శుక్రవారం పలికిన ధర : 4,369 (క్వింటాల్‌కు)
శనివారం మార్కెట్‌కు వచ్చిన పెసర్లు : 5700 క్వింటాళ్లు
అధికారులు నిర్ణయించిన ధర : గరిష్టం 4556, మోడల్ *3928
కానీ 2500 క్వింటాళ్లకు పలికిన ధర : 3900 (క్వింటాల్‌కు)
మిగతా వాటిని నాన్‌కోట్‌కింద చేర్చి 1500 ఇవ్వాలని వ్యాపారుల నిర్ణయం
పెసర రైతుకు కొసరే మిగిలింది.. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో రెండు రోజులపాటు మెరుగైన మద్దతు ధర రావడంతో సంతోషపడిన రైతులు శనివారం భారీగా పెసర్లను తెచ్చారు. ఇంకేముంది వ్యాపారులు కుమ్మక్కయ్యారు. ఒక్కసారిగా ధర తగ్గించేశారు. వ్యయప్రయాసలకోర్చి వచ్చిన రైతులు ధర చూసి అగ్రహోద్రులయ్యారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను దోచుకుంటారా అంటూ ఆందోళనకు దిగారు. - న్యూస్‌లైన్, సూర్యాపేట
సూర్యాపేట, న్యూస్‌లైన్ : మార్కెట్‌కు తీసుకొచ్చిన పెసర్లకు మ ద్దతు ధర లభించక పోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన నిర్వహించారు. శనివారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు 5700 క్వింటాళ్ల పెసర్లను రైతులు తీసుకొచ్చారు. దీంతో సిండికేట్‌గా మారిన వ్యాపారులు మద్దతు ధర చెల్లించలేదు. పెసర్లకు గరిష్ట ధర *4556, కనిష్టధర *3209, మోడల్‌ధర *3928లుగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. కానీ మార్కెట్‌లో వచ్చిన పెసర్లలో 2500 క్వింటాళ్లకు మాత్రమే * 3900ల ధర పలికింది. మిగతా వాటిని నాట్ కోట్ కింద చేర్చిన వ్యాపారులు కేవలం *1500ల ధర మాత్రమే ఇచ్చారు. పెసర్లకు 2వేల లోపు ధర రావడంతో వాటిని అమ్మడానికి రైతులు నిరాకరించారు. మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి మూరగుండ్ల లక్ష్మయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు దొంతిరెడ్డి సైదిరెడ్డి, దండ శ్రీనివాస్‌రెడ్డిలు మార్కెట్‌కు చేరుకొని రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు.
అందుబాటులో లేని సెక్రటరీ
పెసర్లకు మద్దతు ధర అందించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్‌లో రైతులు ధర్నాకు దిగినప్పటికీ మార్కెట్ సెక్రటరీ గాని, చైర్మన్ గాని అందుబాటులో లేకుండా పోయారు. కేవలం సూపర్ వైజర్‌మాత్రమే ఉన్నారు. సమాచారం అందుకున్న డీఎస్‌వో నాగేశ్వర్‌రావు, తహసీల్దార్ జగన్నాథరావు, సివిల్ సప్లయ్ డీటీఎస్ మహ్మద్ అలీ, ఆర్‌ఐలు బ్రహ్మయ్య మార్కెట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్‌వో మాట్లాడుతూ ధాన్యానికి సంబంధించిన విషయాలు మాత్రమే తన పరిధిలోకి వస్తాయని, పెసర్లను మార్క్‌ఫెడ్ వారు కొనుగోళ్లు చేయాల్సి ఉందన్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్‌ఐ జబ్బార్ అక్కడికి చేరుకొని రైతులను శాంతింప చేయడానికి ప్రయత్నించారు.
రైతుకు దక్కని మద్దతు ధర
Published Sun, Aug 25 2013 6:38 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement