సార్‌! రోడ్డు పక్క ఓ కాలు తెగిపడి ఉంది.. | Delta Police Department Police Found Mannequin Foot On Road Side | Sakshi
Sakshi News home page

సార్‌! రోడ్డు పక్క ఓ కాలు తెగిపడి ఉంది..

Published Fri, Jan 8 2021 10:13 AM | Last Updated on Fri, Jan 8 2021 11:51 AM

Delta Police Department Police Found Mannequin Foot On Road Side - Sakshi

రోడ్డు పక్కన పడి ఉన్న బొమ్మ కాలు

ఒట్టావా : కొద్ది రోజుల క్రితం కెనడాలోని డెల్టా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ పోలీస్‌ అధికారి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆ పోలీస్‌ అధికారిని చూసిన ఓ కారు డ్రైవర్‌ వాహనాన్ని రోడ్డు పక్కగా ఆపుచేశాడు. అనంతరం పోలీస్‌ దగ్గరకు వెళ్లి  ‘‘ సార్‌! పంప్‌ హౌస్‌ దగ్గర రోడ్డు పక్కన ఓ కాలు తెగిపడి ఉంది’’ అని చెప్పాడు. దీంతో ఆ పోలీస్‌ అధికారి పంప్‌ హౌస్‌ దగ్గరకు వెళ్లాడు. అక్కడ తెగిపడి ఉన్న కాలు కనిపించింది. దాని దగ్గరకెళ్లి చూసి, ఆశ్చర్యపోయాడు. అదో బొమ్మ కాలని తెలిసి నవ్వుకున్నాడు. ( చిరుతకు ఝలక్: ఈ జింక చర్య ఊహాతీతం‌ )

డెల్టా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ గత మంగళవారం తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈ సంఘటన గురించి రాసుకొచ్చింది. ‘‘ మీ బొమ్మ ఎడమ కాలు పోయినట్లయితే.. డెల్టా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తీసుకెళ్లండి’’ అంటూ ఫన్నీగా స్పందించింది. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు.. ‘‘ ఆ డ్రైవర్‌ పరిశీలనా నైపుణ్యం అద్భుతం.. కామెడీ పీసు’’.. ‘‘ ఎడమ కాలు లేకుండా ఆ బొమ్మ ఎన్ని అవస్థలు పడుతోందో’’.. ‘‘ఆ పోలీస్‌ కాలినడకన పోయి కాలు కనుగొన్నాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( వైరల్‌: సింహానికే వణుకు పుట్టించాడు )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement