శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరుదైన విమానం | Rare Aeroplane Landed In Shamshabad Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరుదైన విమానం

Published Fri, Aug 30 2024 3:01 PM | Last Updated on Fri, Aug 30 2024 7:02 PM

Rare Aeroplane Landed In Shamshabad Airport

సాక్షి,హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం(ఆగస్టు29) అర్ధరాత్రి అరుదైన విమానం ల్యాండ్‌ అయింది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన విమానం సైజు భారీగా ఉండటంతో దీనిని వేల్ ఆఫ్ ది స్కైగా పిలుస్తారు. ఇది ఎయిర్‌బస్‌కు చెందిన A300-608ST బెలుగా రకం విమానం.

ఇంధనం నింపుకోవడంతో పాటు సిబ్బంది విశ్రాంతి కోసం బెలుగా విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. మస్కట్ నుంచి థాయిలాండ్ వెళ్తుండగా మార్గమధ్యలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఈ లోహవిహంగం వాలింది. ఇది శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వెళుతుందని అధికారులు చెప్పారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement