కాలిఫోర్నియా: ప్రయాణికులతో వెళుతున్న ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి లాస్ వెగాస్‍కు వచ్చిన ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో దట్టమైన పొగ వ్యాపించింది.
విమానం లాస్‌వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.
A #FrontierAirlines jet caught fire while landing in #LasVegas. Onlookers captured the dramatic moment as #FrontierFlight1326, arriving from #SanDiego, made a hard emergency landing at #LasVegasInternationalAirport.#planefire #EmergencyLanding pic.twitter.com/7G2nJJ6GmD
— know the Unknown (@imurpartha) October 6, 2024
విమానంలో మంటలు రావడంతో వెంటనే స్పందించిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు.మంటలు ఎగిసిపడ్డ సమయంలో విమానంలో మొత్తం 190 మంది ప్రయాణికులు,ఏడుగురు సిబ్బంది ఉన్నారు.వారందరినీ సురక్షితంగా విమానం నుంచి బయటికి తీసుకువచ్చారు.
ఇదీ చదవండి: యుద్ధం వస్తే.. ఏ దేశం పవర్ ఎంత..?
Comments
Please login to add a commentAdd a comment