హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా గ్రూప్‌లో భాగమైన స్వరాజ్ ట్రాక్టర్స్ సరికొత్త రికార్డును సాధించింది. 20 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి నూతన మైలు రాయిని అధిగమించింది. ఈసందర్బంగా స్వరాజ్ బ్రాండ్‌పై కస్టమర్ల విశ్వాసానికి, విశ్వాసానికి నిదర్శనమని కంపెనీ పేర్కొంది. స్వరాజ్ డివిజన్, ఎం అండ్ ఎం లిమిటెడ్ సీఈవో హరీష్ చవాన్ ఉద్యోగులు హాజరైన ప్రత్యేక కార్యక్రమంలో 20 లక్షల మార్క్‌నుటచ్ చేసిన ట్రాక్టర్‌ను విడుదల చేశారు.
1974లో స్వరాజ్ ట్రాక్టర్ల ఉత్పత్తి ప్రా రంభం అయింది. 10 లక్షల యూనిట్ల తయారీ మార్క్‌ను కంపెనీ 2013లో నమోదు చేసింది. పంజాబ్‌లోని రెండు ప్లాంట్లలో 15–65 హెచ్‌పీ సామర్థ్యం గల ట్రాక్టర్లను సంస్థ ఉత్పత్తి చేస్తోంది. స్వరాజ్ ట్రాక్టర్ల కోసం మూడవ ప్లాంటును ఇదే రాష్ట్రంలో నెలకొల్పుతోంది.
Comments
Please login to add a commentAdd a comment