aeroplane landing
-
ల్యాండవుతున్న విమానంలో మంటలు
కాలిఫోర్నియా: ప్రయాణికులతో వెళుతున్న ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి లాస్ వెగాస్‌కు వచ్చిన ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో దట్టమైన పొగ వ్యాపించింది.విమానం లాస్‌వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. A #FrontierAirlines jet caught fire while landing in #LasVegas. Onlookers captured the dramatic moment as #FrontierFlight1326, arriving from #SanDiego, made a hard emergency landing at #LasVegasInternationalAirport.#planefire #EmergencyLanding pic.twitter.com/7G2nJJ6GmD— know the Unknown (@imurpartha) October 6, 2024విమానంలో మంటలు రావడంతో వెంటనే స్పందించిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు.మంటలు ఎగిసిపడ్డ సమయంలో విమానంలో మొత్తం 190 మంది ప్రయాణికులు,ఏడుగురు సిబ్బంది ఉన్నారు.వారందరినీ సురక్షితంగా విమానం నుంచి బయటికి తీసుకువచ్చారు.ఇదీ చదవండి: యుద్ధం వస్తే.. ఏ దేశం పవర్ ఎంత..? -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరుదైన విమానం
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం(ఆగస్టు29) అర్ధరాత్రి అరుదైన విమానం ల్యాండ్ అయింది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన విమానం సైజు భారీగా ఉండటంతో దీనిని వేల్ ఆఫ్ ది స్కైగా పిలుస్తారు. ఇది ఎయిర్‌బస్‌కు చెందిన A300-608ST బెలుగా రకం విమానం.ఇంధనం నింపుకోవడంతో పాటు సిబ్బంది విశ్రాంతి కోసం బెలుగా విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. మస్కట్ నుంచి థాయిలాండ్ వెళ్తుండగా మార్గమధ్యలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ లోహవిహంగం వాలింది. ఇది శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వెళుతుందని అధికారులు చెప్పారు. -
వామ్మో! ఏకంగా.. లారీ పై.. ఎక్కిన విమానం..!
మహబూబ్‌నగర్: సాధారణంగా విమానం ఆకాశంలో ఎగురుతుంది.. లేకపోతే విమానాశ్రయంలో ఆగుతుంది. కానీ, ఓ విమానం లారీపై ప్రయాణించడంతో ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. ఆదివారం హైదరాబాద్ వైపు నుంచి విమానం తీసుకెళ్తున్న ఓ లారీ జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఆగింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు రెక్కలు లేని విమానాన్ని ఆసక్తిగా గమనించారు. కర్నూలులో హోటల్ నిర్వహణ కోసం ఈ విమానాన్ని ఢిల్లీ నుంచి తీసుకెళ్తున్నట్లు తెలిసింది. -
హైవేపై విమానాల ల్యాండింగ్ ట్రయల్ రన్
జే.పంగులూరు: విజయవాడ–ఒంగోలు మధ్యనున్న జాతీయ రహదారిపై గురువారం విమానాల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అత్యవసర సమయాల్లో విమానాలు దిగేందుకు వీలుగా.. ఇప్పటికే జాతీయ రహదారిపై రెండు ప్రాంతాల్లో రన్వేలు నిర్మించారు. వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు సైతం క్షేమంగా నేలపైకి దిగడానికి వీలుగా రన్‌వేలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయగా.. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ–కలికివాయి, బాపట్ల జిల్లా రేణింగవరం–కొరిశపాడు మధ్య హైవే మీద రన్వేలు సిద్ధం చేస్తున్నారు. రేణింగవరం–కొరిశపాడు మధ్య 4 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన రన్‌వేపై గురువారం ఉదయం 11 గంటలకు కార్గో, ఫైటర్ జెట్ విమానాలు దిగనున్నాయి. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైమానిక దళ సిబ్బంది విమానాలు దిగే ప్రాంతాన్ని పరిశీలించారు. అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. రన్‌వే కోసం తారు రోడ్డును నాలుగు కిలోమీటర్ల పరిధిలో 6 మీటర్ల మేర తవ్వి.. నాలుగు లేయర్లుగా సిమెంట్ రోడ్డు వేశారు. డివైడర్లను, చుట్టుపక్కల ఉన్న చెట్లను, విద్యుత్ తీగలను తొలగించారు. -
ల్యాండింగ్ చేస్తూ ఢీ కొట్టిన రెండు విమానాలు
వాషింగ్టన్: ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేసే సమయంలో రెండు మినీ విమానాలు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వాట్సోన్‌విల్లే నగరంలోని స్థానిక విమానాశ్రయంలో రెండు విమానాలు ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ‘వాట్సోన్‌విల్లే మున్సిపల్ ఎయిర్‌పోర్ట్‌లో 2 విమానాలు ల్యాండింగ్ చేసే ప్రయత్నంలో ఢీకొన్నాయి. ఈ సంఘటనపై పలు ఏజెన్సీలు సత్వరం స్పందించాయి. పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు మాకు సమాచారం ఉంది.’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు స్థానిక అధికారులు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. ఫెడరల్ ఏవియేషన్ ప్రకారం.. ట్విన్ ఇంజిన్ సెస్నా 340 విమానంలో ఇద్దరు, సింగిల్ ఇంజిన్ సెస్నా152 విమానంలో పైలట్ ఉన్నారు. ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా? అనే విషయం తెలియరాలేదని పేర్కొంది ఎఫ్ఏఏ. Multiple agencies responded to Watsonville Municipal Airport after 2 planes attempting to land collided. We have reports of multiple fatalities. Report came in at 2:56pm. Investigation is underway, updates to follow. pic.twitter.com/pltHIAyw5p — City of Watsonville (@WatsonvilleCity) August 18, 2022 ఇదీ చదవండి: ఆకాశమే ఆమె హద్దు.. -
వామ్మో.. ఈ విమానం ల్యాండింగ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఎథెన్స్: గ్రీస్‌లోని స్కియాథోస్ విమానాశ్రయం సుందరమైన వీక్షణలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విమానాలు దిగడాన్ని చూడటానికి ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులు ల్యాండింగ్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను వీక్షించేందుకు రోజుకు సుమారు 100 మందికిపైగా ఇక్కడి వస్తారు. ఈ విమానాశ్రయం ఇతర అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లా అంత పెద్దగా ఉండదు. చిన్న రన్‌వే ఉంటుంది. ఇక్కడ దిగేందుకు అనుమతి పొందిన అతిపెద్ద విమానం బోయింగ్ 757. ఇటీవల ఓ ప్రయాణికుల విమానం అత్యంత తక్కువ ఎత్తులో ల్యాండింగ్ చేసిన విధానాన్ని చాలా మంది ఆశ్వాదించారు. ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. విజ్‌ఎయిర్ ఎయిర్‌బస్ ఏ321నియో ప్లేన్.. సముద్ర నీటిని తాకుందా అన్నట్లు వెళ్తూ.. అలెగ్జాండ్రోస్ పపడియామంటిస్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ల్యాండింగ్‌కు కొద్ది సెకన్ల ముందు విమానం ముందు టైర్లు రోడ్డుపై ఉన్న వారిని తాకుతాయా అన్నట్లు కనిపించింది. రన్‌వే ఫెన్సింగ్ దాటిన క్రమంలో ఆ గాలికి అక్కడి వారు దూరంగా పడిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోను గ్రేట్ఫ్లైయర్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. స్కియథోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 5,341 అడుగుల రన్‌వే కలిగి ఉంటుంది. అతితక్కువ పొడవు, తక్కువ వెడల్పుతో ఉండటం దీని ప్రత్యేకత. ఈ ఎయిర్పోర్ట్ 1972లో ప్రారంభమైంది. ఇదీ చదవండి: దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణం...అక్కడ అంతా శ్వేత జాతీయులే! -
వైరల్ : చూస్తున్నంతసేపు ఉత్కంఠ..
-
వైరల్ : చూస్తున్నంతసేపు ఉత్కంఠ..
క్యుబెక్ : సాధారణంగా విమానాలు రన్‌వే మీద ల్యాండ్ అవడం చూస్తుంటాం.. కానీ ఇక్కడ మాత్రం ఒక విమానం అత్యవసర పరిస్థితి ఏర్పడడంతో హైవే మీద ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కెనెడాలోని క్యుబెక్ ఫ్రావిన్స్ హైవే నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్పటికే హైవేపై వేగంగా కార్లు వెళుతున్నాయి. ఇదే సమయంలో ఆకాశంలో వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాలనుకున్నాడు. కానీ ఇంకా రన్‌వే చాలా దూరంలో ఉండడంతో అంతసేపు విమానం గాల్లో ఉంటే కష్టమని హైవేపై ల్యాండ్ చేద్దామని భావించాడు. రోడ్డుపై కార్లు రివ్వుమని దూసుకెళుతుండడంతో పైలట్ జాగ్రత్తగా ఏ వాహనానికి తగలకుండా మెళ్లిగా విమానాన్ని హైవే మధ్యలో దింపేశాడు. ఇదంతా రోడ్డుపై వెళుతున్న ఒక ప్రయాణికుడు వీడియో తీసి ట్విటర్లో షేర్ చేశాడు. అయితే వీడియోలో పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్న సమయం ఎంతో ఉత్కంఠ కలిగించింది. హైవేపై వెళుతున్న వాహనాలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా విమానాన్ని కిందకు దించడంలో పైలట్ చాకచక్యతను మెచ్చుకొని తీరాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ' రన్‌వే మీద దిగాల్సిన విమానం హైవే మీద దిగింది.. పైలట్ సమయస్పూర్తిని మెచ్చుకోవాల్సిందే.. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
స్పైస్‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి గురువారం లక్నో మీదుగా వారణాసికి బయలుదేరిన స్పైస్ జెట్ 708 విమానం లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వారణాసిలో విమానం దింపడానికి వాతావరణం అనుకూలంగా లేదనే సంకేతాలు రావడంతో శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండైంది.