చిరంజీవి కాళ్లకు నమస్కరించిన టాలీవుడ్ డైరెక్టర్! | Tollywood Director touches Megastar Chiranjeevi Feet at Event | Sakshi
Sakshi News home page

Chiranjeevi: మెగాస్టార్ కాళ్లు మొక్కిన టాలీవుడ్ డైరెక్టర్!

Published Tue, Nov 12 2024 9:21 PM | Last Updated on Tue, Nov 12 2024 9:22 PM

Tollywood Director touches Megastar Chiranjeevi Feet at Event

చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో విలనిజంతో ఆకట్టుకున్న నటుడు సత్యదేవ్. ఈ ఏడాదిలో 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్‌.. తాజాగా నటించిన చిత్రం జీబ్రా. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన డాలీ ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాలసుందరం, దినేష్‌ సుందరం ఈ మూవీని నిర్మించారు.

తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కాళ్లకు ఆయన నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జెన్నిఫర్‌ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతమందించారు. చాలా రోజులుగా హీరోగా సరైన హిట్ కోసం చూస్తున్న సత్యదేవ్‌ ఈ సినిమాతోనైనా ట్రాక్‌లో పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement