‘‘ఇదెక్కడి పెళ్లి గోలరా నాయనా’’ వైరల్‌ వీడియో : ఎలిమినేట్‌ చేసేయండంటూ ఫైర్‌ | Canadian Woman Post About A Noisy Indian Baraat Turns Racist | Sakshi
Sakshi News home page

‘‘ఇదెక్కడి పెళ్లి గోలరా నాయనా’’ వైరల్‌ వీడియో : ఎలిమినేట్‌ చేసేయండంటూ ఫైర్‌

Published Thu, Jan 9 2025 4:00 PM | Last Updated on Thu, Jan 9 2025 4:25 PM

Canadian Woman Post About A Noisy Indian Baraat Turns Racist

కెనడాలో అర్థరాత్రి జరిగిన భారతీయ వివాహ వేడుకపై కెనడాకు చెందిన ఒక మహిళ  విమర్శలు గుప్పించింది.  ఆమె ఫ్రస్ట్రేషన్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో షేర్‌  చేసిన  వీడియో నెట్టింట  వైరల్‌గా మారింది. స్టోరీ ఏంటంటే..

భారతీయ వివాహాలు, సందడిపై  ఒక కెనడియన్ మహిళ పోస్ట్ చేసిన వీడియో క్లిప్ ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో జాత్యహంకార చర్చకు దారి తీసింది. సాడీ క్రోవెల్(Sadie Crowell) అనే యువతి తన ఇంటి పక్కన జరుగుతున్న ఒక భారతీయ పెళ్లి( Indian Wedding )కి సంబంధించిన హడావిడి, శబ్దాల గురించి విసుక్కుంటూ ఒక వీడియో పెట్టింది. అర్థరాత్రి ఇదేంగోలరా బాబు, నిద్ర రావడం  లేదు  ఆవేదన వ్యక్తంచేసింది.  రాత్రినుంచీ ఒకటే మ్యూజిక్‌.. నిద్రే  లేదు.. ఉదయం 9 అవుతున్నా.. ఆ  సౌండ్స్‌  గోల ఆగ లేదంటూ విమర్శలు గుప్పించింది. పనిలో పనిగా తన బాల్కనీ నుండి  పెళ్లి బరాత్‌కు సంబంధించిన వీడియోతీసి పోస్ట్‌  చేసింది.  దీంతోఇది కాస్తా వైరల్‌ అయింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ఇంకొందరు ఆమె తీరు ఫన్నీగా ఉందంటూ వ్యాఖ్యానించారు. మరికొందరు ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. మరో అడుగు ముందుకేసిన మరో యూజర్‌ వాళ్లని దేశంనుంచి తరిమేయాలంటూ కమెంట్‌ చేశారు. ముఖ్యంగా భిన్న సంస్కృతుల మధ్య గౌరవం, సామరస్యం ఉండాలని కొంతమంది వ్యాఖ్యానించడం గమనార్హం .సోషల్ మీడియాలోఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు రావడం బాధాకరమన్నారుకొందరు నెటిజన్లు. అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునేందుకు వేదికగా ఉపయోగపడుతున్న సోషల్ మీడియా విద్వేషాలను రెచ్చగొట్టే వేదికగా మారకూడదని హితవు పలకడం  విశేషం.

మరికొన్ని వ్యాఖ్యలు ఇలా ఉన్నాయ్‌
"ఆ పరిస్థితిలో స్పానిష్ ప్రజలు పెద్ద బకెట్ల నీటిని కిటికీ నుండి విసిరేవారు" 
"నివాస ప్రాంతంలో ఈ రకమైన బిగ్గరగా చికాకు కలిగించడం అనుమతించబడుతుందా?" 
సామూహిక వలసలున్నపుసామూహిక బహిష్కరణ ఎందుకు జరగకూడదు?!
“మాకా” (మేక్ కెనడా గ్రేట్ ఎగైన్) అనే కొత్త పాలసీని రూపొందించాలి’.
“వీళ్లు (Indians) ఇక్కడికి మంచిగా బతకడానికి వచ్చారు కానీ, మన దేశానికి తగ్గట్టు మారాలి కానీ, వాళ్ల గోలను ఇక్కడ రుద్దకూడదు” 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement