసాయనంగా మార్చే వ్యవస్థ (1-సీ మెటబాలిజం) సక్రమంగా పనిచేయదు. ఈ విషయాన్ని తాము పరిశోధనల ద్వారా గుర్తించినట్లు చందక్ వివరించారు. ఈ నేపథ్యంలోనే గర్భిణులకు ఫోలిక్ యాసిడ్‌తోపాటు బీ12 విటమిన్లను కూడా అందించడం మేలని తాము సూచిస్తున్నామని చెప్పారు. సౌష్టవ నిర్మాణం కిటుకూ అర్థమైంది... అన్ని రకాల జంతువులు, చెట్ల నిర్మాణం సౌష్టవంగా ఉండటం మనం గమనించే ఉంటాం. ఈ నిర్మాణానికి శరీరంలోని హోక్స్ (హెచ్ఓఎక్స్) జన్యువులు కారణమని కూడా తెలుసు. శరీరంలో తల నుంచి కాలివరకూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండే ఈ జన్యువులు ఆయా ప్రాంతాల్లోని అవయవాలు ఏర్పడేందుకు, ఎదిగేందుకు సాయపడతాయి. ఈ జన్యువులు ఈ ఒక్క విధినే నిర్వర్తిస్తాయని నిన్నమొన్నటివరకూ అనుకుంటూండగా, ఇవి మరికొన్ని అదనపు పనులు కూడా చేస్తాయని సీసీఎంబీ శాస్త్రవేత్త రాకేశ్ మిశ్రా జరిపిన పరిశోధనల ద్వారా తెలిసింది. ఈ పరిశోధన ఫలితాలు వేర్వేరు జీవుల శరీర నిర్మాణాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయని రాకేశ్ మిశ్రా తెలిపారు. ముఖ్యంగా కొన్ని రకాల కేన్సర్లలో హోక్స్ జన్యువుల్లో కొన్ని కొంచెం తేడాగా వ్యవహరించడానికి కారణమేమిటన్నది కూడా తెలుసుకునే వీలవుతుందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా శాస్త్ర, పరిశోధన రంగాల్లో సీసీఎంబీ సామర్థ్యం గణనీయంగా పడిపోయిందన్న కొన్ని వార్తా కథనాలను సంస్థ డెరైక్టర్ డాక్టర్ మోహన్‌రావు ఖండించారు. ప్రచురితమైన పరిశోధనలు, వాటి ప్రభావం వంటి అంశాలను వేటిని పరిగణనలోకి తీసుకున్నా సామర్థ్యం ఏటికేడాది పెరుగుతూనే ఉందని ఆయన గణాంకాలతో వివరించారు.