నందిగామ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి మేలు జరుగుతోంది. ఇందుకు తానే ఉదాహరణ అని ఎన్టీఆర్ జిల్లా నందిగామకి చెందిన ట్రాన్స్‌జెండర్ ఇనపనుర్తి సహస్ర అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే యాచక వృత్తి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు సూపర్‌వైజర్‌గా రాణిస్తున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా సహస్ర మాట్లాడుతూ.. ‘నా అసలు పేరు సురేష్. చిన్నతనం నుంచి మహిళగా మారాలని కోరిక. పదవ తరగతి పూర్తికాగానే ఢిల్లీకి వెళ్లాను. అక్కడ హిజ్రాగా మారి నందిగామ వచ్చాను. అందరూ నన్ను దూరంగా పెట్టారు. చేద్దామంటే పని దొరకలేదు. దీంతో యాచించడం తప్ప మరోమార్గం దొరకలేదు. నేను డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగం కోసం ప్రయత్నించినా రాలేదు. 2019లో సీఎం జగన్ ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు ద్వారా ఏపీఎస్‌బీసీఎల్‌కు చెందిన మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం వచ్చింది. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాను. సీఎం జగన్ చలవతోనే నేడు నాకు గౌరవం దక్కుతోంది’ అని తెలిపింది.
ఇది కూడా చదవండి: కాకినాడ తునిలో దారుణం: మహిళా చిరు వ్యాపారిని డబ్బు కోసం బెదిరించి..
Comments
Please login to add a commentAdd a comment