ప్రతీకాత్మక చిత్రం
కొంతమందికి ప్రతిరోజూ పాదాలు నొప్పి, అరికాళ్లు చురుక్కుమని మంటలు పుట్టడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. సాధారణంగా విటమిన్ బీ12 లోపం వల్ల, డయాబెటిస్ ఉండటం వల్ల ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి.
అయితే విటమిన్ టాబ్లెట్లు వాడుతూ, డయాబెటిస్‌కు చికిత్స తీసుకుంటున్నా కూడా ఈ సమస్య వేధిస్తుంటే పాదాలకు మసాజ్ చేయడం చాలా ఉపశమనాన్నిస్తుందంటున్నారు నిపుణులు. అదేమిటో చూద్దాం...
అనేక ప్రయోజనాలు!
చాలామంది ఇళ్లలో పెద్దవాళ్లు ఇప్పటికీ కూడా అరికాళ్లకు, పాదాలకు కొబ్బరినూనె రాయించుకుని కాళ్లు పట్టించుకుంటూ ఉండటం చూస్తుంటాం. అయితే అది పాతకాలం పద్ధతి అని కొట్టిపారేయద్దని, పాదాలకు మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆధునిక పరిశోధనలు కూడా చెబుతున్నాయి.
అరికాళ్ల మసాజ్ కాళ్ల నొప్పులతోపాటు మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. రోజూ పాదాలకు మసాజ్ చేస్తే కాళ్లకు సత్తువ పెరుగుతుంది. ఒక పరిశోధన ప్రకారం... పాదాలకు మసాజ్ చేయడం నాడీవ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది. మెదడులో ఉండే ఎండార్ఫిన్ రసాయనాల ఉత్పత్తిని పెంచుతుంది.
కొన్నిరకాల శస్త్ర చికిత్సల తర్వాత పాదాలకు మసాజ్ చేసిన వారికి నొప్పి తక్కువగా ఉండడంతోపాటు శస్త్ర చికిత్సానంతరం తలెత్తే కొన్ని రకాల ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటారని తెలిపింది. ఫుట్ మసాజ్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
ఫుట్ మసాజ్ చేయడం వల్ల...
కండరాలను బలపరుస్తుంది... రెగ్యులర్ ఫుట్ మసాజ్ కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చాలాకాలం పాటు కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. పాదాలను మర్దన చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది నరాలు దెబ్బతినడం, డయాబెటిస్ వంటి వాటిలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
డిప్రెషన్ దూరం...
►మానసికంగా అస్వస్థతకు గురై, డిప్రెషన్‌కు లోనవుతున్నవారు ఫుట్‌మసాజ్ చేయించుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుంది.
►మంచి నిద్ర కోసం... మీకు రాత్రి నిద్ర రాకపోతే మీకు ఇష్టమైన ఎసెన్షియల్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో పాదాలను సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది.
►సత్వర ఉపశమనం... ఫుట్ మసాజ్ సహాయంతో మీరు మడమలు, బూట్లు, పాదాలు మొదలైన వాటికి తగిలిన గాయాల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ముఖ్యంగా అథ్లెట్లు లేదా ఎక్కువ పనిచేసే వ్యక్తులు.
►గర్భధారణ సమయంలో... గర్భధారణ సమయంలో పాదాలు వాపు సర్వసాధారణం. అలాంటి సమయంలో వారికి ఫుట్ మసాజ్ వల్ల హాయిగా ఉండటమే కాకుండా పాదాలవాపు సమస్య కూడా దూరమవుతుంది.
►ఇన్ని ఉపయోగాలున్న ఫుట్‌మసాజ్‌ను పక్కన పెట్టెయ్యరు కదా.. ఇంక?
చదవండి: Rainy Season Tips: అసలే వర్షాకాలం.. లో దుస్తుల విషయంలో జాగ్రత్త! ఇలా మాత్రం చేయకండి!
Health Benefits Of Corn: మొక్కజొన్న పొత్తు తరచుగా తింటున్నారా? ఇందులోని లైకోపీన్..
Comments
Please login to add a commentAdd a comment