ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా నెటిజన్లు హృదయాల్ని హత్తుకునేలా ఓ వీడియోని షేర్ చేశారు. వీడియో పాతదే. కానీ అందులో ఓ పదేళ్ల బాలుడు ఉన్నట్లు తన మనవళ్లు కూడా ఉంటే ఈ జీవితానికి ఇది చాలు అని అర్ధం వచ్చేలా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటి? హృదయాల్ని హద్దుకునేలా ఆ వీడియోలో ఏముంది?
ఈ సంఘటన 2022లో జరిగిన అర్జెంటీనా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లోనిది. ఈ మ్యాచ్‌లో బోకా జూనియర్స్‌తో ఓడిపోయిన తర్వాత డిఫెన్సా వై జస్టిసియా టీం గోల్ కీపర్ ఎజెక్వియెల్ అన్‌సైన్ ఓటమి తట్టుకోలేక తన రెండు చేతుల్ని మైదానానికి వేసి గుద్దుతున్నాడు. అది చూసిన ఓ పదేళ్లు బాలుడు అయ్యో పాపం అనుకుంటూ తనని ఓదార్చేందుకు గ్రౌండ్‌లోకి దూసుకు వచ్చాడు. అనంతరం ఎజెక్వియెల్‌ను హత్తుకుని ఓదార్చాడు. ఆ వీడియోనే ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.
అలాగే ‘నా ఇద్దరు మనవలూ నన్ను చూసేందుకు త్వరలో వస్తున్నారు. ఈ వీడియోలో కుర్రాడికి ఉన్నట్టే వాళ్లకి కూడా మంచి మనసు ఉంటే చాలు. అంతకుమించి ఇంకేమీ కోరుకోను’ అని కామెంట్ చేశారు. ఆనంద్ మహీంద్రా రీపోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
This little boy apparently ran on to the pitch after a match to console the losing goalkeeper.
— anand mahindra (@anandmahindra) February 11, 2024
My 2 young grandsons will soon be visiting us & I would wish for nothing more than for them to have hearts as empathetic & large as this kid’s..
pic.twitter.com/fQ3uLbHo97
Comments
Please login to add a commentAdd a comment