ఈ హెయిర్‌ రిమూవల్‌ మెషిన్‌ పనితీరుకి.. ఎవరైనా షాక్ అవాల్సిందే..! | Performance Of Hair Removal Machine And Laser Treatment | Sakshi
Sakshi News home page

ఈ హెయిర్‌ రిమూవల్‌ మెషిన్‌ పనితీరుకి.. ఎవరైనా షాక్ అవాల్సిందే..!

Published Sun, Jul 21 2024 6:01 AM | Last Updated on Sun, Jul 21 2024 6:01 AM

Performance Of Hair Removal Machine And Laser Treatment

ఐస్‌ కూలింగ్‌ టచ్‌తో.. లాంగ్‌ లాస్టింగ్‌ రిజల్ట్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ హెయిర్‌ రిమూవల్‌ మెషిన్‌ పనితీరుకి సౌందర్య ప్రియులంతా ముగ్ధులు అవాల్సిందే. ఈ మెషిన్‌తో అవాంఛిత రోమాలను నొప్పి లేకుండా తొలగించుకోవచ్చు. దీనితో క్రమం తప్పకుండా ట్రీట్‌మెంట్‌ కొనసాగిస్తే.. చర్మం మీది వెంట్రుకలు పలుచపడి.. కొంత కాలానికి మొదలుకంటా తొలగిపోతాయి.

3 వారాల నుంచి ఫలితం కనిపిస్తుంటుంది. 5 వారాలకు స్పష్టమైన రిజల్ట్‌ని చూడొచ్చు. అయితే దీని లేజర్‌ ట్రీట్‌మెంట్‌ అందుకునే ముందు.. అవాంఛిత రోమాలున్న చోట షేవ్‌ చేసుకుని.. క్లాత్‌తో క్లీన్  చేసుకుని.. ఆ తర్వాతే ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రీట్‌మెంట్‌ సమయంలో ఈ డివైస్‌.. చల్లదనాన్నిస్తుంది.

చేతులు, కాళ్లు, ముఖం, నడుము, పొట్టభాగం, అండర్‌ ఆర్మ్స్, బికినీ లైన్  ఇలా ప్రతిచోట దీనితో ట్రీట్‌మెంట్‌ తీసుకోవచ్చు. ఇన్ టెన్ ్స పల్స్‌డ్‌ లైట్‌ టెక్నాలజీ .. ఆటో ఫ్లాషింగ్‌ .. 3 మోడ్స్‌ ఆప్షన్ ్సతో ఈ మెషిన్  చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ హెయిర్‌ రిమూవల్‌ మెషిన్ ని.. మహిళలతో పాటు పురుషులూ వినియోగించుకోవచ్చు. అయితే పచ్చబొట్టు ఉన్న ప్రదేశాల్లో, ట్యాన్‌ ఎక్కువగా ఉన్న చోట, గాయలున్న భాగాల్లో దీన్ని యూజ్‌ చేయకపోవడమే మంచిది. అలాగే గర్భిణీలు ఈ ట్రీట్‌మెంట్‌కి దూరంగా ఉండాలి.

ఇక ఈ పరికరాన్ని ఉపయోగించే సమయంలో.. పవర్‌ కనెక్షన్  తప్పనిసరిగా ఉండాలి. ముందే చార్జింగ్‌ పెట్టుకుని వినియోగించుకునే వీలు ఉండదు. తెల్లగా .. కాస్త చామన ఛాయలో ఉన్నవారికి మాత్రమే ఈ మెషిన్  ఉపయోగపడుతుంది. బ్లాక్, బ్రౌన్ , డార్క్‌ బ్రౌన్ , లైట్‌ బ్రౌన్  కలర్స్‌లో ఉన్న వెంట్రుకలను మాత్రమే ఈ మెషిన్  గుర్తించగలదు. వైట్‌ కలర్, రెడ్‌ కలర్‌ వెంట్రుకలను తొలగించలేదు. దీని ధర 239 డాలర్లు. అంటే 19,951 రూపాయలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement