తంగవేలు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు, దివానాపై కూర్చొని ఉన్న తంగవేలు
టీటీడీ కల్యాణ కట్ట ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు
Published Tue, Aug 30 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
–1.5 కోట్లు విలువ చేసే పత్రాలు స్వాధీనం
–బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు
– 3 నెలల్లో 2వ సారి దాడులు
– వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి
తిరుపతి క్రై ం: తిరుమలలోని టీటీడీలో కల్యాణకట్టలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న తంగవేలు,అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు కొర్లగుంటలో నివాసం ఉంటున్న తంగవేలుకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. ఇతనితో పాటు ఇద్దరు కూతుళ్లు, బెంగళూరులో కుమారుడు ఇంట్లోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించామన్నారు. 3 నెలల క్రితం టీటీడీ సూపరింటెండెంట్ నరేంద్ర ఇంట్లో ఏసీబీ చేసిన దాడిలో కల్యాణికట్ట సూపర్‌వైజర్ తంగవేలుకు చెందిన డాక్యుమెంట్లు దొరికాయి. అప్పట్లోనే తంగవేలు ఇంట్లో సోదాలు చేయడం జరిగిందన్నారు. 3 నెలల్లో తంగవేల ఇంట్లో సోదాలు చేయడం ఇది రెండవసారి అని పేర్కొన్నారు. గతంలో కూడా కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రస్తుతం తంగవేలుపై సుమోటో కేసు నమోదు చేసి కుమార్తెలు, కుమారుడి ఇళ్లలోనే కాక, సమీప బంధువుల ఇళ్లలో దాడులు నిర్వహించామన్నారు. దాడులు ఉదయం నుంచి రాత్రి సైతం కొనసాగుతూనే ఉన్నాయి. సోదాల్లో తంగవేలు, అతని కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.50 కోట్లు విలువైన ఇళ్లస్థలాలకు సంబంధించి విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంతేకాకుండా స్థలాలకు సంబంధించిన అగ్రిమెంట్లు,ఈయన చేసే వడ్డీ వ్యాపారాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ సోదాలు పూర్తి అయ్యే వరకు ఆస్థులు ఒక అంచనాకు రావని, సోదాలు పూర్తి అయ్యాక పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ దాడులు రాత్రంతా కొనసాగుతాయన్నారు. ఈ దాడుల్లో మరిన్ని ఆధారాలు దొరికితే తంగవేలుకు సంబంధించిన మరికొందరిపై దాడులు చేసే అవకాశం ఉందన్నారు. దాడుల్లో సీఐలు చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement