సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కాంటెంపరరీ ఇష్యూస్‌పై షార్ప్‌గా రియాక్ట్ అవుతుంటారు ఆనంద్ మహీంద్రా. సబ్జెక్ట్ ఎంత సీరియస్‌ది అయినా సరే సూటిగా సుత్తి లేకుండా తన అభిప్రాయాలను వ్యక్తం చేస‍్తుంటారు. ప్రతిభగల వ్యక్తులకు ప్రోత్సహించడంలో ముందుంటారు. ఈ మొత్తం వ్యవహరంలో మహీంద్రా బ్రాండ్‌ను కూడా అంతర్లీనంగా ప్రమోట్ చూస్తూ తనలోని బిజినెస్‌మేన్ ఎప్పుడూ అలెర్ట్‌గా ఉంటాడని నిరూపిస్తుంటాడు. తాజాగా అటువంటి ఘటన మరోసారి చోటు చేసుకుంది.
ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన వివాహ వేడుకల్లో పెళ్లి కూతురు ట్రెండ్‌కి భిన్నంగా ట్రాక్టర్ నడుపుకుంటూ కళ్యాణ వేదికకు చేరుకుంది. ఈ వీడియో ముందుగా మధ్యప్రదేశ్‌లో ఆ తర్వాత దేశమంతటగా వైరల్‌గా మారింది. అయితే ఇదే వీడియోకు తనదైన కామెంట్ జోడిస్తూ ఓ సీరియన్ సబ్జెక్ట్‌కి ముడి పెడుతూ తన కంపెనీ బ్రాండ్‌ను ప్రమోట్ చేశారు.
Bride named ‘Bharti’ driving a Swaraj. (A @MahindraRise brand) Makes sense… https://t.co/pfSNEe1MDh
— anand mahindra (@anandmahindra) May 31, 2022
పెళ్లి వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే ... పెళ్లి కూతురి పేరు భారతి.. ఆమె నడిపిన వాహనం పేరు స్వరాజ్.. ఈ రెండు కలిపితే మీకు విషయం అర్థమైపోతుందంటూ చెప్పేశారు. దేశంలో విమెన్ ఎంపవర్‌మెంట్‌ని అన్యాపదేశంగా వివరించారు ఆనంద్ మహీంద్రా.
Comments
Please login to add a commentAdd a comment