పాదం లేకున్నా... పట్టుదల ఉంది | thangavelu inspiring special story on winning goldmedal | Sakshi
Sakshi News home page

పాదం లేకున్నా... పట్టుదల ఉంది

Published Sun, Sep 11 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

పాదం లేకున్నా... పట్టుదల ఉంది

పాదం లేకున్నా... పట్టుదల ఉంది

స్ఫూర్తిదాయకం తంగవేలు ప్రస్థానం
తమిళనాడులోని సేలం జిల్లాలో పెరియవడగమ్‌పట్టి అనే మారుమూల గ్రామంలో ఓ నిరుపేద కుటుంబం అది... తల్లి రోజూ కూలికి వెళితే తప్ప నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లని పేదరికం... నలుగురు సంతానం... అందులో ఒకరు తంగవేలు.

 ఐదేళ్ల వయసులో ఇంటి బయట ఆడుకుంటున్న తంగవేలును తమిళనాడు ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో కుడికాలి పాదం పోరుుంది. కర్ర సాయంతో కుంటుతూ నడవాల్సిన పరిస్థితి. ఓ వైపు పేదరికం... మరోవైపు వైకల్యం... దీంతో తంగవేలు తల్లి సరోజ పడిన వేదన అంతా ఇంతా కాదు. తంగవేలు తండ్రి పిల్లల చిన్నతనంలోనే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి రోజూ కూలికి వెళ్లేది. కూరగాయలు అమ్మేది. అరుుతే తన బాధను బయటపడనీయకుండా ఆ తల్లి పిల్లాడిలో స్ఫూర్తి నింపింది. ‘నువ్వెవరి కంటే తక్కువ కాదు’ అంటూ ధైర్యం నింపింది. వయసు పెరిగే కొద్దీ తంగవేలుకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగింది.

పిల్లాడిలో ఉత్సాహం చూసిన స్కూల్ పీఈటీ సేలం తీసుకెళ్లి శిక్షణ ఇప్పించమని సలహా ఇచ్చారు. అక్కడ ప్రభుత్వ క్రీడా శిక్షణ కేంద్రంలో చేర్చితే బాగుంటుందని సూచించారు. సేలంలో హాస్టల్‌లో చేరిస్తే ఆటల సంగతి ఎలా ఉన్నా మూడు పూటలా పిల్లాడు తినగలుగుతాడని ఆ తల్లి భావించింది. అలా తంగవేలు సేలంలోని తమిళనాడు స్పోర్‌‌ట్స అథారిటీ అథ్లెటిక్స్ శిబిరంలో చేరాడు. అక్కడి కోచ్ ఎలమ్‌పరితి రెగ్యులర్ అథ్లెట్లతో పాటు తనకు కూడా శిక్షణ ఇచ్చాడు. ఏనాడూ ట్రైనింగ్‌కు తంగవేలు దూరం కాలేదు. జంప్ చేసే క్రమంలో తన కాలికి అనేకసార్లు గాయాలయ్యారుు. పుండు నొప్పితో కూడా శిక్షణకు వచ్చేవాడు. ఆ క్రమశిక్షణే తనని ఈ రోజు పారాలింపిక్ మెడలిస్ట్‌ను చేసింది.

 14 ఏళ్ల వయసులో ఓ అథ్లెటిక్స్ పోటీలో సాధారణ అథ్లెట్లతో పోటీ పడి తంగవేలు రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో 2013లో జాతీయ పారా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం ద్వారా తంగవేలు జీవితం మారిపోరుుంది. అక్కడ కోచ్ సత్యనారాయణ తనలోని టాలెంట్‌ను గుర్తించి బెంగళూరు తీసుకెళ్లారు. తనని మరింతగా తీర్చిదిద్దారు. 2015 నాటికే తను ప్రపంచంలో నంబర్‌వన్‌గా ఎదిగాడు. ట్యునీషియా గ్రాండ్ ప్రిలో స్వర్ణం సాధించడం ద్వారా పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

ఉద్యోగం కోసం...: ఓ వైపు అథ్లెటిక్స్ మీద పూర్తి స్థారుు దృష్టిపెట్టినా చదువునూ ఏనాడూ విడిచిపెట్టలేదు. 2015లో తను బీబీఏ డిగ్రీ పూర్తి చేశాడు. ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి తల్లికి అండగా నిలవాలనేది అతని కోరిక. తంగవేలుకు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్లు. ఇప్పుడు ఒలింపిక్స్ స్వర్ణం గెలవడంతో వచ్చే నజరానాల ద్వారా ఆ కుటుంబం ఆర్థికంగా కుదురుకుంటుంది.

  పారాలింపిక్స్ హైజంప్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం
3  ఓవరాల్‌గా పారాలింపిక్స్‌లో మనకు ఇది మూడో స్వర్ణం. గతంలో 1972 హిడెల్‌బర్గ్ గేమ్స్‌లో మురళీకాంత్ పేట్కర్ (స్విమ్మింగ్) దేశానికి తొలిసారి స్వర్ణం అందించగా... 2004 ఏథెన్‌‌స గేమ్స్‌లో దేవేంద్ర జజరియా (జావెలిన్ త్రో) కూడా ఈ ఫీట్ సాధించాడు

‘ఈ ఆనందాన్ని ఎలా వర్ణించాలి. చిన్నప్పటి నుంచి తను ఎంత కష్టపడి ఈ స్థారుుకి వచ్చాడో నాకు మాత్రమే తెలుసు. తంగవేలు ఈ స్థారుుకి చేరడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు’     - తంగవేలు తల్లి సరోజ

కఠిన శ్రమతో వెలుగులోకి..
న్యూఢిల్లీ: చిన్నప్పుడే పోలియో బారిన పడినా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వరుణ్ సింగ్ భటి క్రీడలపై అమితాసక్తిని పెంచుకున్నాడు. గ్రేటర్ నొరుుడాకు చెందిన తను స్థానిక సెరుుంట్ జోసెఫ్స్ స్కూల్‌లో చదువుకున్న రోజుల్లోనే వెలుగులోకి వచ్చాడు. అనంతరం జాతీయ మాజీ అథ్లెట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో బెంగళూరు సాయ్ శిక్షణలో తను మరింత రాటుదేలాడు. 2012 లండన్ పారాలింపిక్స్ బెర్త్ కోసం ‘ఎ’ అర్హత ప్రమాణాల (1.60మీ.)ను అందుకోవడంతో వార్తల్లో నిలిచాడు. ఈ ఏడాదే జరిగిన ఐపీసీ అథ్లెటిక్స్ ఆసియా-ఓసియానియా చాంపియన్‌షిప్‌లోనూ 21 ఏళ్ల వరుణ్ భటి 1.82మీ. హైజంప్‌తో స్వర్ణం సాధించడమే కాకుండా ఆసియా రికార్డు సృష్టించాడు.

అభినందనల వెల్లువ
పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తంగవేలు, కాంస్యం నెగ్గిన వరుణ్‌లపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రపతి నుంచి సామాన్యుడి దాకా... అమితాబ్ బచ్చన్, అనుష్కశర్మ నుంచి బీసీసీఐ, పలువురు క్రికెటర్ల ట్వీట్లతో సోషల్ మీడియా హోరెత్తింది.

మీ విజయం దేశంలో అందరికీ స్ఫూర్తిదాయకం. మీ ఇద్దరికీ నా అభినందనలు. భవిష్యత్‌లో మీరు మరిన్ని విజయాలు సాధించాలి.   - భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
భారత దేశం మొత్తం ఆనందిస్తోంది. స్వర్ణం గెలిచిన తంగవేలుకు, కాంస్యం నెగ్గిన వరుణ్ సింగ్ భటికి అభినందనలు.
-ప్రధాని మోదీ
ఈ రోజు మన అథ్లెట్లు కొత్త చరిత్ర సృష్టించారు. రాబోయే తరాలకు వీరిద్దరూ స్ఫూర్తిగా నిలుస్తారు.
- ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ
స్వర్ణం నెగ్గిన క్రీడాకారుల క్లబ్‌లోకి తంగవేలుకు స్వాగతం. కాంస్యం నెగ్గిన వరుణ్‌కు అండగా నిలిచిన గోస్పోర్‌‌ట్స వారుుసెస్ సంస్థకూ అభినందనలు. - అభినవ్ బింద్రా

తమిళనాడు రూ.2 కోట్లు
పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తమ రాష్ట్ర అథ్లెట్ తంగవేలుకు తమిళనాడు ప్రభుత్వం రూ.2 కోట్లు నజరానా ప్రకటించింది. ‘నీ ప్రదర్శన పట్ల యావత్ భారతదేశం గర్వపడుతోంది. తమిళనాడు ప్రజల తరఫున శుభాకాంక్షలు. ఒలింపిక్స్ స్వర్ణం గెలిస్తే ఇచ్చే నజరానాతో సమానంగా తంగవేలుకు కూడా రూ.2 కోట్లు ప్రభుత్వం అందజేస్తుంది’ అని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తెలిపారు. కేంద్ర ప్రభుత్వ క్రీడావిధానం ప్రకారం ఒలింపిక్స్ లేదా పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన వారికి రూ.75 లక్షలు ఇస్తారు. కాంస్యం గెలిస్తే రూ.30 లక్షలు అందుతారుు. తంగవేలు, వరుణ్‌లకు ఈ నజరానా ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement