Beauty Tips: పాదాలు అందంగా క‌నిపించాలా? అయితే ఈ టూల్‌ని.. | Use This Tool For Foot Care | Sakshi
Sakshi News home page

Beauty Tips: పాదాలు అందంగా క‌నిపించాలా? అయితే ఈ టూల్‌ని..

Published Sun, Jun 2 2024 1:19 PM | Last Updated on Sun, Jun 2 2024 1:19 PM

Use This Tool For Foot Care

తల వెంట్రుక నుంచి కాలి గోరు వరకు ఆరోగ్యంగా ఉంటేనే అందం సొంతమవుతుంది. కేశ సౌందర్యం ముఖానికి ఆకర్షణ కాబట్టి.. దానిపట్ల ఎలాగూ శ్రద్ధ పెడతాం! పాదాలనే పెద్దగా పట్టించుకోం! పాదాలే కదా అని పెదవి విరవకుండా.. ఇదిగో ఈ టూల్‌ని తెచ్చుకోండి.. వాటిని చక్కగా సంరక్షించి.. ఆరోగ్యం, అందం రెంటినీ చేకూరుస్తుంది.

చిత్రంలోని ఈ డెడ్‌ స్కిన్‌ రిమూవర్‌లో.. 2 లెవెల్స్‌లో స్పీడ్‌ని అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. డివైస్‌తో పాటుగా రీప్లేసబుల్‌ గ్రైండింగ్‌ హెడ్స్‌ లభిస్తాయి. వాటిలో 2  స్క్రబ్‌ హెడ్స్‌తో పాటు.. ఒక రోలర్‌ ఉంటుంది. ఫాస్ట్‌ చార్జింగ్‌తో పోర్టబుల్‌ డివైస్‌గా ఉన్న ఈ రోలర్‌.. యూజర్‌ ఫ్రెండ్లీగా పని చేస్తుంది.

హ్యాండిల్‌తో.. తేలికగా, ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుందీ డివైస్‌. తడి లేదా పొడి చర్మాలకు అనువైనది. అలాగే స్త్రీ, పురుషులు ఎవరైనా వాడొచ్చు. దీన్ని శుభ్రపరచడం తేలిక. కాళ్లు, గోళ్లు, గోళ్ల చుట్టూ ఉండే చర్మం.. ప్రతి భాగాన్ని శుభ్రపరచి మృదువుగా మారుస్తుంది.

ఈ ఎలక్ట్రిక్‌ మేకప్‌ రిమూవర్‌ ఫుట్‌ స్క్రబ్‌ డెడ్‌ స్కిన్‌ ఎక్స్‌ఫోలియేషన్‌.. హై హీల్స్‌ వాడేవారికి.. పాదాలు కనిపించేలా డ్రెస్సులు వేసుకునేవారికి చక్కగా ఉపయోగపడుతుంది. అందమైన పాదాలను కోరుకునేవారికి.. ఇది చక్కటి బహుమతి అవుతుంది. ఈ ఫుట్‌ స్పా బ్యూటీ రోలర్‌ ఇంట్లో ఉంటే.. పెడిక్యూర్‌ కోసం పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ధర కేవలం 449 రూపాయలు. దీన్ని స్నేహితులకు, శ్రేయోభిలాషులకు గిఫ్ట్‌గానూ ఇవ్వచ్చు.

ఇవి చ‌ద‌వండి: ఏకంగా శున‌కాల‌కై.. అమెరికన్‌ కంపెనీ 'క‌డీ' పేరుతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement