క్యుబెక్ : సాధారణంగా విమానాలు రన్‌వే మీద ల్యాండ్ అవడం చూస్తుంటాం.. కానీ ఇక్కడ మాత్రం ఒక విమానం అత్యవసర పరిస్థితి ఏర్పడడంతో హైవే మీద ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కెనెడాలోని క్యుబెక్ ఫ్రావిన్స్ హైవే నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్పటికే హైవేపై వేగంగా కార్లు వెళుతున్నాయి. ఇదే సమయంలో ఆకాశంలో వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాలనుకున్నాడు. కానీ ఇంకా రన్‌వే చాలా దూరంలో ఉండడంతో అంతసేపు విమానం గాల్లో ఉంటే కష్టమని హైవేపై ల్యాండ్ చేద్దామని భావించాడు.
రోడ్డుపై కార్లు రివ్వుమని దూసుకెళుతుండడంతో పైలట్ జాగ్రత్తగా ఏ వాహనానికి తగలకుండా మెళ్లిగా విమానాన్ని హైవే మధ్యలో దింపేశాడు. ఇదంతా రోడ్డుపై వెళుతున్న ఒక ప్రయాణికుడు వీడియో తీసి ట్విటర్‌లో షేర్ చేశాడు. అయితే వీడియోలో పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్న సమయం ఎంతో ఉత్కంఠ కలిగించింది. హైవేపై వెళుతున్న వాహనాలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా విమానాన్ని కిందకు దించడంలో పైలట్ చాకచక్యతను మెచ్చుకొని తీరాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ' రన్‌వే మీద దిగాల్సిన విమానం హైవే మీద దిగింది.. పైలట్ సమయస్పూర్తిని మెచ్చుకోవాల్సిందే.. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment