marriage barat
-
Indian Marriages: 23 రోజుల్లో రూ.4.25లక్షల కోట్ల వ్యాపారం..!
పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో మరపురాని జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఈ బంధాన్ని జీవితకాలం గుర్తుండిపోయేలా భావిస్తారు. తల్లిదండ్రులు సైతం తమ బిడ్డల కలలకు తగ్గట్టుగా ఉన్నంతలో ఘనంగా చేయాలని ఆరాటపడతారు.. ఇందులో భాగంగానే బంధువులు, స్నేహితుల్లో ఎవరూ చేయని విధంగా పెళ్లిజరపాలనే తలంపుతో వైభవాన్ని చాటేలా చేస్తున్నారు. ఇదంతా ఎప్పుడూ జరుగుతూ ఉన్నా.. ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లకు అయ్యే ఖర్చులు అంచనాలకు మించి ఆకాశాన్నంటుతున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఈ సంవత్సరం పెళ్లిళ్ల సీజన్లో కేవలం 23 రోజుల్లో రూ.4.25లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేసింది. సదరు నివేదిక ప్రకారం.. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు దాదాపు 35లక్షల వివాహాలు జరగనున్నాయి. ఈ వివాహాల వల్ల సంబంధీకులు జరిపే కొనుగోళ్లు, ఇతర సేవలు కలిపి రూ.4.25లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని సర్వే తెలిపింది. ఈ ఏడాది మొత్తం పెళ్లిళ్లలో 10 శాతం అంటే 3.5 లక్షల పెళ్లిళ్లు ఒక్క దిల్లీలోనే ఉంటాయని అంచనా. మొత్తం వివాహాల్లో 50వేల మంది లగ్జరీ కేటగిరీలో ఉండనున్నారు. వారు కనీసం రూ.1కోటి లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తారని నివేదిక చెబుతుంది. మరో 50వేల పెళ్లిళ్లకు ఒక్కో దానికి రూ.50 లక్షల వరకు ఖర్చులు ఉంటాయి. అయితే దాదాపు 6 లక్షల పెళ్లిళ్లకు సుమారు రూ.25లక్షలు ఖర్చు చేయనున్నట్లు సర్వే వెల్లడించింది. 12లక్షల వివాహాలకు రూ.10 లక్షలు, మరో 10 లక్షల వివాహాలకు రూ.6 లక్షల చొప్పున ఖర్చు అవుతుంది. గత సంవత్సరం అదే 23 రోజుల సమయంలో మొత్తం 3.2 మిలియన్ల వివాహాలు జరిగాయి. ఫలితంగా రూ.3.75లక్షల కోట్ల వ్యాపారం నమోదైందని సీఏఐటీ సర్వే చెప్పింది. మధ్యతరగతి వివాహ వేడుకకు అయ్యే ఖర్చు సుమారుగా ఇలా.. కల్యాణ మండపం అద్దె(రోజుకు): రూ.2లక్షలు పూల అలంకరణ, ఇతర వినియోగాలుఖ: రూ.1.50లక్షలు భోజనం నిమిత్తం(క్యాటరింగ్):రూ.1.80క్షలు వంట మనుషులు, సహాయకుల ఖర్చులు: రూ.30వేలు కిరాణా సరకులు: రూ.60వేలు కూరగాయల ఖర్చు: రూ.30వేలు సన్నాయి వాయిద్యాలకు: రూ.20వేలు డ్రింకింగ్ వాటర్: రూ.2వేలు సలాడ్, పాన్, ఐస్‌క్రీం: రూ.25వేలు కార్మికులు, సహాయకులకు: రూ.5వేలు జనరేటర్: రూ.7వేలు విద్యుత్తు లైట్లు, అలంకరణ: రూ.30వేలు ఫొటో, వీడియోగ్రాఫర్: రూ.60వేలు ఇవికాకుండా బంగారు ఆభరణాలు, బంధువుల కానుకలు అదనం. -
ఆనంద్ మహీంద్ర: బారాత్ వీడియో, కరెక్ట్ ట్రాక్‌లో ఉన్నావ్ భయ్యా! ఫ్యాన్స్ ఫిదా
సాక్షి, ముంబై: పారిశ్రామిక వేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. మహీంద్రకు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ డీలర్ తన పెళ్లి సందర్భంగా స్వరాజ్ ట్రాక్టర్స్‌తో బారాత్ నిర్వహించాడు. ఇదే విషయాన్ని ట్విటర్లో పంచుకున్నారు. అందంగా ముస్తాబు చేసిన 12 ట్రాక్టర్లతో, 12 కుటుంబాలతో పెళ్లి ఊరేగింపు జరిగింది అంటూ తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేశారు. ఈ వీడియోపైనే ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఇదికదా కుటుంబం అంటే.. కుటుంబసభ్యునిగా పిలుచుకునేది ఇందుకే కదా.. మనమంతా కుటుంబసభ్యులమే! అభినందనలంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. దీంతో ట్విటర్ యూజర్లు కూడా కొత్త జంలకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా బారాత్‌లో ట్రాక్టర్లతో ట్రాక్టర్ల డీలర్.. వారెవ్వా..నిజంగా సరైన ట్రాక్‌లో ఉన్నాడు అంటూ చమత్కరించడం విశేషం. Now THAT’S what I call being a member of the family! Badhai ho badhai. https://t.co/6vxIGqqAX4 — anand mahindra (@anandmahindra) March 10, 2023 -
మూడు గంటల్లోనే పెళ్లి పెటాకులై..
-
మూడు గంటల్లోనే పెళ్లి పెటాకులై..
సాక్షి, కరీంనగర్/హుజురాబాద్ టౌన్: పెద్దల మాట కాదనలేకనో, సమాజంలో ఎదురయ్యే అవమానాలు భరించలేకనో మూడు ముళ్ళ బంధంతో ఏడు అడుగులు నడిచింది ఓ యువతి. కానీ అంతలోనే వరుడి జీవితంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో వివాహమై మూడు గంటలు కూడా గడవకముందే పెళ్లి పెటాకులై.. ఆ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. సినిమాలోని సీన్లను తలపించే ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. హుజూరాబాద్‌కు చెందిన దివ్య వంశీ అనే యువకుడిని ప్రేమించింది. అయితే, తల్లిదండ్రుల మాట కాదనలేకనో లేదా బలవంతంగానో గానీ వారు కుదిర్చిన వివాహానికి అంగీకరించింది. దీంతో మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ప్రవీణ్ కుమార్‌కు ఇచ్చి బంధువుల సమక్షంలో సోమవారం రాత్రి పెళ్లి జరిపించారు. (చదవండి: మంచం మీద ప్రేమ పెళ్లి: కారణం ఏంటంటే?.) అప్పటి దాకా అంతా బాగానే సాగింది. అయితే భాజా భజంత్రీల నడుమ అప్పగింతలు జరిగి ఊరేగింపు మొదలైన సమయంలో ప్రియుడు ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయింది. మద్యం మత్తులో ఉన్న ప్రియుడు వంశీ సీన్లోకి ఎంటరయ్యాడు. ‘‘నీవు ఎలా పెళ్లి చేసుకున్నావు’’ అంటూ హంగామా సృష్టించాడు. నవ దంపతులు పెళ్లికూతురు ఇంటి నుంచి ఊరేగింపుగా బయలుదేరుతుండగా కారును అడ్డుకున్నాడు. పెళ్లికూతురిని కిందకి దింపి వరుడి ఎదుటే ఆమెకు ముద్దుపెట్టాడు. ఆమెను తనకప్పగించి వెళ్లిపోవాలని గొడవకు దిగాడు. ఇంకేముంది ఈ ఘటన చూసిన పెళ్ళికొడుకు బిత్తరపోయాడు. (చదవండి: మొన్న పెళ్లి.. నిన్న ప్రేమపెళ్లి.. రెండు రోజుల్లో రెండు పెళ్లిళ్లు) వరుడి ఫిర్యాదు.. ప్రియుడితోనే ఉంటానన్న దివ్య దీంతో పెళ్లింట ఆందోళన నెలకొంది. సీన్ పెళ్లి ఇంటి నుంచి పోలీస్ స్టేషన్‌కు మారింది. మద్యం మత్తులో వంశీ అనే యువకుడు తాను పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించానంటూ గొడవకు దిగడంతో చేయడంతో పాటుగా.. తనపై దాడికి యత్నించాడని వరుడు ప్రవీణ్‌కుమార్ ఫిర్యాదు చేశాడు. దీంతో వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. ఇక్కడ వరకు ఓ రకంగా ఉన్న సీన్.. దివ్య ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. తన ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియగానే.. తనకు పెళ్ళికొడుకు వద్దని ప్రియుడే కావాలని, అతనితోనే కలిసి ఉంటానని మరో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో వధూవరులకు రాత్రి వరకు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ ఇరు వర్గాలు రాజీపడలేదు. దీంతో వధువును అక్కడే వదిలేసి వరుడు మందమర్రి వెళ్లిపోయాడు. మరోవైపు, తల్లిదండ్రులు కూడా కుమార్తెను పోలీస్ స్టేషన్లోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్లో ఒంటరిగా మిగిలిన వధువును పోలీసులు కరీంనగర్‌లోని స్వధార్ హోంకు తరలించారు. ఆమె ప్రియుడు వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లింట విషాదం..
సాక్షి, శివ్వంపేట(నర్సాపూర్ ): అప్పటి వరకు పెళ్లి సంబరాల్లో అనందంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. అక్క పెళ్లి వేడుకల్లో భాగంగా బావగారింటి వద్ద నిర్వహించిన భరాత్‌లో ఉత్సాహంగా పాల్గొన తమ్ముడు గుండెపోటుకు గురై మృతిచెందిన విషాదకర సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం తాళ్లపల్లితండా పంచాయతీ పరిధి శంకర్ తండాకు చెందిన లాకావత్ బుజ్జి తారాసింగ్ దంపతులకు కూతురు నీతా, కొడుకు నరేందర్(20) ఉన్నారు. నీతా పెళ్లి సోమవారం కౌడిపల్లి మండలం బుర్గుగడ్డకు చెందిన మేనబావతో శంకర్ తండాలో ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు. సాయంత్రం తండాలో భరాత్ నిర్వహించి అప్పగింతల కార్యక్రమం అనందంగా నిర్వహించారు. బుర్గుగడ్డలో రాత్రి భరాత్ నిర్వహిస్తుండడంతో అక్కడికి స్నేహితులతో కలిసి నరేందర్ వెళ్లాడు. అక్కబావల భరాత్‌లో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న క్రమంలో అస్వస్థతకు గురైనాడు. కొద్దిసేపు సేదతీరిన అనంతరం మాములు స్థితికి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటికి ఛాతిలో నొప్పిగా ఉందని స్నేహితులతో చెప్పడంతో బైక్‌పై కౌడిపల్లిలోని క్లినిక్ తీసుకెళ్లగా నర్సాపూర్ తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే అందుబాటులో లేకపోవడంతో బైక్ పైనే నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడంతో అప్పటికే మృతిచెందాడు. పెళ్లి వేడుకల్లో అనందంగా గడిపిన కుటుంబం నరేందర్ అకస్మాతుగా మృతిచెందడంతో విషాధచాయలు అలుముకున్నాయి. నరేందర్ తూప్రాన్‌లోని స్నేహ జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శంకర్ తండాలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించగా పలువురు ప్రజా ప్రతినిధులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. గత సంవత్సరం శివ్వంపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన నరేందర్ మృతి పట్ల విద్యార్థులు మౌనం పాటించి పాఠశాలకు సెలవు ప్రకటించారు. -
పెళ్లి బరాత్ లేటైయితే ఫైన్
రాంపూర్: బాజా భజంత్రీలు, బాణాసంచా పేలుళ్ల మధ్య అశ్వారోహుడై తాపీగా సాగిపోతున్న పెళ్లి కొడుకు సవారియా...ఆగవే! అంటే ఇక కుదరదు తాంకుపురి తాండా గ్రామంలో. ఏది ఏమైనా పెళ్లి ముహుర్తానికి ముందే పెళ్లి కొడుకు బరాత్ పెళ్లి పందిరికి చేరుకోవాల్సిందే. అలా జరగని పక్షంలో పెళ్లి కొడుకు తరఫువారు భారీగా జరిమానాలు చెల్లించాల్సిందే. ఇది కొత్తగా అమల్లోకి వచ్చిన ఉత్తరప్రదేశ్‌లోని తాంకుపురి తాండా గ్రామం కట్టుబాటు. అనుకున్న సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా నిమిషానికి వంద రూపాయల చొప్పున పెళ్లి కొడుకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు గ్రామ పెద్దలు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రామాల్లో పెళ్లి కొడుకుల బరాత్‌లు తెల్లార్లు సాగడం అతి సాధారణం. అర్ధరాత్రి వేళ మేలతాళాలు మోగిస్తూ, బాణసంచా కాలుస్తూ, నృత్యాలు చేస్తూ నింపాదిగా పెళ్లి కొడుకు బరాత్ వీధులు గుండా సాగితే వీధుల్లోని ప్రజలకు నిద్రాభంగం అవుతుందనీ, అలాగే పెళ్లి కూతురు తరఫు వారు పెళ్లి పందిట్లో పడిగాపులు పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు ఈ ఏర్పాటు చేశారట. అంతేకాదు, గ్రామ ప్రజల గాఢ నిద్రను, పెళ్లి ఖర్చుల పొదుపును దృష్టిలో పెట్టుకొని గ్రామ పెద్దలు మరిన్ని నిబంధనలు కూడా తీసుకొచ్చారు. బరాత్‌లో బాజా భజంత్రీలు మోగించరాదని, బాణసంచా కాల్చరాదని, పెళ్లి భోజనాల్లో ఏ మాత్రం ఆహారపదార్థాలను వృధా చేయరాదని కూడా షరతులు విధించినట్టు గ్రామం మతగురువు మౌలానా అర్షాద్ తెలిపారు. అంతేకాదండోయ్! పిల్లను ఇచ్చి పుచ్చుకోవడం గ్రామస్థుల మధ్యనే జరగాలని, పొరుగూరు పెళ్లి సంబంధాలు చేసుకోరాదనికూడా గ్రామ పెద్దలు కట్టుబాటు చేసుకున్నారు. ఇదేం కట్టుబాటంటూ ఇప్పటికే పొరుగింటి పిల్లతో ప్రణయ కలాపాం సాగిస్తున్న కుర్రకారు కస్సుబుస్సులాడుతున్నారు.