
మహబూబ్‌నగర్: సాధారణంగా విమానం ఆకాశంలో ఎగురుతుంది.. లేకపోతే విమానాశ్రయంలో ఆగుతుంది. కానీ, ఓ విమానం లారీపై ప్రయాణించడంతో ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. ఆదివారం హైదరాబాద్ వైపు నుంచి విమానం తీసుకెళ్తున్న ఓ లారీ జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఆగింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు రెక్కలు లేని విమానాన్ని ఆసక్తిగా గమనించారు. కర్నూలులో హోటల్ నిర్వహణ కోసం ఈ విమానాన్ని ఢిల్లీ నుంచి తీసుకెళ్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment