ల్యాండింగ్‌ చేస్తూ ఢీ కొట్టిన రెండు విమానాలు | Collision Took Place Between Two Small Aircrafts In The US | Sakshi
Sakshi News home page

ల్యాండింగ్‌ చేస్తూ ఢీ కొట్టిన రెండు విమానాలు.. ఇద్దరు మృతి

Published Fri, Aug 19 2022 7:55 AM | Last Updated on Fri, Aug 19 2022 7:55 AM

Collision Took Place Between Two Small Aircrafts In The US - Sakshi

వాషింగ్టన్‌: ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ చేసే సమయంలో రెండు మినీ విమానాలు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వాట్సోన్‌విల్లే నగరంలోని స్థానిక విమానాశ్రయంలో రెండు విమానాలు ల్యాండింగ్‌ చేసేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. 

‘వాట్సోన్‌విల‍్లే మున్సిపల్‌ ఎయిర్‌పోర్ట్‌లో 2 విమానాలు ల్యాండింగ్‌ చేసే ప్రయత్నంలో ఢీకొన్నాయి. ఈ సంఘటనపై పలు ఏజెన్సీలు సత్వరం స్పందించాయి. పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు మాకు సమాచారం ఉంది.’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు స్థానిక అధికారులు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. ఫెడరల్‌ ఏవియేషన్‌ ప్రకారం.. ట్విన్‌ ఇంజిన్‌ సెస్నా 340 విమానంలో ఇద్దరు, సింగిల్‌ ఇంజిన్‌ సెస్నా152 విమానంలో పైలట్‌ ఉన్నారు. ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా? అనే విషయం తెలియరాలేదని పేర్కొంది ఎఫ్‌ఏఏ. 

ఇదీ చదవండి: ఆకాశమే ఆమె హద్దు.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement