Supervisor
-
నాడు యాచక వృత్తి.. నేడు సూపర్వైజర్
నందిగామ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి మేలు జరుగుతోంది. ఇందుకు తానే ఉదాహరణ అని ఎన్టీఆర్ జిల్లా నందిగామకి చెందిన ట్రాన్స్‌జెండర్ ఇనపనుర్తి సహస్ర అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే యాచక వృత్తి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు సూపర్వైజర్గా రాణిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా సహస్ర మాట్లాడుతూ.. ‘నా అసలు పేరు సురేష్. చిన్నతనం నుంచి మహిళగా మారాలని కోరిక. పదవ తరగతి పూర్తికాగానే ఢిల్లీకి వెళ్లాను. అక్కడ హిజ్రాగా మారి నందిగామ వచ్చాను. అందరూ నన్ను దూరంగా పెట్టారు. చేద్దామంటే పని దొరకలేదు. దీంతో యాచించడం తప్ప మరోమార్గం దొరకలేదు. నేను డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగం కోసం ప్రయత్నించినా రాలేదు. 2019లో సీఎం జగన్ ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు ద్వారా ఏపీఎస్‌బీసీఎల్‌కు చెందిన మద్యం దుకాణంలో సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చింది. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాను. సీఎం జగన్ చలవతోనే నేడు నాకు గౌరవం దక్కుతోంది’ అని తెలిపింది. ఇది కూడా చదవండి: కాకినాడ తునిలో దారుణం: మహిళా చిరు వ్యాపారిని డబ్బు కోసం బెదిరించి.. -
ఎంబీఎస్ జ్యువెలరీస్ సూపర్వైజర్ సురేష్ కుమార్ ఇంట్లో ఈడీ తనిఖీలు
-
వీల్‌చైర్‌లో వచ్చి.. పరీక్ష రాసి
కదల్లేని పరిస్థితిలో ఉన్నా తన లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. నడవలేక పోయినా పరీక్ష రాయాలన్న తపనే తనను ముందుకు నడిపింది. దీంతో ఇలా వీల్‌చైర్‌లో వచ్చి మరీ పరీక్ష రాసింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి అంగన్వాడీ టీచర్ గుజ్జ ప్రేమలతకు నెల రోజుల కిందట కాలు ఫ్యాక్చర్ కావడంతో హైదరాబాద్‌లో శస్త్ర చికిత్స చేయించుకుంది. రెండు నెలలు రెస్టులో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్‌లోనే ఉంటూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ ఉద్యోగం కోసం ప్రేమలత ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆమెకు సూపర్వైజర్ ఉద్యోగ పరీక్ష ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి నేరుగా వీల్‌చైర్‌లో వచ్చిన ఆమె.. దిండు, స్టూల్ కూడా పరీక్ష కేంద్రానికి వెంట తెచ్చుకున్నారు. నల్లగొండ ఎన్జీ కాలేజీలో పరీక్ష రాసి వెళ్లారు. – సాక్షి స్టాఫ్ ఫొటో గ్రాఫర్ నల్లగొండ -
మద్యం దుకాణం సూపర్వైజర్ అరెస్టు
రణస్థలం: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కోటపాలెం మద్యం దుకాణ సూపర్వైజర్ పాకాడ అప్పలస్వామిని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇంచార్జి సీఐ ఎ.గణపతిబాబు శనివారం అరెస్టు చేశారు. కోటపాలెం ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అక్రమంగా మద్యం సరఫరా అవుతుందనే ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ సిబ్బంది, ఎన్ఫోర్స్మెంట్ సీఐ బి.నర్సింహులు, సిబ్బంది శుక్రవారం నిఘా వేశారు. బైల్టు దుకాణం నడుపుతున్న సుగ్గు రవికి అప్పలస్వామి 48 మద్యం సీసాలను ఒకేసారి విక్రయించాడు. అక్కడే మాటు వేసిన ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వీరిద్దరినీ పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేశామని ఇన్చార్జి సీఐ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రణస్థలం ఎస్ఐ బి.బంగారురాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన భగీరథ బకాసురులు
సాక్షి, తాండూరు: మిషన్ భగీరథ బకాసురులు అడ్డంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు. వివరాలిలా ఉన్నాయి.. తాండూరు నియోజకవర్గంలో సుమారు. రూ.500 కోట్లతో మిషన్ భగీరథ పనులు సాగుతున్నాయి. మిషన్ భగీరథ పనుల పర్యవేక్షణ బాధ్యతలను ఆర్‌డబ్లుఎస్ శాఖకు అప్పగించారు. బషీరాబాద్ మండలం జీవన్గి, మైల్వార్, కంసన్‌పల్లితో పాటు పలు గ్రామాల్లో కడప జిల్లాకు చెందిన గురువయ్య కాంట్రాక్టర్‌గా పనులు చేస్తున్నాడు. రూ.1.50 కోట్లకు సంబంధించి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. రూ.70 లక్షల పనులకు సంబంధించి మిషన్ భగీరథ పనులను పూర్తి చేయడంతో గురువయ్య రెండు నెలల క్రితం తాండూరులోని డీఈఈ కార్యాలయంలో బిల్లుల కోసం వచ్చారు. డీఈఈ గతంలోనే రూ.65 వేలు డిమాండ్ చేయడంతో బిల్లుల కోసం నగదును లంచంగా ఇచ్చారు. దీంతో రూ.70 లక్షల్లో కొంత బిల్లులు చెల్లించారు. అయితే మరో రూ.20 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉండటంతో గత నెలలో గురువయ్య డీఈఈ శ్రీనివాస్ వద్దకు వెళ్లాడు. రూ.30 వేలను చెల్లిస్తేనే బిల్లులు చేస్తామని డీఈఈ చెప్పాడు. చేసేది లేక గురువయ్య గతనెల 25వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అదును కోసం ఎదురు చూసిన ఏసీబీ అధికారులు 20 రోజుల పాటు పక్కా ప్రణాళికతో పట్టుకోవాలని వేచి చూశారు. ఏసీబీ ట్రాప్‌కు చిక్కిన డీఈఈ శ్రీనివాస్... మిషన్ భగీ«రథ పనుల కోసం బిల్లులు చేయాలని అందుకు కావాల్సిన పర్సంటేజ్ సిద్ధం చేసుకున్నానని కాంట్రాక్టర్ గురువయ్య అధికారులకు నమ్మబలికాడు. దీంతో గురువయ్య ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో రూ.30 వేలు తీసుకుని డీఈఈకి ఇచ్చేందుకు వచ్చారు. అయితే డబ్బులను వర్క్ఇన్స్పెక్టర్ మహేందర్‌కు ఇవ్వాలని చెప్పి పంపించారు. కార్యాలయ ఆవరణలో డబ్బులు తీసుకుంటుండగా మహేందర్‌ను.. రెడ్ హ్యాండెడ్‌గా డీఈఈ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అవినీతి అధికారులను వదలం.. అవినీతికి పాల్పడే అధికారులు ఎవరైన సరే ఆటకట్టిస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. మిషన్ భగీరథ పనుల్లో కాంట్రాక్టర్ గాజుల గురువయ్య నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని బాదితుడు సమాచారం అందించారు. ఈ మేరకు ఈనెల 25వ తేది నుంచి నిఘా పెట్టడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ పనులను పూర్తి చేసిన గురువయ్యకు బిల్లుల కోసం వెళితే లంచం డిమాండ్ చేశారని దీంతో గురువయ్య ఇప్పటి వరకు రూ.95 వేలు ఆర్‌డబ్లుఎస్ డీఈఈ శ్రీనివాస్‌కు లంచంగా ఇచ్చారని విచారణలో తేలిందన్నారు. లంచం తీసుకుంటు పట్టుబడిన డీఈఈ శ్రీనివాస్‌ను, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్‌ను అరెస్టు చేసి చంచల్‌గుడ జైలుకు తరలిస్తామన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు నాగేంద్రబాబు, రాంలింగారెడ్డి, గంగాధర్, మజిద్‌లతో పాటు ఏసీబీ సిబ్బంది తదితరులున్నారు. -
నాడు గల్ఫ్ కార్మికుడు.. నేడు జెడ్పీటీసీ సభ్యుడు
