Foot
-
వింటర్ కేర్ : పాదాల పగుళ్లకు స్ప్రే
చలికాలంలో చర్మ సమస్యలు సాధారణం. వీటిలో పాదాల పగుళ్లు, ట్యాన్, తిమ్మిర్లు,పాదాల నుంచి వేడి ఆవిర్లు కమ్మినట్లు అనిపించడం వంటివి ఎదుర్కొంటూ ఉంటాం. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పాదాలచర్మాన్ని కాపాడుకోవచ్చు.మృదువుగానూ మార్చుకోవచ్చు.తిమ్మిర్లు తగ్గడానికి...∙ఈ కాలం ఎక్కువసేపు కుర్చీ, సోఫాలో కూర్చునే వారికి తిమ్మిర్ల సమస్య ఎక్కువ. అలాంటప్పుడు గ్లాసు వేడినీళ్లలో స్పూన్ వెనిగర్ కలిపి, దానిలో దూదిముంచి, దాంతో రెండు పాదాలు పూర్తిగా తుడవాలి. దీనివల్ల తిమ్మిర్లు,పాదాల చర్మం ΄÷డిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి. కాటన్ సాక్సులు వేసుకుంటే కాళ్ల తిమ్మిర్లు తగ్గుతాయి.పగుళ్ల నివారణకు...పాదాల చర్మం భరించగలిగేంత వేడినీటిలో రాళ్ల ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. స్పూన్ అలోవెరా జెల్, స్పూన్ గ్లిజరిన్, విటమిన్ – ఇ క్యాప్సుల్, కొంచెం రాక్ సాల్ట్... ఇవన్నీ బాగా కలపాలి. పాదాల పగుళ్లుపైన ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. తర్వాత పాలిథిన్ కవర్తోపాదం మొత్తం మూసేయాలి. 10 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత కవర్ తీసేయాలి. దీనివల్ల పాదాల వేడి, నెమ్మదిగా పగుళ్లు తగ్గుతాయి.ట్యాన్ ఏర్పడితే...∙చలికాలం క్రీములు, లోషన్లు పాదాలకు ఎక్కువ రాస్తుంటాం. బయటకు వెళ్లినప్పుడు దుమ్ము, ఎండవల్ల ట్యాన్ ఏర్పడుతుంది. ఈ సమస్య నివారణకు.. స్పూన్ టమోటా రసంలో స్పూన్ బంగాళ దుంప రసం, స్పూన్ వెనిగర్, శనగపిండి లేదా కాఫీ పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్నిపాదాలకు అప్లై చేసి, పదిహేను నిమిషాలు ఉంచి, వాటర్ స్ప్రే చేసి, కాటన్ క్లాత్‌తో తుడిచేయాలి. వారానికి 2–3 సార్లు చేసుకుంటే ట్యాన్ తగ్గిపోతుంది.శుభ్రమైన గోళ్లుపాదాల గోళ్లు శుభ్రంగా ఉండాలంటే పెట్రోలియం జెల్లీని కొద్దిగా కరిగించి, దాంట్లో విటమిన్– ఇ క్యాప్సుల్, గ్లిజరిన్, రోజ్‌వాటర్ కలిపి రాత్రి పడుకునే ముందు గోళ్లచుట్టూ అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.మృదువైన చర్మానికి...రోజ్‌వాటర్, రోజ్మెరీ ఆయిల్, నీమ్ ఆయిల్, అలోవెరా ఆయిల్ అన్నీ సమపాళ్లలో కలిపి స్ప్రే బాటిల్లో పోయాలి. ఈ మిశ్రమాన్ని రోజూ పడుకునే ముందు పాదాలకు స్ప్రే చేయాలి. ఇలా చేస్తే పాదాల చర్మం మృదువుగా అవుతుంది. – సంతోష్ కుమారి, బ్యూటీషియన్ -
పాదాల నొప్పి తగ్గడానికి పొట్టలోని కొవ్వును ఇంజెక్ట్ చేస్తే చాలు!!
తమను బాధించే పాదాల నొప్పికి తమ పొట్ట (లోవర్ అబ్డామెన్)లోని కొవ్వు విరుగుడుగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ప్లాంటార్ ఫేసిౖయెటిస్ వంటి కొన్ని రకాల పాదాల నొప్పికి కారణమయ్యే వ్యాధులకు తమ పొట్టలోని సొంత కొవ్వు కణాలనుంచి తీసిన ‘స్టెమ్ సెల్స్’ను పాదాల్లోకి ఇంజెక్ట్ చేస్తారు. దీనివల్ల చాలాకాలం నుంచి బాధిస్తున్న నొప్పి తగ్గడమే కాదు... కేవలం ఆరు నెలల వ్యవధిలోనే వారు మునుపటిలా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వంటి ఆట పాటల్లో పాలుపంచుకునేంతగా సమస్య నయమవుతుందని ఈ పరిశోధన వల్ల తేలింది. యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్కు చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది. శస్త్రచికిత్సే చివరి పరిష్కారంగా ఉన్న కొత్త పాదాల నొప్పులు కూడా ఈ చిన్నపాటి ఇంజెక్షన్ చికిత్సతో తగ్గి΄ోయినట్లుగా ఈ పరిశోధనలో తెలిసివచ్చింది. ఈ పరిశోధన వివరాలు ప్లాస్టిక్ అండ్ రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ’ అనే మెడికల్ జర్నల్‌లో నమోదు చేశారు. (చదవండి: ఎన్ని సౌందర్య సాధనాలు వచ్చినా ఇవే ఎవర్గ్రీన్..!) -
చిరంజీవి కాళ్లకు నమస్కరించిన టాలీవుడ్ డైరెక్టర్!
చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో విలనిజంతో ఆకట్టుకున్న నటుడు సత్యదేవ్. ఈ ఏడాదిలో 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. తాజాగా నటించిన చిత్రం జీబ్రా. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన డాలీ ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు.తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కాళ్లకు ఆయన నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతమందించారు. చాలా రోజులుగా హీరోగా సరైన హిట్ కోసం చూస్తున్న సత్యదేవ్ ఈ సినిమాతోనైనా ట్రాక్‌లో పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.Megastar #Chiranjeevi's MEGA Grand Entry At #ZEBRA Pre Release Event 💫💥❤️Mana Andari Aradhya Daivam 🙏❤️@KChiruTweets @ActorSatyaDev #MegastarChiranjeevi pic.twitter.com/rZ82BHPjgf— We Love Chiranjeevi 💫 (@WeLoveMegastar) November 12, 2024 -
వందేళ్ల క్రితం ఎవరెస్ట్‌పై గల్లంతు
లండన్: ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో జాడ తెలియకుండా పోయిన బ్రిటిష్ పర్వతారోహకుడి ఆనవాళ్లు తాజాగా వందేళ్లకు బయటపడ్డాయి. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందంలోని పర్వతారోహకులకు 1924లో కనిపించకుండా పోయిన ఇద్దరిలో ఎ.సి.ఇర్విన్(22) పాదం, బూటు, ఆయన పేరున్న ఎంబ్రాయిడరీ సాక్స్ దొరికాయి. ఇది తెలిసి ఇర్విన్ సోదరుని కుమార్తె ఆనందం వ్యక్తం చేశారు. దీంతోపాటు, ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే కంటే 29 ఏళ్ల ముందే ఎవరెస్ట్ అధిరోహించేందుకు వెళ్లిన ఈ ఇద్దరూ తమ ప్రయత్నంలో విజయం సాధించారా లేదా అన్న అనుమానాలకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందం ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనా ఆదీనంలోని ఎవరెస్ట్ ఉత్తర ప్రాంతంలో రొంగ్బుక్ గ్లేసియర్ వద్ద చిత్రీకరణ చేపట్టింది. ఈ బృందానికి ఆస్కార్ విజేత కూడా ప్రముఖ జిమ్మీ చిన్ నాయకత్వం వహిస్తున్నారు. అక్కడ వారికి 1933 నాటి ఆక్సిజన్ సిలిండర్ ఒకటి లభ్యమైంది. ఇర్విన్‌కు సంబంధించిన వస్తువు కూడా ఒకటి దొరికింది. దీంతో, చాలా రోజులు అక్కడే అన్వేషణ జరిపారు. ఫలితంగా వారికి ఓ కాలున్న బూట్ దొరికింది. అందులోని సాక్ ఎంబ్రాయిడరీపై ‘ఎ.సి.ఇర్విన్’అనే పేరుంది. ఈ బూటును 1924 జూన్‌లో జార్జి మల్లోరీతో కలిసి ఎవరెస్ట్ అధిరోహించేందుకు వచ్చి అదృశ్యమైన బ్రిటిష్ దేశస్తుడు ఏసీ శాండీ ఇర్విన్దేనని తేల్చారు. 1999లో మల్లోరీ మృతదేహం పర్వతారోహకుల కంటబడగా, ఇర్విన్ ఆనవాళ్లు ఇప్పటికీ దొరకలేదు. అయితే, ఈయన వెంట తెచ్చుకున్న కెమెరా కోసం పలువురు గతంలో తీవ్రంగా గాలించారు. అందులోని ఫొటోల ఆధారంగా ఈ ఇద్దరు సాహసికుల ప్రయత్నం ఏమేరకు ఫలించిందన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని వారి ఆశ. తాజాగా దొరికిన ఆధారంతో ఇర్విన్ మృతదేహం వంటి ఆనవాళ్లు అదే ప్రాంతంలో దొరకవచ్చన్న అంచనాలు పెరిగిపోయాయి. -
ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్
హైదరాబాద్: ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి నెల రోజుల పాటు 500 మంది మధుమేహ బాధితులకు ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనుంది. మధుమేహ బాధితులకు కాళ్లు తొలగించాల్సిన అవసరం లేకుండా.. ముందుగానే ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే తగిన చికిత్సలతో నయం చేయవచ్చని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వాస్క్యులర్ సర్జరీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు.ఆస్పత్రి ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ జ్ఞానేశ్వర్ ఈ వివరాలు తెలిపారు. ఈ సేవలను వినియోగించుకోవాలనుకునేవారు 9010100536 నంబరుకు ఫోన్ చేయడం ద్వారా తమ పేర్లు నమోదుచేసుకోవచ్చు. సెప్టెంబరు 22 నుంచి నవంబరు 20వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఇంకా అదనపు పరీక్షలు అవసరమైతే వాటిమీద 50% రాయితీ వర్తిస్తుంది. ఈ పరీక్షలు చేయించుకోవడానికి మధుమేహ బాధితులు ఎవరైనా అర్హులే. అయితే తాజాగా మధుమేహం బయటపడినవారి కంటే నాలుగైదేళ్లుగా దీంతో బాధపడుతున్నవాళ్లకు అయితే వెంటనే బయటపడుతుంది. ఇప్పటికే కాళ్లలో కొంత ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ పరీక్షలు చేయించుకోవచ్చు. -
పిల్లల అరచేతులు, అరికాళ్లలో దురదలా..ప్రమాదకరమా?
సాధారణంగా పిల్లల్లో ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు... మరీ ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చాక కొందరు చిన్నారుల్లో ఈ విధమైన లక్షణాలు కనిపి స్తుంటాయి. మొదట్లో అవి చాలా తీవ్రంగా కనిపించినా క్రమేపీ తగ్గిపోతాయి. ఇది చాలా సాధారణం. అలాగే ఎగ్జిమా వంటి మామూలు సమస్యలతో పాటు హైపర్కెరటోటిక్ పాల్మార్ ఎగ్జిమా, కెరటోలైసిస్ ఎక్స్ఫోలియేటా, ఎస్.ఎస్.ఎస్. సిండ్రోమ్, స్ట్రెస్ వంటి కొన్ని సిస్టమిక్ వ్యాధులు ఉన్నప్పుడూ, ఇక సోరియాసిస్, స్కార్లెట్ ఫీవర్లతోపాటు, కొన్నిసార్లు విటమిన్ లోపాలు... ఇలాంటి కారణాల వల్ల అరచేతుల్లో, అరికాళ్లలో దురదలు రావడంతో పాటు చర్మం పగలడం, ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.అంత ప్రమాదకరం కాదు గానీ... పైన పేర్కొన్న సోరియాసిస్ వంటివి మినహాయిస్తే ఇలా చర్మం ఉడి΄ోతూ కొత్త చర్మం వచ్చే ఎగ్జిమా వంటి వాటితపాటు... కొంతమంది చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఇలా అరచేతులు, అరికాళ్లలో సెకండరీ ఇన్ఫెక్షన్లాగా కూడా వచ్చే ‘పోస్ట్ వైరల్ ఎగ్జింథిమా’ అనే కండిషన్లు సాధారణంగా రెండు నుంచి మూడు వారాల్లో వాటంతట అవే పూర్తిగా తగ్గి΄ోతాయి. దాదాపుగా ఏమాత్రం ప్రమాదకరం కాదనే చెప్పవచ్చు.ఈ జాగ్రత్తలు పాటించాలి... ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు చేతులు తేమగా ఉంచుకోవడం (వెట్ సోక్స్), మాయిçశ్చరైజింగ్ క్రీమ్స్ రాయడం వంటివి చేయాలి. జింక్ బేస్డ్ క్రీమ్స్ రాయడం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. లక్షణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ మోతాదు స్టెరాయిడ్స్ (మైల్డ్ స్టెరాయిడ్స్) వల్ల ఉపశమనం ΄÷ందవచ్చు. ఒకవేళ పైన పేర్కొన్న జాగ్రత్తల తర్వాత కూడా తగ్గక΄ోయినా, చేతులు, కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చినా, లక్షణాలు మరీ తీవ్రతరమవుతున్నా పీడియాట్రీషియన్ లేదా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. ∙ చిన్నారుల అరచేతులు, అరికాళ్లలో దురదలా? -
సాంబార్ లో ఎలుక
-
Beauty Tips: పాదాలు అందంగా కనిపించాలా? అయితే ఈ టూల్‌ని..
తల వెంట్రుక నుంచి కాలి గోరు వరకు ఆరోగ్యంగా ఉంటేనే అందం సొంతమవుతుంది. కేశ సౌందర్యం ముఖానికి ఆకర్షణ కాబట్టి.. దానిపట్ల ఎలాగూ శ్రద్ధ పెడతాం! పాదాలనే పెద్దగా పట్టించుకోం! పాదాలే కదా అని పెదవి విరవకుండా.. ఇదిగో ఈ టూల్‌ని తెచ్చుకోండి.. వాటిని చక్కగా సంరక్షించి.. ఆరోగ్యం, అందం రెంటినీ చేకూరుస్తుంది.చిత్రంలోని ఈ డెడ్ స్కిన్ రిమూవర్లో.. 2 లెవెల్స్‌లో స్పీడ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. డివైస్‌తో పాటుగా రీప్లేసబుల్ గ్రైండింగ్ హెడ్స్ లభిస్తాయి. వాటిలో 2 స్క్రబ్ హెడ్స్‌తో పాటు.. ఒక రోలర్ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్‌తో పోర్టబుల్ డివైస్‌గా ఉన్న ఈ రోలర్.. యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది.హ్యాండిల్‌తో.. తేలికగా, ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుందీ డివైస్. తడి లేదా పొడి చర్మాలకు అనువైనది. అలాగే స్త్రీ, పురుషులు ఎవరైనా వాడొచ్చు. దీన్ని శుభ్రపరచడం తేలిక. కాళ్లు, గోళ్లు, గోళ్ల చుట్టూ ఉండే చర్మం.. ప్రతి భాగాన్ని శుభ్రపరచి మృదువుగా మారుస్తుంది.ఈ ఎలక్ట్రిక్ మేకప్ రిమూవర్ ఫుట్ స్క్రబ్ డెడ్ స్కిన్ ఎక్స్ఫోలియేషన్.. హై హీల్స్ వాడేవారికి.. పాదాలు కనిపించేలా డ్రెస్సులు వేసుకునేవారికి చక్కగా ఉపయోగపడుతుంది. అందమైన పాదాలను కోరుకునేవారికి.. ఇది చక్కటి బహుమతి అవుతుంది. ఈ ఫుట్ స్పా బ్యూటీ రోలర్ ఇంట్లో ఉంటే.. పెడిక్యూర్ కోసం పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ధర కేవలం 449 రూపాయలు. దీన్ని స్నేహితులకు, శ్రేయోభిలాషులకు గిఫ్ట్‌గానూ ఇవ్వచ్చు.ఇవి చదవండి: ఏకంగా శునకాలకై.. అమెరికన్ కంపెనీ 'కడీ' పేరుతో.. -
అమెరికాలో నరమాంస భక్షకుడు!
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి తెగిపోయిన మనిషి కాలు చేతబట్టుకుని రోడ్డుపై తిరుగుతూ కలకలం రేపాడు. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరలైంది. అందులో కాలిని అటూ ఇటూ ఊపుతూ, వీడియో తీస్తున్న వ్యక్తివైపు చూస్తూ ఉన్మాదిలా విరగబడి నవ్వుతూ కని్పంచాడతను. అప్పుడప్పుడు దాన్ని వాసన చూస్తూ, నోట్లో పెట్టుకుంటూ అందరినీ భయభ్రాంతులను చేశాడు. ‘దేవుడా! అతడా కాలిని తినేస్తున్నాడు’ అంటూ నేపథ్యంలో కొందరు హాహాకారాలు చేయడం కూడా వీడియోలో విన్పించింది. పట్టాలు దాటబోతూ రైలు ఢీకొని మరణించిన మహిళ తాలూకు తెగిపడిన కాలిని అలా చేతపట్టుకుని తిరిగినట్టు స్థానిక మీడియా వివరించింది. విషయం తెలిసి పోలీసులొచి్చనా అతను ఏమాత్రమూ బెదరకుండా కులాసాగా కని్పంచాడు. అతన్ని 27 ఏళ్ల రెసెండో టెలెజ్గా గుర్తించారు. మృతదేహపు కాలిని ఎత్తుకెళ్లి రైలు ప్రమాదం తాలూకు సాక్ష్యాధారాలను మాయం చేశాడన్న అభియోగాలపై అరెస్టు చేశారు. పోలీసులు తరలిస్తుండగా కూడా కెమెరాల వైపు చూస్తూ ఉత్సాహంగా చేతులూపుతూ కన్పించాడు! -
ముంబయి నుంచి అయోధ్యకు ముస్లిం మహిళ పాదయాత్ర
లక్నో: రాముడు ఆదర్శపురుషుడు. సర్వవ్యాప్తమైన రాముని జీవన విధానం ఆచరణీయం. రామునిపై విశ్వాసం అందరిసొంతం అని నిరూపిస్తోంది ఓ ముస్లిం మహిళ. అయోధ్య రామున్ని దర్శించుకోవడానికి ముంబయి నుంచి కాలినడకన బయలు దేరింది. ఆమె సహచరులతో కలిసి ఏకంగా 1,425 కిలోమీటర్ల దూరం కాలినడకనే ప్రయాణిస్తోంది. ముంబయికి చెందిన షబ్నమ్‌కు రాముడంటే ఎంతో ఇష్టం. అయోధ్యలో కొలువుదీరనున్న రామున్ని దర్శించుకోవడానికి కాలినడకనే వెళ్లాలని నిర్ణయించుకుంది. తన సహచరులు రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేలతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించింది. ముస్లిం మహిళను అయినప్పటికీ రామున్ని పూజించడానికి అచంచలమైన భక్తి ఒక్కటే అర్హతని అంటోంది. రామున్ని పూజించడానికి హిందువు కానవసరం లేదని పేర్కొంది. మంచి మనిషిగా జీవించడమే ముఖ్యమని చెబుతోంది. ప్రస్తుతం యాత్రలో మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. ప్రతి రోజూ 25 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు వెల్లడించింది. సుధీర్ఘ యాత్రలో అలసట వచ్చినప్పటికీ రామునిపై ఉన్న భక్తే తమ యాత్రను కొనసాగిస్తోందని షబ్నమ్ తెలిపింది. రాముని ఆరాధన ఏ ప్రత్యేక మతం లేదా ప్రాంతానికి పరిమితం కాదని, అది సరిహద్దులను దాటి ప్రపంచం మొత్తాన్ని చుట్టుముడుతుందని షబ్నమ్ గట్టిగా నమ్ముతోంది. మతంతో సంబంధం లేకుండా రాముడు అందరివాడనే ప్రేరణ కలిగించడానికే యాత్రను చెపట్టినట్లు పేర్కొంది. అబ్బాయిలు మాత్రమే ఇలాంటి కష్టతరమైన యాత్రలు చేయగలరనే అపోహను దూరం చేస్తానంటోంది. యాత్రలో వీరిని కలిసిన పలువురు ఫొటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. అయితే.. షబ్నమ్ పాదయాత్రకు సవాళ్లు తప్పలేదు. ఆమెకు భద్రత కల్పించడమే కాకుండా భోజనం, వసతి ఏర్పాట్లు కల్పించడంలో పోలీసులు కీలకంగా వ్యవహరించారు. సున్నితమైన ప్రాంతాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. సోషల్ మీడియాలో కొందరు ద్వేషిస్తున్నప్పటికీ.. షబ్నమ్ తన ప్రయాణాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తోంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. విశేష స్పందనలు ప్రోత్సాహాన్నిస్తున్నాయని తెలిపింది. రాముని జెండాను పట్టుకుని నడుస్తున్నప్పుడు ముస్లింలతో సహా అనేక మంది 'జై శ్రీరామ్' అని నినదించిన ఆనంద క్షణాలను అనుభవించానని షబ్నమ్ చెబుతోంది. -
మీకు తెలుసా!..బ్రెడ్‌తో పాదాల పగుళ్లు మాయం!
కోమలంగా ఉండాల్సిన పాదాలు కాస్త చూసేందుకు అస్యహంగా ఉన్నాయా!. కనీసం బయటకువెళ్లలేని స్థితిలో ఉన్నారా. మరోవైపు ఆ పగుళ్లు వల్ల వచ్చే బాధ కారణంగా చన్నీటిలో పాదాలు పెట్టాలన్న భయం వేస్తుంది. ఎన్నో క్రీంలు వాడినా పాదాల పగుళ్లు సమస్య నుంచి బయటన పడలేక పోతుంటే ఈ చక్కటి చిట్కాను ఫాలోకండి. మంచి ఫలితం ఉంటుంది. ఏంటీ.. దీంతోనా! అని షాక్ అవ్వద్దు!. వర్షాకాలం లేదా శీతాకాలం వస్తే అందర్నీ వేధించే సమస్యే కాలు పగుళ్లు ఓ పట్టాన నయం కావు. పైగా మరింత పెద్దవై రక్తం కారి నొప్పి కూడా వస్తుంటుంది. చెప్పులు వేసుకుని నడవాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓ పక్క ఎవ్వరైన ఈ పగుళ్లు చూసి అసహ్యించుకుంటారేమోనని భయపడతాం. అందుకని అవికనిపించకుండా ఉండేలా సాక్స్ వంటి ఉపయోగించి మరీ దాచే ప్రయత్నం చేస్తాం. పోనీ మార్కెట్లో ఉండే పగుళ్లు తగ్గే క్రీం ట్రై చేసినా పెద్దగా ఫలితం ఉండదు. కొబ్బరి నూనె, పసుపు వంటి ఎన్నో చిట్కాలు వాడి విసిగి వేసారిపోయి ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇంతకీ ఆ చిట్కా ఏంటంటే.. బ్రెడ్‌తో కాలా పగుళ్ల సమస్యకు చెక్‌పెట్టొచ్చు. ఏంటీ బ్రెడ్! అని ఆశ్చర్యపోవద్దు. ఔను నిజంగానే దాంతో ఈజీగా పగుళ్లు తగ్గిపోతాయట. ముందుగా ఓ బ్రెడ్ స్లైడ్ తీసుకుని దాన్ని యాపిల్ వెనిగర్‌లో ముంచి మీ మడమను కవర్ చేసేలా ప్లాస్టిక్ కవర్‌తో గట్టిగా చుట్టేయాలి. ఇలా పగుళ్లు ఉన్న చోటల్లా ఇలా యాపిల్ వెనిగర్‌లో ముంచిన బ్రెడ్‌ని పెట్టి, ప్లాస్టిక్ కవర్‌తో గట్టిగా కట్టేయాలి. ఆ తర్వాత ఫలితం చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ ప్రదేశం అంతా గట్టిగా అయ్యి నెమ్మదిగా అక్కడ చర్మం పొలుసులుగా వ్చేసి క్లీన్ అయిపోతుంది. ఎలా అంటే పార్లర్‌కి వెళ్లి పెడిక్యూర్ చేయించుకున్న మాదిరి ఉంటాయి పాదాలు. తప్పక ట్రై చెయ్యండి. (చదవండి: శిల్పంలా ఉండే శృతి హాసన్ బ్యూటీ సీక్రెట్ ఇదేనా!) -
చిన్నారుల్ని ఇబ్బంది పెట్టే హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్!
హ్యాండ్ ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ చిన్నారుల్లో కనిపిస్తుంటుంది. ఈ వ్యాధిలో పిల్లల చేతులు, కాళ్లు, నోటి మీద ర్యాష్, పొక్కులు, పుండ్ల లాంటివి వచ్చి బాధపెడతాయి. ఈ వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉన్నప్పుడు... ఔట్‌బ్రేక్స్ మాదిరిగా అకస్మాత్తుగా పిల్లల్లో అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. ఏడాది పొడవునా ఎప్పుడైనా వ్యాప్తి చెందే ఈ వ్యాధి వాతావరణంలో వేడిమీ, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంటుంది. అందుకే మనలాంటి ఉష్ణమండలపు ప్రాంతాల్లో దీని వ్యాప్తి ఎక్కువ. రోజుల వయసు పిల్లలు మొదలుకొని, పదేళ్ల చిన్నారుల వరకు కనిపించే ఈ సమస్య తల్లిదండ్రుల ఆందోళనకూ కారణమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్లోని ర్యాష్, పుండ్లు, కురుపుల్లో నొప్పి ఓ మోస్తరుగా, కాస్త ఎక్కువగానే ఉండవచ్చు. దేహం రంగు (స్కిన్ టోన్)ను బట్టి ఈ కురుపులు, పుండ్లు పిల్లలందరిలో ఒకేలా కాకుండా కాస్త వేర్వేరుగా కనిపించవచ్చు. అంటే ఎరుపు, గ్రే కలర్, కొన్నిసార్లు తెలుపు రంగులో కనిపిస్తాయి. ఇవి మూడు నుంచి ఆరు రోజుల వరకు కనిపించి, ఆ తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కొంతమంది పిల్లల్లో పిరుదుల మీదా కనిపించే అవకాశం ఉంది. పుండ్లు పిల్లల్లో నోటి వెనకా, గొంతులోనూ వచ్చి బాధిస్తాయి. ఇలా జరగడాన్ని ‘హెర్పాంజియా’ అంటారు. కొంతమందితో మెదడువాపు లక్షణాలు కనిపిస్తాయి. వ్యాప్తి ఇలా... ‘కాక్సాకీ’ అనే వైరస్ కారణంగా ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుంది. ఇది ఎంటరోవైరస్ జాతికి చెందిన వైరస్. పిల్లల ముక్కు నుంచి స్రవించే స్రావాలు, లాలాజలం, పుండ్ల నుంచి స్రవించే తడితో పాటు పిల్లలు తుమ్మడం, దగ్గడం చేసినప్పుడు వ్యాపించే తుంపర్ల (డ్రాప్లెట్స్) వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. వ్యాధి నయమై, లక్షణాలు తగ్గిపోయాక కూడా వైరస్ చాలాకాలం పాటు దేహంలోపలే ఉండి, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి పిల్లలతో ఉండే పెద్దల ద్వారా ఇతర పిల్లలకు ఇది వ్యాప్తి చెందవచ్చు. అరుదుగా ముప్పు... చాలావరకు దానంతట అదే తగ్గిపోయే ఈ వ్యాధి అరుదుగా కొంతమంది పిల్లల్లో ముప్పు తెచ్చిపెట్టవచ్చు. పిల్లల వయసు అనే అంశమే ఈ ముప్పునకు కారణం. అంటే సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లల్లో ఇది ఒకింత ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) కూడా పెరుగుతుంది కాబట్టి పెద్ద వయసు పిల్లల్లో ఇది ప్రమాదకరం కాబోదు. కొద్దిమంది పిల్లల్లో మెదడు, ఊపిరితిత్తులు, గుండె కూడా దుష్ప్రభావాలకు లోనవుతాయి. ఒక్కోసారి ఈ వ్యాధి తెచ్చిపెట్టే ముప్పులు ఈ కింది విధంగా ఉండవచ్చు. వైరల్ మెనింజైటిస్ : మెదడు పొరల్లో వాపుతో పాటు, మెదడు చుట్టూ ఉండే సెరిబ్రో స్పినల్ ఫ్లుయిడ్లో ఇన్ఫ్లమేషన్ కలగడం. ఎన్సెఫలైటిస్ : మెదడువాపునకు కారణమై ఒక్కోసారి ప్రాణాపాయం వరకు వెళ్లే పరిస్థితి రావచ్చు. అయితే ఇది చాలా చాలా అరుదు. చికిత్స ఇది వైరల్ జ్వరం కాబట్టి నిర్దిష్టంగా చికిత్స ఏదీ లేదు. కాకపోతే లక్షణాల ఆధారంగా చికిత్స (సింప్టమేటిక్ ట్రీట్మెంట్) అందించాల్సి ఉంటుంది. అంటే జ్వరం తగ్గడానికి పారాసిటమాల్, డీ–హైడ్రేషన్ సమయంలో ఐవీ ఫ్లుయిడ్స్, సీజర్స్వంటి కాంప్లికేషన్లతో పాటు వైరల్ మెనింజైటిస్, ఎన్కెఫలైటిస్ కనిపించినప్పుడు వాటికి అనుగుణంగా చికిత్స అందించడం అవసరం. ఈ వ్యాధి నివారణకు టీకా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నివారణ: కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్ వాడాలి. ∙నేరుగా దగ్గడం తుమ్మడం చేయకుండా, చేతిగుడ్డ /రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ∙వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిశుభ్రమైన (కాచి, వడబోసిన లేదా క్లోరిన్‌తో బ్లీచ్ చేసిన) నీటిని తాగాలి. ∙పిల్లల వ్యక్తిగత వస్తువుల్నీ పరిశుభ్రంగా ఉంచాలి. వారి డయపర్ వంటి వాటిని జాగ్రత్తగా పారేయాలి (డిస్పోజ్ చేయాలి). పిల్లల వస్తువులు, బొమ్మల వంటివి... ఇతరులు వాడకుండా జాగ్రత్తపడాలి. లక్షణాలు తగ్గే వరకు స్కూల్‌కు పంపకపోవడమే మంచిది. వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పుడు ఇల్లు, తలుపులు, డోన్ నాబ్స్ వంటి వాటితో పాటు పరిసరాలనూ డిస్–ఇన్ఫెక్టెంట్ల సహాయంతో శుభ్రం చేయడం మేలు. వైరస్ కారణంగా 24 నుంచి 48 గంటల పాటు జ్వరం. ∙తీవ్రమైన నీరసం, నిస్సత్తువ. ∙ఆకలి లేకపోవడం, ఆకలి బాగా మందగించడం. ∙గొంతు బొంగురుపోవడం, ఇబ్బందికరంగా మారడం. ∙కొన్నిసార్లు ర్యాష్, పొక్కులు, కురుపులు చిగుర్లు, నాలుక, చెంపల లోపలివైపున కూడా కని పించవచ్చు. కొన్నిసార్లు పొక్కులు, కురుపులు లేకుండా ఎర్రబడిన భాగం కాస్త ఉబ్బెత్తుగా అయినట్లుగానూ కనిపించవచ్చు. డాక్టర్ రమేశ్ బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్ (చదవండి: మరణం తర్వాత జీవితం ఉంటుందటా! షాకింగ్ విషయాలు వెల్లడించిన వైద్యులు) -
తిరుమల కాలినడక.. ఘాట్ మార్గాల్లో జాగ్రత్తలు
తిరుమల: ఆరేళ్ల చిన్నారి లక్షితపై చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. కాలినడక.. ఘాట్ మార్గాల్లో జాగ్రత్తలు చేపట్టింది. సాయంత్రం 6 గంటల తర్వాత నడక దారిలో భక్తులను అనుమతించకూడదని నిర్ణయించింది. అదే విధంగా ఘాట్ రోడ్డులో సాయంత్రం నుంచి ద్విచక్ర వాహనాలను అనుమతించరు. మధ్యాహ్నం 2 గంటల తరువాత చిన్న పిల్లలతో వచ్చే తల్లిదండ్రులను నడక దారిలో అనుమతించరు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డితో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కాలినడక మార్గాలు, ఘాట్ రోడ్లో యాత్రికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి మార్గంలో ఉదయం 5 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 15 సంవత్సరాలలోపు చిన్నారులను తల్లిదండ్రులు, బంధువులతో అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెద్దలకు మాత్రమే అలిపిరి కాలినడక మార్గంలో అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు వైపు కాలినడక మార్గంలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 15 సంవత్సరాలలోపు చిన్నారులను తల్లిదండ్రులు, బంధువులతో అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెద్దలను మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తారు. శనివారం నుంచి రెండు ఘాట్ రోడ్లలో సాయంత్రం 6 గంటల తరువాత ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఐదు ప్రాంతాల్లో చిరుత సంచారం నడక మార్గం, ఘాట్ రోడ్లలో ఐదు ప్రాంతాల్లో చిరుత సంచారం జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడ చిరుతలు పెరిగినట్టు అటవీ అధికారులకు సమాచారం అందుతోంది. శనివారం కూడా నడక మార్గం, ఘాట్ రోడ్లలోని చిరుతల సంచారం గుర్తించారు. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు మూడు ప్రాంతాలు, గాలి గోపురం నుంచి ఏడో మైలు వద్ద చిరుత సంచారాన్ని గుర్తించారు. రెండో ఘాట్ రోడ్డులోని 38వ మలుపు వద్ద చిరుత తిరుగుతున్నట్టు గుర్తించారు. దీంతో భక్తులను అప్రమత్తం చేశారు. 13టీఎమ్ఎల్50: నడక మార్గంలోని 7వ మైలు వద్ద చిన్నారులకు ట్యాగ్లు వేస్తున్న పోలీసులు చిన్నారుల రక్షణకు ట్యాగ్లు అలిపిరి నుంచి తిరుమల నడక దారిలోని అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం పెర గడం, దాడుల నేపథ్యంలో పోలీసులు ముందస్తు రక్షణ చర్యలను చేపట్టారు. ఆదివారం నుంచి అలిపిరి నడక మార్గంలోని ఏడో మైలు వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చిన్నారులకు ట్యాగ్లు వేస్తున్నారు. ట్యాగ్లు వేయడం వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోయినా సులభంగా కనిపెట్టేందుకు వీలవుతుంది. ట్యాగ్‌పై చిన్నారి పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ నమోదు చేసి ఉంటాయి. -
పాట పాడి.. మోదీ కాళ్లు మొక్కిన అమెరికన్ గాయని
వాష్టింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక పర్యటన ముగింపు సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ (USICF) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని మేరీ మిల్బెన్ భారత జాతీయ గీతం ‘జన గణ మన’ ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీని తర్వాత ఓం జై జగదీశే హరే పాట కూడా పాడారు. చివరిలో ఆమె ప్రధాని మోదీకి పాదాభివందనం చేశారు. వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటరులో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రధాని హాజరు కాగా ఈ ఘటన చోటు చేసుకుంది. మిల్బెన్ మాట్లాడుతూ.. జాతీయ గీతం, దేశభక్తి సంగీతాన్ని ఆలపించడానికి తనకు ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని అటునుంచి ఈజిప్టు పర్యటనకు పయనమయ్యారు. 1997 తర్వాత ఈజిప్టులో భారత్ ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. భారత ప్రధాని అమెరికా బయలుదేరే ముందే ఈజిప్ట్ పర్యటననుద్దేశించి మాకు అత్యంత సన్నిహితమైన దేశం ఈజిప్టు సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది. #WATCH | Award-winning international singer @MaryMillben performs the Indian National Anthem at the Ronald Reagan Building in #WashingtonDC #HistoricStateVisit2023 #ModiInUSA #IndiaUSAPartnership pic.twitter.com/pIsXoJlodx — DD News (@DDNewslive) June 24, 2023 చదవండి: Titanic Submarine Disaster: ‘టైటాన్ మునుగుతుందని ముందే చెప్పా’.. అందుకే జాబ్ నుంచి పీకేశారు! -
ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే?
ఎదురుగా ఉన్నది దెయ్యమో మనిషో తేల్చుకోవడానికి కాళ్లు వెనక్కు తిరిగి ఉండటాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు జానపదులు. ఇక్కడ ఉన్న కెల్సీ గ్రబ్ దెయ్యమేమో అని అనుమానం వస్తే తప్పులేదు. ఎందుకంటే ఏకంగా ఆమె తన పాదం మొత్తాన్ని వెనక్కు తిప్పి గిన్నెస్ రికార్డును బద్దలు కొట్టింది. మే 2న ఈ రికార్డు నమోదైంది. ప్రస్తుతం ఈమె కాళ్ల వైపే లోకం అబ్బురంగా చూస్తోంది ‘పిల్లలకు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే క్రేజ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాక్కూడా ఉండేది. కాని నేను కూడా ఆ రికార్డ్ సాధిస్తాననుకోలేదు’ అని సంబరపడుతోంది కెల్సీ గ్రబ్. అమెరికాలోని న్యూ మెక్సికోలో ఆల్ బకాకీ అనే ఊరికి చెందిన 32 ఏళ్ల కెల్సీ తన కాలిని171.4 డిగ్రీలు వెనక్కు తిప్పడం ద్వారా గిన్నెస్ రికార్డు స్ధాపించింది. ‘గత సంవత్సరం ఏదో షాపులో గిన్నెస్ రికార్డ్–2021 పుస్తకం తిరగేశాను. అందులో కాలు వెనక్కు తిప్పే వ్యక్తి ఫొటో ఉంది. అతని కంటే ఎక్కువగా వెనక్కు ఎందుకు తిప్పకూడదు అనిపించింది’ అంది కెల్సీ. చదవండి: రిలేషనే కాదు.. ఎదో తెలియని ఎమోషన్.. జుకర్‌బర్గ్ ఫోటో వైరల్ ఐస్ స్కేటింగ్‌ను తరచూ సాధన చేసే కెల్సీ స్కేటింగ్‌లో పాదాలు చురుగ్గా ఉండాలి కనుక తను సాధన చేస్తే కాలిని వెనక్కు తిప్పగలదు అనుకుంది. ‘నేను పెద్దగా కష్టపడలేదు. అప్పుడప్పుడు పాదాన్ని వెనక్కు తిప్పుతూ ఉండేదాన్ని. కొన్నిసార్లు మోకాల్లో నొప్పి అనిపించేది. అప్పుడు మాత్రం కొంచెం మెల్లగా తిప్పేదాన్ని’ అని తెలిపింది కెల్సీ. ఆమె ఇప్పుడు ఎంత సాధన చేసిందంటే ‘జనం వెనక్కు తిరిగిన పాదాన్ని కాకుండా అంత సులభంగా పాదాన్ని తిప్పినందుకే ఎక్కువ ఆశ్చర్యపోతుంటారు’ అని నవ్వింది. స్నేహితులు ఆమె విన్యాసాన్ని పూర్తిగా గమనించాక గిన్నెస్ రికార్డ్స్ వారికి మెయిల్ పెట్టింది కెల్సీ. ‘ఇదేదో రికార్డు స్థాయి ఫీట్లాగానే ఉంది. వచ్చి పరీక్షించండి అని మెయిల్ పెట్టాను. చిన్నపిల్లల్లాగే ఉత్సాహంగా ఎదురు చూశాను. రికార్డు కన్ఫర్మ్ అయ్యాక చాలా సంబరపడ్డాను’ అందామె. సాధారణ జనంలో చాలా మంది కాలిని 90 డిగ్రీల వరకూ వెనక్కు తిప్పగలరు. కాని కెల్సీ దాదాపు 180 డిగ్రీలు వెనక్కు తిప్పడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. -
Beauty Tips: పాదాలపై ట్యాన్ తగ్గి, కాంతిమంతంగా మారాలంటే..
ముఖానికి ఇచ్చినంత ప్రాముఖ్యత పాదాలకు ఇవ్వకపోడంవల్ల .. ముఖం తెల్లగా ఉన్నప్పటికీ పాదాలపై ట్యాన్ పేరుకుపోయి నల్లగా కాంతిహీనంగా కనిపిస్తాయి. కాళ్లమీద నలుపు తగ్గి, ఆకర్షణీయంగా కనిపించేందుకు చిన్నపాటి ఇంటిచిట్కా పాటిస్తే సరిపోతుంది. ►పావు బకెట్ నీళ్లలో టేబుల్ స్పూను వంటసోడా, టీస్పూను అలోవెరా జెల్, టీస్పూను ఉప్పు వేసి బాగా కలపాలి. ►ఆ నీటిలో పాదాలను ఉంచి, ఐదునిమిషాలపాటు స్క్రబర్‌తో రుద్దాలి. ►తరువాత గోరువెచ్చని నీటిలో పాదాలను పదిహేను నిమిషాలపాటు నానబెట్టాలి. ►తరవాత పాదాలను బయటకు తీసి తడిలేకుండా శుభ్రంగా తుడిచి కొబ్బరి నూనె రాసి మర్దన చేయాలి. ►రోజూ క్రమం తప్పకుండా ఈ పద్ధతిని అనుసరిస్తే కొద్దిరోజుల్లోనే పాదాలు మంచి నిగారింపుని సంతరించుకుంటాయి. చదవండి: Health Tips: ఈ పండ్ల గింజల్లో సైనైడ్‌ను విడుదల చేసే కారకాలు! తిన్నారంటే అంతే సంగతులు! జాగ్రత్త! Eye Stress Relief: ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్ చూసేవాళ్లు! రోజ్‌వాటర్, టీ బ్యాగ్‌లు, పుదీనా.. ఈ చిట్కాలు పాటిస్తే.. -
Health Tips: బీ12 లోపించడం వల్లే ఇలా! పాదాలకు మసాజ్ చేశారంటే..
కొంతమందికి ప్రతిరోజూ పాదాలు నొప్పి, అరికాళ్లు చురుక్కుమని మంటలు పుట్టడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. సాధారణంగా విటమిన్ బీ12 లోపం వల్ల, డయాబెటిస్ ఉండటం వల్ల ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అయితే విటమిన్ టాబ్లెట్లు వాడుతూ, డయాబెటిస్‌కు చికిత్స తీసుకుంటున్నా కూడా ఈ సమస్య వేధిస్తుంటే పాదాలకు మసాజ్ చేయడం చాలా ఉపశమనాన్నిస్తుందంటున్నారు నిపుణులు. అదేమిటో చూద్దాం... అనేక ప్రయోజనాలు! చాలామంది ఇళ్లలో పెద్దవాళ్లు ఇప్పటికీ కూడా అరికాళ్లకు, పాదాలకు కొబ్బరినూనె రాయించుకుని కాళ్లు పట్టించుకుంటూ ఉండటం చూస్తుంటాం. అయితే అది పాతకాలం పద్ధతి అని కొట్టిపారేయద్దని, పాదాలకు మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆధునిక పరిశోధనలు కూడా చెబుతున్నాయి. అరికాళ్ల మసాజ్ కాళ్ల నొప్పులతోపాటు మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. రోజూ పాదాలకు మసాజ్ చేస్తే కాళ్లకు సత్తువ పెరుగుతుంది. ఒక పరిశోధన ప్రకారం... పాదాలకు మసాజ్ చేయడం నాడీవ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది. మెదడులో ఉండే ఎండార్ఫిన్ రసాయనాల ఉత్పత్తిని పెంచుతుంది. కొన్నిరకాల శస్త్ర చికిత్సల తర్వాత పాదాలకు మసాజ్ చేసిన వారికి నొప్పి తక్కువగా ఉండడంతోపాటు శస్త్ర చికిత్సానంతరం తలెత్తే కొన్ని రకాల ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటారని తెలిపింది. ఫుట్ మసాజ్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఫుట్ మసాజ్ చేయడం వల్ల... కండరాలను బలపరుస్తుంది... రెగ్యులర్ ఫుట్ మసాజ్ కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చాలాకాలం పాటు కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. పాదాలను మర్దన చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది నరాలు దెబ్బతినడం, డయాబెటిస్ వంటి వాటిలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. డిప్రెషన్ దూరం... ►మానసికంగా అస్వస్థతకు గురై, డిప్రెషన్‌కు లోనవుతున్నవారు ఫుట్మసాజ్ చేయించుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుంది. ►మంచి నిద్ర కోసం... మీకు రాత్రి నిద్ర రాకపోతే మీకు ఇష్టమైన ఎసెన్షియల్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో పాదాలను సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ►సత్వర ఉపశమనం... ఫుట్ మసాజ్ సహాయంతో మీరు మడమలు, బూట్లు, పాదాలు మొదలైన వాటికి తగిలిన గాయాల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ముఖ్యంగా అథ్లెట్లు లేదా ఎక్కువ పనిచేసే వ్యక్తులు. ►గర్భధారణ సమయంలో... గర్భధారణ సమయంలో పాదాలు వాపు సర్వసాధారణం. అలాంటి సమయంలో వారికి ఫుట్ మసాజ్ వల్ల హాయిగా ఉండటమే కాకుండా పాదాలవాపు సమస్య కూడా దూరమవుతుంది. ►ఇన్ని ఉపయోగాలున్న ఫుట్మసాజ్ను పక్కన పెట్టెయ్యరు కదా.. ఇంక? చదవండి: Rainy Season Tips: అసలే వర్షాకాలం.. లో దుస్తుల విషయంలో జాగ్రత్త! ఇలా మాత్రం చేయకండి! Health Benefits Of Corn: మొక్కజొన్న పొత్తు తరచుగా తింటున్నారా? ఇందులోని లైకోపీన్.. -
కొలనుపాకలో నాలుగడుగుల జైన పాదం
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది లేదా 9వ శతాబ్దానికి చెందిన జైన తీర్థంకరులలో ఒకరిదని భావిస్తున్న భారీ పాదాన్ని కొలనుపాకలో గుర్తించారు. ఈ పాదం దాదాపు నాలుగు అడుగుల పొడవుంది. అక్కడ గతంలో ధ్వంసమై చెల్లాచెదురుగా పడి ఉన్న శిల్పాలు, విగ్రహాలను సోమేశ్వరాలయం సమీపంలోని ప్రాంగణానికి చేర్చే పని ప్రస్తుతం జరుగుతోంది. అక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకులు చూసేందుకు వీలుగా వీటిని ఒకచోట ఉంచబోతున్నారు. ఈక్రమంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యులు కుమారస్వామి, సోమిరెడ్డి ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు శిథిల విగ్రహాల మధ్య ఈ పాదాన్ని గుర్తించారు. జైన తీర్థంకరులలో ఒకరికి సంబంధించిన పాదాల్లో ఎడమ పాదంగా వారు నిర్ధారణకు వచ్చారు. దీన్ని చరిత్ర పరిశోధకుడు, విశ్రాంత పురావస్తు అధికారి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కూడా ధ్రువీకరించారని హరగోపాల్ పేర్కొన్నారు. దీన్ని పాదంగా మాత్రమే ఏర్పాటు చేసినదా? లేదా భారీ విగ్రహానికి చెందిన భాగమా? అన్న విషయమై స్పష్టత రాలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా గొల్లత్తగుడి జైన మందిరం వెనక ఆరు అడుగులు, ఐదు అడుగుల పొడవున్న రెండు జతల భారీ జైన పాదాలను గుర్తించారు. నిర్మల్ జిల్లా భైంసాలో కూడా 3 భారీ పాదాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో భారీ జైన పాదాలున్న మూడో ప్రాంతంగా కొలనుపాకను గుర్తించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పాదం మీద నూపురం, కాలివేళ్లకు అలంకారాలు కనిపిస్తున్నట్టు హరగోపాల్ వెల్లడించారు. -
వరుడికి ట్రాఫిక్ కష్టాలు... కాలినడకన వెళ్లిన తాళి కట్టాడు
కర్ణాటక(యశవంతపుర): ఓ వైపు ముహూర్తం దగ్గర పడుతోంది... రోడ్డంతా ట్రాఫిక్ జామ్... కల్యాణ మంటపం చేరుకోవడానికి పెళ్లి కుమారుడితో బయలుదేరిన బంధువులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఇక లాభం లేదనుకున్న పెళ్లి కుమారుడు కాలినడకన కల్యాణ మంటపానికి వెళ్లి వధువు మెడలో మూడుముళ్లు వేశారు. చామరాజనగరకు చెందిన వధువుకు, తమిళనాడులోని సత్యమంగళకు చెందిన వరుడికి వివాహం నిశ్చయమైంది. సత్యమంగల సమీపంలోని బన్నారి ఆలయంలో శుక్రవారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది. గురువారం రాత్రి కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో సత్యమంగలం అటవీ ప్రాంతం వద్ద రాత్రి సమయంలో వాహన సంచారాన్ని నిషేధించారు. దీంతో మరుసటిరోజు ఉదయం రోడ్డు పొడవునా వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఇదే సమయంలో ఓ పెళ్లి కుమారుడు, బంధువులు కారులో వచ్చారు. ట్రాఫిక్ పునరుద్ధరణకు గంటల కొద్ది సమయం పడుతుందని తెలియడంతో పెళ్లి కుమారుడు కాలినడకన మంటపానికి బయలుదేరాడు. సకాలంలో అక్కడికి చేరుకుని వధువు మెడలో తాళికట్టాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
Ankle Pain Health Tips: యాంకిల్ పెయిన్ వేధిస్తోందా.. ఇంట్లోనే ‘రైస్ ట్రీట్మెంట్’!
పాదానికి దేహానికి మధ్య సంధాన కర్త యాంకిల్ (చీలమండ). కండరాలు ఒత్తిడికి గురవడం వల్ల, నడిచేటప్పుడు కాలు మడత పడడం వంటి చిన్న కారణాలకే యాంకిల్ పెయిన్ వస్తుంటుంది. ప్రమాదవశాత్తూ జారిపడినప్పుడు ఆ దుష్ప్రభావానికి మొదటగా గురయ్యేది యాంకిల్ మాత్రమే. అలాగే ఆర్థరైటిస్ వంటి అనారోగ్య పరిస్థితుల్లోనూ దేహంలోని తొలి బాధిత భాగం ఇదే. యాంకిల్ పెయిన్ వస్తే దైనందిన జీవనం దాదాపుగా స్తంభించిపోతుంది. ఈ నొప్పికి తక్షణం చికిత్స తీసుకోవాల్సిందే. అయితే యాంకిల్ పెయిన్‌కి దారి తీసిన కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. మొదటగా ఇంట్లో తీసుకోగలిగిన జాగ్రత్తలను చూద్దాం. అలాగే డాక్టర్‌ను సంప్రదించాల్సిన పరిస్థితులను తెలుసుకుందాం. ►యాంకిల్ పెయిన్ చికిత్సలో రైస్ మెథడ్ ప్రధానమైనది. రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్ పదాల మొదటి ఇంగ్లిష్ అక్షరాలతో రూపొందించిన చికిత్స విధానం ఇది. ►పూర్తిగా విశ్రాంతినివ్వాలి. పాదం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు మోపకూడదు, బాత్రూమ్ వంటి స్వయంగా చేసుకోవాల్సిన పనులకు క్రచెస్ సహాయంతో నడవాలి. ►గాయం తగిలిన మూడురోజుల వరకు రోజుకు ఐదు సార్లు గాయం మీద ఐస్ పెట్టాలి. ►ఎలాస్టిక్ బ్యాండేజ్‌తో పాదాన్ని చీలమండను కలుపుతూ కట్టుకట్టాలి. అయితే ఈ కట్టును రక్తప్రసరణకు అంతరాయం కలిగేటంత గట్టిగా కట్టకూడదు. ►రెండు దిండ్ల సహాయంతో యాంకిల్‌ను గుండెకంటే ఎత్తులో ఉంచాలి. ►కండరాలు ఒత్తిడికి గురైన కారణంగా వచ్చిన నొప్పి అయితే తగ్గిపోతుంది. ► ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్, దీర్ఘకాల సయాటికా కారణంగా నరాలు దెబ్బతినడం, రక్తనాళాల్లో అడ్డంకులు, కీళ్లలో ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చిన యాంకిల్ పెయిన్ అయితే వైద్యుల సూచనతో చికిత్స చేయించుకోవాలి. అనారోగ్య కారణాన్ని బట్టి మందులు మారుతుంటాయి. -
Feet Care Tips: విటమిన్ ‘ఈ’ క్యాప్య్సూల్స్తో ఇలా అందంగా..
Winter Feet Care Tips: కొందరికి పాదాలు విపరీతంగా పగిలి చూడటానికి వికారంగా కనిపిస్తాయి. అలాంటప్పుడు శరీరం తట్టుకోగలిగినంత వేడినీళ్లల్లో కొన్ని చుక్కల షాంపూ, కొద్దిగా నిమ్మరసం, టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఈ నీళ్లలో పాదాలను ఉంచి, పదినిమిషాల తరువాత పమిస్ స్టోన్ లేదా పాత టూత్ బ్రష్ తీసుకుని పాదాలనుంచి అరికాళ్ల దాకా నెమ్మదిగా రుద్ది కడగాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. కడిగిన పాదాలను తడిలేకుండా శుభ్రంగా తుడవాలి. తెల్లగా ఉండే టూత్ పేస్టును అర టేబుల్ స్పూను తీసుకుని దానిలో రెండు విటమిన్ ఈ క్యాప్య్సూల్స్లోని మిశ్రమాన్ని వేసి రెండింటిని బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని పగుళ్లపై రాసి సున్నితంగా మర్దనా చేయాలి. తరువాత సాక్సులు వేసుకుని పడుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గి పువ్వుల్లా మృదువుగా ముద్దుగా తయారవుతాయి. చదవండి: Legs Swelling Health Tips: ధనియాలను నీటిలో మరిగించి తాగారంటే... -
ఘోరం: వాటి కోసం మహిళ కాళ్లను నరికి.. ఆపై..
జైపూర్: కడియాల కోసం కొందరు దొంగలు ఒంటరిగా ఉన్న మహిళ కాళ్లను నరికి, ఆపై హత్య చేశారు. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని చోటు చేసుకుంది. మృతురాలిని కంకుబాయిగా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. చార్భుజా పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న కంకుబాయి తన భర్తకు భోజనం పెట్టేందుకు తను ఇంటి నుంచి బయలుదేరింది. అయితే కంకుబాయి తన భర్త పనిచేస్తున్న పొలానికి చేరుకోలేదు. దీంతో మహిళ భర్త ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తన పిల్లలను కంకుబాయి ఎక్కడ అని అడిగాడు. కంకుబాయి ఉదయాన్నే పొలానికి ఆహారం తీసుకుని తన దగ్గరకే వచ్చిందని అతని పిల్లలు చెప్పారు. దీంతో మహిళ భర్త, బంధువులు, స్థానికులు రాత్రి వరకు వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో చరభుజ పోలీస్ స్టేషన్లో మహిళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తరువాత ఓ వ్యవసాయ పొలం వద్ద కంకుభాయి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కడియాల కోసం ఆమె కాళ్లు నరికివేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దొంగలించే క్రమంలో మెడపై కూడా దాడి చేయడంతో ఆమె మరణించినట్లు పేర్కొన్నారు. వెండి కడియాల కోసమే ఆమె కాళ్లను దొంగలు నరికినట్లు పోలీసుల విచారణలో తేలింది. పాదాలు నరికిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించడం ఇదే తొలిసారి కాదు. జైపూర్‌లో కొద్ది రోజుల క్రితం, పొలంలో పశువులు మేపేందుకు వెళ్లిన ఓ మహిళ శవమై కనిపించింది. ఆమెను కూడా ఈ రకంగానే హత్య చేశారు. చదవండి: నటిపై దాడి: ఆపై నాలుగు గంటలు అక్కడే ఎందుకు ఉన్నట్లు? -
అడుగేస్తేనే కరెంట్ పుడుతుంది మరి!
అడుగేస్తే మాస్, భూకంపం, దడదడా.. ఇలాంటి డైలాగులు అతిశయోక్తి కోసం సినిమాల్లో వాడుతుంటారు. కానీ, అడుగేస్తే నిజంగా కరెంట్పుడితే? ఎలా ఉంటుంది. ‘పవర్ వాక్’.. ఈ పదం ఎప్పుడైనా విని ఉన్నారా? స్విస్ సైంటిస్టుల చొరవతో త్వరలో ఇది నిజం కాబోతోంది. చెక్క ఫ్లోరింగ్, సిలికాన్ కలయిక ద్వారా ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ ప్రారంభించే దిశగా ‘అడుగు’లు పడబోతున్నాయి. జూరిచ్(స్విట్జర్ల్యాండ్)కు చెందిన ఈటీహెచ్ జూరిచ్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు ఈ ప్రయోగాల్లో తొలి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. నానోజనరేటర్ పేరుతో తయారు చేసిన డివైజ్ ఆధారంగా లో వోల్టేజ్ కరెంట్‌ను ఉత్పత్తి చేయగలిగారు. నానో క్రిస్టల్స్‌ను పొందుపరిచిన చెక్కఫ్లోర్, దానికి సిలికాన్ కోటింగ్‌తో డివైజ్‌ను రూపొందించారు. ఈ డివైజ్‌పై అడుగువేయగానే ఒత్తిడి.. ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఈ కరెంట్‌తో ఎల్ఈడీ బల్బ్స్, చిన్న ఎలక్ట్రిక్ డివైజ్‌లను పని చేసేలా చేశారు. ట్రైబోఎలక్ట్రిక్ ఎఫెక్ట్.. అంటే ఎలక్ట్రాన్లను ఏ మెటీరియల్ అయితే కోల్పోతోందో అది ట్రైబో పాజిటివ్.. ఏదైనా పొందుతుందో అది ట్రైబో నెగెటివ్. ఈ సూత్రం ఆధారంగానే నానోజెనెరేటర్ పని చేస్తుంది. చెక్క ఫ్లోర్ ఎలక్ట్రాన్లను ఆకర్షించడం, వికర్షించడం.. మీద ఆధారపడి ఇది పని చేయనుంది. దీనిని మరింత మెరుగ్గా(మనిషికి ప్రమాదం జరగని స్థాయి) తీర్చిదిద్ది ఇంటి అవసరాలకు, తక్కువ స్పేస్‌లో ఉపయోగించనున్నట్లు ప్రొఫెసర్ గుయిడో పంజరసా చెబుతున్నారు. చదవండి: కరోనా పేషెంట్ల ప్రాణాలను కాపాడే టూల్.. మనోడి సత్తా -
సార్! రోడ్డు పక్క ఓ కాలు తెగిపడి ఉంది..
ఒట్టావా : కొద్ది రోజుల క్రితం కెనడాలోని డెల్టా పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన ఓ పోలీస్ అధికారి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆ పోలీస్ అధికారిని చూసిన ఓ కారు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కగా ఆపుచేశాడు. అనంతరం పోలీస్ దగ్గరకు వెళ్లి ‘‘ సార్! పంప్ హౌస్ దగ్గర రోడ్డు పక్కన ఓ కాలు తెగిపడి ఉంది’’ అని చెప్పాడు. దీంతో ఆ పోలీస్ అధికారి పంప్ హౌస్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ తెగిపడి ఉన్న కాలు కనిపించింది. దాని దగ్గరకెళ్లి చూసి, ఆశ్చర్యపోయాడు. అదో బొమ్మ కాలని తెలిసి నవ్వుకున్నాడు. ( చిరుతకు ఝలక్: ఈ జింక చర్య ఊహాతీతం ) డెల్టా పోలీస్ డిపార్ట్మెంట్ గత మంగళవారం తమ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో ఈ సంఘటన గురించి రాసుకొచ్చింది. ‘‘ మీ బొమ్మ ఎడమ కాలు పోయినట్లయితే.. డెల్టా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తీసుకెళ్లండి’’ అంటూ ఫన్నీగా స్పందించింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు.. ‘‘ ఆ డ్రైవర్ పరిశీలనా నైపుణ్యం అద్భుతం.. కామెడీ పీసు’’.. ‘‘ ఎడమ కాలు లేకుండా ఆ బొమ్మ ఎన్ని అవస్థలు పడుతోందో’’.. ‘‘ఆ పోలీస్ కాలినడకన పోయి కాలు కనుగొన్నాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( వైరల్: సింహానికే వణుకు పుట్టించాడు ) -
అరికాలి ఫొటోలతో లక్షలు ఆర్జిస్తున్నాడు
వాషింగ్టన్: ఓ వ్యక్తి తన పాదాలను ఫొటోలు తీసి అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. కాలు కదపకుండా సంపాదించడం, కాలు మీద కాలేసుకుని బతికేయడం అన్న పదాలకు ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా మారింది. అమెరికాలోని ఆరిజోనాకు చెందిన జాసన్ స్టార్మ్ కూర్చున్న చోట నుంచే డబ్బు సంపాదిస్తున్నాడు. ఆయన చేసేదేదో పెద్ద పెద్ద పనులు కూడా కాదు. కేవలం ఆయన తన రెండు కాళ్లను ఫొటోలు తీస్తాడు. ఆ తర్వాత దాన్ని ఆన్లైన్లో అమ్మకానికి పెడతాడు. వాటినెవరు కొంటారులే అనుకుంటున్నారా? కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అమ్మాయిలు, అబ్బాయిలు ఎగబడి మరీ వీటిని కొంటున్నారు. అలా కేవలం ఫొటోల ద్వారా ఆయన నెలకు సుమారు 4 వేల డాలర్లు(2.9 లక్షలు) ఆర్జిస్తున్నాడు. (చదవండి: వైరల్: ప్రేమ ఎంత మధురమో చూడండి..) ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 5 వేల ఫాలోవర్లు ఉన్న ఆయన తన కాలి ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో షేర్ చేస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా 'ఓన్లీఫ్యాన్స్' అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ఇందులో అతను షేర్ చేసే ఫొటోలు, వీడియోలను వీక్షించాలంటే ముందుగా చందా కట్టాల్సిందే. అందులో భాగంగా నెలకు సుమారు ఎనిమిది డాలర్లు, సంవత్సరానికైతే దాదాపు 81 డాలర్లు చందా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తనకు వేరే పని లేదని, కాళ్లపైనే తన జీవితాన్ని నెట్టుకొస్తున్నానని జాసన్ చెప్పుకొస్తున్నాడు. (చదవండి: సొంత బ్యాంకు, ప్రత్యేక కరెన్సీ!) View this post on Instagram Welcome to your mind control session.. 🔮 You are hypnotized by my perfect smooth hypnotic soles.. 🦶🏻🦶🏻 The more you resist the deeper you fall under the control of my feet You’ve never been so mesmerized 🤤 Watch the full video and get lost in my soles ⤵️ onlyfans.com/jasonstromm A post shared by Jason Stromm (@jasons_feet) on Aug 22, 2020 at 12:09am PDT -
సీఎం కాళ్లు మొక్కిన ముఖ్యమంత్రి
రాయ్‌పూర్ : మాములుగానేతై నేతలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కాళ్లు మొక్కుతుంటారు. కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడం ఎక్కడ చూసి ఉండరు. కానీ ఈ అరుదైన సంఘటన మన భారతదేశంలోనే ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రమణ్ సింగ్(66) వయసులో తన కంటే దాదాపు 20 ఏళ్లు చిన్న వాడైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(46) కాళ్లు మొక్కారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. వచ్చే నెల ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలోల రమణ్ సింగ్ రాజ్‌నందన్‌గావ్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో నామినేషన్ వేయడానికి వెళ్లే ముందు ఇలా యూపీ సీఎం యోగి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. నామినేషన్ అనంతరం ఇరు రాష్ట్రాల సీఎంలు రాజ్‌నందన్‌గావ్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే సీనియర్లు ఇలా యోగికి పాదాభివందనం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఏకంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యోగి ఆదిత్యనాథ్ ముందు శిరస్సు వంచి నిల్చుని ఉన్న ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి. -
జీహెచ్ఎమ్సీ తీరుపై సర్వత్రా విమర్శలు
-
హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు తొలగింపు
-
మాదారి బాటసారి
సాక్షి, సిటీబ్యూరో : ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణల తొలగింపునకు మూడు రోజుల స్పెషల్ డ్రైవ్ చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు.. తొలిరోజు శనివారం 1024 ఆక్రమణలను కూల్చివేశారు. నడక మార్గాలు లేకుండా విస్తరించిన దుకాణాలను ప్రత్యేక ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లతో కూల్చివేయడంపై పలు ప్రాంతాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. ఎంపిక చేసిన 48 మార్గాల్లో 127.5 కి.మీ. పరిధిలో 4133 ఆక్రమణలు గుర్తించిన అధికారులు.. వాటిని తొలగించేందుకు ఆరు బృందాలు రంగంలోకి దిగాయి. వీరిలో జీహెచ్ంఎసీ ఎన్ఫోర్స్మెంట్, టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, యూసీడీ విభాగాలతో పాటు ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగాల పోలీసు అధికారులు కూడా ఉన్నారు. తొలిదశలో శాశ్వత నిర్మాణాలపై దృష్టి.. ప్రధాన రహదారుల ఫుట్‌పాత్‌లపై పాదచారులకు దారి లేకుండా బడాబాబులు జబర్దస్తీగా చేపట్టిన శాశ్వత నిర్మాణాలను కూల్చివేశారు. పేదలు ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక దుకాణాల జోలికి వెళ్లలేదు. నగరంలోని ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలు తొలగించాలని హైకోర్టు పలు మార్లు జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీచేసిందని, జీహెచ్ఎంసీ చట్టం 504 సెక్షన్ మేరకు మూడు రోజుల స్పెషల్ డ్రైవ్ చేపట్టామని కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. స్ట్రీట్ వెండర్స్ పాలసీ అమలు.. కేంద్ర ప్రభుత్వ స్ట్రీట్ వెండర్స్ పాలసీ మేరకు నగరంలో ఇప్పటికే 24,580 మంది వ్యాపారులను గుర్తించి, వారిలో 22,324 మందికి గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. నగరంలో మొత్తం 135 వెండింగ్ జోన్లను తమ యూసీడీ విభాగం గుర్తించిందని, వీటిలో 24 జోన్లను నో వెండింగ్ జోన్లుగా గుర్తించారన్నారు. 77 జోన్లను ఫ్రీ వెండింగ్ జోన్లుగా, మరో 34 జోన్లను పాక్షిక విక్రయ జోన్లుగా ప్రకటించామన్నారు. చిరు వ్యాపారుల ఉపాధికి ఇబ్బంది లేకుండా ఈ వెండింగ్ జోన్లు ఉపకరస్తాయన్నారు. సానుకూల స్పందన: విశ్వజిత్ నగరంలో చేపట్టిన ఫుట్‌ఫాత్‌లపై ఆక్రమణల తొలగింపునకు నగర ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు. స్వల్ప ఘటనలు మినహా కూల్చివేతలు ప్రశాంతంగా జరిగాయన్నారు. జీహెచ్ఎంసీ ఈ స్పెషల్ డ్రైవ్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పలువురు పోస్టింగ్‌లు చేశారన్నారు. చార్మినార్ పాదచారుల పథకంలో భాగంగా అక్కడి నుంచి తొలగించిన చిరువ్యాపారులకు సాలార్జంగ్ మ్యూజియం ఎదుట నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జిపై ప్రత్యామ్నాయం చూపుతున్నట్లుగా ఇతర ప్రాంతాల్లోని వారికీ సమీప ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపాలని పలువురు సూచించారు. ఆరంభ శూరత్వం కారాదు.. జీహెచ్ఎంసీ చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌కు సానుకూలంగా స్పందించిన నగర పౌరులు.. ఇది కేవలం ఆరంభ శూరత్వం కారాదని, అన్ని ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించి ప్రజలు నడిచేందుకు అవకాశం కల్పించాలన్నారు. కొన్ని సర్కిళ్ల పరిధిలో కూల్చివేతలు ప్రారంభించకపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ వారు ఎలాంటి తారతమ్యం లేకుండా చూడాలన్నారు. గతంలో మాదిరిగా కొన్ని రోజులు.. కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయరాదనే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన కొన్ని ఫుట్‌ఫాత్‌లను బడా వ్యాపారులు తమ అవసరాలకు వినియోగిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ, అలాంటివాటినన్నింటినీ తొలగించాలనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. -
ఫుట్‌పాత్... మీ సొత్తే!
సాక్షి, సిటీబ్యూరో: ఫుట్పాత్లంటే పాదచారులు నడవడానికి ఏర్పాటు చేసినవి. కానీ నగరంలోని ఫుట్‌పాత్‌లపై పాదచారులు నడవలేరు. వాటిపైనే దుకాణాల విస్తరణ, ట్రాన్స్ఫార్మర్లు, ఏవి పడితే అవి పెట్టేశారు. దాంతో రోడ్ల వెంబడి నడకదారులు లేక ప్రజలు రోడ్డు మీద నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా మృత్యువాత పడుతున్న పాదచారులు ఏటా 500 మందికి పైగా ఉంటున్నారు. ఇది ఒకవైపు దృశ్యం..మరోవైపు కోణం పరిశీలిస్తే...గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని రోడ్ల పొడవు 9100 కి.మీ.లు.వీటిగుండా నిత్యం దాదాపు 59 లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. అయినప్పటికీ, రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడవడానికి ఫుట్‌పాత్‌లే లేవు. నగరం మొత్తమ్మీద ఉన్న ఫుట్పాత్లెన్నో తెలుసా.. దాదాపు 431 కి.మీ.లు. అంటే కనీసం ఐదు శాతం కూడా లేవు. ప్రధాన రహదారుల వెంబడి సైతం ఫుట్‌పాత్‌లు లేవు. దాంతో తరచూ ప్రమాదాల్లో పాదచారులు ప్రాణాలు కోల్పోతుండటంతో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాల్సిందిగా హైకోర్టు చాలాసార్లు జీహెచ్ఎంసీని ఆదేశించింది. కొన్ని పర్యాయాలు తొలగింపు చర్యలు చేపట్టారు. అది తూతూమంత్రంగా, మొక్కుబడి తంతుగానే మారింది. ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టగానే ఏవేవో ఆటంకాలు. ఒత్తిళ్లు. ఇతరత్రా కారణాలు. ఇలాంటి పరిస్థితి ఎదురవకుండా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించేందుకు...ప్రజల నడిచే హక్కు(రైట్ టు వాక్)ను అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ పకడ్బందీ ప్రణాళిక రచించింది. ప్రభుత్వం దాదాపు మూడునెలల క్రితం జీహెచ్ఎంసీకి ఐపీఎస్ అధికారి విశ్వజిత్‌ను విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, విపత్తునివారణ డైరెక్టర్‌గా నియమించింది. ఫుట్‌ఫాత్‌ల తొలగింపు సందర్భంగా ఎలాంటి పరిస్థితులెదురైనా ఎదుర్కొనేందుకు ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి ఆదేశాలతో తగిన ప్లాన్ చేశారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీస్ అధికారులతోనూ సమావేశం నిర్వహించారు. తొలగింపు చర్యలకు అవసరమైన ఆధునిక యంత్రసామాగ్రిని సమకూర్చుకున్నారు. సిబ్బందికి శిక్షణ నిచ్చారు. గ్రేటర్‌లోని ఆరు జోన్లకుగాను జోన్‌కొకటి చొప్పున ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. వీటిల్లో టౌన్‌ప్లానింగ్ అధికారులు, పోలీసు అధికారులతో సహా ఇరవైమంది ఉన్నారు. కూల్చివేతల సమయంలో ఎలా వ్యవహరించాలో శిక్షణనిచ్చారు. వారు తాము ఎలా పనిచేసేది శుక్రవారం జనార్దన్‌రెడ్డి, విశ్వజిత్లకు వివరించారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఫుట్‌ఫాత్‌లపై ఆక్రమణలు తొలగించనున్నారు. చిరు వ్యాపారులపై ప్రతాపం చూపరు.. తొలుత స్వచ్చందంగా ఆక్రమణల్ని తొలగించేందుకు అవకాశమిస్తామని తెలిపారు. చిరు వ్యాపారాలు చేసుకునేవారికి ఎలాంటి శిక్షలు విధించకుండా, వారు ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వేరే ప్రాంతంలో తమ వ్యాపారం ఏర్పాటుచేసుకునేందుకు తగిన స్థలం చూపుతామని పేర్కొన్నారు.ఫుట్‌పాత్‌లపై ర్యాంపులు ఏర్పాటు చేసి, ఫుట్‌పాత్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారిని మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. తొలగింపు సందర్భంగా అడ్డుకున్నా, తొలగించాక తిరిగి నిర్మాణం చేసినా భారీ జరిమానాలతోపాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. తొలిదశ చర్యల్లో భాగంగా ఒక్కో ప్రత్యేక బృందానికి 8 స్ట్రెచ్‌లు అప్పగించారు. ఒక్కో స్ట్రెచ్ పొడవు దాదాపు 3 కి.మీ.మొత్తం 48 స్ట్రెచ్‌ల్లో వెరసి దాదాపు 127 కి.మీ.ల మేర తొలగింపు స్పెషల్ డ్రైవ్ శనివారం నుంచి మూడురోజుల పాటు చేపట్టనున్నారు. తొలగించాల్సిన నిర్మాణాలు 4133 ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో తొలగింపుచర్యలు ఈ స్ట్రెచ్‌లలో ప్రత్యేక బృందం– 1 చాదర్‌ఘాట్ – రామ్‌కోఠి ఆంధ్రాబ్యాంక్– ఆబిడ్స్ అఫ్జల్‌గంజ్– ఎంజే మార్కెట్ ఖైరతాబాద్– అమీర్‌పేట, అమీర్‌పేట–సనత్‌నగర్ బ్రిడ్జి అమీర్‌పేట– బేగంపేట మెహదీపట్నం–టోలిచౌకి షాదన్కాలేజ్– పెన్షన్ హౌస్ ప్రత్యేకబృందం–2 మలక్‌పేట టవర్– దిల్సుఖ్నగర్ బస్‌డిపో రోడ్ దిల్సుఖ్నగర్ బస్‌డిపో రోడ్– చైతన్యపురి చైతన్యపురి– ఓమ్ని హాస్పిటల్ ఓమ్ని హాస్పిటల్– ఎన్టీఆర్ నగర్ ఎన్టీఆర్ నగర్– ఎల్బీనగర్ ఎల్బీనగర్ – నాగోల్ కర్మన్‌ఘాట్ – సంతోష్‌నగర్ ప్రత్యేకబృందం–3 ఐడీఏ బొల్లారం క్రాస్‌రోడ్– ఆల్విన్క్రాస్రోడ్, మియాపూర్ ఆల్విన్క్రాస్రోడ్, మియాపూర్– బాచుపల్లి నిజాంపేట్ క్రాస్‌రోడ్– హెచ్‌టీలైన్ రోడ్ నిజాంపేట్ క్రాస్‌రోడ్–కేపీహెచ్‌బీ జేఎన్టీయూ కాలేజ్–ఫోరమ్‌మాల్ కేపీహెచ్‌బీ 1ఫేజ్ – కూకట్పల్లి బీజేపీ కార్యాలయం మోతినగర్ క్రాస్‌రోడ్– బోరబండ బోరబండ – మోతినగర్ క్రాస్‌రోడ్స్ ప్రత్యేకబృందం–4 ప్యారడైజ్– క్లాక్‌టవర్ రేతిఫైలి బస్టాప్ – గురుద్వారా రాణిగంజ్– రసూల్‌పురా జంక్షన్ ప్యారడైజ్ హోటల్– మినిస్టర్ రోడ్ సంగీత్జంక్షన్ – రైల్‌నిలయం తార్నాక జంక్షన్– లాలాపేట ఫ్లై ఓవర్ అంబేద్కర్ విగ్రహం– శాంతినగర్ పద్మానగర్ పార్కు చుట్టూ రాణిగంజ్ జంక్షన్– బైబిల్ హౌస్ ప్రత్యేక బృందం– 5 లిబర్టీ జంక్షన్ – నారాయణగూడ సిగ్నల్ నారాయణగూడ సిగ్నల్ జంక్షన్– న్యూబోయిగూడ జంక్షన్ హిందీమహావిద్యాలయ– బర్కత్‌పురా సిగ్నల్ చేనెంబర్ జంక్షన్ గోల్నాక క్రాస్‌రోడ్– కాచిగూడ జంక్షన్ ట్రాఫిక్స్టేషన్ టూరిస్ట్హోటల్– కాచిగూడ జంక్షన్ ఆబిడ్స్– కాచిగూడ రామకృష్ణామ – హిందీమహావిద్యాలయ విద్యానగర్ క్రాస్‌రోడ్– చే నెంబర్ రోడ్ ప్రత్యేక బృందం–6 టోలిచౌకి– నారాయణమ్మ కాలేజ్ నారాయణమ్మ కాలేజ్– హెచ్‌సీయూ హెచ్‌సీయూ – గచ్చిబౌలి ఎఫ్ఓబీ గచ్చిబౌలి ఎఫ్ఓబీ– కొత్తగూడ క్రాస్‌రోడ్ కొత్తగూడ క్రాస్‌రోడ్–మియాపూర్ మియాపూర్– బీహెచ్ఈఎల్ కావూరిహిల్స్–కొత్తగూడ క్రాస్‌రోడ్ హెటెక్‌సిటీ సిగ్నల్– విప్రోసర్కిల్(ఐఎస్బీ) -
మానవత్వమా నీవెక్కడ?
ఒంగోలు టౌన్: ఊరుగాని ఊరు. నా అని పలకరించేవారు లేరు. ఒక్కసారిగా ఆమె భర్త ఆరోగ్యం క్షీణించింది. రిమ్స్‌లో చేర్పిస్తే.. ఇరవై రోజులు చికిత్స చేసి చేతులెత్తేసి తీసుకువెళ్లాలంటూ చెప్పారు. ఎటు వెళ్లాలో తెలియక నాలుగు రోజుల నుంచి కలెక్టరేట్లోని ఫుట్‌పాత్‌పైనే భర్తను పడుకోబెట్టి రెండేళ్ల బిడ్డను ఎత్తుకొని భిక్షాటనకు వెళుతోందా తల్లి. మొదటిరోజు కొంచెం కళ్లు తెరిచి చూసినా మూడు రోజుల నుంచి పూర్తిగా కోమాలోనే ఉన్నాడు. నిత్యం జన సంచారంతో రద్దీగా ఉండే కలెక్టరేట్ వద్ద ఇలా మూడు రోజులుగా ఓ వ్యక్తి అచేతనంగా పడిఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. శుక్రవారం పరిస్థితి మరింత విషమించింది. భర్త చనిపోయాడనుకుని దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో భిక్షాటన కోసం అతని భార్య వెళ్లింది. తోడుగా ఉంటున్న మామ తాగునీటి కోసం వెళ్లాడు. ఆ సమయంలో రెండేళ్ల చిన్నారి తన తండ్రి తల, చేతులను పట్టుకొని అటూ ఇటూ కదిలిస్తున్నాడు. సమీపంలో ఉన్న మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని గమనించి 1098కు సమాచారం ఇచ్చారు. హెల్ప్ ప్రోగ్రాం ఆఫీసర్ బీవీ సాగర్, చైల్డ్‌లైన్ ప్రతినిధి డి.దేవకుమారి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కోమాలో ఉన్న వ్యక్తిని లేపేందుకు ప్రయత్నిస్తే ఎలాంటి చలనం లేదు. రెండేళ్ల చిన్నారిని ఎత్తుకొని కొద్దిసేపు ఇటూ ఇటూ చూశారు. చివరకు ఆ బిడ్డ తల్లి వచ్చింది. తన దీనగాథను వారి వద్ద వెళ్లబోసుకుంది. తన పేరు నీలం అనూష అని, తన భర్త పేరు దుర్గాప్రసాద్ అని చెప్పింది. రాజమండ్రిలోని మండపేటలో ఉంటున్న తాము ఐదారేళ్ల క్రితం కాగితాలు ఏరుకుంటూ ఒంగోలు వచ్చామని తెలిపింది. ‘ఇక్కడ నా అనేవారు లేకపోయినా నా భర్త, రెండేళ్ల కుమారుడు, మామతో కలిసి ఫుట్‌పాత్‌పైనే ఉంటున్నాం. భర్త మద్యం దుకాణంలో పనిచేశాడు. నేను కాగితాలు ఏరుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. నా భర్త లివర్, గుండె చెడిపోవడంతో ఇరవై రోజుల క్రితం రిమ్స్ హాస్పిటల్లో చేర్పించాను. నాలుగు రోజుల క్రితం ఇక బతకడు తీసుకువెళ్లమంటే, కలెక్టరేట్ ఫుట్‌పాత్‌పైనే పడుకోబెట్టా...మూడు రోజుల నుంచి నా భర్తను పిలిచినా పలకడం లేదు.. కదలడం లేదు..’ అంటూ కన్నీళ్ల పర్యంతమైంది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో భిక్షాటన కోసం వెళ్లానని అనూష తెలిపింది. స్పందించిన సాగర్ తన వద్ద ఉన్న రూ.500 ఇచ్చి..రెండేళ్ల చిన్నారిని బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరచిన అనంతరం శిశుగృహలో చేర్పించాడు. సాయంత్రం ఆరుగంటల సమయంలో కూడా దుర్గాప్రసాద్ కోమాలోనే ఉన్నాడు. -
చుట్టేసి.. దూకేసి!
