వాషింగ్టన్: ఓ వ్యక్తి తన పాదాలను ఫొటోలు తీసి అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. కాలు కదపకుండా సంపాదించడం, కాలు మీద కాలేసుకుని బతికేయడం అన్న పదాలకు ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా మారింది. అమెరికాలోని ఆరిజోనాకు చెందిన జాసన్ స్టార్మ్ కూర్చున్న చోట నుంచే డబ్బు సంపాదిస్తున్నాడు. ఆయన చేసేదేదో పెద్ద పెద్ద పనులు కూడా కాదు. కేవలం ఆయన తన రెండు కాళ్లను ఫొటోలు తీస్తాడు. ఆ తర్వాత దాన్ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడతాడు. వాటినెవరు కొంటారులే అనుకుంటున్నారా? కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అమ్మాయిలు, అబ్బాయిలు ఎగబడి మరీ వీటిని కొంటున్నారు. అలా కేవలం ఫొటోల ద్వారా ఆయన నెలకు సుమారు 4 వేల డాలర్లు(2.9 లక్షలు) ఆర్జిస్తున్నాడు. (చదవండి: వైరల్: ప్రేమ ఎంత మధురమో చూడండి..)
ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 5 వేల ఫాలోవర్లు ఉన్న ఆయన తన కాలి ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా 'ఓన్లీఫ్యాన్స్' అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ఇందులో అతను షేర్ చేసే ఫొటోలు, వీడియోలను వీక్షించాలంటే ముందుగా చందా కట్టాల్సిందే. అందులో భాగంగా నెలకు సుమారు ఎనిమిది డాలర్లు, సంవత్సరానికైతే దాదాపు 81 డాలర్లు చందా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తనకు వేరే పని లేదని, కాళ్లపైనే తన జీవితాన్ని నెట్టుకొస్తున్నానని జాసన్ చెప్పుకొస్తున్నాడు. (చదవండి: సొంత బ్యాంకు, ప్రత్యేక కరెన్సీ!)
Comments
Please login to add a commentAdd a comment