tangavelu
-
Tokyo Paralympics: ‘హై’ పైకి...
దివ్యాంగుల విశ్వక్రీడల్లో ఈసారి గతంలో కంటే ఘనమైన ప్రదర్శన చేస్తామని ప్రకటించిన భారత పారాథ్లెట్స్ అన్నమాట నిలబెట్టుకున్నారు. అంచనాలకు మించి రాణిస్తూ అబ్బురపరుస్తున్నారు. ఆదివారం రెండు పతకాలు సాధించిన మనోళ్లు... సోమవారం ఏకంగా ఐదు పతకాలు నెగ్గగా... మంగళవారం మరో మూడు పతకాలు సొంతం చేసుకున్నారు. దాంతో భారత్ గెలిచిన పతకాల సంఖ్య 10కి చేరింది. ఒకే ఒలింపిక్స్‌లోగానీ, పారాలింపిక్స్‌లోగానీ భారత పతకాల సంఖ్య రెండంకెలు దాటడం ఇదే ప్రథమం. గత నెలలో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యధికంగా ఏడు పతకాలు నెగ్గగా... తాజాగా టోక్యోలోనే జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ 10 పతకాలతో కొత్త చరిత్ర సృష్టించింది. టోక్యో: పారాలింపిక్స్‌లో వరుసగా మూడో రోజు భారత దివ్యాంగ క్రీడాకారులు పతకాల పంట పండించారు. పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి–42 కేటగిరీలో మరియప్పన్ తంగవేలు రజతం నెగ్గగా... ఇదే విభాగంలో శరద్ కుమార్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. టి–42 కేటగిరీలో కాళ్లలో లోపం, కాళ్ల పొడవులో వ్యత్యాసం, బలహీనమైన కండరాల శక్తి, క్రియాశీలకమైన కదలికలు లేని వారు పాల్గొనవచ్చు. షూటింగ్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్–1 కేటగిరీలో సింగ్‌రాజ్ అధానా కాంస్య పతకం గెల్చుకున్నాడు. ఫలితంగా మంగళవారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. ఓవరాల్‌గా భారత్ 10 పతకాలతో 30వ స్థానంలో ఉంది. ఒలింపిక్స్‌లోగానీ, పారాలింపిక్స్‌లోగానీ భారత్ పతకాల సంఖ్య రెండంకెలు దాటడం ఇదే తొలిసారి. నాలుగేళ్ల క్రితమే షూటింగ్ క్రీడలో అడుగుపెట్టిన సింగ్‌రాజ్ పాల్గొన్న తొలి పారాలింపిక్స్‌లోనే పతకంతో మెరిశాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సింగ్‌రాజ్ 216.8 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం గెలిచాడు. చావో యాంగ్ (చైనా–237.9 పాయిం ట్లు) స్వర్ణం, జింగ్ హువాంగ్ (చైనా–237.5 పాయింట్లు) రజతం సాధించారు. ఫైనల్లో పాల్గొన్న మరో భారత షూటర్ మనీశ్ నర్వాల్ 135.8 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచాడు. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్–1 కేటగిరీ ఫైనల్లో భారత షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ ఏడో స్థానంలో నిలిచింది. సొంతంగా రేంజ్ ఏర్పాటు చేసుకొని... హరియాణాలోని ఫరీదాబాద్ పట్టణానికి చెందిన 39 ఏళ్ల సింగ్‌రాజ్ చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డాడు. అయితే షూటింగ్‌వైపు మాత్రం అతను 35 ఏళ్ల వయసులో ఆకర్షితుడయ్యాడు. తన మేనల్లుడిని షూటింగ్ రేంజ్‌కు తీసుకెళ్లే క్రమంలో అక్కడే సరదాగా ప్రాక్టీస్ చేసిన సింగ్‌రాజ్ ఆటపట్ల మక్కువ పెంచుకొని సీరియస్‌గా సాధన చేయడం ప్రారంభించాడు. కోచ్‌లు ఓంప్రకాశ్, జేపీ నౌటియాల్, జాతీయ కోచ్ సుభాశ్ రాణా శిక్షణలో రాటుదేలిన సింగ్‌రాజ్ 2018లో ఆసియా పారాగేమ్స్‌లో కాంస్య పతకం సాధించాడు. ఆ తర్వాతి ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన ప్రపంచకప్‌లో రజతం, స్వర్ణం గెలిచాడు. యూఏఈలో ఈ ఏడాది జరిగిన పారాస్పోర్ట్ వరల్డ్‌కప్‌లో స్వర్ణం గెలిచిన సింగ్‌రాజ్ కోవిడ్–19 సమయంలో షూటింగ్ రేంజ్‌లకు తాళాలు పడటంతో ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడ్డాడు. పారాలింపిక్స్‌లో ఎలాగైనా పతకం సాధించాలనే లక్ష్యంతో ఉన్న సింగ్‌రాజ్ కుటుంబసభ్యుల ఆర్థిక సహాయంతో ఇంట్లోనే సొంతంగా షూటింగ్ రేంజ్‌ను ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ కొనసాగించాడు. విశ్వ క్రీడల్లో పతకంతో తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. మళ్లీ మెరిసిన తంగవేలు... 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన మరియప్పన్ తంగవేలు టోక్యోలోనూ అదరగొట్టాడు. పురుషుల హైజంప్ టి–42 విభాగంలో పోటీపడిన ఈ తమిళనాడు ప్లేయర్ 1.86 మీటర్ల ఎత్తుకు ఎగిరి రజత పతకం సాధించాడు. తాను స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగినప్పటికీ పోటీలు జరుగుతున్న సమయంలో వర్షం కురవడం తన స్వర్ణావకాశాలను ప్రభావితం చేసిందని 26 ఏళ్ల తంగవేలు అన్నాడు. ఐదేళ్ల ప్రాయంలో బస్సు ప్రమాదానికి గురై కుడి కాలును కోల్పోయిన తంగవేలు స్కూల్లో వ్యాయామవిద్య ఉపాధ్యాయుడి సలహాతో అథ్లెటిక్స్‌లో అడుగుపెట్టాడు. కూరగాయాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న తన తల్లి సరోజకి చేదోడు వాదోడుగా ఉండేందుకు తంగవేలు 2012 నుంచి 2015 మధ్య కాలంలో ఇళ్లల్లో పేపర్లు వేశాడు. 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి తంగవేలు ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ‘రియో’ పతకంతో లభించిన నగదు ప్రోత్సాహకాలతో ఆర్థికంగా స్థిరపడ్డాడు. 2024 పారిస్ పారాలింపిక్స్‌లోనూ పాల్గొంటానని, ఆ క్రీడల్లో స్వర్ణం సాధించేందుకు ఇప్పటి నుంచే సాధన మొదలుపెడతానని తంగవేలు వ్యాఖ్యానించాడు. నాన్న సలహాతో... టి–42 విభాగంలోనే పోటీపడిన మరో భారత హైజంపర్ శరద్ కుమార్ 1.83 మీటర్ల ఎత్తుకు ఎగిరి కాంస్య పతకాన్ని సాధించాడు. బిహార్‌కు చెందిన 29 ఏళ్ల శరద్ రెండేళ్లుగా ఉక్రెయిన్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. సోమవారం రాత్రి మోకాలి నొప్పితో బాధపడ్డ శరద్ ఈవెంట్ నుంచి వైదొలగాలని భావించాడు. అయితే తండ్రి సూచన మేరకు భగవద్గీత పఠించి మంగళవారం ఈవెంట్లో పాల్గొని శరద్ పతకం సాధించాడు. ‘సోమవారం రాత్రంతా మోకాలి నొప్పితో బాధపడ్డాను. ఈ విషయాన్ని ఫోన్లో నాన్నకు వివరించాను. ఈవెంట్లో పాల్గొనడం కష్టమని చెప్పాను. పట్టుదల కోల్పోకుండా తనవంతు ప్రయత్నం చేయాలని... తమ నియంత్రణలో లేని వాటి గురించి ఆలోచించకూడదని నాన్న సలహా ఇచ్చారు. భగవద్గీత చదవాలని సూచించారు’ అని రెండేళ్ల ప్రాయంలో పోలియో బారిన పడ్డ శరద్ వివరించాడు. -
పాదం లేకున్నా... పట్టుదల ఉంది
స్ఫూర్తిదాయకం తంగవేలు ప్రస్థానం తమిళనాడులోని సేలం జిల్లాలో పెరియవడగమ్పట్టి అనే మారుమూల గ్రామంలో ఓ నిరుపేద కుటుంబం అది... తల్లి రోజూ కూలికి వెళితే తప్ప నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లని పేదరికం... నలుగురు సంతానం... అందులో ఒకరు తంగవేలు. ఐదేళ్ల వయసులో ఇంటి బయట ఆడుకుంటున్న తంగవేలును తమిళనాడు ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో కుడికాలి పాదం పోరుుంది. కర్ర సాయంతో కుంటుతూ నడవాల్సిన పరిస్థితి. ఓ వైపు పేదరికం... మరోవైపు వైకల్యం... దీంతో తంగవేలు తల్లి సరోజ పడిన వేదన అంతా ఇంతా కాదు. తంగవేలు తండ్రి పిల్లల చిన్నతనంలోనే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి రోజూ కూలికి వెళ్లేది. కూరగాయలు అమ్మేది. అరుుతే తన బాధను బయటపడనీయకుండా ఆ తల్లి పిల్లాడిలో స్ఫూర్తి నింపింది. ‘నువ్వెవరి కంటే తక్కువ కాదు’ అంటూ ధైర్యం నింపింది. వయసు పెరిగే కొద్దీ తంగవేలుకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగింది. పిల్లాడిలో ఉత్సాహం చూసిన స్కూల్ పీఈటీ సేలం తీసుకెళ్లి శిక్షణ ఇప్పించమని సలహా ఇచ్చారు. అక్కడ ప్రభుత్వ క్రీడా శిక్షణ కేంద్రంలో చేర్చితే బాగుంటుందని సూచించారు. సేలంలో హాస్టల్లో చేరిస్తే ఆటల సంగతి ఎలా ఉన్నా మూడు పూటలా పిల్లాడు తినగలుగుతాడని ఆ తల్లి భావించింది. అలా తంగవేలు సేలంలోని తమిళనాడు స్పోర్ట్స అథారిటీ అథ్లెటిక్స్ శిబిరంలో చేరాడు. అక్కడి కోచ్ ఎలమ్పరితి రెగ్యులర్ అథ్లెట్లతో పాటు తనకు కూడా శిక్షణ ఇచ్చాడు. ఏనాడూ ట్రైనింగ్‌కు తంగవేలు దూరం కాలేదు. జంప్ చేసే క్రమంలో తన కాలికి అనేకసార్లు గాయాలయ్యారుు. పుండు నొప్పితో కూడా శిక్షణకు వచ్చేవాడు. ఆ క్రమశిక్షణే తనని ఈ రోజు పారాలింపిక్ మెడలిస్ట్‌ను చేసింది. 14 ఏళ్ల వయసులో ఓ అథ్లెటిక్స్ పోటీలో సాధారణ అథ్లెట్లతో పోటీ పడి తంగవేలు రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో 2013లో జాతీయ పారా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం ద్వారా తంగవేలు జీవితం మారిపోరుుంది. అక్కడ కోచ్ సత్యనారాయణ తనలోని టాలెంట్‌ను గుర్తించి బెంగళూరు తీసుకెళ్లారు. తనని మరింతగా తీర్చిదిద్దారు. 2015 నాటికే తను ప్రపంచంలో నంబర్‌వన్‌గా ఎదిగాడు. ట్యునీషియా గ్రాండ్ ప్రిలో స్వర్ణం సాధించడం ద్వారా పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఉద్యోగం కోసం...: ఓ వైపు అథ్లెటిక్స్ మీద పూర్తి స్థారుు దృష్టిపెట్టినా చదువునూ ఏనాడూ విడిచిపెట్టలేదు. 2015లో తను బీబీఏ డిగ్రీ పూర్తి చేశాడు. ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి తల్లికి అండగా నిలవాలనేది అతని కోరిక. తంగవేలుకు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్లు. ఇప్పుడు ఒలింపిక్స్ స్వర్ణం గెలవడంతో వచ్చే నజరానాల ద్వారా ఆ కుటుంబం ఆర్థికంగా కుదురుకుంటుంది. 1 పారాలింపిక్స్ హైజంప్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం 3 ఓవరాల్‌గా పారాలింపిక్స్‌లో మనకు ఇది మూడో స్వర్ణం. గతంలో 1972 హిడెల్‌బర్గ్ గేమ్స్‌లో మురళీకాంత్ పేట్కర్ (స్విమ్మింగ్) దేశానికి తొలిసారి స్వర్ణం అందించగా... 2004 ఏథెన్‌స గేమ్స్‌లో దేవేంద్ర జజరియా (జావెలిన్ త్రో) కూడా ఈ ఫీట్ సాధించాడు ‘ఈ ఆనందాన్ని ఎలా వర్ణించాలి. చిన్నప్పటి నుంచి తను ఎంత కష్టపడి ఈ స్థారుుకి వచ్చాడో నాకు మాత్రమే తెలుసు. తంగవేలు ఈ స్థారుుకి చేరడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు’ - తంగవేలు తల్లి సరోజ కఠిన శ్రమతో వెలుగులోకి.. న్యూఢిల్లీ: చిన్నప్పుడే పోలియో బారిన పడినా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వరుణ్ సింగ్ భటి క్రీడలపై అమితాసక్తిని పెంచుకున్నాడు. గ్రేటర్ నొరుుడాకు చెందిన తను స్థానిక సెరుుంట్ జోసెఫ్స్ స్కూల్లో చదువుకున్న రోజుల్లోనే వెలుగులోకి వచ్చాడు. అనంతరం జాతీయ మాజీ అథ్లెట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో బెంగళూరు సాయ్ శిక్షణలో తను మరింత రాటుదేలాడు. 2012 లండన్ పారాలింపిక్స్ బెర్త్ కోసం ‘ఎ’ అర్హత ప్రమాణాల (1.60మీ.)ను అందుకోవడంతో వార్తల్లో నిలిచాడు. ఈ ఏడాదే జరిగిన ఐపీసీ అథ్లెటిక్స్ ఆసియా-ఓసియానియా చాంపియన్‌షిప్‌లోనూ 21 ఏళ్ల వరుణ్ భటి 1.82మీ. హైజంప్‌తో స్వర్ణం సాధించడమే కాకుండా ఆసియా రికార్డు సృష్టించాడు. అభినందనల వెల్లువ ⇔ పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తంగవేలు, కాంస్యం నెగ్గిన వరుణ్‌లపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రపతి నుంచి సామాన్యుడి దాకా... అమితాబ్ బచ్చన్, అనుష్కశర్మ నుంచి బీసీసీఐ, పలువురు క్రికెటర్ల ట్వీట్లతో సోషల్ మీడియా హోరెత్తింది. ⇔ మీ విజయం దేశంలో అందరికీ స్ఫూర్తిదాయకం. మీ ఇద్దరికీ నా అభినందనలు. భవిష్యత్‌లో మీరు మరిన్ని విజయాలు సాధించాలి. - భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ⇔ భారత దేశం మొత్తం ఆనందిస్తోంది. స్వర్ణం గెలిచిన తంగవేలుకు, కాంస్యం నెగ్గిన వరుణ్ సింగ్ భటికి అభినందనలు. -ప్రధాని మోదీ ⇔ ఈ రోజు మన అథ్లెట్లు కొత్త చరిత్ర సృష్టించారు. రాబోయే తరాలకు వీరిద్దరూ స్ఫూర్తిగా నిలుస్తారు. - ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వర్ణం నెగ్గిన క్రీడాకారుల క్లబ్‌లోకి తంగవేలుకు స్వాగతం. కాంస్యం నెగ్గిన వరుణ్‌కు అండగా నిలిచిన గోస్పోర్‌ట్స వారుుసెస్ సంస్థకూ అభినందనలు. - అభినవ్ బింద్రా తమిళనాడు రూ.2 కోట్లు పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తమ రాష్ట్ర అథ్లెట్ తంగవేలుకు తమిళనాడు ప్రభుత్వం రూ.2 కోట్లు నజరానా ప్రకటించింది. ‘నీ ప్రదర్శన పట్ల యావత్ భారతదేశం గర్వపడుతోంది. తమిళనాడు ప్రజల తరఫున శుభాకాంక్షలు. ఒలింపిక్స్ స్వర్ణం గెలిస్తే ఇచ్చే నజరానాతో సమానంగా తంగవేలుకు కూడా రూ.2 కోట్లు ప్రభుత్వం అందజేస్తుంది’ అని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తెలిపారు. కేంద్ర ప్రభుత్వ క్రీడావిధానం ప్రకారం ఒలింపిక్స్ లేదా పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన వారికి రూ.75 లక్షలు ఇస్తారు. కాంస్యం గెలిస్తే రూ.30 లక్షలు అందుతారుు. తంగవేలు, వరుణ్‌లకు ఈ నజరానా ఇస్తారు. -
టీటీడీ కల్యాణ కట్ట ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు
–1.5 కోట్లు విలువ చేసే పత్రాలు స్వాధీనం –బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు – 3 నెలల్లో 2వ సారి దాడులు – వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తిరుపతి క్రై ం: తిరుమలలోని టీటీడీలో కల్యాణకట్టలో సూపర్వైజర్గా పనిచేస్తున్న తంగవేలు,అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు కొర్లగుంటలో నివాసం ఉంటున్న తంగవేలుకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. ఇతనితో పాటు ఇద్దరు కూతుళ్లు, బెంగళూరులో కుమారుడు ఇంట్లోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించామన్నారు. 3 నెలల క్రితం టీటీడీ సూపరింటెండెంట్ నరేంద్ర ఇంట్లో ఏసీబీ చేసిన దాడిలో కల్యాణికట్ట సూపర్వైజర్ తంగవేలుకు చెందిన డాక్యుమెంట్లు దొరికాయి. అప్పట్లోనే తంగవేలు ఇంట్లో సోదాలు చేయడం జరిగిందన్నారు. 3 నెలల్లో తంగవేల ఇంట్లో సోదాలు చేయడం ఇది రెండవసారి అని పేర్కొన్నారు. గతంలో కూడా కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రస్తుతం తంగవేలుపై సుమోటో కేసు నమోదు చేసి కుమార్తెలు, కుమారుడి ఇళ్లలోనే కాక, సమీప బంధువుల ఇళ్లలో దాడులు నిర్వహించామన్నారు. దాడులు ఉదయం నుంచి రాత్రి సైతం కొనసాగుతూనే ఉన్నాయి. సోదాల్లో తంగవేలు, అతని కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.50 కోట్లు విలువైన ఇళ్లస్థలాలకు సంబంధించి విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంతేకాకుండా స్థలాలకు సంబంధించిన అగ్రిమెంట్లు,ఈయన చేసే వడ్డీ వ్యాపారాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ సోదాలు పూర్తి అయ్యే వరకు ఆస్థులు ఒక అంచనాకు రావని, సోదాలు పూర్తి అయ్యాక పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ దాడులు రాత్రంతా కొనసాగుతాయన్నారు. ఈ దాడుల్లో మరిన్ని ఆధారాలు దొరికితే తంగవేలుకు సంబంధించిన మరికొందరిపై దాడులు చేసే అవకాశం ఉందన్నారు. దాడుల్లో సీఐలు చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.