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): నిన్నటి వరకు గల్ఫ్ కార్మికుడిగా కొనసాగిన గుల్లె రాజేశ్వర్ నేటి నుంచి ఏర్గట్ల మండల తొలి జెడ్పీటీసీ సభ్యుడిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. జీవనోపాధి కోసం ఎన్నో ఏళ్ల పాటు గల్ఫ్‌లో పని చేసిన గుల్లె రాజేశ్వర్ తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంపికయ్యాడు. అంతేకాక జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలను నిర్వహించడానికి పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఏర్గట్లకు చెందిన రాజేశ్వర్ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. వ్యవసాయం ఉన్నా ఉపాధి కోసం 2002లో గల్ఫ్ పయనం అయ్యాడు. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో కూలీగా చేరిన రాజేశ్వర్ తన వృత్తి నైపుణ్యంతో సూపర్వైజర్ స్థాయికి ఎదిగాడు. తాను ఆర్థికంగా స్థిరపడడంతో పాటు పది మందికి పని కల్పిం చాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి 2010లో స్నేహితులు, బంధువుల సహకారంతో సప్లయింగ్ కంపెనీని కువైట్‌లో ప్రారంభించాడు. మరామిష్ జనరల్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీని స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. కువైట్‌లో తన కంపెనీ సక్సెస్ కావడంతో ఇటీవల దుబాయ్ లో కూడా మరో కంపెనీని స్నేహితుల భాగస్వామ్యంతో ప్రారంభించాడు. అయితే కువైట్‌లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ విభాగం బాధ్యతలను స్వీకరించి సేవా కార్యక్రమాలను కొనసాగించాడు. కువైట్‌లో క్షమాభిక్ష అమలు జరిగిన సమయంలో ఎంతో మంది ఖల్లివెల్లి కార్మికులు ఇళ్లకు చేరుకోవడానికి విమాన టిక్కెట్లను కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో అందించి పార్టీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో అతని సేవలను ఆ పార్టీ అధిష్టానం గుర్తించింది. ఏర్గట్ల జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అవకాశం కల్పించగా ఆయనను జెడ్పీటీసీ పదవి వరిం చింది. జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన రాజేశ్వర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు జిల్లా పరిషత్‌లో పార్టీ ఫ్లోర్ లీడర్‌గాను వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకున్నారు. -
టీటీడీ కల్యాణ కట్ట ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు
–1.5 కోట్లు విలువ చేసే పత్రాలు స్వాధీనం –బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు – 3 నెలల్లో 2వ సారి దాడులు – వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తిరుపతి క్రై ం: తిరుమలలోని టీటీడీలో కల్యాణకట్టలో సూపర్వైజర్గా పనిచేస్తున్న తంగవేలు,అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు కొర్లగుంటలో నివాసం ఉంటున్న తంగవేలుకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. ఇతనితో పాటు ఇద్దరు కూతుళ్లు, బెంగళూరులో కుమారుడు ఇంట్లోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించామన్నారు. 3 నెలల క్రితం టీటీడీ సూపరింటెండెంట్ నరేంద్ర ఇంట్లో ఏసీబీ చేసిన దాడిలో కల్యాణికట్ట సూపర్వైజర్ తంగవేలుకు చెందిన డాక్యుమెంట్లు దొరికాయి. అప్పట్లోనే తంగవేలు ఇంట్లో సోదాలు చేయడం జరిగిందన్నారు. 3 నెలల్లో తంగవేల ఇంట్లో సోదాలు చేయడం ఇది రెండవసారి అని పేర్కొన్నారు. గతంలో కూడా కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రస్తుతం తంగవేలుపై సుమోటో కేసు నమోదు చేసి కుమార్తెలు, కుమారుడి ఇళ్లలోనే కాక, సమీప బంధువుల ఇళ్లలో దాడులు నిర్వహించామన్నారు. దాడులు ఉదయం నుంచి రాత్రి సైతం కొనసాగుతూనే ఉన్నాయి. సోదాల్లో తంగవేలు, అతని కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.50 కోట్లు విలువైన ఇళ్లస్థలాలకు సంబంధించి విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంతేకాకుండా స్థలాలకు సంబంధించిన అగ్రిమెంట్లు,ఈయన చేసే వడ్డీ వ్యాపారాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ సోదాలు పూర్తి అయ్యే వరకు ఆస్థులు ఒక అంచనాకు రావని, సోదాలు పూర్తి అయ్యాక పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ దాడులు రాత్రంతా కొనసాగుతాయన్నారు. ఈ దాడుల్లో మరిన్ని ఆధారాలు దొరికితే తంగవేలుకు సంబంధించిన మరికొందరిపై దాడులు చేసే అవకాశం ఉందన్నారు. దాడుల్లో సీఐలు చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు. -
ఊపిరితిత్తుల కౌన్సెలింగ్
నడిస్తే ఆయాసం... ఛాతీనొప్పి..? నా వయసు 33. పదేళ్ల నుంచి ఒక ఆస్బెస్టాస్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. మూడేళ్ల నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాను. మొదట్లో నా సమస్యను టీబీగా అనుమానించి చికిత్స తీసుకున్నాను. ఫలితం లేదు. వడివడిగా నడవలేకపోతున్నాను. పరుగెడితే పట్టలేనంత ఆయాసం, రొప్పుతో పాటు ఛాతీలో భరించలేనంత నొప్పి. మిత్రులు హైదరాబాద్‌కు వెళ్లి స్పెషలిస్టుకు చూపించమంటున్నారు. మీ సలహా ఏమిటి? - బి. నరసింహారావు, వీరులపహాడ్ ఊపిరితిత్తుల వ్యాధులకూ, క్యాన్సర్‌కు దారితీసే కొన్ని ప్రధాన కారణాలలో ఆస్బెస్టాస్ ఒకటి. దీన్నే రాతినార అంటారు. ఆస్బెస్టాస్ గనులు లేదా పరిశ్రమల్లో పనిచేసేవారి ఆరోగ్యంపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆస్బెస్టాస్ రాళ్లను పిండి చేస్తున్న సమయంలో కంటికి కనిపించనంతటి పరిణామంలో వాటినుంచి వెలువడే ఖనిజ ధాతువులు గాలిలో కలుస్తాయి. ఆ గాలిని పీల్చినప్పుడు అవి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి, అక్కడి కణజాలాన్ని రోగగ్రస్తం చేస్తాయి. ఊపిరితిత్తుల చుట్టూ దానికి రక్షణ కవచంలా ఉండే ఒక పలచటి పొర ఉంటుంది. దీన్నే మీసోథీలియోమా అంటారు. ఆస్బెస్టాస్ ఖనిజ ధాతువులు గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించిన తర్వాత దానికి రక్షణగా ఉండే ఈ పొరను తీవ్రంగా ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. అది క్రమంగా మీసోథీలియోమా క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. దీన్ని మొదట్లోనే గుర్తిస్తే చికిత్సకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పటికే మీరు చాలా కాలయాపన చేశారు. ఇక ఎంతమాత్రం ఆలస్యం చేసినా మీ సమస్య మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మీ సమస్యకు కారణం ఏమిటో తెలుసుకునేందుకు ఊపిరితిత్తుల నిపుణులను కలవండి. సమస్యను బట్టి చికిత్స ఉంటుంది. అయితే మీరు ఉన్న వృత్తిరీత్యా (ప్రొఫెషనల్ హజార్డ్గా) మీకు మీసోథీలియోమా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన ఆధునిక పురోగతి కారణంగా అది మీసోథీలియోమా క్యాన్సరే అని నిర్దారణ జరిగినా... దీనికి వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ (వ్యాట్స్) ద్వారా చికిత్స చేయవచ్చు. ఇక అవసరాన్ని బట్టి కీమో, రేడియేషన్ చికిత్సలనూ వినియోగించుకోవచ్చు. ఆస్బెస్టాస్తో వచ్చే ఎంతటి జటిలమైన సమస్యకైనా ఇప్పుడు పెద్దనగరాల్లో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీలైనంత త్వరగా మీకు దగ్గరలోని పెద్ద సెంటర్లకు వెళ్లండి. -
‘స్వచ్ఛంద’ మోసం
ఉద్యోగాల పేరుతో టోకరా పోలీసులను ఆశ్రయించిన బాధితులు సుమారు రూ.10 లక్షల మేరకు వసూలు చేశారని ఆరోపణ ఐదు జిల్లాల్లో మోసపోయిన నిరుద్యోగులు చౌడేపల్లె: స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని నమ్మబలికారు. నగదు వసూలుచేసి మోసం చేసిన సంఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. బాధితులు శుక్రవారం చౌడేపల్లె పోలీసులకు ఫిర్యాదుచేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చౌడేపల్లె మండలం చారాలకు చెందిన కొందరు యువకులు ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశారు. కుప్పంలో బ్రాంచ్ని ఏర్పాటుచేసి 40 మంది నిరుద్యోగులను గుర్తించి ఉద్యోగాలిస్తామని నమ్మబలికారు. వారికి పశువులకు సోకే వ్యాధుల నివారణపై సుమారు 40 రోజులపాటు కుప్పంలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన యువకులు వచ్చారు. ఆ సమయంలో నిరుద్యోగులు సొంత ఖర్చులతోనే గడిపారు. ఆ తర్వాత శిక్షణ పూర్తయ్యిందని చెప్పి సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ.5 వేలు వసూలు చేశారు. నాబార్డు పథకం ద్వారా తమ సంస్థకు నిధులు వస్తాయని, ఎవరి గ్రామాల్లో పశువుల వ్యాధులు నయం చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి పంపారు. టెక్నీషియన్ పోస్టులోఉన్నవారికి రూ.7,500, సూపర్వైజర్కు రూ.13 వేలు జీతం చెల్లిస్తామని చెప్పారు. ఉద్యోగం ఇచ్చామని చెప్పి గుర్తింపు కార్డులు కూడా జారీ చేశారు. విధి నిర్వహణలో భాగంగా మొబైల్ సర్వీసుకోసం అందరూ ఫైనాన్స్‌లో మోటా ర్ సైకిళ్లు కొన్నారు. ఆ తర్వాత మూడు నెలలైనా స్టయిఫండు లేదు. జీతమూ రాలేదు. చివరకు శుక్రవారం చౌడేపల్లె పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూపర్వైజర్ పోస్టు కోసం రూ:35 వేలు తీసుకొన్నారు నాకు సూపర్ వైజర్ పోస్టు కేటాయిస్తున్నామని చెప్పి రూ:35 వేలు ఇవ్వాలని సంస్థ నిర్వాహకులు డిమాండు చేయడంతో చెల్లించాను. ఉద్యోగం లేదు.. చివరికి అప్పులే మిగిలాయి.. ఎలాగైనా న్యాయం చేయాలి -రెడ్డెప్ప, పాలింపల్లె, చౌడేపల్లె మండలం. నమ్మితే నిలువునా ముంచేశారు పేదకుటుంబంలో పుట్టిన మాకు మాసొంత గ్రామాల్లోనే ఉద్యోగాలిచ్చి జీతాలిస్తామంటే వారిని నమ్మి నిలువునా మోసపోయాం. బమా ప్రాంతంలో ఎనిమిది మందికి ఉద్యోగాలిస్తామని డబ్బులు వసూలు చేశారు. మాలాగా మోసపోయిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. -సునీల్‌కుమార్, ప్రొద్దుటూరు, వైఎస్సార్‌జిల్లా. 06పిజిఆర్33జెపిజి: చౌడేపల్లెలో పోలీసులకు ఫిర్యాధుచేస్తున్న బాధితులు. 06పిజిఆర్34జెపిజి: చౌడేపల్లెలో మోసపోయిన బాధితులు 06పిజిఆర్35జెపిజి: డబ్బులు తీసుకొన్నతరువాత సంస్థవారు ఇచ్చిన రశీదు 06పిజిఆర్36జెపిజి: జారీ చేసిన గుర్తింపు కార్డులు 06పిజిఆర్37జెపిజి: రెడ్డెప్ప, పాలింపల్లె, చౌడేపల్లె మండలం. 06పిజిఆర్38జెపిజి: సునీల్‌కుమార్, పొద్ద్రుటూరు, వైఎస్సార్‌జిల్లా. -
పల్లియార్డు సూపర్వైజర్ నోటిదురుసు
పల్లి, పసుపు యార్డుల్లో కాంటాలు నిలిపివేసిన దడువాయిలు,హమాలీలు మూడున్నర గంటలపాటు రైతుల నిరీక్షణ క్షమాపణ చెప్పిన అధికారి కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లోని పల్లి, పసుపు యార్డులో బుధవారం సుమారు మూడున్నర గంటలపాటు కాంటాలు నిలిచిపోయాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పల్లియార్డులో పనిచేస్తున్న సూపర్వైజర్ సంజీవ్ ఉదయమే మద్యం సేవించి పలువురు హమాలీ కార్మికులతోపాటు దడువాయిలను దూషించాడు. దీంతో హమాలీ, దడువాయి కార్మికులు ఆ అధికారిని పల్లియార్డు నుంచి మార్చేదాకా కాంటాలు నిర్వహించమని మార్కెట్ కార్యదర్శి ఉప్పుల శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. కాంటాలు ఆలస్యం కావడంతో చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. బస్తాల వద్ద, మార్కెట్ కార్యాలయం ఎదుట కునుకు తీస్తూ కొనుగోళ్ల కోసం నిరీక్షించారు. చివరగా రైతులంతా మూకుమ్మడిగా మార్కెట్ కార్యదర్శిని కలిసి పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సమయంలోనే మార్కెట్‌కు వచ్చిన జేడీఎం సుధాకర్ కు కూడా రైతులు మొరపెట్టుకున్నారు. సూపర్వైజర్ సంజీవ్‌తో జేడీఎం, కార్యదర్శి దడువాయిలు, హమాలీలకు క్షమాపణ చెప్పించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎట్టకేలకు మూడున్నర గంటల అనంతరం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గతంలోనూ ఈ అధికారి తీరు ఇంతే.. గతంలో పలుమార్లు ఈ సూపర్వైజర్ ఉదయం, మధ్యాహ్నం సమయంలో మద్యం సేవిస్తూ అధికారులతో పాటు హమాలీ, గుమస్తా, దడువాయిలను సైతం నానా రకాలుగా వేధించాడు. ఇప్పటికైనా మార్కెట్ ఉన్నతాధికారులు స్పందించి సూపర్వైజర్పై చర్య తీసుకోవాలని రైతులు, హమాలీ కార్మికులు, దడువాయిలు, గుమస్తాలు, ఉద్యోగులు, రైతులు కోరుతున్నారు. -
పోలీసులు అదుపులో బోగస్ సంస్ధ సూపర్ వైజర్
-
రైతుకు దక్కని మద్దతు ధర
శుక్రవారం పలికిన ధర : 4,369 (క్వింటాల్‌కు) శనివారం మార్కెట్‌కు వచ్చిన పెసర్లు : 5700 క్వింటాళ్లు అధికారులు నిర్ణయించిన ధర : గరిష్టం 4556, మోడల్ *3928 కానీ 2500 క్వింటాళ్లకు పలికిన ధర : 3900 (క్వింటాల్‌కు) మిగతా వాటిని నాన్కోట్కింద చేర్చి 1500 ఇవ్వాలని వ్యాపారుల నిర్ణయం పెసర రైతుకు కొసరే మిగిలింది.. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులపాటు మెరుగైన మద్దతు ధర రావడంతో సంతోషపడిన రైతులు శనివారం భారీగా పెసర్లను తెచ్చారు. ఇంకేముంది వ్యాపారులు కుమ్మక్కయ్యారు. ఒక్కసారిగా ధర తగ్గించేశారు. వ్యయప్రయాసలకోర్చి వచ్చిన రైతులు ధర చూసి అగ్రహోద్రులయ్యారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను దోచుకుంటారా అంటూ ఆందోళనకు దిగారు. - న్యూస్‌లైన్, సూర్యాపేట సూర్యాపేట, న్యూస్‌లైన్ : మార్కెట్‌కు తీసుకొచ్చిన పెసర్లకు మ ద్దతు ధర లభించక పోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన నిర్వహించారు. శనివారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు 5700 క్వింటాళ్ల పెసర్లను రైతులు తీసుకొచ్చారు. దీంతో సిండికేట్‌గా మారిన వ్యాపారులు మద్దతు ధర చెల్లించలేదు. పెసర్లకు గరిష్ట ధర *4556, కనిష్టధర *3209, మోడల్ధర *3928లుగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. కానీ మార్కెట్లో వచ్చిన పెసర్లలో 2500 క్వింటాళ్లకు మాత్రమే * 3900ల ధర పలికింది. మిగతా వాటిని నాట్ కోట్ కింద చేర్చిన వ్యాపారులు కేవలం *1500ల ధర మాత్రమే ఇచ్చారు. పెసర్లకు 2వేల లోపు ధర రావడంతో వాటిని అమ్మడానికి రైతులు నిరాకరించారు. మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి మూరగుండ్ల లక్ష్మయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు దొంతిరెడ్డి సైదిరెడ్డి, దండ శ్రీనివాస్‌రెడ్డిలు మార్కెట్‌కు చేరుకొని రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. అందుబాటులో లేని సెక్రటరీ పెసర్లకు మద్దతు ధర అందించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్లో రైతులు ధర్నాకు దిగినప్పటికీ మార్కెట్ సెక్రటరీ గాని, చైర్మన్ గాని అందుబాటులో లేకుండా పోయారు. కేవలం సూపర్ వైజర్మాత్రమే ఉన్నారు. సమాచారం అందుకున్న డీఎస్వో నాగేశ్వర్రావు, తహసీల్దార్ జగన్నాథరావు, సివిల్ సప్లయ్ డీటీఎస్ మహ్మద్ అలీ, ఆర్ఐలు బ్రహ్మయ్య మార్కెట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్వో మాట్లాడుతూ ధాన్యానికి సంబంధించిన విషయాలు మాత్రమే తన పరిధిలోకి వస్తాయని, పెసర్లను మార్క్‌ఫెడ్ వారు కొనుగోళ్లు చేయాల్సి ఉందన్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్ఐ జబ్బార్ అక్కడికి చేరుకొని రైతులను శాంతింప చేయడానికి ప్రయత్నించారు. -
ఐసీడీఎస్‌లో వసూల్ రాణి!
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఐసీడీఎస్‌లో కిందిస్థాయి సిబ్బందిపై ఓ సూపర్వైజర్ వేధింపులు, వసూళ్ల పర్వం శ్రుతి మించుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆ సూపర్ వైజర్ తాను చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం చేయలేవంటూ తరచూ బెదిరిస్తున్నట్లు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన మాట వినని ఉద్యోగిపై కక్ష కట్టి పదే పదే విజిటింగ్లంటూ ఆ సెంటర్‌ను తనిఖీ చేసి తనదారికి తెచ్చుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఆ సూపర్వైజర్కు శాఖలో కొంతమంది ఉన్నతాధికారుల అండదండలు ఉండడంతో ఎవరికీ ఫిర్యాదు చేయలేక, మామూళ్లు ఇచ్చుకోలేక అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, ప్రతీ నెల మాత్రం ఆమెకు మామూళ్లు ఇవ్వాల్సిందేనని పలువురు అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సూపర్వైజర్ల బదిలీలు జరిగినప్పటికీ ఆ సూపర్వైజర్ మాత్రం జిల్లా కేంద్రం నుంచి బదిలీ కాలేదు. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని ఇక్కడే తిష్టవేసిందని, అంతేకాకుండా మరో సర్కిల్‌కు ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు శాఖలో చర్చించుకుంటున్నారు. వసూళ్లపర్వం ఇలా... విజిటింగ్ల పేరుతో అంగన్వాడీ కార్యకర్తలను, ఆయాలను బెదిరించడంతో పాటు ప్రతీ కేంద్రం నుంచి నెలకు కొంత వసూళ్లకు కూడా సూపర్వైజర్ పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతినెలా తాను సెంటర్లకు వస్తున్నందున తన బండి పెట్రోల్ ఖర్చుల కింద రూ.100 ఇవ్వాలని వసూలు చేస్తున్నట్లు, నెలకు ఒకసారి జరిగే సర్కిల్ మీటింగ్‌లో ఈ డబ్బులను వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అలాగే ప్రతిసెంటర్ నుంచి పిల్లల సంఖ్యను ఎక్కువ చూపించి ఒక ట్రే గుడ్లతోపాటు పిండి(పౌష్టికహారం) కట్టలను సైతం తన ఇంటికి తెప్పించుకుంటారని చెబుతున్నారు. ఆ సూపర్వైజర్ ఇటీవల ఒక నూతన గృహాన్ని కొనుగోలు చేసింది. గృహ ప్రవేశం నిమిత్తం ప్రతీ సెంటర్ కార్యకర్త నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసినట్లు అంగన్వాడీలు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. తన సర్కిల్‌తోపాటు మరో సర్కిల్‌కు ఇన్చార్జ్గా ఉండటంతో మొత్తం 90 మందికిపైగా అంగన్వాడీ కార్యకర్తలు ఒక్కొక్కరి నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఆమె ప్రతినెలా సెంటర్లో తనిఖీలు చేయకుండా ఉండాలన్నా... సెలవులు కావాలన్నా.. డబ్బులు ఇవ్వాల్సిందేనని, లేదంటే వారికి వేధింపులు తప్పడం లేదని సిబ్బంది చెబుతున్నారు. కాగా, ఈ ఆరోపణలు ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ సుఖజీవన్‌బాబు దృష్టికి పోవడంతో సదరు సూపర్వైజర్పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయాలని సీడీపీవో ఝన్సీని ఆదేశించినట్లు సమాచారం. దీంతో సీడీపీవో బుధవారం అంగన్వాడిలను సూపర్వైజర్ అక్రమాల గురించి విచారణ చేసినట్లు సమాచారం.