గ్రేటర్ వాసులకు మెట్రో డివైడర్లు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ), అమీర్‌పేట్–మియాపూర్(13 కి.మీ)మార్గంలో మెట్రో పిల్లర్ల మధ్యన ఎత్తయిన గోడలతో డివైడర్లు, పలు చోట్ల దూరంగా యూటర్న్లు ఏర్పాటు చేశారు. దీంతో పాదచారులకు రోడ్డు దాటడం కష్టంగా మారింది. వాహనదారులు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తోంది. ఆయా యూటర్న్ల వద్ద జీబ్రా క్రాసింగ్స్, పాదచారుల మార్గం లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. రాకపోకలు కష్టమై మెట్రో రూట్లో రహదారికి ఇరువైపులా వ్యాపారాలు సైతం పడిపోయాయి. బుధవారం ‘సాక్షి’ బృందం పరిశీలనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సాక్షి నెట్వర్క్: మెట్రో మార్గాల్లో డివైడర్ల నిర్మాణంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ఎత్తులో డివైడర్లు ఉండడం, అర కిలోమీటర్‌కు పైగా దూరంలో యూటర్న్లు ఏర్పాటు చేయడం, జీబ్రాక్రాసింగ్‌లు లేకపోవడంతోసిటీజనులు అవస్థలు పడుతున్నారు. దీంతో కస్టమర్లు రాక వ్యాపారాలు దివాళాతీస్తున్నాయని రోడ్‌సైడ్ వ్యాపారులు వాపోతున్నారు. నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ), అమీర్‌పేట్–మియాపూర్ (13 కి.మీ) మార్గాల్లో ‘సాక్షి’ బుధవారం విజిట్ నిర్వహించగా ఈ ఇబ్బందులు కళ్లకు కట్టాయి. సిగ్నల్స్ లేవ్... మలేసియాటౌన్‌షిప్:కూకట్పల్లి నుంచి మియాపూర్ మార్గంలో కొన్నిచోట్ల జిబ్రాక్రాసింగ్లు ఉన్నప్పటికీ సిగ్నల్స్, ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వాహనాలు, పాదచారులు ఏక కాలంలో రోడ్డు దాటుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ♦ కేపీహెచ్‌బీ కాలనీ రైల్వే స్టేషన్ దాటాక రామ్‌దేవ్‌రావ్ ఆసుపత్రి దగ్గర జిబ్రాక్రాసింగ్ ఏర్పాటు చేశారు. కానీఇక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ లేదు. దీంతో ఇప్పటికే చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ♦ కూకట్పల్లి, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్లు, నిజాంపేట్ క్రాస్‌రోడ్ ప్రాంతాల్లో సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసిన్పటికీ.. ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ♦ ఇక్కడ ప్రధాన రహదారికి ఇరువైపులా వస్త్ర, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. డివైడర్ల ఏర్పాటుతో వ్యాపారం తగ్గుముఖం పట్టిందని వ్యాపారులు వాపోతున్నారు. ఉప్పల్‌లో వ్యాపారులకు తిప్పలు.. ఉప్పల్: మెట్రో రైలు మార్గంలో పిల్లర్ల కింద నిర్మించిన డివైడర్లు స్థానిక వ్యాపారులకు శాపంగా మారాయి. దూరంగా యూటర్న్ ఏర్పాటు చేయడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న వాణిజ్య సముదాయాలకు 50 శాతం వరకు గిరాకీ తగ్గిందని వాపోతున్నారు. ఇలానే కొనసాగితే వ్యాపారాలు మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హబ్సిగూడ వీధి నెంబర్–8 నుంచి చౌరస్తా వరకు 1.5 కిలోమీటర్ల దూరంలో రెండే యూటర్న్లు ఉన్నాయి. దీంతో పాదచారులు చాలా దూరం నడవాల్సి వస్తోంది. దివాళా... డివైడర్ల కారణంగా మా వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. వీధి నెంబర్–8 వద్ద దారిని మూసేయడంతో మా పరిస్థితి మరింత దారుణంగా మారింది. దారి లేక కస్టమర్లు రాలేకపోతున్నారు. మాగోడు ఎవరూ వినడం లేదు. – ప్రసాద్, వ్యాపారస్తుడు ట్రాఫిక్ జంఝాటం.. గచ్చిబౌలి: జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుంచి హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ వరకు 2.7 కిలోమీటర్ల మార్గంలో ఐదు యూటర్న్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ మార్గంలో 26 క్రాసింగ్స్ ఏర్పాటు చేసినప్పటికీ.. అవన్నీ ఇరుకుగా మారడంతో సిటీజనులు రోడ్డు దాటేందుకు అవస్థలు పడుతున్నారు. ఇక ఈ రూట్లో ప్రధాన రహదారి ఇరుకుగా మారడంతో పార్కింగ్ సమస్యలతో కస్టమర్లు రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర కిలోమీటర్ నడవాల్సిందే.. సనత్‌నగర్/అమీర్‌పేట: అమీర్‌పేట్–ప్యారడైజ్ వరకు ఆరు యూటర్న్లు, అమీర్‌పేట్–ఎర్రగడ్డ వరకు మూడు యూటర్న్లు ఉన్నాయి. ఒక్కో యూటర్న్‌కు అరకిలోమీటరు పైగానే దూరం ఉంది. దీంతో పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత దూరం నడవలేక డివైడర్లు ఎక్కి ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ♦ ముఖ్యంగా అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, ఈఎస్ఐ మెట్రో స్టేషన్లకు దూరంలో యూటర్న్లు ఉండడంతో ప్రయాణికులు ఆటోకు రూ.50 చెల్లించి రోడ్డు దాటాల్సి వస్తోంది. ♦ యూటర్న్ల వద్ద లైటింగ్, రేడియం స్టిక్కర్లతో ఇండికేషన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ♦ అమీర్‌పేట్–సికింద్రాబాద్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా వ్యాపార, వాణిజ్య సముదాయాలే ఉంటాయి. ఈ మార్గం మొత్తం డివైడర్లు ఏర్పాటు చేయడంతో అటు.. ఇటు వెళ్లే దారిలేక షాపులకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. ఇక్కడ కాస్త బెటర్ సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఈస్ట్ – పరేడ్‌గ్రౌండ్స్ – ప్యారడైజ్ – రసూల్‌పురా మార్గంలో పరిస్థితి కొంచెం బెటర్‌గా ఉంది. సికింద్రాబాద్ ఈస్ట్ – పరేడ్‌గ్రౌండ్స్ వరకు మినహా మిగతా మార్గంలో డివైడర్ల సమస్య లేదు. ♦ ఈ మార్గంలో ప్యాట్నీ, ప్యారడైజ్ ఫ్లైఓవర్లకు సమాంతరంగా రోడ్డుకిరువైపులా ఫుట్‌పాత్ వెంబడి మెట్రో లైన్ ఏర్పాటు చేశారు. దీంతో గతంతో పోలిస్తే రోడ్డు దాటేందుకు పాదచారులకు కొత్తగా ఇబ్బందులేవీ లేవు. ♦ ఇక పరేడ్‌గ్రౌండ్స్ – సికింద్రాబాద్ ఈస్ట్ మార్గంలో పెద్దగా కమర్షియల్ జోన్ లేనందున వ్యాపారులకు ఎలాంటి సమస్యలు లేవు. ♦ ప్యారడైజ్ – రసూల్‌పురా స్టేషన్ల మధ్య దగ్గర్లోనే యూటర్న్ ఉంది. వ్యాపారం తగ్గింది.. డివైడర్ల ఏర్పాటుతో వ్యాపారం బాగా తగ్గింది. సుదూర ప్రాంతాల్లో యూటర్న్లు ఏర్పాటు చేయడంతో.. అంత దూరం వెళ్లలేక కస్టమర్లు షాపులకు రావడం లేదు. డివైడర్ల ఎత్తు తగ్గించి పాదచారులు రోడ్డు దాటేందుకు వీలు కల్పించాలి. అమీర్‌పేట్ స్టేషన్ దగ్గర ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేసినా పాదచారులను అనుమతించడం లేదు. – గులాబ్‌సింగ్, వ్యాపారవేత్త, అమీర్‌పేట్ సౌకర్యాలేవీ? మెట్రో మార్గాల్లో రోడ్డు దాటాలంటే నరకమే.! అసలు రోడ్డు దాటేందుకు వీలుగా దారి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా దూరంగా యూటర్న్ ఉన్నాయి. ఇక జిబ్రాక్రాసింగ్లే లేవు. పాదచారులు, వాహనదారులకు సౌకర్యాలు కల్పించాలి. – మంకయ్య, బల్కంపేట -
చార్మినార్‌కు నో ఎంట్రీ..
సాక్షి, సిటీబ్యూరో: చార్మినార్ పరిసరాల్లో పాదచారుల పథకంలో భాగంగా సోమవారం నుంచి వాహనాల రాకపోకలను నిషేధించారు. చార్మినార్‌కు నలువైపులా ఉన్న రోడ్లను బ్లాక్ చేశారు. కేవలం పాదచారులను మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే చార్మినార్ చుట్టూ తోపుడు బండ్లపై పండ్ల విక్రయాలను, స్ట్రీట్ వెండర్లను, దుకాణాలను ఎత్తివేశారు. దీంతో విసిగిపోయిన స్థానికులు సోమవారం ఆందోళనకు దిగారు. -
బీటెక్ విద్యార్థి దుర్మరణం
సాక్షి, నిజామాబాద్: ఫుట్‌బోర్డు ప్రయాణం బీటెక్ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. వివరా లు.. నగరంలోని ఆదర్శనగర్‌కు చెందిన తోకల దేవిదాస్, మమతలకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు మదన్‌కుమార్ (22) ఉన్నారు. ఆర్మూర్‌లోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాల లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న మదన్.. ఎప్పటిలాగే గురువా రం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు రెడీ కాగా, దేవిదాస్ అతడ్ని కంఠేశ్వర్ బస్టాప్ వద్ద దింపి వెళ్లాడు. ఆర్మూర్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు నిజామాబాద్ నుంచి మెట్‌పల్లికి వెళ్తుండగా, మదన్ అందులో ఎక్కాడు. ప్ర యాణికులు ఎక్కువగా ఉండటంతో అతడు ఫుట్‌బోర్డుపై నిలబడ్డాడు. బస్సు కొద్ది దూరం వెళ్లిందో లేదో.. ఫుట్‌బోర్డు పైనున్న మదన్ కాలుజారి కిందపడి పోయాడు. గమ నించిన తోటి విద్యార్థులు, ప్రయాణికులు గమనించి కేకలు వేసే లోపే.. బస్సు వెనుక చక్రాలు అతని తలపై నుంచి దూసుకెళ్లాయి. దీంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. క్షణాల్లో జరిగిన ఈ హఠాత్ పరిణామంతో విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. బోరుమన్న తల్లిదండ్రులు కొడుకును దింపి వెళ్లిన కొద్ది సేపటికే అతడు మృతి చెందాడని తెలియడంతో తండ్రి దిగ్భ్రాంతికి గురయ్యాడు. మదన్‌ను దిగబెట్టిన స్థలానికి హుటాహుటిన వచ్చి చూడగా విగతజీవిగా మారిన కొడుకును చూసి బోరుమన్నాడు. ఏకైక కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు ఎంతో హుషారుగా కళాశాలకు వెళ్లిన మదన్ శమమై తిరిగి రావడం కాలనీవాసులను కలచి వేసింది. విద్యార్థుల రాస్తారోకో.. మదన్ మృతి విషయం తెలిసి విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. కళాశాలల సమయంలో సరిపడా బస్సులు నడపకుండా ఆర్టీసీ అధికారులు విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకోకు దిగారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే మదన్ మృతి చెందాడని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏసీపీ సుదర్శన్, మూడో టౌన్ ఎస్సై కృష్ణ విద్యార్థులకు సర్దిచెప్పారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ టీవీయూవీ జిల్లా అధ్యక్షుడు లాల్‌సింగ్ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో రాస్తారోకో చేశారు. నగర సీఐ సుభాష్ చంద్రబోస్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో నాగేశ్వర్రావు, ఎస్సై గౌరేందర్ అక్కడకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఆర్టీసీ నుంచి రావాల్సిన బెనిఫిట్లు వస్తాయని, ఇందుకు తాము సహకరిస్తామని సీఐ హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు డిపో–1 మేనేజర్ ఆనంద్‌కుమార్‌ను కలిసి మదన్ కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవించారు. బస్సులు తక్కువగా ఉండటంతో విద్యార్థులు ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని, కళాశాలల సమయంలో బస్సుల ట్రిప్పులు పెంచాలని డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించిన మేనేజర్ బస్సు సర్వీసులు పెంచుతామని హామీ ఇచ్చారు. -
నో పార్కింగ్ 'జర్నీ'
మరో వారం రోజుల్లో సిటీలో మెట్రో రైలు కూతపెట్టనుంది. మెట్రో జర్నీకోసం కలలుగంటున్న సిటీజన్లకు.. పలు స్టేషన్ల వద్ద పార్కింగ్ సహా వసతుల లేమి స్వాగతం పలుకుతోంది. అరకొర పనులు..అసంపూర్తి నిర్మాణాలు చాలాచోట్ల దర్శనమిస్తున్నాయి. నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ), మియాపూర్–అమీర్‌పేట్ (13 కి.మీ) మార్గంలో ఈ నెల 28న ప్రధాని మోదీ చేతులమీదుగా మెట్రో రైలు ప్రారంభోత్సవం జరగనుంది. ఈనేపథ్యంలో ఆయా స్టేషన్ల వద్ద ప్రారంభానికి సన్నద్ధత ఎలా ఉంది? ప్రయాణికులకు కల్పించిన వసతులేమిటి తదితర అంశాలను రెండు కారిడార్ల పరిధిలోని 30 కి.మీ మార్గంలో ‘సాక్షి’ బృందం సోమవారం విస్తృతంగా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ విజిట్‌లో పలుస్టేషన్ల వద్ద సమస్యలే స్వాగతం పలికాయి. మొత్తం 24 స్టేషన్లకు గాను 11 చోట్ల మాత్రమే పార్కింగ్ వసతి ఉన్నట్లు తేలింది. మిగతా 13 చోట్ల వాహనాలు నిలపడం పెద్ద సమస్యే. మెట్రో స్టేషన్ల వద్ద ఇదీ పార్కింగ్ పరిస్థితి... మార్గం: నాగోల్–అమీర్‌పేట్ 17 కి.మీ మొత్తం స్టేషన్లు: 14 పార్కింగ్ వసతి ఉన్నవి: నాగోల్, ఉప్పల్, పరేడ్‌గ్రౌండ్స్, రసూల్‌పురా, బేగంపేట్, అమీర్‌పేట్ పార్కింగ్ వసతి లేనివి: స్టేడియం, ఎన్జీఆర్ఐ, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ వైఎంసీఏ, ప్యారడైజ్, ప్రకాశ్‌నగర్ మార్గం:మియాపూర్–ఎస్.ఆర్.నగర్ 13 కి.మీ మొత్తం స్టేషన్లు:10 పార్కింగ్ వసతి ఉన్నవి: మియాపూర్ టర్మినల్ స్టేషన్, బాలానగర్, కూకట్పల్లి, భరత్‌నగర్ పార్కింగ్ వసతి లేనివి: జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ, మూసాపేట్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్.ఆర్.నగర్ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ కలల మెట్రో కళ్ల ముందుకొస్తుంటే... స్టేషన్లలో వసతుల లేమి ప్రయాణికులకు నిరాశే మిగిల్చనుంది. మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సమస్య ప్రధానంగా మారింది. కొన్ని చోట్ల ప్రయాణికుల వాహనాలకు పార్కింగ్ స్థలమున్నా... బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు మాత్రం తగిన ఏర్పాట్లు లేవు. ఇక ముహూర్తం ముంచుకొస్తున్నా చాలా స్టేషన్లలో పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని స్టేషన్లలో ఫుట్‌పాత్‌లు నిర్మించనే లేదు. సుందరీకరణ పనులూ అంతంత మాత్రంగానే జరిగాయి. వ్యర్థాలు పేరుకుపోయి స్టేషన్లు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి. నవంబర్ 28న మెట్రో రైలు ప్రారంభం నేపథ్యంలో నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ), మియాపూర్–అమీర్‌పేట్(13 కి.మీ) మార్గంలోని 24 స్టేషన్లలో ‘సాక్షి’ సోమవారం విజిట్ నిర్వహించగా.. ఈ అసౌకర్యాలు కళ్లకు కట్టాయి. అమీర్‌పేట్ స్టేషన్ ⇒ ఇంటర్‌ఛేంజ్ మెట్రో స్టేషన్‌గా ఉన్న అమీర్‌పేటలో పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ⇒ ఫుట్‌పాత్ పనులు ఇంకా చేపట్టలేదు. ⇒ సుందరీకరణ పనుల ఊసే లేదు. ⇒ స్టేషన్ కింది భాగంలో వ్యర్థాలు పేరుకుపోయి డంపింగ్‌యార్డులా మారింది. ⇒ మెట్రో కింది భాగంలో లైటింగ్ వ్యవస్థ పూర్తి చేయాల్సి ఉంది. ⇒ ప్రయాణికుల వాహనాల నిలుపుదలకు సారథి స్టూడియో సమీపంలో పార్కింగ్ కేటాయించారు. కానీ లింక్ బస్సులు నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ లేదు. ⇒ అమీర్‌పేట్ రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రహదారిపైకి వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మియాపూర్ స్టేషన్ ♦ పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయలేదు. ♦ కొన్ని ప్రాంతాల్లో టైల్స్ వేసినా... ఎక్కువ భాగం ఇంకా చదును చేయాల్సి ఉంది. ♦ పచ్చదనం పనులు కొంతమేర మాత్రమే చేపట్టారు. ♦ హెలీ ప్యాడ్, పైలాన్ నిర్మాణం కొనసాగుతోంది. ♦ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, ఎస్కలేటర్ ఏర్పాటు చేశారు. బాలానగర్ ♦ స్టేషన్‌కు సమీపంలో ఎక్కడా పార్కింగ్ సౌకర్యం లేదు. రైలు ఎక్కేందుకు ట్యాక్సీలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వచ్చే ప్రయాణికులు స్టేషన్ సమీపంలోకి వస్తే ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ♦ సమీప కాలనీల నుంచి మెట్రో స్టేషన్ వరకు వచ్చేందుకు మినీ బస్సులు నడపాల్సిన అవసరం ఉంది. ♦ స్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్ పనులు కొనసాగుతున్నాయి. జేఎన్టీయూ ♦ పార్కింగ్ పనులు ఇప్పుడే ప్రారంభించారు. ♦ పచ్చదనం ఏర్పాటు చేసేందుకు స్థలం కూడా లేదు. ♦ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు ఏర్పాటు చేశారు. ఎర్రగడ్డ ♦ ప్రయాణికుల వాహనాలకు పార్కింగ్ వసతి లేదు. ♦ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు తగిన ఏర్పాట్లు లేవు. ♦ ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయలేదు. ♦ ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు వస్తే ట్రాఫిక్ తప్పదు. ఈఎస్ఐ ♦ ఈ స్టేషన్లోనూ పార్కింగ్‌కు అవకాశం లేదు. ♦ స్టేషన్ నిర్మాణం కారణంగా ప్రధాన రహదారి రెండు వైపులా 30 ఫీట్లకు తగ్గిపోవడంతో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు చిక్కులు తప్పవు. ♦ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, ఫుట్‌పాత్‌లు నిర్మించారు. ♦ స్టేషన్‌కు ఒకేసారి అధిక సంఖ్యలో జనం తరలివస్తే ట్రాఫిక్ తప్పదు. మూసాపేట్ ♦ బైక్‌లు, కార్లకు పార్కింగ్ లేదు. బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదు. వీటిని ఎక్కడ నిలపాలనే దానిపై ఇంకా ఓ క్లారిటీ లేనట్టు తెలుస్తోంది. ♦ టైల్స్ నిర్మాణం కొనసాగుతోంది. అనుకున్నంత స్థాయిలో హరితం లేదు. ♦ పారిశుధ్య లోపం కనిపిస్తోంది. ♦ ఫుట్‌పాత్‌లు ఇంకా ఏర్పాటు చేయలేదు. కేపీహెచ్‌బీ ♦ ఈ మెట్రో స్టేషన్‌కు పార్కింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద లోటే. ఇక్కడ స్టేషన్ లోపల అన్ని వసతులు ఏర్పాటు చేశారు కానీ పార్కింగ్‌పై అధికారులు దృష్టి సారించలేదు. ♦ ట్యాక్సీలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వచ్చే ప్రయాణికులు స్టేషన్ సమీపంలో దిగడానికి వస్తే ట్రాఫిక్ జామయ్యే అవకాశం ఉంది. ♦ సమీప కాలనీల నుంచి మెట్రో స్టేషన్ వరకు వచ్చేందుకు మినీ బస్సులు నడపాల్సిన అవసరం ఉంది. ♦ స్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్ పనులు కొనసాగుతున్నాయి. ఎస్ఆర్ నగర్ ♦ పార్కింగ్ స్థలం లేదు. ♦ ప్రధాన రహదారి కుంచించుకుపోవడంతో ఈ మార్గంలో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు వీలుగా ప్రత్యేక మార్గాలు లేవు. ♦ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు. ♦ ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడ దిగి ప్రధాన రహదారిపైకి తరలివస్తే ట్రాఫిక్ చిక్కులు తప్పవు. కూకట్పల్లి ♦ ఈ స్టేషన్‌కు పార్కింగ్ వసతి లేదు. ఇదే ఇక్కడ పెద్ద సమస్య. బయట నుంచి వచ్చే వాహనాలు ఎక్కడ నిలపాలో తెలియని పరిస్థితి ఉంది. ♦ ఈ స్టేషన్ సమీపంలో బస్స్టేషన్లు ఉండడం కొంత అనుకూలం. బస్సుల్లో వచ్చి ఇక్కడి నుంచి మెట్రో రైలులో ప్రయాణించవచ్చు. ♦ సమీప కాలనీలకు కనెక్టివిటీ వాహనాలు నడపాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రైవేట్ క్యాబ్‌లు, ఆటోలు ఆశ్రయించాల్సి వస్తుంది. భరత్‌నగర్ ♦ ప్రయాణికుల వాహనాలకు పార్కింగ్ సదుపాయం లేదు. ♦ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు తగినంత స్థలం లేదు. ♦ ఫుట్‌పాత్‌లు, పచ్చదనం కానరాలేదు. ♦ ఎక్కడి టైల్స్ అక్కడే పడేసి ఉన్నాయి. ♦ ప్రయాణికులు చాలా జాగ్రత్తగా బయటకు వెళ్లాలి. పక్కన మూసీ నది నాలా ఉంది. చిన్నపాటి రక్షణ ఏర్పాట్లు చేసి వదిలేశారు. బేగంపేట్ ♦ స్టేషన్‌కు ఒకవైపే మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. రెండు రైళ్లు ఒకేసారి వస్తే.. ప్రయాణికులందరూ ఒకే మార్గం గుండా రోడ్డు మీదకు రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బ్రిడ్జి కింది నుంచే వాహనాలతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ♦ ఇక ఫుట్‌పాత్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ♦ ప్రయాణికుల వాహనాలకు సరిపడా పార్కింగ్ స్థలం లేదు. ♦ స్టేషన్ కింది భాగం వ్యర్థాలు, చెత్తాచెదారంతో నిండిపోయింది. ♦ లైఫ్‌స్టైల్ బిల్డింగ్ వైపున్న లిఫ్ట్ ఎదుట కేబుళ్లు వదిలేశారు. ప్రకాష్‌నగర్ ♦ పేరుకే ప్రకాష్‌నగర్ మెట్రో స్టేషన్. ఇది ఆ ప్రాంతానికి సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంది. ♦ పార్కింగ్ స్థలం లేనే లేదు. పార్కింగ్ కోసం రసూల్‌పురా చౌరస్తాలో కేటాయించిన ప్రాంతానికి వెళ్లాల్సిందే. ♦ ఫుట్‌పాత్ పనులు కొనసాగుతున్నాయి. ♦ నిర్మాణ వ్యర్థాలు, చెత్తా చెదారం షరామామూలే. ♦ బేగంపేట్ రహదారి మధ్యలో మెట్ల మార్గం ఉండడంతో ప్రయాణికులు ఒకేసారి రోడ్డు మీదకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మెట్టుగూడ ♦ స్టేషన్‌కు ఓ వైపు రైల్వే క్వార్టర్లు, మరోవైపు ప్రైవేట్ భవనాలు, అపార్టుమెంట్లు ఉన్నాయి. దీంతో పార్కింగ్ స్థలం లేకుండా పోయింది. ♦ ఫుట్‌పాత్ పనులు జరుగుతున్నాయి. ♦ ట్రాఫిక్‌జామ్‌తో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. హబ్సిగూడ ♦ ప్రత్యేకంగా పార్కింగ్ లేదు. అయితే బస్టాప్ నుంచి మరికొంత దూరం వరకు వాహనాలు నిలుపుకోవచ్చు. ♦ స్టేషన్‌కు రెండు వైపులా బస్టాపులు ఉన్నాయి. ♦ సారథి స్టూడియోను ఆనుకొని విశాలమైన బస్బే ఉంది. ♦ సుప్రభాత్ హోటల్ దగ్గర ఇంకా ఫుట్‌పాత్ పనులు జరుగుతున్నాయి. రసూల్‌పురా ♦ పార్కింగ్ స్థలం కేటాయించినప్పటికీ అందులో చెత్తాచెదారం పేరుకుపోయింది. చదును చేయాల్సి ఉంది. ♦ ఫుట్‌పాత్‌ల నిర్మాణం అసంపూర్తిగా ఉంది. ♦ అందమైన పూల మొక్కలు తెచ్చారు. కానీ నాటలేదు. ♦ నిర్మాణ వ్యర్థాలు ఎక్కడికక్కడే గుట్టులుగా ఉన్నాయి. ప్యారడైజ్ ♦ స్టేషన్‌కు కిలోమీటర్ దూరంలో పార్కింగ్ స్థలం ఉంది. ♦ ఫుట్‌పాత్ పనులు 20 శాతమే పూర్తయ్యాయి. ♦ హరితం ఊసే లేదు. ♦ చాలా పనులు చేయాల్సి ఉంది. పరేడ్‌గ్రౌండ్ ♦ ఈ స్టేషన్లో ప్రయాణికులకు అనువైన వసతులున్నాయి. ♦ జీహెచ్ఎంసీ కార్యాలయ భవనం, రక్షణశాఖ స్థలం, మరోవైపు పెట్రోలుబంక్ స్థలాన్ని మెట్రో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ♦ అయితే విశాలమైన పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైనంత స్థలం ఉన్నప్పటికీ... ఆ దిశగా పనులు నేటికీ ప్రారంభం కాలేదు. సికింద్రాబాద్ ఈస్ట్ ♦ చాలా ఇరుకైన ప్రదేశంలో ఈ స్టేషన్ ఉంది. ♦ ఫుట్‌పాత్‌లు నిర్మించలేదు. ♦ క్యాబ్‌లు, కార్లలో వచ్చి ప్రయాణికులు చాలా దూరంలో దిగి రావాల్సిందే. ♦ మెట్రో అధికారులు స్వాధీనం చేసుకున్న గోపాలపురం పోలీస్ స్టేషన్ భవనం స్థలాన్ని పార్కింగ్‌కి కేటాయిస్తారని ప్రచారం జరిగినా... నేటికీ ఆ దిశగా పనులు జరుగలేదు. సదరు స్థలాన్ని చదును చేసి ప్రస్తుతం స్క్రాప్ వస్తువుల కేంద్రంగా వాడుతున్నారు. తార్నాక ♦ ప్రయాణికులు తమ వాహనాలు పార్క్ చేసేందుకు స్థలం లేదు. ♦ స్టేషన్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గం చాలా ఇరుగ్గా ఉంది. మున్సిపల్ వాటర్ ట్యాంకర్ ఉంది. ♦ వాహనాలను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లు, డీసీఎంలు వందలాదిగా వస్తాయి. ♦ దీంతో ప్రయాణికులు ఎటువైపు వెళ్లాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ♦ ట్రాఫిక్ రద్దీకి అవకాశం ఉంది. ఫుట్‌పాత్ పనులు ఇంకా జరుగుతున్నాయి. ఎన్జీఆర్ఐ ♦ ద్విచక్ర వాహనాలకు మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంది. ♦ పెద్ద వాహనాలు నిలిపేందుకు అవకాశం లేదు. ♦ స్టేషన్‌కు రెండు వైపులా ఫుట్‌పాత్‌లు లేవు. ♦ వర్షాకాలం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నీళ్లు నిలుస్తాయి. స్టేడియం ♦ ఈ స్టేషన్‌కు రెండు వైపులా రోడ్డు ఇరుకుగా ఉంది. ♦ ప్రయాణికుల రాకపోకలకు ఫుట్‌పాత్‌లు ఉన్నప్పటికీ, ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో స్టేషన్ దిగి వెళ్లేటప్పుడు వాహనాల రద్దీ నెలకొనే అవకాశం ఉంది. ♦ హబ్సిగూడ వైపు వెళ్లే మార్గంలో ఫుట్‌పాత్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ♦ స్టేడియానికి ఇరువైపులా మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ♦ రోడ్ల తవ్వకాల కోసం భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. అటు వైపు ప్రయాణికులు ఎక్కడం, దిగడం చాలా కష్టం. ♦ పైపులైన్ పనులతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఉప్పల్ ♦ ఇక్కడ ద్విచక్ర వాహనాలకు మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంది. ♦ కార్లు, బస్సులు, ఆటోలు తదితర పెద్ద వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలాలు లేవు. ♦ రెండువైపులా బస్టాపులు ఉన్నాయి. ప్రయాణికులు నేరుగా బస్టాపులకు వెళ్లేందుకు అవకాశం ఉంది. ♦ ఫుట్‌పాత్‌లు, గ్రీనరీ ఏర్పాటు చేశారు. నాగోల్ ♦ వాహనాలకు పార్కింగ్ సదుపాయం లేదు. ♦ స్టేషన్‌కు ఎదురుగా రెండకరాల్లో డంపింగ్ యార్డ్ ఉంది. దుర్గంధంతో ప్రయాణికులు ముక్కు మూసుకోవాల్సిందే. ♦ స్టేషన్‌కు సమీపంలోనే ఆర్టీఏ కార్యాలయం ఉంది. ప్రతిరోజు వందలాది వాహనాలతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. ♦ జనం ఒకేసారి రోడ్డు మీదకు వస్తే ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోవాల్సిందే. ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఎక్కువ. అదే పెద్ద సమస్య.. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే మెట్రోకు పార్కింగ్ సదుపాయం లేకపోవడం శోచనీయం. మెట్రో ప్రయాణానికి ఇదే పెద్ద సమస్యగా మారింది. అలాగే చార్జీలపై స్పష్టత లేదు. అందరికీ అందుబాటులో చార్జీలుండాలి. – ఎస్.అనిల్‌రెడ్డి, ఉప్పల్ పార్కింగ్ ఏదీ? మెట్రో రైలులో ప్రయాణించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. అయితే కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీలోని మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం లేదు. దీంతో మాకు ఇబ్బందలు తప్పేలా లేవు. – స్వామి, కూకట్పల్లి ఇప్పటికైనా..? కూకట్పల్లి, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ పార్కింగ్ సదుపాయం కల్పించకపోవడం దారుణం. అధికారులు ఇప్పటికైనా స్పందించి పార్కింగ్ ఏర్పాటు చేయాలి. – నరసింహ, కేపీహెచ్‌బీ పనుల్లో జాప్యం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముహూర్తం ఖరారైన పనులు ఇంకా పూర్తి కాలేదు. పార్కింగ్, షాపింగ్ మాల్ల పనులు ఎప్పడో చేయాల్సి ఉంది. ఇక సౌకర్యాలు ఎలా ఉంటాయో చూడాలి. పార్కింగ్ ఫీజు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించాలి. – కిరణ్, గచ్చిబౌలి -
గూడులేని పక్షులు
నిరాశ్రయులకు షెల్టర్ల నిర్మాణంలో అంతులేని జాప్యం.. ఆదిలాబాద్‌లోని ప్రధాన మార్కెట్ దారిలో డివైడర్‌పై కర్రలు, గోనె సంచుల సహాయంతో గుడిసెను ఏర్పాటు చేసుకున్న యాచకురాలు.. ఎదురుగా భిక్షాటన చేస్తున్న దృశ్యం.. ఆదిలాబాద్ నుంచి గొడిశెల కృష్ణకాంత్‌గౌడ్ : నిరాశ్రయులు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ.. కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారికి ఆశ్ర యం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ‘జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్’ (నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్) కింద నిధులు మంజూరు చేస్తుంది. ప్రధానంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆస్పత్రుల సమీపంలో స్థలాలను గుర్తించి అక్కడ ఆశ్రయం కోసం శాశ్వత భవనా లను నిర్మించడం పథకం ఉద్దేశం. ఈ పథకం కింద పలుచోట్ల ఇప్పటికే తాత్కాలిక షెల్టర్లు కొనసాగుతున్నాయి. నగరాల్లో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా వీటిని నిర్మిస్తున్నారు. ఆశ్రయాల్లో సౌకర్యాలూ ఉండాలి... ఆశ్రయాల్లో తాగునీరు, టాయిలెట్స్, బెడ్లు, మెడికల్ వసతి కల్పించాల్సి ఉంది. పలు పట్టణాల్లో నిరాశ్రయులను గుర్తిం చినప్పటికీ షెల్టర్లు, శాశ్వత భవన నిర్మాణాలను చేపట్టలేదు. స్థల ఎంపిక కూడా దీనికి సమస్యగా మారుతోంది. నిరాశ్రయులంటే యాచకులు మాత్రమే కాదు.. నిరాశ్రయులంటే కేవలం యాచకులనే అపోహ ఉంది. కానీ ఇళ్లు లేని అనేక మంది పొద్దంతా పనిచేసి సాయంత్రం అరుగులపై, రోడ్ల పక్కన చిన్నచిన్న గుడిసెలు వేసుకుని జీవిస్తుంటారు. రిక్షాలు, ఆటోలు నడిపేవారు సైతం ఇల్లు దూరప్రాంతంలో ఉంటే రెండు రోజులకు ఓసారి వెళ్లి వస్తుంటారు. అలాంటి వారు సైతం రోడ్డు పక్కనే పడుకుంటుంటారు. పల్లె విడిచి పట్టణానికి వలస వెళ్లిన కార్మికులు ఎందరో సరైన పడుకునే వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. వివిధ కారణాలతో కుటుంబ సభ్యులను వదిలి వచ్చిన వారు, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు బానిసలైన వారు కూడా రోడ్డుపక్కనే పడుకుని ఉంటారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆశ్రయాల నిర్మాణానికి ముందుకొచ్చి నిధులు మంజూరు చేస్తోంది. ఇక్కడ గుర్తింపునకే పరిమితం.. కొత్తగూడెంలో 103, మంచిర్యాల 79, ఆదిలాబాద్ 79, వేములవాడ 60, నిర్మల్ 49, కామారెడ్డి 40, భువనగిరి 55, భైంసా 48, ఆర్మూర్‌లో 43 మంది నిరాశ్రయులను గుర్తించారు. మిగతా పట్టణాల్లోనూ స్వల్ప సంఖ్యలో నిరాశ్రయులు ఉన్నారు. -
పాదం తొక్కేస్తోందా?
ముందడుగు వేసేది పాదమే ముందంజలో ఉంచేదీ పాదమే పాదానికి ప్రాబ్లమ్ వస్తే వెనకబడిపోతాం అవును... పడిపోతాం పాదాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఆరోగ్యాన్నే తొక్కేస్తుంది. పాదం... పదిలం! కాలు లేకపోతే కదలిక లేదు. పాదం కదలకపోతే పురోగతి లేదు. అంతెందుకు పాదంలో ఏదైనా సమస్య ఉండి కాళ్లను కదిలించలేక పోతే మన క్యాలరీల ఖర్చు తగ్గుతుంది. దాంతో మొత్తం ఆరోగ్యమే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చిన్నప్పటి నుంచి కాళ్లు కదలాలి. కదలిక ఉండాలి. అంటే వ్యాయామ రూపంలోనన్నమాట. అప్పుడే ఆరోగ్యం ఉంటుంది. ఇది కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కాదు... మానసిక ఆరోగ్యానికి కూడా. పిల్లల్లో ఏమాత్రం కదలికలు లేకుండా ఇంటికే పరిమితమయ్యేవారు, ఏవో కారణాలతో కాళ్లు కదలికలు మందగించి మంచానికే అంటిపెట్టుకుని ఉండేవారిలో కొన్ని మానసిక సమస్యలూ కనిపించవచ్చు. తాము బయటికి వెళ్లకపోవడం, నలుగురిలో కలవకపోవడంతో డిప్రెషన్ వంటి సమస్యలూ రావచ్చు. అంతేకాదు... పోటీతత్వం మందగించి మందకొడిగానూ మారిపోవచ్చు. పిల్లల్లో ఆ పరిస్థితి రానివ్వకుండా చూసుకుంటే చదువుల్లో, ఆటల్లో, ఎదిగాక సమాజంలోనూ వారిది క్రియాశీల భూమిక. అంత కీలకమైనది కాలు. చలనశీలమైనది పాదం. ఆ పాదం గురించి కొన్ని విషయాలు ఆపాదం నుంచి మస్తకంలోకి వెళ్లడానికి ఈ కథనం. పాదాల నిర్మాణం: మానవ పాదంలో 26 ఎముకలు ఉంటాయి. మానవ శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. అంటే రెండు పాదాల్లోనూ కలుపుకుంటే 52 కాబట్టి... ఒక వ్యక్తిలో ఉండే మొత్తం ఎముకల్లోని నాలుగో వంతు పాదాల్లోనే ఉంటాయన్నమాట. 107 లిగమెంట్లు, 19 కండరాలు ఉంటాయి. ఒక వ్యక్తి బరువంతా మోయడానికి వీలుగా పాదం విశాలంగా రూపొందింది. మొదటి నష్టం షూస్ లేదా పాదరక్షలతోనే... ప్రతి వ్యక్తిలోనూ 20 ఏళ్ల వయసు వచ్చే వరకూ పాదం పూర్తిగా రూపొందే ప్రక్రియ పూర్తి కాదు. కానీ మారుతున్న జీవనశైలి ప్రకారం చిన్నప్పట్నుంచే ప్రతివారి పాదాలనూ షూలతో బిగించి ఉంచడం సాధారణమైంది. బుడిబుడి అడుగులు వేసే బుడతల పాదాలను సైతం రంగురంగుల సాక్స్ లేదా షూలతో బిగిస్తుంటారు. దీనివల్ల వచ్చే చిన్న చిన్న లోపాలే పెద్దయ్యాక నడకలో నష్టం కలిగించే అవకాశం ఉంది. హైహీల్ వల్ల నష్టాలు ఎందుకంటే... జీవులు తమ నాలుగు కాళ్ల మీద నడవడానికి అనువుగా రూపొందాయి. కానీ మనిషి తన రెండు కాళ్ల మీదే మొత్తం బరువు మోపేలా ముందు వైపు లింబ్స్‌ను చేతులుగా రూపొందించుకుంటూ నిటారుగా నిలబడ్డాడు. దాంతో మనిషి బరువంతా రెండు కాళ్ల మీద వెన్ను మీద పడటం ప్రారంభమైంది. మన వీపు భాగం ఇంగ్లిష్ అక్షరమైన ‘ఎస్’ అనే ఆకృతితో ఉంటుంది. వెన్నెముక ఉన్న జీవులన్నీ నడిచే సమయంలో పడే ఒత్తిడిని గణనీయంగా తగ్గించడానికి ఈ ‘ఎస్’ ఆకృతి ఉపకరిస్తుంది. హైహీల్స్ తొడగడం వల్ల నడుం భాగంలో ఉండే వీపు (లంబార్) ప్రాంతం తన ఒంపును కోల్పోయి నిటారుగా అవుతుంది. ఆపైన ఉండే ఛాతీ భాగంలోని వెనకభాగపు వీపు (థొరాసిక్ లేదా మిడ్ బ్యాక్), మెడ, తల... ఇవన్నీ సాధ్యమైనంత నిటారుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలో మనిషికి స్వాభావికంగా ఉండే ‘ఎస్’ ఆకృతి ఒంపు కాస్తా నిటారుగా మారుతుంది. దాంతో కండరాలపై ఉండాల్సినదాని కన్నా ఒత్తిడి అధికమవుతుంది. పైగా వాటిని సరైన అలైన్మెంట్లో లేకుండా అదేపనిగా ఉపయోగించడం వల్ల కండరాలు దెబ్బతిని నొప్పి వస్తుంటుంది. హైహీల్స్ ఇష్టపడేవారికి టిప్స్ ⇒రోజంతా హైహీల్స్ మాత్రమే వేసుకోకండి ⇒మధ్యాహ్నం లేదా సాయంత్రాలే షాపింగ్ చేయండి. ఆ సమయంలో మీ పాదాల ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. ⇒మీ హైహీల్ షూను ఎంచుకునే సమయంలో ఒకదాని తర్వాత మరొకటి ధరించి కాకుండా... రెండింటినీ ఒకేసారి వేసుకుని నడిచి చూడండి. (ఒక్కోసారి హీల్ నిడివిలోనూ మార్పు ఉండవచ్చు. రెండింటినీ ఒకేసారి వేసుకుంటే ఆ తేడా తెలిసేందుకు అవకాశం ఎక్కువ) ⇒ మీ మడమ వెడల్పులో మడమ ఎత్తు సగం ఉంటే అది సరైన ఆరోగ్యకరమైన హీల్ అని గుర్తుంచుకోండి. ⇒ మీరు హైహీల్స్ తొడిగే ఫ్రీక్వెన్సీ ఎంత తగ్గితే మీకు దాని వల్ల వచ్చే నొప్పులూ అంతగా తగ్గుతాయి ఠి పాయింటెడ్ హైహీల్స్ లేదా మరీ బిగుతుగా ఉండే షూస్ వేసుకోవద్దు ⇒మీరు హైహీల్స్ వేసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రమాదాల వల్ల అసలు పాదరక్షలే తొడగలేని పరిస్థి తి కూడా తలెత్త వచ్చని గుర్తుంచుకోండి ⇒హైహీల్స్ వేసుకునే ముందు మీ మోకాలి కింద వెనక భాగంలో ఉండే కాఫ్ మజిల్స్‌ను కాసేపు రుద్దుకుంటూ వార్మప్ మసాజ్‌లా చేయండి. కాఫ్ మజిల్స్‌కు ప్రతిరోజూ తగినంత వ్యాయామాన్ని, స్ట్రెచింగ్‌ను ఇవ్వండి ⇒ మీరు నిర్దేశించుకున్న సమయం కంటే ఎక్కువ సేపు హైహీల్స్ వేసుకుంటే... అవి విడిచాక కాసేపు రెండు కాళ్లూ కాస్తంత దూరంగా పెట్టి పాదాలు నేలకు ఆనేట్లుగా ఉంచి కాసేపు అలాగే నిలబడండి. ఈ సమయంలో ముందుకు వంగి మోకాళ్లు ఒంగకుండా చేతి వేళ్లతో కాలివేళ్లను ముట్టుకునే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ను చేయండి ⇒హైహీల్స్ తొడిగినప్పుడు నొప్పిగా ఉంటే అలా భరిస్తూ నడక కొనసాగించకండి. వెంటనే వాటిని విడిచేయండి. పాదాలలో పగుళ్లు పాదాల పగుళ్లకు అలర్జీలు మొదలుకొని చాలా కారణాలు ఉండవచ్చు. శరీరానికి తగిన నీరు అందకపోతే కూడా కాళ్లకు పగుళ్లు ఏర్పడతాయి. మనం వాడే సబ్బు, తీసుకునే ఆహారంలో న్యూట్రిషన్ పాళ్లు తక్కువగా ఉండటమూ కారణం కావచ్చు. కాళ్ల పగుళ్లకు బ్యాక్టీరియా/ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణమైతే ఒక్కోసారి అవి పగుళ్ల నుంచి పుండ్లుగా మారొచ్చు. అందుకే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్నిసార్లు డయాబెటిస్/థైరాయిడ్ /ఒబేసిటీ లాంటివీ కాళ్ల పగుళ్ల సమస్యకు కారణం కావచ్చు. పాదాల పగుళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఈ కింది సూచనలు పాటించాలి. మంచినీటిని ఎక్కువగా తాగాలి. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి కాళ్లను కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి, శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత పొడిబట్టతో శుభ్రంగా, తడిలేకుండా తుడవాలి. మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండే క్రీములను కాళ్లకు రాసుకొని సాక్సులను ధరించాలి. రాత్రంతా సాక్స్‌లు ధరించడం మంచిది. కాలికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో... పాదాలకు వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యమైన కొన్ని సమస్యలివే... ఆనెకాయలు: షూ వల్ల ఒకేచోట నిరంతరం ఒత్తిడి పడుతుండటం వల్ల ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. దాంతో అక్కడ మృతకణాలు చేరుతూ పోవడం వల్ల ఈ ఆనెకాయలు వస్తుంటాయి. కొందరు ఆనెకాయలను బ్లేడుతో కోసేస్తుంటారు. మరికొందరు ఆనెకాయలపై కొన్ని చుక్కల యాసి పోస్తూంటారు. కానీ ఆనెకాయలు వస్తే దాని చుట్టూ ప్లాస్టర్ వేసి డాక్టర్‌కు చూపించాలి. బ్యూనియన్: కొందరికి షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల కాలి బొటనవేలు లోపలి వైపునకు నొక్కుకుపోయి, దాని వెనకవైపు ఎముక ముందుకు పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. ఈ సమసయను ‘బ్యూనియన్’ అంటారు. కొందరిలో ఇది వారసత్వంగానూ కనిపిస్తుంది. షూ వల్ల మరింత పెరుగుతుంది. షూ ఒరుసుకుపోతున్న చోట... పాదం తనను తాను రక్షించుకునేందుకు మరో అదనపు కణజాలాన్ని వృద్ధి చేసుకుంటుంది. ఇలాంటి సందర్భాల్లో సమస్య ఉన్నవారు డాక్టర్‌ను కలిసి, అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం. అథ్లెట్స్ ఫుట్ : ఈ సమస్య ఫంగస్ కారణంగా వస్తుంది. నిజానికి ఈ ఫంగస్ ఎప్పుడూ పాదాలపై ఉండే ఉంటుంది. కానీ పాదం నిత్యం తేమ, తడిలో ఉన్నప్పుడు ఆ ఫంగస్ పెరిగి, చర్మం చిట్లి, అథ్లెట్స్ ఫుట్ సమస్య వస్తుంది. అరికాళ్లలో ఉండే చెమట గ్రంథుల స్రావంతోనూ పాదం చెమ్మబారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటప్పుడు పాదాన్ని శుభ్రంగా కడిగి, వీలైతే ఆల్కహాల్ ఉన్న వాష్లను ఉపయోగించి శుభ్రం చేసి, పాదాల మీద పౌడర్ చల్లి, ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకుంటే పాదం ఆరోగ్యంగా ఉంటుంది. సమస్య తీవ్రతను బట్టి యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సి రావచ్చు. బొటనవేలి గోరు లోపలికి పెరగడం : కొందరికి బొటనవేలిపై ఉన్న గోరు లోపలివైపునకు పెరుగుతూ ఉంది. ఇలా జరగకుండా చూసుకోవాలంటే కాలి గోర్లు తీసే సమయంలో మూలల్లో మరీ చిగుర్ల నుంచి కాకుండా కాస్తంత దూరం నుంచే కట్ చేసుకుంటే ఈ సమస్యను ఎప్పటికీ రాకుండా చూసుకోవచ్చు. పాదాలకు తిమ్మిర్లు పట్టడం : పాదానికి తిమ్మిర్లు పట్టి, పాదం మొద్దుబారినట్లుగా ఉండటం చాలా మందిలో కనిపించే సాధారణ లక్షణమే. ఇలాంటి లక్షణం కనిపించినవారిలో షుగర్ వ్యాధి లేకపోతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే షుగర్ వ్యాధి ఉండి తిమ్మిర్లతో పాదం మొద్దుబారి స్పర్శ తెలియకపోతే మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. పాదాల వ్యాయామం: పాదాల కోసం చేయాల్సిన వ్యాయామాలు చాలా రకాలుగా ఉంటాయి. చిన్న వయసులో అయితే స్కూలు ఆవరణలో ఆడే అనేక రకాల ఆటలు పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. స్కిప్పింగ్ లాంటివి కాళ్ల ఆరోగ్యంతో పాటు ఆరోగ్యకరమైన ఎదుగుదలకూ తోడ్పడతాయి. ఇక టీనేజ్ దాటాక జిమ్‌కు వెళ్లే యువకులు స్క్వాట్స్ మొదలుకొని, వారికి అనువుగా ఉండే అనేక రకాల వ్యాయామాలు చేస్తారు. పిక్కలు మనకు గుండెలాంటివి కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం, వాటి రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా జాగ్రత్తపడటం వల్ల కాళ్ల ఆరోగ్యం బాగుటుంది. అయితే ఏ వయసు వారిలోనైనా బ్రిస్క్ వాకింగ్ చేయడం అన్ని విధాలా ఆరోగ్యకరం. అది కాళ్లతో పాటు సమస్త అవయవాలకూ ఆరోగ్యాన్ని ప్రదానం చేస్తుంది. పాదరక్షల ఎంపిక ఎలా ఉండాలంటే... పాదరక్షల ఎంపికలో మొదట రెండు పాదాల పొడవును కొలిచి, రెండింటికీ సౌకర్యంగా ఉండే జోడునే ఇవ్వమని చెప్పాలి. మనం తొడుక్కునే షూస్ పాదం చివరే ముగియకుండా... మరో రెండు సెంటీమీటర్లు ఎక్కువగా ఉండాలి. అలా ఖాళీ ఉందో లేదో నొక్కి చూసుకోవాలి. పాదంలో వెడల్పులగా ఉండే భాగం ముడుచుకోకుండా, సౌకర్యంగా పరచుకునేలా షూ ఉండాలి. ఈమధ్య చాలామంది పొట్టిగా ఉండే ‘షార్ట్ సాక్స్’ తొడుగుతున్నారు. అవి కాలిని బాగా బిగుతుగా మడిచినట్లుగా చేసే టైట్ షూ అంత ప్రమాదకరం. సాక్స్ కాస్త సాగుతూ ఉండేవి అయితేనే మంచిది. డయాబెటిస్ ఉన్నవారు పాదాల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... మిగతావారితో పోలిస్తే డయాబెటిస్తో బాధపడేవారు పాదాలను మరింత శుభ్రంగా ఉంచుకోవాలి. అందునా ఐదు నుంచి పదేళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నవారు తమ కాళ్లను ప్రత్యేకంగా పాదాలను చాలా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించుకుంటూ ఉండాలి. వారు పాదాల పరిరక్షణ కోసం పాటించాల్సిన సూచనలివి... ⇒ తరచూ కాలి పరీక్ష స్వయంగా చేసుకుంటూ ఉండాలి. పాదాల కింద అద్దం పెట్టుకుని, పాదం ఏవిధంగా ఉందో చూసుకోవాలి. కాలి పైభాగాన్ని కూడా నిశితంగా పరీశించుకోవాలి. అలాగే కాలి వేళ్ల మధ్య భాగాలనూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరిశీలనలో చిన్న పొక్కులాంటిది ఉన్నా దాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో అది పుండుగా మారే ప్రమాదం కూడా ఉండవచ్చు. అది భవిష్యత్తులో కాలిని తొలగించేంత ప్రమాదకరంగా కూడా మారేందుకు అవకాశం ఉంటుంది. అందుకే పొక్కు చిన్నగా ఉన్నప్పుడే పూర్తిగా మానిపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒నిత్యం పాదాలను పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య కూడా పొడిగా ఉండటం కోసం పౌడర్ రాసుకోవాలి. ⇒కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లూ కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకండి. సౌకర్యంగా ఉండేవి మాత్రమే ఎంచుకోవాలి. ⇒ వేడి వస్తువులనుంచి మీ కాళ్లను దూరంగా ఉంచుకోండి. డయాబెటిస్ ఉన్నవారు హాట్ వాటర్ బ్యాగ్‌తో కాళ్లకు కాపడం పెట్టుకోక పోవడమే మంచిది. ⇒పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్‌తో కాళ్లను రుద్దుకొని, మళ్లీ ఆ తర్వాత పొడిగానూ మారేలా శుభ్రం చేసుకోవాలి. ⇒కాళ్లమీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్‌ను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవడం చాలా అవసరం. ⇒కాలిగోళ్లను ప్రతివారమూ తొలగించుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరుమూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. ఇది డయాబెటిస్ రోగుల్లో ప్రమాదం. ⇒ఇంట్లోకూడా పాదరక్షలు లేకుండా నడవకూడదు. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి. ⇒ఏడాదికోసారి డాక్టర్‌కు చూపించుకుంటూ ఉండాలి. ఇవన్నీ పాదాల సంరక్షణకు ఉపయోగపడే మార్గాలు. చివరగా... పాదాలు మన ప్రతి కదలికనూ నిర్ణయిస్తాయి... నియంత్రిస్తాయి. ప్రగతి పథాన ఉంచుతాయి. అందుకే పాదాల ఆరోగ్య పరిరక్షణే అందరి ప్రథమ ప్రాధాన్యం కావాలి. డాక్టర్ కె.సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం.. షోరూమ్‌లో మంటలు
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని మంజు థియేటర్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. థియేటర్ పరిసర ప్రాంతంలో ఉన్న ఓ చెప్పుల షో రూమ్‌లో భారీగా మంటలు ఎగడిపడుతున్నాయి. దీంతో స్థానికులు, చుట్టుపక్కల షాపుల వాళ్లు భయాందోళనతో పరుగులు తీశారు. భవనం మొత్తం మంటల్లో ఉందని కొందరు అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేశారు. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
త్వరలో తిరుమలలో కాలిబాటకు మోక్షం
-
కొండాపూర్‌లో ఆక్రమణల తొలగింపు
కొండాపూర్: కొండాపూర్‌లోని టీఎస్ఎస్పీ బెటాలియన్ రోడ్డులో పుట్‌పాత్ ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు ఆ ప్రదేశంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి రోడ్డు ఆక్రమణలకు గురి అవుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. -
పాదం లేకున్నా... పట్టుదల ఉంది
స్ఫూర్తిదాయకం తంగవేలు ప్రస్థానం తమిళనాడులోని సేలం జిల్లాలో పెరియవడగమ్పట్టి అనే మారుమూల గ్రామంలో ఓ నిరుపేద కుటుంబం అది... తల్లి రోజూ కూలికి వెళితే తప్ప నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లని పేదరికం... నలుగురు సంతానం... అందులో ఒకరు తంగవేలు. ఐదేళ్ల వయసులో ఇంటి బయట ఆడుకుంటున్న తంగవేలును తమిళనాడు ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో కుడికాలి పాదం పోరుుంది. కర్ర సాయంతో కుంటుతూ నడవాల్సిన పరిస్థితి. ఓ వైపు పేదరికం... మరోవైపు వైకల్యం... దీంతో తంగవేలు తల్లి సరోజ పడిన వేదన అంతా ఇంతా కాదు. తంగవేలు తండ్రి పిల్లల చిన్నతనంలోనే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి రోజూ కూలికి వెళ్లేది. కూరగాయలు అమ్మేది. అరుుతే తన బాధను బయటపడనీయకుండా ఆ తల్లి పిల్లాడిలో స్ఫూర్తి నింపింది. ‘నువ్వెవరి కంటే తక్కువ కాదు’ అంటూ ధైర్యం నింపింది. వయసు పెరిగే కొద్దీ తంగవేలుకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగింది. పిల్లాడిలో ఉత్సాహం చూసిన స్కూల్ పీఈటీ సేలం తీసుకెళ్లి శిక్షణ ఇప్పించమని సలహా ఇచ్చారు. అక్కడ ప్రభుత్వ క్రీడా శిక్షణ కేంద్రంలో చేర్చితే బాగుంటుందని సూచించారు. సేలంలో హాస్టల్లో చేరిస్తే ఆటల సంగతి ఎలా ఉన్నా మూడు పూటలా పిల్లాడు తినగలుగుతాడని ఆ తల్లి భావించింది. అలా తంగవేలు సేలంలోని తమిళనాడు స్పోర్ట్స అథారిటీ అథ్లెటిక్స్ శిబిరంలో చేరాడు. అక్కడి కోచ్ ఎలమ్పరితి రెగ్యులర్ అథ్లెట్లతో పాటు తనకు కూడా శిక్షణ ఇచ్చాడు. ఏనాడూ ట్రైనింగ్‌కు తంగవేలు దూరం కాలేదు. జంప్ చేసే క్రమంలో తన కాలికి అనేకసార్లు గాయాలయ్యారుు. పుండు నొప్పితో కూడా శిక్షణకు వచ్చేవాడు. ఆ క్రమశిక్షణే తనని ఈ రోజు పారాలింపిక్ మెడలిస్ట్‌ను చేసింది. 14 ఏళ్ల వయసులో ఓ అథ్లెటిక్స్ పోటీలో సాధారణ అథ్లెట్లతో పోటీ పడి తంగవేలు రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో 2013లో జాతీయ పారా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం ద్వారా తంగవేలు జీవితం మారిపోరుుంది. అక్కడ కోచ్ సత్యనారాయణ తనలోని టాలెంట్‌ను గుర్తించి బెంగళూరు తీసుకెళ్లారు. తనని మరింతగా తీర్చిదిద్దారు. 2015 నాటికే తను ప్రపంచంలో నంబర్‌వన్‌గా ఎదిగాడు. ట్యునీషియా గ్రాండ్ ప్రిలో స్వర్ణం సాధించడం ద్వారా పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఉద్యోగం కోసం...: ఓ వైపు అథ్లెటిక్స్ మీద పూర్తి స్థారుు దృష్టిపెట్టినా చదువునూ ఏనాడూ విడిచిపెట్టలేదు. 2015లో తను బీబీఏ డిగ్రీ పూర్తి చేశాడు. ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి తల్లికి అండగా నిలవాలనేది అతని కోరిక. తంగవేలుకు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్లు. ఇప్పుడు ఒలింపిక్స్ స్వర్ణం గెలవడంతో వచ్చే నజరానాల ద్వారా ఆ కుటుంబం ఆర్థికంగా కుదురుకుంటుంది. 1 పారాలింపిక్స్ హైజంప్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం 3 ఓవరాల్‌గా పారాలింపిక్స్‌లో మనకు ఇది మూడో స్వర్ణం. గతంలో 1972 హిడెల్‌బర్గ్ గేమ్స్‌లో మురళీకాంత్ పేట్కర్ (స్విమ్మింగ్) దేశానికి తొలిసారి స్వర్ణం అందించగా... 2004 ఏథెన్‌స గేమ్స్‌లో దేవేంద్ర జజరియా (జావెలిన్ త్రో) కూడా ఈ ఫీట్ సాధించాడు ‘ఈ ఆనందాన్ని ఎలా వర్ణించాలి. చిన్నప్పటి నుంచి తను ఎంత కష్టపడి ఈ స్థారుుకి వచ్చాడో నాకు మాత్రమే తెలుసు. తంగవేలు ఈ స్థారుుకి చేరడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు’ - తంగవేలు తల్లి సరోజ కఠిన శ్రమతో వెలుగులోకి.. న్యూఢిల్లీ: చిన్నప్పుడే పోలియో బారిన పడినా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వరుణ్ సింగ్ భటి క్రీడలపై అమితాసక్తిని పెంచుకున్నాడు. గ్రేటర్ నొరుుడాకు చెందిన తను స్థానిక సెరుుంట్ జోసెఫ్స్ స్కూల్లో చదువుకున్న రోజుల్లోనే వెలుగులోకి వచ్చాడు. అనంతరం జాతీయ మాజీ అథ్లెట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో బెంగళూరు సాయ్ శిక్షణలో తను మరింత రాటుదేలాడు. 2012 లండన్ పారాలింపిక్స్ బెర్త్ కోసం ‘ఎ’ అర్హత ప్రమాణాల (1.60మీ.)ను అందుకోవడంతో వార్తల్లో నిలిచాడు. ఈ ఏడాదే జరిగిన ఐపీసీ అథ్లెటిక్స్ ఆసియా-ఓసియానియా చాంపియన్‌షిప్‌లోనూ 21 ఏళ్ల వరుణ్ భటి 1.82మీ. హైజంప్‌తో స్వర్ణం సాధించడమే కాకుండా ఆసియా రికార్డు సృష్టించాడు. అభినందనల వెల్లువ ⇔ పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తంగవేలు, కాంస్యం నెగ్గిన వరుణ్‌లపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రపతి నుంచి సామాన్యుడి దాకా... అమితాబ్ బచ్చన్, అనుష్కశర్మ నుంచి బీసీసీఐ, పలువురు క్రికెటర్ల ట్వీట్లతో సోషల్ మీడియా హోరెత్తింది. ⇔ మీ విజయం దేశంలో అందరికీ స్ఫూర్తిదాయకం. మీ ఇద్దరికీ నా అభినందనలు. భవిష్యత్‌లో మీరు మరిన్ని విజయాలు సాధించాలి. - భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ⇔ భారత దేశం మొత్తం ఆనందిస్తోంది. స్వర్ణం గెలిచిన తంగవేలుకు, కాంస్యం నెగ్గిన వరుణ్ సింగ్ భటికి అభినందనలు. -ప్రధాని మోదీ ⇔ ఈ రోజు మన అథ్లెట్లు కొత్త చరిత్ర సృష్టించారు. రాబోయే తరాలకు వీరిద్దరూ స్ఫూర్తిగా నిలుస్తారు. - ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వర్ణం నెగ్గిన క్రీడాకారుల క్లబ్‌లోకి తంగవేలుకు స్వాగతం. కాంస్యం నెగ్గిన వరుణ్‌కు అండగా నిలిచిన గోస్పోర్‌ట్స వారుుసెస్ సంస్థకూ అభినందనలు. - అభినవ్ బింద్రా తమిళనాడు రూ.2 కోట్లు పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తమ రాష్ట్ర అథ్లెట్ తంగవేలుకు తమిళనాడు ప్రభుత్వం రూ.2 కోట్లు నజరానా ప్రకటించింది. ‘నీ ప్రదర్శన పట్ల యావత్ భారతదేశం గర్వపడుతోంది. తమిళనాడు ప్రజల తరఫున శుభాకాంక్షలు. ఒలింపిక్స్ స్వర్ణం గెలిస్తే ఇచ్చే నజరానాతో సమానంగా తంగవేలుకు కూడా రూ.2 కోట్లు ప్రభుత్వం అందజేస్తుంది’ అని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తెలిపారు. కేంద్ర ప్రభుత్వ క్రీడావిధానం ప్రకారం ఒలింపిక్స్ లేదా పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన వారికి రూ.75 లక్షలు ఇస్తారు. కాంస్యం గెలిస్తే రూ.30 లక్షలు అందుతారుు. తంగవేలు, వరుణ్‌లకు ఈ నజరానా ఇస్తారు. -
టెన్త్ విద్యార్థులతో టీచర్ నీచమైన పని!
రాయ్‌పూర్: విద్యార్థులకు ఇంగ్లిష్ పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు తానే దారితప్పాడు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యార్థులను స్టాఫ్‌రూమ్‌కు పిలింపించుకొని.. వారితో ఒళ్లు పట్టించుకున్నాడు. బొక్కబోర్ల పడుకున్న అయ్యవారికి ఓ విద్యార్థి నడుముపై భాగంలో మసామ్ చేస్తే.. మరో ఇద్దరు విద్యార్థులు చెరోకాలిని పట్టుకొని నొక్కారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్‌గా మారిపోయింది. ఛత్తీస్‌గఢ్ జశ్పూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. తుమ్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనూప్ మింజ్ ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కానీ ఆయన తాజాగా విద్యార్థులను స్టాప్రూమ్కు పిలింపించుకొని ఒళ్లు పట్టించుకున్నాడు. ముగ్గురు విద్యార్థులు సేవకులుగా ఆయన ఒళ్లు పడుతుండగా వీడియో కెమెరా కంటికి చిక్కింది. ఈ వీడియో ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో దావానలంలా పాకింది. దీంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాధికారికి సదరు ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని విద్యాధికారి హామీ ఇచ్చారు. ఈ చర్యకు పాల్పడిన ఇంగ్లిష్ టీచర్ అనూప్ మాత్రం 'నేను జ్వరంతో ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నా. నేనేమీ విద్యార్థులను ఒళ్లు పట్టమని బలవంతపెట్టలేవు. వారే ఉద్దేశపూరితంగా అలాచేశారు' అని చెప్పుకొచ్చారు. -
తొడ కండరాలకు బలమిచ్చే ఆసనాలు
లైఫ్ సిద్ధ ఉత్థిత పార్శ్వ కోణాసన స్టెప్-1: నిటారుగా నిలబడి, కాళ్ల మధ్య వీలైనంత గ్యాప్ ఉంచి నిలబడాలి. తర్వాత కుడి పాదం ముందుకు చాపి, ఎడమపాదాన్ని అదే లంబంలో పక్కకు ఉంచి త్రికోణాసనంలోకి రావాలి. కుడిచేయి కిందకు తీసుకెళ్ళి కుడిపాదాన్ని పట్టుకోవచ్చు. లేదా కుడిపాదం పక్కన నేల మీద చెయ్యిని పెట్టవచ్చు. రెండు చేతుల్ని 180 డిగ్రీల కోణంలో ఉంచాలి. దీనిని త్రికోణాసనమంటారు. స్టెప్-2: కుడికాలుని ముందుకు వంచుతూ కుడిపాదం నుండి కుడి మోకాలు నిటారుగా 90 డిగ్రీల కోణంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. మోకాలు నుండి తొడభాగం తుంటికీలు వరకు భూమికి సమాంతరంగా ఉండేటట్లుగా చూసుకుని పైకి ఎత్తిన ఎడం చేయి ఏటవాలుగా ఎడమ భుజం మీదుగా ఎడమ చెవిని తాకుతూ ఉండాలి. అలాగే ఎడమ పాదం దగ్గర నుండి ఎడమ చేయి చివర వరకూ ఏటవాలు రేఖలో ఉండేట్టు చూసుకోవాలి. ఈ స్థితిని పార్శ్వకోణాసనమంటారు. స్టెప్-3: కింద ఉంచిన కుడిచేతిని ఎడమ మోకాలు కింద నుంచి చుడుతూ మెడ మీదకు తీసుకువెళ్లాలి. పైన ఏటవాలుగా ఉంచిన ఎడమచేతిని కూడా మడచి మెడ వెనుకకు తీసుకువెళ్ళి రెండు చేతివేళ్లను ఇంటర్‌లాక్ చేసి శరీరం భూమి వైపుకు ముందుకు పడిపోకుండా పక్కలకు ఉండేటట్లుగా సరి చూసుకోవాలి. ఈ స్థితిని శుద్ధ ఉత్థిత పార్శ్వ కోణాసనమంటారు. సామాన్య సాధకులు స్టెప్ 2 వరకూ తేలికగా సాధన చేయగలరు. స్టెప్ 3 కొంచెం తరువాత భంగిమ కనుక సీనియర్ సాధకులు మాత్రమే అతి సునాయసయంగా చేయగలుగుతారు. ఉపయోగాలు: మడమలు, కాలి పిక్కలు, మోకాళ్లు, తొడలు, నడుము భాగం బలంగా తయారవుతాయి. మెడ, భుజాలు, ఛాతీ భాగాలూ స్ట్రెంథెన్ అవుతాయి. మత్స్యాసన ఈ ఆసనంలో నీటి మీద పడుకుని చేసినప్పుడు శరీరం నీటిలో తేలియాడుతుంది కనుక దీనికి మత్స్యాసనం అన్నారు. చేసే విధానం: వెల్లికిలా పడుకోవాలి. కాళ్లు రెండూ ముందుగా పద్మాసనంలోకి తీసుకురావాలి. తర్వాత చేతులు రెండూ తలకిరువైపులా అరచేతులు భూమి మీద సపోర్ట్‌తో వీపు వెనుక భాగాన్ని తలను పైకి లేపి, తల మాడు భాగాన్ని భూమి మీద ఆనించే ప్రయత్నం చేయాలి. తరువాత చేతులు రెండూ ముందుకు తీసుకువచ్చి పద్మాసనంలో ఉన్న కాలి పాదాలను రెండు చేతులతో ఫొటోలో చూపించిన విధంగా పట్టుకుని మోచేతులు భూమికి తగిలేటట్లుగా పాదాలు మరింత పక్కకి వచ్చేటట్లుగా చేయాలి. పద్మాసన భాగం గాలిలోకి లేవకుండా సమంగా భూమి మీద ఆనేటట్లుగా చూడాలి. ఛాతీపైకి ప్రొజెక్ట్ చేయబడి ఉంటుంది. ఎవరైతే పడుకుని పద్మాసనం చేయలేరో వాళ్లు కాళ్లు రెండూ పాదాలు ముందుకు స్ట్రెచ్ చేసి కలిపి ఉంచాలి. లేదా ఎడమకాలు (యాంకెల్) మీదకు కుడికాలు (యాంకిల్) క్రాస్ చేసి ఉంచాలి. చేతులతో పాదాలు పట్టుకునే అవకాశం లేదు కనుక మోచేతులు భూమి మీద బలంగా ఉంచుతూ చేతులు రెండూ ముందుకు, అర చేతులు నడుముకు ఇరువైపులా భూమి మీదకు ప్రెస్ చేస్తూ వీపును మరింత పైకి లేపే ప్రయత్నం చేయాలి. ఇంకా చేయగల్గితే అరచేతులు రెండూ సీట్ కిందకు తీసుకువెళ్ళి భూమిపై ప్రెస్ చేస్తూ వీపును మరింత పైకి లేపే ప్రయత్నం చేయాలి. ఇంకా చేయగల్గితే అర చేతులు రెండూ సీట్ కిందకు తీసుకువెళ్ళి భూమిపై ప్రెస్ చేస్తూ సపోర్ట్ తీసుకుంటూ వీపు భాగాన్ని పైకి వీలైనంతగా లేపాలి. ఇందులో ముఖ్యమైన విషయం వీపు క్రింద భాగం భూమి మీద ఆనకుండా వంపు వచ్చేలా చేయాలి. ఈరకంగా కూడా చేయలేనివారు సింగల్ కాట్ కాని డబుల్ కాట్ మీద కాని వెల్లికిలా పడుకుని తలని మెడని బెడ్ అంచు భాగం దాటికి క్రిందకి పడేవేస్తూ ఉంచాలి. వీపు పై భాగంలో కింద ఒక దిండును ఉంచినట్లయితే ఈ ఆసనం ఎఫెక్ట్ పూర్తిగా అనుభూతి పొందవచ్చు. ఉపయోగాలు: మెడను, ఛాతీని స్ట్రెచ్ చేస్తుంది. మెడ, భుజాలలో ఉన్న టెన్షన్ నుంచి విముక్తి కలుగుతుంది. ఊపిరితిత్తులు ఎక్స్పాండెడ్ స్టేట్‌లో ఉంటాయి కనుక శ్వాసకోశ వ్యవస్థకు మంచిది. శ్వాసకోశ వ్యాధులకు మంచి ఉపశమనం కలుగుతుంది. థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్రంధులు, పిట్యుటరీ, పీనియల్ గ్రంధులు ఉత్తేజింపబడతాయి. స్పాండిలైటిస్ సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది. జాగ్రత్తలు: బాగా హై లేదా లో బి.పి ఉన్నవారు మైగ్రేయిన్, ఇన్సోమ్నియా వ్యాధిగ్రస్తులు గతంలో మెడ వీపు భాగాలలో ఏమైనా గాయాలు ఉన్నవారు బలహీనమైన ఊపిరితిత్తులు ఉన్నవారు ఈ ఆసనం చేయకపోవడం మంచిది. లేదా నిపుణుల పర్యవేక్షణలో చేయడం ఉత్తమం. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
విద్యార్థులకు 'నది' కష్టాలు!
చెన్నైః ప్రతిరోజూ పాఠశాలకు వెళ్ళాలంటే అక్కడి విద్యార్థులకు నది కష్టాలు తప్పడంలేదు. ఎప్పుడూ మోకాల్లోతు దాటి ఉండే నీళ్ళలో బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది. ఒక్కోసారి నీటి ఉధృతి పెరిగితే నడుములు దాటి కూడా నీరు ప్రవహిస్తుంటుంది. అటువంటి ప్రమాద పరిస్థితుల్లో నీటిలో నడుస్తూ స్కూలుకు వెళ్ళాల్సిన పరిస్థితి తమిళనాడు విద్యార్థులకు దినదినగండంగా మారుతోంది. ఇక వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుంది. ఉధృతంగా ప్రవహించే నీటి ప్రవాహాన్ని దాటి నదికి ఆవలివైపున ఉన్న స్కూలును చేరుకోవడం ప్రాణాలతో చెలగాటమే. ఏళ్ళతరబడి బ్రిడ్జి నిర్మాణంకోసం ఆ ప్రాంత వాసులు అర్జీలు పెట్టినా పట్టించుకునేవారే కరువయ్యారు. తమిళనాడు క్రిషగిరి జిల్లా బోడూరు గ్రామ ప్రాంతంలోని విద్యార్థులు స్కూలుకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదిని దాటేందుకు బ్రిడ్జి లేక, మోకాల్లోతు నీటిలోనే నడుచుకుంటూ వెడుతున్నారు. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కాలం వెళ్ళదీస్తున్నారు. బోడూరు చుట్టుపక్కల గ్రామాలనుంచి ప్రతిరోజూ సుమారు 100 మంది విద్యార్థులు పెన్నార్ నదిని దాటి స్కూలుకు వెడుతుంటారు. ఆయా గ్రామాల్లోని విద్యార్థులే కాక గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు సైతం నిత్యావసరాలకోసం పక్క గ్రామానికి వెళ్ళాలంటే నదిని దాటక తప్పడం లేదు. కనీసం 3000 మంది ప్రయాణీకులు ప్రతిరోజూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బోడూర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నదిపై బ్రిడ్జి లేకపోవడంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. స్థానిక ఉత్పత్తులను మార్కెట్ కు చేర్చాలన్నా బ్రిడ్జిని చేరుకోవాలంటే సుమారు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని, రోగులను అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలించాలన్నా నదిని దాటడం ఎంతో కష్టంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అయితే క్రిషగిరి జిల్లాలో నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే ముఖ్యమంత్రి జయలలిత రూ.1.5 కోట్ల నిధులు కేటాయించారని, నిర్మాణంకోసం అధికారులకు ఆదేశాలు కూడ జారీ చేశారని పశుసంవర్థకశాఖ మంత్రి బాలకృష్ణా రెడ్డి చెప్తున్నారు. నదిపై బ్రిడ్జిలేక, నీరు ఉధృతంగా ఉన్నసమయంలో సంవత్సరంలో సుమారు 100 రోజులపాటు పాఠశాలకు హాజరుకాలేకపోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మరో రెండేళ్ళలో బోర్డు పరీక్షలు రాయాల్సి ఉండగా... అధికారులు ఇచ్చే హామీలు ఎప్పుడు అమల్లోకి వస్తాయో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పాదాలు పదిలం
బ్యూటిప్స్ వర్షాకాలం పాదాల సంరక్షణ కష్టంగానే ఉంటుంది. రోజువారీ తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల వల్ల పాదాల ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవచ్చు. కప్పు మామిడిపండు గుజ్జు, కప్పు పెరుగు, అరకప్పు ఓట్స్, మూడు టీ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు స్క్రబ్‌గా ఉపయోగించాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పాదాల చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. చేతులు, పాదాలపై ట్యాన్ పోవాలంటే మామిడిపండు గుజ్జులో, టీ స్పూన్ తేనె కలిపి ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి. మరో ఐదు నిమిషాల తర్వాత శుభ్రపరుచుకొని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి.ఐదు టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్, కప్పుడు వైట్ వెనిగర్, గోరువెచ్చని నీళ్లలో కలపాలి. ఆ నీటిలో పాదాలను పదిహేను నిమిషాలు ఉంచాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేస్తుంటే కాలి పగుళ్లు తగ్గుతాయి. పాదాల చర్మం మృదువుగా అవుతుంది. వాన నీళ్లలో నానితే వేళ్ల మధ్య తడి వల్ల ఫంగస్ చేరుతుంటుంది. ఇలాంటప్పుడు బేకింగ్ పౌడర్‌లో మూడు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి, పాదాలకు, వేళ్ల మధ్య రాసుకోవాలి. ఫంగస్ తగ్గడంతో పాటు చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాళ్లు, పాదాల చర్మం పొడిబారి పొలుసులుగా కనిపిస్తుంటుంది. సీ సాల్ట్‌లో కొద్దిగా పాలు కలిపి చర్మంపై రాసి, మృదువుగా స్క్రబ్ చేయాలి. ఇది శక్తిమంతమైన క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది. రాత్రి పడుకునే ముందుగా పాదాలను శుభ్రపరచాలి. తర్వాత కరిగించిన వ్యాక్స్‌లో కొద్దిగా ఆవనూనె కలిపి రాసుకోవాలి. పది-పదిహేను రోజుల్లో కాలి పగుళ్లు త గ్గుతాయి. పాదాల చర్మం మృదువుగా మారుతుంది. ఉప్పు లేని బటర్ టేబుల్ స్పూన్, స్ట్రాబెర్రీ ఒకటి, చిన్నముక్క కీరా, టీ స్పూన్ నిమ్మరసం, గుడ్డులోని పచ్చసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి, ఇరవై నిముషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. పాదాల చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. -
నేను.. మీ పాదాన్ని!
ఆనంద్‌కు తన గుండె, కాలేయం, ఊపిరితిత్తుల వంటి అవయవాల మీద మక్కువ ఎక్కువ. నేను అంత సమస్యలను తెచ్చిపెట్టే అవయవాన్ని కాదని ఆనంద్ నమ్మకం. అందుకే నా గురించి పెద్దగా ఆలోచించడు. కానీ నేనొక నిర్మాణపమైన అద్భుతాన్ని. నేను ఆనంద్ పాదాన్ని. నేనెంత సంక్లిష్టమైన అవయవాన్నో తెలియక కాలిని కాస్తంత చిన్నచూపు చూస్తుంటాడు ఆనంద్. అతడి నడక సాఫీగా సాగడం అన్నది నేను సెలైంట్‌గా పనిచేస్తుండటం వల్లనే. నాలో 26 ఎముకలు ఉంటాయి. ఆనంద్ మొత్తం కాలిలో ఉండే మొత్తం ఎముకల సంఖ్యతో పోలిస్తే నాలుగో వంతు అతడి పాదంలోనే ఉంటాయి. 107 లిగమెంట్లు, 19 కండరాలు ఉంటాయి. అతడి 72 కిలోల బరువును నేనే మోస్తుంటాను. అతడి ఒంటిలోని అత్యంత పొడవైన ఎముక, దాని చుట్టూ ఉండే కండరాన్ని నేనే బ్యాలెన్స్ చేస్తుంటాను. ఆ బరువు మోయడానికి వీలుగా విశాలంగా రూపొందించుకోవడం కోసం అరికాలుగా మారి నన్ను నేను విస్తరించుకున్నాను. నడక... తెలియకుండానే రోజూ జరిగే సంక్లిష్ట ప్రక్రియ నిజానికి నడక అన్నది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. పాదం నేల మీద మోపగానే మొదటి షాక్ నాకు తగులుతుంది. ఆ షాక్ ప్రభావాన్ని తగ్గించడం కోసం... షాక్ అబ్జార్బర్‌లా పనిచేయడం కోసం... ఆ ప్రభావాన్ని నేను పాదమంతటికీ విస్తరింపజేస్తాను. కానీ ఆనంద్ మాత్రం నాకంటే అతడి వాహనం టైర్ల మీదే ఎక్కువగా దృష్టిసారిస్తుంటాడు. నాకు ఎప్పుడైనా దెబ్బతగిలితే... నాకు గాయమైందన్న అంశం కంటే తాను నడవలేకపోతున్నాననే అంశమే అతడిని బాధిస్తుంది. నడక ఎలా సాగుతుందంటే... పాదం మోపగానే మొదటి బరువు అతడి మడమలోని బంతిలాంటి ఎముకపై పడుతుంది. ఆ తర్వాత కాలివేళ్లలో ఎముకలైన ఐదు మెటాటార్సల్స్పై పడుతుంది. వాటి సాయంతో నేను నేలను వెనక్కుతోస్తాను. కానీ నేల కదలదు కదా. దాంతో ఆ చర్య ప్రభావంతో నేను ముందుకు కదిలి, ఆనంద్‌ను ముందుకు నడిపిస్తుంటాను. గచ్చు గట్టిదనంతో మరిన్ని గాయాలు... యుగాలనాటి ఆనంద్ పూర్వీకులు పాదరక్షలు ఏవీ లేకుండానే నడుస్తుండేవారు. ఆ తర్వాత నన్ను రక్షించుకోడానికి నా చుట్టూ చర్మాన్ని కట్టారు. ఇప్పుడు ఆధునిక కాలంలో షూస్ ధరిస్తున్నారు. ఆనంద్ పూర్వీకులు నేలపై నడిచినప్పుడు నాకు బాగానే ఉండేది. కానీ ఇప్పుడు సిమెంట్ చేసిన, కఠినమైన పేవ్మెంట్ల మీద ఆనంద్ నడుస్తున్నాడు. మెత్తటి నేల మీద, గడ్డి మీద నడవకుండా ఇలా కఠినమైన ఉపరితలం మీద నడవడం నాకు కష్టాలు తెస్తోంది. నాలోని ఎముకలు కాస్త మృదువుగా, కాస్తంత సాగే గుణంతో ఉంటాయి. ఇరవైలలోపే ఆంక్షలు ఆరంభం ఆనంద్‌కు 20 ఏళ్ల వయసు వచ్చే వరకూ నేను రూపొందే ప్రక్రియ పూర్తి కాదు. అందువల్ల ఈ లోపే నన్ను షూస్, సాక్స్ వంటి వాటితో బంధిస్తూ ఉండటం, నా ఎదుగుదలకు ప్రతిబంధకంగా నిలుస్తూ ఉండటం వల్ల నాలో చాలా కొద్దిపాటి లోపాలు తలెత్తుతూ ఉండవచ్చు. అయితే అందరు తల్లిదండ్రుల్లాగే ఆనంద్ పేరెంట్స్ కూడా అతడు బుడిబుడి అడుగులు వేయాలని ఎదురుచూశారు. అంతవరకూ మామూలుగా నన్ను ఉండనిచ్చినవాళ్లు అతడు అడుగులు వేయడం మొదలుపెట్టగానే నన్ను బంధించారు. దీనివల్ల నాకు వచ్చేవి చిన్నచిన్న లోపాలే అయినా అవి మున్ముందు ఆనంద్ పాదాలకు నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువ. అతడు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఆనంద్ పేరెంట్స్ అతడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవారు. అతడి గుండె, ఊపిరితిత్తులు ఇతర అవయవాలు బాగానే ఉన్నాయా లేదా అని చూపించేవారు. కానీ నన్ను, నా ఆకృతి తీరును విస్మరించేవారు. కానీ ఆ అవయవాలతో పోలిస్తే... ఆ టైమ్‌లో నాకు వచ్చే ఇబ్బందులు ఎక్కువ. ఆనంద్‌కు నాలుగేళ్ల వయసులో నన్ను గనక ఆర్థోపెడిక్ సర్జన్‌కు / డాక్టర్‌కు చూపిస్తే వారు నాకు జరుగుతున్న నష్టాలు గుర్తించేవారు. (విదేశాల్లో అయితే పాదాల ప్రాథమిక సంరక్షణ కోసమే పనిచేసే వారుంటారు. వాళ్లను పోడియాట్రిస్ట్ అంటారు) ఆనంద్‌కు ఆరేళ్ల వయసు వచ్చే సరికి, దాదాపు 40 శాతం మంది పిల్లల్లో వచ్చే నష్టాలే నాకూ వచ్చాయి. నా పాదం వేళ్లు నష్టపోవడం మొదలైంది. ఇది జన్యుపరంగానో లేదంటే షూస్ వల్లనో జరుగుతుంది. ఆనంద్‌కు బ్రష్చేసుకోవడం ఎలా, జుట్టు దువ్వుకోవడం ఎలా అని నేర్పుతారు. కానీ పాద సంరక్షణ నేర్పరు. పొడిగా ఉంచితే ఆరోగ్యంగా ఉంటాను ఒక్కోసారి ఆనంద్ పాదాలకు కాయకాచి అందులో పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఇలా జరిగినప్పుడు పాదాల డాక్టర్‌కు చూపించుకుని, తగిన చికిత్స చేయించుకోవాలి. అథ్లెట్స్ ఫుట్ అనే సమస్య ఫంగస్ కారణంగా నాకు వస్తుంది. నిజానికి ఈ ఫంగస్ నాపై ఎప్పుడూ ఉండనే ఉంటుంది. కానీ పాదం ఎప్పుడూ తేమ, తడిలో ఉన్నప్పుడు ఫంగస్ పెరిగి, చర్మం చిట్లి, అథ్లెట్స్ ఫుట్ సమస్య వస్తుంది. అరికాళ్లలో ఉండే చెమట గ్రంథులు స్రావాలతో పాదం చెమ్మబారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటప్పుడు ఆనంద్ పాదాన్ని శుభ్రంగా కడిగి, వీలైతే ఆల్కహాల్ ఉన్న వాష్లను ఉపయోగించి శుభ్రం చేసి, పాదాల మీద పౌడర్ చల్లి, ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకుంటే నేను ఆరోగ్యంగా మారతాను. అవసరాన్ని బట్టి యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. ఆనంద్‌కు బొటనవేలిపై ఉన్న గోరు లోపలివైపునకు పెరుగుతూ ఉంది. ఇలా జరగకుండా చూసుకోవాలంటే కాలి గోర్లు తీసే సమయంలో మూలల్లో మరీ చిగుర్ల నుంచి కాకుండా కాస్తంత దూరం నుంచే కట్ చేసుకుంటే ఈ సమస్యను ఎప్పటికీ రాకుండా చూసుకోవచ్చు. ఇక ఈ మధ్య ఆనంద్‌కు కాలు చల్లగా అనిపించడం, పాదం మొద్దుబారినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పాదానికి రక్తప్రసరణ పెరిగేలా చూసుకోవడం వల్ల ఈ సమస్య రాదు. అన్నిటికంటే ఆనంద్ పూర్వికులలాగే అతడు కూడా కాసేపు వ్యాయామం చేస్తే మంచిది. ఇక చివరగా నేను ఆనంద్‌ను కాస్త భయపెట్టాలి. మున్ముందు ఆనంద్‌కు వయసు పెరగబోతోంది. ఆ సమయంలో అతడు ఒకింత వ్యాయామం ఇచ్చి నా ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. లేదంటే నేను అతడిని నడిపించలేకపోవచ్చు. అందుకు ఇకపైన అయినా అతడు నా పట్ల దృష్టిసారించాలి. అది కూడా మరింత సునిశితమైన దృష్టి. ప్రమాద అవకాశాలు అతడిలో కంటే ఆమెకే ఎక్కువ పాదం గాయపడిందంటే దేహం గాయపడినట్లే అన్న పాత సూక్తిని గుర్తుంచుకోవడం మేలు. ఆనంద్ బూట్లు ధరించడం వల్ల నిల్చునే భంగిమలోనే మార్పువస్తుంది. దాంతో మొత్తం ఆకృతిలోనే మార్పురావచ్చు. అది చేదు పరిణామాలు దారితీయవచ్చు. ఆనంద్‌తో పోలిస్తే అతడి భార్యకు ఇలా జరిగే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. ఎందుకంటే ఆనంద్ భార్య ధరించే హైహీల్స్ వల్ల ఈ ప్రమాదం నాలుగింతలు ఎక్కువగా ఉంటుంది. ఆమెకే కాదు... మహిళలందరికీ ఈ ముప్పు ఉంటుంది. కాలికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో! నాకు వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. పాదాలపై ఆనెకాయలు రావచ్చు. షూ వల్ల ఒకేచోట అదేపనిగా ఒత్తిడి పడుతుండటం వల్ల ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అక్కడ మృతకణాలు చేరుతూ పోవడం వల్ల ఇలా ఆనెకాయలు రావచ్చు. ఆనంద్ పాదాలలోని నరాలలో కొన్నింటిపై ఎక్కువ, మరికొన్నింటిపై తక్కువ ప్రభావం పడుతుండవచ్చు. అలా నరాలపై ఎక్కువ ఒత్తిడి పడ్డప్పుడు అతడికి నొప్పి వస్తుండవచ్చు. ఆనెకాయల విషయంలో ఆనంద్ తానే ఒక సర్జన్ అనుకుంటాడు. రేజర్బ్లేడు తీసుకుని, దాన్ని కోస్తూ ఉంటాడు. ఆనెకాయలను మాడ్చటానికి దానిపై కొన్ని చుక్కల యాసిడ్ పోస్తూ ఉంటాడు. కానీ నిజానికి ఆనెకాయలు వస్తే దాని చూట్టూ ప్లాస్టర్ వేసి డాక్టర్‌కు చూపించాలి. ఇక షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల కాలి బొటనవేలు లోపలి వైపునకు నొక్కుకుపోయి, దాని వెనకవైపు ఎముక ముందుకు పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. ఈ సమస్యను ‘బ్యూనియన్’ అంటారు. కొందరిలో ఇది వారసత్వంగానూ కనిపిస్తుంది. షూ వల్ల మరింత పెరుగుతుంది. షూ ఒరుసుకుపోతున్న చోట... నన్ను నేను రక్షించుకునేందుకు మరో అదనపు కణజాలాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాను. ఇలాంటప్పుడు దాని చుట్టూ ఆనంద్ పట్టీ కట్టి దాని పైన షూ తొడుగుతుంటాడు. దాని వల్ల సమస్య మరింత పెరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆనంద్ డాక్టర్‌ను కలిసి, అవసరమైతే శస్త్రచికిత్స లేదా బొటనవేలిని మరింత దృఢతరం చేసుకునే చికిత్సలు చేయించుకోవడం అవసరం. పాదరక్షల ఎంపిక ఎలా ఉండాలంటే... ఆనంద్ తన జీవితకాలంలో సగభాగం నన్ను బూట్ల జైలులో బంధించి ఉంచుతాడు. కానీ అతడికి సరైన పాదరక్షల ఎంపిక ఎలాగో తెలియదు. ఒక కాలికి సరిపోగానే వెంటనే అలాంటిదే మరోకాలికి పరీక్షించకుండానే తొడిగేస్తాడు. ఆనంద్ చేయాల్సింది అది కాదు. తన రెండు పాదాల పొడవును కొలిచి, రెండింటికీ సౌకర్యంగా ఉండే జోళ్లనే ఇవ్వమని చెప్పాలి. అతడి షూస్ అతడి పాదం చివరే ముగియకుండా... మరో రెండు సెంటీమీటర్లు ఎక్కువగా ఉండాలి. పాదంలో వెడల్పుగా ఉండే భాగం ముడుచుకోకుండా, సౌకర్యంగా పరచుకునేలా అతడి షూ ఉండాలి. ఈమధ్య ఆనంద్ షార్ట్ సాక్స్ తొడుగుతున్నాడు. ఇవి చాలా వరకు కాలిని ముడుచుకుపోయేట్లుగా చేసే బిగుతు షూ అంతటి ప్రమాదకరమైనవి. సాక్స్ కాస్త సాగుతూ ఉండేవి అయితేనే మంచిది. -
పాదాల అందం ఇలా పదిలం..
బ్యూటిప్స్ సౌందర్య పోషణలో ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యం చాలా మంది పాదాలకు ఇవ్వరు. వస్త్రధారణ ఎంత బాగున్నా పాదాలు అందంగా, ఆరోగ్యంగా లేకపోతే అజాగ్రత్తగలవారి జాబితాలో చేరిపోతారు. మడమ దగ్గర మురికిగా ఉండటం, పగుళ్లు బారడం.. వంటివి కనిపించకుండా ఉండాలంటే... రోజూ రాత్రి పడుకునేముందు పాదాలను శుభ్రంగా కడిగి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఫూట్ క్రీమ్‌లో గ్లైకోలిక్ యాసిడ్ ఉన్నది ఎంచుకుంటే పాదాల పగుళ్లు రావు, చర్మం మృదువుగా ఉంటుంది. ఈ క్రీమ్ రాసిన తర్వాత సాక్స్ ధరించాలి.నాణ్యమైన బాడీ లోషన్‌ను కాళ్లకు, పాదాలకు రాయాలి. బాదం నూనె, ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో రోజూ పడుకునే ముందు లేదా ఉదయం లేచాక మసాజ్ చేసుకుంటే పాదాలకు మంచి విశ్రాంతి లభిస్తుంది. పాదాల చర్మం కూడా మృదువుగా తయారవుతుంది. ప్యుమిక్స్టోన్తో రుద్ది, కడిగితే మృతకణాలు సులువుగా వదులుతాయి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి, తుడిచి, ఫ్రూట్క్రీమ్ను తప్పక రాసుకోవాలి. పాదాలు నొప్పిగా ఉంటే గోరువెచ్చని నీటిలో సుగంధనూనె కొన్ని చుక్కలు వేసి, అందులో కాళ్లు పెట్టి సేద తీరాలి.కాళ్లకు ఉన్న అవాంఛిత రోమాలను తొలగించాలంటే లేజర్ కన్నా వాక్సినేషన్ సరైన పద్ధతి.స్నానం చేసేటప్పుడు నీళ్లలో కొన్ని చుక్కల నూనెను కలిపితే కాళ్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. పాదాల పగుళ్లు తగ్గాలంటే... క్యాండిల్ వాక్స్, ఆవనూనె కలిపి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని పాదాల పగుళ్లు ఉన్న చోట రాయాలి. తర్వాత కాటన్ సాక్స్ ధరించాలి. రాత్రి మొత్తం ఇలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం శుభ్రపరుచుకోవాలి. ఈ జాగ్రత్తలతో పాటు కాలి గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడం, మసాజ్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే పాదాలు అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. -
ఆనందం పంచి.. విషాదం మిగిల్చి!
పుట్టిన రోజు సంతోషమే వేరు. ఆ పిల్లాడికీ అంతే. తెల్లవారగానే జేబు నిండా చాక్లెట్లు.. మంది నిండా ఉత్సాహంతో పరుగున పాఠశాలకు చేరుకున్నాడు. స్నేహితులు, ఉపాధ్యాయులకు ఆనందం పంచిపెట్టాడు. బెల్లు మోతతో ఒక్క ఉదుటున బయటపడ్డాడు. రద్దీప్రయాణికులతో వస్తున్న బస్సు తనను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్తుందని ఊహించలేకపోయాడు. త్వరగా ఇంటికి చేరుకోవాలనే తాపత్రం ఆ విద్యార్థిని కబళించింది. బస్సు కింద పడి విద్యార్థి మృతి ఉదయం పాఠశాలలో పుట్టిన రోజు సంబరం సాయంత్రం త్వరగా ఇల్లు చేరుకోవాలనే తాపత్రయం రద్దీ నేపథ్యంలో బస్సెక్కబోయి జారిపడిన వైనం ఏపీ మోడల్ స్కూల్లో విషాదం ఎమ్మిగనూరు రూరల్: కడిమెట్లకు చెందిన మహమ్మద్, ఖాజమ్మ దంపతులకు మహబుబ్, ఉసేని సంతానం. ఇద్దరూ మండల పరిధిలోని కడివెళ్ల ఏపీ మోడల్ స్కూల్లో చదువుకుంటున్నారు. మహబూబ్ 7వ తరగతి కాగా.. ఉసేని(11) 6వ తరగతి. శుక్రవారం పుట్టిన రోజు కావడంతో ఉసేని స్కూల్లో స్నేహితులు, ఉపాధ్యాయులకు చాక్లెట్లు పంపిణీ చేశాడు. సాయంత్రం స్కూల్ వదలిన తర్వాత వచ్చిన ఆర్టీసీ బస్సు(ఏపీ28 జెడ్2564) ఎక్కేందుకు పరుగుతీశాడు. అప్పటికే బస్సు రద్దీగా ఉండటం, కొందరు విద్యార్థులు ఫుట్‌బోర్డుపై వేలాడుతున్నా త్వరగా ఇల్లు చేరుకోవాలనే ఆత్రుతతో తనూ ఎక్కే ప్రయత్నం చేశాడు. మరో ఇద్దరు విద్యార్థులు కూడా అదే ప్రయత్నం చేయబోగా ముగ్గురూ కిందపడిపోబోయారు. సీనియర్ విద్యార్థులు ఇద్దరిని కాపాడగా.. ఉసేని నడుము పైనుంచి బస్సు టైరు ఎక్కింది. తీవ్ర గాయాలైన విద్యార్థిని ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు 108 అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్ కృష్ణయ్య తన సుమో వాహనంలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అయితే ఉసేని మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఆసుపత్రిలో కుటుంబీకులను పరామర్శించారు. 526 మంది విద్యార్థులకు మూడు బస్సులు కడివెళ్ల ఏపీ మోడల్ స్కూల్లో ఆరు నుంచి ఇంటర్మిడియట్ వరకు 526 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇంత మంది విద్యార్థులకు 5 ఆర్టీసీ బస్సులు అవసరం కాగా.. ప్రస్తుతం మూడింటినే పంపుతున్నారు. గతంలో ఒకే బస్సు వచ్చేది.. అప్పడు బస్సు టాప్ పైనుంచి విద్యార్థి కింద పడి కాలు విరిగింది. సాయంత్రం ఒక బస్సు 4.30 తర్వాత వస్తుండటంతో విద్యార్థులు త్వరగా ఇంటికి చేరుకోవటానికి ఎగబడతున్నారు. మరో రెండు బస్సులు 5 గంటలకైనా రావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ మూడు బస్సుల్లో విద్యార్థులు అతి కష్టం మీద ఇళ్లకు చేరుకుంటున్నారు. బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ అధికారులను పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు చెప్పారు. -
భూతప్పల కాలి స్పర్శ కోసం.. వేయి కళ్లతో!
వాళ్ల కాలి స్పర్శ తగిలితే చాలు.. సర్వ శుభాలు జరుగుతాయని, వ్యాధులన్నీ నయమవుతాయని నమ్మకం. ఆ కాలి అడుగులు తగలడం కోసం ఉపవాస దీక్షతో.. తడిదుస్తులు ధరించి.. వాళ్లొచ్చే దారిలో ఇలా పడుకుంటారు. ఇదంతా అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని భక్తరపల్లి ప్రాంతంలో జరిగే భూతప్పల ఉత్సవం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, జిల్లేడుకుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతియేటా మార్గశిరమాసంలో వారం రోజుల పాటు జరుగుతాయి. ఇక్కడకు వచ్చే భూతప్పల కాలి స్పర్శ కోసం వందలాది మంది భక్తులు వేచి చూస్తుంటారు. భక్తులు బియ్యపుపిండి, బెల్లం కలిపి చలివిడితో హారతులు చేసి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మెక్కులు తీర్చుకుంటారు. హారతుల ఉత్సవం తర్వాత జరగే భూతప్పల ఉత్సవం ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. భూతప్పల కాలి స్పర్శ కోసం వాళ్లు వచ్చే దారిలో ఎంతోమంది భక్తులు ఉపవాస దీక్షతో, తడిబట్టలతో వేచి ఉంటారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వాముల వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. ఉత్సవ విగ్రహాల ముందు భూతప్పలు కత్తి, డాలు పట్టి విన్యాసాలు చేస్తూ దారివెంట బోర్లాపడుకున్న భక్తులపై నడుచుకుంటూ వెళ్తారు. అలా వెళ్లేటప్పుడు.. ఎవరెవరికి వాళ్ల కాలి స్పర్శ తగులుతుందో.. వాళ్లకు సర్వ శుభాలు కలుగుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం. ఈ తంతు అనాదిగా ఇక్కడ జరుగుతూనే ఉంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తారు. -
కాలిబాటలు ఆక్రమిస్తే కటకటాల్లోకే..
- పదేపదే ఉల్లంఘిస్తే తప్పదన్న ట్రాఫిక్ చీఫ్ - ఈ తరహా కేసులన్నీ ఇక ట్యాబ్‌ల ద్వారానే - జీపీఎస్, లెసైన్సు వివరాలతో సహా నమోదు - మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన నగర కొత్వాల్ సాక్షి : రహదారులపై సామాన్యుల నడకను నరకప్రాయంగా చేస్తున్న ఫుట్‌పాత్ ఆక్రమణల్ని ట్రాఫిక్ విభాగం అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పదే పదే ఈ నేరానికి పాల్పడుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ సహకారంతో ట్రేడ్ లెసైన్సుల రద్దుతో పాటు న్యాయస్థానం ద్వారా జైలుకు కూడా తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నగర ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న అధికారుల ట్యాబ్‌ల కోసం ప్రత్యేక యాప్ రూపొందించారు. దీన్ని మంగళవారం కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. నగర కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో ఉన్న 150 మంది అధికారులకు అందించిన ట్యాబ్స్‌లో దీన్ని నిక్షిప్తం చేస్తున్నారు. నగరంలోని ఫుట్‌పాత్‌లను దుకాణదారులతో పాటు చిరువ్యాపారులూ ఆక్రమిస్తున్నారు. దీంతో పాదచారులు రోడ్డు మీదనే నడవాల్సి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరహా ఉల్లంఘనులపై ట్రాఫిక్ పోలీసులు సిటీ పోలీసు చట్టంలోని 39 (బి) సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు చలాన్ పుస్తకాల ద్వారా ఈ కేసులు రాస్తుండటంతో డేటాబేస్ లేక పదే పదే ఆక్రమిస్తున్న వారిని సాంకేతికంగా గుర్తించడం సాధ్యం కావట్లేదు. దీనికి పరిష్కారంగానే యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌ను వినియోగించి చలాన్ విధించినప్పుడు అనేక వివరాలను ఆన్‌లైన్‌లోకి చేరతాయి. వ్యాపారి వివరాలతో పాటు దుకాణం ట్రేడ్ లెసైన్స్ సంఖ్య, టిన్ నెంబర్, జీపీఎస్ ప్రకారం ఆ దుకాణం ఉన్న ప్రాంతం తదితరాలు నమోదు అవుతాయి. ఓసారి పోలీసులు కేసు రాసిన తర్వాత ఒకటి రెండు రోజులకు మళ్ళీ ఫుట్‌పాత్‌ను ఆక్రమించేస్తుంటారు. ఇలా పదే పదే ఉల్లంఘనకు పాల్పడే వారి వివరాలతో డేటాబేస్ రూపొందుతుంది. వీటి ఆధారంగా న్యాయస్థానంలో చార్జ్‌షీట్ వేసి జైలుకు పంపేలా చేయడంతో పాటు దుకాణం లెసైన్సు రద్దు చేయించేందుకు వీలుంటుంది. -
చక్రంపేటలో పులి - భయంతో వణుకుతున్న జనం
మొయిన్‌పేట మండలం చక్రంపేట గ్రామ శివారులోని పొలాల్లో బుధవారం మధ్యాహ్నం పులి సంచరిస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. వారు ఈ విషయాన్ని అధికారులకు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పొలాలను పరిశీలించారు. పులి అడుగు జాడలు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రజలు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరో వైపు పులిని బంధించేందుకు అటవీ సిబ్బంది ఏర్పాట్లు చేస్తారని తెలియజేశారు. -
అతి భారీ పాదం
ఫోటోలో కనపడుతున్నది వెనెజులాకు చెందిన జీసన్ ఒర్లాండో రోడ్రిగ్వెజ్ హెర్నాండెజ్. వయసు 20 ఏళ్లు. 2016 గిన్నిస్ బుక్‌లో ఇతనికి చోటు దొరికింది. ఈ ఆజానుబాహుడి పాదం మామూలు పాదం కాదు. ఏకంగా ఒక అడుగు, నాలుగు అంగుళాల పొడవుంది. సాధారణంగా అయితే మన షూ సైజు ఏ ఎనిమిదో, తొమ్మిదో ఉంటుంది. మరి ఇతగాడి సెజైంతో తెలుసా? 26. ఇతనికి పాద రక్షలను ప్రత్యేకంగా తయారు చేయాల్సిందే. అందుకే గిన్నిస్‌లోకి ఎక్కేశాడు. -
డయాబెటిక్ ఫుట్ కౌన్సెలింగ్
డయాబెటిక్ రోగుల్లో పాద సంరక్షణ ఎలా? నా వయసు 63. నేను గత పదేళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నాను. ఇటీవలే మీరు ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఐదు నుంచి పదేళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్న రోగులు తమ పాదాలను సురక్షితంగా చూసుకోకపోతే కాళ్లను తొలగించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అయితే పాదాలను సురక్షితంగా చూసుకునే ప్రక్రియలను విపులంగా వివరిస్తే నాలాంటి రోగులెందరికో మేలు కలుగుతుందని నా భావన. దయచేసి... డయాబెటిస్ రోగులు పాదసంరక్షణలో పాటించాల్సిన సూచనలను వివరించగలరు. - బి. చంద్రశేఖరరావు, శ్రీకాకుళం షుగర్ ఉన్న ప్రతివారూ, అందునా ఐదు నుంచి పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తమ కాళ్లనూ ప్రత్యేకంగా పాదాలను చాలా జాగ్రత్తగానూ, నిశితంగానూ పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ క్రమంలో పాటించాల్సిన మార్గదర్శకాలివి... తరచూ కాలి పరీక్ష స్వయంగా చేసుకుంటూ ఉండటం : ఈ ప్రక్రియంలో భాగంగా పాదాల కింద అద్దం పెట్టుకుని, పాదం ఏ విధంగా ఉందో చూసుకోవాలి. కాలి పైభాగాన్నీ నిశితంగా పరీశించుకోవాలి. అలాగే కాలి వేళ్ల మధ్య భాగాలనూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరిశీలనలో చిన్న పొక్కులాంటిది ఉన్నా దాన్ని విస్మరించ కూడదు. భవిష్యత్తులో అది పుండుగా మారే ప్రమాదం కూడా ఉండవచ్చు నిత్యం పాదాలను పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య కూడా పొడిగా ఉండటం కోసం పౌడర్ రాసుకోవాలి కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లూ కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకండి. సౌకర్యంగా ఉండేవి మాత్రమే ఎంచుకోవాలి వేడి వస్తువులనుంచి మీ కాళ్లను దూరంగా ఉంచుకోండి. డయాబెటిస్ ఉన్నవారు హాట్ వాటర్ బ్యాగ్‌తో కాళ్లకు కాపడం పెట్టుకోకపోవడమే మంచిది పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుకున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్‌తో కాళ్లను రుద్దుకొని, మళ్లీ ఆ తర్వాత పొడిగానూ మారేలా శుభ్రం చేసుకోవాలి కాళ్ల మీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్‌ను సంప్రదించి, ఆయన పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవడం చాలా ముఖ్యం కాలిగోళ్లను ప్రతివారమూ తొలగించుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. ఇది డయాబెటిస్ రోగుల్లో ప్రమాదం ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకండి. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి ఏడాదికోసారి కాలి వైద్య నిపుణులు (డయాబెటిక్ పోడియాట్రిస్ట్)కు చూపించుకుంటూ ఉండాలి. ఇవన్నీ కాలి సంరక్షణకు ఉపయోగపడే మార్గాలు. డాక్టర్ వి. రఘు కార్డియాలజిస్ట్, ప్రైమ్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఆర్టీసీ బస్సు కిందపడి యువకుడికి తీవ్రగాయాలు
చేవెళ్ల ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో సంఘటన చేవెళ్ల రూరల్: ఆర్టీసీ బస్సు కింద పడి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, బాధితుడు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ మండలం అలంపల్లి గ్రామానికి చెందిన పి.యాదగిరి అనే యువకుడు ఆటో నడిపించుకుంటూ జీవిస్తున్నాడు. సోమవారం ఓ పని నిమిత్తం నగరానికి వెళ్లేందుకు వికారాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ఎక్కాడు. కాగా బస్సు సాయంత్రం చేవెళ్ల బస్‌స్టేషన్‌కు చేరుకుంది. చేవెళ్లలో బస్ దిగేసమయంలో ఫుట్‌బోర్డుకు దగ్గరలో ఉన్న ఆ యువకుడు కిందికి దిగి మళ్లీ బస్సు ఎక్కుతున్న సమయంలో అతడి చెప్పు ఊడిపోయి కిందపడిపోయింది. దీంతో చెప్పును తీసుకొనే ప్రయత్నం చేస్తుండగా.. అప్పటికే కదిలిన బస్సు ముందు టైరు కింద పడిపోయాడు. దీన్ని గమనించని డ్రైవర్ బస్సును వెనక్కి తీయటంతో ఆ యువకుడి పైకి ఎక్కింది. దీంతో త్రీవంగా గాయపడిన యువకుడిని 108లో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఆస్పత్రికి తరలించారు. చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రి కార్యాలయం ముట్టడి
విశాఖపట్నం: విశాఖపట్నంలోని పుట్ పాత్లపై వ్యాపారుల తోపుడు బళ్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడంపై చిరు వ్యాపారులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని కోరుతూ ఏపీ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా అధికారులు బళ్లను తొలగించారని వారు మండిపడ్డారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన వ్యాపారులకు సూచించారు. -
కాలినడకన తిరుపతికి ఎమ్మెల్యే
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలె యాదయ్య తిరుపతికి కాలినడకన వెళుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే పాదయాత్రతో తిరుపతికి వస్తానని ఆయన మొక్కుకున్నారు. దీంతో ఆయన సోమవారం తన స్వగ్రామమైన నవాబ్‌పేట మండలం చింతలపేట నుంచి తిరుపతికి కాలినడకన బయలుదేరారు. చేవెళ్లకు మంగళవారం చేరుకున్న ఎమ్మెల్యే యాదయ్య బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలని వేంకటేశ్వర స్వామిని దర్శించారు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి యాత్ర ప్రారంభించారు. రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఈ యాత్రకు చేవెళ్లలో స్వాగతం పలికారు. అయితే కాలే యాదయ్య కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. గత నవంబర్‌లో యాదయ్య టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. -
అచ్చం పాదం లాగే ఉందే!
అయాగవా: ఇది అచ్చం భారీ పాదం లాగా ఉందికదా! 30 సెంటీ మీటర్ల పొడవున్న ఈ ముల్లంగి కిలోన్నర బరువుంది. జపాన్‌లోని అయాగవా పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న కూరగాయల ఎగ్జిబిషన్లో ఇది చూపరులను విశేషంగా ఆకర్శిస్తోంది. యుకిహిరో యుకేచి అనే జపాన్ రైతు పొలంలో ఇది కాచింది. దీన్ని అధిక ధరకు విక్రయించి లాభపడుతామని ముందు భావించిన సదరు రైతు చివరకు మనసు మార్చుకొని పట్టణంలో కొనసాగుతున్న కూరగాయల ప్రదర్శనకు తీసుకొచ్చారు. -
హా...ర్టీసీ!
సాక్షి, సిటీబ్యూరో: నగరం, శివారు ప్రాంతాల్లోని విద్యార్థులు కళాశాలల్లో సీట్ల కోసమే కాదు... బస్సులు పట్టుకోవడానికి... వాటిలో సీట్లు సంపాదించడానికి కూడా పోటీ పడాల్సి వస్తోంది. పది కిలోమీటర్ల దూరమైనా...రెండు గంటలు ముందు బయలుదేరనిదే సకాలంలో తరగతులకు హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం విద్యార్థుల సంఖ్యకు తగిన స్థాయిలో ఆర్టీసీ బస్సులు లేకపోవడమే. ఉదయం, సాయంత్రం బస్సు ప్రయాణం ఒక సవాల్‌గా మారింది. వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం శివార్లలోని ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలలకు వెళ్తుండగా వాళ్ల కోసం కనీస సంఖ్యలో ఆర్టీసీ బస్సులు నడపలేకపోతోంది. అందుబాటులో ఉండే కొద్దిపాటి బస్సుల్లోనే విద్యార్థులు ప్రమాదపుటంచుల్లో పయనిస్తున్నారు. ఫుట్‌బోర్డులు, టాప్‌లపై పయనిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేవరకూ తల్లిదండ్రులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని గడుపుతున్నారు. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్ మార్గంలో నిత్యం 30 వేల మందికి పైగా విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నారు. వారిలో 24 వేల మంది ఆర్టీసీ పైనే ఆధారపడి ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కలిపి 101 బస్సులు మాత్రమే ఈ మార్గాల్లో నడుస్తున్నాయి. ఇవి కేవలం విద్యార్థుల కోసం నడిపేవే కాదు. అన్ని వర్గాల ప్రయాణికులను అనుమతిస్తారు. దీంతో ప్రయాణం ప్రమాదకరంగానే ఉంటుంది. నగరంలోని అన్ని రూట్లలో ఇదే పరిస్థితి. పరుగెత్తే బస్సులను అందుకొనేందుకు విఫలయత్నం చేస్తూ ఏటా వందలాది మంది విద్యార్థులు ప్రమాదాల బారిన పడి క్షతగాత్రులవుతున్నారు. అమ్మాయిలు సైతం ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. * నగర శివార్లలో 500కు పైగా ఇంజినీరింగ్, ఫార్మా, మేనేజ్మెంట్, ఎంసీఏ, తదితర వృత్తి విద్యా కళాశాలల్లో 3 నుంచి 4 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 2.5 లక్షల మంది ఆర్టీసీ పైనే ఆధారపడి పాస్‌లు తీసుకున్నారు. అవి ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. * 9 ప్రధాన మార్గాల్లో ఆర్టీసీ 771 బస్సులు నడుపుతోంది. మొత్తం 7,459 ట్రిప్పులు నడుపుతున్నట్లు చెబుతున్నారు. కానీ విద్యార్థుల సంఖ్యకు సరిపడేలా ఉంటున్నాయా అన్న ప్రశ్నకు వారివద్ద సమాధానం లేదు. ఇదీ ప్రమాదాల సంఖ్య... ► ఎల్బీనగర్ పరిధిలో ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు: 30, క్షతగాత్రులు : 50 మంది ► పేట్‌బషీరాబాద్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు ► 88 రోడ్డు ప్రమాదాలు జరిగితే 29 మంది మరణించారు. వారిలో విద్యార్థుల ► సంఖ్య 12గా పోలీసులు చెబుతున్నారు. ► దుండిగల్ పరిధిలో 93 రోడ్డు ప్రమాదాల్లో 48 మంది మృతి చెందగా... ► వారిలో 15 మంది విద్యార్థులు ఉన్నారు. ► జీడిమెట్ల ప్రాంతంలో జరిగిన 66 రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృతి చెందారు. ► వారిలో నలుగురు విద్యార్థులు. ► గతంలో ప్రమాదాల నివారణకు బస్ స్టాపులలో నియమించిన ► హోంగార్డులను ఇటీవల తొలగించారు. -
పుట్‌పాత్ పాలైన బతుకులు
-
యువ సేన @ ట్రాన్స్ఫార్మర్స్
చెత్త తీసుకెళ్లేవాడు వస్తేనే ఆరడుగుల దూరంలో నుంచో పెట్టడం... మాసిపోయిన దుస్తుల్లో ఎవరైనా కనిపిస్తే చాలు వారిని హీనంగా చూడటం... ఇదీ మన సమాజం తీరు. ఈ సంఘం నుంచి ఫుట్‌పాత్ మీద కునారిల్లుతున్న బతుకులను చూసి అసహ్యించుకోవడమో, ఆమడదూరం నుంచి సాగిపోవడమో తప్ప వారిని ఆప్యాయంగా స్పర్శించే మానవత్వం ఆశించగలమా ? మట్టికొట్టుకుపోతున్న ముఖాలను తుడిచి, కడిగిన ముత్యాల్లా మెరిపించే ప్రేమాభిమానాలను ఊహించగలమా? కాచిగూడ రైల్వేస్టేషన్ ప్రాంతం..ఆదివారం.. సాయంత్రం 4 గంటలు.. ఫుట్‌పాత్ మీద ఓ వ్యక్తి ఉన్నాడు. చింపిరి జుట్టు.. అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డం.. అక్కడక్కడా గాయాలు.. ముసిరిన ఈగలు.. అటుగా వెళ్తున్న వారు అతడ్ని చూడగానే దూరంగా జరిగి వెళ్తున్నారు. కొందరు ఈసడించుకుంటున్నారు. అదే సమయంలో ఓ ఐదుగురు యువకులు అక్కడికి వచ్చారు. ఫుట్‌పాత్‌పై ఏదో ధ్యాసలో ఉన్న ఆ వ్యక్తిని పలకరించారు. ఏదో చెబుతున్నారు.. అతను వద్దంటున్నాడు (సైగలతోనే). వీరు గడ్డం పట్టుకుని బతిమాలుతున్నారు. చుట్టుపక్కల జనాలంతా ఈ తంతును వింతగా చూస్తున్నారు. ఓ అరగంట తర్వాత అతడు సరేననడంతో సీన్ మారిపోయింది. అప్పటికప్పుడు తమ వెంటున్న సరంజామా బయటకు తీశారు. ఒకరు హెయిర్ స్టైలిస్ట్‌గా మారిపోతే, మరొకరు ఆస్పత్రిలో నర్స్ విధులను మొదలుపెట్టారు. ఒకరు వెంట తెచ్చిన క్యారియర్ నుంచి ఫుడ్ తీసి సిద్ధం చేస్తుంటే.. ఇంకొకరు ఓ వారానికి సరిపడా.. మందులు, సబ్బులు వంటివి కిట్‌లో సర్దుతున్నారు. ‘మమత కరువై.. మనుషుల మధ్యే మానుల్లా మనుగడ సాగిస్తున్న వారి జీవితాలు శిథిలమైపోతుంటే మౌనంగా ఉండటం సరైనదేనా..?’.. ఈ ప్రశ్నకు సమాధానంగా అవతరించిందే ‘ట్రాన్స్ఫార్మర్స్’. ఫుట్‌పాత్‌పై తెల్లారిపోతున్న బతుకులకు కాసింత వెలుగు ప్రసాదించడానికి నగర యువత తీసుకొచ్చిన కాంతిపుంజం. ఆదివారం అంటే ఆనందం అనుకునే ఈ తరం యువతకు కాస్త భిన్నంగా హాలిడేను హార్ట్ టచింగ్ డేగా కూడా మార్చుకుంటున్నారు వారు. మ్యూజిక్ బాండ్ నుంచి యంగిస్థాన్ వరకు.. నగరానికి చెందిన అరుణ్ డేవిడ్ మరికొందరు మిత్రులతో కలసి టేకెన్ పేరుతో మ్యూజిక్ బ్యాండ్ నిర్వహించేవారు. ‘అప్పడు మేం చాలా కన్సర్ట్స్‌లో సోషల్ రెస్పాన్సిబులిటీ గురించి పాటలు పాడేవాళ్లం. వాటికి ఇన్స్పైర్ అయిన వారు.. ఏం చేయాలని అడిగేవారు. అప్పుడే ఓ వేదిక స్థాపించాలనుకున్నాం. అలా ఓ ఐదుగురం కలసి 2012 మార్చిలో యంగిస్థాన్ స్టార్ట్ చేశాం’ అని తమ తొలి అడుగులను గుర్తు చేసుకున్నారు అరుణ్. ప్రస్తుతం ఇందులో 120 మంది రిజిస్టర్ట్ వాలంటీర్లు ఉన్నారు. ప్రతి ఆదివారం వీరు సమావేశమవుతారు. వారానికో వాలంటరీ ఇంట్లో వంట చేయించి 1,000 మంది నిర్భాగ్యులకు పంపిణీ చేస్తుంటారు. ప్రతి శనివారం కనీసం ఐదు అనాథ శరణాలయాలకు వెళ్లి అక్కడి పిల్లలకు ట్యూషన్ చెబుతారు. ఇదే కోవలో ఈ యువసేన వేసిన మరో ముందడుగే ట్రాన్స్ ఫార్మర్స్. ఆలోచన వెనుక.. ఫుట్‌పాత్ మీద అపరిశుభ్రంగా ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఈ ఆలోచన కలిగిందని యంగిస్థాన్ సభ్యుడు రోహిత్ చెబుతాడు. ‘పగబట్టిన విధి వీరిని విగత జీవులుగా మార్చేసింది. నెలలు కాదు ఏళ్లకేళ్లు వీళ్లు స్నానం చేయరు. వీరి జీవితాలను ఎందుకు మార్చకూడదు అనిపించింది అనుకున్న’ ఈ యువత కాచిగూడ స్టేషన్ దగ్గర ఫుట్‌పాత్ మీదున్న ఓ వృద్ధుడి మేకోవర్‌తో ‘ట్రాన్స్ఫార్మర్స్’గా తొలి అడుగు వేసింది. ‘అపరిశుభ్రంగా ఉన్న ఆ వృద్ధుడ్ని ఎంతో బతిమాలితే గాని ఒంటి మీద చేయి వేయనీయలేదు. అతనికి ట్రిమ్ చేసి.. స్నానం చేయించి.. ఫొటో తీసి చూపిస్తే.. ఆయన దాన్ని ముద్దాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడ’ని చెప్పుకొచ్చారు ఆ యువకులు. వారానికి ఐదుగురు వీరిలో వారానికి ఐదుగురు బ్యాచ్ చొప్పున ట్రాన్స్ఫార్మర్స్ అవతారమెత్తుతున్నారు. హెయిర్ కటింగ్, ప్రాథమిక చికిత్స మెళకువలు నేర్చుకుంటు న్నారు. ‘మేకోవర్‌కు గంట పడుతోంది. కొందరి వెంట్రుకల్లో పురుగులుంటాయి. కొందరి జుట్టు కట్ చేయడానికి వీలులేకుండా ఉంటాయ’ని గుర్తు చేసుకుంటూ ఆ అభాగ్యజీవుల బతుకులపై వీరికున్న సానుభూతి వ్యక్తమైంది. అలా వదిలేయకుండా.. ‘ఈ ఫుట్‌పాత్ జీవులలో వృద్ధులే ఎక్కువ. పిల్లల ఆదరణ లేని వారు, రోడ్డు ప్రమాదాలకు గురై మానసికంగా దెబ్బతిన్నవారు.. ఇలా ఎందరో ఉన్నారు. వీరిని మేకోవర్ పూర్తయ్యాక వదిలేయకుండా ట్రైనింగ్ సెంటర్స్‌కు పంపాలని ఆలోచనలో ఉన్నాం. రిహాబిలిటేషన్, స్కిల్ ట్రైనింగ్, షెల్టర్ హౌస్‌కు కూడా ప్లాన్ చేస్తున్నాం. సులభ్ వారితో మాట్లాడి వారికో శాశ్వతమైన ఐడీ తీసుకుందాం అనుకుంటున్నాం’ అంటూ తమ భవిష్యత్ ప్రణాళికలు వివరించారీ మిత్రబృందం. ‘ది సోల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు సర్వ్ హ్యుమానిటీ’ అన్న లియో టాల్‌స్టాయ్ మాటల్నే తమ చేతలకు ప్రాతిపదికగా చెబుతున్న ఈ స్నేహితులు చేస్తున్న సేవ.. యువత నడతకు కొత్త భాష్యం. -
అందంగా... మొదటి అడుగు...
మెట్టినింట పెట్టే మొదటి అడుగు అందంగా ఆ తర్వాతి అడుగు ఆనందంగా సాగాలని నవవధువు కోరుకుంటుంది. అమ్మాయిల ఊహలకు తగ్గట్టు డిజైనర్లు పెళ్లికూతురి పాదాలను ఆభరణాల అలంకరణలతో ముచ్చటగొలుపుతున్నారు. వివాహ సమయాలలో పెళ్లికూతురికి నగల అలంకరణ ఎంత బాగుంటే అంత కళగా ఉంటుంది. అందుకే పెద్దలు కూడా వధువు ఆభరణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మెడకు, చేతులకు, నడుముకు నగలను ఆలంకరించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. ఇప్పుడు పాదాలను ఈ జాబితాలో చేర్చుతున్నారు ఆభరణాల నిపుణులు. కాళ్లపట్టీల గురించి తెలిసిందే! కానీ పాదాలను కప్పినట్టుగా ఉంచే ఈ డిజైన్లు అతివలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పాదాల ఆభరణాలలో కుందన్స్, పూసలు, ముత్యాల మెరుపులు కొత్తగా కాంతులీనుతున్నాయి. బంగారు, వెండి ఆభరణాలలోనే కాకుండా వన్ గ్రామ్ గోల్డ్‌లో ఇవి కనువిందు చేస్తున్నాయి. -
ఫోర్బ్స్ జాబితాలో ధోని
ఏడాదిలో రూ. 177 కోట్ల ఆర్జన న్యూయార్క్: భారత క్రికెట్ కెప్టెన్ ధోని.. దేశంలోకెల్లా అత్యధిక ఆర్జన గల క్రీడాకారుడిగా ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదనతో తొలి 100 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులతో ఫోర్బ్స్ వెబ్సైట్ జాబితా రూపొందించింది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ దాకా 12 నెలల కాలంలో ధోని రూ. 177 కోట్లు ఆర్జించి ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి ఈ జాబితాలో నిలిచిన ఏకైక క్రీడాకారుడు ధోనియే. ఈ జాబితాలో అమెరికా బాక్సర్ మేవెదర్ ఏడాది కాలంలోనే రూ. 621 కోట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. టైగర్ వుడ్స్ రూ. 591 కోట్లతో రెండో స్థానం పొందాడు. ఫుట్‌బాల్ ఆటగాళ్లలో రొనాల్డో (పోర్చుగల్) రూ. 473 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
మేయర్‌గా ఫుట్పౌడర్
మేయర్లుగా జంతువులు ఎన్నికైన ఉదంతాలు తెలిసిందే. ఈక్వెడార్‌లోని పికోజా నగర మేయర్ పదవికి 1967లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా ఒక ఫుట్ పౌడర్ (పాదాల దుర్వాసన పోగొట్టే పౌడర్) ఎన్నికైంది. ‘పల్వాపీస్’ బ్రాండ్ పేరిట ఫుట్ పౌడర్ ఉత్పత్తి చేసే కంపెనీ, మేయర్ ఎన్నికల్లో తన ఉత్పత్తినే అభ్యర్థిగా నిలిపింది. అభ్యర్థులంతా హోరాహోరీగా ప్రచారపర్వంలో నిమగ్నమై ఉంటే, మీడియా మాత్రం ఈ ఫుట్పౌడర్ను తలకు పూసుకొని హిప్పీలు చేపట్టిన నిరసన ప్రదర్శనలకు విపరీతమైన ప్రచారం కల్పించింది. ‘ఏ అభ్యర్థికైనా ఓటేయండి... ఆరోగ్యం కావాలంటే మాత్రం ‘పల్వాపీస్’కే ఓటేయండి’ అంటూ ఫుట్పౌడర్ కంపెనీ సాగించిన ప్రచారానికి ఆకర్షితులైన ప్రజలు ఫుట్పౌడర్కే పట్టం కట్టారు. -
పాదాలనొప్పి... నివారణ... చికిత్స
వయసు పెరుగుతున్నకొద్దీ పాదాల్లో నొప్పి రావడం చాలామందిలో కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అవేమిటో తెలుసుకుందాం... మడమ కింది భాగం నుంచి మొదలై కాళ్ల వేళ్ల వద్ద ఉండే ఎముకల వరకు... అంటే పాదమంతా విస్తరించి ఉండే భాగాన్ని ప్లాంటార్ ఫేషియా అంటారు. అది ఎముకనూ, కండరాలనూ కలిపే ధాతువు వంటిది. దీనికి సాగే గుణం ఎక్కువ. ఇది పొట్టిగా ఉంటే పాదం వద్ద వంపు పెద్దగా ఉంటుంది. పొడవుగా ఉంటే పాదం వద్ద వంపు తక్కువగా ఉంటుంది. మరీ పొడుగ్గా ఉంటే పాదం అంతా సమతలంగా కిందికి ఆనినట్లుగా ఉంటుంది. ప్లాంటార్ ఫేషియా కింద కొవ్వుపదార్థం ఉండటం వల్ల నడుస్తున్నప్పుడు దానిపై పడే ఒత్తిడి నుంచి ఈ కొవ్వు నిండిన భాగం కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ ఫేషియాకు ఏదైనా గాయం తగిలితే పాదం నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పులు సాధారణం గా ఉదయం వేళల్లో ఎక్కువగా ఉంటాయి. కూర్చుని అకస్మాత్తుగా లేచినప్పుడు పాదాల్లో నొప్పి రావచ్చు. కొందరిలో సూదులతో గుచ్చినట్లుగా కూడా నొప్పి కలగవచ్చు. పాదాల నొప్పుల నివారణకు: పాదాల్లో నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పాదంపై పడే భారాన్ని గణనీయంగా తగ్గించి, పాదానికి విశ్రాంతి ఇవ్వాలి. ఇందుకోసం ఎక్కువగా నడవడం, పరుగెత్తడం తగ్గించాలి. పాదం మధ్యలో వంపు తిరిగి ఉన్న భాగానికి సపోర్ట్ ఇచ్చేలా ఉండే పాదరక్షలను ఎంచుకోవాలి. ఒకవేళ ఫ్లాట్ పాదరక్షలు వాడేవారికి పాదాల్లో నొప్పి వస్తుంటే... ఆర్చ్‌లా వంపు తిరిగి ఉన్న భాగానికి సపోర్ట్ ఇచ్చేలా అక్కడ స్పాంజి వంటి మెత్తటి పదార్థాన్ని పాదరక్షలోని ఆ ప్రదేశంలో అమర్చుకోవడం మంచిది. దీనివల్ల వంపు భాగంలో ఒత్తిడి తగ్గుతుంది. ఈ వ్యాయామాలతో పాదం నొప్పి నుంచి ఉపశమనం... ఫేషియాను సాగేలా చేసే వ్యాయామం: గోడ ఎదురుగా నిలబడి, మీ చేతుల్ని గోడపై ఆన్చాలి. నొప్పిగా ఉన్న కాలిని వెనక్కు పెట్టి పాదాలను ఫ్లాట్‌గా భూమికి ఆన్చి ఉంచాలి. ఇప్పుడు మోకాళ్లను వంచాలి. ఈ సమయంలో పాదాలను లేపకూడదు. దీన్ని ఆరు నుంచి ఎనిమిది సార్లు రిపీట్ చేయాలి. ఇలా చేస్తే ఫేషియా సాగి నొప్పి తగ్గే అవకాశాలు ఎక్కువ. పిక్క సాగేలా చేసే వ్యాయామం: గోడ ఎదురుగా నిలబడి చేతులను గోడపై ఆన్చాలి. నొప్పిగా ఉన్న కాలిని నిలకడగా ఉంచి మరోకాలిని మోకాళ్ల వద్ద ముందుకి వంచాలి. ఈ సమయంలో పాదాలు నేలను తాకి ఉండేలా చేయాలి. దీన్ని ఆరు నుంచి ఎనిమిది సార్లు రిపీట్ చేయాలి. కాలి కండరాలను బలపరచుకోవడం కోసం: ఇందుకోసం కాలి మునివేళ్లపై నిలబడి పైన ఉండే వస్తువును అందుకోవడానికి ప్రయత్నించినట్లుగా సాగాలి. కాలివేళ్లను దృఢంగా చేసుకోవడం కోసం: కింద పడి ఉన్న వస్తువును కాలివేళ్లతో అందుకోవాలి. ఈ నాలుగు రకాల వ్యాయామాలు చేస్తుండటం వల్ల పాదాలనొప్పులు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. చికిత్స: పాదాల నొప్పుల తీరుతెన్నులను, వ్యక్తి లక్షణాలను బట్టి మంచి హోమియో వైద్యుని ఆధ్వర్యంలో ఆర్సెనికమ్, లెడమ్పాల్, పెట్రోలియమ్, జింకమ్, ఆసిడ్ బెంజ్, రొడోడెండ్రాన్, కాస్టికమ్ మొదలైన మందులను వాడితే మంచి ఫలితం ఉంటుంది. -
ఆర్టీసీ డ్రైవర్ల దూకుడు
=ప్రమాదాలకు నిలయం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతం =అడ్డగోలు పార్కింగ్లు.. కానరాని బస్షెల్టర్లు సాక్షి, సిటీబ్యూరో/ సికింద్రాబాద్, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణికులకు రక్షణ కరువవుతోంది. అడ్డదిడ్డంగా నిలుపుతున్న బస్సులు, డ్రైవర్ల దూకుడు ప్రయాణికులను అయోమయానికి గురి చేయడంతోపాటు, నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులు ఢీ కొడుతున్న ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడుతుండగా, మరెందరో క్షతగాత్రులవుతున్నారు. బుధవారం ఉదయం మేడ్చల్ డిపోకు చెందిన ఒక ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక ద్విచక్రవాహనం పెకైక్కిన ఆర్టీసీ బస్సు ఏడుగురిని గాయపరిచింది. అదృష్టవశాత్తు ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టి బస్సు నిలిచిపోయింది. లేకుంటే పలువురు ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసేవి. డ్రైవర్ల నిర్లక్ష్యం, తొందరపాటుతనం ఫలితంగా రేతిఫైల్ బస్‌స్టేషన్ ప్రాంతంలో ప్రయాణికుల ప్రాణాలు కనురెప్ప పాటున గాలిలో కలుస్తున్నాయి. రహదారులపైనే బస్‌స్టాప్‌లు రేతిఫైల్ బస్‌స్టేషన్‌తోపాటు రైల్వేస్టేషన్‌ను ఆవరించి ఉన్న ఆరు బస్‌స్టాపుల్లో ఎక్కడా ప్రయాణికులకు కాసేపు నిల్చునేందుకైనా అనువైన వాతావరణం లేదు. స్టేషన్ ప్రాంతంలోని ఉప్పల్ బస్టాప్, చిలకలగూడ చౌరస్తా, గురుద్వార్, 31 బస్టాప్ ప్రాంతాల్లో రహదారులపైనే అడ్డదిడ్డంగా నిలుపుతున్న బస్సులు ఎక్కడానికి మహిళలు, వృద్ధులు పడరాని పాట్లు పడుతున్నారు. దురాక్రమణలో ఫుట్‌పాత్‌లు ఆల్ఫా హోటల్ మొదలు, రామకృష్ణ హోటల్ వరకు రైల్వేస్టేషన్ ముందుగల ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇష్టారాజ్యంగా నిలుపుతూ, తిప్పుతున్న ఆర్టీసీ బస్సుల ద్వారా సంభవిస్తున్న ప్రమాదాలకు దూరంగా ఉండేందుకు ఫుట్‌పాత్‌లు సైతం కనుమరుగయ్యాయి. రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు పూర్తిగా దురాక్రమణలకు గురై వ్యాపార వాణిజ్య కేంద్రాలకు నిలయంగా మారిపోయినా ఆర్టీసీ, పోలీసు అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కానరాని స్కై వాక్ ఆల్ఫా హోటల్ మొదలు, రామకృష్ణ హోటల్ వరకు రైల్వేస్టేషన్ ముందుగల ప్రధాన రహదారి వరకు పాదచారుల కోసం స్కై వాక్ (ఆకాశ వంతెన) నిర్మిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించి రెండేళ్లవుతున్నా ఆ దిశగా కనీసం ప్రతిపాదనలు సైతం నేటికీ సిద్ధం కాలేదు. స్కై వాక్ ప్రతిపాదనలకు ముందే ఈ రహదారిపై రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలన్న ప్రతిపాదనలు సైతం కార్యరూపం దాల్చలేదు. ఈ రహదారిని వన్ వే చేయడం మినహా ఇక్కడ ప్రమాదాలను, ట్రాఫిక్‌ను నియంత్రించడం సాధ్యపడదని నిపుణులు చెబుతున్నారు. వన్ వే చేయండి ఎప్పుడూ రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రధాన రహదారిని వన్ వే చేసి ప్రమాదాలను నివారించాలని సికింద్రాబాద్ గణపతి దేవాలయం ధర్మకర్తల మండలి కోరింది. ఈ మేరకు మండలి చైర్మన్ పి. సుస్మిత పోలీసు అధికారులకు బుధవారం లేఖ రాశారు. మచ్చుతునకలివీ... 2013 ఫిబ్రవరి 14 గుంటూరు జిల్లా కొత్తపేటకు చెందిన వ్యాపారి రామారావు భార్య అరుంధతి (61) రైల్వేస్టేషన్‌లోకి వెళ్లేందుకు సికింద్రాబాద్ రేతిఫైల్ చేరుకోగానే హయత్‌నగర్ డిపోకు చెందిన ఏపీ10జడ్7808 నెంబర్‌గల ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఫలితంగా ప్రాణాలు కోల్పోయింది. 2013 సెప్టెంబర్ 12 మూసాపేట్ చేపల వ్యాపారి రాందులారి (50) వ్యాపారం పనిమీద సికింద్రాబాద్ చేరుకుని ఒక బస్సు దిగి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా మరోబస్సు రివర్స్ తీయడంతో రెండు బస్సుల మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. 2013 నవంబర్ 20 రేతిఫైల్ బస్‌స్టేషన్ ఎదురుగా మేడ్చల్ డిపోకు చెందిన ఏపీ 29 జడ్ 1639 నెంబర్‌గల ఆర్టీసీ బస్సును వేగంగా నడిపించడంతో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇరువురు, పాదచారులు ఆరుగురు తీవ్ర గాయాల పాలయారు.