
మేయర్‌గా ఫుట్‌పౌడర్
మేయర్లుగా జంతువులు ఎన్నికైన ఉదంతాలు తెలిసిందే. ఈక్వెడార్‌లోని పికోజా నగర మేయర్ పదవికి 1967లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా ఒక ఫుట్ పౌడర్ (పాదాల దుర్వాసన పోగొట్టే పౌడర్) ఎన్నికైంది. ‘పల్వాపీస్’ బ్రాండ్ పేరిట ఫుట్ పౌడర్ ఉత్పత్తి చేసే కంపెనీ, మేయర్ ఎన్నికల్లో తన ఉత్పత్తినే అభ్యర్థిగా నిలిపింది. అభ్యర్థులంతా హోరాహోరీగా ప్రచారపర్వంలో నిమగ్నమై ఉంటే, మీడియా మాత్రం ఈ ఫుట్‌పౌడర్‌ను తలకు పూసుకొని హిప్పీలు చేపట్టిన నిరసన ప్రదర్శనలకు విపరీతమైన ప్రచారం కల్పించింది. ‘ఏ అభ్యర్థికైనా ఓటేయండి... ఆరోగ్యం కావాలంటే మాత్రం ‘పల్వాపీస్’కే ఓటేయండి’ అంటూ ఫుట్‌పౌడర్ కంపెనీ సాగించిన ప్రచారానికి ఆకర్షితులైన ప్రజలు ఫుట్‌పౌడర్‌కే పట్టం కట్టారు.