Swaraj Tractors
-
‘స్వరాజ్’ నుంచి తేలికపాటి ట్రాక్టర్లు
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ తేలికపాటి ట్రాక్టర్లు రెండింటిని ఆవిష్కరించింది. టార్గెట్ 630, టార్గెట్ 625 పేరుతో వీటిని మార్కెట్లో విక్రయించనున్నట్టు తెలిపింది. ‘టార్గెట్’ శ్రేణిలో 20–30 హెచ్‌పీ విభాగంలో వీటిని తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఇందులో టార్గెట్ 630 ముందుగా మహారాష్ట్ర, కర్ణాటకలో రూ.5.35 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరపై అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఇక టార్గెట్ 625 మోడల్ ట్రాక్టర్‌ను స్వల్ప వ్యవధిలోపు తీసుకొస్తామని తెలిపింది. తక్కువ బరువుతో సౌకర్యంగా ఉండే (కాంపాక్ట్ లైట్ వెయిట్) ట్రాక్టర్ల కోసం రూ.200 కోట్ల తో ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసినట్టు స్వరాజ్ ట్రాక్టర్స్ ప్రకటించింది. ఈ ప్లాట్‌ఫామ్ నుంచే ఈ రెండు మోడళ్లను ఆవిష్కరించడం గమనార్హం. ఇక ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. కాంపాక్ట్ లైట్ వెయిట్ విభాగంలో 27–30 శాతం వాటా సొంతం చేసుకోవాలన్న ప్రణాళికతో సంస్థ ఉంది. -
ఆనంద్ మహీంద్ర: బారాత్ వీడియో, కరెక్ట్ ట్రాక్‌లో ఉన్నావ్ భయ్యా! ఫ్యాన్స్ ఫిదా
సాక్షి, ముంబై: పారిశ్రామిక వేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. మహీంద్రకు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ డీలర్ తన పెళ్లి సందర్భంగా స్వరాజ్ ట్రాక్టర్స్‌తో బారాత్ నిర్వహించాడు. ఇదే విషయాన్ని ట్విటర్లో పంచుకున్నారు. అందంగా ముస్తాబు చేసిన 12 ట్రాక్టర్లతో, 12 కుటుంబాలతో పెళ్లి ఊరేగింపు జరిగింది అంటూ తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేశారు. ఈ వీడియోపైనే ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఇదికదా కుటుంబం అంటే.. కుటుంబసభ్యునిగా పిలుచుకునేది ఇందుకే కదా.. మనమంతా కుటుంబసభ్యులమే! అభినందనలంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. దీంతో ట్విటర్ యూజర్లు కూడా కొత్త జంలకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా బారాత్‌లో ట్రాక్టర్లతో ట్రాక్టర్ల డీలర్.. వారెవ్వా..నిజంగా సరైన ట్రాక్‌లో ఉన్నాడు అంటూ చమత్కరించడం విశేషం. Now THAT’S what I call being a member of the family! Badhai ho badhai. https://t.co/6vxIGqqAX4 — anand mahindra (@anandmahindra) March 10, 2023 -
మహీంద్రా స్వరాజ్ 20 లక్షల మార్క్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా గ్రూప్‌లో భాగమైన స్వరాజ్ ట్రాక్టర్స్ సరికొత్త రికార్డును సాధించింది. 20 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి నూతన మైలు రాయిని అధిగమించింది. ఈసందర్బంగా స్వరాజ్ బ్రాండ్‌పై కస్టమర్ల విశ్వాసానికి, విశ్వాసానికి నిదర్శనమని కంపెనీ పేర్కొంది. స్వరాజ్ డివిజన్, ఎం అండ్ ఎం లిమిటెడ్ సీఈవో హరీష్ చవాన్ ఉద్యోగులు హాజరైన ప్రత్యేక కార్యక్రమంలో 20 లక్షల మార్క్‌నుటచ్ చేసిన ట్రాక్టర్‌ను విడుదల చేశారు. 1974లో స్వరాజ్ ట్రాక్టర్ల ఉత్పత్తి ప్రా రంభం అయింది. 10 లక్షల యూనిట్ల తయారీ మార్క్‌ను కంపెనీ 2013లో నమోదు చేసింది. పంజాబ్‌లోని రెండు ప్లాంట్లలో 15–65 హెచ్‌పీ సామర్థ్యం గల ట్రాక్టర్లను సంస్థ ఉత్పత్తి చేస్తోంది. స్వరాజ్ ట్రాక్టర్ల కోసం మూడవ ప్లాంటును ఇదే రాష్ట్రంలో నెలకొల్పుతోంది. -
భారతి ‘స్వరాజ్’’పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కాంటెంపరరీ ఇష్యూస్‌పై షార్ప్‌గా రియాక్ట్ అవుతుంటారు ఆనంద్ మహీంద్రా. సబ్జెక్ట్ ఎంత సీరియస్‌ది అయినా సరే సూటిగా సుత్తి లేకుండా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ప్రతిభగల వ్యక్తులకు ప్రోత్సహించడంలో ముందుంటారు. ఈ మొత్తం వ్యవహరంలో మహీంద్రా బ్రాండ్‌ను కూడా అంతర్లీనంగా ప్రమోట్ చూస్తూ తనలోని బిజినెస్‌మేన్ ఎప్పుడూ అలెర్ట్‌గా ఉంటాడని నిరూపిస్తుంటాడు. తాజాగా అటువంటి ఘటన మరోసారి చోటు చేసుకుంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన వివాహ వేడుకల్లో పెళ్లి కూతురు ట్రెండ్‌కి భిన్నంగా ట్రాక్టర్ నడుపుకుంటూ కళ్యాణ వేదికకు చేరుకుంది. ఈ వీడియో ముందుగా మధ్యప్రదేశ్‌లో ఆ తర్వాత దేశమంతటగా వైరల్‌గా మారింది. అయితే ఇదే వీడియోకు తనదైన కామెంట్ జోడిస్తూ ఓ సీరియన్ సబ్జెక్ట్‌కి ముడి పెడుతూ తన కంపెనీ బ్రాండ్‌ను ప్రమోట్ చేశారు. Bride named ‘Bharti’ driving a Swaraj. (A @MahindraRise brand) Makes sense… https://t.co/pfSNEe1MDh — anand mahindra (@anandmahindra) May 31, 2022 పెళ్లి వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే ... పెళ్లి కూతురి పేరు భారతి.. ఆమె నడిపిన వాహనం పేరు స్వరాజ్.. ఈ రెండు కలిపితే మీకు విషయం అర్థమైపోతుందంటూ చెప్పేశారు. దేశంలో విమెన్ ఎంపవర్మెంట్ని అన్యాపదేశంగా వివరించారు ఆనంద్ మహీంద్రా. చదవండి: ఆనంద్ మహీంద్రా s/o హరీష్..ఆయన విలువలే ఆస్తి! -
హార్టికల్చర్‌లో యాంత్రికీకరణపై స్వరాజ్ ట్రాక్టర్స్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాగు రంగంలో.. ప్రధానంగా హార్టికల్చర్ తదితర విభాగాల్లో వివిధ దశల్లో యాంత్రికీకరణకు తోడ్పడే ఉత్పత్తులపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్‌లో భాగమైన స్వరాజ్ డివిజన్ సీఈవో హరీశ్ చవాన్ తెలిపారు. ఇందులో భాగంగా కోడ్ పేరిట ఆవిష్కరించిన కొత్త ట్రాక్టరుకు భారీ స్పందన లభిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి కేవలం రెండు నెలల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో 500 పైచిలుకు, దేశవ్యాప్తంగా 2,700 పైగా బుకింగ్స్ వచ్చాయని మంగళవారమిక్కడ విలేకరులకు తెలిపారు. డిమాండ్‌ను బట్టి వచ్చే మూడేళ్లలో ఈ కోవకి చెందే మరో రెండు, మూడు ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు చవాన్ తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 80 పైగా డీలర్ల ద్వారా విక్రయాలు సాగిస్తున్నట్లు చవాన్ చెప్పారు. పరిశ్రమపరంగా చూస్తే కోవిడ్ వ్యాప్తి సమయంలో 2020–21లో ట్రాక్టర్ల విక్రయాలు సుమారు 26 శాతం పెరిగి దాదాపు తొమ్మిది లక్షల స్థాయిలో నమోదయ్యాయని, అ యితే గత ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా (దాదాపు 4–5%) మేర క్షీణించాయని తెలిపారు. ఇతర అంశాలతో పాటు కొంత అధిక బేస్ ప్రభావం ఇందుకు కారణమన్నారు. ట్రాక్టర్ల విభాగంలో తమ గ్రూప్‌నకు దాదాపు 40 శాతం వాటా ఉందని చవాన్ చెప్పారు. సానుకూల వర్షపాత అంచనాల మధ్య ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ అమ్మకాలు ఆశావహంగా ఉండగలవని భావిస్తున్నట్లు వివరించారు. కీలక ముడివస్తువుల ధరలు పెరుగుతుండటంతో ఉత్పత్తుల రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఉంటోందని పేర్కొన్నారు. తమ మొత్తం అమ్మకాల్లో ఏపీ, తెలంగాణ మార్కెట్ల వాటా 10 శాతం మేర ఉంటుందని, గత అయిదేళ్లలో 60,000 పైచిలుకు ట్రాక్టర్లు విక్రయించామని చవాన్ వివరించారు. చదవండి: అదరగొట్టిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్..మైండ్‌ట్రీతో విలీనంపై కీలక వ్యాఖ్యలు..! -
‘స్వరాజ్ కోడ్’.. ముందుగా తెలుగు రాష్ట్రాలకే
న్యూఢిల్లీ: హార్టికల్చర్ రైతులకు సాగులో శ్రమను తగ్గించేందుకు తోడ్పడేలా స్వరాజ్ ట్రాక్టర్స్ ‘కోడ్’ పేరిట కొత్త మెషీన్‌ను ఆవిష్కరించింది. పంట కోత తదితర అవసరాలకు కూడా ఉపయోగపడేలా ఇది చిన్న కమతాల్లో సైతం సులువుగా తిరగగలదని సంస్థ తెలిపింది. కూరగాయలు, పండ్లు మొదలైనవి పండించే రైతులకు ఇది ఉపయోగకరంగా ఉండగలదని కంపెనీ పేర్కొంది. ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో దీన్ని ప్రవేశపెడతామని, ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లోనూ దశలవారీగా అందుబాటులోకి తెస్తామని వివరించింది. ధర త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. -
ఆ కాలుష్యానికి ఆనంద్ మహీంద్ర పరిష్కారం
సాక్షి, ముంబై: పారిశ్రామిక వేత్త ,మహీంద్రా గ్రూప్ చైర్మన్ అనంద్ మహీంద్ర మరో ఆసక్తికరమైన విషయాన్ని ట్విటర్ లో షేర్ చేశారు. వేసవి పంటల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను పారవేసే చౌకైన ,పర్యావరణ అనుకూలమైన మార్గాన్ని ట్వీట్ చేశారు. మహీంద్రా అనుబంధ సంస్థ స్వరాజ్ ట్రాక్టర్స్ రూపొందించిన ట్రాక్టర్ గురించి తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు. కాలుష్య స్థాయిలను తగ్గించడానికి సూపర్ ప్లాంటర్ వాడాలన్నారు. ఇలాంటి యంత్రం రూపకల్పనకు నిజమైన ప్రాధాన్యత ఇస్తూ.. చురుకుగా ఉండాలంటూ వ్యవసాయరంగ ఉత్పత్తుల విభాగం అధ్యక్షుడు హేమంత్ సిక్కాకు ట్యాగ్ చేశారు. దీనికి సిక్కా సానుకూలంగా స్పందించారు. స్వరాజ్ షేర్ చేసిన ట్వీట్ ప్రకారం, గడ్డి కాల్చివేతతో వస్తున్న పొగ లాంటి సమస్యలకు ఈ ట్రాక్టర్ మంచి పరిష్కారం. ఇది పొలంలో మిగిలిని మొండి వ్యర్థాలను తిరిగి మట్టిలో కలపడానికి సహాయపడుతుందని స్వరాజ్ తెలిపింది. "సూపర్ సీడర్ విత్ స్వరాజ్ 963 ఎఫ్ఈ ట్రాక్టర్'' పర్యావరణహితమైందంటూ ఒక వీడిమోను ట్వీట్ చేసింది. తమ ట్రాక్టర్లను వాడాలని కంపెనీ సూచించింది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రను ఆకర్షించింది. కాగా పంట వ్యర్థాలను తగులబెట్టడం పర్యావరణ వ్యవస్థకు తీవ్ర ముప్పుగా ప రిణమిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వీటిని కాల్చడం మూలగా వస్తున్న పొగ భయంకరమైన కాలుష్యాన్ని వెదజల్లుతోంది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని రైతులు తమ పొలాల్లో పంట తరువాత గడ్డిని తగులబెట్టడం దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని కమ్మేస్తోంది. అలాగే దేశ వ్యాప్తంగా పలు చోట్లు అనుసరిస్తున్న ఈ పద్థతి పర్యావరణాన్ని హానికరంగా పరిణమిస్తున్న సంగతి తెలిసిందే. We should be more active in facilitating the adoption of such implements @hsikka1 This is a real priority. https://t.co/6D22OPHCGv — anand mahindra (@anandmahindra) October 14, 2020 -
చిన్న కమతాలే పెద్ద సమస్య
(చండీగఢ్, సాక్షి బిజినెస్ బ్యూరో) : భారత్‌లో వ్యవసాయ యాంత్రికీకరణకు ప్రధాన అవరోధం చి న్న కమతాలేనని, తెలుగు రాష్ట్రాల్లో ఇవి చాలా ఎక్కువని స్వరాజ్ ట్రాక్టర్స్ సీఓఓ వీరెన్ పొప్లి అభిప్రాయపడ్డారు. ఇంతవరకు 60 హెచ్‌పీలోపు ట్రాక్టర్ల ఉత్పత్తిపైనే శ్రద్ధ చూపిన స్వరాజ్ ట్రాక్టర్స్ తొలిసారి అధిక హెచ్‌పీ విభాగంలోకి కాలుమోపింది. ఇందులో భాగంగా 60– 75 హెచ్‌పీ విభాగంలో కొత్తగా స్వరాజ్ 963 ఎఫ్ఈ పేరిట కొత్త ట్రాక్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా చండీగఢ్‌లో సాక్షి బిజినెస్ బ్యూరోతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న కాంట్రాక్ట్ ఫామింగ్ బిల్లుతో చిన్న కమతాల సమస్య క్రమంగా కనుమరుగుకావచ్చని ఆయన అంచనా వేశారు. కాంట్రాక్ట్ ఫామింగ్ సరైన రీతిలో అమల్లోకి వస్తే శక్తిమంతమైన యంత్రాల వినియోగం పెరుగుతుందన్న ఆలోచనతో కంపెనీ ఈ విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ నెల్లో ఎంసీఎఫ్సీఎ(కాంట్రాక్టు సాగు ముసాయిదా బిల్లు)కు కేబినెట్ ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. స్టీల్ ధరలు పెరగడమే ప్రమాదం! క్రూడాయిల్ ధర పెరుగుదల కన్నా స్టీల్ ధరల పెరుగుదలపైనే ఆటో రంగం ఆందోళన చెందుతోందని వీరెన్ చెప్పారు. స్టీలు ధరల పెంపుతో ఉత్పాదకాల ధరలు పెరిగి అంతిమంగా విక్రయాలు, లాభాలపై నెగిటివ్ ప్రభావం పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా ఏపీ, తెలంగాణ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రైతులకు కొత్త ట్రాక్టర్ అందుబాటులోకి వస్తుందని, త్వరలో దేశమంతా విక్రయాలు ఆరంభిస్తామని ఎం అండ్ ఎం వ్యవసాయోపకరణాల విభాగం అధిపతి రాజేశ్ జెజుకరి చెప్పారు. దీని ఆరంభ ధర రూ. 7.4 లక్షలు(మొహాలీ ఎక్స్ షోరూం ధర).ఇతర ప్రత్యేకతలు: 60హెచ్‌పీ ఇంజన్, 2200 కిలోల లిఫ్టింగ్ సామర్ధ్యం.3 రేంజ్ స్పీడ్ ఆప్షన్, డిజిటల్ డాష్ బోర్డ్ తదితరాలు. -
మార్కెట్లోకి స్వరాజ్ 60 హెచ్‌పీ ట్రాక్టర్
రెండేళ్లలో మరో రెండు మోడళ్లు ♦ 2015-16లో 5 శాతం వృద్ధి అంచనా ♦ స్వరాజ్ సేల్స్ ఎస్వీపీ రాజీవ్ రెల్లన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ట్రాక్టర్ల తయారీ దిగ్గజం స్వరాజ్ 60 హెచ్‌పీ విభాగంలోకి ప్రవేశించింది. 960 ఎఫ్ఈ పేరుతో కొత్త ట్రాక్టర్‌ను శుక్రవారం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 3,478 సీసీ 3 సిలిండర్ ఇంజన్‌ను దీన్లో వాడారు. 60 హెచ్‌పీ ట్రాక్టర్లలో ఇంత సామర్థ్యం గల ఇంజన్‌ను వాడడం ఇదే తొలిసారి. 2,000 కిలోల బరువును సులువుగా ఎత్తగలదు. సైడ్ షిఫ్ట్ మెకానిజంతో 8 ఫార్వర్డ్, 2 రివర్స్ గేర్లున్నాయి. 12 అంగుళాల పెద్ద క్లచ్‌ను వాడారు. వేరియంట్‌ను బట్టి ఎక్స్ షోరూం ధర రూ.7.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ట్రాక్టర్ బరువు 2,330 కిలోలు. 30 ముఖ్యమైన ఫీచర్లను దీనికి జోడించామని స్వరాజ్ ట్రాక్టర్స్ సేల్స్ ఎస్వీపీ రాజీవ్ రెల్లన్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ట్రాక్టర్‌ను పూర్తిగా దేశీయంగా తయారు చేశామన్నారు. అధిక సామర్థ్యంతో..: మహీంద్రా గ్రూప్‌కు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ ఇప్పటి వరకు 50 హెచ్‌పీ సామర్థ్యానికే పరిమితమయ్యాయి. అధిక సామర్థ్యం గల ట్రాక్టర్లను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా 60 హెచ్పీలోకి ప్రవేశించిన ఈ సంస్థ... వచ్చే రెండేళ్లలో మరో రెండు మోడళ్లను తేనుంది. వీటిలో 65 హెచ్‌పీ మోడల్ కూడా ఉండబోతోంది. ఈ మోడళ్లను కంపెనీ కొత్త ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేయనుంది. మహీంద్రా, స్వరాజ్‌లకు సంయుక్తంగాట్రాక్టర్ల మార్కెట్లో 40% వాటా ఉందని కస్టమర్ కేర్ సీనియర్ జీఎం ఆర్.సి.శర్మ చెప్పారు. జహీరాబాద్ ప్లాంటులో ట్రాక్టర్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. తద్వారా దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. 5 శాతం వృద్ధి అంచనా..: దేశవ్యాప్తంగా 2014-15లో 5.51 లక్షల ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 4-5% వృద్ధిని పరిశ్రమ ఆశిస్తోంది. 2014తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూలైలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ 3% తగ్గింది. దేశవ్యాప్తంగా ఈ కాలంలో అమ్మకాలు 14% తగ్గటం ఇక్కడ గమనార్హం. దేశంలో కొన్ని ప్రాంతాల్లోనే వర్షాభావ పరిస్థితులున్నాయని, ఆశించిన వృద్ధి ఉంటుందని రాజీవ్ చెప్పారు.