
సాక్షి, ముంబై: పారిశ్రామిక వేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. మహీంద్రకు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ డీలర్ తన పెళ్లి సందర్భంగా స్వరాజ్ ట్రాక్టర్స్‌తో బారాత్ నిర్వహించాడు. ఇదే విషయాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. అందంగా ముస్తాబు చేసిన 12 ట్రాక్టర్లతో, 12 కుటుంబాలతో పెళ్లి ఊరేగింపు జరిగింది అంటూ తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేశారు.
ఈ వీడియోపైనే ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఇదికదా కుటుంబం అంటే.. కుటుంబసభ్యునిగా పిలుచుకునేది ఇందుకే కదా.. మనమంతా కుటుంబసభ్యులమే! అభినందనలంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో ట్విటర్ యూజర్లు కూడా కొత్త జంలకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా బారాత్‌లో ట్రాక్టర్లతో ట్రాక్టర్ల డీలర్.. వారెవ్వా..నిజంగా సరైన ట్రాక్‌లో ఉన్నాడు అంటూ చమత్కరించడం విశేషం.
Now THAT’S what I call being a member of the family! Badhai ho badhai. https://t.co/6vxIGqqAX4
— anand mahindra (@anandmahindra) March 10, 2023